surrendered
-
తీహార్ జైల్లో లొంగిపోయిన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలులో లొంగిపోయారు.కాగా, అంతకుముందు కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్‌కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్ చేశారు. -
ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నాంపల్లి కోర్టులో లొంగిపోయిన శివరాం రాథోడ్.. సరెండర్ పిటిషన్ దాఖలు చేశాడు. శివరాం పిటిషన్‌కు నాంపల్లి కోర్టు అనుమతిచ్చింది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజి పల్లి గ్రామానికి చెందిన ప్రవల్లిక ఈనెల 13న రాత్రి హైదరాబాద్‌లోని హాస్టల్లో ఆత్మహత్యకు పాల్పడ్డ సంగతి తెలిసిందే. ప్రియుడు మోసం చేసిన కారణంగానే మర్రి ప్రవల్లిక ఆత్మహత్యకు పాల్పడ్డట్టు నిర్థారించిన హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఆ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా వాసి శివరామ్ చేతిలో మోసపోయా నన్న విషయాన్ని ప్రవళిక తన సోదరుడు ప్రణయ్‌కి వాట్సాప్ సందేశాల ద్వారా తెలిపింది. ఈ మేరకు ప్రణయ్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు, శివరాం ఆచూకీ తెలపాలని అతడి కుటుంబ సభ్యులు తాజాగా రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. తమను పోలీసులు బెదిరింపులకు గురిచేస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. వివరాల ప్రకారం.. శివరాం ఆచూకీ గురించి వివరాలు తెలపాలని పోలీసు స్టేషన్‌కు పిలిపించి మానసికంగా మనోవేదనకు గురిచేస్తున్నారని అతడి కుటుంబ సభ్యులు మానవ హక్కుల కమిషన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శివరాం ఆచూకీ తెలపకపోతే ఎన్కౌంటర్ చేస్తామని బెదిరించినట్టు తెలిపారు. శివరాం ఆచూకీ తెలుసుకోవాల్సిన పోలీసులు.. తమను ఇబ్బందులకు గురిచేసి ఎక్కడున్నాడని అడగడం దారుణమన్నారు. అతడి గురించి ఏ విషయం తెలిసినా పోలీసులు వెంటనే చెబుతామన్ని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. తమ కుటుంబ సభ్యులకు చిక్కడపల్లి పోలీసుల నుంచి ప్రాణభయం ఉందని, వారికి రక్షణ కల్పించాలని హెచ్ఆర్సీని శివరాం బంధువు సంతోష్ రాథోడ్ వేడుకున్నారు. చదవండి: మెట్రోలో కోతి చేష్టలు -
మహిళతో వివాహేతర సంబంధం.. ఆరేళ్ల క్రితం హత్య చేసి.. సినిమాను తలదన్నేలా..
ఆరిలోవ(విశాఖ తూర్పు): ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆరేళ్ల క్రితం జరిగిన ఓ హత్య కేసు ఓ కొలిక్కి వచ్చింది. నిందితుడే స్వయంగా పోలీసులకు లొంగిపోవడంతో పోలీసులకు పని సులువైంది. నిందితుడిని పోలీసులు గురువారం రిమాండ్‌కు తరలించారు. ఆరిలోవ సీఐ ఇమాన్యుయేల్ రాజు తెలిపిన వివరాల ప్రకారం.. ఆరిలోవ ప్రాంతానికి చెందిన దాడి లక్ష్మి (48) 2016 ఏప్రిల్ 7 నుంచి కనిపించడంలేదని ఆమె భర్త దాడి నాగేశ్వరరావు అదే నెల 9న ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అదే నెల 11న ముడసర్లోవ రిజర్వాయర్‌లో గుర్తు తెలియని మృతదేహం ఒడ్డుకు కొట్టుకువచ్చింది. ఆ మృతదేహం మిస్సింగ్ అయిన దాడి లక్ష్మిదిగా ఆమె భర్త గుర్తించాడు. ఆమె కాళ్ల, చేతులు కట్టేసి ఉన్నాయి. దీంతో పాటు గోనె సంచికి పెద్ద రాయి కట్టి ఉండటంతో పోలీసులు అప్పట్లో అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో కొన్నాళ్ల తర్వాత ఆ కేసును పెండింగ్‌లో పెట్టారు. ఇదిలా ఉండగా ఈనెల 4న దాడి లక్ష్మిని 2016 ఏప్రిల్ 7న తానే హత్య చేశానంటూ గోపాలపట్నం ప్రాంతానికి చెందిన దాసరి దిల్లీశ్వరరావు ఆరిలోవ పోలీసులకు తెలియజేశాడు. దీంతో పోలీసులు అతడి నుంచి వివరాలు సేకరించి గురువారం కోర్టుకు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. ఏటీఎంలో డబ్బులు తీయించి.. తరువాత హత్య... దిల్లీశ్వరరావు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి. రిటైర్డ్ అయిన తర్వాత ఆయన నగరంలో ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశాడు. అక్కడ ఉన్న క్యాంటీన్లో దాడి లక్ష్మి వంట మనిషిగా పనిచేసేది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. దిల్లీశ్వరరావు 2016లో హౌసింగ్ లోన్ తీసుకొని గోపాలపట్నంలో ఇళ్లు కొన్నాడు. ఇళ్లు కొనగా మిగిలిన మరికొంత నగదు అతని భార్య బ్యాంక్ ఖాతాలో ఉంది. డబ్బులు అవసరమై అడిగితే ఆమె ఇవ్వలేదు. దీంతో ఆమె బ్యాంక్ ఏటీఎం కార్డు తీసుకొచ్చి లక్ష్మితో ఏటీఎంలో అవసరమైన డబ్బులు విత్‌డ్రా చేయించాడు. ఆ విషయమై దిల్లీశ్వరరావును అతని భార్య నిలదీసింది. అంతటితో ఆగకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె ఏటీఎం కార్డు ఉపయోగించి ఓ మహిళ డబ్బులు విత్‌డ్రా చేసినట్లు సీసీ కెమెరాలలో వెల్లడైంది. దీంతో లక్ష్మితో ఉన్న సంబంధం బయటపడిపోతుందనే భయంతో ఆమెను అంతం చేయాలనుకున్నాడు. అందుకు తగిన ప్లాన్ వేసుకున్నాడు. 2016 ఏప్రిల్ 7న రాత్రి లక్ష్మిని బైక్‌పై ఎక్కించుకొని ముడసర్లోవ ప్రాంతానికి తీసుకెళ్లాడు. బీఆర్టీఎస్ పక్కన సింహాచలం కొండ అంచున ఆమె మెడ గట్టిగా పట్టి చంపేశాడు. కాళ్లు చేతులు కట్టేసి మృతదేహాన్ని ఓ గోనె సంచిలో పెట్టాడు. మృతదేహం తేలకుండా గోనె సంచికి పెద్ద రాయిని తాడుతో కట్టి ముడసర్లోవ రిజర్వాయర్‌లో పడేశాడు. చదవండి: షాకింగ్ ఘటన.. ద్విచక్ర వాహనంపై ఒంటరిగా మహిళ.. పొదల్లోకి లాక్కెళ్లి.. ఇదంతా ఆయన స్వయంగా వచ్చి లొంగిపోయి వివరించడంతో పోలీసులు అవాక్కయ్యారు. దీని ప్రకారం దిల్లీశ్వరరావును కోర్టులో హాజరుపరిచి అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. తాను చేసిన పాపానికి తగిన శిక్ష అనుభవిస్తున్నానని, తన భార్య, పిల్లలు తనకు దూరంగా ఉండటంతో తాను ఒంటరయ్యానని పోలీసులకు తెలియజేశాడు. ఇటీవల తన కుమార్తె వివాహం కూడా తనకు తెలియకుండా జరిపించారని పేర్కొన్నాడు. పశ్చాత్తాపంతో చేసిన నేరం అంగీకరిస్తున్నట్లు తెలిపాడు. -
యోగిజీ ఎఫెక్ట్: ప్లీజ్.. చంపొద్దు కావాలంటే జైల్లో పెట్టండి
లక్నో: ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండో దఫా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఫలితంతో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండోసారి అధికార పీఠంపైకి వచ్చారు. ఈ నేపథ్యంలో యూపీకి చెందిన ఓ యువకుడు ఆందోళనలో ఉన్నాడు. కారణం ఏంటని అంటారా?.. ప్రాణభీతి. సీఎంగా యోగి ఆదిత్యానాథ్ అధికారంలో ఉన్నప్పుడు క్రిమినల్స్ పాలిట సింహస్వప్నం అయ్యారు. వరుస ఎన్కౌంటర్లలో క్రిమినల్స్‌ను ఏరిపారేయించారు. ఈ తరుణంలో ఆయన రెండోసారి సీఎం అయ్యేసరికి.. తననూ ఎక్కడ ఎన్కౌంటర్ చేయిస్తాడో అని భయపడుతున్నాడు ఆ వ్యక్తి. తనను చంపొద్దని.. జైల్లో పెట్టాలని వేడుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌతమ్ సింగ్ అనే వ్యక్తి ఓ కేసులో నిందితుడుగా ఉన్నాడు. ముందస్తుగా లొంగిపోవడమే మంచిదని భావించి.. గౌతమ్ సింగ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లాడు. అదీకాక ‘నేను ఆత్మసాక్షిగా లొంగిపోతున్నా.. నన్ను దయచేసి చంపోద్దు’అంటూ ప్లకార్డు పట్టుకొని పోలీసుస్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. -
నితీశ్ రాణే లొంగుబాటు
ముంబై: హత్యాయత్నం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి నారాయణ్ రాణె కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణె బుధవారం సాయంత్రం సింధుదుర్గ్ జిల్లా కోర్టులో లొంగిపోయారు. దీంతో జిల్లాకోర్టు ఆయనను జ్యూడీషియల్ కస్టడీకి పంపించినట్లు ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రదీప్ ఘరట్ బుధవారం మీడియాకు వెల్లడించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. నితేష్ రాణెను పోలీసు కస్టడీకి ఇవ్వాల్సిందిగా కోర్టులో వాదించాల్సి ఉందని తెలిపారు. అంతకుముందే బోంబే హైకోర్టులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. కోర్టులో రాణె లొంగిపోతానని, విచారణకు సహకరిస్తానని ఒప్పుకున్నట్లు ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. నితేశ్ రాణేకు కోర్టులో చుక్కెదురు బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణెకు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టులో చుక్కెదురైంది. అరెస్టుకు ముందు బెయిల్ ఇవ్వాలని పెట్టుకున్న దరఖాస్తును మంగళవారం సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో నితేష్ రాణె అరెస్టు విషయం ఆయన మెడపై వేలాడుతున్న కత్తిలా తయారైంది. డిసెంబరు 18న సింధుదుర్గ్ జిల్లా బ్యాంకు ఎన్నికల ప్రచార సభలో శివసేన కార్యకర్త సంతోష్ పరబ్‌పై దాడి జరిగింది. ఈ దాడి ఘటన వెనుక నితేష్ రాణెతోపాటు ఆయన సహచరుడు గోట్యా సావంత్ హస్తముందని ఆరోపిస్తూ స్థానిక కణకావ్లీ పోలీసుస్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. అయితే రాణే అరెస్టు కాకుండా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని స్థానిక కణకావ్లీ సివిల్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. అందుకు సివిల్ కోర్టు నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించా రు. అక్కడ కూడా ఆయనకు చుక్కెదురవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే సుప్రీంకోర్టు సింధుదుర్గ్ జిల్లా సెషన్స్ కోర్టునే ఆశ్రయిం చాలని సలహా ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పిస్తూ పది రోజుల వరకు అరెస్టు చేయవద్దని కూడా ఆదేశించింది. దీంతో ఆయనకు ఊరట లభించింది. అయితే జనవరి 31నాటి విచారణలో నితేష్ రాణె తరఫు న్యాయవాది సతీశ్ మాన్‌షిండే, ప్రభుత్వం తరఫు న్యాయవాది ప్రదీప్ ఘరత్ ఈ అంశంపై వాదనలు విన్పించారు. తీర్పు మంగళవారం మధ్యాహ్నం వెల్లడిస్తామని చెప్పి వాయిదా వేశారు. వాదోపవాదాల అనంతరం నితేష్ రాణె బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తున్నట్లు తీర్పునిచ్చారు. -
రాహుల్ హత్య కేసులో కీలక పరిణామం, A1 లొంగుబాటు
సాక్షి, విజయవాడ: స్థానికంగా కలకలం రేపిన వ్యాపారి రాహుల్ హత్యకేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాహుల్ హత్య కేసు ప్రధాన నిందితుడు కోరాడ విజయ్ మాచవరం పోలీసుల ఎదుట ఆదివారం లొంగిపోయాడు. రాహుల్ హత్య కేసులో ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు A-1 కోరాడ విజయ్, A-2 కోగంటి సత్యం, A-3 విజయ్ భార్య పద్మజ, A-4 పద్మజ, A-5 గాయత్రి పేర్లను పేర్కొన్నారు. రాహుల్ తండ్రి రాఘవరావు స్టేట్మెంట్ ఆధారంగా సెక్షన్ 302, 120బి, రెడ్‌విత్ 34 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ హత్య కేసులో ఇప్పటికే కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోరాడ విజయ్‌తో కలిపి పోలీసులు అదుపులో ఉన్నవారి సంఖ్య 6కు చేరింది. మాచవరం పోలీసుల ముమ్మర విచారణ కొనసాగుతోంది. (చదవండి: King Cobra: 13 అడుగుల గిరినాగు) హత్యకు గురైన రాహుల్.. అతని మృతదేహం లభ్యమైన కారు -
అడ్డంగా దొరికి.. ఎదురుదాడి
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: తహసీల్దార్‌పై నోరు పారేసుకుని అడ్డంగా దొరికిపోయిన టీడీపీ నేత, మాజీ విప్ కూన రవికుమార్ తన తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎదురు దాడికి దిగారు. మూడు రోజులుగా పరారీలో ఉన్న రవికుమార్ బుధవారం ఉదయం పొందూరు పోలీసు స్టేషన్లో లొంగిపోయే సమయంలో ప్రత్యారోపణలకు దిగారు. తన మాట వినని వారిని అవినీతి అధికారులని, తానెవరినీ వదలనని అంటూనే.. వారికి అండగా నిలుస్తున్న ఉద్యోగ సంఘాలను టార్గెట్ చేశారు. వాస్తవానికి గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో మట్టి అక్రమ తరలింపు వ్యవహారంలోనే కాదు అంతకుముందు కూడా తహసీల్దార్ రామకృష్ణపై బెదిరింపులకు దిగారు. చెరువు వ్యవహారంతోపాటు మరో రెండు విషయాల్లో తహసీల్దార్ తమకు అడ్డంకిగా నిలిచారని టార్గెట్ చేసుకున్నారు. దారికి తెచ్చుకోవడమే లక్ష్యంగా... కూన రవికుమార్ తొలి నుంచి ఉద్యోగులపై దుందుడుకు వైఖరిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. భయపెట్టి దారికి తెచ్చుకోవాలని చూస్తున్నారు. వీఆర్ఓలు, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీ, తహసీల్దార్... ఇలా ప్రతి ఒక్కరినీ బెదిరించి తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలనుకుంటారు. అధికారం లేకపోయినా తన మాటే చెల్లుబాటు కావాలని, తాను చెప్పినట్టు చేయాలని హుకుం జారీ చేయడం అలవాటుగా మారిపోయింది. ఎవరైతే తన మాటను వినరో వారిని టార్గెట్ చేసుకుని తొలుత లంచాలు ఎర చూపడం, ఇంకా లెక్క చేయకపోతే బూతు పురాణాలకు దిగడం, అంతకీ లొంగకపోతే అవినీతి ముద్ర వేసి పబ్బం గడుపు కోవాలని చూస్తున్నారు. గతంలో సరుబుజ్జిలి ఎంపీడీఓ విషయంలోనూ, ఈఓపీఆర్డీ విషయంలోనూ, వీఆర్ఓల విషయంలోనూ ఇదేరకంగా వ్యవహరించి నోటికొచ్చినట్టు తిట్టి ఆడియోల ద్వారా దొరికిపోయారు. అయినా తన వైఖరి మార్చుకోకుండా ఎన్ని కేసులు పెట్టినా ఏమవుతుందని, బెయిల్‌పై వచ్చేస్తానన్న ధీమాతో నోటికి పనిచెబుతూనే ఉన్నారు. చివరికి రవికుమార్ బెదిరింపులతో ఉద్యోగులంతా భయపడిపోతున్నారు. వారి అనుచరులు ఏం చేయిస్తారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఇది తొలిసారి కాదు.. తహసీల్దార్ రామకృష్ణను బెదిరించడం ఇది తొలిసారి కాదు. దీనికి ముందు రెండు ఘటనలు జరిగాయి. వాటిలోనూ తహసీల్దార్‌ను దురుసుగా మాట్లాడారన్న వాదనలున్నాయి. కూన రవికుమార్ స్వగ్రామమైన పెనుబర్తిలో తన ఇంటి వెనక రెండు ఎకరాల గ్రామ కంఠం భూమి ఉంది. ఆ గ్రామంలో మరెక్కడా ప్రభుత్వ స్థలం లేకపోవడంతో 31మంది పేదల ఇళ్ల స్థలాల కోసం ఆ గ్రామ కంఠాన్ని ప్రతిపాదించారు. ఖాళీగా ఉన్న స్థలం కావడంతో సామాజిక పోరంబోకుగా గుర్తించి పేదల స్థలాల కోసం కేటాయించేందుకు గ్రామంలో తీర్మానం కూడా చేశారు. కానీ, రవికుమార్ వెనకుండి తన అనుయాయులు కొందర్ని రంగంలోకి దించి, ఆ భూమి తమ స్వాధీనంలో ఉందని చెప్పి అడ్డు తగలడం ప్రారంభించారు. ఉపాధి నిధుల కింద చేపట్టిన చదును పనులను అడ్డుకున్నారు. దీంతో వారందరికీ తహసీల్దార్ నోటీసులు జారీ చేశారు. వాటికి సమాధానం ఇవ్వకుండా ఈ విషయంలో కోర్టుకు వెళ్లారు. ఇందులో తాము జోక్యం చేసుకోలేమని, నోటీసులు ఇచ్చిన తహసీల్దార్‌కు సమాధానం ఇచ్చుకోవాలని కోర్టు స్పష్టం చేయడంతో కంగుతిన్నారు. దీంతో అధికారులు ఆ గ్రామ కంఠాన్ని పేదల ఇళ్ల స్థలాల కోసం సిద్ధం చేసే పనిలో పడ్డారు. కూన రవికుమార్‌కు ఇదంతా రుచించలేదు. తహసీల్దార్‌ను లక్ష్యంగా చేసుకుని నోరు పారేసుకోవడం ప్రారంభించారు. ఇక, ఆ తర్వాత పెనుబర్తి పంచాయతీ పరిధిలో అలమాజీపేటలో ప్రభుత్వ నిధులతో వేస్తున్న రోడ్డుకు అడ్డంగా రవికుమార్ అనుయాయులు గోడ కట్టేశారు. దీని విషయంలోనూ తహసీల్దార్ ముందుకెళ్లడంతో ఆ సమయంలో కూడా రవికుమార్ బెదిరింపులకు దిగారు. తాజాగా గోరింట గ్రామంలోని రామసాగరం చెరువులో రవికుమార్ సోదరుడికి చెందిన రెండు జేసీబీలు, నాలుగు టిప్పర్లతో మట్టిని అక్రమంగా తవ్వుతుండగా వీఆర్ఓ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు తహసీల్దార్ అక్కడికి చేరుకుని వాహనాలను సీజ్ చేశారు. దీన్ని జీరి్ణంచుకోలేని కూన రవికుమార్ ఏకంగా ఫోన్లో ఇష్టారీతిన విరుచుకుపడ్డారు. కూన రవికుమార్ దుర్భాషలతోపాటు.. కొంతమంది తరుచూ వెంబడిస్తుండటం, ఫోన్లో సతాయించడంతో భరించలేక టీడీపీ నేత నోటి దురుసు ఆడియోను తహసీల్దార్ బయటపెట్టారు. వాస్తవంగా రామసాగరం చెరువులో ఉపాధి హామీ పథకం కింద కూలీల చేత మట్టి తవ్వకాలు జరపాల్సి ఉంది. అందుకు విరుద్ధంగా కూన రవి సోదరుడు, మరికొంతమంది జేసీబీతో తవ్వకాలు జరిపి, లారీల ద్వారా అక్రమంగా తరలిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు చెరువుల్లో జేసీబీతో తవ్వకాలు చేపట్టకూడదు. అందుకు భిన్నంగా చేసి ఇప్పుడు చెరువులో మట్టిని ఎందుకు తరలించకూడదని, తరలిస్తే తప్పేముందని వితండవాదానికి దిగుతున్నారు. అంతేకాకుండా తహసీల్దార్ అవినీతి పరుడని, అవినీతిపరులైన ఉద్యోగులను వదలనని, వారికి ఉద్యోగ సంఘాలు వత్తాసు పలుకుతున్నాయని ఎదురు దాడికి దిగడం చర్చనీయాంశమైంది. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు కారణాలు వెతుకుతున్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. అధికారులంటే అంత చులకనా? పొందూరు: తహసీల్దార్ రామకృష్ణను బెదిరించిన కేసులో బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయిన టీడీపీ నాయకుడు కూన రవికుమార్ ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి మాట్లాడిన మాటల పట్ల నిరసన వ్యక్తమవుతోంది. పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులపై తప్పుడు ఆరోపణలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల గౌరవం లేకుండా మాట్లాడారు. తహసీల్దార్‌ను ఏకవచనంతో సంబోధించడాన్ని అందరూ ఆక్షేపిస్తున్నారు. రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై చేసిన వ్యాఖ్యలను పలువురు ఖండిస్తున్నారు. అడ్డంగా దొరికి ఎదురుదాడికి దిగడం తగదని, క్షమాపణ చెబితే పరువు నిలుస్తుందని హితవు పలుకుతున్నారు. గతంలో గ్రామ కంఠం భూమి విషయంలో, నిర్మాణంలో ఉన్న రోడ్డుకు అడ్డంగా తన అనుయాయులు కట్టిన గోడకు అభ్యంతరం పెట్టిన విషయంలో తహసీల్దార్‌పై కోపం పెంచుకొని.. ఇప్పుడు అతనిపై అవినీతి ఆరోపణలు చేయడం తగదని వారంటున్నారు. పొందూరు స్టేషన్లో లొంగిపోతూ రవికుమార్ తహసీల్దార్ రామకృష్ణపై విమర్శలు చేశారు. అవినీతి ఆరోపణలున్న అతనిని ఉద్యోగ సంఘాలు వెనకేసుకు రావడం తగదని సమర్థించుకోజూశారు. -
ఇద్దరు ‘ఆదర్శ’ ఉపాధ్యాయుల సరెండర్
సాక్షి, గుడిహత్నూర్(ఆదిలాబాద్) : మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) ఇన్చార్జి ప్రిన్సిపాల్ సైఫుల్లాఖాన్, అదే పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సత్యనారాయణ గౌడ్లను సరెండర్ చేస్తూ డీఈవో రవీందర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇదే పాఠశాలలో కాంట్రాక్టు ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న అశ్విని.. ప్రిన్సిపాల్ సైఫుల్లాఖాన్ తనపై దాడి చేశాడని గత మూడు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే స్పందించి అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్‌తో విచారణ జరిపించారు. విచారణ పూర్తి కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సైఫుల్లాఖాన్‌ను ఆయన మాతృ పాఠశాల ఆసిఫాబాద్ మోడల్ స్కూల్‌కు సరెండర్ చేయగా సత్యనారాయణగౌడ్‌ను రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేశారు. వివాదాలకు బీజం పోసిన సత్యనారాయణ గౌడ్! కరీంనగర్ జిల్లా కొడిమ్యాల ఆదర్శ పాఠశాలలో విధులు నిర్వహించి అవినీతి అక్రమాలకు పాల్పడి పనిష్మెంట్పై ఇక్కడికి బదిలీపై వచ్చిన సత్యనారాయణ గౌడ్ వచ్చిన అనతికాలంలోనే పాఠశాలలో అనేక వివాదాలకు కారణమైనట్లు విచారణలో తేలినట్లు తెలుస్తోంది. పాఠశాలలో జరిగే చిన్నచిన్న పొరపాట్లను వేలెత్తి చూపి కాంట్రాక్టు సిబ్బందిని మచ్చిక చేసుకొని వర్గాలుగా చీల్చి ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న సైఫుల్లాఖాన్ తప్పించి తానే ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు చేపట్టాలని వివాదాలు సృష్టించినట్లు తెలిసింది. అదనపు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ చేపట్టిన సుధీర్ఘ విచారణలో తెరవెనుక ఉండి వివాదాలు సృష్టిస్తున్న సత్యనారాయణ గౌడ్ తెరముందుకు వచ్చాడు. దీంతో అతనని రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్‌కు సరెండర్ చేయడంతో ఆదర్శ పాఠశాల కథ సుఖాంతం అయింది. -
