Liquor policy
-
అంతా కనికట్టు.. ఆధారం ఉంటే ఒట్టు!
-
ఆధారం ఉంటే ఒట్టు.. అంతా కనికట్టు!
ఫిర్యాదే ఓ కుట్ర.. నివేదికే బూటకం.. కేసే అక్రమం.. ఎఫ్ఐఆర్ కుయుక్తి.. వెరసి దర్యాప్తు పేరుతో వేధింపులు.. అబద్ధపు వాంగ్మూలాలే ఆధారం.. ఇదీ రాష్ట్రంలో సీఐడీ, సిట్ పేరిట అరాచకం. చంద్రబాబు ప్రభుత్వ కుట్రకు తార్కాణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు పేరుతో సాగిస్తున్న రెడ్‌బుక్ కుతంత్రం. ఇందులో భాగంగా కూటమి సర్కారు సిట్ పేరిట ఓ అరాచక వ్యవస్థను సృష్టించి, సాగిస్తున్న వేధింపులు వెర్రి తలలు వేస్తున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ గగ్గోలు పెట్టిన చంద్రబాబు ముఠా.. అధికారంలోకి వచ్చాక ఒక్క ఆరోపణను నిరూపించలేక చేతులెత్తేసింది. దాంతో తిమ్మిని బమ్మి చేసైనా సరే వేధించాలని లక్ష్యంగా పెట్టుకుని మద్యం విధానంపై అక్రమ కేసుతో రంగంలోకి దిగింది. ఫిర్యాదు మొదలు దర్యాప్తు వరకు సాగుతున్న కుతంత్రం విస్తుగొలుపుతోంది. - సాక్షి, అమరావతికుట్రపూరితంగా ఫిర్యాదువైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై అక్రమ కేసు కోసం కూటమి ప్రభుత్వ పెద్దలు పక్కా పన్నాగంతో పావులు కదిపారు. అందుకోసం కుట్రపూరితంగా ఎవరికీ అనుమానం కలగని రీతిలో వెంకటేశ్వరరావు, శ్రీనివాస్ అనే ఇద్దరు ప్రైవేటు వ్యక్తులను తెరపైకి తెచ్చారు. మద్యం విధానంలో అవినీతి జరిగిందంటూ.. విచారణ చేయాలని వారిద్దరూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనాకు గత ఏడాది సెప్టెంబరు 9న ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగిందని భావిస్తే పోలీసు, ఏసీబీ, సీఐడీ తదితర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయాలి. లేదా న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. అంతేగానీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేయరు. అయితే ఈ ఇద్దరూ అటు దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేయలేదు. ఇటు న్యాయస్థానాన్నీ ఆశ్రయించ లేదు. ఎందుకంటే వీరి వద్ద ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి. వీరిద్దరి నుంచి ఫిర్యాదు అందుకున్న ముఖేశ్ కుమార్ మీనా.. ప్రభుత్వ పెద్దల కుట్రను కొనసాగిస్తూ తర్వాత అంకానికి తెరతీశారు. ఆయన ఆ ఫిర్యాదు కాపీని ఏపీ బెవరేజస్ కార్పొరేషన్ ఎండీకి పంపించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.రూ.4 వేల కోట్ల కట్టు కథమద్యం కొనుగోళ్లు, ఇతర రికార్డులన్నీ బెవరేజస్ కార్పొరేషన్ కార్యాలయంలోనే ఉంటాయి. ఏయే తేదీల్లో ఏయే డిస్టిలరీలకు ఎంత విలువైన ఆర్డర్లు ఇచ్చారన్న వివరాలు వారి వద్దే ఉంటాయన్నది బహిరంగ రహస్యం. మద్యం విధానంలో అక్రమాలకు పాల్పడితే ఇవిగో అని చూపించవచ్చు. ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు కాబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఎలాంటి ఆధారాలు చూపించ లేదు. అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా కేవలం తొమ్మిది రోజుల్లోనే అవినీతి కట్టుకథను సృష్టించారు. ఏకంగా రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు నివేదిక ఇచ్చేశారు. అంటే ఎక్సైజ్ శాఖే తూతూ మంత్రపు విచారణతో రూ.4 వేల కోట్ల అక్రమాలంటూ చంద్రబాబు కుట్రను వండి వర్చేసింది. అంతా అనుకున్నట్టు కుట్ర కథను నడిపించిన తర్వాత, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్ కుమార్ మీనా ఈ విషయంపై సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ సాక్షిగా అక్రమ కేసు ఇక ప్రభుత్వ పెద్దల కుట్రకు పదును పెట్టడం తమ వంతు అని సీఐడీ రంగంలోకి దిగింది. పక్కా పన్నాగంతో బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక, ఎక్సైజ్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్రమ కేసు నమోదు చేసేసింది. నిందితులు ఎవరో కూడా పేర్కొనకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి అందులోని ఏడో కాలమ్‌లో నిందితులను చూపించలేదు. నిందితులు ఎవరో తెలీదని కూడా వెల్లడించింది. అంటే ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లను చెబితే వారందరినీ నిందితులుగా చూపించేందుకు కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఎవరు ఎవర్ని మోసం చేశారన్న కనీస సమాచారం కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన లేదు. పైగా ఐపీసీ సెక్షన్ 420ని చేరుస్తూ కేసు నమోదు చేయడం విడ్డూరం. అసలు కుట్ర ఏమిటన్నది పేర్కొనకుండా, అవినీతి ఏమిటన్నది చూపకుండా ఐపీసీ సెక్షన్లు 409, 120 బి కింద అభియోగాలు నమోదు చేసింది. తద్వారా బెవరేజస్ కార్పొరేషన్ ఉన్నతాధికారులు, ఉద్యోగులు అందరిపైనా అక్రమ కేసు నమోదు చేసేందుకు ముందస్తు ఎత్తుగడ వేసింది. ఎఫ్ఐఆర్లోని తొమ్మిదో కాలమ్‌లో పేర్కొనాల్సిన ఆ కేసులో అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలు కూడా వెల్లడించ లేదు. అవసరమైతే ప్రత్యేకంగా నివేదిస్తామని చెప్పడం గమనార్హం. అవసరమైతే.. అన్నది ఏమిటో సీఐడీ ఉన్నతాధికారులకే తెలియాలి. ఒక కేసు దర్యాప్తు చేస్తున్నప్పుడు అక్రమాలకు సంబంధించిన అంశాలు అన్నీ అవసరమైనవే కదా.. అని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంటే ఎఫ్ఐఆర్ నమోదు చేసే నాటికి సీఐడీ వద్ద కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవన్నది సుస్పష్టం. దీన్నిబట్టి బెవరేజస్ కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక పూర్తిగా కట్టుకథేనని స్పష్టమవుతోంది. అందుకే అక్రమాలకు సంబంధించిన ఆస్తుల వివరాలను వెల్లడించ లేకపోయారు. కానీ ఎఫ్ఐఆర్లోని పదో కాలమ్‌లో ఈ వ్యవహారంలో ఏకంగా రూ.4 వేల కోట్ల కంటే ఎక్కువ అవినీతి జరిగినట్టుగా పేర్కొనడం విడ్డూరం. నిందితులు తెలీదు.. ఆ కేసుకు సంబంధించిన ఆస్తుల వివరాలు లేవు.. కానీ రూ.4 వేల కోట్ల అవినీతి జరిగినట్టు మాత్రం కథ అల్లేశారు. ఈ లెక్కన ఎంతటి నిరాధార ఆరోపణలో.. ఎంతటి అక్రమ కేసో అన్నది తేటతెల్లమవుతోందని న్యాయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు.కట్టు కథకు తగ్గట్టు వాంగ్మూలాలు ఈ కేసు దర్యాప్తు పేరిట వేధింపులు, అరాచకాల కుట్రకు బరితెగించేందుకు సీఐడీ సరిపోదని చంద్రబాబు ప్రభుత్వం భావించింది. అందుకే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేరుతో అరచకానికి తెగించింది. ఎలాంటి ఆధారాలు లేని కేసులో అబద్ధపు ఆధారాలు సృష్టించేందుకు సిట్ రెండు నెలలుగా పాల్పడుతున్న వేధింపులే ఇందుకు నిదర్శనం. దర్యాప్తు పేరిట బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులను తీవ్ర స్థాయిలో వేధిస్తోంది. ఆ కేసులో సాక్షుల పేరిట వారిని విచారిస్తూ కనికట్టు చేస్తోంది. తాము చెప్పినట్టుగా అబద్ధపు వాంగ్మూలాలు ఇవ్వాలని బెదిరిస్తోంది. శారీరకంగా, మానసికంగా హింసిస్తోంది. సిట్ వేధింపులు తట్టుకోలేక ఉద్యోగులు ఇచ్చిన అబద్ధపు వాంగ్మూలాలను తమ అక్రమ కేసుకు ఆధారంగా చేసుకుంటోంది. ఈ క్రమంలో బెవరేజస్ కార్పొరేషన్ అధికారులు, ఉద్యోగులు తాము సాక్షులుగా భావిస్తూ సిట్ నుంచి తప్పించుకునేందుకు అబద్ధపు వాంగ్మూలాలు ఇస్తున్నారు. ఓసారి వాంగ్మూలాల నమోదు పూర్తయిన తర్వాతే వారినే ఈ కేసులో నిందితులుగా చేర్చాలన్నది సిట్ పన్నాగం. ఈ కేసులో ఎవరెవరిని ఏ విధంగా ఇరికించాలి.. కనికట్టు చేసి జనాన్ని ఎలా నమ్మించాలి.. జరగని నేరాన్ని జరిగినట్లు ఏ విధంగా చూపించాలన్నది టీడీపీ ప్రధాన కార్యాలయంలో తయారయ్యే స్క్రిప్టు మేరకు జరుగుతోంది. అవే డిస్టిలరీలు.. పెరిగిన ఆదాయం.. ఇంకెక్కడ అవినీతి?వాస్తవానికి డిస్టిలరీల ముసుగులో దందా సాగించింది చంద్రబాబే. మద్యం విధానం ముసుగులో చంద్రబాబు తన బినామీలు, సన్నిహితులకు చెందిన మద్యం డిస్టిలరీలకు అడ్డగోలుగా లబ్ధి చేకూర్చారు. వారి ద్వారా ఖజానాకు గండి కొట్టి, నిధులను సొంత ఖజానాకు మళ్లించుకున్నారు. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉండగా, వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. మిగిలిన ఆరు డిస్టిలరీలకు అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతులు ఇచ్చాయి. (వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 మధ్య ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వనే లేదు) 2014 నవంబర్‌లో జీఓ నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ (ఎక్సైజ్) డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు విరుద్ధంగా, కమిటీ సూచించిన వాటి కంటే ఎక్కువ డిస్టిలరీల స్థాపనకు టీడీపీ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఇక అప్పటి వరకు ఊరూ పేరూ తెలియని బ్రాండ్ల మద్యం అమ్మకాలకు చంద్రబాబు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది. డిస్టిలరీలతో కుమ్మక్కై కొన్ని ఉత్పత్తులకు కృత్రిమ డిమాండ్‌ను సృష్టించి దోపిడీకి తెర తీసింది. 2015–2019 మధ్య ఇలా నాలుగైదు కంపెనీలకు లబ్ధి చేకూరింది. వీరి నుంచే 70 శాతం కొనుగోళ్లు చేశారు. ఈ నేపథ్యంలో 2019–24 మధ్య కొత్తగా ఒక్క డిస్టిలరీ కూడా రాలేదు. పైగా మద్యం విక్రయాల ద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. ఈ లెక్కన అవినీతికి తావెక్కడ? అంతా చంద్రబాబు అండ్ కో కట్టుకథే. -
ఆప్ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ!
ఢిల్లీ : అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ (congress party) పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఆయా పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. అధికార ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా, ఆమ్ (aap) ఆద్మీ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ (Alcohol Affected Party) అంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏఐసీసీ మీడియా, ప్రచార విభాగం చైర్మన్ పవన్ ఖేరా( pawan khera) గురువారం మీడియాతో మాట్లాడారు. ‘మద్యం ఆరోగ్యానికి హానికరం అనే విషయం మనందరికీ తెలుసు. మద్యం అలవాటు మనిషిని, అతని కుటుంబాన్ని, సమాజాన్ని నాశనం చేస్తుందని మనందరికీ తెలిసిన విషయమే.शराब स्वास्थ्य के लिए हानिकारक है और शराब की लत इंसान, उसके परिवार और समाज को बर्बाद कर देती है- ये हम सब जानते हैं।लेकिन शराब से पैसा बनाने की लत से न सिर्फ इंसान, समाज बल्कि पूरा शहर खराब हो जाता है। हम सबने देखा है कि कैसे AAP (Alcohol Affected Party) ने शराब के जरिए पूरी… pic.twitter.com/MZld4aS4DP— Congress (@INCIndia) January 23, 2025 కానీ, మద్యం ద్వారా డబ్బు సంపాదించాలనే వ్యసనం కారణంగా కేవలం వ్యక్తి, సమాజం మాత్రమే కాకుండా మొత్తం నగరం కూడా నాశనం అవుతుంది. ఆప్ (ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ ) మద్యం ద్వారా మొత్తం ఢిల్లిని ఎలా నాశనం చేసిందో మనం చూశాం. ఇప్పుడు మీకు ఓ ఆడియో క్లిప్‌ను వినిపిస్తాను. వినండి. అ ఆడియోలో ఆప్ ఎమ్మెల్యే, ఆ పార్టీకి చెందిన విద్యాశాఖ మంత్రి, ఎక్సైజ్ మినిస్టర్ ఎలా కుంభకోణం చేశారో తెలుస్తోంది. ఆప్ కన్వినర్ కేజ్రీవాల్ ఓ మాట అన్నారు. తన వద్ద ప్రతి రోగానికి ఔషధం ఉందని. కానీ ఔషధం కనిపించలేదు.కానీ మద్యం కుంబకోణం స్పష్టంగా కనిపిస్తోంది. అందులో మొత్తం ప్రభుత్వం మునిగిపోయింది’ అని విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం పవన్ ఖేరా కామెంట్స్ ఢిల్లీ రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. -
లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. మళ్లీ కేజ్రీవాల్ విచారణ
ఢిల్లీ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆప్ అధినేత, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారం (డిసెంబర్ 21) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.డిసెంబరు 5న ఎక్సైజ్ పాలసీని రూపొందించడంలో, అమలు చేయడంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని ఈడీ ఆరోపించింది. కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌ను అనుమతి కోరింది. తాజాగా,లెఫ్టినెంట్ గవర్నర్ కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఈడీకి అనుమతి ఇచ్చారు. దీంతో మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను ఈడీ విచారించనుంది.Delhi LG VK Saxena has given sanction to the Enforcement Directorate to prosecute AAP chief and Former Delhi CM Arvind Kejriwal in the excise policy case: LG OfficeOn December 5, the Enforcement Directorate sought permission for sanction of prosecution against Arvind Kejriwal.— ANI (@ANI) December 21, 2024 మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్,విడుదలమద్యం పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 13న కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు.మద్యం పాలసీ కేసు కథేంటీ?ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది.అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది.దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి.రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. అరెస్టు చేసింది.ఇదే కేసులో కేజ్రీవాల్, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలు సైతం జైలు శిక్షను అనుభవించారు. బెయిల్‌పై విడుదలయ్యారు. తాజాగా, కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఈడీకి అనుమతివ్వడం చర్చాంశనీయంగా మారింది. -
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టు ఊరట కల్పించింది. మద్యం పాలసీ కేసులో తాను వారంలో సోమవారం, బుధవారం పోలీస్‌స్టేషన్‌కు హాజరవ్వాల్సి వస్తుందని, ఈ అంశంలో తనకు వెసులు బాటు కల్పించాలని కోరుతూ సిసోడియా సుప్రీం కోర్టును ఆశ్రయించారు.సిసోడియా పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సిసోడియా పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం తెలిపింది. అయితే, కేసుకు సంబంధించిన విచారణకు మాత్రం తప్పని సరిగా హాజరు కావాలని సూచించింది. తదుపరి విచారణను డిసెంబర్ 17కి వాయిదా వేసింది. माननीय सुप्रीम कोर्ट का हृदय से आभार, जिसने ज़मानत की शर्त को हटाकर राहत प्रदान की है। यह निर्णय न केवल न्यायपालिका में मेरी आस्था को और मजबूत करता है, बल्कि हमारे संवैधानिक मूल्यों की शक्ति को भी दर्शाता है। मैं हमेशा न्यायपालिका और संविधान के प्रति अपने कर्तव्यों का सम्मान करता… https://t.co/er7qTn2QMU— Manish Sisodia (@msisodia) December 11, 2024 మద్యం పాలసీ కేసులో 17నెలల జైలు జీవితంఢిల్లీ మద్యం విధానానికి సంబంధించిన కేసులో గతేడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు అప్పటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. అరెస్టయిన రెండు రోజుల తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి గత 17 నెలలకు పైగా ఆయన జైల్లోనే ఉన్నారు. ఈ క్రమంలో బెయిల్ కోరుతూ ఆ మధ్య సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ఈ ఏడాది ఆగస్ట్ 9న పలు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ.10లక్షల వ్యక్తిగత పూచీకత్తు, ఆ మొత్తానికి ఇద్దరు షూరిటీలతో ఆయనను విడుదల చేయాలని కోర్టు ఆదేశించింది. తన పాస్‌పోర్ట్‌ను అప్పగించాలని, సాక్షులను ప్రభావితం చేయకూడదని ఆదేశించింది. -
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
ఏపీలో విచ్చలవిడిగా బెల్టు షాపులు
-
Gunshot: అంతం కాదిది ఆరంభం.. మూడు చీప్ లు ఆరు చీకులు. ముంపులో మేతగాళ్లు
-
ఇసుక, మద్యంలో కూటమి పెద్దల అవినీతి: కాకాణి
నెల్లూరు, సాక్షి: ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు. ‘‘సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటాకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే ఉండటం లేదు. చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు.. క్షేత్రస్థాయిలో మరోటి జరుగుతోంది. చంద్రబాబు మాటలకు అర్దాలే వేరులే అన్నట్లు ఉంది. ఇసుక, మద్యం జోలికి వెళ్ళవద్దని చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీనరేజ్ రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్నప్పుడు సీనరేజ్ ఎక్కడ ఉంటుంది?. రాష్ట్రంలో ఇసుక, మద్యంకు సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయి. ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, కేసులూ పెట్టలేదు. ... లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసింది. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారు. లాటరీ ద్వారా ఎంపిక చెయ్యాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. .. మా రీచ్‌లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి, ఎమ్మెల్యే లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారు. మంత్రి అంటే లెక్క లేకుండా చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం’’ అని అన్నారు.చదవండి: చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు! -
టిడిపి ఎమ్మెల్యేలంతా లిక్కర్ మాఫియాగా అవతరించారు: వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
-
ఏపీలో కొత్త మద్యం విధానంపై ఆగ్రహావేశాలు
-
టీడీపీ, కూటమి నాయకులకే సంపద సృష్టి: అమర్నాథ్ మండిపాటు
సా క్షి, విశాఖపట్నం: చంద్రబాబు ఎన్నికల ముందు సంపద సృష్టి అని చెప్పారని, అంటే రాష్ట్రానికి సంపద సృష్టిస్తారని అందరూ అనుకున్నారని.. కానీ మద్యం పాలసీ, వైన్‌షాప్‌ల కేటాయింపు చూసిన తర్వాత, వాస్తవ పరిస్థితి అందరికీ అర్ధమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చురకలంటించారు. ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పిన సంపద సృష్టికి అర్ధం.. కేవలం తెలుగుదేశం పార్టీతో పాటు, కూటమి నాయకులకు మాత్రమే సంపద సృష్టించడం అన్నట్లుగా తేలిందని ఆయన ధ్వమెత్తారు. ఆ దిశలోనే నిన్న (14వ తేదీ) జరిగిన మద్యం షాప్‌ల కేటాయింపుల్లో అన్ని చోట్ల టీడీపీ నాయకులు, కార్యకర్తలు, కూటమి ప్రజా ప్రతినిధులకు ఎక్కువ షాప్‌లు దక్కాయని గుర్తు చేశారు.‘రాష్ట్రంలో పెద్ద కుంభకోణం జరిగింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, తెలుగుదేశం నాయకుల ఆదాయం పెంచడమే లక్ష్యంగా మద్యం పాలసీ ఉంది. అందుకు అనుగుణంగానే వైన్‌షాప్‌ల కేటాయింపు కూడా జరిగింది. 2019లో తాము అధికారంలోకి రాగానే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 43 వేల బెల్టుషాప్‌లు రద్దు చేశాం. అలాగే 4500 వైన్‌షాప్‌లు ఉంటే, వాటిని 2900కి తగ్గించాం. ఆ విధంగా పేద కుటుంబాలను రక్షించి, వారిని మద్యం బారి నుంచి కాపాడాలని చూశామని చెప్పారు.నాడు వాలంటీర్ల ద్వారా ఇంటింటికీ ప్రభుత్వ సేవలు అందిస్తే, ఇప్పుడు చంద్రబాబు ఇంటింటికీ మద్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టారని.. రానున్న రోజుల్లో వీధికో బెల్టు షాప్ ఉంటుందని, అలాగే ఇంటికే మద్యం సరఫరా మొదలుపెడతారని విమర్శించారు. కీలకమైన విద్య, వైద్య రంగాలను పూర్తిగా పక్కన పెట్టేసి, వాటికి బదులు మద్యానికి అ«ధిక ప్రాధాన్యం ఇస్తున్నారని మండిపడ్డారు. అందుకే వెంటనే మద్యం పాలసీ రద్దు చేయాలని డిమాండ్ చేసిన మాజీ మంత్రి, ప్రభుత్వం నిర్ణయం మార్చుకోకపోతే, ప్రజల పక్షాన పోరాడతామని ప్రకటించారు. మద్యంపై పేదప్రజలు కూడా తప్పకుండా తిరగబడతారని ఆయన అన్నారు. -
టీడీపీ నేతల సంపద పెంచేందుకే కొత్త మద్యం పాలసీ..
-
దోపిడీకి పక్కాడీల్!
-
ఎమ్మెల్యేలు చెప్పిన వారికే మద్యం లైసెన్సులు అంటే ఇక టెండర్లు ఎందుకు
-
టీడీపీ నేతలకు వరంగా మద్యం పాలసీ: కాకాణి
సాక్షి, నెల్లూరు: ఏపీలో మద్యం పాలసీ టీడీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారిందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. మంత్రిగా ఉన్న నారాయణ.. తన పార్టీ వారికే షాప్స్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు అంటూ ఘాటు విమర్శలు చేశారు. చంద్రబాబు ఏపీలో లిక్కర్ సిండికేట్ మాఫియా నడుపుతున్నారని కామెంట్స్ చేశారు.మాజీ మంత్రి కాకాణి బుధవారం నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో లిక్కర్ మాఫియా నడుస్తోంది. గతంలో ప్రభుత్వ మద్యం షాప్స్ ఉంటే.. ఇప్పుడు వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు. మద్యం పాలసీ టీడీపీ ప్రజాప్రతినిధులకు వరంగా మారింది. మద్యం టెండర్స్‌ను టీడీపీ నేతలు అన్ని విధాలుగా వాడుకుంటున్నారు. రెండు లక్షల 50వేల కోట్ల రూపాయలు గతంలో తన వారికి మద్యంలో దోచిపెట్టారు. ఎమ్మెల్యేలు ఎవరికి చెబితే వారికి దుకాణాలు ఇవ్వమని ప్రభుత్వం నుంచి ఎక్సైజ్ అధికారులకి ఆదేశాలు వచ్చాయి.మంత్రిగా పని చేస్తున్న నారాయణ.. తన పార్టీ వారికే షాప్స్ ఇస్తున్నామని చెప్పడం సిగ్గుచేటు. దరఖాస్తులు వేయకుండా మద్యం వ్యాపారులను టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. కొన్ని చోట్ల 30 శాతం వాటా ఇవ్వాలని టీడీపీ ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారు. మద్యం పాలసీ విషయంలో చంద్రబాబు నిర్ణయాన్ని తప్పుబడుతున్నాం. పాలసీని రద్దు చేసి.. పారదర్శకమైన విధానాన్ని తీసుకురావాలి అని డిమాండ్ చేశారు.ఇది కూడా చదవండి: ఏపీలాగే హర్యానా ఫలితాలు.. వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు -
బాబూ.. ఇది టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టే: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అధికారంలోకి వస్తే కేసులన్నీ మాఫీ చేసుకుంటారా?.. చంద్రబాబు ఒక దుర్మార్గమైన సంప్రదాయాన్ని తీసుకొచ్చారని మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. అలాగే, కేసులు మాఫీ చేసుకోవడానికేనా ప్రజలు మీకు అధికారం ఇచ్చింది? అని ప్రశ్నించారు. ఇదే సమయంలో ఇసుక సిండికేట్ కారణంగా టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టి జరుగుతోందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి అంబటి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. తన అధికారాన్ని ఉపయోగించుకుని చంద్రబాబు కేసుల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. అంగళ్లులో పోలీసులు, వైఎస్సార్సీపీ శ్రేణులపై పచ్చ నేతలు దాడులు చేశారు. ఉమాపతి రెడ్డి ఫిర్యాదుతో 20 మందిపై కేసులు పెట్టారు. చంద్రబాబు పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఉమాపతి రెడ్డి దర్యాప్తునకు సహకరించడం లేదని అబద్ధాలు చెబుతూ పోలీసు విచారణలోనే కేసు క్లోజ్ చేయాలనే కుట్రలకు పాల్పడుతున్నారు. అధికారంలోకి మీ మీద ఉన్న కేసులన్నీ క్లోజ్ చేసుకుంటారా?.చంద్రబాబు అధికారంలో అన్నీ సిండికేట్లే. చంద్రబాబు ప్రభుత్వం మద్యాన్ని సిండికేట్ చేసింది. ఎల్లో మీడియాను సిండికేట్ చేసి వాళ్లకు సంపద సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం నియంత్రణకు చర్యలు తీసుకున్నాం. నాణ్యమైన మద్యం దొరకడం లేదని చంద్రబాబు ప్రచారం చేశారు. నాణ్యమైన మద్యం ఎలా ఇస్తారో రానున్న రోజుల్లో చూస్తాం. మద్యం దుకాణానికి రూ.30 లక్షలు వసూలు చేస్తున్నారు. నేడు విచ్చలవిడిగా మద్యం అమ్ముకునేందుకు తలుపులు తెరిచారు. రూ.30లక్షలు కట్టకపోతే షాపులు దక్కనివ్వబోమని బెదిరిస్తున్నారు. ఇలాంటి దుర్మార్గాలను మళ్లీ తెరమీదకి తెస్తున్నారు. అడ్డగోలుగా డబ్బులు వసూలు చేయడమే మంచి ప్రభుత్వమా?. సిండికేటుగా ఏర్పడి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.రాష్ట్రంలో టీడీపీ నేతలు దోపిడీలకు పాల్పడుతున్నారు. మద్యం షాపులు నడపాలని ముందుకొచ్చే వారిని వేధింపులకు గురి చేస్తున్నారు. 961 షాపులకు నిన్న సాయంత్రం వరకు ఒక్క అప్లికేషన్ కూడా రాలేదు. దరఖాస్తులు పెట్టుకోవాలంటే టీడీపీ ఎమ్మెల్యేలకు జనం భయపడుతున్నారు. ఇదంతా చంద్రబాబుకు తెలిసే జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేలకు సంపద సృష్టించే కార్యక్రమం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వస్తే ఇసుక ఉచితంగా ఇస్తామని చంద్రబాబు వాగ్దానం చేశాడు. రాష్ట్రంలో ప్రస్తుతానికి అసలు ఇసుకే దొరకడం లేదు. వైఎస్సార్సీపీ హయాంలో కంటే ఇప్పుడే అధిక ధరకు ఇసుక అమ్ముతున్నారు. టీడీపీ నేతలే సిండికేట్‌గా ఏర్పడి ఇసుకను దోచేస్తున్నారు’ అంటూ విమర్మించారు. ఇది కూడా చదవండి: భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్సీపీ -
భారీ దోపిడీకి టీడీపీ ప్లాన్!: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ భారీ దోపిడీకి తెర లేపిందని ఆరోపించింది వైఎస్సార్సీపీ. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారని కామెంట్స్ చేసింది.వైఎస్సార్సీపీ ట్విట్టర్ వేదికగా.. టీడీపీ భారీ దోపిడీకి తెర!రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ.ముఖ్య నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా వ్యూహం రూపొందించి అమలు చేస్తున్నారు అని ఆరోపించింది. .@JaiTDP భారీ దోపిడీకి తెర!రాష్ట్రంలో మద్యం దందా ద్వారా అధికారికంగా భారీ దోపిడీకి తెర లేపిన టీడీపీ. ‘‘ముఖ్య’’నేత కనుసన్నల్లో జరుగుతున్న దుకాణాల కేటాయింపుల్లో టీడీపీ సిండికేట్‌కు రాచబాట పరుస్తున్నారు. టీడీపీ ప్రజాప్రతినిధుల కుటుంబ సభ్యులు, బినామీలకే మద్యం దుకాణాలను కేటాయించేలా…— YSR Congress Party (@YSRCParty) October 7, 2024ఇదే సమయంలో పోలవరంపై కూడా వైఎస్సార్సీపీ కీలక వ్యాఖ్యలు చేసింది. పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుకు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. ఈ గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి అంటూ వ్యాఖ్యలు చేసింది.పోలవరాన్ని పూర్తి చేస్తాం అంటూ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన @ncbn కు కేంద్రం రెండేళ్ల గడువిచ్చింది. గడువులోగా ఆయన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తారా? ఎప్పట్లానే మాట తప్పి నాలుక మడత వేస్తారా చూడాలి.#YSRPolavaram pic.twitter.com/LXttcFl6QJ— YSR Congress Party (@YSRCParty) October 7, 2024మరోవైపు.. ఉచిత ఇసుకపై మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటైరికల్ కామెంట్స్ చేశారు. అంబటి ట్విట్టర్ వేదికగా.. నేతి బీరకాయలోని నెయ్యి ఎంతో.. ఉచిత ఇసుక లోని ఉచితం అంత! చంద్రబాబు.. అంటూ వ్యాఖ్యలు చేశారు. నేతి బీరకాయ లోని నెయ్యి ఎంతో ఉచిత ఇసుక లోని ఉచితం అంత !@ncbn— Ambati Rambabu (@AmbatiRambabu) October 7, 2024 -
Big Question: నారా వారి సారా.. జాతిపిత జయంతి రోజున బాబు కానుక
-
‘ఎన్టీఆర్ మద్య నిషేధానికి చంద్రబాబు తూట్లు’
తాడేపల్లి, సాక్షి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏనాడు మద్యాన్ని నియంత్రించలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి మండిపడ్డారు. అదీకాక ఎన్టీఆర్ మద్యం నిషేధానికి చంద్రబాబు తూట్లు పొడిచారని అన్నారు. ఆమె బుధవారం మద్యం పాలసీపై మీడియాతో మాట్లాడారు.‘‘ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎందుకు ప్రైవేటు పరం చేస్తున్నారో ప్రభుత్వం చెప్పాలి. గాంధీజయంతి రోజు మద్యం పాలసీ ఎందుకు తెచ్చారు?. మహిళల పసుపు, కుంకుమతో చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏవీ అమలు చేయలేదు. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచేసి, మద్యం మాత్రం రూ.99కే ఇస్తామంటున్నారు. ఇష్టం వచ్చినట్లు తాగి తందనాలాడమని చంద్రబాబు చెప్తున్నారు. మహిళా సంఘాలు వద్దంటున్నా చంద్రబాబు ఎందుకు పట్టించుకోవడం లేదు?. మహిళల తాళిబొట్లు తెగినా పట్టించుకోరా?. షాపింగ్ కాంప్లెక్స్ లాగా లిక్కర్ కాంప్లెక్సులు తేవటం ఏంటి?. జగన్ హయాంలో మద్యం ప్రభుత్వ నియంత్రణలో ఉంది. అందుకే ఎలాంటి సమస్యా ఆనాడు రాలేదు. ఇప్పుడు తన మనుషులకు ఆదాయం సమకూర్చేందుకు చంద్రబాబు మద్యం షాపులు ఇస్తున్నారు. అయ్యప్ప మాలలు వేసుకుంటే మద్యం అమ్మకాలు తగ్గుతున్నాయని బాధ పడిన వ్యక్తి చంద్రబాబు. తిరుపతిలో 227 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వటం దారుణం. ఈ మద్యం పాలసీని వైఎస్సార్సీపీ వ్యతిరేకిస్తోంది. వీటన్నిటిపై మహిళా సంఘాలతో కలిసి పోరాటం చేస్తాం’ అని అన్నారామె.చదవండి: టీటీడీ నిబంధనలు తుంగలో తొక్కేసిన పవన్.. -
పౌర సేవలకు జగన్ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!
ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ఇంక పండగే పండగ! చౌక మద్యం.. అడిగినోళ్లకు అడిగినంత. ఐదేళ్లుగా జనావాసాలకు దూరంగా.. ఊరిబయట ఉన్న మద్యం దుకాణాలిప్పుడు వీధి వీధికి రానున్నాయి! ఇప్పటివరకూ మద్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వమే రీటెయిల్ మద్యం షాపులు నిర్వహిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు రంగంలోకి దిగబోతున్నారు. అయినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త మద్యం పాలసీ విపరిణామాలు ఇవి. లిక్కర్ సిండికేట్ల దాదాగిరీ.. గతంలో చంద్రబాబు కాలంలో మాదిరిగా లిక్కర్ సిండికేట్లు, అధికార పార్టీ నేతల మధ్య అక్రమ సంబంధాలు మళ్లీ జోరందుకోనున్నాయి. కొత్త మద్యం పాలసీ దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా ఉపయోగపడవచ్చు.మద్య నిషేధమే లక్ష్యంగా ఉద్యమించి 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో మద్యం ఏరుల్లా పారించేందుకు భూమికను సిద్ధం చేసిందన్నమాట. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి 1996లోనే చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి మద్యనిషేధాన్ని ఎత్తివేసిన సంగతి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. చంద్రాబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కింది కూడా మద్యం లాబీ పెద్దల అండతోనే అన్న చర్చ కూడా అప్పట్లో జోరుగానే నడిచింది. బాబు హయాంలో లిక్కర్ స్కాములు కూడా బోలెడన్ని చోటు చేసుకోవడం వార్తల్లోకి ఎక్కిన అంశాలే.ఇక మద్య నిషేధ ఉద్యమానికి ఛాంపియన్లమని ప్రచారం చేసుకున్న ఈనాడు మీడియా ప్రస్తుతం వారి పత్రికలో పెట్టిన హెడ్డింగ్ ఏమిటంటే ఇక నాణ్యమైన మద్యం రాబోతోందని. ప్రపంచ దేశాల సంగతి తెలియకపోయినా, బహుశా దేశంలో ఎక్కడా తాము తక్కువ ధరకే మద్యం అందిస్తామని ప్రచారం చేసిన ఏకైక నేత చంద్రబాబు నాయుడే కావచ్చు. ఈ సంద్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సెటైర్ ఆసక్తికరంగా ఉంది. ఇంతకాలం ''మద్యం తాగడం హానికరం" అని మద్యం బాటిళ్లపై రాస్తున్నారు. ఇక దాన్ని తొలగించి చంద్రబాబు ప్రభుత్వం 'నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇస్తున్నాం ఎంతైనా తాగండి" అని స్టిక్కర్ అంటిస్తారేమోనని చమత్కరించారు.ఇదీ చదవండి: తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుకనిజంగానే మద్యం నిత్యం తాగడం ప్రమాదకరం. సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాల్సింది పోయి సాయంత్రం వేళ ఒక పెగ్గేసుకోండని ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం రావడం లేదని ఆరోపించారు. నిజానికి జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లేమి తేకపోయినా చంద్రబాబు టైమ్‌లో ఇచ్చిన పది పదిహేను బ్రాండ్లను కొనసాగించినా అవన్నీ జగన్ బ్రాండ్లుగానే ప్రచారం చేయడంలో చంద్రబాబుతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కృషి చేసిన సంగతి తెలిసిందే. అవి నాణ్యత లేనివని అప్పట్లో ఆరోపించారు. ఈ వందరోజుల పాలనలో ఆ బ్రాండ్లను రద్దు చేసినట్టు కనిపించలేదు. ఈ మూడు నెలల్లో మందుబాబుల ఆరోగ్యం దెబ్బ తినలేదని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారా? తాజాగా మద్యం మానిపించే బాధ్యత ఆయన మందుబాబుల భార్యల మీద పెట్టారు. తానేమో షాపులు పెంచి, వారికి మార్జిన్లు పెంచి, ఇళ్ల మద్య షాపులు ,బార్లు, ఎలైట్ షాపులు పెడతారట. కాని మద్యం తాగవద్దని భార్యలే చెప్పాలట. జగన్ తాను హామీ ఇచ్చినట్టు మద్య నిషేధం చేయలేకపోయి ఉండవచ్చు. మద్య నియంత్రణ ద్వారా ఆ దిశగా కృషి చేశారనేది వాస్తవం. అంతకుముందు నాలుగు వేలకు పైగా ఉన్న షాపులను 2,600కు తగ్గించడం, బార్లను తగ్గించడం, అమ్మకం వేళల్ని కుదించడం, ధర పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన లాంటి చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక దళాల్ని నియమించారు. సిండికేట్లు లేకుండా, మద్యం మాఫియాలు లేకుండా జగన్ చేయగలిగారు. అయినా చంద్రబాబు అండ్ కో విపరీతమైన దుష్ఫ్రచారం చేసింది. ఇప్పుడు సహజంగానే మద్యం మాఫియాల అండ టీడీపీకి లభిస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతమున్న పలు బార్ల యజమానులను బెదిరించి వాటిని స్వాధీనం చేసుకున్నారట.స్థూలంగా చూస్తే కొత్త మద్యం విధానం ప్రైవేట్ సిండికేట్లు, అధికార కూటమి నేతలకు ఎంత వీలైతే అంత దోపిడి చేసుకునే అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే పలు చోట్ల షాపుల టెండర్లలో తమకు పోటీ రావద్దని టీడీపీ కూటమి నేతలు ఇతర మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మద్యం క్వార్టర్ రూ.99లకే ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మరీ అంత తక్కువ ధరకు నాణ్యమైన మద్యం వస్తుందా అన్న సందేహం కొందరిలో ఉంది. భక్తితో తిరుమలకు కొన్ని సంస్థలు తక్కువ ధరకే నేతిని సరఫరా చేస్తే అందులో నాణ్యత ఉండదంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పుడు మద్యంలో మాత్రం తక్కువ ధరకు ఇస్తే నాణ్యత ఉంటుందని చెబుతున్నారు.రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు రాబోతున్నాయి. అంటే సుమారు వేయి పెరుగుతాయి. పన్నెండు ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేస్తారట. వాకిన్ లిక్కర్ స్టోర్లు రాబోతున్నాయని అంటున్నారు. యథాప్రకారం బెల్ట్ షాపులను నిరోధించే పరిస్థితి ఉండకపోవచ్చు. 2014-19 మద్య మద్యం ఎంత అరాచకంగా ఏపీలో పారిందో అది తిరిగి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారనేది కూటమి నేతల అభిప్రాయం కావచ్చు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి పత్రికలు చాలా సంతోషపడుతూ నాణ్యమైన మద్యం రాబోతున్నదని ప్రచారం చేస్తున్నాయి. ఈ మద్యం తక్కువ ధరకే వస్తుంది కదా అని అధికంగా తాగితే ప్రజలు అనారోగ్యం పాలు కారా అన్న వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నకు సమాధానం దొరకదు.రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు మద్యాన్ని విపరీతంగా తాగించి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఈ మద్యం విధానంపై పెద్దగా స్పందిస్తున్నట్టు కనపడ్డం లేదు. కాకపోతే అక్కడక్కడ కొద్ది పాటి నిరసనలు జరిగాయి. ఇంతకాలం ఊళ్లకు దూరంగా వున్న లిక్కర్ షాపులు ఇకపై నివాసాల మధ్యలోనే ఏర్పాటైతే వచ్చే దుష్ప్రరిణామాలపట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. బెల్టు షాపులు యథేచ్ఛగా వచ్చే అవకాశం ఉండడంతో రోజులో ఏ సమయంలోనైనా మద్యం సరఫరా ఉండవచ్చు.జగన్ ప్రభుత్వం ఇంటింటికీ పౌరసేవలు అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ మద్యం సరఫరా చేసేటట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలల్ని బాగు చేసి సీబీఎస్ఈ, ఆంగ్ల మీడియం, ట్యాబులు వంటి సంస్కరణలు ప్రవేశపెడితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. విద్య కన్నా మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందేమో చూడాలి. మద్యం విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పోటీపడేలా ఉన్నారు. చంద్రబాబు అనుభవం చిట్టచివరికి ఆంధప్రదేశ్ ప్రజలు మద్యానికి బానిసలు అయ్యేలా చేసేలా ఉంది.- కొమ్మినేని శ్రీనివాస రావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
చంద్రబాబు హయాంలో 'మద్యాం 'ధ్రప్రదేశ్ గా మారిన ఏపీ
-
మద్యం పేరుతో ఓట్లు అడుక్కునే దరిద్రం ఏపీలోనే ఉంది..
-
లిక్కర్ సిండికేట్‌కి ఏపీ ప్రభుత్వం దాసోహం
సాక్షి,అమరావతి : లిక్కర్ సిండేకేట్కి ఏపీ ప్రభుత్వం దాసోహమైంది. సిండికేట్ జేబులు నింపేలా నిర్ణయం తీసుకుంది. చరిత్రలో ఎన్నడూ లేనంత రీటైల్ మార్జిన్ చంద్రబాబు ప్రభుత్వం పెంచింది. 2019 వరకు 10 శాతం ఉన్న రిటైలర్ మార్జిన్‌ను.. తాజాగా 20 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఐఎంఎఫ్ లిక్కర్, బీర్, ఫారెన్ లిక్కర్, వైన్లపై 20 శాతం రిటైల్ మార్జిన్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో పేర్కొంది. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీగా గండిపడుతోంది.ప్రైవేట్ వ్యాపారులకు మేలు చేసేలా.. సిండికేట్ జేబులు నింపేలా సర్కార్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతున్నది . -
AP: కొత్త మద్యం పాలసీ.. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ
సాక్షి,అమరావతి : ఏపీ ప్రభుత్వం నూతన మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండేళ్ల కాల పరిమితితో నూతన మద్యం పాలసీని విడుదల చేస్తున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది. నోటిఫికేషన్లో భాగంగా నేటి నుంచి 9వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ చేపట్టనుంది. అక్టోబర్ 11న రాష్ట్ర వ్యాప్తంగా 3,396 మద్యం దుకాణాలకు లాటరీ తీసి లైసెన్స్‌లు ఇవ్వనుంది ఏపీ ప్రభుత్వం.దరఖాస్తు ఫీజు రూ.2 లక్షలు ఉంటుంది. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం లేదు. అదేవిధంగా ఒకరు ఎన్ని దుకాణాలకైనా దరఖాస్తు చేసుకోవచ్చు. జనాభా ప్రాతిపదికన రూ.50 లక్షల నుంచి రూ.85 లక్షల వరకు లైసెన్స్ ఫీజును నిర్ణయించింది. 4 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ లిక్కర్ మాల్ ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఏపీ ఎక్సైజ్ శాఖ అధికారులు చెబుతున్నారు. -
ముడుపులు తేలక మల్లగుల్లాలు
చిత్తూరు అర్బన్: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త మద్యం పాలసీ అటు సర్కారు ఖజానా నింపడమే కాదు.. కూటమి నేతలకూ కాసుల వర్షం కురిపిస్తోంది. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖలో జరుగుతున్న సీఐ బదిలీలే ఇందుకు కారణం. ఈ వారంలోనే నూతన మద్యం పాలసీ తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతకుముందే ఎక్సైజ్ సీఐల బదిలీలు పూర్తిచేయాలని భావిస్తోంది. దీంతో మద్యం అమ్మకాల్లో రాష్ట్రస్థాయిలోనే పేరున్న సర్కిళ్ల కోసం అధికారులు పోటీపడుతున్నారు. ఎందుకంటే.. మద్యం అమ్మకాలు బాగా జరిగితేనే సిండికేట్ల ఏర్పాటు, ఎమ్మారీ్పకి గండి కొట్టడం సాధ్యమవుతుంది.ఈ పనులన్నీ జరగాలంటే తాము చెప్పిన సీఐ ఉంటేనే సాధ్యమని ప్రజాప్రతినిధులు ఈ బదిలీల్లో తలదూరుస్తున్నారు. కానీ, రాయలసీమలోని జోన్–4 పరిధిలో ఉన్న నాలుగు జిల్లాల సీఐల బదిలీలు కొలిక్కిరాలేదు. నాయకులకు ముట్టాల్సిన ముడుపులు ముట్టకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పంచాయతీ తేలకపోవడంతో రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం బదిలీల ఉత్తర్వులు ఇచ్చేయడానికి సిద్ధపడింది. అయితే, సీమలోని కూటమి నేతల నుంచి కమిషనర్ కార్యాలయానికి హెచ్చరికలు వెళ్లినట్లు ఎక్సైజ్ శాఖలో చర్చించుకుంటున్నారు.తేలని సీఐల పోస్టింగ్లుఇక రాష్ట్రంలోని విశాఖ, నెల్లూరు, కృష్ణాలోని మూడు జోన్లలో శనివారం రాత్రి బదిలీల ప్రక్రియ పూర్తయ్యింది. మిగిలింది జోన్–4 మాత్రమే. మూడు జోన్లతో పాటు చిత్తూరు, వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో సీఐల బదిలీల ఉత్తర్వులు సైతం శనివారమే విడుదల కావాల్సింది. కానీ, కూటమి నేతలు తమకు అనుకున్న స్థాయిలో ముడుపులు రాలేదన్న కారణంతో సీఐల పోస్టింగులపై తేల్చలేదు. ప్రధానంగా తిరుపతి అర్బన్, చంద్రగిరి, డిస్టిలరీ, పలమనేరు, నగరి, గూడూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు భారీ ధర పలుకుతోంది. ఇక కడప అర్బన్, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేలు, కర్నూలు అర్బన్, ఆదోని, ఎమ్మిగనూరు, నంద్యాల, డోన్, అనంతపురం అర్బన్, హిందూపురం, కదిరి, ధర్మవరం, ఉరవకొండ సర్కిళ్లకు సైతం డిమాండ్ నెలకొంది. ఈ ప్రాంతాల్లో పనిచేయడానికి పలువురు సీఐలు ఎక్కువగా మక్కువ చూపిస్తున్నారు.ఫలితంగా స్థానిక ఎమ్మెల్యేలు వాళ్లకు కావాల్సింది తీసుకుని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్‌కు సిఫార్సు లేఖలపరంగా.. కొన్నిచోట్ల మంత్రులు వాటికి అడ్డుకట్ట వేస్తూ తమ సిఫార్సు లేఖలు ఇచ్చేశారు. దీంతో ఎవర్ని ఎక్కడ వేయాలో తెలీక కమిషనర్ కార్యాలయం తల పట్టుకుంటోంది. ఇప్పటికే అనంతపురంలోని ఓ ఎమ్మెల్యేను కమిషనర్ కార్యాలయంలోని ఓ అధికారి సంప్రదించి, మంత్రి చెప్పిన వాళ్లకు పోస్టింగ్ ఇస్తున్నట్లు చెప్పారు. అగ్గిమీద గుగ్గిలమైన ఆ నేత, తన నియోజకవర్గంలో మంత్రి పెత్తనం ఏంటని చీవాట్లు పెట్టినట్లు సమాచారం.దీంతో.. రాయలసీమలోని బదిలీల వ్యవహారం తేల్చడం తమవల్ల కాదంటూ కమిషనర్ కార్యాలయం చేతులెత్తేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయం ఆబ్కారీ శాఖ మంత్రి దృష్టికి వెళ్లినా ఆయన మాట కూడా కూటమి ఎమ్మెల్యేలు కొందరు వినడంలేదని తెలుస్తోంది. మరికొన్ని సర్కిళ్లలో నేతల రేటుకు సీఐలు సరితూగకపోవడంతో బదిలీల్లో సందిగ్థత నెలకొంది. ఆదివారం ఈ పంచాయతీ చినబాబు వద్దకు చేరనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత సర్కిళ్లకు నిర్ణయించిన ధరలు తగ్గుతాయా, ఎమ్మెల్యేలు, మంత్రుల సిఫార్సు లేఖల్లో ఎవరివి చెల్లుతాయో అన్న దానిపై ఎక్సైజ్ శాఖలో ఆసక్తి నెలకొంది. -
అడ్డగోలు దోపిడీకి అధికారిక సిండికేట్
అందులో ఉన్నవి నాలుగు ఐటీ ఆధారిత సేవల సంస్థలే ఏ శాఖ అయినా.. ఏ పనికైనా వాటి సేవలను పొందాల్సిందే కొత్త మద్యం విధానం సహా అన్నింటికీ అవే వీటిద్వారా దోపిడీకి రాచబాట వేసుకుంటున్న ప్రభుత్వ పెద్దలుసాక్షి, అమరావతి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం అడ్డగోలు దోపిడీ కోసం అధికారిక సిండికేట్‌కు తెరతీసింది. అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలపై గుత్తాధిపత్యం కట్టబెట్టింది. టెండర్లు లేకుండానే ఏకపక్షంగా కన్సల్టెన్సీల నియామకానికి విధివిధానాలను ఖరారు చేసింది. ఇప్పటికే కొత్త మద్యం విధానం రూపకల్పనకు ఏకపక్షంగా కన్సల్టెన్సీ నియామకం చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అన్ని శాఖలకూ వర్తింపజేస్తూ ఏకీకృత దోపిడీ వ్యవస్థను రూపొందిస్తోంది.వివిధ అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కన్సల్టెన్సీల నియామకానికి మార్గదర్శకాలతో ఇటీవల జారీ చేసిన జీవో–86 ప్రభుత్వ పెద్దల దోపిడీ పన్నాగానికి నిదర్శనంగా నిలుస్తోంది. ప్రభుత్వ శాఖలు ఏవైనా ప్రాజెక్టులు, ప్రొక్యూర్మెంట్, కొత్త విధానం, మాస్టర్‌ప్లాన్ రూపకల్పన, సాంకేతిక సేవలు, పౌర సేవలు వంటి వాటి కోసం కన్సల్టెన్సీల నియామకంలో పారదర్శక టెండర్లకు ఈ జీవో ద్వారా ప్రభుత్వం దారులు దాదాపుగా మూసివేసింది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ సర్విసెస్ (ఎన్ఐసీఎస్ఐ)లో ఎంపానల్ అయిన కన్సల్టెన్సీలనే ఎంపిక చేయాలని షరతు విధించింది.ఎన్ఐసీఎస్ఐ జాబితాలో ఈ అండ్ వై, కేపీఎంజీ, డెలాయిట్, పీడబ్ల్యూసీ అనే నాలుగు కంపెనీలే ఉన్నాయి. ఏ శాఖ అయినా ఈ సంస్థలకు తమ ప్రాజెక్టుకు అర్హత లేదని భావిస్తే టెండర్ల కోసం ప్రభుత్వ అనుమతి కోరాలి. అయితే, అసలు టెండర్ల ప్రక్రియ నిర్వహించేందుకే వీల్లేదని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే.. ఏ శాఖ అయినా టెండర్లు పిలుస్తామని కోరినా ప్రభుత్వం తిరస్కరిస్తుందనే సంకేతాలిచ్చింది. మరోపక్క వివిధ శాఖలకు సేవలందిస్తున్న కన్సల్టెన్సీలను తక్షణం వైదొలగాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. తద్వారా అన్ని శాఖలు ఈ నాలుగు కంపెనీలతోనే సేవలు పొందేలా రాచబాట వేసింది. పారదర్శకతకు పాతర ఈ నాలుగూ ప్రధానంగా ఐటీ కంపెనీలు. ఐటీ ఆధారిత సేవలను మాత్రమే అందించగలవు. కానీ.. చంద్రబాబు ప్రభుత్వం ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎక్సైజ్, పర్యాటక, పట్టణాభివృద్ధి, వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్, విద్య, వైద్యం.. ఇలా అన్ని శాఖల కన్సల్టెన్సీ సేవలను వీటికే కట్టబెట్టాలని నిర్ణయించింది. కేంద్ర ఆర్థిక శాఖ 2021లో జారీ చేసిన ప్రొక్యూర్మెంట్–ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ మార్గదర్శకాల ప్రకారం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే కన్సల్టెన్సీలకు సాంకేతిక అర్హతలు 30 శాతం మించకూడదు.ఆర్థికపరమైన అర్హతలు ఎక్కువ ఉండాలి. బాబు ప్రభుత్వం ఈ నిబంధనను కూడా ఉల్లంఘించి, కన్సల్టెన్సీ సంస్థల సాంకేతిక అర్హతలు 70 శాతం లేదా 60 శాతం ఉండొచ్చని పేర్కొంది. అంటే ఆర్థిక అర్హతలు 30 లేదా 40 శాతం ఉంటే సరిపోతుందని చెప్పింది. సిండికేట్‌లోని నాలుగు కంపెనీలు ఐటీ ఆధారిత సేవల సంస్థలైనందున, వాటికి సాంకేతిక అర్హతలే ఎక్కువ ఉంటాయనే చంద్రబాబు ప్రభుత్వం ఈ నిబంధన విధించింది. భారీ దోపిడీకి పక్కా పన్నాగం ప్రభుత్వ విధానాలు, ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి మార్గం సుగమం చేసేందుకే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఎత్తుగడ వేశారు. ప్రభుత్వ పెద్దలు ముందుగానే తమకు అనుకూలమైన విధివిధానాలను అనధికారికంగా రూపొందిస్తారు. అనంతరం అస్మదీయ కన్సల్టెన్సీ సంస్థను నియమించి, తాము రూపొందించిన విధానాన్నే దాని ద్వారా ప్రభుత్వానికి సమర్పిస్తారు. ప్రభుత్వం దానిని ఆమోదిస్తుంది. తద్వారా యథేచ్చగా దోపిడీకి పాల్పడి ప్రజాధనాన్ని కొల్లగొడతారు.ఇన్నర్ రింగ్ రోడ్డు దోపిడీ తరహాలోనే..రాష్ట్ర విభజన అనంతరం 2014–19లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్లో దోపిడీకి పన్నిన వ్యూహాన్నే ఇప్పుడు ఏకంగా అన్ని శాఖలకు వర్తింపజేస్తోంది. అప్పట్లో ఏకంగా రూ.5 వేల కోట్ల భూదోపిడీకి ప్రభుత్వ పెద్దలు వేసిన ఇన్నర్ రింగ్ రోడ్డు స్కెచ్ పెను సంచలనం సృష్టించింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ముఠా ముందుగానే ఓ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌ను అనధికారికంగా ఖరారు చేసింది.చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు అప్పటికే భారీగా కొన్న భూములను ఆనుకుని ఆ రోడ్డు నిర్మించేలా అలైన్మెంట్ రూపొందించారు. తరువాత ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ రూపకల్పనకు ఓ అస్మదీయ కన్సల్టెన్సీని నియమించారు. తాము రూపొందించిన అలైన్‌మెంట్‌నే ఆ కన్సల్టెన్సీ ద్వారా ప్రభుత్వానికి సమర్పించారు. దాంతో చంద్రబాబు, నారాయణ, లింగమనేని కుటుంబాలు ఆ అలైన్‌మెంట్‌కు అటూ ఇటూ కొన్న భూముల విలువ అమాంతం పెరిగింది. తద్వారా ఏకంగా రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. అదే దోపిడీ విధానాన్ని ఇప్పుడు అన్ని ప్రభుత్వ శాఖల్లో అమలు చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కాగా పన్నిన వ్యూహమే ఈ కన్సల్టెన్సీల సిండికేట్ జీవో అనేది స్పష్టమవుతోంది. -
నియంత్రించాల్సింది మద్యం ధరలు కాదు: విజయ సాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అనవసర అంశాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ఈ క్రమంలో ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో మద్యం ధరల అంశాన్ని ప్రస్తావించారు. చంద్రబాబు నిర్ణయాలు ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతున్నాయని మండిపడ్డారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా.. ఏపీలో కూటమి ప్రభుత్వం మెడిసిన్ ఖర్చులు, విద్యా సంస్థల ఫీజులను పరిమితం చేయడానికి బదులుగా.. మద్యం ధరను రూ.99కి పరిమితం చేయాలని నిర్ణయించింది. అంటే ప్రభుత్వం ప్రజలకు ఏం సందేశం పంపుతోంది?. చంద్రబాబు ప్రభుత్వం చర్యలు మద్యపానాన్ని, గృహ హింసను పెంచుతుంది. అలాగే, ప్రజారోగ్యాన్ని మరింత దిగజార్చుతోంది. అనవసర అంశాలకే చంద్రబాబు ప్రాధాన్యత ఇస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.Instead of capping the cost of medicines or fees of educational institutions, the TDP govt. in AP has chosen to cap the price of liquor at ₹99/180ml. What message are they sending? This step will increase alcoholism, domestic violence, and worsen public health. Dubious…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 23, 2024 ఇది కూడా చదవండి: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఉద్యోగులకు వేధింపులు! -
ఇదేం పని చంద్రబాబు..
-
Delhi liquor scam: కేజ్రీవాల్ విడుదల
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట లభించింది. ఢిల్లీ మద్యం విధానం కుంభకోణానికి సంబంధించిన సీబీఐ కేసులో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు తీర్పు వెలువరించింది. విచారణ పేరిట నిందితులను సుదీర్ఘ కాలం పాటు జైల్లో ఉంచడం వారి వ్యక్తిగత స్వేచ్ఛను కాలరాయడమేనని ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. కేసుపై ఎలాంటి వ్యాఖ్యలూ చేయొద్దని కేజ్రీవాల్‌కు షరతు విధించింది. సీబీఐ తీరును ఈ సందర్భంగా తప్పుబట్టింది. ఈ ఉదంతానికి సంబంధించి ఈడీ కేసులో బెయిల్ లభించగానే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడాన్ని ప్రశ్నించింది. పంజరంలో చిలుకలా ప్రవర్తించొద్దంటూ చీవాట్లు పెట్టింది. కోర్టు తీర్పుతో ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకున్నాయి. దాదాపు ఆరు నెలల కారాగారవాసం అనంతరం కేజ్రీవాల్ తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. మద్యం విధానం కుంభకోణం కేసులో గత మార్చి 21న కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో ప్రచార నిమిత్తం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో మే 10న విడుదలైన ఆయన జూన్ 2 తిరిగి జైలుకు వెళ్లారు. అనంతరం ఈడీ కేసులో బెయిల్ మంజూరైనా సీబీఐ తిరిగి అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశారు. బెయిల్ కోసం ముందుగా ట్రయల్ కోర్టుకు వెళ్లాలన్న సీబీఐ వాదనను తోసిపుచి్చంది. అన్ని కేసులకూ ఒకే నియమాన్ని వర్తింపజేయలేమని స్పష్టం చేసింది.కేజ్రీవాల్‌కు షరతులివే...మద్యం కుంభకోణం ఉదంతంలో సీబీఐ కేసుపై బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్యలూ చేయరాదు. లెఫ్టినెంట్ గవర్నర్ సంతకం అవసరమైన ఫైళ్లు మినహా మిగతా వాటిపై సంతకాలు చేయరాదు. సీఎం కార్యాలయానికి, సచివాలయానికి వెళ్లడానికి వీల్లేదు (ఈ షరతులను తాజా తీర్పులో ధర్మాసనం సడలించింది. కానీ మే 10, జూలై 12 నాటి తీర్పుల్లో సుప్రీంధర్మాసనం ఈ రెండు షరతులనూ విధించింది. వాటిని విస్తృత ధర్మాసనం మాత్రమే రద్దు చేయగలదని ఆ సందర్భంగా పేర్కొంది. దాంతో అవి అమల్లోనే ఉండనున్నాయి) ట్రయల్ కోర్టు విచారణ అన్నింటికీ హాజరు కావాలి. విచారణ త్వరగా పూర్తయేందుకు సహకరించాలి.పంజరంలో చిలుక కావొద్దు సీబీఐకి జస్టిస్ భూయాన్ హితవు ఈడీ కేసులో బెయిల్ షరతులను తప్పుబట్టిన న్యాయమూర్తి విడిగా 33 పేజీల తీర్పు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరుపై న్యాయమూర్తులిద్దరూ ఏకాభిప్రాయం వెలిబుచి్చనా పలు ఇతర అంశాలపై జస్టిస్ భూయాన్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేయడంలో తనకెలాంటి అసంబద్ధతా కన్పించడం లేదని జస్టిస్ సూర్యకాంత్ పేర్కొనగా జస్టిస్ భూయాన్ మాత్రం ఆ అభిప్రాయంతో తీవ్రంగా విభేదిస్తూ విడిగా 33 పేజీల తీర్పు రాశారు. కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన సమయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇంకా ఏమన్నారంటే... → ఈ కేసులో 22 నెలలుగా ఊరికే ఉన్న సీబీఐకి, ఈడీ కేసులో బెయిల్ వచి్చన వెంటనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచి్చంది? → బెయిల్‌ను అడ్డుకోవడమే దీని వెనక ఉద్దేశంగా కని్పస్తోంది. → ప్రశ్నలకు సమాధానం దాటవేస్తున్నారు గనుక నిర్బంధంలో ఉంచాల్సిందేనన్న వాదన సరికాదు. → సహాయనిరాకరణ చేసినంత మాత్రాన నిర్బంధం కూడదు. నిందితునికి మౌనంగా ఉండే హక్కుంటుంది. → బలవంతంగా నేరాంగీకారం రాబట్టే ప్రయత్నాలు కచ్చితంగా చట్టవిరుద్ధమే.→ ఇవే అభియోగాలపై ఈడీ కేసులో బెయిల్ మంజూరయ్యాక కూడా జైల్లోనే ఉంచజూడటం అక్రమం. → సీజర్ భార్య నిందలకు అతీతంగా ఉండాలన్న సామెత సీబీఐకి పూర్తిగా వర్తిస్తుంది. అత్యున్నత దర్యాప్తు సంస్థగా నిజాయితీగా వ్యవహరించడమే కాదు, అలా కని్పంచడం కూడా చాలా ముఖ్యం. ఏకపక్ష పోకడలు పోతోందన్న అభిప్రాయం కలగకుండా జాగ్రత్త పడాలి. → సీబీఐని పంజరంలో చిలుకగా ఇదే న్యాయస్థానం ఇటీవలే ఆక్షేపించింది. అది తప్పని, తాను స్వేచ్ఛాయుత చిలుకనని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత దర్యాప్తు సంస్థదే → సీఎం కార్యాలయంలోకి వెళ్లొద్దని, ఫైళ్లపై సంతకాలు చేయొద్దని ఈడీ కేసులో బెయిల్ సందర్భంగా కేజ్రీవాల్‌కు కోర్టు విధించిన షరతులపై నాకు తీవ్ర అభ్యంతరాలున్నాయి. కాకపోతే న్యాయపరమైన క్రమశిక్షణను గౌరవిస్తూ వాటిపై నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు!నా పోరు ఆగదు జైలు నా స్థైర్యాన్ని పెంచింది: కేజ్రీవాల్ ‘‘జైల్లో పెట్టి నన్ను కుంగదీయాలని, నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలని చూశారు. కానీ జైలు గోడలు, ఊచలు నన్నేమీ చేయలేకపోగా నా మనోబలాన్ని వెయ్యి రెట్లు పెంచాయి. నా జీవితంలో ప్రతి క్షణం, ఒంట్లోని ప్రతి రక్తపు చుక్కా దేశసేవకే అంకితం. జాతి వ్యతిరేక శక్తులపై నా పోరు ఆగబోదు’’ అని కేజ్రీవాల్ అన్నారు. శుక్రవారం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన అనంతరం ఆయన తిహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ సీనియర్ నేత మనీశ్ సిసోడియా తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో గుమిగూడిన ఆప్ కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. అనంతరం భారీ వర్షంలోనే చండ్గీరాం అఖాడా నుంచి తన అధికారిక నివాసం దాకా కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించారు. ‘జైలు తాళాలు విరిగి పడ్డా యి. కేజ్రీవాల్ విడుదలయ్యారు’ అంటూ నినాదాలతో హోరెత్తించారు. వారికి ఆయన అభివాదం చేశారు. వర్షంలో తడుస్తూనే వాహనం పై నుంచి వారినుద్దేశించి మాట్లాడారు. ‘‘జాతి వ్యతిరేక శక్తులతో తలపడ్డందుకే నన్ను జైల్లో పెట్టారు తప్ప తప్పు చేశానని కాదు. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. దేశాన్ని బలహీనపరిచేందుకు, విడదీసేందుకు జాతి వ్యతిరేక శక్తులు కుట్రలు చేస్తున్నాయి. ఈసీని బలహీనపరిచేందుకు, ఈడీ, సీబీఐలను పూర్తిగా చెప్పుచేతల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటిని పూర్తిస్థాయిలో ఎదుర్కొందాం. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నా. అయినా ప్రతి దశలోనూ దైవం నాకు దన్నుగా నిలిచింది. నేను సత్యమార్గంలో నడవడమే అందుకు కారణం’’ అన్నారు. అంతకుముందు కేజ్రీవాల్‌కు బెయిల్ లభించగానే ఆప్ ప్రధాన కార్యాలయం వద్ద, ఆయన నివాసం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నాయి. కేజ్రీ భార్య సునీత తదితరులు వాటిలో పాల్గొన్నారు. -
సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. దీంతో ఆయన ఆరు నెలల త్వరాత తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం (సెప్టెంబర్ 13) విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా మద్యం పాలసీ కేసులో సీబీఐ అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసింది. కానీ ఎందుకు అరెస్ట్ చేసిందో గల కారణాలపై స్పష్టతలేదు. సీబీఐ సమాధానాలు సైతం అర్ధవంతంగా లేవు. అందుకే కేజ్రీవాల్ అరెస్ట్‌తో పాటు జైలు శిక్షను కొనసాగించలేము. కేజ్రీవాల్‌ని సైతం వాంగ్మూలం ఇవ్వమని బలవంతం చేయలేము అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది.సీబీఐపై ప్రశ్నలు సంధించిన సుప్రీంవిచారణ సందర్భంగా సుప్రీం కోర్టు జస్టిస్ ఉజ్జల్ భుయాన్ సీబీఐపై విమర్శలు చేశారు. మద్యం పాలసీకి సంబంధించి మార్చి 2023లో కేజ్రీవాల్‌ను సీబీఐ విచారించింది. విచారించిన 22 నెలల సమయం తీసుకుని కేజ్రీవాల్ అరెస్ట్ చేసింది. అరెస్ట్ చేసేందుకు ఎందుకు అంత సమయం తీసుకుందని ప్రశ్నించారు. షరతులతో కూడిన బెయిల్చివరగా ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కేజ్రీవాల్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. రూ.10లక్షల పూచీకత్తు, ఇద్దరు షూరిటీలతో ఈ బెయిల్ మంజూరు చేసింది. అంతేకాదు ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లడం,అధికారికంగా సంతకాలు చేయడంతో పాటు కేసు గురించి బహిరంగ వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. ఇదీ చదవండి : అసెంబ్లీ ఎన్నికల్లో దేశంలోనే సంపన్న మహిళ పోటీ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పును ధర్మాసనం ఈ నెల 5వ తేదీన రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది జూన్ 26న సీబీఐ అరెస్టు చేసింది. తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తొలుత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ అరెస్టును హైకోర్టు సమర్థించింది. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ ఆగస్టు 5న ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. సీబీఐ తనను అరెస్టు చేయడాన్ని సవాలు చేయడంతోపాటు బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఇదిలా ఉండగా, ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌ను ఈ ఏడాది మార్చి 21న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌కు జూలై 12వ తేదీన సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. తాజాగా, శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు సీబీఐ కేసులోనూ కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఇవాళ తీహార్ జైలు నుంచి విడుదల కానున్నారు. -
సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కేనా?
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను గురువారం(సెప్టెంబర్ 5) సుప్రీం కోర్టు విచారించనుంది. బెయిల్ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం విచారించనుంది.మద్యం పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పొందగా.. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవలే మనీష్ సిసోడియా, కవిత సహా పలువురికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్. ఇప్పట్లో లిక్కర్ కేసులో ట్రయల్ జరిగే పరిస్థితులు లేకపోవడంతో అత్యున్నత న్యాయ స్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం బెయిల్ వస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. సీబీఐ ఏం చెబుతుంది?మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తుంది. కేజ్రీవాల్ ఆదేశాలతో మద్యం పాలసీ ద్వారా నిధుల్ని సేకరించి..ఆ మొత్తాన్ని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఖర్చు పెట్టినట్లు చెబుతుంది. గోవాలో 40 నియోజకవర్గాలు ఉన్నాయని, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థికి రూ.90 లక్షలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని..చెప్పినట్లుగానే నిధుల్ని మళ్లించారని కోర్టుకు సీబీఐ ఆధారాల్ని అందించింది.తొలిసారి కేజీవాల్ అరెస్ట్ మద్యం పాలసీ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తొలి సారి మార్చి 21న అరెస్ట్ చేసింది. అనంతరం కొద్దిరోజులకే కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ కోసం అప్లయి చేయగా.. ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అదే కేసులో జూన్ 26న ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అతడిని అదుపులోకి తీసుకుని జూన్ 29న జ్యుడీషియల్ కస్టడీలో ఉంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం.. జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు. -
కవిత బెయిల్ పిటిషన్‌పై రేపు సుప్రీం కోర్టులో విచారణ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ బెయిల్ పిటిషన్ మంగళవారం (ఆగస్ట్20న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. జస్టీస్ బీఆర్ గవాయి, జస్టీస్ విశ్వనాథ్ ధర్మాసనం బెయిల్ పిటిషన్‌పై విచారించనుంది.ఈడీ, సీబీఐ కేసుల్లో తనకు బెయిలు ఇవ్వాలని కోరుతూ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. జూలై 1న న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దాన్ని సవాలు చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నెల 12న పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కవిత తరుఫు న్యాయవాది ముకుల్ రోహత్గి మధ్యంతర బెయిల్ కోరారు. ‘అయిదు నెలల నుంచి కవిత జైల్లో ఉన్నారు. ఇప్పటికే చార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ కేసులో 493 మంది సాక్షులు ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే మనీశ్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ ఇచ్చారు. కవిత ఒక మహిళ.. మధ్యంతర బెయిల్ ఇవ్వండి’ అని కోరారు.కవిత తరపున వాదనలు విన్న అనంతరం.. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా మధ్యంతర ఉపశమనం కల్పించలేమని తెలిపింది. ప్రతివాదులుగా ఉన్న దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్ట్ 20కి వాయిదా వేసింది. దీంతో రేపు కవిత బెయిల్ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. -
గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి: మంత్రి పార్థసారథి
సాక్షి, అమరావతి: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్రంలో కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నట్టు మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు.కేబినెట్ భేటీ అనంతరం, మంత్రి పార్థసారథి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మద్యం అమ్మకాలు తగ్గాయి. బీర్, లిక్కర్ అమ్మకాలు తగ్గిపోవడంతో 18వేల కోట్ల నష్టం వచ్చింది. ఈ ప్రభుత్వంలో మెరుగైన బ్రాండ్లు అందుబాటులోకి తెస్తాం. అందరికీ అందుబాటులో ఉన్న ధరలకు మద్యం తీసుకొస్తామన్నారు.అలాగే, భూములపై రెవెన్యూ గ్రామ సభలను మూడు నెలల పాటు నిర్వహిస్తాం. అందులో భాగంగానే మూడు నెలల పాటు రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని నిర్ణయించినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో మావోయిస్టులపై నిషేధం మరో ఏడాది పాటు పొడగిస్తున్నట్టు తెలిపారు. అలాగే, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖలు విడుదల చేసిన 217, 144 జీవోలు రద్దు చేస్తున్నట్టు స్పష్టం చేశారు. -
సీఎం కేజ్రీవాల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
సాక్షి, హైదరాబాద్ : తీహార్ జైల్లో ఉన్న తనకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరో రెండు అదనపు సమావేశాలకు అనుమతి ఇవ్వాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఇవ్వాళ ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టింది.ఈ సందర్బంగా కేజ్రివాల్ పిటిషన్ జైలు అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ స్పందించాలని జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ ధర్మాసనం కోరింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై తదుపరి విచారణ జూలై 15 కు వాయిదా వేస్తూ తీర్పును వెలువరించింది. -
ఢిల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు దక్కని ఊరట
ఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఊరట దక్కలేదు. కేజ్రీవాల్‌కు బెయిల్ ఇస్తూ రౌస్ అవెన్యూ కోర్టు (ట్రయిల్ కోర్టు) తీర్పు ఇచ్చింది. ఆ తీర్పుపై ఈడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడీ పిటిషన్‌పై మంగళవారం హైకోర్టు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ధర్మాసనం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించగా.. ఆ తీర్పుపై స్టే విధించింది. ఈ సందర్భంగా సుదీర్ కుమార్ జైన్ ధర్మాసనం ..ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పులో లోపాల్ని ఎత్తి చూపింది. ఈడీ వాదనకు తగినంత సమయం ఇవ్వకపోవడం, మనీలాండరింగ్ నిరోధక చట్టంలో విడుదలకు సంబంధించిన షరతులను సరిగ్గా చర్చించడంలో విఫలమవడంతో పాటు ఇతర అంశాలు ఉన్నాయని స్పష్టం చేస్తూ కేజ్రీవాల్ బెయిల్‌పై స్టే విధించింది. దీంతో కేజ్రీవాల్‌కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినట్లైందిDelhi HC allows Enforcement Directorate's plea to stay the trial court's bail order for Delhi Chief Minister Arvind Kejriwal in the money laundering case linked to the alleged money laundering excise scam.The bench of Justice Sudhir Kumar Jain stays the Arvind Kejriwal bail… pic.twitter.com/A4XL3FKdm1— ANI (@ANI) June 25, 2024కేజ్రీవాల్‌కు బెయిల్.. అంతలోనే అంతుకు ముందు తనకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ జూన్ 20న రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌లో అరవింద్ కేజ్రీవాల్ ప్రమేయం నేరుగా ఉందని తెలిపేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కోర్టు ఆధారాల్ని అందించడంలో విఫలం కావడంతో రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. సుప్రీం కోర్టులో రేపే విచారణ అయితే ట్రయిల్ కోర్టు తీర్పును ఈడీ సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పు హేతుబద్దంగా లేదని ఈడీ తరుపు న్యాయవాది అడిషినల్ సోలిసిటర్ జర్నల్ (ఏఎస్జీ) ఎస్వీ రాజు వాదించారు. ట్రయల్ కోర్టు తమ వాదనల్ని వినిపించేందుకు తగినంత సమయం ఇవ్వలేదని, వెంటనే ఆ ఉత్తర్వులపై స్టే విధించాలని విజ్ఞప్తి చేశారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే విచారణ చేపట్టాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈడీ పిటిషన్‌పై బుధవారం విచారణ చేపట్టింది. ట్రయిల్ కోర్టు ఢిల్లీ సీఎంకు బెయిల్ ఇస్తూ తీర్పును వెలువరించిన విధానాన్ని తప్పుబట్టింది. కాగా, ట్రయిల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించంపై కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై రేపు (జూన్ 26న) సుప్రీం కోర్టులో విచారణకు రానుంది. -
కేజ్రీవాల్ కోర్టు వీడియో తొలగించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశం
ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్.. కోర్టులో మాట్లాడిన వీడియోను సోషల్ మీడియా అకౌంట్స్ నుంచి వెంటనే తొలగించాలని సునీతా కేజ్రీవాల్‌ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మనీలాండరింగ్ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌ను కోర్టులో ప్రవేశపెట్టినప్పడు ఆయన భార్య సునీతా కేజ్రీవాల్.. కోర్టు ప్రొసిడింగ్స్ జరిగిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ విషయంలో న్యాయవాది వైభవ్ సింగ్ వేసిన పిల్‌పై శనివారం ఢిల్లీ హైకోర్టు స్పందించింది. ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో రికార్డింగ్.. కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంఘించనట్లు అవుతుందని కోర్టు పేర్కొంది. సునితా కేజ్రీవాల్ సంబంధిత వీడియోను డిలీట్ చేయాలని, అదే విధంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ సైతం రీపోస్ట్ అయిన ఆ వీడియోను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సునితా కేజ్రీవాల్‌తో పాటు వీడియో పోస్ట్ చేసిన మరో ఐదుగురికి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఈ పిల్‌పై జూలై 9న విచారణ చేపడతామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది.అరవింద్ కేజ్రీవాల్‌ను మార్చి 28 ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవేశపెట్టారు. వీడియో కాన్ఫరెన్స్‌ను రికార్డ్ చేసిన సునితా కేజ్రీవాల్ ఆ వీడియోను సోషల్‌మీడియాలో పోస్ట్‌చేశారు. అయితే ఇలా చేయటం కోర్టు ప్రొసిడింగ్స్‌ను ఉల్లంగిండమవుతుందని ఢిల్లీ హైకోర్టు తప్పు పట్టింది. -
సీఎం కేజ్రీవాల్ ప్రభుత్వానికి షాక్.. మంత్రి రాజీనామా
ఢిల్లీ, సాక్షి : మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు భారీ షాక్ తగిలింది. బుధవారం ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆప్ నుంచి బయటకు వెళ్తూ ఆ పార్టీపై, సీఎం కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా స్థాపించిన ఆమ్ ఆద్మీ ‘అవినీతిలో పాలుపంచుకున్న’ పార్టీగా పతనమైందని అన్నారు. ‘అవినీతిపై పోరాటంలో బలమైన సందేశాన్ని చూసిన తర్వాత నేను ఆప్‌లో చేరాను. నేడు, పార్టీ అవినీతి కార్యకలాపాల మధ్యలో కూరుకుపోయింది. అందుకే నేను వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని గిరిజన శాఖ మంత్రి రాజ్ కుమార్ ఆనంద్ తెలిపారు. మద్యం పాలసీ కేసులో సీఎం కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తాజాగా, ఆ పార్టీకి రాజ్‌కుమార్ ఆనంద్ రాజీనామాతో రానున్న రోజుల్లో ఆ పార్టీలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సీఎం కేజ్రీవాల్ ఇలా చేస్తారనుకోలేదు.. ‘సుప్రీం’ మాజీ న్యాయమూర్తి
సాక్షి, బెంగళూరు: ఎక్సైజ్ పాలసీ కేసులో అరెస్టైన ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీరుపట్ల సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2011లో ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే అవినీతి ( India Against Corruption) కి వ్యతిరేకంగా ఉద్యమం చేశారు. అన్నా హజారే నేతృత్వంలో జరిగిన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిలో కేజ్రీవాల్‌తో పాటు ఎన్.సంతోష్ హెగ్డేలు ఉన్నారు. అయితే నాడు అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమం చేసిన కేజ్రీవాల్ నేడు లిక్కర్ కేసులో అరెస్ట్ కావడంపై హెగ్డే స్పందించారు. కేజ్రీవాల్ తీరుపై తీవ్ర నిరాశ చెందాను. ఆప్ (అధికారంలోకి వచ్చిన తర్వాత) అవినీతి లేని పరిపాలన కొనసాగిస్తుందని అనుకున్నాను. కానీ అది జరగలేదు.అధికారంతో భ్రష్టుపట్టించారని పీటీఐతో మాట్లాడారు. ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం ‘‘ ఈరోజు రాజకీయాలు అవినీతి గుహగా మారాయి. ఏ రాజకీయ పార్టీ కూడా దాని నుండి విముక్తి పొందలేదు. అవినీతికి వ్యతిరేకంగా చేసే ఇండియా ఎగెనెస్ట్ కరప్షన్ ఉద్యమం నుంచి బయటకు రావడానికి కారణం కూడా అదే. రాజకీయాలకు దూరంగా ఉంటూ రాజకీయాలను ప్రక్షాళన చేయాలన్నదే మా సూత్రం. ఉద్యమం కాస్త రాజకీయ పార్టీగా కానీ ఆ తర్వాత కొంతమంది వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నారు. ఆప్‌ను స్థాపించారు. అప్పుడే నేను ఉద్యమం నుంచి బయటకు వచ్చాను. పార్టీ పెట్టి అవినీతి నిర్మూల చేస్తానని అనుకోలేదు. అది జరగదు కూడా. అందుకు కేజ్రీవాల్ అరెస్టే ఉదాహరణ’’ అన్నారు. ఉద్యమం కొనసాగుతుండగానే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపన జరిగింది. అందులో చేరాలంటూ కేజ్రీవాల్ తనని స్వయంగా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే అందుకు నేను ఒప్పుకోలేదని నాటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. విపక్షాల విమర్శల్లో అర్ధం లేదు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈడీ, సీబీఐ వంటి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తుందని, వారిపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందన్న విపక్షాలు ఆరోపణలపై హెగ్డే తన అభిప్రాయాలను పంచుకున్నారు . ప్రతిపక్షాన్ని నాశనం చేయడం కోసమే అధికార పార్టీ ఇలా చేస్తోందంటూ ప్రతిపక్షాల ఆరోపణల్ని నేను నమ్మను. అవును.. ఎంపిక చేసి నేతల్ని దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేస్తున్నాయి. కానీ అది నేరం కాదు. ఎందుకంటే న్యాయ శాస్త్రంలో కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని సీబీఐ,ఈడీలు ఇలా చేస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, మాజీ సొలిసిటర్ జనరల్ ఎన్ . సంతోష్ హెగ్డే మద్దతు పలికారు. -
సీఎం కేజ్రీవాల్ అరెస్ట్.. ఢిల్లీలో టెన్షన్ టెన్షన్
-
ED: కవిత అరెస్ట్‌పై ఈడీ కీలక ప్రెస్‌నోట్ విడుదల
ఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టుపై ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) కీలక విషయాలు వెల్లడించింది. ఈ మేరకు ఈడీ సోమవారం కవిత అరెస్ట్‌పై అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈ నెల15న కవితను అరెస్ట్ చేసినట్లు పేర్కొంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చిందని పేర్కొంది. ఈ నెల 23 తేదీ వరకు కవిత కస్టడికి తీసుకున్నట్లు ప్రకటనలో తెలిపింది. ‘ఢిల్లీ లిక్కర్ కేసులో 128.79 కోట్ల రూపాయల ఆస్తుల జప్తు చేశాం. ఆస్తుల జప్తును అడ్జుడికేటింగ్ అథారిటీ ఆమోదించింది. మద్యం విధానం రూపకల్పనలో కవిత ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నేతలు సీఎం అరవింద్ కేజ్రీవాల్,మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కుట్ర చేశారు. ఈ వ్యవహారంలో ఆప్ పార్టీ నేతలకు 100 కోట్ల రూపాయలు ముడుపులు అప్పజెప్పడంలో కవిత క్రియాశీల పాత్ర పోషించారు. ఈ మొత్తాన్ని హోల్‌సేల్ వ్యాపారుల నుంచి ఇప్పించారు. తిరిగి ఆ డబ్బును లాభాలను రాబట్టుకునేందుకు మరిన్ని కుట్రలు పన్నారు. ఈ కేసులో మనిష్ సిసోడియా, సంజయ్ సింగ్, విజయ్ నాయర్ సహా ఇప్పటివరకు 15 మందిని అరెస్టు చేశాం. 245 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాం. ఒక ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఐదు సప్లిమెంటరీ కంప్లైంట్స్ ఫైల్ చేశాం. కవిత ఏడు రోజుల ఈడి కస్టడీలో ఉంది. ఆమెను అరెస్టు చేసే సమయంలో బంధువులు మాకు ఆటంకం కలిగించారు. నిలకడగా కవిత ఆరోగ్యం: వైద్యులు ఈడీ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవితకు డాక్టర్లు వైద్యపరీక్షలు చేశారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. కవిత బీపీ సాధారణంగా ఉందన్న పేర్కొన్నారు. 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం 'అరవింద్ కేజ్రీవాల్'కు రూ.15,000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో.. దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్థానం తనకు బెయిల్ మంజూరు చేసిన తరువాత న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. ఢిల్లీ ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రనేతలు.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ చార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు చోటు చేసుకుంది. ఎక్సైజ్ పాలసీ ముసాయిదా రూపకల్పన సమయంలో ఈ కేసులో నిందితులు ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నారని ఏజెన్సీ తెలిపింది. -
ఢిల్లీ లిక్కర్ విధానం కేసు ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ: ఇంతకుముందు ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఇప్పుడు కల్వకుంట్ల కవిత వంటి ప్రముఖుల అరెస్టులతో ఢిల్లీ లిక్కర్ విధానం కేసు కలకలం రేపుతోంది. అసలు ఈ కేసు ఏమిటన్నది అంతటా చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీలో మద్యం అమ్మకాలకు సంబంధించి అక్కడి ఆప్ ప్రభుత్వం 2021లో నూతన లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ప్రభుత్వం టెండర్లు పిలిచి ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులను అప్పగిస్తుంది. ఇందుకోసం లైసెన్స్ ఫీజును, మద్యం అమ్మకాలపై పన్నులను వసూలు చేస్తుంది. అయితే ఢిల్లీ ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీలో.. మద్యం షాపుల లైసెన్సుల జారీ, పన్నుల్లో అపరిమిత రాయితీలు ఇచ్చింది. ఉదాహరణకు పాత విధానంలో ఒక 750 మిల్లీలీటర్ల మద్యం బాటిల్ హోల్‌సేల్ ధర రూ.166.71 అయితే.. కొత్త విధానంలో రూ.188.41కి పెంచారు. కానీ దానిపై ఎక్సైజ్ సుంకాన్ని రూ.223.89 నుంచి నామమాత్రంగా రూ.1.88కు, వ్యాట్‌ను రూ.106 నుంచి రూ.1.90కు తగ్గించారు. ఇదే సమయంలో షాపుల నిర్వాహకులకు ఇచ్చే మార్జిన్ (లాభం)ను రూ.33.35 నుంచి ఏకంగా రూ.363.27కు పెంచారు. బయటికి మద్యం ధరలు పెరిగినా.. ప్రభుత్వానికి భారీగా ఆదాయం తగ్గి, షాపుల నిర్వాహకులకు అతి భారీ లాభం వచ్చేలా పాలసీ రూపొందింది. దీనికితోడు మద్యం హోం డెలివరీ, తెల్లవారుజామున 3 గంటల దాకా షాపులు తెరిచిపెట్టుకునే వెసులుబాటునూ ప్రభుత్వం కల్పించింది. ఈ పాలసీ కింద 849 మద్యం షాపులను ప్రైవేట్ వ్యక్తులు/ కంపెనీలకు అప్పగించింది. ఇక్కడే ఆప్ ప్రభుత్వ పెద్దలు తమ సన్నిహితులకు భారీగా లాభం జరిగేలా వ్యవహరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మద్యం పాలసీలో భారీగా అవకతవకలను గుర్తించిన ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం కేంద్రానికి, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. దీనితో ఈడీ, సీబీఐ కేసులు నమోదు చేశాయి. రూపకల్పన నుంచే అక్రమాలంటూ.. ఢిల్లీలో మద్యం పాలసీ రూపకల్పన సమయం నుంచే అక్రమాలు చోటు చేసుకున్నాయని ఈడీ, సీబీఐ తమ దర్యాప్తులో గుర్తించాయి. కొందరిని అరెస్టు చేసి విచారణ జరిపాయి. ఈ క్రమంలో పలువురు మద్యం దుకాణాలు తమకు వచ్చేలా చేసుకోవడం, భారీగా లాభాలు వచ్చేలా పాలసీని ప్రభావితం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారని.. ఆప్ నేతలకు రూ.వందల కోట్లు ముడుపులు ఇచ్చారని వెల్లడైందని ఈడీ కోర్టులో దాఖలు చేసిన చార్జిషిట్‌లో పేర్కొంది. ఈ వ్యవహారంలో సౌత్ గ్రూపు పేరిట ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతోపాటు మరికొందరు భాగస్వాములు అయ్యారని ఆరోపించింది. వారి మధ్య పెద్ద మొత్తంలో లావాదేవీలు జరిగాయని, ఈ క్రమంలో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని పేర్కొంది. దీనికి సంబంధించి ఇప్పటికే పలుమార్లు కవితను ప్రశ్నించిన ఈడీ.. తాజాగా అరెస్టు చేసింది. -
‘సీఎం కేజ్రీవాల్ ఈడీ నుంచి తప్పించుకోలేరు’
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానంలో అవకతవకలకు సంబంధించిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) జారీ చేసిన సమన్ల నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తప్పించుకోలేరని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. అయితే ఈడీ ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్‌కు వరుసగా మూడుసార్లు సమన్లు జారీ చేసిన విసయం తెలిసిందే. కాగా.. మూడోసారి జారీ చేసిన మమన్ల ప్రకారం కేజ్రీవాల్ 2024 జనవరి 3వ తేదీ ఈడీ ముందు హాజరుకావల్సి ఉంది. అరవింద్ కేజజ్రీవాల్ ఉద్దేశపూర్వకంగానే ఈడీ ముందుకు రావటంలేదని వీరేంద్ర సచ్‌దేవా మండిపడ్డారు. ముడోసారి జారీ చేసిన సమన్ల నుంచి మాత్రం కేజ్రీవాల్ ఎట్టిపరిస్థితుల్లో తప్పించుకోలేరని అన్నారు. VIDEO | "Initially, he used the excuse of elections and then Vipassana, and now let's see what explanation he gives on January 3. He can't evade this for long, he has to appear before the agency," says BJP leader @Virend_Sachdeva on ED's summon to CM Arvind Kejriwal. pic.twitter.com/GObqIb6fL7 — Press Trust of India (@PTI_News) December 30, 2023 మొదటిసారి ఎన్నికలు, రెండోసారి విపాశన ధ్యానం పేరుతో కేజ్రీవాల్ దూరంగా ఉన్నారని దుయ్యబట్టారు. జనవరి 3న హాజరుకావాలన్న ఈడీ సమన్లపై ఎలాంటి వివరణ ఇస్తారో చూస్తామని తెలిపారు. అయితే సుదీర్ఘం కాలం మాత్రం ఈడీ సమన్ల నుంచి తప్పించుకోవడం సాధ్యం కాదని అన్నారు. కచ్చితంగా కేజ్రీవాల్ ఈడీ ముందుకు హాజరు కావాల్సిందేనని తెలిపారు. ఇక సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ మొదటిసారి నవంబర్ 2న, రెండోసారి డిసెంబర్18న, మూడోసారి డిసెంబర్ 21న సమన్లను జారీ చేసిన విషయం తెలిసిందే. రెండు సార్లు ఈడీ విచారణకు డుమ్మా కొట్టిన సీఎం కేజ్రీవాల్ జనవరి 3న ఈడీ ముందుకు హాజరవుతారో? లేదో? అని పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. చదవండి: ‘రాముడు హిందువులకే దేవుడు కాదు.. అందరివాడు’ -
విచారణకు కేజ్రీ డుమ్మా!
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకల కేసులో గురువారం విచారణకు రావాలన్న ఈడీ సమన్లను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి బేఖాతరు చేసినట్టు సమాచారం. బుధవారమే ఆయన పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో విపాసన ధ్యానం కోర్సులో చేరేందుకు వెళ్లినట్లు వార్తలొచ్చాయి. ‘‘ఆయన ఏటా చలికాలంలో విపాసనకు వెళ్తారని అందరికీ తెలుసు. అయినా ఈడీ కావాలనే ఇప్పుడు సమన్లు ఇచ్చింది’’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. దీనిపై ఈడీ తదుపరి చర్యలేమిటనేది తెలియాల్సి ఉంది. నవంబర్ 2న కేజ్రీవాల్‌ను ఈడీ విచారణకు పిలవగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సి ఉందంటూ హాజరు కాలేదు. -
మందుబాబులకు తెలంగాణ సర్కార్ షాక్?
సాక్షి, హైదరాబాద్: మందు బాబులకు షాక్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోందా?. గత ప్రభుత్వాల నిర్ణయాలపై వరుస సమీక్షలతో గడుపుతున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ దిశగా అధికార యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ వ్యాప్తంగా బెల్ట్ షాపుల మూసివేతకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అలాగే.. వైన్ షాపుల లిక్కర్ సేలింగ్ సమయాన్ని సైతం కుదించే దిశగా సమాలోచనలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ వ్యాప్తంగా 2,620 బెల్ట్ షాపులు ఉన్నాయి. మరోవైపు మద్యం రేట్ల విషయంలోనూ విధివిధానాల రూపకల్పన కోసం.. ఒక పాలసీ ఏర్పాటు యోచనలోనూ రేవంత్ సర్కార్ ఉన్నట్లు సమాచారం. మరో రెండు, మూడు రోజుల్లో ఈ అంశంపై ఒక స్పష్టమైన ప్రకటన వెలువడొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికప్పుడు అది అమలు కాకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తం చేస్తున్నారు కొందరు అధికారులు. -
మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!
మహబూబ్‌నగర్ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు. మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్ కింగ్‌లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్, నారాయణపేట, నాగర్‌కర్నూల్ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి. బిజీబిజీ.. ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు. లాభాలు ఉండటంతో.. మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు. -
కేజ్రీవాల్‌కు ఏదో జరగబోతోంది
న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఇరుకున పెట్టేందుకు పెద్ద కుట్ర జరగబోతోందని ఆప్ నేత సంజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేశారు. మనీ ల్యాండరింగ్ కేసులో శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన అనంతరం కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడారు. ‘కేజ్రీవాల్‌ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోంది. ఆయన్ను అరెస్ట్ చేయడం మాత్రమే కాదు. అంతకంటే మించి ఏదో చేయడమే ఆ కుట్ర’ అని అన్నారు. మద్యం విధానం కేసులో మనీ ల్యాండరింగ్ ఆరోపణలపై విచారణకు రావాలంటూ ఈడీ పంపిన సమన్లకు కేజ్రీవాల్ స్పందించని విషయం తెలిసిందే. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంజయ్ జ్యుడీషియల్ కస్టడీని కోర్టు ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. -
AP: పురందేశ్వరికి ముందే తెలిసిపోయిందా?
ఈ మధ్య బీజేపీ ఏపీ శాఖ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ ప్రభుత్వంపై మద్యం కుంభకోణం అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చారు. ఏమిటి.. ఈ మహిళా నేతకు మద్యం గోలేమిటి అనే సందేహం వచ్చింది. ఆమె వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పక్ష నేత విజయసాయిరెడ్డి, లోక్ సభ లో పార్టీ నేత మిధున్ రెడ్డిలపై కూడా కొన్ని విమర్శలు చేశారు. దానికి విజయసాయి గట్టి కౌంటర్ ఇచ్చారు. ఆమెకు సంబంధించిన పలు విషయాలు బహిర్గతం చేయవలసి వస్తుందని హెచ్చరించారు. అవేమిటో తెలియదు. ఇప్పుడు అసలు విషయం వెల్లడైంది. ఆమె ఎందుకు మద్యం కుంభకోణం అంటూ గగ్గోలు పెట్టారో అర్ధం అయింది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మద్యం స్కామ్ కేసు రాబోతోందని ఆమెకు, చంద్రబాబు కుటుంబానికి, టీడీపీ ముఖ్యనేతలు కొందరికి సమాచారం ఉండి ఉండాలి. స్కిల్ స్కామ్ కేసులో అరెస్టు అయి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడుకు స్వయానా ఆమె వదిన కావడంతో ఆ బంధుత్వాన్ని అడ్డు పెట్టుకుని టీడీపీ నేతలు ఆమె ద్వారా రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేయించి ఉండాలి. ఎందుకంటే టీడీపీ నేతలు ఏ విమర్శలు చేసినా జనం పట్టించుకునే పరిస్థితి ఉండడం లేదు. అన్నీ అబద్దాలు ఆడుతున్నారనే భావన జనంలోకి వెళుతోంది. ఆమె ఒకటికి రెండుసార్లు మద్యం కుంభకోణం అనడం, కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయడం.. ఇదంతా రాజకీయంలే అనుకున్నవారికి అసలు విషయం అర్ధం అయింది. ✍️చంద్రబాబుపై ఏపీ సీఐడీ మద్యం స్కామ్ కేసును నమోదు చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి ఏడాదికి రూ.1,300 కోట్ల మేర నష్టం చేశారన్నది అభియోగం. ఈ విషయాలు జనంలోకి వెళ్లడానికి ముందుగానే ఎదురు దాడి చేయాలని పురందేశ్వరి బృందం అనుకుని అలా ప్రభుత్వంపై విమర్శలు చేశారని తేలుతోంది. ఇక ఈ కేసు విషయానికి వస్తే, నంద్యాల మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డితో పాటు టీడీపీ నేతలు అయ్యన్నపాత్రుడు,యనమల రామకృష్ణుడి బంధువులకు మద్యం కంపెనీల ఏర్పాటులో ప్రత్యేక రాయితీలు ఇచ్చారన్న ఆరోపణలను దర్యాప్తు సంస్థ మోపింది. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ వాట్ తో పాటు ఆరుశాతంగా ఉన్న ప్రివిలేజ్ ఫీజ్ ను పది శాతం చేయాలని సూచిస్తే, ఈ కంపెనీలకు చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసిందని సీఐడీ దర్యాప్తులో తేలింది. ఇదంతా క్విడ్ ప్రోకో ప్రకారం జరిగిందని అనుమానిస్తున్నారు. ఇవే విషయాలను ఏసీబీ కోర్టుకు సీఐడీ అధికారులు తెలియచేశారు. ఈ కేసులో ఏ పరిణామాలు సంభవిస్తాయో తెలియదు కాని, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో రూ. 338 కోట్ల మొత్తం చేతులు మారిందని ఆరోపణ వస్తేనే ఆ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు గత ఆరునెలలుగా బెయిల్ రాలేదు. విచారణ పూర్తి కానందున ఇప్పటికీ బెయిల్ ఇవ్వడానికి వీలు లేదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అదే సూత్రం చంద్రబాబు కేసులో కూడా వర్తిస్తే, ఆయనకు బెయిల్ రావడం కష్టమే కావచ్చన్నది ఒక అభిప్రాయంగా ఉంది. అందుకే కేసు మెరిట్స్ లోకి వెళ్లకుండా ఆయన న్యాయవాదులు 17-ఏ అనో, అనారోగ్యం అనో కారణాలు చూపుతూ మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్ లు వేశారు. ✍️చంద్రబాబు టైమ్ లో జరిగిన మద్యం స్కామ్ పై పురందేశ్వరి స్పందిస్తారో లేదో తెలియదు. టీడీపీ నేత, మాజీ మంత్రి లోకేష్ మాత్రం తీవ్రంగా స్పందించారు. జగన్ ప్రభుత్వం కల్తీ మద్యం అమ్ముతోందని, ఆయనపై 35 లక్షల కేసులు పెట్టాలని చిత్రమైన విమర్శ చేశారు. మద్యం తాగి అనారోగ్యంపాలై 35 వేల మంది మణించారని కూడా ఆరోపించారు. దీనిపై చర్చకు సిద్దమా?అని ఆయన ప్రశ్నించారు. ఎవరి హయాంలో మద్యం దందా జరిగిందో తేల్చుకుందామని ఆయన అన్నారు. ✍️ఇలా అర్ధం ,పర్దం లేని అబద్దాల వల్లే చంద్రబాబు, లోకేష్ ల ప్రకటనలకు విలువ లేకుండా పోతోంది. చంద్రబాబుపై సీఐడీ పెట్టిన కేసు ఏమిటి? లోకేష్ చేస్తున్న ఆరోపణ ఏమిటి?. ముందుగా చంద్రబాబు పై వచ్చిన అభియోగాలు ఏ రకంగా వాస్తవం కాదో ప్రజలకు వివరించాలి కదా!. ఆ తర్వాత ఏ ఆరోపణ అయినా చేయవచ్చు. అది వేరే సంగతి. కాగ్ సైతం చంద్రబాబు టైమ్ లో మద్యం వ్యాపారంలో ఖజానాకు నష్టం కలిగిందని పేర్కొందా?లేదా?. 2014 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన నంద్యాల నుంచి ఎన్నికైన ఎస్పివై రెడ్డికి.. ఢిల్లీ ఏపీ భవన్ లోనే పచ్చ కండువా కప్పి టిడిపిలోకి తీసుకున్నది అవాస్తవమా? ఆయనకు అప్పుడు ఇచ్చిన ఆఫర్ ఏమిటో జనానికి తెలియదా?. ఆ విషయం ఆ రోజుల్లో ఎస్పివై రెడ్డే అంతరంగికంగా చెబుతుండేవారని అంటారు. అప్పుడే ఆయన డిస్టిలరీని స్థాపించారు. దానికి చంద్రబాబు ప్రభుత్వం ఎక్కడ ఇబ్బంది పెడుతుందో అని ఆయన పార్టీ మారినట్లు చెప్పేవారు. ఆ తర్వాత చంద్రబాబు ఇచ్చిన ఆఫర్ కూడా బాగానే కుదిరింది. ✍️నిజానికి ఆయన ఒక్కరికే కాదు. మరో ఇద్దరు వైఎస్సార్సీపీ ఎంపీలను కూడా టిడిపిలోకి లాగారు. ఇరవై మూడు మంది వైసిపి ఎమ్మెల్యేలను చంద్రబాబు కొనుగోలు చేశారని బహిరంగంగానే చెప్పుకునేవారు. కర్నూలు జిల్లా కొడుమూరుకు అప్పట్లో ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన ఒక నేత తనకు ఎంత ఆఫర్ వచ్చింది ఓపెన్ గానే చెప్పడం కలకలం రేపింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాను అప్పుల్లో ఉన్నానని, వాటన్నింటిని టీడీపీ అధినాయకత్వం తీర్చి వేయడానికి ఒప్పుకుందని, అందుకే పార్టీ మారానని తన సన్నిహితులు పలువురికి చెప్పేవారు. మరో ఎమ్మెల్యేకి బెంగుళూరులో డబ్బు ఏర్పాటు జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. వీటిలో కొన్నిటింకి టీడీపీ మద్దతు ఇచ్చే ఒక పత్రికాధిపతి కూడా మద్యవర్తిగా కూడా ఉన్నారని ప్రచారం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ మద్యం కుంభకోణం జరగలేదని టీడీపీ నేతలు డబాయించవచ్చు. స్కిల్ కేసులో మాదిరి అసలు విషయం జోలికి వెళ్లకుండా అక్రమ కేసు అని బుకాయించవచ్చు. కాని, అసలు విషయాలన్ని బయటకు వస్తే టిడిపికి, చంద్రబాబుకు మరింత ఇబ్బంది అని భయపడుతున్నారనిపిస్తుంది. జగన్ అధికారంలోకి వచ్చాక ఒక కొత్త డిస్టిలరీ ఇవ్వకపోయినా,కొత్త బ్రాండ్లు ఏమీ రాకపోయినా చంద్రబాబు టైమ్ లో ఇచ్చిన లైసెన్స్ లన్ని,కొత్త బ్రాండ్లన్నీ ఇప్పుడే ఇచ్చినట్లు ప్రచారం చేయడం టీడీపీకి, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా కథనాలు ఇవ్వడం అలవాటుగా మారింది. ఈ క్రమంలోనే పురందేశ్వరి కూడా ముందుగానే వైఎస్సార్సీపీపై ఎదురు దాడి చేస్తే చంద్రబాబు పై ఉన్న స్కామ్ కు ప్రాధాన్యత తగ్గుతుందని అనుకుని ఉండాలి. అలాకాని పక్షంలో ఆమె చంద్రబాబు టైమ్ లో జరిగినట్లు సీఐడీ చెబుతున్న ఈ స్కామ్ పై స్పందించవలసి ఉంటుంది. స్కిల్ స్కామ్ కేసులోనే ఆమె చంద్రబాబుకు మద్దతు ఇస్తూ మాట్లాడి అభాసుపాలయ్యారు. అయినా ఆమె పార్టీ కన్నా, బంధుత్వానికే ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ✍️ఒకప్పుడు దగ్గుబాటి కుటుంబానికి, చంద్రబాబుకు ఉప్పు-నిప్పుగా పరిస్థితి ఉన్నా.. చంద్రబాబు ఎలాగో వారిని తన దారిలోకి తెచ్చుకున్నట్లు అనిపిస్తుంది. లోకేష్ మద్య నిషేధం గురించి చెబుతున్నారు. బహుశా ఆయన బాగా చిన్నవాడై ఉండవచ్చు. 1994లో ఎన్.టి.రామారావు ప్రభుత్వంలోకి రాగానే మద్య నిషేధం అమలు చేశారు. ఆయనను కూలదోసి చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తాను ఇంకా కఠినంగా మద్య నిషేధాన్ని అమలు చేస్తానని కొంతకాలం ఊదరగొట్టి, ఆ వెంటనే ఇది మనవల్ల కావడం లేదని చేతులెత్తేసి, ప్రజాభిప్రాయ సేకరణ అంటూ కొత్త డ్రామాకు తెరదీసి మధ్య నిషేదాన్నే ఎత్తివేశారు. మరి అందుకు ఆయనపై ఎన్ని లక్షల కేసులు పెట్టాలో కూడా లోకేష్ ఆలోచించుకోవాలి. ✍️1999 ఎన్నికల సమయంలో అనుకుంటా!మద్యం కంపెనీలకు సుమారు 400 కోట్లు చెల్లించిన వైనంపై ఆరోపణలు వచ్చాయి. వాటిపై కాంగ్రెస్ నేత,మాజీ మంత్రి పాల్వాయి గోవర్దనరెడ్డి కోర్టుకు వెళ్లారు. అప్పుడు ఎలా చంద్రబాబు ఆ కేసునుంచి బయటపడింది లోకేష్ తెలుసుకుంటే, ఆ అనుభవం బాగా ఉపయోగపడవచ్చు.చంద్రబాబు క్విడ్ ప్రోకో కారణంగా అప్పట్లో ఏడాదికి రూ. 1300 కోట్ల నష్టం ప్రభుత్వానికి వచ్చిందని సీఐడీ చెబుతోంటే దానికి ప్రాధాన్యం ఇవ్వకుండా ఈనాడు మీడియా నేరుగా చంద్రబాబుపై కక్షసాధింపుల పర్వంలో భాగంగా మద్యం కేసు పెట్టినట్లు చెప్పేసింది. ✍️అసలు వార్తను పక్కకు దోసి చంద్రబాబును ప్రభుత్వం వేధిస్తోందని పత్రికలో, టీవీలో ప్రచారం చేశారు. మరి గతంలో ఎమ్.పిగా ఉన్న వైఎస్ జగన్ పై పదకుండు కేసులు పెట్టినప్పుడు, ఒక చార్ఝీషీట్ పై మరో చార్జీషీట్ వేసినప్పుడు అదంతా సక్రమం అనిపించిన ఈనాడుకు.. ఇప్పుడు చంద్రబాబుపై అవినీతి అభియోగాలు వస్తే మాత్రం అంతా అక్రమం అని గగ్గోలు పెడుతోంది. అందుకే ఈనాడు రామోజీరావుకు, చంద్రబాబుకు మద్య బందం ఫెవీకాల్ వంటిదని అందరూ అంటుంటారు. ఇక మరో పత్రిక ఆంద్రజ్యోతి ఒకవైపు కేసు కక్ష అంటూనే, మరో వైపు అప్పటి ఇంకో అధికారి అజయ్ కల్లంపై ఎందుకు కేసు పెట్టలేదని స్టోరీ ఇచ్చింది. అంటే ముందుగా ఈ అక్రమం జరిగిందని ఆ పత్రిక ఒప్పుకుని , ఆ తర్వాత ఏమైనా రాసుకోవచ్చు. చంద్రబాబుపై కేసు పెడితే అక్రమం అయితే, మరి అజయ్ కల్లంపై కేసు పెట్టాలని ఎలా రాస్తారో తెలియదు. జగన్ ప్రభుత్వంపై మద్యం లో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, ప్రభుత్వం టీడీపీ హయాలో ఏదో జరిగిపోయిందని కేసు పెట్టిందని ఈనాడు తెగ బాధపడిపోయింది. ఈ ప్రభుత్వంపై ఏవైనా ఆరోపణలు ఉంటే ఆధారసహితంగా చేయాలి. దానికి ప్రభుత్వం సమాధానం ఇస్తుంది. అంతే తప్ప చంద్రబాబు ప్రభుత్వంలో ఎలాంటి అక్రమాలు జరిగినా వాటిపై కేసులే పెట్టవద్దని ఈనాడు వంటి మీడియా విచిత్రమైన వాదన చేయడం దేనికి సంకేతం అవుతుంది?. రామోజీరావు అవినీతికి పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు కాదా?. ఇప్పటికే వివిధ కేసులలో విలవిలలాడుతున్న చంద్రబాబుకు ఈ మద్యం స్కామ్ మరో దెబ్బే అని చెప్పాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (55)కు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారం సమన్లు జారీ చేసింది. నవంబర్ 2న ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. ఇదే కేసులో అరెస్టై జైల్లో ఉన్న ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసిన కొద్ది గంటలకే ఈ పరిణామం చెటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి దాఖలు చేసిన చార్జిషీట్లలో కేజ్రీవాల్ పేరును ఈడీ ఇప్పటికే పలుసార్లు పేర్కొనడం తెలిసిందే. ఈ కేసు నిందితులంతా ఢిల్లీ మద్యం విధానం 2021–22 తయారీ, అమలుకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ కేజ్రీవాల్‌తో ఎప్పటికప్పుడు టచ్‌లో ఉన్నట్టు అందులో చెప్పుకొచ్చింది. నవంబర్ 2న కేజ్రీవాల్ స్టేట్మెంట్ను ఈడీ నమోదు చేయనుందని సమాచారం. మద్యం కుంభకోణానికి సంబంధించి అవినీతి, నేరపూరిత కుట్ర అభియోగాల్లో కేజ్రీవాల్‌ను సీబీఐ ఏప్రిల్ 16న కూడా 9 గంటలపాటు ప్రశ్నించింది. మండిపడ్డ ఆప్ కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లపై ఆప్ మండిపడింది. తమ పార్టీని ఎలాగైనా అంతం చేయడమే లక్ష్యంగా కేంద్రంలోని బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించింది. అందులో భాగంగానే ఈ తప్పుడు కేసులో తమ అధినేతను ఎలాగైనా ఇరికించేందుకు నరేంద్ర మోదీ సర్కారు ఎప్పట్నుంచో ప్రయతి్నస్తోందని ఆప్ నేత, మంత్రి సౌరభ్ భరద్వాజ్ ఆరోపించారు. మరోవైపు, ఈ కేసులో సిసోడియా అవినీతికి సంబంధించి చాలినన్ని రుజువులున్నాయని సుప్రీం బెయిల్ నిరాకరణతో తేలిపోయిందని బీజేపీ పేర్కొంది. కనుక నైతిక బాధ్యత వహిస్తూ కేజ్రీవాల్ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కేసులో అవినీతి జరిగినట్టు ఎలాంటి రుజువులూ లేవని కేజ్రీవాల్‌తో పాటు ఆప్ నేతలంతా ఇప్పటిదాకా చెప్తూ వచి్చందంతా పచ్చి అబద్ధమని రుజువైందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవ అన్నారు. ఆది నుంచీ వివాదాలే ఢిల్లీ మద్యం విధానాన్ని 2021లో కేజ్రీవాల్ ప్రభుత్వం అమల్లోకి తెచి్చంది. మద్యం లైసెన్సుదారులకు నిబంధనలకు విరుద్ధంగా అనేక విధాలుగా కేజ్రీవాల్ సర్కారు లబ్ధి చేకూర్చిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దాంతో దీనిపై విచారణ జరపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని నాటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశించారు. మద్యం విధానం తప్పుల తడక అని, ఎక్సైజ్ మంత్రిగా సిసోడియా తీసుకున్న నిర్ణయాల వల్ల ఖజానాకు కనీసం భారీ నష్టం జరిగిందని, ఆప్ నేతలు తదితరులు లైసెన్సుదారుల నుంచి పలు మార్గాల్లో లబ్ధి పొందారని సీఎస్ నివేదించారు. ఈ వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో చివరికి 2022 జూలై 31న నూతన మద్యం విధానాన్ని కేజ్రీవాల్ సర్కారు రద్దు చేసింది. ఇందులో తీవ్ర అవకతవకలు జరిగాయంటూ 2022 ఆగస్టు 17న సీబీఐ కేసు నమోదు చేసింది. సిసోడియాతో పాటు 15 మందిని నిందితులుగా చేర్చింది. -
Delhi Liquor Policy Case: సిసోడియా బెయిల్‌పై 30న సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ: ఢిల్లీలో మద్యం విధానంలో అవకతవకలు, మనీల్యాండరింగ్ కేసులో అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మాజీ మంత్రి మనీశ్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం ఈ నెల 30వ తేదీన తీర్పు వెలువరించనుంది. ఈ కేసును సీబీఐ, ఈడీలు దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో అరెస్టయిన సిసోడియా తిహార్ జైలులో కస్టడీలో ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్‌పై అక్టోబర్ 17వ తేదీతో వాదనలు ముగిశాయి. తీర్పు సోమవారం ఉదయం వెలువడుతుందని సుప్రీంకోర్టు వర్గాలు తెలిపాయి. -
‘మద్యం’పై మాట్లాడే అర్హత పురందేశ్వరికి లేదు
పుత్తూరు రూరల్: మద్యం పాలసీపై మాట్లాడే అర్హత ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి లేదని డిప్యూటీ సీఎం కె.నారాయణస్వామి అన్నారు. ఆదివారం తిరుపతి జిల్లా పుత్తూరులో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్టీ రామారావు మద్యపాన నిషేధం తీసుకొస్తే.. ఆయన స్థాపించిన పార్టీని చంద్రబాబు లాక్కుని మద్య నిషేధం ఎత్తివేసినప్పుడు పురందేశ్వరి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు పాలించిన 2014–19 కాలంలోనే ఏకంగా 7 డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చారని గుర్తు చేశారు. 2019లో ఏర్పడిన సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఇప్పటివరకు ఒక్క డిస్టలరీకి గానీ, ఒక్క బ్రూవరీకి గాని అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పీఎంకే డిస్టలరీ యనమల రామకృష్ణుడిదని, శ్రీకృష్ణ డిస్టలరీ ఆదికేశవులనాయుడిదని, స్పై డిస్టిలరీ ఎస్పీవై రెడ్డిదని, విశాఖ డిస్టిలరీ అయ్యన్నపాత్రుడిదని వివరించారు. ఇప్పుడున్న ప్రతి బ్రాండు చంద్రబాబు పాలనలో తీసుకొచ్చినవే అని, అందుకే వాటిని ‘సీ’ బ్రాండ్లు అంటున్నారని తెలిపారు. కేజీహెచ్‌లో గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో నెలకు సుమారు 20 మంది పాడైన లివర్, పాంక్రియాస్ రోగులు అడ్మిట్ అవడమనేది పదేళ్లుగా జరుగుతున్న విషయమేనని స్పష్టం చేశారు. మద్యపానం చేస్తే లివర్ చెడిపోవచ్చు బ్రాండుతో సంబంధం లేకుండా మద్యాన్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు తీసుకుంటే లివర్ చెడిపోవచ్చని మంత్రి నారాయణస్వామి పేర్కొన్నారు. దేశంలోనే మద్యం సేవించే వారి సంఖ్య 15 శాతానికి పెరిగిందని నిమ్హాన్స్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. చంద్రబాబు పాలనలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడాన్ని సమర్థిస్తూ ఈనాడు, ఆంధ్రజ్యోతి వార్తలు రాశాయని గుర్తు చేశారు. చంద్రబాబు తన అనుచర గణానికి 4,378 మద్యం షాపులను కట్టబెట్టడమే కాకుండా, 43 వేల బెల్ట్ షాపులు పెట్టి మద్యపానాన్ని ఏరులై పారించారని గుర్తు చేశారు. అందుకే పురందేశ్వరి మద్యం పాట పాడుతోంది పురందేశ్వరి తన మరిది చంద్రబాబు, ఆయన కొడుకు లోకేశ్‌ను కాపాడేందుకే మద్యం పాట పాడుతున్నారని మంత్రి నారాయణస్వామి ఎద్దేవా చేశారు. పురందేశ్వరి బీజీపీ అధ్యక్షురాలా? టీడీపీ అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుతో కలిసి పురందేశ్వరి, ఆమె భర్త సైతం ఎన్టీఆర్ మృతికి కారకులయ్యారని, ఎన్టీఆర్ కూతురుగా చెప్పుకోవడానికి ఆమెకు అర్హత లేదని పేర్కొన్నారు. చంద్రబాబు ఆర్థిక నేరస్తుడని తొలిసారిగా చెప్పింది దేశ ప్రధాని నరేంద్ర మోదీ అని.. ఆ తరువాత చెప్పింది పవన్‌కళ్యాణ్ అని గుర్తు చేశారు. చంద్రబాబు అరెస్ట్ న్యాయపరంగానే జరిగిందని రాష్ట్ర ప్రజలు విశ్వసించారు కాబట్టే ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేక స్పందన రాలేదన్నారు. -
Fact Check: అవన్నీ మీ ‘బాబు’ బ్రాండ్లే
సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారం కోల్పోతేనే ఈనాడు రామోజీరావు గంగవెర్రులెత్తిపోతారు. అలాంటిది ఇక అవినీతి కేసుల్లో ఆధారాలతో సహా అడ్డంగా దొరికి తన ఆత్మబంధువు జైలుకెళ్తే ఇక రామోజీ మామూలుగా ఉంటారా.. కల్లు తాగిన కోతిలా తయారై తన కలంతో విషం కక్కుతారు. ఇప్పుడు ఆయన పూనకం వచ్చినట్లుగా అదే చేస్తున్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానంపై తెగ దుష్ప్రచారం చేస్తున్నారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలతో రోజురోజుకు జనాదరణ పెంచుకుంటున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై అక్కసు వెళ్లగక్కుతున్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో నాణ్యమైన మద్యం విక్రయించడంలేదని మరో అవాస్తవ కథనాన్ని ప్రచురించి ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ఈనాడు ఎప్పటిలాగే మరోసారి బరితెగించింది. ఇటువంటి టీడీపీ, ఈనాడు దుష్ప్రచారాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగానే గతంలో ఎన్నోమార్లు సమర్థంగా తిప్పికొట్టింది. అయినప్పటికీ రామోజీ తన వంకర బుద్ధిని మార్చుకోకుండా రాష్ట్ర ప్రభుత్వంపై విద్వేషాన్ని వెళ్లగక్కుతునే ఉన్నారు. అందుకే మరోసారి ప్రజలకు వాస్తవాలు తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్యాక్ట్‌చెక్.. బాబు హయాంలోనే పచ్చ సిండికేట్ దోపిడీ.. రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం సిండికేట్ మొత్తం ఆ పార్టీ నేతల గుప్పెట్లోనే ఉండేది. బడి పక్కన, గుడి పక్కన అనే విచక్షణ కూడా లేకుండా ఎక్కడపడితే అక్కడ మద్యం దుకాణాలకు అనుమతులిచ్చేసి.. పర్మిట్ రూమ్‌ల పేరుతో అనధికారిక బార్లను తెరిచేసి.. మరో 43వేల బెల్డ్ దుకాణాలను ఏర్పాటుచేసి మరీ మద్యాన్ని ఏరులై పారించారు. ఈ మద్యం దుకాణాల్లో ఎంఆర్పీ కంటే మద్యం బాటిల్‌పై రూ.10 నుంచి రూ.25 వరకు అధిక ధరకు విక్రయించినా అడిగే నాథుడే లేకుండాపోయారు. ఆనాడు మద్యం దందాపై కిమ్మనకుండా ఈనాడు సహకరించిందన్నది బహిరంగ రహస్యం. ఆ బ్రాండ్లన్నీ తెచ్చింది చంద్రబాబే.. నిజానికి.. రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై ఈనాడు ఇప్పుడు నీతులు చెబుతుండటం విడ్డూరంగా ఉంది. వివిధ మద్యం బ్రాండ్ల పేర్లను ఉదాహరిస్తూ వాటితో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని మొసలి కన్నీరు కారుస్తోంది. కానీ, అవన్నీ చంద్రబాబు బ్రాండ్లనే వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగా దాచిపెడుతున్నారు. అప్పటివరకూ కనిపించని... వినిపించని మద్యం బ్రాండ్లన్నీ కూడా రాష్ట్రంలోకి తీసుకొచ్చింది చంద్రబాబే అన్నది నిఖార్సైన నిజం. సంధి ప్రేలాపనలు పేలుతున్న రామోజీ.. ఆ వివరాలు ఇవిగో.. ► ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూడీలక్స్ బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉండగానే 2017 నవంబరు 22న అనుమతిచ్చారు. ► గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ బ్రాండ్ల పేరుతో విస్కీ, బ్రాందీ తదితర 15 బ్రాండ్లకు కూడా టీడీపీ ప్రభుత్వమే 2018 అక్టోబరు 26న ఒకేసారి అనుమతులిచ్చింది. ► హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్ఎన్జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్లతో బీరు విక్రయాలు సైతం చంద్రబాబు నిర్వాకమే. ఆ బ్రాండ్లకు టీడీపీ ప్రభుత్వం 2017 జూన్ 7న అనుమతి జారీచేసింది. ► రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్ పేర్లతో విస్కీ, బ్రాందీ బ్రాండ్లకు కూడా రామోజీ పార్ట్నర్ చంద్రబాబే 2018 నవంబరు 9న అనుమతిచ్చారు. ► బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు అనుమతులు ఎప్పుడు ఇచ్చారో తెలుసా రామోజీ.. 2019 మే 14న మీ చంద్రబాబు ప్రభుత్వమే. అప్పటికి ఇంకా రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టలేదు. ► ఆ మర్నాడే టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ, బ్రాందీ బ్రాండ్లకూ టీడీపీ సర్కారే అనుమతినిచ్చిందన్నది పచ్చి నిజం. డిస్టిలరీలకు అనుమతులిచ్చింది ఆయనే రామోజీ.. ఇక రాష్ట్రంలో మద్యం తయారుచేస్తున్న డిస్టిలరీలన్నింటికీ అనుమతులిచ్చింది చంద్రబాబు ప్రభుత్వమే. రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలకు అంతకుముందు ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. అంటే టీడీపీ నేతలకు చెందిన కంపెనీలకే చంద్రబాబు అనుమతులిచ్చారు. ప్రస్తుతం చంద్రబాబు సన్నిహితుల కంపెనీలే మద్యాన్ని తయారుచేస్తున్నాయి. టీడీపీ ప్రభుత్వ హయాంలోనూ ప్రస్తుతం కూడా ఆ డిస్టిలరీలు తయారుచేస్తున్న మద్యాన్నే రాష్ట్రంలో విక్రయిస్తున్నారు. అయినా సరే టీడీపీ అధికారంలో ఉంటే మద్యం నాణ్యమైనదీ.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉంటే మద్యంలో నాణ్యతలేదని దుష్ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది. ప్రతీ డిస్టిలరీకి సమాన అవకాశాలు.. అలాగే, మద్యం తయారీ కూడా అప్పట్లో మాదిరిగా ఒకే డిస్టిలరీకి 50శాతం ఆర్డర్ ఇచ్చేయకుండా ప్రతీ డిస్టిలరీకీ సమానంగా అవకాశం వచ్చేలాగా.. 4–6 శాతం ఉండేలా తయారీ ఆర్డర్లు ఇస్తున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మీకు ఎక్కడ తప్పు కనిపిస్తోంది?.. ఎక్కడ నాసిరకం ఉంది రామోజీ? మద్యం డాన్ చంద్రబాబే.. రాష్ట్రంలో మద్యం డాన్ చంద్రబాబే అన్న వాస్తవాన్ని రామోజీరావు ఉద్దేశపూర్వకంగానే విస్మరిస్తున్నారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే.. అందులో 14 చంద్రబాబు హయాంలోనే అనుమతులిచ్చారు. మరి మద్యం డాన్ చంద్రబాబే కదా రామోజీ. పైగా.. రాష్ట్రంలోని ఈ డిస్టిలరీలన్నీ దాదాపుగా టీడీపీ కీలక నేతల కుటుంబాల చేతుల్లోనే ఉన్నాయి. పీఎంకే డిస్టిలరీ టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అల్లుడు పుట్టా మహేశ్‌కుమార్‌ది. ఆయన టీడీపీ నేత పుట్టా మధుసూదన్ యాదవ్‌కు కుమారుడు కూడా. ► శ్రీకృష్ణ ఎంటర్‌ప్రైజస్ టీడీపీ మాజీ ఎంపీ దివంగత డీకే ఆదికేశవుల నాయుడు కుటుంబానిది. ► ఎస్పీవై ఆగ్రో ప్రొడక్ట్స్ టీడీపీ నేత, మాజీ ఎంపీ ఎస్పీవై రెడ్డి కుటుంబానిది. వైఎస్సార్సీపీ తరపున ఎంపీగా గెలిచిన ఎస్పీవై రెడ్డిని నిబంధనలకు విరుద్ధంగా టీడీపీలో చేరినందుకు నజరానాగా ఆ డిస్టిలరీకి చంద్రబాబు అనుమతిచ్చారు. ► ఇక బాబు ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు ఆగ మేఘాల మీద 2019, ఫిబ్రవరి 25న అనుమతినిచ్చిన విశాఖ డిస్టిలరీస్‌లో టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు వాటాదారుగా ఉన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో దశలవారీ మద్య నియంత్రణ.. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం దశల వారీగా మద్య నియంత్రణ విధానాన్ని సమర్థంగా అమలుచేస్తోంది. ఇందుకోసం... ► టీడీపీ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉ.10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తూ ఉండేవి. కానీ, ఇప్పుడు సమయాన్ని కుదించి కచ్చితంగా అమలుచేస్తున్నారు. ఉ.10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలకు అనుమతించారు. ► బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దుచేశారు. చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే వాటన్నింటినీ పూర్తిగా తొలగించింది. అలాగే, గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించారు. అవి అనధికారికంగా బార్లగా చలామణి అయ్యేవి. వాటినీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే రద్దుచేసింది. ► దుకాణాలనూ కుదించారు. టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులివ్వలేదు. ► షాక్ కొట్టేలా ధరలు పెంచారు. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో చాలాసార్లు చెప్పారు. విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫలితంగా పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ► మరోవైపు.. అమ్మకాలూ భారీగా తగ్గాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. అందుకు గణాంకాలే తార్కాణం. మద్యం నాణ్యతపై ఈనాడు దుష్ప్రచారం ఈనాడు కుట్రపూరితంగా సాగిస్తున్న మరో దుష్ప్రచారం ఏమిటంటే...రాష్ట్రంలో మద్యం నాణ్యత లేదని.. విషపు అవశేషాలు ఉన్నాయని చెన్నైలోని ఎస్జీఎస్ ల్యాబొరేటరీ పేరిట ఓ అబద్ధపు నివేదికను ప్రచారంలోకి తీసుకొచ్చింది. కానీ, ఈనాడు కుట్ర బెడిసికొట్టింది. తాము అసలు అలాంటి నివేదికే ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టంచేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరంకాని సహజసిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని స్పష్టంచేసింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని చెప్పింది. అయినా సరే రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ రాష్ట్రంలో మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ ల్యాబ్‌లో పరీక్షించింది. ఆ నమూనాలన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని నివేదిక ఇచ్చింది. మద్యం నాణ్యతపై ఆరోపణల్లో వాస్తవం లేదని తేల్చిచెప్పింది. రాష్ట్రంలో మద్యం తయారీకి డిస్టిలరీలు ఎప్పుడెప్పుడు అనుమతులు పొందాయంటే.. 1. కాంటినెంటల్ వైన్స్, ఆటోనగర్, విజయవాడ, 1971, ఆగస్టు 9 2. బీఆర్కే స్పిరిట్స్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 1998, సెప్టెంబరు 15 3. పెర్ల్ డిస్టిలరీ లిమిటెడ్, సింగరాయకొండ, ప్రకాశం జిల్లా, 1997, ఆగస్టు 14 4. సోరింగ్ స్పిరిట్స్ ప్రైవేట్ లిమిటెడ్, చేబ్రోలు, తూ.గోదావరి జిల్లా, 2007, నవంబరు 7 5. సెంటిని బయో ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, గండేపల్లి, కృష్ణాజిల్లా 2010, జూన్ 9 6. బీవీఎస్ డిస్టిలరీస్, కంకిపాడు, కృష్ణాజిల్లా, 2017, జనవరి 2 7. శ్రావణి ఆల్కో బ్రూ ప్రైవేట్ లిమిటెడ్, గంపలగూడెం, కృష్ణాజిల్లా, 2017, సెప్టెంబరు 29 8. గౌతమి ఆగ్రో ఇండస్ట్రీస్ లిమిటెడ్, వంగూరు, ప.గోదావరి జిల్లా, 1997, నవంబరు 17 9. జీఎస్బీ అండ్ కో, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2008 10. బీడీహెచ్ ఆగ్రో వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్, కొప్పరం, తూ.గోదావరి జిల్లా, 2017, ఆగస్టు 25 11. విశాఖ డిస్టిలరీస్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2019, ఫిబ్రవరి 25 12. పీఎంకే డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, కశింకోట, విశాఖపట్నం జిల్లా, 2017, అక్టోబరు 23 13. ఈగిల్ డిస్టిలరీస్, తాడిగొట్ల, కడప, 1974, అక్టోబరు 14. ఎస్వీఆర్ డిస్టిలరీస్, తిరుపతి, 1982 15. శ్రీకృష్ణా ఎంటర్ప్రైజెస్, తిమ్మ సముద్రం, చిత్తూరు జిల్లా, 1998, జులై 16. ఎస్ఎన్జే సుగర్స్, ప్రొడక్ట్స్, వెంకటాచలం, నెల్లూరు జిల్లా, 2018, మే 17. మోహన్ బేవరేజస్ అండ్ డిస్టిలరీస్ లిమిటెడ్, పల్లూరు, చిత్తూరు జిల్లా, 1978 18. ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్, నంద్యాల, కర్నూలు జిల్లా, 2016, సెప్టెంబరు 19. ఖోడేస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, కుప్పం, చిత్తూరు జిల్లా, 1970 20. ప్రాగ్ డిస్టిలరీస్ ప్రైవేట్ లిమిటెడ్, నల్లమిల్లి, తూ.గోదావరి జిల్లా, 1997, మార్చి 31. -
Fact Check: రామోజీ కలం ‘కిక్కు’తోంది..
సాక్షి, అమరావతి: కళ్ల ముందు కనిపిస్తున్న నిజాలను దాచి, అబద్ధాల కథనాలు రాసి పారేస్తే ప్రజలు నమ్మక ఏం చేస్తారు అన్న భ్రమల్లో ఉన్నారు ఈనాడు రామోజీరావు. అంకెలు అబద్ధాలు చెప్పవు.. నిజాలే చెబుతాయి కదా.. అందుకే ఈనాడు రామోజీరావు ఎప్పుడూ అంకెలు చెప్పరు, అబద్ధాలే చెబుతారు. అందులోనూ తన ఆత్మబంధువు చంద్రబాబు సీఎం కుర్చీలో లేకపోతే ఆయన కలం వెర్రితలలు వేస్తుంది. అబద్ధాలు, అభూత కల్పనలను రంగరించి మరీ విషం కక్కుతుంది. ప్రజల్ని మభ్యపెట్టడం, మోసగించడమే ఆ కలం నిత్యకృత్యం. ఇందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన మరోసారి విద్వేషాన్ని చిమ్మారు. ఓట్లడిగే ‘అర్హత’ కోల్పోయిన జగన్.. అంటూ ఈనాడు ఊగిపోయింది. రాష్ట్ర ప్రభుత్వ మద్యం విధానంపై ఓ అబద్ధాల కథనాన్ని అచ్చేసింది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వ నిబద్ధతకు పాతరేసి ఎప్పటిలాగే దుష్ప్రచారానికి తెగబడింది. అందులో.. వైఎస్సార్సీపీ ప్రభుత్వ మద్యం విధానానికి వక్రభాష్యం చెబుతూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు రామోజీ పడరాని పాట్లు పడ్డారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిన నిజాన్ని.. టీడీపీ నేతలు మద్యం సిండికేట్‌గా మారి పేదలను దోచుకున్న దోపిడీని చూసి పచ్చ పారవశ్యంతో పులకించిపోయిన రామోజీ ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేస్తున్న దశలవారీ మద్య నియంత్రణ విధానాన్ని విమర్శించేందుకు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారు. కానీ, టీడీపీ ప్రభుత్వంలో మూడు బార్లు ఆరు దుకాణాలుగా మద్యం ఏరులై పారిందని.. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో దశలవారీగా మద్య నియంత్రణ సుసాధ్యమవుతోందని రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయ ప్రాభవం ఇక ముగిసిందని.. తన ఆర్థిక అక్రమ సామ్రాజ్యం కుప్పకూలిందని 90 ఇయర్స్ రామోజీ ఇకనైనా గుర్తిస్తే మేలు. నిత్యం అబద్ధాలను వల్లెవేసే ఈనాడు విషపు రాతల బండారాన్ని బట్టబయలు చేస్తున్న పచ్చినిజం ‘ఏది నిజం’ ఇదిగో.. అప్పట్లో మూడు పర్మిట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలు.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలోటీడీపీ నేతల మద్యం సిండికేట్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో మూడు పర్మిట్ రూమ్‌లు.. ఆరు బెల్ట్ దుకాణాలుగా మద్యం ఏరులై పారిందన్నది నిఖార్సైన నిజం. రామోజీకి గుర్తులేదేమోగానీ రాష్ట్ర ప్రజలు మాత్రం మరిచిపోలేదు. అప్పట్లో టీడీపీ నేతల గుప్పెట్లో ఉండే మద్యం మాఫియా యథేచ్ఛగా ప్రజలను దోపిడీ చేసింది. వేళాపాళా లేకుండా 24 గంటలూ మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగేవి. ఎమ్మార్పీ ధరల కంటే 25శాతం వరకు అధిక ధరలకు అమ్ముతున్నా సరే నాడు ఎక్సైజ్ శాఖ చేష్టలుడిగి చోద్యం చూడాల్సి వచ్చేది. మద్యం మాఫియా ఆట కట్టించిన సీఎం జగన్.. మద్యం మాఫియా అరాచకాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్క విధాన నిర్ణయంతో తుడిచిపెట్టేశారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని ఆయన రద్దుచేశారు. 2019, అక్టోబర్ 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేసేశారు. దాంతో రాష్ట్రంలో మద్యం మాఫియా కోరలు పీకి తుదముట్టించారు. అందుకోసం.. మద్యం దుకాణాల వేళలు కుదింపు ప్రైవేటు వ్యక్తులైతే ఎంతగా మద్యం విక్రయాలు పెంచితే తమకు అంతటి లాభం వస్తుందని అనుకుంటారు. కానీ, ప్రైవేటు మద్యం దుకాణాల విధానాన్ని సీఎం జగన్ రద్దుచేశారు. ప్రస్తుతం మద్యం దుకాణాలు ప్రభుత్వానివే కాబట్టి మద్యం అమ్మకాలను ప్రోత్సహించాల్సిన అవసరమేలేదు. అంతేకాదు.. మద్యం విక్రయాల సమయాలను బాగా కుదించారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రైవేటు మద్యం దుకాణాలు ఉ.10గంటల నుంచి రాత్రి 11గంటల వరకు అధికారంగా విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24గంటలూ విక్రయిస్తూ ఉండేవి. ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల సమయాన్ని కుదించి ఉ.10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించారు. కచ్చితంగా అమలుచేస్తున్నారు కూడా. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా రాష్ట్రంలో 43వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. కాలనీలు, వీధులు, సందుల్లో ఎక్కడపడితే అక్కడ బెల్ట్ దుకాణాలు విచ్చలవిడిగా మద్యాన్ని విక్రయించేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ 43వేల బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. టీడీపీ ప్రభుత్వంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లకు అనుమతించారు. అంటే ఆ పర్మిట్ రూమ్‌లు అనధికారికంగా బార్లుగా చలమణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆ 4,380 పర్మిట్ రూమ్‌ల అనుమతులను సైతం రద్దుచేసింది. మద్యం దుకాణాలు క్రమంగా తగ్గింపు చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో 4,380 మద్యం దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రైవేటు మద్యం దుకాణాలను పూర్తిగా తొలగించి ప్రభుత్వపరం చేసింది. అంతేకాదు.. మద్యం దుకాణాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. 2019లో రాష్ట్రంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు ఉండగా ప్రస్తుతం 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలే ఉన్నాయి. అలాగే, టీడీపీ ప్రభుత్వం ఏటా బార్ల సంఖ్యను పెంచేది. కానీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వం బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారుచేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. విక్రయాలు తగ్గించేందుకే ధరల షాక్ మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభల్లోనూ మేనిఫెస్టోలోనూ స్పష్టంగా చెప్పారు. పేదలను మద్యం వ్యసనానికి దూరం చేసేందుకే ఆ నిర్ణయమన్నారు. అంతేగానీ, మద్యం విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. ఆ మాటకు కట్టుబడుతూ అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దాంతో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. మరోవైపు.. మద్యం వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో మద్యం రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ వాస్తవాన్ని రామోజీ వక్రీకరిస్తూ రాష్ట్రంలో మద్యం విక్రయాలు పెరిగాయని ప్రజలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తుండటం విడ్డూరంగా ఉంది. వాస్తవానికి రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు మద్యం వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలతో ‘నవోదయం’.. దశాబ్దాలుగా నాటుసారా తయారీయే జీవనోపాధిగా చేసుకున్న కుటుంబాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. అందుకోసం ‘నవోదయం’ పేరుతో వినూత్న సంస్కరణలను తీసుకొచ్చి ఆ కుటుంబాల సామాజిక గౌరవాన్ని పెంచింది. 2022 ఏప్రిల్ నాటికి రాష్ట్రంలో 1,891 గ్రామాలను గుర్తించారు. ఆ గ్రామాల్లో ఇప్పటికే 1,552 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం రూ.11.46 కోట్ల మేర సహాయం చేసింది. 99 శాతం మేనిఫెస్టో అమలు దశలవారీ మద్య నియంత్రణ అనే అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏమీ బుకాయించడంలేదు. తాము చేసిందే చెబుతున్నారు. అదే సమయంలో తమ పరిమితిని కూడా అంగీకరిస్తున్నారు. అందుకే ఆయన తమ మేనిఫెస్టోను 99 శాతం అమలుచేశామనే చెబుతున్నారు. మద్యం, ఉద్యోగుల విషయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి చాలావరకు చేశారు. కానీ, సాంకేతిక అంశాలు, ఇతరత్రా కారణాలతో ఆ రెండు అంశాల్లో అరశాతం చొప్పున మిగిలిపోయిందని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిజాయతీగా అంగీకరిస్తోంది. అందుకే తాము 99శాతం మేనిఫెస్టోను అమలుచేశామనే సీఎం జగన్ చెబుతుండటం ఆయన నిజాయతీ, నిబద్ధతకు నిదర్శనం. అంతేగానీ, ఆయన ప్రజల్ని మోసపుమాటలతో మాయచేయడంలేదు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేశామని చెబుతున్న ముఖ్యమంత్రి జగన్‌ను రామోజీరావు పచ్చకావరంతో తప్పుబడుతున్నారు. కానీ, చంద్రబాబు 2014 ఎన్నికల్లో ప్రకటించిన మేనిఫెస్టోను ఏమాత్రం అమలుచేయలేదు. అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. టీడీపీ అధికారిక వెబ్సైట్ నుంచి సైతం దానిని తొలగించారు. అయినాసరే అప్పట్లో రామోజీరావు నోరు పెగల్లేదు.. పెన్ను కదల్లేదు. మేనిఫెస్టోను ఎందుకు అమలుచేయడంలేదని ప్రశ్నించలేదు. ఎందుకంటే అప్పట్లో అధికారంలో ఉన్నది తన పార్ట్నర్ చంద్రబాబు కాబట్టి. తన అక్రమ ఆర్థిక సామ్రాజ్యానికి వెన్నుదన్నుగా ఉన్న చంద్రబాబు కాబట్టి. ప్రజలకు ఎంత నష్టం జరిగినా, రాష్ట్ర ప్రగతి దెబ్బతిన్నా సరే ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ, ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 99 శాతం మేనిఫెస్టోను అమలుచేసి.. ఆ విషయాన్ని నిజాయతీగా ప్రకటిస్తున్నా సరే రామోజీ తప్పుబడుతుండటం ఈనాడు ‘పచ్చ’కామెర్ల తత్వాన్ని బయటపెడుతోంది. ఆ పచ్చపైత్యం చంద్రబాబుకు కమ్మగా ఉంటుందేమోగానీ టీడీపీ కుట్రలను, ఈనాడు దుష్ప్రచారాన్ని రాష్ట్ర ప్రజలు తిప్పికొడుతున్నారు. ఇది నాలుగున్నరేళ్లుగా రుజువవుతూనే ఉంది. అర్హులందరికీ సంక్షేమం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉన్నామని తేల్చిచెబుతున్నారు. చంద్రబాబు, రామోజీ మద్యం బంధం వ్యాపార ప్రయోజనాల కోసం కుట్రపూరిత రాజకీయాలతో ప్రభుత్వ వ్యవస్థను భ్రష్టు పట్టించడంలో చంద్రబాబు, రామోజీరావు సిద్ధహస్తులు. వారి రాజకీయ బంధం మద్యంతో ముడిపడి ఉందన్నది బహిరంగ రహస్యం. 1989–94లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం.. అప్పట్లో తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసి మద్యానికి తలుపులు బార్లా తెరిచారు. అయినాసరే.. రామోజీరావు కిమ్మనకుండా మద్దతు తెలిపారు. ఎందుకంటే అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు నిజంగా ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్‌లో మద్యం విక్రయాల గురించి శ్రీరంగ నీతులు చెబుతుండటం విడ్డూరంగా లేదూ? అక్రమ మద్యంపై ఎస్ఈబీ ఉక్కుపాదం అలాగే, వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అక్రమ మద్యం, నాటుసారాపై ఉక్కుపాదం మోపుతోంది. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా సాగిన అక్రమ మద్యం, నాటుసారా దందాను సమర్థంగా కట్టడి చేస్తోంది. అందుకోసం ప్రత్యేకంగా ‘స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో (ఎస్ఈబీ)ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏర్పాటుచేయడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనం. ఎస్ఈబీ మూడు విధాలుగా అక్రమ మద్యం, నాటుసారాను అరికడుతోంది. అదెలాగంటే.. ► అక్రమ మద్యం, నాటుసారా తయారీ దశాబ్దాలుగా సాగుతున్న 147 గ్రామాలను గుర్తించి దాడులు నిర్వహిస్తోంది. ► గ్రామ వలంటీర్లు, వార్డు వలంటీర్లు, గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా కచ్చితమైన సమాచారాన్ని తెప్పించుకుని అక్రమ మద్యం దందాను అడ్డుకుంటోంది. ► ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం స్మగ్లింగ్‌ను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. ► అంతర్రాష్ట్ర సమన్వయ సమావేశాలు నిర్వహిస్తూ.. పొరుగు రాష్ట్రాలతో కలిసి దాడులు నిర్వహిస్తోంది. -
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మరోసారి కవిత పేరు..
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఈడీ మరోసారి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించింది. కవితకు సంబంధించిన వ్యక్తిగా స్కాంలో అరుణ్ పిళ్లై వ్యవహరించారని ఈడీ పేర్కొంది. ఈ కేసులో కవిత పాత్రపై సమగ్ర దర్యాప్తు వివరాలను కోర్టుకు ఈడీ సమర్పించింది. నాలుగవ సప్లమెంటరీ చార్జిషీట్లో 53 సార్లు కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. 278 పేజీల భారీ చార్జిషీట్లో అరుణ్ పిళ్లై, బుచ్చి బాబు సమీర్ మహేంద్ర కీలక స్టేట్మెంట్లలో కవిత పేరు ప్రస్తావనకు వచ్చింది. ఛార్జిషీట్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముందే కవిత, ఆప్ విజయ్ నాయర్ మధ్య చర్చలు జరిగాయి. ఆ తర్వాత మద్యం పాలసీ ఖరారు చేసినట్లు పేర్కొన్న ఈడీ.. కవిత కాల్ డేటా రికార్డును సాక్ష్యంగా సమర్పించింది. ‘‘ఏప్రిల్ 8, 2022న కవిత అరుణ్ పిళ్లైలు వంద కోట్ల ముడుపుల సొమ్మును తిరిగి ఎలా రాబట్టుకోవాలనే అంశంపై విజయ్ నాయర్ దినేష్ అరోరాతో ఢిల్లీలోని ఉబెరాయ్ హోటల్లో చర్చించారు. సౌత్ గ్రూపునకు అనుకూలమైన విధానం రూపకల్పన చేసి ముడుపులు అందుకున్నారు. సౌత్ గ్రూప్ నుంచి విజయనాయర్ 100 కోట్ల ముడుపులు అందుకున్నారు. పాలసీ అమల్లోకి వచ్చిన తర్వాత కవిత, సమీర్ మహేంద్ర ఫేస్ టైం లో మాట్లాడుకుని బిజినెస్ బాగుందని అభినందనలు తెలుపుకున్నారు. ఇండో స్పిరిట్ ఎల్ వన్ దరఖాస్తు ఆలస్యం కావడంపై సమీర్ మహేంద్రతో కవిత చర్చలు జరిపింది’’ అని ఈడీ పేర్కొంది. బ్రిండ్ కో యజమాని అమన్ దల్ తమకు వ్యతిరేకంగా ఫిర్యాదులు చేస్తున్నారని సమీర్ వెల్లడించగా, అలాంటి సమస్యలుంటే తాను క్లియర్ చేస్తానని కవిత చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. చదవండి: లిక్కర్ స్కాంలో సిసోడియాకు గట్టి దెబ్బ, ఆ వెంటనే.. ‘‘ఈ అంశంపై హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనిల్ కూడా పాల్గొన్నారు. తన తరఫున అరుణ్ వ్యాపారంలో ఉంటారని అవసరమైతే ఈ వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించాలని కవిత సూచించింది. తాను కవితను రెండుసార్లు కలిశానని, ముడుపులు తిరిగి రాబట్టుకునే అంశంపై చర్చించానని విజయ్ నాయర్ స్టేట్మెంట్ ఇచ్చారు. 11.11.2022న ఈడీ ముందు అరుణ్ పిళ్ళై కీలక సాక్ష్యం ఇచ్చారు. కవితకు ఆప్‌కు మధ్య 100 కోట్ల రూపాయల డీల్ కుదిరింది అని అరుణ్ పిళ్లై స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే ఇండో స్పిరిరిలో ఆమెకు వాటాలు ఉన్నాయి’’ అని ఈడీ పేర్కొంది. కవిత తరపున తాను భాగస్వామిగా పనిచేశానని అరుణ్ పిళ్ళై వెల్లడించారని, పెర్నార్డ్ రికార్డు బిజినెస్‌ను ఇండస్పిరిట్‌కు ఇప్పించి, అందులో 65 శాతం వాటాలు పొందారని, ఈ వ్యాపారంలో కవితే అసలైన ఇన్వెస్టర్ అని, కవితకు ఆప్‌కు మధ్య సంపూర్ణమైన అవగాహన కుదిరింది’’ అని ఈడీ తెలిపింది. -
మద్యం విధానంపై ఈనాడు తప్పుడు వార్త
-
రామోజీ మంటకు ‘మందు’ ఉందా?
సాక్షి, అమరావతి: కల్లు తాగిన కోతి వనమంతా చెరచినట్లుగా ఇతర రాష్ట్రాల్లో మద్యం కుంభకోణాలు బయటపడితే ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు కేసులు పెట్టరంటూ గగ్గోలు పెట్టడం రామోజీరావు మానసిక స్థితిపై సందేహాలను రేకెత్తిస్తోంది! నేరం జరిగిన చోట.. అభియోగాలు నమోదైన చోట కేసులు పెడతారుగానీ మీ కడుపుమంట తీరేందుకు కేసులు పెట్టాలంటే ఎలా? ఒకపక్క తాను చంకనెక్కించుకునే చంద్రబాబును ప్రజలు ప్రతిసారీ తిరస్కరిస్తున్నారు.. మరోపక్క చిట్‌ఫండ్స్ ముసుగులో నిర్మించుకున్న అక్రమ సౌథం పునాదులు కదిలిపోతుండటంతో తాగుబోతు కథనాలకు తెగబడ్డారని స్పష్టమవుతోంది! ఏమైనా పోలిక ఉందా? ఢిల్లీ, చత్తీస్‌గఢ్‌లో సీఐబీ, ఈడీ నమోదు చేసిన కేసులతో ఏపీకి ఎలాంటి సంబంధం లేదు. ఇంకా చెప్పాలంటే అసలు వాటి మద్యం విధానాలతో మన రాష్ట్రానికి పోలికే లేదు. ఢిల్లీలో మద్యం దుకాణాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు టెండర్లు నిర్వహించారు. అందులో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఏపీలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతంలో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేసింది. ధనార్జనకు దూరంగా ప్రభుత్వమే పరిమిత వేళల్లో ఆంక్షలతో వీటిని నిర్వహిస్తోంది. అలాంటప్పుడు అక్రమాలకు తావు లేదన్నది సుస్పష్టం. అయినప్పటికీ ఢిల్లీతో ముడిపెట్టాలని రామోజీ ప్రయత్నించడం బరి తెగింపు కాదా? ఇక ఛత్తీస్‌గఢ్‌లో మద్యం వ్యవహారాలపై ఈడీ నమోదు చేసిన కేసు వ్యవహారాలు పూర్తి భిన్నం. అక్కడ కొందరు నాయకులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం దుకాణాలను తమ గుప్పిట్లో పెట్టుకున్నారు. అనధికారికంగా తయారైన మద్యాన్ని విక్రయించడంతోపాటు డిస్టిలరీల నుంచి కొనుగోలు చేసే మద్యాన్ని ప్రభుత్వ గిడ్డంగులకు కాకుండా నేరుగా దుకాణాలకు సరఫరా చేస్తున్నారని అభియోగాలు నమోదయ్యాయి. ఇక్కడ అసలు అలాంటి పరిస్థితే లేదని అందరికీ తెలుసు. రాష్ట్రంలో మద్యం తయారు చేస్తున్న 20 డిస్టిలరీలన్నీ గతంలో చంద్రబాబు, అంతకు ముందు ప్రభుత్వాల హయాంలో అనుమతి ఇచ్చినవే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వకపోవడం గమనార్హం. నాడు మూడు డిస్టిలరీలకే 47.09 శాతం ఆర్డర్లు ► 74 శాతం మద్యం కొనుగోళ్లు 16 డిస్టిలరీలకే ఇచ్చారంటూ ఈనాడు గగ్గోలు పెట్టింది. వాస్తవం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నవే 20 డిస్టిలరీలు. వాటిలో 16 డిస్టిలరీలకు 74 శాతం ఆర్డర్లిచ్చారు. సగటున ఒక్కో డిస్టిలరీకి దాదాపు ఐదు శాతం ఇచ్చినట్లు. దీన్ని తప్పంటే ఎలా? మిగిలిన నాలుగు డిస్టిలరీలకు 26 శాతం ఆర్డర్లు వచ్చినట్లేగా? సగటున ఇది 6 శాతం కన్నా ఎక్కువే కదా?. మరి వీళ్లకు అన్యాయం జరిగినట్లా? ► చంద్రబాబు హయాంలో కేవలం 5 డిస్టిలరీల నుంచే 50 శాతం కన్నా ఎక్కువ మద్యం కొన్నారు. అంటే సగటున ఒక్కో డిస్టిలరీకీ 10 శాతం ఇచ్చారు. మిగిలిన 15 డిస్టిలరీలకూ కలిపి 50 శాతం. అంటే దాదాపుగా 3 శాతం. ఇదీ.. అసలు కథ! ► టీడీపీ హయాంలో 2017–18లో మొత్తం రూ.8,106 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లు ఇచ్చారు. వాటిలో ఐదు కంపెనీలకే ఏకంగా రూ.4,122.28 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చారు. ఇందులో పెర్ల్ డిస్టిలరీస్‌కు ఒక్కదానికే రూ.1,374.79 కోట్లు, పెర్నోడ్ రిచర్డ్ ఇండియా లిమిటెడ్‌కు రూ.548.03 కోట్లు, ఎస్వీయార్ డిస్టిలరీస్‌కు రూ.395.1 కోట్లు, అలైడ్ బ్లెండర్స్ డిస్టిలరీస్‌కు రూ.457.86 కోట్లు, ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్‌కు రూ.319.57 కోట్ల మద్యం ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఐదు కంపెనీలకు 50 శాతం కంటే ఎక్కువ ఆర్డర్లిచ్చారు. సగటున వీటికి 10 శాతం కంటే ఎక్కువే. ► చంద్రబాబు హయాంలో 2018–19లో మొత్తం రూ.4,765.75 కోట్ల విలువైన మద్యం ఆర్డర్లివ్వగా 3 డిస్టిలరీలకు ఏకంగా రూ.2,244.44 కోట్ల విలువైన ఆర్డర్లివ్వటం గమనార్హం. పెర్ల్ డిస్టిలరీస్‌కు రూ.1,462.41 కోట్లు, సెంటినీ బయో ప్రొడక్ట్స్‌కు రూ.638.52 కోట్లు, ఎస్పీవై ఆగ్రోప్రొడక్సŠట్‌కు రూ.143.51కోట్లు ఆర్డర్లు ఇచ్చారు. అంటే ఈ మూడు డిస్టిలరీలకు ఏకంగా 47.09 శాతం. ఒక్కోదానికీ 15 శాతం కంటే ఎక్కువే. దీన్ని ఏమంటారు రామోజీ? ‘అదాన్’ అంటూ వక్రభాష్యం... అదాన్ డిస్టిలరీ నుంచే ఎక్కువగా మద్యం కొనుగోలు చేస్తున్నారంటూ ఈనాడు కన్నీళ్లు కార్చింది. నిజమేంటంటే... అసలు అదాన్ డిస్టిలరీస్ అనేదే లేదు. దానికి ప్రభుత్వం ఎలాంటి ఆర్డరూ ఇవ్వలేదు. టీడీపీ సీనియర్‌నేత అయ్యన్నపాత్రుడి కుమారుడు, ఆయన భాగస్వాములు కలిసి విశాఖ డిస్టిలరీస్ ఏర్పాటు చేశారు. గతేడాది అయ్యన్న కుమారుడు ఆ సంస్థ నుంచి బయటికొచ్చేశారు. మిగతా భాగస్వాములు దాన్ని అదాన్ కంపెనీకి సబ్ లీజుకు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అదీ కథ. పైపెచ్చు ఈ కంపెనీకి అడ్డగోలుగా ఆర్డర్లు ఇచ్చేశారన్నది కూడా పచ్చి అబద్ధమే. వైఎస్సార్ సీపీ పాలనలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఇప్పటిదాకా రూ.17,570 కోట్ల విలువైన మద్యానికి ఆర్డర్లిస్తే అందులో విశాఖ డిస్టిలరీస్‌కు ఇచ్చింది రూ.1,164 కోట్లు. అంటే 6 శాతం. మొత్తం డిస్టిలరీలు 20 ఉన్నపుడు అందులో ఒక డిస్టిలరీకి 6 శాతం ఆర్డర్లిస్తే అది అడ్డగోలుగా ఇవ్వటం ఎలా అవుతుందో రామోజీరావే చెప్పాలి. మద్యం దందాకు చెక్ పడటంతో చంద్రబాబు హయాంలో యథేచ్చగా సాగిన మద్యం దందాకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడ్డుకట్ట వేసిందనే వాస్తవాన్ని ఈనాడు పత్రిక తట్టుకోలేకోతోంది. గతంలో మద్యం దుకాణాలన్నీ టీడీపీ నేతలు సిండికేట్ గుప్పిట్లో పెట్టుకుని దాదాపు 24 గంటలపాటు నిర్వహిస్తూ 25 శాతం అధిక ధరలకు విక్రయిస్తూ దోపిడీకి పాల్పడ్డారు. ఈ దందాకు రామోజీ వత్తాసు పలికేవారు. ఎందుకంటే బాబు – రామోజీ మధ్య ఉన్నది మద్యం బంధమే అన్న వాస్తవం బహిరంగ రహస్యం. 1989–94లో అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపడం, తమ పోటీ పత్రిక ‘ఉదయం’ ఆర్థిక మూలాలను దెబ్బతీసేందుకు రామోజీరావు సంపూర్ణ మద్య నిషేధం ఉద్యమాన్ని ప్రోత్సహించారు. ఎన్టీరామారావు అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. ఆ తర్వాత ఎన్టీరామారావుకు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు. వెంటనే రామోజీరావు ఏమాత్రం సిగ్గూఎగ్గూ లేకుండా ప్లేటు ఫిరాయించి సంపూర్ణ మద్య నిషేధం విధానానికి టాటా చెప్పారు. అంతే.. నిషేధాన్ని చంద్రబాబు ఎత్తేశారు. అప్పుడే రామోజీ ఫిల్మ్‌సిటీ నిర్మాణం చేపట్టారు. అందులోని స్టార్‌హోటళ్లలో మద్యం విక్రయాల కోసం రామోజీరావు ప్రజల రక్తమాంసాలతో వ్యాపారం చేశారు. నేడు సమర్థంగా మద్యం విధానం మద్యం మాఫియా అరాచకాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రాగానే ముగింపు పలికారు. ప్రైవేట్ మద్యం దుకాణాల విధానాన్ని రద్దు చేస్తూ తీసుకున్న ఒక్క విధాన నిర్ణయంతో విప్లవాత్మక సంస్కరణకు శ్రీకారం చుట్టారు. 2019 అక్టోబరు 1 నుంచి మద్యం దుకాణాలన్నీ ప్రభుత్వపరం చేశారు. మద్యం మాఫియాను తుడిచిపెట్టేశారు. దశలవారీగా నియంత్రించేందుకు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దుకాణాల వేళలు కుదింపు టీడీపీ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు విక్రయాలు సాగించేవి. అనధికారికంగా 24 గంటలూ విక్రయిస్తూ ఉండేవి. ఇప్పుడు సమయాన్ని కుదించి కచ్చితంగా అమలు చేస్తున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 9 గంటల వరకే విక్రయాలను అనుమతించారు. బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లు రద్దు చంద్రబాబు హయాంలో ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుబంధంగా 43 వేల బెల్ట్ దుకాణాలు ఉండేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే బెల్ట్ దుకాణాలను పూర్తిగా తొలగించింది. గతంలో మద్యం దుకాణాలకు అనుబంధంగా పర్మిట్ రూమ్‌లను అనుమతించారు. అవి అనధికారికంగా బార్లగా చలామణి అయ్యేవి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే ఇవీ రద్దయ్యాయి. దుకాణాలు కుదింపు టీడీపీ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా ఇప్పుడు 2,934కి తగ్గిపోయాయి. ఈ సంఖ్యను ఇంకా తగ్గించే ఉద్దేశంలో ప్రభుత్వం ఉంది. ఇక బార్ల సంఖ్యను పెంచలేదు. 2019లో ఖరారు చేసిన 840 బార్లే ఉన్నాయి. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు. భారీగా తగ్గిన అమ్మకాలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. రాష్ట్రంలో మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం మద్యం విక్రయాలు సగానికి పడిపోయాయి. అందుకు గణాంకాలే తార్కాణం. షాక్ కొట్టేలా ధరలు.. మద్యం విక్రయాలను నిరుత్సాహపర్చడమే తమ పార్టీ విధానమని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల చాలాసార్లు స్పష్టంగా చెప్పారు. విక్రయాలను ప్రోత్సహించి సొమ్ము చేసుకోవడం తమ లక్ష్యం కాదని స్పష్టంచేశారు. అందుకే అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను షాక్ కొట్టేలా పెంచారు. అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ (ఏఆర్ఈటీ) పన్నునూ విధించారు. దీంతో మద్యం ధరలు పెరిగాయి. మద్యపాన వ్యసనాన్ని నిరుత్సాహ పరిచేందుకు విధించిన ఏఆర్ఈటీ పన్నుతో రాబడి పెరుగుతున్నట్లు కనిపిస్తున్నా వాస్తవానికి మద్యం విక్రయాలు గణనీయంగా తగ్గాయి. పేదలు ఈ వ్యసనానికి క్రమంగా దూరమవుతున్నారు. తగ్గిన విక్రయాలు కనపడలేదా? మద్యం ద్వారా ఆదాయం పెరిగింది కాబట్టి మద్యం ఏరులైపారుతోందంటూ ఈనాడు ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తోంది. వాస్తవం ఏమిటంటే... పేదలకు అందుబాటులోలేకుండా చేసేందుకు మద్యం ధరలు పెంచడంతోనే ఆదాయం పెరిగినట్టు కనిపిస్తోంది. మద్యం విక్రయాల పరిమాణం మాత్రం గణనీయంగా తగ్గింది. చంద్రబాబు సీఎంగా ఉండగా 2018– 19లో రాష్ట్రంలో 384.31 లక్షల మద్యం కేసులు, 277.1 లక్షల బీర్ కేసులు విక్రయాలు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 2019–20లో మద్యం కేసులు 308.49 లక్షలు, బీరు కేసులు 212.91లక్షల కేసులే విక్రయించారు. 2020–21లో అయితే మద్యం కేసులు 187.55 లక్షలు, బీరు కేసులు 56.97 లక్షలతో విక్రయాలు తగ్గిపోయాయి. ఇక 2021–22లో మద్యం కేసులు 266.08 లక్షలు, బీరు కేసులు 81.67 లక్షలు విక్రయాలు జరిగాయి. 2022–23లో మద్యం కేసులు 335.98 లక్షలు, బీరు కేసులు 116.76 లక్షల కేసులే విక్రయించారు. మరి ఎలా చూసినా గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే విక్రయాలు తగ్గిపోవడం ఈనాడుకు కనపడకపోవటాన్ని ఏమనుకోవాలి? -
అధికారంతో విషమెక్కావ్.. కేజ్రీవాల్‌పై అన్నాహజారే ఆగ్రహం
రాలేగావున్/ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై ప్రముఖ గాంధేయవాది ఉద్యమకారుడు అన్నా హజారే.. ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ విధానం వివాదంలో నిలవడంతో పాటు ఆప్ సర్కార్ విమర్శలు.. దర్యాప్తు సంస్థల విచారణను సైతం ఎదుర్కొంటోంది. ఈ పరిస్థితుల్లో తన మాజీ శిష్యుడైన కేజ్రీవాల్‌పై అన్నా హజారే బహిరంగ లేఖ ద్వారా విమర్శలు గుప్పించారు. ‘‘ముఖ్యమంత్రి అయ్యాక నీకు(కేజ్రీవాల్‌ను ఉద్దేశించి..) నేను ఒక లేఖ రాయడం ఇదే మొదటిసారి. లిక్కర్ పాలసీ విషయంలో ప్రభుత్వానికి సంబంధించిన వార్తలు నన్ను ఎంతగానో బాధించాయి. ఆప్ మేనిఫెస్టో స్వరాజ్‌కు పరిచయం నాతోనే రాయించావు. అందులో మద్యంవిధానాల విషయంలో నిజాయితీగా వ్యవహరిస్తానని చెప్పావ్. నివాస ప్రాంతాల్లో స్థానికుల మద్దతు లేకుండా లిక్కర్ షాపులు తెరవనని స్వరాజ్‌లో పేర్కొన్నావ్. మరి ముఖ్యమంత్రి అయ్యాక ఆ ఆదర్శాలను ఎలా మరిచిపోయావ్?.. నువ్వు, మనీశ్ సిసోడియా, అంతా కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించారు. కానీ, ఇప్పుడు మిగతా పార్టీలకు మీకు తేడా ఏం లేకుండా పోయింది అని ఆయన లేఖలో మండిపడ్డారు. నేను సూచించినట్లుగా.. మనం ఒక గ్రూప్‌గా ఉండి.. అవగాహన డ్రైవ్ చేపట్టి ఉంటే.. భారతదేశంలో ఎక్కడా ఇలాంటి తప్పుడు మద్యం పాలసీ ఏర్పడి ఉండేది కాదేమో. అయినా బలమైన లోక్‌పాల్, అవినీతి వ్యతిరేక చట్టాలకు బదులు.. లిక్కర్ పాలసీని తీసుకొచ్చే యత్నం చేశావ్. పైగా అది పూర్తి ప్రజా.. ప్రత్యేకించి మహిళా వ్యతిరేక నిర్ణయం అంటూ.. లేఖలో ఆగ్రహం వెల్లగక్కారు హజారే. మద్యంలాగే అధికారం కూడా మత్తెక్కిస్తుంది. అధికారం అనే మత్తుతో మీరు (కేజ్రీవాల్‌ను ఉద్దేశించి) విషమెక్కి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఢిల్లీ నగరం నలుమూలలా మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నా.. అధికారం కోసం డబ్బు, డబ్బు కోసం అధికారం అనే వలయంలో ప్రజలు ఇరుక్కున్నట్లుగా కనిపిస్తోంది. ఒక పెద్ద ఉద్యమం నుండి ఉద్భవించిన పార్టీకి ఇది సరికాదు అంటూ ఆప్ కన్వీనర్‌పై తీవ్ర స్థాయిలో లేఖలో మండిపడ్డారు హజారే. తన స్వస్థలం రాలేగావున్లో, స్వరాష్ట్రం మహారాష్ట్రలో మద్యం పాలసీలు ఆదర్శవంతంగా ఉన్నాయంటూ లేఖలో కితాబిచ్చారాయన. ఇదీ చదవండి: నాకు క్లీన్ చిట్ దొరికిందోచ్! -
లిక్కర్ స్కామ్ ప్రకంపనలు.. అసలేంటీ కథ?
ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం ప్రకంపనలు తెలంగాణను కుదిపేస్తున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈ స్కాంతో సంబంధాలున్నాయన్న బీజేపీ ఎంపీ ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. అసలు ఏంటీ ఢిల్లీ కొత్త మద్యం విధానం..? దీనివల్ల ఖజనాకు ఏం నష్టం జరిగింది..? సీబీఐ ఆరోపణలేంటి..? దేశ రాజధానిలో మద్యం అమ్మే దుకాణాలను ఢిల్లీ ప్రభుత్వమే నిర్వహిస్తుంది. అయితే 2021 జూన్‌లో లిక్కర్ షాపుల ప్రైవేటీకరణకు కేజ్రీవాల్ సర్కార్ తెర తీసింది. మొత్తం ఢిల్లీని 32 జోన్లుగా విభజించి.. ఒక్కో జోన్లో 27 లిక్కర్ వెండ్స్ ఉండేలా నిబంధనలు రూపొందించింది. దీనిద్వారా ఖజానాకు రూ.9,500 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఆప్ ప్రభుత్వం.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పంపిన నివేదికలో పేర్కొంది . అప్పట్లో ఢిల్లీ ఎల్జీగా ఉన్న అనిల్ బైజల్.. నూతన ఎక్సైజ్ పాలసీని ఆమోదిస్తూనే రెండు నిబంధనలు పెట్టారు. ప్రస్తుతం ఏవైతే మద్యం షాపులు ఉన్నాయో వాటి స్థానంలో ప్రైవేట్ వ్యక్తులకి లైసెన్సులు ఇవ్వొచ్చు. అయితే దుకాణాలు లేనిచోట మాత్రం.. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ, ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అనుమతి తీసుకోవాలి. అయితే డీడీఏ, ఎమ్సీడీల నుంచి పర్మిషన్ తప్పనిసరి నిబంధనను కేజ్రీవాల్ ప్రభుత్వం ఉల్లంఘించింది. ఎమ్‌ఆర్‌పీలతో సంబంధం లేకుండా ఇష్టారీతిన ధరలు నిర్ణయించుకునేందుకు లైసెన్స్‌దారులకు అధికారం ఇవ్వడం, తెల్లవారుజామున 3 గంటల వరకూ షాపులు నడుపుకునేందుకు అనుమతితో పాటు డ్రై డేలను 21రోజుల నుంచి 3 రోజులకు తగ్గించడం వంటివి చేసింది. 2021 నవంబర్‌లో ఢిల్లీలో కొత్త లిక్కర్ పాలసీ అమల్లోకి వచ్చింది. అయితే దీంట్లో అనేక అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. మద్యం షాపుల కోసం టెండర్లు వేసినవారికి లైసెన్స్ ఫీజ్‌లో రాయితీలు ఇచ్చినట్టు, కొందరికి పూర్తిగా లైసెన్స్ ఫీజ్ మాఫీ చేసినట్టు తన నివేదికలో పేర్కొన్నారు చీఫ్ సెక్రటరీ. కొవిడ్ టైమ్‌లో మద్యం అమ్మకాలు లేకపోవడంతో రూ.144 కోట్ల ఫీజును మాఫీ చేసింది కేజ్రీవాల్ ప్రభుత్వం. అంతేకాదు, విదేశీ బీరు విచ్చలవిడిగా ప్రవేశించడానికి వీలుగా కంపెనీలకు ఒక్కో కేసుకు 50 చొప్పున రాయితీ కూడా ఇచ్చినట్టు సీఎస్ తన నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగానే లెఫ్ట్‌నెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణంపై సీబీఐ విచారణకు సిఫార్సు చేశారు. ఢిల్లీ విద్యాశాఖతోపాటు ఎక్సైజ్‌శాఖ మంత్రిగా ఉన్న మనీశ్ సిసోడియాను ఈ కుంభకోణంలో ప్రధాన నిందితుడిగా సీబీఐ పేర్కొంది. ఆయనతోపాటు అప్పటి ఎక్సైజ్ కమిషనర్ ఆరవ గోపీకృష్ణ, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ ఏకే తివారీ, అసిస్టెంట్ ఎక్సైజ్ కమిషనర్ పంకజ్ భట్నాగర్‌లతోపాటు మరో 9 మంది వ్యాపారవేత్తలని నిందితులుగా ఎఫ్ఐఆర్లో చేర్చింది. ఐపీసీ సెక్షన్ 120-బి, 477ఏ, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7 కింద సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. మద్యం విధానంలో క్విడ్‌ప్రోకో జరిగిందని ఆరోపించింది. ఎక్సైజ్ అధికారులు, రాజకీయనేతలకు కోట్ల రూపాయల ముడుపులు అందినట్టు పేర్కొంది. సిసోడియాకు కుడిభుజమైన దినేశ్ అరోరా అనే వ్యక్తికి చెందిన రాధా ఇండస్ట్రీస్ ఖాతాలకు కోటి రూపాయలు ముడుపులు అందినట్టు సాక్ష్యాలతో బయటపెట్టింది సీబీఐ. అయితే కేజ్రీవాల్, సిసోడియా మాత్రం ఇవన్నీ అసత్యాలే అంటున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర అంటూ ఎదురుదాడి చేస్తున్నారు. -
‘ఈ జిమ్మిక్కులు ఏమిటి.. మోదీ జీ?’.. ప్రధానిపై మనీశ్ సిసోడియా విమర్శలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా. ఢిల్లీ లిక్కర్ పాలసీలో అవకతవకలపై దర్యాప్తు జరుగుతున్న వేళ విదేశీ ప్రయాణాలు చేపట్టకుండా లుక్ఔట్ నోటీసులు జారీ చేయటాన్ని తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘ మీరు చేయించిన దాడులు పూర్తిగా విఫలమయ్యాయి. ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఇప్పుడు నాకు మీరు లుక్ఔట్ నోటీసులు ఇచ్చారు. ఈ జిమ్మిక్కులు ఏమిటి మోదీ జీ? నేను ఢిల్లీలోనే ఉన్నాను. నేను ఎక్కడికి రావాలో దయచేసి చెప్పండి.’ అని పేర్కొన్నారు సిసోడియా. భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీలు దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని ఆరోపించారు సిసోడియా. విద్యా, ఆరోగ్య రంగంలో మంచి పనితీరు కనబరుస్తూ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారుతున్న ఆమ్ ఆద్మీ పార్టీపై ఏజెన్సీలను ఉపయోగించి బెదిరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. హైకమాండ్ ఆదేశాల మేరకే సీబీఐ అధికారులు తన నివాసంలో సోదాలు చేశారన్నారు. రానున్న 2024 సాదారణ ఎన్నికల్లో భాజపాకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాన ప్రత్యర్థిగా మారుతున్నారనే కారణంగా ఆయనని అడ్డుకోవాలని చూస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు.. విదేశాలకు వెళ్లకుండా మనీశ్ సిసోడియాకు లుక్ఔట్ సర్క్యూలర్ జారీ చేసినట్లు వస్తున్న వార్తలను సీబీఐ వర్గాలు ఖండించాయి. ఇదీ చదవండి: లిక్కర్ కుంభకోణంలో అసలు సూత్రధారి కేజ్రీవాల్: కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ ధ్వజం -
Delhi Liquor Policy: ఎల్జీ దెబ్బకు వెనక్కి తగ్గిన కేజ్రీవాల్!
న్యూఢిల్లీ: లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా దెబ్బకు ఢిల్లీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొత్త ఎక్సైజ్ పాలసీ అమలుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరిన నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. కొత్త మద్యం పాలసీని పక్కన పెట్టి పాత విధానాన్నే అమలు చేయాలని నిర్ణయించారు. 2022-23 కొత్త మద్యం పాలసీపై ప్రభుత్వం ఇంకా చర్చలు కొనసాగిస్తున్న నేపథ్యంలో మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 2022-23 ముసాయిదా ఎక్సైజ్ పాలసీని ఇంకా లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమోదానికి పంపించలేదు. అయితే.. ఇప్పటికే 2021-22 ఎక్సైజ్ పాలసీని మార్చి 31 తర్వాత రెండు సార్లు పొడిగించింది ఢిల్లీ ప్రభుత్వం. అది జులై 31తో ముగియనుంది. తాజాగా తీసుకొచ్చే కొత్త పాలసీలో లిక్కర్ హోమ్ డెలివరీ వంటీ కీలక మార్పులను ప్రతిపాదించింది ఆబ్కారీ శాఖ. ఈ విషయంపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా శనివారం మాట్లాడే అవకాశం ఉంది. మరోవైపు.. కొత్త పాలసీ అమలులోకి వచ్చే వరకు మరో ఆరు నెలల పాటు పాత విధానాన్ని అమలులో ఉంచాలని గత గురువారమే సిసోడియా ఆదేశించినట్లు సమాచారం. మరోవైపు.. 2021, నవంబర్ 17న అమలులోకి వచ్చిన ఎక్సైజ్ పాలసీకి ముందు ప్రభుత్వ ఆధ్వర్యంలోని నాలుగు కార్పొరేషన్లు నిర్వహించిన లిక్కర్ లావాదేవీల వివరాలు ఇవ్వాలని ఆర్థిక శాఖ ఆదేశించినట్లు తెలిసింది. ఈ నాలుగు కార్పొరేషన్లు నగరంలో మొత్తం 475 లిక్కర్ దుకాణాలను నడుపుతున్నాయి. ఇదీ చదవండి: కొత్త మద్యం పాలసీలో ప్రస్తుతం జోక్యం చేసుకోలేం -
చంద్రన్న కానుకలే ఈ చీప్ లిక్కర్ బ్రాండ్లు: సీఎం జగన్
సాక్షి, అమరావతి: చంద్రబాబు ఇంటి పేరు నారా బదులు సారా అని పెడితే బాగుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం మద్యం పాలసీపై అసెంబ్లీ సమావేశాల్లో స్వల్పకాలిక చర్చ సందర్భంగా.. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం జరుగుతోందని సీఎం జగన్ వివరించారు. రాష్ట్రంలో 20 డిస్టిలరీలకుగానూ 14 డిస్టీలరీలకు అనుమతి ఇచ్చిన పాపం చంద్రబాబుదేనని, 2019 తర్వాత ఒక్క డిస్టిలరీకి గానీ, ఒక్క బ్రూవరీకిగాని తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదని సీఎం జగన్ గుర్తు చేశారు. ‘‘నవరత్నాలు, అమ్మ ఒడి.. ఇవీ మా ప్రభుత్వ బ్రాండ్లు. ప్రెసిడెంట్ మెడల్, గవర్నర్ ఛాయిస్ భూంభూం బీర్, పవర్ స్టార్ 999, 999 లెజెండ్.. బ్రాండ్లన్నీ చంద్రన్న కానుకలే. ఇవన్నీ చంద్రబాబు ఆశీస్సులతో వచ్చిన బ్రాండ్లే. ప్రెసిడెంట్ మెడల్ బ్రాండ్.. చంద్రబాబు మెడల్ బ్రాండ్. గవర్నర్ ఛాయిస్ 2018, నవంబర్ 5న అనుమతి ఇచ్చింది చంద్రబాబే. ఆయన దిగిపోయే చివరి క్షణం వరకు లిక్కర్ బ్రాండ్లకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. చంద్రబాబు హయాంలోనే 254 బ్రాండ్లు వచ్చాయి. ఇవన్నీ ఆయన ట్రేడ్ మార్క్ బ్రాండ్లు. కానీ, ఈ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారు. స్పెషల్ స్టేటస్, త్రీ క్యాపిటల్ అంటూ తప్పుడు లేబుల్స్‌తో ప్రచారం చేసిన ఘనత కూడా టీడీపీ నేతలదేనని సీఎం జగన్ అన్నారు. ‘‘2019 తర్వాత మా ప్రభుత్వం ఒక్క బ్రాండ్‌కు కూడా అనుమతి ఇవ్వలేదు. మేం అమ్మే బ్రాండ్లన్నీ లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచి వచ్చినవే. మనిషి పరంగా చంద్రబాబు, పార్టీపరంగా టీడీపీ , మరో వైపు ఎల్లో మీడియా ఇవే అసలు సిసలైన చీప్ బ్రాండ్స్. ఏ షాపు నుంచి తీసుకొచ్చారో ఆధారాలు లేకుండా శాంపిల్స్ టెస్టింగ్‌కు ఇచ్చారు. ఇక్కడ శాంపిల్స్‌లో ట్యాంపరింగ్ కూడా చేసి ఉండొచ్చు కదా. వారు ఇచ్చిన లైసెన్స్డ్ డిస్టిలరీస్ నుంచే మద్యం విక్రయిస్తున్నాం. అప్పుడు అది విషంగా ఎలా మారుతుంది?’’ అని ప్రశ్నించారు సీఎం జగన్. మా ప్రభుత్వం 16 మెడికల్ కాలేజీలకు అనుమతిస్తే.. డిస్టిలరీలకు అనుమతి ఇచ్చిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, జంగారెడ్డిగూడెం మరణాలపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, సహజ మరణాలను కల్తీ సారా మరణాలుగా చంద్రబాబు చిత్రీకరిస్తున్నారంటూ సీఎం జగన్ ఆక్షేపించారు. టీడీపీ నేతలవి క్రిమినల్ బ్రెయిన్స్ అని, వాళ్లందరినీ జూలో పెట్టడమే కరెక్ట్ అంటూ సీఎం జగన్ చమత్కరించారు. పీఎంకే డిస్టిలరీస్ యనమల వియ్యంకుడిది కాదా?, శ్రీకృష్ణ డిస్టిలరీస్ ఆదికేశవులనాయుడిది కాదా? విశాల డిస్టిలరీస్ ఎవరిది? అయ్యన పాత్రుడిది కాదా? అని సీఎం జగన్.. సభాముఖంగా నిలదీశారు. -
ఈ నెల 14 నుంచి అన్నా హజారే నిరాహారదీక్ష
పుణే: మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఈ నెల 14 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సంస్కర్త అన్నా హజారే ప్రకటించారు. సూపర్మార్కెట్లు, కిరాణా కొట్లలో వైన్ అమ్మకాలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీన్ని వ్యతిరేకిస్తున్న అన్నాహజారే ఈ విషయమై ముఖ్యమంత్రి ఉద్దవ్‌కు లేఖ రాశారు. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రాష్ట్రప్రజలు కోరుతున్నారని ఆయన లేఖలో వివరించారు. ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించుకోకుంటే స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో 14 నుంచి నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు. -
తెలంగాణ మద్యం పాలసీలో మార్పులు ఇవే.. జీవో విడుదల
సాక్షి, హైదరాబాద్: రానున్న రెండేళ్లకు గాను మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. 2021–23 సంవత్సరాలకు వైన్ (ఏ4) షాపుల కేటాయింపు నిబంధనలతో సీఎస్ సోమేశ్‌కుమార్ శనివారం జీవో ఎంఎస్ నం.98 విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 1 నుంచి వచ్చే 2023 నవంబర్ 30 వరకు ఈ పాలసీ వర్తిస్తుంది. గత రెండేళ్ల కాలా నికి (2019–21) ఇచ్చిన నోటిఫికేషన్లో స్వల్ప మార్పులు చేస్తూ ఈ నిబంధనలు రూపొందించారు. మద్యం దుకాణాల కోసం టెండర్ దరఖాస్తు ఫీజును గతంలోలాగే రూ.2 లక్షలుగా నిర్ధారించగా, ఎక్సైజ్ ఫీజును కూడా పాత స్లాబుల్లోనే కొనసాగించారు. అయితే ఫీజు చెల్లింపు వాయిదాల పెంపు, బ్యాంకు గ్యారెంటీ చూపించాల్సిన మొత్తం తగ్గింపు, టర్నోవర్‌పై రిటైల్ వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ పెంపు లాంటి నిర్ణయాలతో ఈసారి కొత్త మద్యం పాలసీ విడుదల చేశారు. ఏ4 షాపుల కేటాయింపు నిబంధనలివే.. మద్యం షాపుల టెండర్లో పాల్గొనే దరఖాస్తు ఫీజును గత పాలసీలో ఉన్నట్లే రూ.2 లక్షలు ఖరారు చేశారు. టెండర్లో షాప్ రాకుంటే ఈ ఫీజు ప్రభుత్వానికి జమ అవుతుంది. ఎక్సైజ్ ఫీజును కూడా జనాభా ఆధారంగా పాత పాలసీలో ఉన్న స్లాబులుగానే నిర్ధారిస్తారు. ఫీజులో ఎలాంటి మార్పు ఉండదు. ఈ ఫీజును గతంలో ఏడాదికి నాలుగు సార్లు చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వాయిదా సంఖ్యను ఆరుకు పెంచారు. ఈ ఫీజు మొత్తంలో 25 శాతానికి బ్యాంకు గ్యారెంటీ ఇస్తే సరిపోతుంది. గతంలో మాదిరిగానే ధరావతు (ఈఎండీ) చెల్లించాల్సిన అవసరం లేదు. లైసెన్సు లభించిన షాపు నుంచి నిర్ధారిత కోటా కన్నా ఏడు రెట్లు దాటితే గతంలో మార్జిన్ 6.4 శాతం ఉండేది. ఇప్పుడు ఆ కోటాను 10 రెట్ల వరకు 27 శాతంగా పెంచారు. కొన్ని మద్యం బ్రాండ్లపై 20 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు. 10 రెట్ల టర్నోవర్ తర్వాత కూడా వ్యాపారులకు 10 శాతం మార్జిన్ ఇవ్వనున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా మొత్తం షాపులో 15 శాతం గౌడ, 10 శాతం ఎస్సీ, 5 శాతం ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్ ఇవ్వనున్నారు. ఆయా వర్గాలకు కేటాయించిన షాపులను జిల్లాలు యూనిట్‌గా ఆ జిల్లాలో సదరు సామాజికవర్గ జనాభాను రాష్ట్రంలోని ఆ సామాజికవర్గ జనాభాతో పోల్చి కేటాయిస్తారు. అది కూడా జిల్లా కలెక్టర్లు డ్రా పద్ధతిలో నిర్ధారిస్తారు. మద్యం దుకాణాల కోసం వచ్చిన దరఖాస్తుల నుంచి జిల్లా కలెక్టర్లు లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తారు. రిటైల్ షాపు ఎక్సైజ్ ట్యాక్స్ (షాపు ఫీజు)ను గతంలో ఉన్న స్లాబుల ప్రకారమే నిర్ణయించారు. అయితే, జీహెచ్ఎంసీ పరిధిలోని షాపులకు వర్తించే స్లాబును జీహెచ్ఎంసీకి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండే షాపులకు, ఇతర కార్పొరేషన్లకు వర్తించే స్లాబులను కూడా ఐదు కిలోమీటర్ల పరిధిలోని షాపులకు వర్తింపజేస్తారు. మున్సిపాలిటీలకు వర్తించే స్లాబును ఆయా మున్సిపాలిటీలకు 2 కిలోమీటర్ల దూరంలోని షాపులకు వర్తింపజేయనున్నారు. పర్మిట్రూం కోసం అదనంగా ఏడాదికి రూ.5 లక్షలు చెల్లించాలి. వాకిన్ స్టోర్ కావాలంటే మరో రూ.5 లక్షలు అదనంగా చెల్లించాలి. జీహెచ్ఎంసీ, పరిసర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాల్లోని షాపులు ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు విక్రయాలు జరుపుకోవచ్చు. మద్యం బాటిల్ లేబుల్‌పై ఉన్న ధరకు మాత్రమే విక్రయించాల్సి ఉంటుంది. ప్రతి షాపులో మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. దరఖాస్తు ప్రక్రియ ద్వారా కేటాయించిన దుకాణాలకు మళ్లీ టెండర్లు పిలవాలా లేక అవుట్లెట్లను ఏర్పాటు చేయాలా అనే అధికారాలను ఎక్సైజ్ కమిషనర్‌కు కట్టబెట్టారు. పెంచుదామా.. వద్దా? రాష్ట్రంలో అదనంగా కొత్త షాపులను నోటిఫై చేద్దామా వద్దా అన్న దానిపై ఆబ్కారీ శాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 2,216 (ఏ4) వైన్‌షాపులకు అనుమతి ఉంది. ఈ షాపుల సంఖ్యను రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెంచలేదు. ఈసారి రిజర్వేషన్లను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో షాపుల సంఖ్య పెంచే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. భారీగా అమ్మకాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ షాపులు పెంచుదామనే కసరత్తు జరుగుతోంది. అయితే మరో 350 దుకాణాలా? 220 దుకాణాలా లేదా అసలే పెంచకుండా పాత షాపులనే నోటిఫై చేద్దామా అన్న దానిపై తుది నిర్ణయం తీసుకోలేదని సమాచారం. ఇప్పటికే రాష్ట్రంలోని బార్‌షాపులు నష్టాల్లో నడుస్తున్నాయన్న చర్చ నేపథ్యంలో వైన్‌షాపులు పెంచితే బార్లు ఆర్థికంగా మరింత దెబ్బతింటాయని ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అయితే, ప్రభుత్వం శనివారం ఇచ్చిన నోటిఫికేషన్లో షాపుల సంఖ్య ప్రస్తావన లేదు. దరఖాస్తు షెడ్యూల్ విడుదల సమయంలో ఈ సంఖ్యను స్పష్టం చేస్తారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ కూడా నేడో, రేపో వెలువడుతుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈనెల 9 నుంచి 18 వరకు దరఖాస్తులు స్వీకరించి 20న డ్రాలు తీసి, అదే రోజున ప్రొవిజనల్ లైసెన్సులు ఇస్తారు. కొత్త షాపులు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. ఎక్సైజ్ ఫీజు స్లాబులివే: జనాభా ఎక్సైజ్ ఫీజు (సంవత్సరానికి లక్షల రూపాయల్లో) 5 వేల వరకు 50 5 వేల నుంచి 50 వేల వరకు 55 50 వేల నుంచి లక్ష వరకు 60 లక్ష నుంచి 5లక్షల వరకు 65 5 నుంచి 20లక్షల వరకు 85 20 లక్షల కంటే ఎక్కువ 110 -
మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్
సాక్షి, అమరావతి: ఈ నెలాఖరుతో మద్యం పాలసీ ముగుస్తున్నందున ప్రస్తుతమున్న 2,934 ప్రభుత్వ మద్యం దుకాణాలకు ఏడాది పాటు లైసెన్సు రెన్యువల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అదే సమయంలో మద్యపానంతో కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ శుక్రవారం జీవో జారీ చేశారు. గతేడాది అక్టోబర్ 1న ప్రకటించిన పాలసీలో ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రభుత్వమే రిటైల్ మద్యం దుకాణాలను నిర్వహించేలా ఏడాదికి లైసెన్సు జారీ చేశారు. అప్పట్లో ఉన్న 4,380 షాపులను 33 శాతం తగ్గించడంతో ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలో 2,934 షాపులు నడుస్తున్నాయి. వీటికి వచ్చే ఏడాది సెప్టెంబర్ నెలాఖరు వరకు లైసెన్సులను జారీ చేస్తారు. ► 2,934 షాపులను మాత్రమే నిర్వహించాలి. ఈ సంఖ్య పెరగకుండా వాక్ ఇన్ షాపులు (ఎలైట్ షాపులు) ఏర్పాటుకు అనుమతించింది. ► జాతీయ రహదారుల వెంబడి మద్యం అమ్మకాలపై సుప్రీంకోర్టు నిబంధనలు గట్టిగా అమలుపరచాలి. తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి వరకు, వయా ఆర్టీసీ బస్టాండ్, లీలామహల్ సర్కిల్, నంది సర్కిల్, విష్ణు నివాసం, శ్రీనివాసం, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్వీఆర్ఆర్ ఆస్పత్రి, స్విమ్స్ ఆస్పత్రి వరకు మద్యం షాపులకు అనుమతి లేదు. ► ఏపీఎస్‌బీసీఎల్ ఆధ్వర్యంలో ఈ మద్యం షాపులు నడుస్తాయి. మద్యం షాపుల్లో ట్రాక్ అండ్ ట్రేస్ విధానం అమలయ్యేలా చూడాలి. దీనివల్ల అవకతవకలు జరగడానికి అవకాశం ఉండదు. -
‘తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారు’
సాక్షి, తాడేపల్లి : అధికారం పోవడంతో టీడీపీ నేతలు పిచ్చెక్కి మాట్లాడుతున్నారని ఏపీఐఐసీ ఛైర్మన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. కల్లు తాగిన కోతుల్లా టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే రోజా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తమకు నచ్చిన బ్రాండ్స్ లేవని టీడీపీ నేతలు మాట్లాడడం సిగ్గు చేటని, ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు తాగుబోతుల సంఘం అధ్యక్షుడిలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేతో శాసనసభలో మద్యం బ్రాండ్స్ గురించి మాట్లాడించిన ఘనత బాబుకే దక్కుతుందన్నారు. మద్యం ధరలు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినట్లు టీడీపీ నేతలు భాధపడుతున్నారన్నారని ఎద్దేవాచేశారు. టీడీపీ హాయాంలో ఒక్క బెల్ట్ షాపు అయినా తగ్గించారా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 20 శాతం షాపులను తగ్గించారని వివరించారు. బోండా ఉమ లిక్కర్ షాప్‌లో వర్కర్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ కార్యాలయాలను లోకేష్ మద్యం దుకాణాలుగా మార్చారన్నారు. నారా వారు మద్యాన్ని ఏరులై పారించారన్నారు. మహిళల తాళి బొట్లు తెగేలా చంద్రబాబు మద్యం షాపులు పెంచారని మండిపడ్డారు. బీరును హెల్త్ డ్రింక్ అని గతంలో టీడీపీ నేత జవహర్ పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇక సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థకు సెల్యూట్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. కేవలం ఒక రోజులోనే దాదాపు 60 లక్షల మందికి పింఛన్లు పంపిణీ చేశారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు టీడీపీకి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ప్రజల కోసం పనిచేస్తున్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అధికారుల మీద దాడులు చేయడం టీడీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కేశినేని నానిపై బుద్ద వెంకన్న బహిరంగంగానే దాడులు చేశరని, అంతేకాకుండా వనజాక్షి జుత్తు పట్టుకొని చింతమనేని కొట్టిన విషయాన్ని ఎమ్మెల్యే ఆర్కే రోజా గుర్తుచేశారు. చదవండి: నెల రోజుల్లో ఎన్నికలను పూర్తి చేయాలి కరోనా అలర్ట్: ‘మాస్కులకు ఆర్డర్లు ఇస్తే మంచిది’ -
అక్రమ ఇసుక, మద్యంపై ఫిర్యాదులకు టోల్‌ఫ్రీ నంబర్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఇసుక, మద్యం పాలసీల అమలుతీరుపై ప్రజల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ఫ్రీ నెంబరు ఖరారయ్యింది. ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు.. మద్యం అక్రమ విక్రయాలపై ఫిర్యాదులకు ‘14500’ నెంబర్‌ను కేంద్ర టెలికం శాఖ కేటాయించింది. దీంతో దీనిని టోల్‌ఫ్రీ నంబరుగా ఉపయోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తగు ఏర్పాట్లుచేసిన తర్వాత ఈ నంబర్‌ను పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని.. ఆ సమాచారం త్వరలో ప్రకటిస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. -
ఎక్సైజ్‌కు రూ.34 కోట్ల ఆదాయం
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ ఎక్సైజ్ సర్కిల్‌కు పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరింది. ప్రతి రెండేళ్లకు నిర్వహించే మద్యం దుకాణాల టెండర్లతో ఈసారి బాగా కలిసి వచ్చింది. ప్రభుత్వం దరఖాస్తు ఫీజు పెంచినా మద్యం వ్యాపారులు ఎక్కువ మొత్తంలో ఆసక్తి చూపారు. దీంతో 1072 దరఖాస్తుల ద్వారా రూ. 2 లక్షల చొప్పున రూ. 21 కోట్ల 44 లక్షల ఆదాయం వచ్చింది. దీంతో పాటు 83 మద్యం దుకాణాదారులు మొదటి కిస్తు చెల్లించడం ద్వారా రూ. 13 కోట్ల 18లక్షల ఆదాయం సమకూరింది. మొత్తంగా ఎక్సైజ్ శాఖకు రూ. 34 కోట్ల 62 లక్షల 75 వేల ఆదాయం వచ్చింది. నవంబర్ 1 నుంచి ఏర్పాటయ్యే నూతన మద్యం దుకాణాల్లో నిబంధనలు పాటించాలని, లేకుంటే దుకాణాల లైసెన్సు రద్దు చేస్తామని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే 83 మద్యం దుకాణాల లైసెన్సు ప్రక్రియను పూర్తి చేశారు. గుడివిల్ పేరిట వల మద్యం దుకాణాలు దక్కని కొంతమంది వ్యాపారులు లక్కీడ్రాలో షాపులు దక్కిన వారికి గుడ్‌విల్ పేరుతో వల వేస్తున్నారు. నూతనంగా మద్యం దుకాణాలను లక్కీ డ్రాద్వారా దక్కించుకున్న వారిని నేరుగా కలిసి గుడ్‌విల్ ఇస్తామని మద్యం దుకాణాలను మాకే అప్పగించాలని అడుగుతున్నారు. ఇప్పటికే పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. నిజామాబాద్నగరంతో పాటు డిమాండ్ ఉన్న మద్యం దుకాణాలపై ఇప్పటికే వ్యాపారులు కన్నేశారు. నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కొత్తగా మద్యం వ్యాపారం ప్రారంభించాలంటే బడా వ్యాపారులతో కొన్ని ఇబ్బందులు తప్పవు. అందుకే కొత్తగా దుకాణాలు దక్కిన వారు సైతం సిండికేట్లకు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. లీజుకు ఇస్తే లైసెన్సు రద్దు మద్యం దుకాణాలు దక్కిన వారు ఎవరైనా సరే కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. అలా కాకుండా మద్యం దుకాణాలు ఇష్టారాజ్యంగా నడిపితే చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. మద్యం దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇస్తే లైసెన్సులు రద్దు చేస్తామని చెబుతున్నారు. 24న 8 మద్యం దుకాణాలకు డ్రా నిజామాబాద్ జిల్లాలో లక్కీ డ్రా నిలిచిపోయిన 8 దుకాణాలకు మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈ నెల 23 సాయంత్రం 4 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 24న జిల్లా కలెక్టరేట్లో లక్కీ డ్రా ఉంటుందన్నారు. నిజామాబాద్ నగరంలోని 18, 19 షాపులు, బోధన్‌లో 32, 41, 42, ఆర్మూర్‌లో 60, 61, 62 దుకాణాలకు 05 కన్నా తక్కువ దరఖాస్తులు రావడంతో డ్రా నిలిపివేశారు. మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. గతంలో తక్కువ దరఖాస్తులు వచ్చినా లక్కీడ్రా నిర్వహించారు. కానీ ఈ సారి గెజిట్‌లో నిబంధన లేకున్నా మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తున్నారని పలువురు మద్యం దుకాణా దారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలు పాటించాలి జిల్లాలో నూతన ఎౖక్సైజ్ పాలసీ నవంబర్ 1వ తేదీ నుంచి మొదలు కానుంది. 91 మద్యం దుకాణాల్లో 83 మద్యం దుకాణాలకు లైసెన్సు ప్రక్రియ పూర్తి చేశాం. ఇప్పటికే సుమారుగా రూ. 34 కోట్లకుపైగా ఆదాయం సమకూరింది. మరో 8 దుకాణాలకు సైతం దరఖాస్తులు తీసుకుంటున్నాం. 24న లక్కీ డ్రా ఉంటుంది. మద్యం దుకాణాదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలి. దుకాణాలు ఎవరికైనా లీజుకు ఇచ్చినా, నిబంధనలు పాటించకున్నా శాఖపరమైన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ నవీన్‌చంద్ర, ఎక్సైజ్ సూపరింటెండెంట్ -
పెరగనున్న కిక్కు!
సాక్షి, రంగారెడ్డి: కొత్త మద్యం పాలసీ ద్వారా ఆబ్కారీ శాఖకు కాసుల కిక్కు రానుంది. గతంతో పోలిస్తే ఈసారి దరఖాస్తు ఫీజు, కిందిస్థాయి స్లాబ్‌కు సంబంధించి రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు ( లైసెన్స్) పెరగడంతో అదే స్థాయిలో ఆదాయం అదనంగా చేకూరనుంది. 2019–21 మద్యం పాలసీని ఖరారు చేసిన సర్కారు.. దుకాణాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉమ్మడి జిల్లాలోని 422 మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. గతంతో పోలిస్తే దరఖాస్తు ఫీజు, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజును ప్రభుత్వం పెంచడంతో ఆశావహుల నుంచి ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. మొన్నటి వరకు ఉన్న దరఖాస్తు ఫీజు ధర అమాంతం రెట్టింపు అయింది. రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు ఎగబాకింది. అలాగే, రిటైల్ షాప్ ఎక్సైజ్ ఫీజు పెంచడంతోపాటు నాలుగు స్లాబులుగా ఉన్న లైసెన్స్ ఫీజును.. ఆరు స్లాబులుగా మార్చారు. పాత పాలసీ ప్రకారం కనిష్టంగా లైసెన్స్ ఫీజు రూ.45 లక్షలు ఉండగా నూతన పాలసీలో దీనిని రూ.50 లక్షలుగా చేశారు. రూ.1.10 కోట్ల గరిష్ట ఫీజులో ఎలాంటి మార్పు లేదు. మిగిలిన స్లాబులు రూ.55 లక్షలు, రూ.60 లక్షలు, రూ.65 లక్షలు, రూ.85 లక్షలుగా నిర్ణయించారు. పెరిగిన షాపుల సంఖ్య జిల్లా వైన్స్ రంగారెడ్డి 195 మేడ్చల్ 182 వికారాబాద్ 45 పాత పాలసీ ప్రకారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 412 మద్యం దుకాణాలు ఉన్నాయి. కొత్త పాలసీ ప్రకారం ఈ సంఖ్య 422కు చేరుకుంది. జిల్లాకు కొత్తగా దుకాణాలు మంజూరు కాకపోయినా.. హైదరాబాద్ నుంచి పది షాపులను మన జిల్లాలో కలిపారు. ఆ షాపుల్లో మద్యం అమ్మకాలు చాలా తక్కువగా ఉండటంతో.. రంగారెడ్డి జిల్లాలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆబ్కారీ శాఖ అధికారులు తెలిపారు. ఫలితంగా గతంతో పోలిస్తే ఈసారి అదనంగా మరో 10 షాపులు పెరిగాయి. శంషాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో ఏడు, సరూర్‌నగర్ ఈఎస్ పరిధిలో ఒక షాపు అదనంగా ఏర్పాటు కానున్నాయి. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలోకి రెండు దుకాణాలు వెళ్లనున్నాయి. దరఖాస్తు ఫీజు రూ. 2 లక్షలు దరఖాస్తుల విక్రయం ద్వారానే ఉమ్మడి జిల్లా నుంచి రూ.130 కోట్లను రాబట్టాలని ఆబ్కారీ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇందులో భాగంగా షాపుల కోసం పోటీని పెంచేందుకు ఈఎండీని ప్రభుత్వం ఎత్తివేసిందని ఎౖక్సైజ్‌శాఖ అధికారి ఒకరు తెలిపారు. అలాగే, దరఖాస్తు ఫీజును రూ.2 లక్షలకు పెంచేశారు. చివరిసారి కొత్త రంగారెడ్డి జిల్లా పరిధిలో 187 దుకాణాలకు 3,889 దరఖాస్తులు అందాయి. ఆ సమయంలో ఒక్కో దరఖాస్తు ధర రూ.లక్షగా ఉంది. ఈ లెక్కన దరఖాస్తుల ఫీజు రూపంలోనే ఆబ్కారీ శాఖకు రూ.38.89 కోట్ల ఆదాయం సమకూరింది. మేడ్చల్, వికారాబాద్ జిల్లాలు కలుపుకుంటే దాదాపు రూ.90 కోట్లు వచ్చిందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. 16 వరకు దరఖాస్తుల స్వీకరణ కొత్త దుకాణాలు దక్కించుకునేందుకు ఈనెల 9 నుంచి 16వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. 18వ తేదీన డ్రా తీసి షాపులను కేటాయించనున్నట్లు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ డిప్యూటీ కమిషనర్ మహ్మద్ యాసిన్ ఖురేషీ తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను ఇంకా ఖరారు చేయలేదన్నారు. ఒకటిరెండు రోజుల్లో ఆ వివరాలను వెల్లడిస్తామని పేర్కొన్నారు. దరఖాస్తులు అన్ని ఎక్సైజ్ పోలీస్స్టేషన్లు, ఈఎస్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయి. అలాగే వెబ్సైట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. పాత పాలసీ ప్రకారమే మద్యం దుకాణాల పనివేళల్లో ఎలాంటి మార్పులేదు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు, మిగిలిన ప్రాంతాల్లో ఉదయం 10 నుంచి రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరిచే ఉంటాయి. వచ్చేనెల ఒకటో తేదీ నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి రానుంది. అదే రోజు కొత్త మద్యం దుకాణాలు విక్రయాలు ప్రారంభిస్తాయి. -
లిక్కర్.. లిక్విడ్ క్యాష్
సాక్షి, హైదరాబాద్: వీలైనంత ఎక్కువ ఆదాయాన్ని రాబట్టడమే లక్ష్యంగా మద్యం విక్రయాలకు సంబంధించి లైసెన్స్ మార్గదర్శ కాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మద్యం దుకాణాల సంఖ్య పెంచకుండానే ఖజానా నింపే ప్రయత్నం చేసింది. గురువారం ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్ మార్గదర్శకాలతో కూడిన జీవోలను విడుదల చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం గతంలో నాలుగు శ్లాబుల్లో ఉన్న లైసెన్స్ ఫీజును ఆరు శ్లాబులుగా నిర్ధారించారు. ఈ ఆరు శ్లాబు ల్లోని నాలుగు శ్లాబుల్లో ఫీజును రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంచారు. తద్వారా లైసెన్స్ ఫీజు కింద ప్రభుత్వానికి వందల కోట్ల రూపాయల అదనపు ఆదాయం సమకూరనుంది. గతంలో ఉన్న టెండర్ ఫీజును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ పెంపు ద్వారా కనీసం రూ.400 కోట్ల అదాయం అదనంగా రానుంది. ప్రతి షాపు ఏటా రూ.5 లక్షలు లెవీ కింద చెల్లించాలన్న నిబంధనతో మరో రూ.100 కోట్లకు పైగా రాబడి వస్తుంది. మొత్తం మీద లైసెన్స్ ఫీజులు, దరఖాస్తు ఫీజు, లెవీ, శ్లాబుల పెంపు ద్వారా మొత్తం రూ.2,320 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుందని అంచనా వేస్తున్నారు. ఫీజులు పెంచినా లైసెన్స్ హోల్డర్లకు కొంత వెసులుబాటు కల్పించారు. ముఖ్యంగా దరఖాస్తుతో పాటు ఇవ్వాల్సిన ధరావత్తు తొలగిం చారు. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని గతంలో మూడు వాయిదాల్లో చెల్లించాల్సి ఉండగా, దాన్ని నాలుగు వాయిదాలకు పెంచారు. బ్యాంకు గ్యారంటీలు, ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో కూడా ఉదారతతోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీర్లపై కమీషన్ 25 నుంచి 20 శాతానికి తగ్గించారు. కొత్త మార్గదర్శకాలు కొత్త లైసెన్స్ నవంబర్1 నుంచి అమల్లోకి వస్తుంది. 2021 అక్టోబర్ 31తో గడువు ముగుస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం షాపుల సంఖ్యను నిర్ధారించి డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తారు. ప్రస్తుతమున్న 2,216 షాపులు కొనసాగుతాయి. షాపుల పరిధి, శ్లాబులను మార్పు చేసే అధికారం ఎక్సైజ్ కమిషనర్‌కు ఉంది. ఉదయం 10 నుంచి రాత్రి 10 వరకు మద్యం విక్రయాలకు అనుమతిస్తారు. జీహెచ్ఎంసీ పరిధిలో రాత్రి 11 వరకు విక్రయించవచ్చు. ఏటా లైసెన్స్ ఫీజు మొత్తానికి ఏడింతల విలువైన మద్యాన్ని అమ్ముకోవచ్చు. అంతకన్నా ఎక్కువ అమ్మకాలు జరపాలంటే వ్యాట్‌తో పాటు 8 శాతం టర్నోవర్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఏటా రూ.5 లక్షలు లెవీ కింద చెల్లించాలి. సాధారణ రకం మద్యానికి 27 శాతం, మధ్యతరహా, ప్రీమియం మద్యంపై 20 శాతం, బీర్లపై 20 శాతం కమిషన్ రిటైలర్‌కు ఉంటుంది. అయితే గతంలో బీర్లపై ఉన్న 25 శాతం కమీషన్ తగ్గించారు. టెండర్ ఫీజు కింద రూ.2 లక్షలు చెల్లించాలి. ఈ మొత్తాన్ని తిరిగి ఇవ్వరు. దరఖాస్తుతో పాటు ఈఎండీ కింద ఎలాంటి ధరావత్తు అవసరం లేదు. నాలుగు శ్లాబుల విధానాన్ని 6 శ్లాబులకు పెంచారు. లైసెన్స్ ఫీజు మొత్తాన్ని ఏటా 4 వాయిదాల్లో చెల్లించొచ్చు. గతంలో 3 వాయిదాలే ఉండేది. షాపులు నిర్వహించేందుకు మొదట లైసెన్స్ ఫీజులో నాలుగో వంతు చెల్లించాలి. మరో 6 నెలలకు బ్యాంకు గ్యారంటీలు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు సమర్పించాలి. వైన్‌షాపులను వాకిన్ షాపుల తరహాలో నిర్వ హించాలంటే అదనంగా ఏటా రూ.5 లక్షలు కట్టాలి. -
తెలంగాణలో కొత్త మద్యం పాలసీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రకటించింది. నూతన మద్యం విధానానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను గురువారం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ విడుదల చేశారు. నవంబర్ 1 నుంచి 2021 అక్టోబర్ వరకు కొత్త మద్యం విధానం అమలులో ఉంటుంది. జనాభా ప్రాతిపదికన లైసెన్స్ ఫీజులు ఖరారు చేయనుంది. గతంలో ఉన్న 4 స్లాబులను 6 స్లాబులకు పెంచింది. లాటరీ విధానం ద్వారా మద్యం షాపుల ఎంపిక ఉంటుంది. ధరఖాస్తు ఫీజును రూ.లక్ష నుంచి రూ.2లక్షలకు పెంచారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, ఇతర ప్రాంతాలలో రాత్రి 10 గంటల వరకు మద్యం షాపులు తెరచి ఉంటాయి. ఈ నెలాఖరులోగా లాటరీ విధానం ద్వారా మద్యం లైసెన్స్ దారుల ఎంపిక ఉంటుందని సోమేష్ కుమార్ పేర్కొన్నారు. -
1 నుంచి నూతన మద్యం విధానం
సాక్షి, విజయవాడ: అక్టోబర్ 1 నుంచి నూతన మద్యం విధానం అమలులోకి వస్తుందని, దాని ప్రకారం ప్రభుత్వ ఆధీనంలోనే మద్యం విక్రయాలు జరుగుతాయని ఏపీ రాష్ట్ర ఎక్సైజ్ శాఖమంత్రి నారాయణస్వామి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాసంకల్ప యాత్రలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు దశలవారీగా మద్యనిషేధంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3500 ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటు చేయనున్నామని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగానే గతనెలలో 475 ప్రభుత్వ మద్యం దుకాణాలను ప్రారంభించామని చెప్పారు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఈ మద్యం దుకాణాలను నిర్వహిస్తామని, వీటి ద్వారా 3500 మంది సూపర్ వైజర్లు, 8033 మంది సేల్స్ మెన్ ఉద్యోగాలు వస్తాయని మంత్రి పేర్కొన్నారు. బెల్ట్ షాప్‌లు, నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం గత ప్రభుత్వం మద్యంను ఆదాయంగా భావించిందనీ, అయితే మహిళల కష్టాలను తీర్చేందుకు దశలవారీ మద్య నిషేధాన్ని చేపడుతున్నామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 43వేల బెల్ట్ షాప్‌లు వెలిశాయని ఆయన మండిపడ్డారు. జగన్మోహన్రెడ్డి సీఎం అయిన వెంటనే ప్రభుత్వం బెల్ట్ షాప్‌లపై ఉక్కుపాదం మోపడంతో.. ఇప్పటికే రాష్ట్రంలో బెల్ట్ షాప్ లను పూర్తిస్థాయిలో నిర్మూలించామన్నారు. బెల్ట్ షాప్ నిర్వాహకులపై 2872 కేసులు నమోదు చేసి, 2928 వ్యక్తులను అరెస్ట్ చేశామని మంత్రి తెలిపారు. అదేవిధంగా నాటుసారా తయారీదారులపై ఉక్కుపాదం మోపామని, 4788 కేసుల్లో 2834 మంది వ్యక్తులను అరెస్ట్ చేశామని ఆయన పేర్కొన్నారు. 18 బోర్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నామనీ, ఇంటర్ స్టేట్ బోర్డర్లలో 31 చెక్‌పోస్ట్‌లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఎక్సైజ్ శాఖలో పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా.. ఎక్సైజ్ అధికారులు చిత్తశుద్దితో పనిచేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం ఉన్న సిబ్బంది కొరతను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అంతేకాక 678 కానిస్టేబుల్ పోస్టులకు ప్రతిపాదనలు ఇచ్చామని, ముఖ్యమంత్రి వీటి భర్తీకి సానుకూలంగా స్పందించారని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటును పర్యవేక్షిస్తున్నామని అన్నారు. దుకాణాల నిర్వహణపై సీఐ, ఎస్సైలకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించామని, దీనిపై ఎన్ఫోర్స్మెంట్ పూర్తిగా బాధ్యత తీసుకుందని మంత్రి నారాయణస్వామి అన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో సారాయి, అక్రమ మద్యం రవాణా లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. 'డీ అడిక్షన్ సెంటర్'లను అన్ని ఆసుపత్రుల్లోనూ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మద్యం మీద ఆధారపడిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపుతామని, మద్యపాన నిషేధానికి అందరి సహకారం అవసరమని తెలిపారు. అదేవిధంగా మిగిలిన రాష్ట్రాల్లో మద్యం ధరలు ఏవిధంగా వున్నాయో పరిశీలించి, మద్యం ధరల పెరుగుదలపై అధ్యయనం చేస్తున్నామని వెల్లడించారు. గతంలో బార్లు రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగించేవారనీ, ఈ సమయాలను తగ్గించాలని ఆలోచిస్తున్నామని ఈ మేరకు మంత్రి చెప్పుకొచ్చారు. ప్రభుత్వ మద్యం షాపులతో ఆదాయం తగ్గదు ప్రభుత్వం నిర్వహించే షాప్‌ల వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గదని, రిటైలర్లకు ఇచ్చే పదిశాతం ఇన్సెంటివ్ ప్రభుత్వానికే మిగులుతుందని అన్నారు. ముఖ్యమంత్రి ప్రభుత్వానికి వచ్చే ఆదాయం కన్నా ప్రజాసంక్షేమానికే ప్రాధాన్యత ఇస్తారని, దీంతో ఒక వ్యక్తికి మూడు బాటిళ్లకే పరిమితం చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. మద్యం దుకాణాలకు సంబంధించి కొన్నిచోట్ల అధిక అద్దెలు ఇస్తున్నారనే ఆరోపణలు వస్తుండడంతో.. అద్దెకు ఇచ్చిన వ్యక్తి ఎలా ఇచ్చారో పరిశీలించి, చర్యలు తీసుకుంటామని అన్నారు. పాఠశాలలు, ఆద్యాత్మిక సంస్థలకు దగ్గరగా మద్యం షాప్‌లు వుండకూడదని నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. బార్లకు దగ్గరగా ప్రభుత్వం మద్యం దుకాణాలు పెట్టాలని ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల వద్ద మద్యం సేవించే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మంత్రితో పాటు ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ హరికుమార్, బేవరేజస్ ఎండి వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘ఇకపై ఒక వ్యక్తికి మూడు మద్యం బాటిళ్లే’
సాక్షి, అమరావతి : వచ్చే నెల 1వ తేదీ నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద 500 మద్యం దుకాణాలను ప్రభుత్వం ప్రారంభించబోతుందని ఎక్సైజ్ కమిషనర్ ఎంఎం నాయక్ వెల్లడించారు. అక్టోబర్ 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 3000 మద్యం దుకాణాలు సర్కారు ఆధ్వర్యంలోనే నిర్వహిస్తామని చెప్పారు. గురువారం ఆయన తొలివిడత షాపుల నిర్వహణ కోసం సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల సాకారం చేసే దిశగా ఎక్సైజ్ శాఖ పనిచేస్తుందన్నారు. రాష్ట్రంలో బెల్ట్ షాపులను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ సమూలంగా నిర్మూలించిందని చెప్పారు. జూన్ 1నుంచి ఆగస్ట్ చివరినాటికి 2,500 కేసులు నమోదు చేశామని వెల్లడించారు. సీఎం ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా 4,380 షాపులను 3,500కు కుదించామన్నారు. మరికొద్ది గంటల్లోనే నూతన ఎక్సైజ్ పాలసీ అమలులోకి రాబోతుందని, అది పూర్తిగా అమల్లోకి వచ్చాక పర్మిట్ రూమ్‌లు ఉండవని స్పష్టం చేశారు. ఇకపై రాష్ట్రంలో బెల్టు షాపులు, ఎమ్మార్పీ ధరల ఉల్లంఘన ఉండబోవన్నారు. ఉదయం పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకే మద్యం అమ్మకాలు జరుగుతాయన్నారు. ఒక వ్యక్తి దగ్గర ఆరు బాటిళ్లు ఉండొచ్చన్న నిబంధన రద్దు చేసి దానిని మూడు బాటిళ్లకు తగ్గించామని చెప్పారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
నూతన ఎక్సైజ్ పాలసీ ప్రకటించిన ఏపీ సర్కార్
సాక్షి, అమరావతి: దశలవారిగా మద్యపాన నిషేధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు ముందుకు వేసింది. ఏపీ సర్కార్ బుధవారం నూతన ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. అక్టోబర్ 1 నుంచి కొత్త విధానంలో మద్యం విక్రయాలు చేపట్టనుంది. కొత్త మద్యం పాలసీ విధానంలో 800 షాపులు తగ్గించింది. బెల్ట్ షాపులు ఎక్కడా కనిపించకుండా చర్యలు చేపట్టింది. ఇక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రం భక్తుల మనోభావాలు దృష్ట్యా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి అలిపిరి మార్గమధ్యలో మద్యం షాపులను నిషేధించింది. అక్టోబర్ 1 నుంచి బేవరేజస్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే 3500 మద్యం షాపులను నిర్వహించనున్నారు. కాగా మద్యం మహమ్మారిపై గత టీడీపీ ప్రభుత్వానికి భిన్నంగా సీఎం జగన్మోహన్రెడ్డి నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ప్రభుత్వానికి అత్యధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే మద్యాన్ని విడతల వారీగా నిషేధించేందుకు పూనుకున్నారు. ప్రజారోగ్యానికి, సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఇప్పటికే బెల్టుషాపులపై ఉక్కుపాదం మోపారు. అయితే మద్యం మాఫియాకు పూర్తిగా చెక్ పెట్టేందుకు ఏకంగా ప్రైవేటు మద్యం దుకాణాలు రద్దు చేసేందుకు సంకల్పించారు. -
అందుకే కొత్త మద్యం పాలసీ : నారాయణస్వామి
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మద్యం ద్వారా వచ్చే ఆదాయం కంటే మహిళల ఆరోగ్యమే ముఖ్యమని ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి అన్నారు. మంగళవారం మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మద్యం బెల్టు షాపులను పూర్తిగా నియంత్రించామని తెలిపారు. మద్యపాన నిషేధాన్ని దశల వారీగా అమలు చేస్తున్నామని చెప్పారు. మద్యం నియంత్రణలో భాగంగా ప్రభుత్వం మద్యం దుకాణాలను నిర్వహిస్తోందన్నారు. అందుకోసమే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చినట్టు వివరించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఏటా మద్యం అమ్మకాలను పెంచారని మండిపడ్డారు. కానీ వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం షాపులను భారీగా తగ్గించిందని వెల్లడించారు. సుదీర్ఘ పాదయాత్రలో మహిళల కష్టాలను చూసిన సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధాన్ని ప్రకటించారని గుర్తుచేశారు. ఇచ్చిన మాటను నిలుబెట్టుకునేలా సీఎం వైఎస్ జగన్ మద్యపాన నిషేధాన్ని దశలవారీగా అమలు చేస్తున్నారని చెప్పారు. -
వైఎస్ జగన్ హామీపై మహిళల్లో హర్షాతిరేకాలు
-
మద్యంపై వైఎస్ జగన్ పకటనను స్వాగతిస్తున్న మహిళలు
-
లరియాపల్లికి జాతీయ గుర్తింపు
భువనేశ్వర్: రాష్ట్రంలోని ఓ మారుమూల పల్లె జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించి రాష్ట్రపతి పురస్కారం అందుకుంది. ఒకనాడు సారా మైకంలో తేలియాడిన ఈ పంచాయతీలో నేడు సారా ఛాయలు లేకుండా పోవడం విశేషం. ఈ విశిష్టత భారత రాష్ట్రపతి గుర్తింపును సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచింది. సంబల్పూర్ జిల్లా బమొరా సమితి లరియాపల్లి పంచాయతీ గ్రామం సరికొత్త చరిత్రను ఆవిష్కరించింది. లరియాపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ సుక్రి కుజుర్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. సారా తాగుడు, మత్తు పదార్థాల (డ్రగ్స్) సేవన నిర్మూలన కార్యక్రమంలో విజయం సాధించినందుకు ఈ పురస్కారం ప్రదానం చేశారు. ఈ పంచాయతీ వ్యాప్తంగా మద్యం నిషేధం అమలవుతోంది. ఒకానొకప్పుడు ఈ గ్రామం నిండా మందు బాబులే. ఈ గ్రామంలో ఏటా 2.4 క్వింటాళ్ల నాటు సారా విక్రయం జరిగేది. ఇది 3 ఏళ్ల కిందటి పరిస్థితి. గ్రామస్తుల నిరవధిక కృషితో నేడు ఈ పంచాయతీ సారా రహిత గ్రామంగా పేరొందడం విశేషం. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ డైరెక్టర్, కార్యకర్తల ఆధ్వర్యంలో గ్రామస్తులు సారా నిర్మూలనకు నిరవధికంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించి లక్ష్యం సాధించారు. గ్రామంతో బాటు పంచాయతీ వ్యాప్తంగా మత్తు పానీయాలు, పదార్థాల విక్రయం, సేవన నిర్మూలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రస్తుతం ఈ గ్రామం మత్తు రహిత ప్రాంతంగా వెలుగొందుతోంది. గ్రామస్తుల దైనందిన జీవన పోకడలో సంస్కరణ ధ్యేయంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యక్తిత్వ వికాస కేంద్రం క్రమం తప్పకుండా యోగా, ప్రాణాయామం, ధ్యానం ఇతరేతర కార్యక్రమాల్ని చేపట్టారు. అంచెలంచెలుగా మద్యం వైపరీత్యాలపట్ల గ్రామస్తుల్ని చైతన్య పరిచారు. నిరవధికంగా చైతన్య కార్యక్రమాలు ఆర్ట్ ఆఫ్ లివింగ్ డైరెక్టర్ భోలా నాథ్, లరియాపల్లి గ్రామ సర్పంచ్‌తో పాటు మరో 50 మంది గ్రామస్తులు చైతన్య కార్యక్రమాల్ని నిరవధికంగా సాగించి మద్యం ఇతరేతర మత్తు పదార్థాల విక్రయం, సేవించడాన్ని నిర్మూలించారు. యూత్ లీడర్షిప్ శిక్షణ ఇతరేతర చైతన్య కార్యక్రమాల్ని – మిగతా 2వపేజీలో uనిర్వహించారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 6 అబ్కారీ కేసులు నమోదు కాగా 2017–18 ఆర్థిక సంవత్సరంలో ఈ కేసుల నమోదు 3కి దిగజారింది. కొత్త ఆర్థిక సంవత్సరం 2018–19లో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం విశేషం. గ్రామంలో దీర్ఘకాలం పని చేసిన మద్యం కొట్లు మూయించారు. ఈ దుకాణాల్లో సిబ్బంది, కార్మికులకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులుగా చేర్పించి ఉపాధి కల్పించడంతో వీరి జీవన శైలి ఊహాతీతంగా సంస్కరణకు నోచుకుంది. ఉద్యానవనాల పెంపకం, చేపలు ఇతరేతర జలచరాల ఉత్పాదన, వ్యవసాయ రంగం పనులు వగైరా వ్యవహారాల్లో సారా విక్రేతల అనుబంధ వర్గాలు ఇప్పుడు తలమునకలై స్వగ్రామానికి జాతీయ వన్నె దిద్ది రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్నారు. -
మందుపై ముందుచూపు!
సాక్షి, అమరావతి: అధికార పార్టీ నేతల కనుసన్నల్లోని లిక్కర్ లాబీకి దాసోహమైన రాష్ట్ర ప్రభుత్వం మరో బంపర్ ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే బార్లకు ఐదేళ్ల పాటు (2022 వరకు) వ్యాపారం చేసుకునేందుకు లైసెన్సులు ఇచ్చిన సర్కారు సార్వత్రిక ఎన్నికలకు ముందుగా మద్యం షాపులకు కూడా ఐదేళ్ల పాటు లైసెన్సులు జారీ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. రెన్యువల్ స్థానంలో ఐదేళ్ల పాటు పొడిగింపు గతేడాది ప్రకటించిన మద్యం పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు రెండేళ్లకు లైసెన్సులు జారీ చేశారు. ఈ ఏడాది జూన్ నెలాఖరున రాష్ట్రంలోని 4,380 మద్యం షాపులకు లైసెన్సులు ఏడాది పాటు రెన్యువల్ చేయాల్సి ఉంది. అయితే రెన్యువల్ స్ధానంలో ఐదేళ్ల పాటు మద్యం లైసెన్సులు పొడిగించేలా ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించినట్లు విశ్వసనీయ సమాచారం. లైసెన్సు పొడిగింపు రాజకీయ కారణాలతో ముడిపడి ఉన్నట్లు అధికార వర్గాలే వెల్లడించడం గమనార్హం. మద్యం వ్యాపారులతో ప్రభుత్వం లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకుని వారి వ్యాపారానికి ఆటంకాలు లేకుండా లైసెన్సు కాలపరిమితి పొడిగించనుందని అధికారులు చెబుతున్నారు. ఇందుకుగాను మద్యం వ్యాపారుల నుంచి ఐదేళ్ల లైసెన్సు ఫీజు ఒకేసారి వసూలు చేయనున్నారు. ఒకేసారి రూ.2,500 కోట్లు గతేడాది రాష్ట్రంలోని మద్యం షాపుల నుంచి లైసెన్సు ఫీజుల రూపంలో రూ.500 కోట్ల ఆదాయం లభించింది. ఇప్పుడు ఐదేళ్లకు ఒకేసారి వసూలు చేస్తే సుమారుగా రూ.2,500 కోట్లకు పైగా ఆదాయం సర్కారుకు సమకూరుతుంది. అధికార పార్టీకి చెందిన వారే అధిక శాతం మద్యం షాపులు నిర్వహిస్తున్నారు. లాటరీ విధానంలో షాపులు దక్కించుకున్న వారిని బెదిరించి గుడ్‌విల్ చెల్లించి అధికార పార్టీ నేతలు స్వాధీనం చేసుకున్నారు. అధికార పార్టీ ముఖ్యులే తెర వెనుక ఉండి సిండికేట్లుగా జత కట్టారు. 2019 జూన్‌తో మద్యం దుకాణాల లైసెన్సుల కాలపరిమితి ముగుస్తుంది. అయితే వీరి వ్యాపారానికి ఆటంకాల్లేకుండా 2023 వరకు మద్యం వ్యాపారం చేసుకునేలా లైసెన్సు ఫీజు వసూలు చేసేలా ప్రతిపాదనలు రూపొందించారు. మరో ఐదేళ్లు... రాబోయే ఐదేళ్ల పాటు మద్యం వ్యాపారం ఆటంకాల్లేకుండా కొనసాగించేందుకు వీలుగా ప్రతిపాదనలు రూపొందిస్తున్నట్లు ప్రభుత్వం లైసెన్సీలకు సమాచారం అందించింది. కొద్ది రోజుల క్రితం మద్యం విక్రయాలపై కమీషన్ 18 శాతం పెంచాలని సిండికేట్లు సర్కారు పెద్దల్ని కలిశారు. మార్జిన్ పెంచాల్సిందేనని చిత్తూరు, అనంతపురం, తూర్పుగోదావరి, కర్నూలు జిల్లాల్లో మద్యం షాపులు బంద్ చేసి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో వారిని బుజ్జగించి లైసెన్సులు ఐదేళ్ల పాటు పొడిగిస్తామని సర్కారు పెద్దలు హామీనిచ్చినట్లు సమాచారం. మద్యం వ్యాపారులకు ప్రోత్సాహం గతేడాది బార్లకు లైసెన్సులు 2022 వరకు ఇచ్చి లైసెన్సు ఫీజుల్ని గణనీయంగా తగ్గించారు. గతంలో 50 వేల జనాభా వరకు బార్ల లైసెన్సు ఫీజు రూ.25 లక్షలు ఉండేది. దీన్ని రూ.2 లక్షలకు తగ్గించారు. రిజిస్ట్రేషన్ ఫీజు రూ.8 లక్షలు కలిపి మొత్తం రూ.10 లక్షలు లైసెన్సు ఫీజుగా నిర్ణయించారు. 50 వేల నుంచి 5 లక్షల జనాభా ఉన్న పట్టణాలు, నగరాల్లో లైసెన్సు ఫీజు రూ.40 లక్షలు ఉండేది. ఈ ఫీజును రిజిస్ట్రేషన్ ఛార్జి, లైసెన్సు ఫీజు కలిపి రూ.20 లక్షలుగా నిర్ణయించారు. ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.50 లక్షలుగా ఉన్న లైసెన్సు ఫీజును తగ్గించి కేవలం రూ.30 లక్షలే వసూలు చేశారు. మద్యం షాపులకు కూడా లైసెన్సు ఫీజులు తగ్గించి వ్యాపారాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. -
మద్యం ఎమ్మార్పీ ఉల్లంఘనకు చెక్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎక్సైజ్ శాఖ సాంకేతికంగా మరో ముందడుగు వేసింది. మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) ఉల్లంఘనను నిరోధించడంతో పాటు, అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని నిరోధించడం కోసం ‘లిక్కర్ ప్రైస్’అనే కొత్త యాప్‌ను ప్రవేశపెట్టింది. శనివారం ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గౌడ్, ఎక్సైజ్ కమిషనర్ సోమేశ్‌కుమార్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్‌తో కలసి ఈ యాప్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 880 లిక్కర్ బ్రాండ్లను విక్రయిస్తున్నారు. ఒక్కో సీసా మీద ఎంత ఎమ్మార్పీ ఉంది? క్వాటర్కు ఎంత? ఫుల్ బాటిల్‌కు ఎంత? ఏ డిపో నుంచి తెచ్చారు?.. తదితర విషయాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేళ దుకాణదారు ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరకు మద్యం విక్రయిస్తే అదే యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే వాట్సప్ నంబర్ 7989111222కు గానీ, 18004252523 టోల్ ఫ్రీ నంబర్కుకానీ ఫిర్యాదు చేయవచ్చు. నిర్ణీత సమయం దాటిన తరువాత మద్యం విక్రయించినా, సమయం కంటే ముందే దుకాణం తెరిచినా కూడా ఈ యాప్‌ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. అలాగే ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా అమ్ముడయ్యే 25 బ్రాండ్ల మద్యం ధరలను, 5 బీరు బ్రాండ్ల ధరలను దుకాణాలవద్ద ప్రామాణిక పట్టిక ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ యాప్ ద్వారా ఎమ్మార్పీ ఉల్లంఘనలను పూర్తిగా నిరోధించవచ్చని పద్మారావు గౌడ్ అన్నారు. -
బీరు ధరకు రెక్కలు
సాక్షి, హైదరాబాద్: గత నెలలో మద్యం ధరలు పెంచిన ప్రభుత్వం తాజాగా బీరుపై దృష్టి పెట్టింది. బీరు ధరలు పెరగబోతున్నాయి. కేసు బీరు మీద కనిష్టంగా రూ.45 నుంచి రూ.60 వరకు పెంచనున్నట్లు సమాచారం. ఇందుకు సాధ్యాసాధ్యాల అ మలుకు ముగ్గురు సభ్యుల కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీకే ధర నిర్ణయ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయి. పెంచబోతున్న మొత్తంలో పన్నులు పోనూ మిగిలిన సొమ్మును బీరు కంపెనీలకే ఇచ్చేలా కసరత్తులు చేస్తున్నారు. ఇందుకేనా? రాష్ట్రానికి అవసరమైనంత బీరు సరఫరా కోసం ప్రభుత్వం ప్రతి ఏటా బ్రూవరీ కంపెనీలతో ఒప్పందం చేసుకుంటుంది. ఇటీవల మద్యం ధరలు పెంచిన నేపథ్యంలో బీరు ధరలు కూడా పెంచాలని బ్రూవరీస్ యాజమాన్యం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ విజ్ఞప్తి పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. ఇక్కడే అధిక వినియోగం రాష్ట్రంలో ప్రస్తుతం 6 బ్రూవరీ (బీరు ఉత్పత్తి పరి శ్రమలు)ల ద్వారా నెలకు 507.91 లక్షల బల్కు లీటర్ల (బీఎల్ఎస్) చొప్పున ఏడాదికి 6,096 బీఎల్ ఎస్‌ల బీరు ఉత్పత్తి అవుతోంది. ఇందులో 5,500 బీఎల్ఎస్లు రాష్ట్రంలోనే వినియోగమవుతోంది. రోజుకు 8 లక్షల మంది 13 లక్షల సీసాల చొప్పున బీర్లు తాగుతున్నట్లు టీఎస్‌బీసీఎల్ నివేదికలు చెబు తున్నాయి. ఈ లెక్కన నెలకు 37.5 లక్షల కేసుల బీర్ల ను మందు బాబులు లాగిస్తున్నారు. ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య 296 లక్షల కేసుల బీర్లు వినియోగ మయ్యాయి. గతేడాది విక్రయాలతో పోలిస్తే ఇది 27% అధికం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ లాంటి పొరుగు రాష్ట్రాల్లో బీర్ల వినియోగం తెలంగాణలో సగం కూడా లేదు. -
తెలంగాణలో నూతన మద్యం పాలసీ ఖరారు
-
బెల్టు తీసి.. టోపీ పెడతాం..!
-
బెల్టు తీసి.. టోపీ పెడతాం..!
