![Sunita Kejriwal Fire On Enforcement Directorate](/styles/webp/s3/article_images/2024/06/21/sunitakejriwal_0.jpg.webp?itok=Hx9JSVOJ)
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆమ్‌ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు శుక్రవారం(జూన్21) చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ దాఖలు చేసిన రద్దు పిటిషన్‌ను విచారించేదాకా బెయిల్ ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది.
Comments
Please login to add a commentAdd a comment