అనంతపురం: రీ ఆర్గనైజింగ్ కమిటీ(ఆర్‌ఓసీ) మాజీ నేత నాగూర్ హుస్సేన్ (40) ధర్మవరం కోర్టులో బుధవారం లొంగిపోయాడు. గత పదేళ్లుగా ఆయన అజ్ఞాతంలో ఉన్నాడు. ఇతడిపై దాదాపు పది కేసులు ఉన్నాయి. తమ ప్రత్యర్థులను హతమార్చేందుకు మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఆర్వోసీని ఏర్పరచినట్లు చెబుతారు. ఈ కమిటీలో ప్రధాన నిందితులు ఇప్పటికే లొంగిపోయిన విషయం తెలిసిందే.
ప్రస్తుతం అనంతపురం జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్న చమన్, అలాగే పరిటాల రవి ప్రధాన అనుచరుడైన పోతుల సురేష్ సైతం పోలీసుల సమక్షంలో లొంగిపోయారు. వీరు కూడా దాదాపు ఆరేళ్లకు పైగా అజ్ఞాతంలో ఉన్నారు. తాజాగా నాగూర్ హుస్సేన్ లొంగిపోవటం భిన్న పరిణామాలకు దారితీస్తోంది. ఇంకా ఈ కమిటీలో ఎవరైనా ఇప్పటికీ యాక్టివ్ గా ఉన్నారా అనే ప్రశ్న తలెత్తుతోంది.
(ధర్మవరం)