లక్నో: ఇతర మతానికి, విశ్వాసానికి సంబంధించిన సాధువులు, పూజారులపై కించపరిచే వ్యాఖ్యలు చేయటం ఆమోదయోగ్యం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినవారిని శిక్షించేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ప్రతీ మతాన్ని, విశ్వాసాన్ని గౌరవించాలని అన్నారు. రాబోయే పండుగల నేపథ్యంలో శాంతిభద్రతలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ఇతర అధికారులతో సీఎం యోగి సోమవారం సమీక్ష నిర్వమించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎవరైనా మత విశ్వాసాన్ని దెబ్బతీస్తే విధంగా సాధువులు, పూజారులు, దేవతలకు వ్యతిరేకంగా కించపరిచే వ్యాఖ్యలు చేస్తే వాళ్లు చట్ట వ్యతిరేక పరిధిలోకి వస్తారు. అలాంటివారిని కఠినంగా శిక్షిస్తాం. అన్ని వర్గాల, మతాల ప్రజలు ఒకరినొకరు గౌరవించుకోవాలి. నిరసనల పేరుతో అరాచకం, విధ్వంసం, దహనాలను సహించబోం. ఎవరు ఇటువంటి చర్యలకు పాల్పడటానికి ధైర్యం చేసినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది’’ అని అన్నారు.
ఇటీవల పూజారి యతి నర్సింహానంద్ మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ నేపథ్యంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరికలపై ప్రాధాన్యత సంతరించుకుంది. మరోపైపు.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు యతి నర్సింహానంద్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. యతి నర్సింహానంద్‌ను ఘజియాబాద్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన సహాయకులు తెలిపారు. అయితే.. ఆయన సహాయకులు చేసిన వ్యాఖ్యలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు.
చదవండి: అమ్మవారికి కష్టాలు చెప్పుకుంటూ.. ట్రాన్స్‌జండర్ల పూజలు
Comments
Please login to add a commentAdd a comment