లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో దఫా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితంతో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికార పీఠంపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన ఓ యువకుడు ఆందోళనలో ఉన్నాడు. కారణం ఏంటని అంటారా?.. ప్రాణభీతి.
సీఎంగా యోగి ఆదిత్యానాథ్ అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అయ్యారు. వరుస ఎన్‌కౌంటర్‌లలో క్రిమినల్స్‌ను ఏరిపారేయించారు. ఈ తరుణంలో ఆయన రెండోసారి సీఎం అయ్యేసరికి.. తననూ ఎక్కడ ఎన్‌కౌంటర్ చేయిస్తాడో అని భయపడుతున్నాడు ఆ వ్యక్తి. తనను చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడుగా ఉన్నాడు. ముందస్తుగా లొంగిపోవడమే మంచిదని భావించి.. గౌతమ్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అదీకాక ‘నేను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నా.. నన్ను దయచేసి చంపోద్దు’అంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment