ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది.
ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment