sunita kejriwal
-
మోదీకి కేజ్రీవాల్ ఎప్పటికీ తలవంచరు: సునీతా కేజ్రీవాల్
చండీగఢ్: ప్రధాని నరేంద్రమోదీ ముందు తన భర్త ఎప్పటికీ తలవంచరని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. హర్యానాలోని సోహ్నాలో ఆదివారం(ఆగస్టు4) జరిగిన ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) ప్రచార సభలో సునీత ప్రసంగించారు. ‘ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పనులు మోదీ చేయలేకపోయారని విమర్శించారు. #WATCH | Sohna, Haryana: Delhi CM and AAP national convenor Arvind Kejriwal's wife Sunita Kejriwal says, "Is there any other party that has improved the conditions of government schools, hospitals, made mohalla clinics, provided free electricity? Only Arvind Kejriwal can do all… pic.twitter.com/tWUzLC4vsN— ANI (@ANI) August 4, 2024 మరిన్ని మంచి పనులు చేయకుండా కేజ్రీవాల్‌ను ఆపడానికే జైలులో పెట్టారు. ‘హర్యానా భూమి పుత్రుడైన కేజ్రీవాల్ మోదీకి ఎప్పటికీ తలవంచరు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హర్యానాలో బీజేపీకి ఎవరూ ఒక్క ఓటు కూడా వేయొద్దు’అని సునీత కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. -
Sunita Kejriwal: గొప్ప కార్యాలు సాధించేందుకే పుట్టారు!
యమునానగర్: అరవింద్ కేజ్రీవాల్‌కు భగవంతుడి అనుగ్రహం ఉందని, గొప్ప కార్యాలను సాధించేందుకే ఆయన పుట్టారని భార్య సునీత కేజ్రీవాల్ అన్నారు. ‘1968 ఆగస్టు 16న అరవింద్ కేజ్రీవాల్ పుట్టారు. ఆ రోజు కృష్ణ జన్మాష్టమి. ఇది యాధృచ్చికం కాదు. ఆయన ద్వారా దేవుడు ఏదో చేయించాలని అనుకుంటున్నాడని భావిస్తున్నా’ అని ఆమె పేర్కొన్నారు. మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వొద్దని హరియాణ ప్రజలను కోరారు. శనివారం సునీత హరియాణాలో సదౌరాలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు. పాఠశాలలు, ఆసుపత్రుల స్థితిగతులను మార్చడం, మొహల్లా క్లినిక్‌లు, ఉచిత విద్యుత్.. ఇవి ఆప్‌తోనే సాధ్యమన్నారు. హరియాణా పుత్రుడు కేజ్రీవాల్‌తోనే ఇవి సాధ్యమని చెప్పారు. తప్పుడు కేసులో తన భర్తను బీజేపీ జైలుకు పంపిందని ఆరోపించారు. ‘మోదీ.. కేజ్రీవాల్‌ను కాదు హరియాణా పుత్రుడిని జైళ్లో పెట్టారు. నేను మీ కోడలిని. ఈ అవమానాన్ని మీరు సహిస్తారా? నిశ్శబ్దంగా ఉంటారా? కేజ్రీవాల్ ఒక సింహం. ఆయన మోదీ ముందు మోకరిల్లరు’ అని సునీత అన్నారు. -
ఢిల్లీలో ఆప్ జలదీక్ష
న్యూఢిల్లీ: నీటి ఎద్దడిని తీవ్రంగా ఎదుర్కొంటున్న ఢిల్లీ వాసుల కష్టాలు తీర్చాలంటూ ఆప్ నేత, ఢిల్లీ మంత్రి ఆతిశీ సింగ్ శుక్రవారం నిరాహార దీక్ష చేపట్టారు. యమునా నది అదనపు జలాలను హరియాణా తక్షణం ఢిల్లీకి విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. రాజ్‌ఘాట్‌లో గాం«దీజీకి నివాళులరి్పంచి దీక్ష మొదలెట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, సౌరభ్ భరద్వాజ్ తదితరులు ఆమెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. దీక్షకు మద్దతుగా తిహార్ జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని సునీత చదివి వినిపించారు. ‘‘ఆతిశి తపస్సు విజయవంతమవుతుంది. గొంతెండుతున్న వారి దప్పిక తీర్చడం మన సంప్రదాయం. తీవ్రమైన ఎండకాలంలో పొరుగురాష్ట్రాలు నీళ్లిచ్చి ఆదుకోవాలి. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వం నీటిని విడుదలచేయకుండా ఆపి ఢిల్లీ ప్రజలు ఆప్ ప్రభుత్వాన్ని తిట్టుకునేలా చేయాలని మోదీ సర్కారు కుట్ర పన్నింది’’ అని అందులో కేజ్రీవాల్ ఆరోపించారు. ‘‘నీటి సమస్యపై మోదీకి లేఖ రాశా. హరియాణా ప్రభుత్వాన్ని వేడుకున్నా. ఢిల్లీ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు, మహిళల నీటి సమస్యలు చూడలేక నీటి సత్యాగ్రహానికి సిద్ధపడ్డా’’ అని ఆతిశి ప్రకటించారు. రోజూ 613 లక్షల గ్యాలెన్ల నీటిని విడుదలచేసే హరియాణా గత రెండు వారాలుగా కేవలం 513 లక్షల గ్యాలెన్ల నీటినే రోజూ విడుదలచేస్తోంది. గత రెండు రోజులుగా మరో 120 లక్షల గ్యాలెన్ల మేర కోత పెట్టింది.విమర్శించిన బీజేపీ దీక్షను రాజకీయ నాటకంగా బీజేపీ అభివరి్ణంచింది. ‘‘ఆతిశి విఫల మంత్రి. నీటి కష్టాలు తప్పవని ఫిబ్రవరిలోనే సూచనలు కనిపించినా ముందస్తు ఏర్పాట్లు చేయలేదు. ఎగువ హిమాచల్ ప్రదేశ్ నుంచో, ఆప్ పాలిత పంజాబ్ నుంచి ఎందుకు నీళ్లు అడగటం లేదు? ఢిల్లీ నీటి ట్యాంకర్ మాఫియాతో ఆప్ నేతలకు సంబంధముంది’’ అని ఆరోపించింది.నా భర్త ఏమన్నా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదా: సునీతా కేజ్రీవాల్తన భర్త ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అన్నట్లుగా ఈడీ వ్యవహరిస్తోందని కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ మండిపడ్డారు. ఆయన బెయిల్‌ను హైకోర్టులో సవాలు చేపడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘బెయిల్ ఉత్తర్వు వెబ్సైట్లో అప్లోడ్ కూడా కాకముందే తెల్లవారుజామునే ఈడీ హైకోర్టును ఆశ్రయించిందని ఆక్షేపించారు. కేజ్రీవాల్ ఏమైనా ఉగ్రవాదా?’’ అంటూ దీక్షా స్థలి వద్ద మండిపడ్డారు. -
కేజ్రీవాల్ ఏమైనా టెర్రరిస్టా: సునీతా కేజ్రీవాల్ ఫైర్
న్యూఢిల్లీ: దేశంలో నియంతృత్వం హద్దులు దాటిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) తీరుపై ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఢిల్లీలో నీటి సంక్షోభాన్ని పరిష్కరించాలని ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు శుక్రవారం(జూన్21) చేపట్టిన నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సునీత మాట్లాడుతూ లిక్కర్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఆర్డర్‌ను ట్రయల్ కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేయకముందే ఈడీ హైకోర్టులో బెయిల్ రద్దు పిటిషన్ ఎలా వేస్తుందని ప్రశ్నించారు. సీఎం స్థాయిలో ఉన్న కేజ్రీవాల్‌ను ఉగ్రవాదిలా చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమకు హైకోర్టు న్యాయం చేస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు.కాగా, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్‌పై ఈడీ దాఖలు చేసిన రద్దు పిటిషన్‌ను విచారించేదాకా బెయిల్ ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దేశానికి ఆయువుపట్టయిన ఢిల్లీని కొల్లగొట్టిన వారే ఎర్రకోటలో జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, ఆపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేసి కేంద్రంలో అధికారం చేపట్టాయి. గత రెండు ఎన్నికల్లో రాజధానిలోని మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. ఎంపీలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను పక్కన పెట్టేసింది! ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొన్న ఆప్.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌పై 90వ దశకం నుంచి క్రమంగా బీజేపీ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత నుండి హస్తినలో అధికారం ఆ రెండు పారీ్టల మధ్యే మారుతూ వచి్చంది. 2009లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయగా 2014, 2019ల్లో అదే ఫీట్‌ను బీజేపీ చేసి చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ‘చీపురు’ తిరగేసిన ఆప్ లోక్‌సభకు వచ్చేసరికి ఒక్క స్థానమూ దక్కించుకోలేకపోయింది. ఓట్లపరంగా కూడా బీజేపీ ఆ రెండు పారీ్టలకు అందనంత ఎత్తులో నిలిచింది. కమలం గుర్తుకు 56.86 శాతం ఓట్లు రాగా హస్తానికి 22.51 శాతం, ఆప్‌కు గుర్తుకు 14.79 శాతం పోలయ్యాయి. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆప్ చేతిలో వరుసగా భంగపాటు తప్పడం లేదు.కేజ్రీవాల్ అరెస్టు కలిసొచ్చేనా? నయా రాజకీయాలతో సంచలనం అరవింద్ కేజ్రీవాల్ 2012లో పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నానాటికీ బలపడుతూ వచి్చంది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. 70 సీట్లకు 28 స్థానాలు సాధించింది. బీజేపీకి 32 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో 8 సీట్లొచి్చన కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారి సీఎం అయ్యారు. కానీ 49 రోజులకే రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్క సీటూ రాలేదు. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లతో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేతులెత్తేసినా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 62 సీట్లతో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి తరఫున సుడిగాలి ప్రచారానికి సన్నద్ధమైన కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. ఇది ఆప్‌కు కలిసొస్తుందా, ప్రతికూలంగా మారుతుందా అన్నది ఆసక్తికరం. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొనడం ఆప్‌కు ఊరటనిచ్చే పరిణామమే. దీనిపై మే 7న కోర్టు వెలువరించబోయే నిర్ణయం కోసం పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బీజేపీ ‘హ్యాట్రిక్’ గురి... ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భోజ్‌పురి సూపర్ స్టార్ 2014లో ఇక్కడి నుంచే బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. తర్వాత ఢిల్లీ బీజేపీ పగ్గాలు చేపట్టి 7 సీట్లనూ క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తివారీ తప్ప మిగతా ఆరుగురు సిట్టింగులనూ బీజేపీ మార్చేయడం విశేషం! ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని బీజేపీ ప్రధాన ప్రచారాంశంగా జనంలోకి తీసుకెళ్తోంది. మోదీ ఫ్యాక్టర్‌తో పాటు సీఏఏ, అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు తదితరాలను నమ్ముకుంది. పూర్వాంచలీలు, ముస్లింల ఆధిపత్యముండే ఈశాన్య ఢిల్లీ స్థానంలో బిహార్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య కీలక పోరు జరగనుంది. హ్యాట్రిక్‌తో మూడోసారి లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్న మనోజ్ తివారీ ఒకవైపు, కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ మరోవైపు బరిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక సమతూకం పాటించింది. తూర్పు ఢిల్లీ నుంచి పంజాబీ అయిన హరీశ్ మల్హోత్రా, చాందినీ చౌక్ నుంచి బనియా నాయకుడు ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి గుజ్జర్ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి జాట్ నాయకుడు కమల్జీత్ సెహ్రావత్, ఎస్సీ రిజర్వ్డ్ వాయవ్య ఢిల్లీ నుంచి దళిత నాయకుడు యోగేంద్ర చందోలియాలను బరిలో నిలిపింది. కమల్జీత్తో పాటు న్యూఢిల్లీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ రూపంలో ఇద్దరు మహిళలకూ అవకాశం ఇచి్చంది.సునీతా కేజ్రీవాల్ ప్రచారం... ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల బరిలో దిగుతున్నాయి. రాజధానిలో బీజేపీకి ఎలాగైనా ముకుతాడు వేయాలని చూస్తున్నాయి. ‘ఢిల్లీ మోడల్’ను కేజ్రీవాల్ ప్రధానంగా ప్రచారం చేశారు. ఆయన జైలుపాలైన నేపథ్యంలో ఆప్ ప్రచార భారాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. ఆమె సభలకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు వంటి అంశాలను ఆప్, కాంగ్రెస్ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పైనా విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో, విపక్షాలపై దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఉసిగొల్పుతోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.సర్వేలేమంటున్నాయి... ఢిల్లీలో ఈసారి కూడా బీజేపీ మొత్తం 7 లోక్‌సభ సీట్లనూ క్లీన్‌స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంటున్నాయి. అయితే కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిఆప్కు కలిసొస్తే ఆ పారీ్టకి ఒకట్రెండు స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్‌రూఫ్‌లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024 -
‘‘కేజ్రీవాల్‌ను చంపుతారా..?’’
న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్‌షోలో పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్‌షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారన్నారు. తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. సునీతా కేజ్రీవాల్‌కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్‌షోలు ప్రారంభించారు. తొలి రోడ్‌షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
ప్రచారానికి సిద్దమైన సునీతా కేజ్రీవాల్.. అక్కడ నుంచే స్టార్ట్
ఢిల్లీ: ఢిల్లీలో లోక్‌సభ 2024 ఎన్నికలు ఆరో దశలో (మే 25) జరగనున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రధాన, ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టయిన కారణంగా ఇప్పటివరకు ఎన్నికల ప్రచారం నిర్వహించలేదు. రేపటి నుంచి (శనివారం) ఆప్ తరపున ప్రచారం నిరవహించనున్నట్లు కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రకటించారు.సునీతా కేజ్రీవాల్ తూర్పు ఢిల్లీ నియోజకవర్గం నుంచి రోడ్‌షో ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఢిల్లీలో మాత్రమే కాకుండా పంజాబ్, హర్యానాలలో కూడా పార్టీ తరపున ప్రచారం చేయనున్నట్లు విలేకర్ల సమావేశంలో సునీతా కేజ్రీవాల్ స్పష్టం చేశారు. శనివారం తూర్పు ఢిల్లీలో తన మొదటి రోడ్‌షోను.. ఆదివారం పశ్చిమ ఢిల్లీలో రోడ్‌షోను నిర్వహిస్తుందని సమాచారం.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది. -
ఇప్పుడు ఆప్‌కు ఆమె బెస్ట్ పర్సన్.. సౌరభ్ భరద్వాజ్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి 'అరవింద్ కేజ్రీవాల్' అరెస్ట్ అయిన తరువాత కూడా పరిపాలన సాగిస్తున్నారు. జైలు నుంచి పంపిస్తున్న సందేశాలను తన భార్య సునీత కేజ్రీవాల్ ప్రజలకు చేరవేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని నడిపించడానికి 'సునీత' సరైన వ్యక్తి అని ఆప్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు. ఢిల్లీ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న భరద్వాజ్.. ప్రధాన కార్యాలయంలోని జరిగిన ఒక కార్యక్రంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రికి తాను "దూత" అని సునీత కేజ్రీవాల్ ఎప్పుడూ చెబుతుంటారని అన్నారు. పార్టీ రాజకీయాలు దాని మేనిఫెస్టో చుట్టూ మాత్రమే తిరుగుతాయని.. సునీత కేజ్రీవాల్ ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి చాలా కీలకమైన వ్యక్తి అని ఆయన అన్నారు. ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన అరవింద్ కేజ్రీవాల్ ఏప్రిల్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఆయన భార్య ఇప్పటివరకు మూడు డిజిటల్ బ్రీఫింగ్‌లను ప్రసంగించారు. లోక్‌సభ ఎన్నికల్లో సునీత కేజ్రీవాల్ పార్టీ తరపున ప్రచారం చేస్తారా? అని అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. అది జరిగితే మేము కూడా సంతోషిస్తాము, ఆ నిర్ణయం ఆమె వ్యక్తిగత నిర్ణయమని పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ మరో జైలు సందేశం.. ఈసారి ‘ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్’
ఢిల్లీ, సాక్షి: జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నుంచి మరో సందేశం వచ్చింది. ఎప్పటిలాగే ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ ఆ సందేశాన్ని వినిపించారు. అయితే ఈ సారి ఓ ఆసక్తికర అంశం ఉంది. అదేంటంటే.. సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన సతీమణి సునీత కేజ్రీవాల్ వినిపిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఇందులో ఆమె వెనుక గోడకు అంబేడ్కర్, భగత్ సింగ్ చిత్రపటాలతో పాటు సీఎం కేజ్రీవాల్ ఫోటో కూడా ఉంది. అయితే కటకటాల వెనుక సీఎం ఉన్నట్లు ఆ ఫొటోను ఏర్పాటు చేశారు. "నేను జైలులో ఉండటం వల్ల ఢిల్లీ ప్రజలు ఏ విధంగానూ బాధపడకూడదు. ప్రతి ఎమ్మెల్యే ప్రతి రోజు వారి ప్రాంతానికి వెళ్లి ప్రజల సమస్యలను చర్చించి వాటిని పరిష్కరించాలి" అని కేజ్రీవాల్ తన లేఖలో పేర్కొన్నట్లు సునీత కేజ్రీవాల్ వీడియోలో చదివి వినిపించారు. "ప్రజల ప్రభుత్వపరమైన సమస్యలే కాకుండా ఇతర సమస్యలను కూడా మనం పరిష్కరించాలి. ఢిల్లీలోని రెండు కోట్ల మంది ప్రజలు నా కుటుంబం. నా వల్ల ఎవరూ బాధపడకూడదు. వారందరికీ దేవుడి ఆశీస్సులు ఉంటాయి. జై హింద్" అని కేజ్రీవాల్ అన్నట్లుగా సునీత పేర్కొన్నారు. -
తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం
ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ అరెస్టై.. జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈడీ లాకప్ ఉండి పారిపాలన కొనసాగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు ఆదేశాలు కూడా జారీ చేశారు. తాజాగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీహార్ జైలు నుంచి పంపిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ మీడియాకు చదవి వినిపించారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా తమ నియోజకవర్గాల్లోని ప్రాంతాలను ప్రతిరోజూ సందర్శించాలని కేజ్రీవాల్ సూచించినట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నాట్లు వివరించారు. ‘నేను జైలులో ఉన్నందున ఢిల్లీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులకు గురికావొద్దు. ప్రతిరోజూ ఎమ్మెల్యేలంతా వారి నియోజకవర్గాలోని ప్రాంతాలను సందర్శించాలి. అక్కడ ప్రజల సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలి’ అని కేజ్రీవాల్ సందేశం పంపినట్లు సునీతా కేజ్రీవాల్ మీడియకు తెలిపారు. అంతకు ముందు లిక్కర్ స్కామ్ మనీలాండరింగ్ కేసులో బెయిల్ లభించిన ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సునీతా కేజ్రీవాల్ కలిశారు. ఇక.. ఇటీవల అరవింద్ కేజ్రీవాల్‌ను ఆశీర్వదిస్తూ..వాట్సప్‌లో సందేశాలు పంపి మద్దతు పలకాలని సునీతా కేజ్రీవాల్ ఒక వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ఏప్రిల్ 15 వరకు కొనసాగనుంది. -
ఉచిత కరెంటు.. కేజ్రీవాల్ ఆరు గ్యారంటీలు ఇవే..
న్యూఢిల్లీ: రాబోయే లోక్‌సభ ఎన్నికలకు ముందు తన ఆరు వాగ్దానాలను ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రజల ముందుంచారు. ఉచిత విద్యుత్, ఉచిత వైద్యం, ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా వంటివి వీటిలో ఉన్నాయి. ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో జరిగిన ప్రతిపక్షాల మెగా ర్యాలీలో ఎన్నికల వాగ్దానాలతో కూడిన కేజ్రీవాల్ సందేశాన్ని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు. ఆరు గ్యారంటీలు ఇవే.. అంతరాయం లేని విద్యుత్ ఉచిత కరెంటు విప్లవాత్మక విద్య యూనివర్సల్ హెల్త్‌కేర్ రైతులకు గిట్టుబాటు ధరలు ఢిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా “ప్రియమైన భారతీయులారా, మీరందరికీ నా శుభాకాంక్షలు. నేను ఓట్లు అడగడం లేదు. ఎన్నికల్లో గెలవడానికి ఎవరినీ ఓడించడం గురించి మాట్లాడడం లేదు. దేశాన్ని నవభారతంగా మార్చడం గురించి మాట్లాడుతున్నాను. మన దేశానికి అన్నీ ఉన్నాయి. నేను జైల్లో ఉన్నాను. దేశం గురించి ఆలోచించడానికి ఇక్కడ నాకు చాలా సమయం దొరికింది. భారతమాత బాధలో ఉంది. పిల్లలకు మంచి చదువులు ఉండడం లేదు. ప్రజలకు సరైన వైద్యం అందడం లేదు. కరెంటు కోతలు, అధ్వాన రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని కేజ్రీవాల్ లేఖలో పేర్కొన్నారు. -
సునీతా కేజ్రీవాల్‌తో కల్పనా సోరెన్ భేటీ
న్యూఢిల్లీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌ను కలిశారు. ఢిల్లీలోని ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డులో ఉన్న సీఎం నివాసానికి ఆమె వెళ్లారు. సునీతా కేజ్రీవాల్, కల్పనా సోరెన్‌లు సుమారు 20 నిమిషాల సేపు మాట్లాడుకున్నారని అధికారులు తెలిపారు. అనంతరం కల్పన మీడియాతో మాట్లాడారు. ‘సునీతా జీతో ఆవేదన, బాధను పంచుకునేందుకు ఇక్కడికి వచ్చా. ఆమె తన పరిస్థితిని వివరించారు. తుది వరకు పోరాడాలని ఇద్దరం నిర్ణయించుకున్నాం. యావత్తూ జార్ఖండ్ ప్రజలు కేజ్రీవాల్ వెన్నంటే ఉంటారు’అని చెప్పారు. ‘జార్ఖండ్‌లో రెండు నెలల క్రితం జరిగిందే ఢిల్లీలో పునరావృతమైంది. నా భర్త హేమంత్ జైలుకు వెళ్లారు. కేజ్రీవాల్ కస్టడీలో ఉన్నారు. జార్ఖండ్, ఢిల్లీల్లో పరిస్థితులు ఒకేలా ఉన్నాయి’అని చెప్పారు. కాంగ్రెస్ అగ్ర నేత సోనియా గాంధీని కలిసి, పరిస్థితిని వివరిస్తానన్నారు. భూకుంభకోణం మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ జనవరిలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కల్పనా సోరెన్, జార్ఖడ్ సీఎం చంపాయి సోరెన్‌తోపాటు ఆదివారం ఢిల్లీలో జరిగే ఇండియా కూటమి ర్యాలీలో పాల్గొంటారని సమాచారం. సునీతా కేజ్రీవాల్ కూడా ర్యాలీలో పాలు పంచుకుంటారని ఆప్ నేతలు తెలిపారు. -
Sunita Kejriwal: కేజ్రీవాల్ నిజాలన్నీ వెల్లడిస్తారు!
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం కుంభకోణం కేసులో నిజాలను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయటపెట్టబోతున్నట్లు ఆయన భార్య సునీత కేజ్రీవాల్ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈడీ ఆయన్ను అరెస్టు చేసిందంటూ ఆమె బుధవారం వీడియో సందేశం విడుదల చేశారు. ‘‘మంగళవారం కలిసినప్పుడు నా భర్త నాతో పలు విషయాలు పంచుకున్నారు. ఆయన ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ప్రజల గురించే ఆలోచిస్తున్నారు. ఢిల్లీలో తాగునీటి సమస్యను నివారించాలని లేఖ ద్వారా పంపిన ఉత్తర్వులను కూడా కేంద్రం వివాదాస్పదంగా మారుస్తోంది. ఢిల్లీ నాశనం కావాలని కోరుకుంటోంది. ఈడీ అధికారులు ఇప్పటిదాకా 250 సార్లు సోదాలు నిర్వహించారు. మా నివాసంలో సోదాలు చేసి కేవలం రూ.73 వేలు స్వా«దీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంలో చేతులు మారిన సొమ్ము ఇంకా దొరకలేదని ఈడీ చెబుతోంది. మద్యం కుంభకోణంలో నిజనిజాలు, ఆ డబ్బు ఎక్కడుందో గురువారం కోర్టులో బయటపెడతానని కేజ్రీవాల్ నాతో చెప్పారు. అందుకు రుజువులు కూడా సమర్పిస్తారు’’ అని వీడియో సందేశంలో సునీత స్పష్టం చేశారు. క్షీణిస్తున్న కేజ్రీవాల్ ఆరోగ్యం ఈడీ కస్టడీలో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్యం క్షీణిస్తోందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు బుధవారం ఆందోళన వ్యక్తం చేశాయి. మధుమేహ బాధితుడైన కేజ్రీవాల్ రక్తంలో చక్కెరస్థాయిల్లో హెచ్చు తగ్గులు నమోదవుతున్నాయని వెల్లడించాయి. కేజ్రీవాల్ బ్లడ్‌షుగర్ లెవెల్ ఒక దశలో 46 ఎంజీకి పడిపోయిందని డాక్టర్లు చెప్పారని, ఇది చాలా ప్రమాదరమని తెలియజేశాయి. హైకోర్టులో కేజ్రీవాల్‌కు దక్కని ఊరట కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో నిరాశే ఎదురైంది. ఆయన అరెస్టులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. తనను ఈడీ కస్టడీ నుంచి తక్షణమే విడుదల చేయాలంటూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు బుధవారం విచారణ చేపట్టింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్ 2వ తేదీలోగా స్పందించాలని న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈడీకి సూచించారు. తదపరి విచారణను ఏప్రిల్ 3వ తేదీకి వాయిదా వేశారు. -
ఢిల్లీని నాశనం చేస్తారా?.. సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజలను నీటి కష్టాల పాలు చేస్తారా? ఢిల్లీని నాశనం చేస్తారా? అని సీఎం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ అన్నారు. తాగునీటి సమస్యలపై సంబంధిత మంత్రికి సీఎం కేజ్రీవాల్ లేఖ రాస్తే దానిపై కేసులు వేశారని మండపడ్డారామె. బుధావారం సునీతా కేజ్రీవాల్ ప్రెస్మీట్లో మాట్లాడారు. ‘రెండు రోజుల క్రితం సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాగునీటి సమస్యలకు సంబంధించి మంత్రి అతిశీకి ఆదేశాల లేఖ పంపారు. వాటి మీద కేంద్ర ప్రభుత్వం కేసు నమోదు చేసింది. ఢిల్లీని నాశనం చేస్తారా? ఢిల్లీ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తారా? ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా బాధపడుతున్నారు. ఇప్పటి వరకు ఈడీ 250 సోదాలు జరిపింది. ఈడీ అధికారులు లిక్కర్ స్కామ్ డబ్బు కోసం సోదాలు చేశారు. కానీ వారికి తమ వద్ద ఎటువంటి డబ్బు లభించలేదు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ మార్చి 28(గురువారం) అన్ని విషయాలు బయటపెడతారు. లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడ ఉందో కూడా చెబుతారు. వాటికి సంబంధించి కేజ్రీవాల్ ఆధారాలు కూడా సమర్పిస్తారు’ అని సునిత కేజ్రీవాల్ తెలిపారు. సీఎం కేజ్రీవాల్ అరెస్ట్ అయిన తర్వాత రెండోసారి ఆమె ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడారు. ఇక.. మర్చి 21న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేసింది. అనంతరం ఆయన్ను ఈడీ.. కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీకి కోరింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 వరకు కోర్టు.. ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక..ఈడీ లాకప్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ పరిపాలన కొనసాగిస్తూ.. ఆదేశాలు జారీ చేస్తున్నారు. దీనిపై బీజేపీ మండిపడుతూ.. సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తోంది -
‘రబ్రీ 2.0’.. కేజ్రీవాల్ సతీమణిపై కేంద్ర మంత్రి వ్యాఖ్యలు
లిక్కర్ పాలసీ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలుకు వెళ్లడం, పార్టీలో కీలక నేతలు కూడా జైల్లో ఉండటంతో కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ అన్నీ తానై నడిపిస్తున్నారు. జైలు నుంచి కేజ్రీవాల్ పంపిన సందేశాన్ని ఆమె ప్రజలకు చదివి వినిపించారు. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ సీఎం అవుతారని మీడియా కథనాలు వస్తున్నాయి. జైలు నుంచి కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయడంపై బీజేపీ తీవ్ర విమర్శలతో దాడి చేస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచే పాలన కొనసాగిస్తారంటూ ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన ప్రకటన ఢిల్లీ ప్రజలకు, చట్టానికి, ప్రజాస్వామ్యానికి అవమానకరమని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. ‘అప్పుడు బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ జైలుకి వెళ్లినప్పుడు ఆయన సతీమణి రబ్రీదేవిని ముందు పెట్టి నడిపించారు. ఇప్పుడు రబ్రీ 2.0 సమయం వచ్చింది’ అన్నారు. -
కేజ్రీవాల్ సతీమణికి బన్సూరి స్వరాజ్ కౌంటర్
లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపించిన సందేశాన్ని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో ఆవేదనతో చదివి వినిపించారు. దీనిపై బీజేపీ నాయకురాలు, దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్ కౌంటర్ ఇచ్చారు. "ఈ రోజు ఆమె (సునీతా కేజ్రీవాల్) బహిరంగంగా వ్యక్తం చేసిన భావాలను నేను అర్థం చేసుకోగలను. దానికి (అరెస్ట్) బాధ్యత వహించే ఏకైక వ్యక్తి అరవింద్ కేజ్రీవాల్ అని నేను చెబుతాను. ఈ మద్యం పాలసీ కారణంగా ఏడ్చిన మహిళలందరికీ ఆయన జవాబుదారీగా ఉండాలి" అని బన్సూరి స్వరాజ్ అన్నారు. లిక్కర్ కుంభకోణంలో కేజ్రీవాల్ రూ.100 కోట్లు తీసుకున్నారని బన్సూరి స్వరాజ్ ఆరోపించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జారీ చేసిన తొమ్మిది సమన్లను కేజ్రీవాల్ ఖాతరు చేయకపోవడంపై విరుచుకుపడిన బన్సూరి స్వరాజ్.. "ఈడీ జారీ చేసిన తొమ్మిది సమన్లను దాటవేసేందుకు ఢిల్లీ ప్రజలకు, తన సొంత కుటుంబానికి ఆయనే బాధ్యుడు. దీంతోనే ఈడీ అదుపులోకి తీసుకుంది" అన్నారు. -
‘మోదీ అధికార దురహంకారం’: కేజ్రీవాల్ సతీమణి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ స్పందించారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయనది అధికార దురహంకారమని, అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం పాలసీతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ విచారణకు సంబంధించి తన భర్త, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేతను అదుపులోకి తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బృందం ఆమె ఇంటిపై దాడి చేసిన ఒక రోజు తర్వాత సునీతా కేజ్రీవాల్ ఇలా ప్రతిస్పందించారు. "మూడుసార్లు ఎన్నికైన మీ ముఖ్యమంత్రిని మోదీజీ అధికార అహంకారంతో అరెస్టు చేశారు. అందరినీ అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది ఢిల్లీ ప్రజలకు చేసిన ద్రోహం. మీ ముఖ్యమంత్రి ఎప్పుడూ మీ వెంటే ఉన్నారు. లోపల (జైలు) అయినా బయట అయినా.. ఆయన జీవితం దేశానికే అంకితం చేశారు. ప్రజలకు ప్రతిదీ తెలుసు. జై హింద్" అని సునీతా కేజ్రీవాల్ ‘ఎక్స్’ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. आपके 3 बार चुने हुए मुख्यमंत्री को मोदीजी ने सत्ता के अहंकार में गिरफ़्तार करवाया।सबको crush करने में लगे हैं। यह दिल्ली के लोगो के साथ धोखा है।आपके मुख्यमंत्री हमेशा आपके साथ खड़े रहें हैं।अंदर रहें या बाहर, उनका जीवन देश को समर्पित है।जनता जनार्दन है सब जानती है।जय हिन्द🙏 — Sunita Kejriwal (@KejriwalSunita) March 22, 2024 -
కేజ్రీవాల్‌కు డబుల్ ధమాకా
సాక్షి, న్యూఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌కు డబుల్ ధమాకాలా ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ పుట్టినరోజు కూడా మంగళవారం రావడం కలిసివచ్చింది. భార్య బర్త్‌డే వేడుకలతో పాటు ఢిల్లీ ప్రజలు తన సర్కార్‌కు మరోసారి పట్టం కట్టడంతో కేజ్రీ ఉత్సాహం రెట్టింపైంది. తన భర్త కోసం విస్తృతంగా ప్రచారం చేసిన సునీతా కేజ్రీవాల్ (54)కు ట్విటర్లో నెటిజన్ల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కేజ్రీవాల్ రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వకముందు ఇద్దరూ ఐఆర్ఎస్ అధికారులుగా పనిచేసిన విషయం తెలిసిందే. హ్యాపీబర్త్‌డే సునీతా మేడమ్..మా హీరోకు మీరే బలం..మిమ్మల్ని చూసి గర్విస్తున్నామని ఓ ట్విటర్ యూజర్ పేర్కొనగా, ఎన్నికల ఫలితాలు సానుకూలంగా వచ్చిన రోజే పుట్టినరోజు జరుపుకోవడం సంతోషకరమని, కేజ్రీవాల్ వెనుకున్న శక్తి మీరేనంటూ మరో ట్విటర్ యూజర్ వ్యాఖ్యానించారు. మరోవైపు ఓటింగ్ రోజున పోలింగ్ బూత్ వెలుపల కుటుంబ సభ్యులతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన సునీత తమ కుమారుడు తొలిసారిగా ఎన్నికల్లో ఓటు వేస్తున్నాడని పేర్కొన్నారు. తన భర్త కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలను దీటుగా తిప్పికొడుతూ ఆప్ శ్రేణులతో కలిసి ఆమె ఇంటింటి ప్రచారం చేపట్టారు. చదవండి : ఆప్ సంబరాలు.. కేజ్రీవాల్ కీలక నిర్ణయం -
పట్టరాని సంతోషంలో స్మృతీ ఇరానీ, సునీతా కేజ్రీవాల్
న్యూఢిల్లీ : స్త్రీలు ఎంత గొప్ప స్థాయిలో ఉన్నా సరే.. సంతానం విషయానికి వచ్చేసరికి ఒకేలా స్పందిస్తారు. పిల్లలు గెలిస్తే అందరికన్నా ఎక్కువ వారే సంతోషపడతారు.. ఓడితే పిల్లలకు ధైర్యం చెబుతారు. ఇందుకు నిదర్శనంగా నిలిచారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఢిల్లీ ముఖ్యమంత్రి భార్య సునీత కేజ్రీవాల్. ఇంతకు విషయం ఏంటంటే.. గురువారం సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో కేజ్రీవాల్ కుమారుడు పుల్కిత్ కేజ్రీవాల్ 96.4 శాతం, స్మృతి ఇరానీ కొడుకు జోహర్ 91 శాతం మార్కులు సాధించి వారి తల్లిదండ్రుల ఆనందానికి కారణమయ్యారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా వెల్లడించారు సునీత కేజ్రీవాల్, స్మృతి ఇరానీ. ‘దేవుడి దయ, శ్రేయోభిలాషుల ఆశీర్వాదాలతో మా అబ్బాయి సీబీఎస్సీ 12వ తరగతి ఫలితాల్లో 96.4 పర్సంటైల్‌ను సాధించాడు. అత్యంత కృతజ్ఞతాభావంతో’ అని సునీత ట్వీట్ చేశారు. అలాగే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా..‘బిగ్గరగా చెప్పడం కరెక్టే. మా అబ్బాయి జోహర్ పట్ల చాలా గర్వంగా ఉంది. ప్రపంచ కెంపో ఛాంపియన్ షిప్లో క్యాంస పతకం సాధించడంతో పాటు సీబీఎస్సీలో మంచి స్కోర్ సాధించాడు. ఆర్థిక శాస్త్రంలో 94 శాతాన్ని సాధించినందుకు స్పెషల్ యాహూ. నన్ను క్షమించండి. ఈ రోజు నేను అత్యంత సంతోషకరమైన అమ్మను’ అని పట్టలేని సంతోషాన్ని వ్యక్తం చేశారు. గురువారం మధ్యాహ్నం వెల్లడైన ఈ ఫలితాల్లో 83.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. Ok saying it out loud— proud of my son Zohr..not only did he come back with a bronze medal from the World Kempo Championship also scored well in 12 th boards. Best of 4– 91% .. special yahoo for 94% in economics.. Maaf karna ,today I’m just a gloating Mom🙏 — Chowkidar Smriti Z Irani (@smritiirani) May 2, 2019 -
సోల్‌మేట్ సునీత
సునీతా కేజ్రీవాల్, ఐ.ఆర్.ఎస్. మాజీ అధికారి జన్మస్థలం : ఢిల్లీ; భర్త : అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి; వివాహం : 1994; పిల్లలు : హర్షిత (1996), పులకిత్ (2001); చదువు : ఎమ్మెస్సీ జువాలజీ ఉద్యోగం : ఇన్‌కం టాక్స్ కమిషనర్ (1995) సర్వీసు : 20 ఏళ్లు; విరమణ : 2016 ప్రకృతి ఎప్పుడూ తన ధర్మాన్ని విస్మరించదు. నమ్మకద్రోహం, అసత్య ఆరోపణలు అనే విత్తనాలను నాటితే తిరిగి అవే మొలకెత్తుతాయి. ఇది అనివార్యం. – సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య (కపిల్ మిశ్రాను ఉద్దేశించి) కపిల్ నువ్వు నన్ను దీదీ (అక్క) అని పిలుస్తావు. మా ఇంటికి వస్తూపోతూ ఉంటావు. అప్పుడైనా చెప్పాల్సింది కదా... ఆ రెండు కోట్ల రూపాయల సంగతి. ఒకే. మే 5న అంటున్నావు కదా నువ్వు మా ఇంటికి వచ్చింది. ఆ రోజు కూడా ఎప్పటిలా నిన్ను అడిగేవుంటాను.. ‘టీ తాగుతావా?’ అని. అప్పుడు ఎందుకు చెప్పలేకపోయావు రెండు కోట్ల రూపాయల సంగతి? – సునీతా కేజ్రీవాల్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య (కపిల్ మిశ్రాను ఉద్దేశించి) సునీతా కేజ్రీవాల్ అంకితభావం గల సహధర్మచారిణి. తన ఇంట్లో ఎలాంటి కుట్రలు జరుగుతున్నాయో అమె గ్రహించలేరు. నిజం ఏమిటో ఆమెకు తెలీదు. భర్త పతనావస్థ అమెను కలవరపెడుతోంది. ఆమె నన్ను ఎన్ని మాటలు అనినా సరే, నేను ఆమెను ఒక్క మాటా అనను. – కపిల్ మిశ్రా, మంత్రివర్గం నుంచి సస్పెండ్ అయిన ‘ఆప్’ ఎమ్మెల్యే గత సోమవారం సునీతకు, కపిల్‌కు మధ్య నడిచిన ట్వీట్లు ఇవి. సునీత మితభాషి. కపిల్ అన్నట్లు.. ఆమె తన ఇంటిని తప్ప తక్కిన విషయాలేమీ పట్టించుకోరు. అయితే తన భర్త అవినీతిపరుడు అన్న ఆరోపణలపై ఆమె మితభాషిగా మిగిలిపోదలచుకోలేదు. మే 5న ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్... కేజ్రీవాల్ ఇంటికి వెళ్లి మరీ రెండు కోట్ల రూపాయల నగదును ఇచ్చివచ్చారని కపిల్ ఆరోపించడంపై సునీత ఇప్పుడు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అయితే ఇది తన భర్తను వెనకేసుకు రావడం కాదు. ‘నా భర్త గురించి నాకు తెలుసు’ అని గట్టిగా చెప్పడం. నిజానికి తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కేజ్రీవాల్ తీసుకున్నంత తేలికగా ఆయన భార్య సునీత తీసుకోలేకపోతున్నారు. దీనికి కారణం ఆమె ఒక స్త్రీ, ఒక భార్య, ఒక గృహిణి కావడం ఒక్కటి మాత్రమే కాదు! నిజాయితీపరురాలైన ఇండియన్ రెవిన్యూ ఆఫీసర్ అయి ఉండడం కూడా. ఇన్‌కంటాక్స్ డిపార్ట్మెంట్లో 20 ఏళ్లకు పైగా సేవలు అందించిన ఇండియన్ రెవిన్యూ సర్వీస్ అధికారి సునీతా కేజ్రీవాల్ గత ఏడాదే స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసి బయటికి వచ్చారు. నిత్యం రాజకీయ ఒత్తిడులలో ఉంటున్న తన భర్తకు నిరంతరం తోడుగా ఉండడానికి ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. భర్త కోసం ఉద్యోగం మానేసిన సునీత.. భర్త కోసమే ఉద్యోగం చేసిన రోజులు కూడా ఉన్నాయి. 2014కు ముందు అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకుని తన ఉద్యోగాన్ని మానేసినప్పుడు.. సునీత తన ఉద్యోగాన్ని కొనసాగించి కుటుంబాన్ని అర్థికంగా నెట్టుకొచ్చారు. అయితే సునీత కూడా ఇప్పుడు రాజకీయాల్లోకి రావడానికి మాత్రమే తన ఉద్యోగాన్ని త్యాగం చేశారని ఢిల్లీ బీజేపీ చీఫ్ మనోజ్ తివారీ అంటున్నారు. బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లవలసినప్పుడు ఆయన భార్య రబ్రీదేవి బిహార్ ముఖ్యమంత్రి అయిన విధంగానే, త్వరలో సునీతా కేజ్రీవాల్ కూడా ఢిల్లీకి ముఖ్యమంత్రి అవుతారని మనోజ్ తివారీ అంచనా. వాస్తవానికి ఇది అంచనా కన్నా కూడా ప్రత్యర్థి పార్టీపై ఆయన సంధించిన విసురుగానే భావించాలి. అయితే సునీతా కేజ్రీవాల్ ఈ అంచనాలను, భావనలను పట్టించుకునేంత తీరికను ఏమీ అనుభవించడం లేదు. ‘భర్త పక్కన ఉండడం’ అనే ప్రత్యేక హోదా.. ఆమె భర్త ప్రస్తుతం నిర్వర్తిస్తున్న ముఖ్యమంత్రి బాధ్యత కన్నా కూడా ఎంతో కీలకమైనది. అనుక్షణం ప్రజాక్షేత్రంలో ఉండే భర్తకు సహాయకారిగా ఉండడం ప్రజాసేవల కిందికి వస్తుంది తప్ప రాజకీయాల్లోకి వచ్చినట్లు అనుకోడానికి లేదు. ఎన్నికల ప్రచారాలలో కూడా ఇంతవరకు అరవింద్ పక్కన సునీత కనిపించడం ఆయనకు వ్యక్తిగత సంరక్షురాలిగా మాత్రమే. 2014 ఎన్నికల్లో వారణాసి పార్లమెంటు సీటుకు నరేంద్ర మోదీపై అరవింద్ పోటీ చేసినప్పుడు కూడా ప్రచారంలో భర్త వెంట ఉన్న భార్యగా మాత్రమే సునీత తన పాత్రను పరిమితం చేసుకున్నారు. ఆమె మొదటì సారిగా భర్త పక్కన కనిపించింది 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 సీట్లకు గాను 67 సీట్లు గెలిచి, కేజ్రీవాల్ ఘన విజయం సాధించినప్పుడే. అప్పుడు కూడా భర్త ప్రోద్బలంతో మాత్రమే ఆమె ఆ కొద్దిసేపు భర్త పక్కన కనిపించారు. రాజకీయాలలో సునీత మొదటి నుంచీ ఒక నీడలా మాత్రమే కేజ్రీవాల్ వెంట ఉంటున్నారు. అయితే అది రాజకీయ నీడ కాదు. రాజకీయాలనుంచి భర్తను సేదతీర్చే నీడ. ఇరవై రెండేళ్ల క్రితం అరవింద్‌ని వివాహం చేసుకున్నప్పుడు ఒక సాధారణ యువతిలా అమె ఎలాగైతే ఉన్నారో... ఇప్పటికీ అలాగే ఉన్నారు. అలా ఉండడం గొప్ప అని కాదు. ఐ.ఆర్.ఎస్. అధికారులుగా ఇద్దరూ వృత్తిపరమైన ఒత్తిళ్లు అనుభవించినప్పుడు, అరవింద్ స్థిరమైన ఉద్యోగం మాని అస్థిరమైన రాజకీయ రంగంలోకి వచ్చినప్పుడు, ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రిగా తన భర్త తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పుడు కూడా.. ఇంటిపై, పిల్లలపై ఆ ప్రభావం పడకుండా, భర్తపై ఈగ వాలకుండా.. ఒక శక్తి స్వరూపిణి అయిన గృహిణిలా సునీత ఓర్పుగా, నేర్పుగా నెగ్గుకొస్తున్నారు. ‘థ్యాంక్యూ సునీతా...’ అంటూ అరవింద్ భార్యను ప్రశంసిం చడం... మెజారిటీ సీట్లు సాధించిన ఆనందంలో అన్నమాట కాదు. తన జీవితంలో మేజర్ పార్ట్ అంతా నువ్వేనని కృతజ్ఞతలు చెప్పడం. ఇంతకన్నా చెప్పడానికి ఏముంటుంది సోల్‌మేట్‌కు? లవ్ స్టోరీ: సునీత ఢిల్లీ అమ్మాయి. అరవింద్ హర్యానా అబ్బాయి. సునీత ఎమ్మెస్సీ జువాలజీ. అరవింద్ మెకానికల్ ఇంజనీరింగ్. ఇద్దరూ సివిల్స్ రాశారు. ఇద్దరూ ఐ.ఆర్.ఎస్.కు సెలక్ట్ అయ్యారు. ఇద్దరికీ ఒకేచోట.. నేషనల్ అకాడెమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ముస్సోరీ)లో... ట్రైనింగ్. ఆ ట్రైనింగ్‌లోనే అరవింద్ సునీతను చూశాడు. సునీత అరవింద్‌ను చూసిందో లేదో అరవింద్‌కి తెలీదు. మనసులో ఏం ఉంటే అది మాట్లాడే క్యారెక్టర్ అరవింద్‌ది. సణుగుడు ఉండదు. నీళ్లు నమలడం ఉండదు. ‘ఏమండీ.. మిమ్మల్ని ప్రేమిస్తున్నా’ అని చెప్పదలచుకున్నాడు, వెళ్లి చెప్పేశాడు. సునీత కళ్లింత అయ్యాయి! అతడి ధైర్యం ఆమెకు నచ్చింది. అతడు కొద్దిగా సిగ్గుపడడం కూడా ఆమెకు నచ్చింది. అసలు.. ధైర్యం, సిగ్గు కాదు... అతడి కళ్లలోని నిజాయితీ ఆమెకు బాగా నచ్చింది. లక్కీ ఏంటంటే... పెళ్లికి వాళ్లు పెద్దగా కష్టపడలేదు. తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో అనుకున్నారు. ఒప్పుకున్నారు. కులాలు ఒకటో కాదో అంటారేమో అనుకున్నారు. ఒకటే కాకపోయినా, ఒప్పుకునేవారేమో... కానీ, ఒకటే అయ్యాయి. ఇక చదువు, సంస్కారం, ఉద్యోగం... అన్నీ ఈక్వల్. 1994 ఆగస్టులో ఎంగేజ్మెంట్, నవంబర్‌లో పెళ్లి. ఈ గ్యాప్‌లో సినిమాలు, షికార్లు, కానుకలు ఎలాగూ ఉండేవే, ఉన్నాయి కూడా. ట్రైనింగ్ పూర్తయ్యాక ఇద్దరికీ ఢిల్లీలో ఉద్యోగాలు వచ్చేశాయి. పిల్లలూ లైఫ్‌లోకి వచ్చేశారు. ఇరవై ఏళ్ల తర్వాత అరవింద్ రాజకీయాల్లోకి వచ్చేశాడు. ఇప్పుడిక తెలిసిందే.. సునీత ఢిల్లీ సియెం గారి భార్య. లవ్లీ స్టోరీ: ఫిబ్రవరి 2015. ఢిల్లీ ఎన్నికలు ముగిశాయి. సిటీ అంతా మఫ్లర్లే.. కేజ్రీవాల్‌కి ఇమిటేషన్. కౌంటింగ్ రోజు.. ‘ఫైవ్సాల్.. కేజ్రీవాల్’ అని ఇంటర్నెట్లో స్క్రోల్స్. అంతా టీవీల ముందు కూర్చున్నారు. ఫలితాలు వెల్లడయ్యాయి. కేజ్రీవాల్ భారీ మెజారిటీతో గెలిచారు. ఆ వార్త రాగానే కేజ్రీవాల్... పక్కనే ఉన్న భార్యను గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. కుటుంబ సభ్యులెవరో ఫొటో తీశారు. ఆ ఫొటోని కేజ్రీవాల్ స్వయంగా తనే ట్విట్టర్లో పోస్ట్ చేసి... ‘థ్యాంక్యూ సునీతా ఫర్ ఆల్వేజ్ బీయింగ్ దేర్’ అని ట్వీట్ చేశారు. ఒక భారతీయ రాజకీయ నాయకుడు... గృహిణి అయిన తన భార్యకు బహిరంగంగా ధన్యవాదాలు తెలిపిన సందర్భం బహుశా అదే మొదటిది కావచ్చు. ఆ తర్వాత ఇంటి బాల్కనీలోంచి భర్త పక్కనే నిలుచుని సునీత కూడా ప్రసంగించారు. ప్రసంగం అంటే పెద్దగా ఏం కాదు. ‘ఇతడు మన నాయకుడు. మన కోసం పని చేసే నాయకుడు’ అని మాట్లాడ్డం. వెంటనే అరవింద్ మైక్ అందుకున్నాడు. ‘మీ నాయకుడి వెనుక ఉన్నది ఈ నాయకురాలే’ అన్నాడు. హోరుగా చప్పట్లు. సునీతపై పూలజల్లు కురుస్తుంటే అరవింద్ పులకించిపోయాడు. భార్య భుజం చుట్టూ చెయ్యి వేసి.. ‘‘ఈమె నా భార్య. నేనివాళ బలవంతంగా తనని ముందుకు తెచ్చాను. నేను ఆమెకు చెప్పాను... ‘ప్రభుత్వం నిన్ను ఏమీ చేయదు. నా పక్కన వచ్చి నిలుచో’ అని చెప్పాను. తను నా పక్కన లేకపోతే నేను ఏదీ సాధించగలిగి ఉండేవాడిని కాదు. ఒక్కణ్ణీ నేను ఏమీ చేయలేను. నేను చిన్న మనిషిని’’ అని ఉద్వేగంగా అన్నాడు. సునీత ఆ రోజు అరవింద్ పక్కనైతే ఉన్నారు కానీ, రాజకీయాల్లో లేరు. ఐ.ఆర్.ఎస్. సీనియర్ ఉద్యోగి ఆమె. అందుకే అరవింద్ అన్నాడు... ‘ప్రభుత్వం నీపై చర్యేమీ తీసుకోదులే.. నా పక్కన ఉండు’ అని.నిజానికి సునీతకు అలాంటి భయాలేమీ లేవు. భర్త ఉద్యోగం మానేసి వచ్చిన రోజు కూడా ఆమె ఎప్పటిలానే డైనింగ్ టేబుల్‌పై భోజనం వడ్డించి ఆయన్ని పిలిచారు. ‘పిల్లలూ.. మీరూ వచ్చేయండి’ అని కూతుర్ని, కొడుకును పిలిచారు. ఉద్యోగాల కన్నా, రాజకీయాల కన్నా.. భర్త, కుటుంబం ముఖ్యం అన్న ట్లు ఉంటారు సునీత. ప్రతి అడుగులో, ఆలోచనలో ఆ కమిట్మెంట్ కనిపిస్తుంది ఆమెలో. అన్నట్లు ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం ఎప్పుడు జరిగిందో గుర్తుందా? ఫిబ్రవరి 14న. వాలెంటైన్స్‌డే రోజు. అరవింద్, సునీతల ప్రేమకు సరిగ్గా సరిపోయే సందర్భం అది! -
కేజ్రీవాల్ భార్యకు కోపం వచ్చింది
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై సంచలన ఆరోపణలు చేసి ఈడ్చుకెళ్లి తీహార్ జైలులో పడేస్తానంటూ వ్యాఖ్యానించిన ఆప్ బహిష్కృత నేత కపిల్ మిశ్రాపై కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ తీవ్రంగా మండిపడ్డారు. అబద్ధపు ఆరోపనణ చేసిన మిశ్రా భవిష్యత్ పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ‘ ప్రకృతి ధర్మం ఎప్పుడూ తప్పుకాదు. అవన్నీ నమ్మకద్రోహంలో నుంచి పుట్టినవి, తప్పుడు ఆరోపణలు చేశారు. జరగబోయే పరిణామాలన్నింటికి అతడు (కపిల్ మిశ్రా) బాధ్యత వహిస్తాడా? ఆహ్వానిస్తాడా’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. డొల్ల కంపెనీలు ఏర్పాటుచేసి తన నల్లధనాన్ని తెల్లధనంగా కేజ్రీవాల్ మార్చుకున్నారని, ఎన్నికల కమిషన్‌కు తప్పుడు అఫిడవిట్లు సమర్పించారని కపిల్ మిశ్రా ఆరోపించిన విషయం తెలిసిందే. కేజ్రీవాల్ చేసిన తప్పులకు ఆయన కాలర్ పట్టుకొని తీసుకెళ్లి తీహార్ జైలులో పడేస్తానంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ భార్య స్పందించడం ప్రాధాన్యం సంతరించుకుంది.