ప్రధానికి ఈసీ దాసోహం
న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఎన్నికల సంఘం(ఈసీ) లొంగిపోయిందని, ఈసీ అంటే ఇకపై ఎవరికీ భయం, గౌరవం ఉండవని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. ‘ఎలక్టోరల్ బాండ్లు మొదలు కొని ఈవీఎంలు, ఎన్నికల షెడ్యూల్లో మోసం, నమో టీవీ ప్రారంభం, మోదీ సైన్యం అంటూ వ్యాఖ్యలు.. తాజాగా కేదార్‌నాథ్‌లో మోదీ డ్రామా.. వీటన్నిటి విషయంలో ఈసీ మోదీకి, ఆయన ముఠాకు సాగిలపడిన విషయం దేశ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఈసీ అంటే ఇకపై ఎవరికీ గౌరవం కానీ, భయం కానీ ఉండవు’ అని ఆదివారం ఆయన ట్విట్టర్లో పేర్కొన్నారు. తన అసమ్మతిని రికార్డు చేయనందుకు నిరసనగా ఈసీ సమావేశాలకు హాజరుకానంటూ కమిషనర్ అశోక్ లావాసా అసంతృప్తి వెళ్లగక్కిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈసీ తన స్వాతంత్య్రాన్ని ప్రభుత్వానికి ధారాదత్తం చేయడం సిగ్గుచేటంటూ కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ట్విట్టర్లో ఆరోపించారు. తీర్థయాత్రలు చేయడం ద్వారా మతాన్ని, మత చిహ్నాలను వాడుకుని ప్రధాని మోదీ ఓటింగ్‌ను ప్రభావితం చేయడం ఆమోదయోగ్యం కాదని తెలిపారు. ఇది ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘన కిందికి వస్తుందని చిదంబరం పేర్కొన్నారు. తల్లులు, అక్కాచెల్లెళ్లకు సెల్యూట్ సాధారణ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించి నందుకు మహిళలను కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం ప్రశంసించారు. తల్లులు, సోదరిల గొంతును కచ్చితంగా వినాలని పేర్కొన్నారు. చివరిదశ లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన అనంతరం రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చివరిదైన 7వ దశలో లోక్‌సభకు ఆదివారం ఎన్నికలు ముగిశాయి. కృతనిశ్చయంతో ఉన్న ఓటర్లు, పోటీ చేసిన అభ్యర్థులే కాకుండా, మన తల్లులు, అక్కాచెల్లెళ్లు కూడా ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించారు. వారందరికీ నేను గౌరవ వందనం చేస్తున్నాను’ అని రాహుల్ అన్నారు. అంతకుముందు కాంగ్రెస్ ప్రధాన ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా ట్వీట్ చేస్తూ చివరిదశ ఎన్నికల్లోనూ ప్రజలు ఓటు వేసి, దేశంలో అందరి అభిప్రాయాలు వినిపడేలా చూడాలన్నారు. -
లైసెన్స్డ్ గన్స్ సరెండర్
ఆదిలాబాద్ అర్బన్: లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసు అధికారులు ఉమ్మడి జిల్లాలో లైసెన్స్డ్ గన్లు వెనక్కి తీసుకుంటున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. పోలింగ్ దగ్గర పడుతుండడంతో ఎన్నికల పరిణామాలపై ఎప్పటికప్పుడు నిఘాపెంచుతున్నారు. ఇందులో భాగంగానే లైసెన్స్డ్ ఆయుధాలను పలువురి నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఆయాపోలీస్‌స్టేషన్లలో, ఆయుధగారాల్లో ఈ ఆయుధాలు డిపాజిట్ అయ్యాయి. స్వాధీనం చేసుకున్న ఆయుధాలను ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేయనున్నారు. ఆయుధాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించనున్నారు. బ్యాంకుల వద్ద విధులు నిర్వర్తించే సెక్యూరిటీకి మాత్రం మినహాయింపు ఇచ్చినట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ఆయుధాలు స్వాధీనం చేసుకొని ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేసిన విషయం తెలిసిందే. ఉమ్మడి జిల్లాలో 376 స్వాధీనం లైసెన్స్డ్ ఆయుధాలను ఎక్కువ డబ్బు సంపాదించే వారు, ఇతరుల నుంచి ప్రాణహాని ఉన్న వ్యక్తులు, వ్యాపారులు, సెలబ్రిటీస్, హీరోలు, ప్రముఖులతోపాటు రాజకీయ నాయకులు ఆత్మరక్షణకోసం ఆయుధాలు ఉపయోగిస్తుంటారు. ఎన్నికల నిబంధనలు, చట్టం ప్రకారం లైసెన్స్డ్ ఆయుధాలను ఎన్నికల సమయంలో సరెండర్ చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ఉమ్మడి జిల్లాలో మొత్తం 376 ఆయుధాలు సరెండర్ అయ్యాయి. ఇందులో ఆదిలాబాద్‌లో కేవలం 17 ఆయుధాలు ఉండగా, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలు కలుపుకొని 359 ఆయుధాలు ఉన్నాయి. లైసెన్స్ లేని ఆయుధాలను వినియోగించడం చట్టరీత్య నేరమన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే లైసెన్స్ పొందేందుకు జిల్లా మేజిస్ట్రేట్ (కలెక్టర్)కు దరఖాస్తు చేసుకుంటారు. ఆయుధ లైసెన్స్ ఎందుకు అవసరమో దరఖాస్తులో వివరంగా తెలియజేయాల్సి ఉంటుంది. సదరు వ్యక్తి విజ్ఞప్తి మేరకు జిల్లా మెజిస్ట్రేట్ దరఖాస్తుదారుడి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతారు. దరఖాస్తులో పేర్కొన్న విషయం విచారణలో సరైనదిగా తేలితే సదరు వ్యక్తికి లైసెన్స్ జారీ చేస్తారు. ఈ లైసెన్స్‌ను ఏటా జనవరిలో రెన్యూవల్ చేస్తారు. ఆదిలాబాద్‌లో 1,360 మంది బైండోవర్.. ఎన్నికల సమయంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తగా వ్యవహరించి గోడవలు సృష్టించే వారిని బైండోవర్ చేస్తారు. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో 1,360 మందిని బైండోవర్ చేశారు. వీరందరిని మండల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆయుధాల డిపాజిట్ ఇలా.. నిర్మల్‌టౌన్: ఎన్నికల సమయంలో లైసెన్స్డ్ గన్స్ ఉన్న వారు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో వాటిని డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ చేసిన అనంతరం వారికి సంబంధిత పోలీస్ అధికారి రిసిప్ట్ అందిస్తారు. ఈ రిసిప్ట్‌ను సదరు వ్యక్తి తన వద్ద ఎన్నికల ప్రక్రియ ముగిసేంత వరకు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎన్నికల అనంతరం రిసిప్ట్ ఆధారంగా ఎవరి లైసెన్స్డ్ గన్లను వారికి పోలీస్ అధికారులు అప్పగిస్తారు. డిపాజిట్ చేసిన లైసెన్స్డ్ గన్లను భద్రత దృష్ట్యా ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో భద్రత పరుస్తారు. -
10 మంది మావోయిస్టుల లొంగుబాటు
జార్ఖండ్: జార్ఖండ్ రాష్ట్రం మావోయిస్టు ప్రభావిత ప్రాంతం లోహర్దాగా జిల్లాలో పెద్ద సంఖ్యలో మావోయిస్టు నేతలు పోలీసులు లొంగిపోయారు. ఒక్కొక్క మావోయిస్టు తలపై రెండు లక్షల రూపాయల చొప్పున రివార్డు కూడా ఉంది. తుపాకులు వీడండి.. వాలీబాల్ ఆడండి (బందూక్ ఛోడో వాలీబాల్ ఖేలో అభియాన్) పథకం కింద పోలీసులు మావోయిస్టులను జనజీవన స్పవంతిలోకి తెచ్చేందుకు ప్రవేశపెట్టిన పథకం సత్ఫలితాలనిచ్చిందని ఎస్పీ కార్తీక్.ఎస్ తెలిపారు. లొంగుబాట పట్టిన పది మందిలో ఏరియా కమాండర్లు బిశాల్ ఖేర్వార్, కైలాష్ ఖేర్వార్ ఉన్నారు. -
పాపభీతితో లొంగిపోయాడు
► పోలీసుల అదుపులో అప్పన్న తలనీలాల చోరీ నిందితుడు ► రూ.4.50లక్షల నగదు స్వాధీనం పాతపోస్టాఫీసు(విశాఖ దక్షిణం): పాపభీతి వెంటాడడంతో తలనీలాల దొంగ పోలీసులకు లొంగిపోయాడు. సింహాద్రి అప్పన్న ఉగ్రరూపంలో నిద్రలో కనిపిస్తున్నాడని, నిజం చెప్పమని గర్జించడంతో లొంగిపోయానని సింహాచలం దేవస్థానంలో తలనీలాలు దొంగిలించిన ప్రధాన నిందితుడు ఏలూరు సమీప జాలిపూడి మండలం మాదేపల్లి గ్రామానికి చెందిన పసుపులేటి రాంబాబు (47) పోలీసులకు చెబుతున్నాడు. పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నగర సంయుక్త పోలీస్ కమిషనర్ సత్తార్ ఖాన్, క్రైం డీసీపీ రవికుమార్‌మూర్తి వివరాలు వెల్లడించారు. 2015 ఫిబ్రవరి 14న సింహాచలం దేవస్థానంలో 10 బస్తాల్లో ఉన్న సుమారు 150 కేజీల బరువున్న తలనీలాలు చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ.7.50 లక్షలు ఉంటుందని అప్పట్లో అంచనా వేశారు. ఈ తలనీలాలు ఎవరు దొంగలించారు, ఎక్కడికి తరలించారో తెలుసుకునేందుకు పోలీసులు చేపట్టిన దర్యాప్తు ఒక్క అంగుళం కూడా ముందుకు సాగలేదు. దొంగగా మారిన తలనీలాల వ్యాపారి ఈ క్రమంలో ప్రధాన నిందితుడైన రాంబాబు తండ్రి నుంచి వారసత్వంగా తలనీలాల వ్యాపారం స్వీకరించాడు. రాష్ట్రంలోని పలు దేవాలయాలకు చెందిన తలనీలాలను వేలం పాట ద్వారా కొనుగోలు చేసి వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నాడు. కొన్నాళ్లపాటు భద్రాచలం కొత్తగూడెంకు చెందిన చల్లా జంపన్నతో కలిసి తలనీలాల వ్యాపారం చేశారు. ఈ క్రమంలో వీరిద్దరూ క్రికెట్ బెట్టింగ్‌లలో తమ వద్ద ఉన్న సొమ్మంతా పోగొట్టుకుని అప్పులపాలయ్యారు. అప్పుల ఊబి నుంచి బయట పడేందుకు రాంబాబు, జంపన్నలు కలిసి సింహాచలం దేవస్థానం కల్యాణకట్టలో నిల్వ ఉంచిన తలనీలాల బస్తాలలో పది కిటికీ ఊచలు వంచి దొంగిలించారు. తర్వాత కాణిపాకం వినాయకుని దేవస్థానంలో కూడా వీరిద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడ్డారు. ఈ కేసులో చల్లా జంపన్నను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు. అదే తరుణంలో రాంబాబులో పాపభీతి మొదలయింది. సింహాద్రినాథుడు కలలో కనిపిస్తున్నాడని, తాను లొంగిపోదామనుకుంటున్నానని ప్రకాశం జిల్లా మాలకొండ దేవస్థానం కార్యనిర్వహణాధికారికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. దీంతో విషయం తెలుసుకున్న గోపాలపట్నం పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టి రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి 4.5 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో అడిషినల్ డీసీపీ (క్రైం) వరదరాజు, ఏసీపీ భీమారావు, గోపాలపట్నం సీఐ వైకుంఠరావు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
రూ.40 లక్షల విలువైన గుట్కా స్వాధీనం
-
పోస్టల్ స్కామ్: లొంగిపోయిన ప్రధాన సూత్రధారి
హైదరాబాద్: నగరంలోని పోస్టాఫీసుల్లో రూ.2.95కోట్ల నగదు అక్రమంగా మార్పిడి చేసిన కేసులో పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు గురువారం పోలీసులకు లొంగిపోయారు. ఈ మేరకు సీబీఐ, ఏసీబీ హైదరాబాద్ ఓ ప్రకటన విడుదల చేసింది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సుధీర్ బాబు కోసం అన్ని చోట్ల నిఘా పెట్టడంతో స్వయంగా ఆయనే లొంగిపోయినట్లు పేర్కొంది. ప్రస్తుతం మరింత సమాచారం కోసం సుధీర్ బాబును విచారిస్తున్నట్లు చెప్పింది. విశ్వసనీయ సమాచారంతో హిమాయత్ నగర్, గోల్కొండ, కర్వాన్ సాహు చౌక్ పోస్టాఫీస్లుల్లో అక్రమంగా నగదు మార్పిడి జరుగుతోందని తెలిసి విజిలెన్స్ అధికారులతో పాటు మూడు శాఖలపై దాడులు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ సందర్భంగా పోస్టల్ అధికారులు జీ శ్రీనివాస్, అబ్దుల్ గని, సురేష్ కుమార్, రవితేజలు రూ.2.95 కోట్ల కొత్త నోట్లను అక్రమంగా ప్రైవేటు వ్యక్తులకు అందించినట్లు గుర్తించామని తెలిపారు. కేసులో ప్రధాననిందితుడైన పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్ బాబు ఆచూకీ లేకుండా పోవడంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారున. అదుపులోకి తీసుకున్న సమయంలో వీరి నుంచి కీలక పత్రాలు, ల్యాప్ టాప్ లు, మొబైళ్లు, రూ.17.02 లక్షల నగదు(రూ.2వేల నోట్లు) స్వాధీనం చేసుకున్నారు. వీరందరిని జ్యూడిషీయల్ కస్టడీకి పంపించి విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. -
మహిళా మావోయిస్టు లొంగుబాటు
భద్రాద్రికొత్తగూడెం: మావోయిస్టు మహిళా సభ్యురాలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు చర్ల ఏరియా దళ సభ్యురాలు సున్నం శ్రీదేవి అలియాస్ నిర్మల శనివారం ఉదయం భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ కిశోర్‌ఝా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జనజీవనస్రవంతిలోకి వచ్చిన మహిళా నక్సలైట్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. -
లొంగిపోయిన మావోయిస్టు నేత
రాంచీ: మావోయిస్ట్ నేత బలేశ్వర్ ఓరాన్ జార్ఖండ్ డీజీపీ డీకే పాండే ఎదుట లొంగిపోయాడు. ఓరాన్ పై ఐదు లక్షల రివార్డు ఉంది. లొంగిపోయిన మావోలకు ప్రభుత్వం ఇచ్చే అన్ని సదుపాయాలను అయనకు ఇవ్వనున్నట్టు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టునేత బిహార్-జార్ఖండ్ స్పెషల్ ఏరియా కమిటీలో సభ్యులు. గతంలో సబ్ జోనల్ కమాండర్‌గా కూడా వ్యవహరించారు. -
23 మంది బైండోవర్
తాడిపత్రి రూరల్ : తాడిపత్రి మండలంలోని ఊరిచింతల, వెంకటాంపల్లి గ్రామాల్లో ఇరువర్గాలకు చెందిన 23 మందిని మంగళవారం బైండోవర్ చేసినట్లు రూరల్ ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. ఊరిచింతల గ్రామానికి చెందిన రామాంజనేయులు మరో ఎనిమిది మంది, ఆదెన్న మరో ఏడుగురిని అలాగే వెంకటాంపల్లికి చెందిన శివారెడ్డి,మరో ఇద్దరు, గంగిరెడ్డి, మరో ఇద్దరిని తహశీల్దార్ ఎల్లమ్మ వద్ద బైండోవర్ చేయించామని తెలిపారు. రామాంజనేయులు వర్గం, ఆదెన్న వర్గం పాతకక్షలతో తరచూ గొడవలు పడుతున్నారు. అలాగే శివారెడ్డి, గంగిరెడ్డి భూమి విషయంలో గొడవలు పడుతున్నారు. ముందస్తు చర్యలో భాగంగా వారిని బైండోవర్ చేయించామని ఎస్ఐ తెలిపారు. -
దారితప్పిన జింకపిల్ల పోలీసులకు అప్పగింత
నర్వ : కందిచేన్లో దారితప్పి వచ్చిన కష్ణ జింకపిల్లను స్థానిక రైతులు చేరదీసి నర్వ పోలీసులకు అప్పగించిన సంఘటన ఆదివారం సీపురం గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. మండల పరిధిలోని సీపురం గ్రామానికి చెందిన రైతు ఆంజనేయులు ఆదివారం తెల్లవారుజామున తాను సాగుచేస్తున్న కందిచేనుకు వెళ్లి పరిశీలిస్తుండగా జింకపిల్ల తారసపడింది. దీంతో ఆంజనేయులు జింకపిల్లను జాగ్రత్తగా చేరదీసి జక్కనపల్లి గ్రామవాసులతో కలిసి నర్వ పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. జింకపిల్లను స్వాధీనం చేసుకొని ఫారెస్టు అధికారులకు అప్పగించినట్లు ఏఎస్ఐ మక్సూద్ అహ్మద్ తెలిపారు. -
తండ్రి హత్య కేసులో ప్రేమికుడితోపాటు కుమార్తె లొంగుబాటు
కేకే.నగర్: తండ్రిని హత్య చేసిన కేసులో ప్రేమికుడు సహా కుమార్తె న్యాయస్థానంలో లొంగిపోయింది. ఈ సంఘటన కో యంబత్తూరులో చోటు చేసుకుంది. కోయంబత్తూరు చొక్కం పుదూర్ షణ్ముగానగర్కు చెందిన నాగరాజన్ (55) కెమికల్ బిజినెస్ చేసేవాడు. ఇతని భార్య ప్రమీల. కుమార్తె మహాలక్ష్మి. ఈమె కోయంబత్తూరు మలుమిచ్చింపట్టిలో గల ప్రైవేటు కళాశాలలో బీఎస్సీ మొదటి సంవత్సరం చదువుతోంది. మహాలక్ష్మి ఒత్తకాల్ మండపం ప్రీమియర్ మిల్ ఆర్సీ నగర్‌కు చెందిన సతీష్ (19)ను ప్రేమించింది. వీరి ప్రేమను ఆమె తండ్రి నాగరాజన్ అంగీకరించలేదు. కూతురుకు మద్దతు ఇచ్చిన ప్రమీల, మహాలక్ష్మిని నాగరాజన్ ఇంటి నుంచి తరిమేశాడు. ఈ కారణంగా నాగరాజన్ పై వారికి ద్వేషం ఏర్పడింది. ఆయన్ని హత్య చేయాలని మహాలక్ష్మి, ప్రమీల, సతీష్ కలిసి పథకం పన్నారు. దాని ప్రకారం సతీష్, తన మిత్రులు నలుగురితో కలిసి నెక్కమమ్ తోటలో నాగరాజన్‌పై కత్తితో దాడి జరిపి హత్య చేశారు. ఈ నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులు వెతుకుతున్న మహాలక్ష్మి, సతీష్ శుక్రవారం కోయంబత్తూర్ జేఎం 5 మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. కేసుపై విచారణ జరిపిన మెజిస్ట్రేట్ ఇద్దరికి రిమాండ్ విధించి... జూన్ 17వ తేదీన పొల్లాచ్చి జేఎం 2 మెజిస్ట్రేట్ కోర్టులో హాజరు పరచాలని ఉత్తర్వులు జారీ చేశారు. అయితే పరారీలో ఉన్న నాగరాజన్ భార్య ప్రమీల కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
కీసరలో ప్రభుత్వ భూములు స్వాధీనం
కీసర: రంగారెడ్డి జిల్లాలో రూ. 5 కోట్ల విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని మంగళవారం రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కీసర మండలం అహ్మద్‌గూడ గ్రామానికి చెందిన బండ్ల పోచయ్య, రాములు, నారాయణలకు వ్యవసాయ నిమిత్తం అధికారులు ఎనిమిదెకరాల 17 గుంటల భూమిని కేటాయించారు. అయితే వీరు ఆ భూమిని ఇతరులకు విక్రయించినట్లు సమాచారం అందడంతో రెవెన్యూ అధికారులు ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నాగారం గ్రామపరిధిలో రూ. కోటి విలువ చేసే మరో స్థలాన్ని కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. -
50 కిలోల గంజాయి స్వాధీనం
అనంతగిరి: విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 50 కేజీల గంజాయిని పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. జి.మాడుగుల నుంచి సఫారీ వాహనంలో హైదరాబాద్‌కు తరలిస్తుండగా అనంతగిరి వద్ద ఎస్ఐ దామోదర్‌నాయుడు సిబ్బందితో కలసి దాడి చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న వాహనంతో పాటు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసులు నమోదు చేసిన పోలీసులు స్టేషన్‌కు తరలించారు. -
భారీగా పేలుడు పదార్థాలు పట్టివేత
బొబ్బిలి: విజయనగరం జిల్లాలో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బొబ్బిలి పట్టణంలో పోలీసులు ఆదివారం ఉదయం జరిపిన దాడుల్లో 18 బస్తాల డిటోనేటర్లు, జిలెటిన్ స్టిక్స్‌ను కనుగొన్నారు. చిన్నబజార్ వీధిలోని జంబలి లక్ష్మీనారాయణ, జంబలి కవితయ్య ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించగా మూడు బ్యాగుల్లో ఉంచిన డిటోనేటర్లు, ఫ్యూజ్‌వైర్లను పట్టుకున్నారు. వీరికి సంబంధించిన ఒక గోదాములో మరో 15 బస్తాల పేలుడు పదార్ధాలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పక్కా సమాచారం మేరకు ఈ దాడులు జరుగుతున్నాయి. వ్యాపారులకు దీపావళి సామాగ్రి విక్రయించేందుకు లైసైన్స్ ఉండగా... ఆ ముసుగులో డిటోనేటర్లను క్వారీలు ఇతర అవసరాలకు విక్రయిస్తున్నట్టు తెలిస్తుంది. గత మూడు రోజులుగా పట్టణంలో పోలీసులు భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
చింతూరు: తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని ఆదివారం సాయంత్రం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం జిల్లా సీలేరు నుంచి ఖమ్మం జిల్లా కొత్తగూడెంనకు డీసీఎం వాహనంలో తరలిస్తున్న గంజాయిని చింతూరు గ్రామంలో పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.46 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి, డీసీఎంను సీజ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా గంజాయి స్వాధీనం
అబిడ్స్: ధూల్‌పేట్ ఎక్సైజ్ పోలీసులు జరిపిన దాడుల్లో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. శివలాల్‌నగర్‌లో ఒక గోడౌన్లో గంజాయి ఉందన్న సమాచారంతో ధూల్‌పేట్ ఏఈఎస్ జ్వాలారెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి దాడులు చేపట్టారు. ఈ దాడులలో 48 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని సరస్వతిభాయి, కాలూసింగ్లను అరెస్టు చేసినట్లు ఏఈఎస్ జ్వాలారెడ్డి తెలిపారు. నిందితులు వైజాగ్, వరంగల్ల నుంచి గంజాయిని తీసుకువచ్చినట్లు తమ విచారణలో తేలిందని చెప్పారు. ఈ గంజాయి విలువ దాదాపు రూ.5 లక్షల వరకు ఉంటుందని ఆమె తెలిపారు. -
నాటు తుపాకితో ఆర్టీసీ డ్రైవర్ అరెస్ట్
