సాక్షి, ఢిల్లీ: తీహార్ జైల్లో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ లొంగిపోయారు. మధ్యంతర బెయిల్ ముగియడంతో జైల్లో ఆయన లొంగిపోయారు. మద్యం పాలసీ కేసుపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఏప్రిల్‌లో ఆయనను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం కోసం 21 రోజుల మధ్యంతర బెయిల్‌ను సుప్రీంకోర్టు మే 10న మంజూరు చేసింది. ఆదివారంతో బెయిల్ గడువు ముగిసింది. బెయిల్ పొడిగింపు అభ్యర్థనను కోర్టు నిరాకరించడంతో ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం సాయంత్రం తీహార్ జైలులో లొంగిపోయారు.
కాగా, అంతకుముందు కేజ్రీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు సందేశం ఇస్తూ.. ‘‘సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నేను 21 రోజుల పాటు ఎన్నికల ప్రచారానికి వచ్చాను. ఈ అవకాశం ఇచ్చిన న్యాయస్థానానికి కృతజ్ఞతలు. ఈరోజు తిరిగి లొంగిపోతానని తెలిపారు.
‘‘మధ్యాహ్నం 3 గంటలకు ఇంటి నుండి బయలుదేరి రాజ్‌ఘాట్‌లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులర్పిస్తాను. అనంతరం హనుమాన్ ఆలయానికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుంటాను. అక్కడ నుంచి పార్టీ కార్యాలయానికి వెళ్లి నేతలను, కార్యకర్తలను కలిసి తీహార్‌కు వెళ్తా. మీరు ఇక్కడ సంతోషంగా ఉంటేనే మీ సీఎం జైల్లో ఆనందంగా ఉంటాడు’’ అంటూ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment