లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఫేక్ ప్రచారం కలకలం సృష్టించింది. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇంటి వద్ద బాంబు ఉందంటూ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో.. పోలీసులు హై అలర్ట్ అయ్యారు. సీఎం ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.
వివరాల ప్రకారం.. ఓ ఆగంతకుడు అధికారులకు ఫోన్ చేసి సీఎం యోగి ఆదిత్యానాథ్ అధికారిక నివాసం వద్ద బాంబు ఉందని తెలిపాడు. దీంతో, వెంటనే అలర్ట్ అయిన పోలీసులు బాంబు నిర్వీర్య స్క్వాడ్‌తో రంగంలోకి దిగి తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బాంబు ఆచూకీ లభ్యం కాకపోవడంతో అది ఫేక్ కాల్ అని నిర్ధారించారు. బాంబు దొరక్కపోయినప్పటికీ పోలీసులు.. సీఎం యోగి నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు.
Security upped outside UP CM Yogi Adityanath's Lucknow residence after bomb scare pic.twitter.com/vWpSmxqe8n
— Times No1 (@no1_times) February 17, 2023
Comments
Please login to add a commentAdd a comment