మంచాల: రంగారెడ్డి జిల్లాలో నాటు తుపాకి కలిగి ఉన్న ఓ వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. మంచాల ఎస్సై యాదగిరి కథనం ప్రకారం... ఎల్లమ్మ తండా గ్రామానికి చెందిన సపావట్ రవి కుమార్. వృత్తి రీత్యా ఆర్టీసీ డ్రైవర్. ఆయన వద్ద తమ పూర్వీకులు వాడిన నాటు తుపాకిను కలిగి ఉన్నాడు. దానికి సంబంధించిన లైసెన్స్, ఎలాంటి అనుమతి పత్రాలు అతని వద్ద లేవు. గుట్టు చప్పుడు కాకుండా రవి కుమార్ తుపాకిని తన దగ్గర భద్రపర్చుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మంచాల ఎస్సై యాదగిరి నాటు తుపాకిని స్వాధీనం చేసుకొని రవి కుమార్‌ను అరెస్టు చేశారు. -
రూ. 29 లక్షల హవాల డబ్బు స్వాధీనం
-
భారీగా హవాలా సొమ్ము పట్టివేత
హైదరాబాద్: అక్రమంగా నగదును తరలిస్తున్న ఇద్దరి వ్యక్తులను షాహినాయత్ గంజ్ పోలీసులు గురువారం రాత్రి అదుపులోకి తీసుకున్నారు. రూ.50 లక్షలను సంచుల్లో పెట్టుకుని ద్విచక్రవాహనాలపై వెళ్తున్న శ్యాంసుందర్ శర్మ, ఓం ప్రకాశ్ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. వారి వద్దనున్న రూ.50 లక్షలను హవాలా మార్గాల్లో తరలిస్తున్నట్లు వెల్లడైంది. పోలీసులు సొమ్మును సీజ్ చేసి నిందితులను విచారిస్తున్నారు. ఈ హవాలా నగదు వెనుక బడా వ్యాపారవేత్తల హస్తం ఉన్నట్లు తెలుస్తుంది. -
అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం పట్టివేత
చంద్రగిరి: చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన చంద్రగిరి మండలం మూలపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం చోటుచేసుకుంది. వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో ఓ వ్యాన్‌లో 36 ఎర్రచందనం దుంగలను పోలీసులు పట్టుకున్నారు. వీటిని తరలిస్తున్న వ్యాన్ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రైల్వేకోడూరు: వైఎస్సార్ జిల్లాలో నీళ్లలో దాచిన ఎర్రచందనం దుంగలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వేకోడూరు మండలం మాధవరంపాడు రైల్వేట్రాక్ బ్రిడ్జి కింద పోలీసులు, అటవీశాఖాధికారులు సంయుక్తంగా చేసిన దాడుల్లో 120 ఎర్రచందనం దుంగలను అదుపులోకి తీసుకున్నారు. అధికారులు కనిపెట్టకుండా ఉండేందుకు దొంగలు నీళ్లలో దాచిపెట్టి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
నల్లమలలో భారీ డంప్ స్వాధీనం
ఎర్రగొండపాలెం: ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులకు భారీ డంప్ దొరికింది. యర్రగొండపాలెంకు 30 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో పోలీసులు గురువారం మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా డంప్ బయటపడిందని ఎస్పీ శ్రీకాంత్ చెప్పారు. ఇందులో.. 11 రాకెట్ లాంచర్లు, ఒక ఏకే 47 బుల్లెట్ మ్యాగజిన్, తపంచా బ్యారెల్, రాకెట్ లాంచర్ విడి భాగాలతోపాటు గ్యాస్ కట్టర్లు 2, కవర్ ప్యాకింగ్ మెషిన్, 2 డ్రిల్లింగ్ బిట్లు ఉన్నట్లు ఆయన తెలిపారు. -
భారీగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
సాలూరు: విజయనగరం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాలూరులో గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్నారని స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు తనిఖీలు చేపట్టగా ట్రాన్స్‌పోర్టు ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 20 బస్తాల గుట్కా, జర్దా, ఖైనీ ప్యాకెట్లను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకన్న ప్యాకెట్ల విలువ సుమారు రూ. 5 లక్షల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
కరీంనగర్ జిల్లా : అక్రమంగా కలప తరలిస్తున్న వ్యాన్‌ను కరీంనగర్ జిల్లా పోలీసులు అదుపులోకి పట్టుకున్నారు. మహదేవ్ పూర్ మండలం బొమ్మాపూర్ క్రాస్ రోడ్డు వద్ద వాహనంలో కలప తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసుల తనిఖీల్లో సుమారు రూ. 3 లక్షల విలువ చేసే టేకు దుంగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు. -
మావోయిస్టు అగ్రనేత అశోక్ లొంగుబాటు
హైదరాబాద్: తెలంగాణలో మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత గణపతి సోదరుడు, పార్టీ దండకారణ్య కమిటీ కార్యదర్శి గాజర్ల అశోక్ హైదరాబాద్‌లో గురువారం పోలీసుల ఎదుట లొంగిపోయారని తెలుస్తోంది. ఆయన అనేక ఎన్కౌంటర్లతో పాటు, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. ప్రభుత్వం.. అశోక్‌పై రూ.20 లక్షల రివార్డు ప్రకటించి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా గాజర్ల అశోక్ దండకారణ్యంలో యాక్టివ్‌గా పని చేస్తున్నారు. ఆయన స్వస్థలం వరంగల్ జిల్లా చిట్యాల మండలం వెలిశాల. అనారోగ్యం వల్లే అశోక్ .. పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఆయనను వెంటనే విడుదల చేయాలని విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు డిమాండ్ చేస్తున్నారు. కాగా అశోక్ లొంగుబాటును పోలీసులు ఇంకా ప్రకటించలేదు. -
పేకాట రాయుళ్ల నుంచి భారీగా నగదు స్వాధీనం
బాసర: ఆదిలాబాద్ జిల్లా, మహారాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో ఉన్న క్లబ్‌పై పోలీసులు శనివారం రాత్రి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భారీగా నగదుతో పాటు, 100 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఏఎస్పీ ఆధ్వర్యంలోని పోలీసుల బృందం మహారాష్ట్రలోని నాయిగాం గ్రామంలోని క్లబ్‌పై దాడులు చేశారు. పేకాట ఆడుతున్న తెలంగాణ, ఏపీ, మహారాష్ట్రలకు చెందిన 100 మందిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ.20 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. -
కొడుకా లొంగిపో..
మావోయిస్టు విద్యాసాగర్‌రెడ్డి తల్లిదండ్రుల వేడుకోలు ధర్మసాగర్ : మండలంలోని కరుణపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మణికంటి విద్యాసాగర్‌రెడ్డి అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని అతడి తల్లిదండ్రులు సుధాకర్‌రెడ్డి-లత కోరారు. శుక్రవారం ధర్మసాగర్ ఠాణాలో సీఐ ఎ.రాజయ్య సమక్షంలో వారు విలేకరులతో మాట్లాడారు. తమ కుమారుడు కుటుంబాన్ని విడిచిపెట్టినప్పటి నుంచి తాము దుర్భరజీవితం గడుపుతున్నట్లు తెలిపారు. సీఐ ఎ.రాజయ్య మాట్లాడుతూ, విద్యాసాగర్ రెడ్డి లొంగిపోతే సాధారణ జీవనం గడిపేందుకు సదుపాయూలు కల్పిస్తామని చెప్పారు. -
మనసు దోచుకున్నాడు..
పోలీసులకు టీ అందిస్తున్న వ్యక్తి పేరు శీలంశెట్టి వెంకటరమణ. వృత్తి దొంగతనం. 200లకు పైగా దొంగతనాలతోపోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన చరిత్ర అతనిది. ఎన్నిసార్లు జైలుకు వెళ్లొచ్చినా మార్పు రాలేదు. మళ్లీ ధ్యాసంతా దొంగతనాల పైనే. 2002లో కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేసినా అతనిలో చలనం కలగలేదు. ఆఖరికి తనపై ఉన్న కేసులకు విసుగెత్తి స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. అతనిలో మార్పు వస్తుందనే నమ్మకంతో ఎలాగైనా మార్చాలని సంకల్పించిన పోలీసులు.. ఎట్టకేలకు విజయం సాధించారు. ఆరు నెలల పాటు వెంకటరమణకు, అతని కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చి మంచి మనిషిగా మార్చారు. కృష్ణా జిల్లా రాజరాజేశ్వరీపేట ఇతని స్వస్థలం. పదేళ్ల వయసు నుంచే చెడు సావాసాలతో దొంగతనాలకు అలవాటు పడ్డాడు. ఇళ్ల లో దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు. తాను చేస్తున్న పనికి ముఖం చూపించుకోలేక భార్యాపిల్లలకు, బంధువులకు దూరంగా బతికేవాడు. పేదరికం, చిన్నతనంలో తెలియనితనంతో దొంగగా మారానని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే భార్యాపిల్లల భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మారిపోయానని కన్నీటి పర్యంతమయ్యాడు వెంకటరమణ. అతడు నలుగురిలో తలెత్తుకుని జీవించేందుకు నగర క్రైం డీసీపీ నవీన్‌కుమార్ సహకారంతో హైదరాబాద్‌లోని ఉప్పల్ పోలీసులు.. దాదాపు 40 వేలతో ఓ టీస్టాల్ ఏర్పాటు చేయించారు. ఈ టీస్టాల్‌ను అదనపు డీసీపీ శ్రీనివాస్, క్రైం ఏసీపీ సాయి మనోహర్, మల్కాజిగిరి ఏసీపీ రవిచందన్రెడ్డితో కలసి బుధవారం ప్రారంభించారు. ప్రతి నేరస్తుడు తన నేరప్రవృత్తిని వీడి జనజీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకొస్తే తమ వంతు సాయమందిస్తామని ఏసీపీ రవి చందన్‌రెడ్డి పేర్కొన్నారు. వారికి వివిధ రంగాల్లో శిక్షణనిచ్చి గౌరవంగా బతికేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. - హైదరాబాద్ -
దళ కమాండర్ లొంగుబాటు
ఖమ్మం : ఖమ్మం జిల్లాలోని తెలంగాణ-చత్తీస్ఘడ్ సరిహద్దులో మావోయిస్టు దళ కమాండర్ శ్యామల దుర్గయ్య అలియాస్ దర్మన్న పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈయనపై చత్తీస్ఘడ్, తెలంగాణా రాష్ట్రాలలో 20కి పైగా కేసులు ఉన్నాయి. దర్మన్న మూడు రోజుల కిందటే భద్రాచలం ఏఎస్పీ భాస్కరన్ ఎదుట లొంగిపోయారు. శనివారం విలేకర్ల ముందు ప్రవేశపెట్టారు. (కొత్తగూడెం) -
ఆర్ఓసీ మాజీ నేత హుస్సేన్ లొంగుబాటు
అనంతపురం: రీ ఆర్గనైజింగ్ కమిటీ(ఆర్ఓసీ) మాజీ నేత నాగూర్ హుస్సేన్ (40) ధర్మవరం కోర్టులో బుధవారం లొంగిపోయాడు. గత పదేళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతడిపై దాదాపు పది కేసులు ఉన్నాయి. తమ ప్రత్యర్థులను హతమార్చేందుకు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఆర్వోసీని ఏర్పరచినట్లు చెబుతారు. ఈ కమిటీలో ప్రధాన నిందితులు ఇప్పటికే లొంగిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్‌గా ఉన్న చమన్, అలాగే పరిటాల రవి ప్రధాన అనుచరుడైన పోతుల సురేష్ సైతం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. వీరు కూడా దాదాపు ఆరేళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా నాగూర్ హుస్సేన్ లొంగిపోవటం భిన్న పరిణామాలకు దారితీస్తోంది. ఇంకా ఈ కమిటీలో ఎవరైనా ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది. (ధర్మవరం) -
లొంగిపోయిన ఇద్దరు కీలక మావోయిస్టులు
బెంగళూరు: మావోయిస్టు నేతలైన సిరిమనెనాగరాజ్, నూర్జుల్పీకర్లు చిక్కమగళూరు కలెక్టర్ బీసీ శేకరప్ప సమక్షంలో సోమవారం మధ్యాహ్నం లొంగిపోయారు. వీరివెంట సామాజిక వేత్తలు హెచ్ఎస్ దొరైస్వామి, గౌరీలంకేశ్, శివసుందర్, నగరిబాబయ్య తదితరులు ఉన్నారు. తాము ఇక శాంతియుత జీవనం కొససాగిస్తామని ఈ సందర్భంగా నాగరాజు, నూర్జుల్పీకర్ మీడియా తో పేర్కొన్నారు. తమ లొంగుబాటు వెనుక ఎవరి ఒత్తిడి లేదన్నారు. అనారోగ్య కారణాలతో తా ము జనజీవన స్రవంతిలో కలుస్తున్నామన్నది కేవలం అసత్యప్రచారమని కొట్టిపారేశారు. తమ మనస్సాక్షికి అనుగుణంగానే నడుచుకుంటున్నామన్నారు. ఇదిలా ఉం డగా ఈ ఇద్దరు మావోయిస్టులు లొంగిపోవడానికి కొద్ది గంటల మందు కేరళ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగినట్లు సమాచారం. ఇరురాష్ట్రాల ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ కొంతమంది కరపత్రాలను పంచుతూ తమనుతాము మావోయిస్టులుగా పరిచయం చేసుకున్నట్లు స్థానికులు చెప్పారు. మరోవైపు చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమైన మావోయిస్టుల లొంగుబాటుకు ప్రభుత్వం అంగీకరించడం సరికాదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్‌జ్యోషి అభిప్రాయపడ్డారు. దీని వల్ల పోలీసుల నైతిక స్థైర్యం దెబ్బతింటుందని అభిప్రాయపడ్డారు. -
పోలీసులకు లొంగిపోయిన టీవీ9 రవిప్రకాష్
హైదరాబాద్: టీవీ 9 సీఈఓ రవి ప్రకాష్ ఈరోజు ఎల్బినగర్ పోలీస్ స్టేషన్ కు వచ్చి లొంగిపోయారు. తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచేలా కథనం ప్రసారం చేసిన టీవీ9 న్యూస్‌చానల్‌పై, ఆ సంస్థ సీఈఓ రవిప్రకాష్‌పైన జూన్‌లో ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. జూన్ 12వ తేదీ రాత్రి 8.30 గంటలకు టీవీ9లో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచే విధంగా కథనం ప్రసారం చేశారని ఆరోపిస్తూ 18న ఎల్బీనగర్కు చెందిన న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ సైబరాబాద్ రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం టీవీ9 సంస్థ, దాని సీఈవో రవిప్రకాష్‌పై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రవిప్రకాష్‌కు నోటీసులు జారీ చేశారు. రవిప్రకాష్ ఈరోజు పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసుకు సంబంధించి పోలీసులు కొద్దిసేపు అతనిని ప్రశ్నించారు. ఆ తరువాత అతనిని పంపించివేశారు.