సర్కారు మద్యం పాలసీపై అనుమానాలు - కొసరు తొలగింపు.. అసలు పెంపు! - బెల్టు షాపుల తొలగింపు నిర్ణయం ప్రచారం కోసమే! - రాష్ట్రంలో 40 వేలకు పైగానే బెల్టు షాపులు - బాబు సీఎం అయ్యాక బెల్టు షాపులు రద్దు చేస్తూ నాలుగో సంతకం - మూడేళ్లుగా వీటిపై ఒక్కసారి కూడా సమీక్షించిన దాఖలాలే లేవు - తాజాగా ప్రతిపక్ష నేత ప్రకటనతో మరోసారి రద్దు ఉత్తర్వులు సాక్షి, అమరావతి : డోర్ డెలివరీ అంటూ ఇన్నాళ్లూ రాష్ట్రంలో మద్యం వరద పారించిన సర్కారు.. ఇప్పుడు బెల్టు షాపుల రద్దుకు డ్వాక్రా మహిళలు, ఎన్జీవోల సాయం కోరడంపై అనుమానాలు వ్యక్తమవు తున్నాయి. ఓ వైపు అసలు షాపులను వదిలేసి కొసరు షాపుల రద్దు అంశాన్ని మాత్రమే తెరపైకి తేవడం.. మరో వైపు మద్యం దుకాణాలు, బార్ల సంఖ్యను పెంచేస్తుండటం ఈ అనుమానాలకు తావిస్తోంది. మహిళల నుంచి నిరసనలు వెల్లువెత్తడం.. తాము అధికారంలోకి రాగానే దశల వారీగా మద్య నిషేధం విధిస్తామని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రకటించిన నేపథ్యంలో చంద్రబాబు సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా బెల్టు షాపులను ఎత్తేస్తామని ప్రకటించింది. వాస్తవానికి చంద్రబాబు సీఎంగా మూడేళ్ల క్రితం ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో బెల్టు షాపులు రద్దు చేస్తున్నట్లు ఫైలుపై సంతకం చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బెల్టు షాపుల గురించి, వాటి పరిస్థితిపై ఎన్నడూ సమీక్ష చేసిన పాపాన పోలేదు. 2014 జూన్ 8న బెల్టు షాపుల రద్దుపై జీవో 263 జారీ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప ఏ చర్యలూ తీసుకోలేదు. ప్రజా వ్యతిరేకత నుంచి బయట పడేందుకోసమని తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 13న సీఎం చంద్రబాబు బెల్టు షాపుల్ని రద్దు చేయాలని ఆదేశించారని, ఈ మేరకు 18వ తేదీన కేబినెట్ నిర్ణయించిందని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నరసింహం మెమో జారీ చేశారు. కాగితాల్లోనే కమిటీలు బెల్టు షాపుల సమాచారమిస్తే నజరానా అందిస్తామని, గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని మూడేళ్ల క్రితం ఆదేశించారు. బెల్టు షాపులను రద్దు చేసేందుకు రాష్ట్రంలో 13 జిల్లా కమిటీలు, 553 మండల, 5,332 గ్రామ కమిటీలు ఏర్పాటు చేసినట్లు కాగితాలపై చూపించారు. ఈ కమిటీలు ఉన్నాయా.. లేక రద్దయ్యాయో తెలియని స్థితి. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే బెల్టు షాపుల రద్దు అంశాన్ని ప్రభుత్వం ప్రచారంగా మాత్రమే వాడుకోజూస్తున్నదని పలువురు సామాజిక కార్యకర్తలు, మద్యం వ్యతిరేక పోరాట కమిటీ నేతలు వ్యాఖ్యానించడం గమనార్హం. అన్నీ తూతూ మంత్రపు కేసులే రాష్ట్రంలో 40 వేలకు పైగా బెల్టు షాపులున్నట్లు సాక్షాత్తూ ఎక్సైజ్ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ఎక్సైజ్ శాఖ ఇటీవల నిర్వహించిన అంతర్గత సర్వేలో ఈ విషయం రూఢీ కావడం గమనార్హం. మూడేళ్లుగా బెల్టు షాపులపై 23 వేల కేసులు నమోదు చేసినట్లు అధికారిక ఎక్సైజ్ లెక్కలు వెల్లడిస్తున్నాయి. ఇవి కూడా తూతూ మంత్రంగా నమోదు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దర్జాగా అమ్మకాలు.. వసూళ్లు ► శ్రీకాకుళం జిల్లాలో ఓ మంత్రి నియోజకవర్గంలో బెల్టు షాపులు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. మద్యం వ్యాపారులు బెల్టు షాపులు ఏర్పాటు చేసుకున్నందుకు నెలవారీ రూ.కోటిన్నర సంబంధిత మంత్రికి ముట్టజెప్పాలి. వీటి వసూలు బాధ్యత ఓ సీఐ నిర్వహిస్తున్నారు. ఈ విషయంపై ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు ఏకంగా సమీక్ష సమావేశంలోనే బాహాటంగా వెల్లడించారు. ► గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో ఓ సీనియర్ ఎమ్మెల్యే ఆధ్వర్యంలోనే బెల్టు షాపులు నడుస్తున్నాయి. ► విశాఖ జిల్లాలో మద్యం వ్యాపారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే సైతం బెల్టు షాపుల ద్వారా అమ్మకాలు జరిపిస్తున్నారు. ► చిత్తూరు జిల్లాలో బెల్టు షాపులు ఏర్పాటు చేస్తున్నారంటూ మహిళలు ఇటీవల జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ► పశ్చిమగోదావరి జిల్లాలో మంత్రికి సన్నిహితంగా ఉండే సిండికేటు నేత ఒకరు ఎమ్మార్పీ ఉల్లంఘనలు మొదలు బెల్టు షాపుల వరకు అంతా తానే పర్యవేక్షిస్తారు. సదరు మంత్రి అనుయాయుడికి ఇక్కడ ఎక్సైజ్ అధికారులు సంపూర్ణ సహకారాలు అందిస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. ‘బెల్టు’ తీయాల్సిందే.. రాష్ట్రంలో అనధికారికంగా నడుస్తున్న బెల్టు షాపులపై దాడులు కొనసాగించాలని ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీ నరసింహం ఆ శాఖ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, పోలీస్ ఇతర ప్రభుత్వ శాఖల సాయంతో గ్రామాల్లో బెల్టు షాపుల్ని తొలగించాలని సూచించారు. బుధవారం విజయవాడ నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఇచ్చిన ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులపై ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కాగా, రెండు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా 133 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి 138 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు. 415 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నామన్నారు. -
మద్యంపై ఉద్యమం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విచ్చలవిడి గా అమ్మకాలు జరి పేలా ఉన్న మద్యం పాలసీపై మహిళలు పెద్దఎత్తున ఉద్య మించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశం గురువారం జరి గింది. లక్ష్మణ్ మాట్లాడుతూ మహిళల సమస్యలపై పోరాట కార్యాచరణ రూపొం దించుకోవాలని చెప్పారు. ఈ నెల 23, 24 తేదీల్లో వరంగల్‌లో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు జరుగుతాయన్నారు. మోదీ విధానాలు, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే లా కృషిచేయాలన్నారు. మద్యం అమ్మకా లతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.45వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకొం టుంటే... మరో వైపు మద్యం సేవించి ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నా యన్నారు. మహిళామోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ, కె.పుష్పలీల పాల్గొన్నారు. -
ఎక్కడి దుకాణాలు అక్కడే..
విజయనగరం రూరల్: అంతా అనుకున్నట్టే జరిగింది. మద్యంపై వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరు కాదంటూనే మద్యం అమ్మకాలు పెంచడానికే ప్రభుత్వం మొగ్గుచూపింది. దీంతో రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మారుస్తూ ప్రభుత్వం జీఓ ఎంఎస్ 28 మంగళవారం విడుదల చేసిం ది. చంద్రబాబు సర్కార్ తన జిమ్మిక్కులతో ఏకంగా సుప్రీంకోర్టు తీర్పునే అపహాస్యం చేసిందని పలువురు మండిపడుతున్నారు. మార్గదర్శకాలకు చెక్ తుంగలో తొక్కింది. తమ పరిధిలో ఉన్న రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులకు డీనోట్ఫై చేస్తూ ప్రభుత్వం మంగళవారం జీఓ జారీ చేసింది. నూతన మద్యం విధానంలో భాగంగా జాతీయ, రాష్ట్ర రహదారులపై ఉన్న దుకాణాలు, బార్లు 220 నుంచి 500 మీటర్ల దూరంలో చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈనెల ఒకటి నుంచి రహదారులకిరువైపులా ఉన్న దుకాణాలను తొలగించేశారు. దీంతో ఈ దుకాణాలను జనావాసాల మధ్య ఏర్పాటు చేయడానికి ప్రయత్నించగా, ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వం రాష్ట్ర రహదారులను జిల్లా ప్రధాన రహదారులుగా మార్చింది. అంతా అనుకున్న విధంగా జరగడంతో రాష్ట్ర రహదారుల పక్కనే మద్యం దుకాణాల ఏర్పాటుకు మార్గం సుమగమైంది. జాతీయ రహదారులపై ఉన్న దుకాణాలే మార్పు.. జిల్లా వ్యాప్తంగా జూన్ 30 నాటికి 210 మద్యం దుకాణాల్లో 169 మద్యం దుకాణాలు, 27 బార్లలో 18 జాతీయ, రాష్ట్ర రహదారుల పక్కనే ఉండేవి. వీటిలో 43 మద్యం దుకాణాలు, ఏడు బార్లు జాతీయ రహదారుల పక్కన.. రాష్ట్ర రహదారుల పక్కన 126 మద్యం దుకాణాలు, 11 బార్లు ఉన్నాయి. అయితే ప్రభుత్వం జారీ చేసిన జీఓ ప్రకారం కేవలం జాతీయ రహదారుల పక్కన ఉన్న దుకాణాల మార్పే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. జీఓలో కేవలం మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోనే రాష్ట్ర రహదారులపై మద్యం దుకాణాలు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. జిల్లాలో 90 శాతంపైగా మద్యం దుకాణాలు మున్సిపాలిటీ, మండల కేంద్రాల్లోని గ్రామాల్లో ఉండడంతో 120 వరకు దుకాణాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంది. మంగళవారం వరకు జిల్లా వ్యాప్తంగా 210 మద్యం దుకాణాలకు గాను ఎక్సైజ్ అధికారులు 108 దుకాణాలకు అనుమతులు ఇవ్వగా, విజయనగరం డివిజన్లో ఏడు బార్ల నిర్వహణకు అనుమతులు మంజూరు చేశారు. -
ఊరిలో బార్... దారిలో బెల్ట్!
⇔ రేపటి నుంచి నూతన మద్యం పాలసీ అమలు ⇔ జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల దూరంలోనే దుకాణాలు ⇔ కొత్త షాపులు, బార్ల ఏర్పాటులో వ్యాపారులు బిజీ ⇔ హైవే పక్కన ఇక బెల్టు షాపులు ! ⇔ ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్న వ్యాపారులు ⇔ ఇళ్ల మధ్య మద్యం షాపులు పెట్టవద్దని ఫిర్యాదుల వెల్లువ మచిలీపట్నం : ఇప్పటి వరకు బెల్ట్ షాపులు గ్రామాల్లో ఇళ్ల మధ్య ఉండేవి. గుట్టుగా మద్యం విక్రయించేవారు. బార్ అండ్ రెస్టారెంట్లు ఊరికి దూరంగా... రహదారులకు దగ్గరగా ఉండేవి. ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారనుంది. గుడి, బడి, నివాసాల సమీపానికి మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లు రానున్నాయి. యథేచ్ఛగా మద్యం విక్రయించనున్నారు. బెల్ట్ షాపులు మాత్రం ఇళ్లకు దూరంగా.. రహదారులకు దగ్గరగా చేరనున్నాయి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జూలై ఒకటో తేదీ నుంచి జాతీయ, రాష్ట్ర రహదారులకు 500మీటర్ల దూరంలో మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి ఉండటమే ఇందుకు కారణం. రహదారులకు దూరంగా బార్లు, మద్యం షాపులు పెడితే వ్యాపారం తగ్గిపోతుందని భావించిన వ్యాపారులు... కొత్త పాలసీ ప్రకారం షాపులు, బార్లు ఏర్పాటు చేస్తూనే, పాత వాటిని బెల్ట్ షాపులుగా కొనసాగించాలని పథకం రచించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక్కరోజే గడువు ... సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లను రహదారులకు దూరంగా మార్చేందుకు ఒక్క రోజే సమయం ఉంది. ఈ క్రమంలో మూడు నెలలు గడువు ఇవ్వాలని మద్యం వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. అదే సమయంలో నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్ కోసం దరఖాస్తు కూడా చేయలేదు. అయితే, వ్యాపారుల అప్పీలును హైకోర్టు గురువారం ఉదయం తిరస్కరించింది. మరోవైపు నూతన ఎక్సైజ్ పాలసీ–2017 ప్రకారం రెన్యూవల్, కొత్త వాటికి లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా గురువారం సాయంత్రం 5 గంటలకు వరకు మాత్రమే గడువు ఉంది. దీంతో బార్ అండ్ రెస్టారెంట్ యజమానులు హడావుడిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 25, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 126 బార్ అండ్ రెస్టారెంట్లు ఉన్నాయి. వీటన్నింటికి రెన్యూవల్, లైసెన్స్‌ల కోసం దరఖాస్తులు రావడంతో వాటి పరిశీలనను మచిలీపట్నం, విజయవాడ ఎక్సైజ్ ఈఎస్‌లు పూర్తి చేశారు. వ్యూహాత్మకంగా... జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా 500 మీటర్ల దూరంలో మద్యం షాపులు, బార్ అండ్ రెస్టారెంట్లను ఏర్పాటు చేయాల్సి రావడంతో ఆ పనిలో వ్యాపారులు బిజీగా ఉన్నారు. విజయవాడలో అత్యధికంగా బార్ అండ్ రెస్టారెంట్లు ఉండటంతో వీటిని ఎక్కడకు తరలించాలి, ఎక్కడ మద్యం విక్రయాలు చేయాలి.. అనే అంశాలపై మల్లగుల్లాలు పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లకు పెద్ద భవనం కావాల్సి ఉండటంతో సమస్యలు తలెత్తుతున్నాయి. గృహాల మధ్యలో మద్యం దుకాణాలా... నూతన నిబంధనల ప్రకారం జిల్లాలోని 343 మద్యం దుకాణాల్లో అధిక శాతం ఇళ్ల మధ్యనే ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. విజయవాడ ఈఎస్ పరిధిలో 168, మచిలీపట్నం ఈఎస్ పరిధిలో 175 షాపులు ఉన్నాయి. వీటిని గృహాల మధ్య ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుండటంతో ఎక్సైజ్ అధికారులకు స్థానిక ప్రజల నుంచి ఫిర్యాదు వస్తున్నాయి. మొవ్వ మండలం పెదపూడి గ్రామంలో ఇళ్లు, అంగన్వాడీ, రామాలయం దగ్గరలో మద్యం దుకాణం ఏర్పాటు చేస్తున్నారని మచిలీపట్నం ఎక్సైజ్ ఈఎస్‌కు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. ప్రజలు ఫిర్యా దు చేస్తే ఇళ్ల మధ్య మద్యం దుకా ణాలను తొలగిస్తామని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. -
‘సారా’ చంద్ర‘బార్’ నాయుడు
ఎమ్మెల్యే రోజా ఆగ్రహం - రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు - స్కూళ్లు మూసేసి కొత్తగా బార్లు తెరవడమే బాబు విజనా! సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో పిల్లలు చదువుకోవాల్సిన స్కూళ్లను మూసి వేసి, కొత్తగా బార్లు తెరవడమే ముఖ్యమంత్రి చంద్రబాబు విజనా!? అని వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే, రాష్ట్ర పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఆర్ కె రోజా సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు ఈ రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా, బారాంధ్రప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. శనివారం ఆమె పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. గతంలో ఎన్టీఆర్ తీసుకు వచ్చిన సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచిన చంద్రబాబు మళ్లీ ఇపుడు ‘తాగండి... తాగించండి... చచ్చే వరకూ తాగించండి...’ అనే విధానంతో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రిని నారా చంద్రబాబునాయుడు అనే కంటే సారా చంద్ర బార్ నాయుడు అంటే సరిపోతుందని ఆమె వ్యంగ్యంగా అన్నారు. 30 వేల మందికో బార్ అంటూ కొత్తగా 85 బార్లకు లైసెన్సులు ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఈ లైసెన్సులు ఇచ్చినందుకు చంద్రబాబుకు, ఆయన కుమారునికి, ఎక్సైజ్ మంత్రికి ఎంతెంత వాటాలు మద్యం వ్యాపారుల నుంచి ముట్టాయో చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. చంద్రబాబు ధనదాహానికి మద్యం విధానాల వల్ల ఈ రోజు ఆడవాళ్ల జీవితాలు బలవుతున్నాయని వారి పుస్తెలు తెగి పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని భావిస్తామని, అది ఒక్క దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే చూశామని ఆమె అన్నారు. 20 మంది లోపు పిల్లుంటే స్కూళ్లు మూసేయండని తొలుత నిర్ణయించారని వ్యతిరేకత రావడంతో మళ్లీ సమీక్షించి 10 మందికి లోపు ఉంటే తీసేయమన్నారన్నారు. అదే రాష్ట్రంలో 50 వేల మందికి ఒక బార్ ఉంటే ఆ జనాభాను 30 వేల మందికి తగ్గించి లైసెన్సులు ఇవ్వడం దేనికి సంకేతమని రోజా ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో ఆడబిడ్డలు పుస్తెలు తెంపుకునే పరిస్థితి, ఎంతో మంది కొడుకులు కోల్పోయే పరిస్థితి వచ్చిందన్నారు. రాష్ట్రంలో అవినీతి ఎంత తారాస్థాయిలో ఉందో చెప్పడానికి ఓ ఎస్ఐ తాను నెలకు కోటి రూపాయల మమూళ్లు ఇవ్వలేనని మొర పెట్టుకుంటూ జిల్లా కలెక్టర్‌కు లేఖ రాయడమే నిదర్శనమని ఆమె అన్నారు. మీ నాన్న ఖర్జూరనాయుడు సొత్తా!? తానిచ్చే పెన్షన్లు , రేషన్ తీసుకోవద్దు, రోడ్లపై నడవొద్దు అని చంద్రబాబు అనడంపై రోజా మండిపడ్డారు. ‘ఇదేమీ చంద్రబాబునాయుడు, ఆయన నాన్న ఖర్జూరనాయుడు సొత్తా లేక మీ మా ఎన్టీఆర్ సొత్తా... లేక నీ పుత్రుడు లోకేష్ సొత్తు ప్రజలకు పెడుతున్నాననుకున్నావా’ అని ఆమె ప్రశ్నించారు. ప్రజలు కట్టే పన్నులతో వారి సంక్షేమ కార్యక్రమాలు పెట్టేవాటిలో కూడా అర్హు లైన వారిని తప్పించేసి టీడీపీ వారికి ఇచ్చేసుకుంటూ ప్రజల మీద అక్కసు చూపిస్తున్నారన్నారు. ప్రాణం పోయే వరకూ పార్టీలోనే... తన ప్రాణం పోయే వరకూ వైఎస్సార్ కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని రోజా ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను పార్టీ మారబోతున్నట్లు కొందరు పనికిమాలిన వారు, పనికిమాలిన రాతలు రాస్తున్నారన్నారు. ఇలాంటి వార్తలు రాసే వారు ఏ విలువలతో కూడిన జర్నలిజం పాటిస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో తాను చేయని తప్పునకు టీడీపీ నాకు శిక్ష వేస్తే నాకు వెన్నంటి ఉండి నా సోదరి అని వైఎస్ జగన్మోహన్రెడ్డి తనకు అండగా నిలిచారని ఆమె అన్నారు. రాజకీయంగా తనకు ఒక స్థానాన్ని , గౌరవాన్ని, అవకాశాన్ని ఇచ్చింది జగన్ ఆయన కుటుంబమేనని, ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీని వీడనని ఆమె అన్నారు. టీడీపీకి 9 ఏళ్లు సేవ చేసినా తనను ఎన్నికల్లో ఓడించిన ఆ పార్టీలోకి తాను వెళ్లబోనని, తలాతోక లేని జనసేనలోకి కూడా వెళ్లబోనని ఆమె అన్నారు. -
సింహం ముందు పందికొక్కు తొడకొట్టినట్లు: రోజా
హైదరాబాద్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయి. నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్ నాయుడిగా మార్చుకోండి. మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇచ్చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థం అవుతోంది. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం, లోకేశ్ వాటా ఎంత?. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా?. తాగుబోతులంతా కూర్చోని తీసుకున్న బార్ల పాలసీ ఇది. స్కూళ్లను మూసి బార్లను తెరవడమే విజనా?. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా చేస్తున్నారు?. బార్ల పాలసీ వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదు. జయంతి,వర్థంతికి తేడా తెలియని లోకేషా ...జగన్‌కు సవాల్ విసిరేది. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు ఉంది లోకేష్ సవాల్. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్. ఇక నాపై కొంతమంది పనికిమాలిన వార్తలు రాస్తున్నారు. పనికిమాలిన టీడీపీలోకి, తలాతోకలేని జనసేనలోకి వెళ్లను. నా ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్ఆర్ సీపీలోనే ఉంటా’ అని రోజా స్పష్టం చేశారు. -
ఖరారు కాని మద్యం పాలసీ
ప్రొద్దుటూరు : మద్యం షాపుల యజమానులు అయోమయంలో పడ్డారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 31 వరకు మద్యం దుకాణాలకు గడువు ఉంది. అయితే జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్లలోపు దుకాణాలు ఉండరాదని ఇటీవల సుప్రీంకోర్డు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వ్యాపారులు డీలా పడ్డారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో 109 మద్యం షాపులు, 8 బార్లు ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల లోపు 91 మద్యం షాపులు, 6 బార్లు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ విధానం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నూతన పాలసీలో ప్రాంతాలతో సంబంధం లేకుండా వైన్ షాపులు ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని మద్యం వ్యాపారులు భావిస్తున్నారు. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 16 షాపులు, 6 బార్లు రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల లోపు ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. వేంపల్లి నుంచి ప్రొద్దుటూరు, రాజుపాళెం మీదుగా చాగలమర్రి వరకు ఉన్న రహదారి స్టేట్ హైవే కిందికి వస్తుంది. దీంతో కొర్రపాడు రోడ్డులోని భగత్‌సింగ్ కాలనీ, రాజుపాళెంలో ఉన్న మద్యం షాపులకు ఈ నిబంధన వర్తిస్తుంది. చాపాడు, లింగాపురం, మైదుకూరు రోడ్డు, కేకే స్ట్రీట్, వైఎంఆర్ రాజీవ్ సర్కిల్, టిబిరోడ్డు, గాంధీరోడ్డులోని గాంధీబొమ్మ పరిసర ప్రాంతాల్లోని మద్యం షాపులు 500 మీటర్లలోపు ఉన్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రకారం పట్టణ, మండలాల్లో 90 శాతం పైగా మద్యం దుకాణాలను వేరే ప్రాంతాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుతం వార్డుల వారీగా దుకాణాలను నిర్వహిస్తున్నారు. తాజా నిబంధనల ప్రకారం రాష్ట్ర, జాతీయ రహదారులకు 500 మీటర్ల దూరంలో దుకాణాల నిర్వహణ జరగాల్సి ఉంది. ఆయా ప్రాంతాల్లో అధికారులే మద్యం షాపు ఏర్పాటుకు స్థలాలను గుర్తిస్తారా లేక ప్రాంతాలతో నిమిత్తం లేకుండా ఎక్కడైనా ఏర్పాటు చేసుకోవచ్చనే నిబంధన వస్తే ఏం చేయాలని వైన్‌షాపు యజమానులు ఆందోళన చెందుతున్నారు. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు.. కొత్త మద్యం పాలసీ ఇంకా ఖరారు కాలేదు. ఈ నెల 20న స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర, జాతీయ రహదారుల్లోని 500 మీటర్ల లోపు ఉన్న మద్యం దుకాణాలు, బార్లను గుర్తించి అధికారులకు నివేదిక పంపించాం. –బాలకృష్ణన్, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు -
సంపూర్ణ మద్య నిషేధం ఎప్పుడు?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని ఎçప్పుడు అమలు చేస్తారో చెప్పాల్సిందిగా మదురై హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ సందర్భంగా ప్రభుత్వంపై 14 ప్రశ్నలను సంధించింది.తిరునెల్వేలి జిల్లా సాంబవర్ వడకరైకి చెందిన శక్తివేల్ మద్యానికి బానిస. బీడీలు చుట్టి కార్మికురాలిగా పనిచేస్తూ భారంగా బతుకీడ్చే తల్లిని వేధించి డబ్బులు తీసుకుని మద్యం సేవించడం శక్తివేల్‌కు నిత్యకృత్యం. మద్యానికి డబ్బులు ఇవ్వలేదని గత ఏడాది డిసెంబర్ 3వ తేదీన తల్లితో గొడవపడి వేటకొడవలితో ఆమెను నరికాడు. ఈ కేసులో శక్తివేల్ అరెస్టయి జైలుపాలుకాగా బెయిల్ కోరుతూ మదురై హైకోర్టులో అతను దరఖాస్తు చేసుకోగా సోమవారం విచారణకు వచ్చింది. పిటిషన్ విచారించిన న్యాయమూర్తి ఎన్. కృపాకరన్ మాట్లాడుతూ ఇలా అన్నారు. కుమారుని చేతిలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలైన తల్లి కోలుకుని ఇంటికి చేరుకున్నారు. అలాగే బెయిల్ పిటిషన్ దారుడు సైతం 30 రోజులకు పైగా జైల్లో ఉన్నాడు. కాబట్టి అతనికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాను. సెంగోట్టై మేజిస్ట్రేట్ కోర్టులో రూ.10వేలకు ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుపై బెయిల్ పొందవచ్చు. రెండువారాల పాటు ఉద యం, సాయంత్రం సాంబవర్ వడకరై పోలీస్‌స్టేషన్‌కు హాజరై సంతకాలు చేయాలి అని తీర్పు చెప్పారు. ఈ కేసులో కేంద్ర ప్రభుత్వ కేబినెట్ కార్యదర్శి, హోంశాఖ కార్యదర్శి, తమిళనాడు హోంశాఖ కార్యదర్శి, రెవెన్యూ కార్యదర్శి, డీజీపీ, టాస్మాక్ యాజమాన్యంలను ఈ కోర్టు తానుగా ముందుకు వచ్చి ఈ బెయిల్ పిటిషన్‌పై వ్యతిరేక పిటిషన్ దారులుగా చేరుస్తోంది. వీరందరూ 14 ప్రశ్నలకు కోర్టుకు బదులివ్వాల్సి ఉంటుంది. దశలవారీగా సంపూర్ణ మద్యనిషేధం అమలు చేస్తామని అన్నాడీఎంకే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినట్లుగా అధికారంలోకి రాగానే 500 టాస్మాక్‌లకు తాళం వేసింది. అయితే ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఏ తేదీ నుంచి సంపూర్ణ మధ్య నిషేధం అమలవుతుంది? భారత్‌లోనూ, తమిళనాడులోనూ మద్యసేవనం పెరిగిపోతోందా? మద్యానికి బానిసలైన వారి సంఖ్య ఏడాదికి ఏడాది పెరిగిపోతోందా ? ఈ ప్రశ్నకు ఏడాదివారిగా వివరాలు ఇవ్వాలి. మద్య సేవనం వల్ల నేరాలు ఏడాదికి ఏడాది పెరుగుతున్నాయా ? గత పదేళ్లలో మద్య సేవనం నేపథ్యంలో ఏఏ నేరాలు చోటుచేసుకున్నాయి.? ఈ వివరాలను సైతం ఏడాది వారిగా దాఖలు చేయాలి. మద్యం సులభంగా అందుబాటులో ఉన్నందున పిల్లలు, విద్యార్థులు సైతం ఆకర్షితులు అవుతున్నారా? మద్యం తాగడం వల్ల చిన్నారులు నేరాలకు పాల్పడుతున్నారా ? మద్యం అమ్మకాల నేపథ్యంలో మహిళలు లైంగిక వేధింపులకు గురవుతున్నారా ? పిల్లలకు మద్యం అమ్మ కూడదన్న చట్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు కఠినంగా అమలు చేయకూడదు? చిన్నారులను మద్యానికి దూరం చేసేలా చైతన్యప్రచారాలను ఎందుకు చేపట్టకూడదు ? మద్యానికి బానిసలైన మగవారి వల్ల భార్యా పిల్లలు మానసికంగా బాధపడుతున్నారా ? సంపాదనంతా మద్యానికి ఖర్చు చేయడం వల్ల కుటుంబాల పట్ల బాధ్యతగా వ్యవహరించకపోవడం వాస్తవమేనా ? మద్యం సేవనం వల్ల చోటుచేసుకునే అనర్థాలపై అవగాహనకు తగిన నిధులు కేటాయిస్తారా? రోజుకు 70 లక్షల మంది మద్యంను సేవిస్తుండగా, ప్రతి 96 నిమిషాలకు ఒకరు చొప్పున మద్యంతో మరణిస్తుండగా, వీరికి అవసరమైన చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తారా? మద్యం నుంచి విముక్తి తాలూకా స్థాయిలో కౌన్సెలింగ్ సెంటర్లు ఎందుకు ఏర్పాటు చేయరాదు? ఈ ప్రశ్నలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున బదులు చెప్పాలని ఆదేశించిన న్యాయమూర్తి కృపాకరన్ విచారణను ఈనెల 24వ తేదీకి వాయిదా వేశారు. -
ఒకింత మోదం.. మరింత ఖేదం
అరుణ్ జైట్లీ ఆశల బడ్జెట్ గ్రేటర్ సిటీజన్లకు ఒకింత మోదం.. మరింత ఖేదం మిగిల్చింది. బుధవారం నాటి కేంద్ర బడ్జెట్ వేతనజీవుల అంచనాలను పూర్తిగా నిజం చేయలేకపోయింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. తాజా బడ్జెట్‌తో మహానగరంలో ఇక విందు, వినోదం, విమానయానం భారంగా పరిణమించనుంది. స్మార్ట్ ఫోన్లు, కార్లు, బైకుల ధరలు పెరిగే అవకాశం ఉండడంకుర్రకారుతోపాటు మధ్యతరగతికి ఇబ్బందిగా మారింది. ఇక ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారీ సిగరెట్లు, పాన్‌మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పెద్దగా ఆశ్చర్యపర్చలేదు. ఐటీ రంగంతోపాటు..స్టార్టప్‌లు..సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు పలు రాయితీలు ప్రకటించడంతో ఆయా సంస్థలు సిటీకి వెల్లువెత్తనున్నాయి. ఎన్నో ఆశించిన నగరవాసిని అరుణ్‌జైట్లీ బడ్జెట్ నిరాశ పరిచింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచుతారనుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు జల్లింది. మూడు నుంచి ఐదు లక్షల మధ్య ఆదాయం ఉండే వారికి కేవలం ఐదుశాతం పన్నుతో సరిపెట్టడం గుడ్డిలో మెల్ల. కాస్మొపాలిటన్ నగరంగా మారిన మహానగరంలో తాజా బడ్జెట్‌తో విందు, వినోదం, విమానయానం భారం కానుంది. ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, స్మార్ట్ఫోన్ల ధరలు ప్రియం కానుండడం యువత జేబులకు చిల్లులు పడడం తథ్యమన్న సంకేతాలు వెలువడ్డాయి. కార్లు, బైక్‌ల ధరలు పెరగడం మధ్యతరగతి వర్గానికి చేదువార్త. ఔషధాలు, మెడికల్ ఉపకరణాల ధరలు తగ్గడంతో అందరికీ వైద్యం అందుబాటులోకి రానుండడం ఆనందిచదగ్గ విషయం. సిగరెట్లు, పాన్ మసాలాలు, పొగాకు ఉత్పత్తులు, మద్యం ధరలు పెరగడం పొగ, మందుబాబుల జేబుకు చిల్లు తప్పదు. ఐటీరంగంతో పాటు.. స్టార్టప్‌లు.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రాయితీలు ప్రకటించడంతో కొత్త పరిశ్రమలకు గ్రేటర్ నగరం కేరాఫ్ అడ్రస్‌గా మారనుంది. సీసీటీవీల ధరలు దిగిరానుండడంతో నగరంలో ప్రతి ఇల్లు, కార్యాలయం ఆవరణలో నిఘాకు మార్గం సుగమమైంది. ఇక కుర్రకారు అమితంగా ఇష్టపడే వై–ఫై సేవలందించే రూటర్ల ధరలు తగ్గే అవకాశాలుండడంతో ఆన్లైన్, ఇంటర్నెట్, సోషల్ మాధ్యమాలు వినియోగించేవారిలో జోష్ పెంచింది. మరోవైపు బ్రాండెడ్ దుస్తులు, కాస్మోటిక్స్ ధరలు పెరగడం మింగుడు పడని అంశం. చిన్న గృహాలకు తీసుకునే రుణాలపై వడ్డీ రాయితీలు ప్రకటించడం వేతనజీవులు, మధ్యతరగతి వర్గానికి ఊరటనిచ్చే అంశం. – సాక్షి, సిటీబ్యూరో ► జైట్లీ బడ్జెట్ నగరవాసి ఆశలపై నీళ్లు ► కార్లు, బైక్‌లు, ఫోన్లు ప్రియం ► విందు వినోదం భారం ► దిగిరానున్న ఔషధ ధరలు -
‘మద్యం’తో ఫుట్ బాల్ క్రీడ
విశ్లేషణ బిహార్‌లో మద్య నిషేధం విధించిన నితీష్, ఎన్టీఆర్‌లా తాగుడు సామాజిక పర్య వసానాలకు, ప్రభుత్వ నిధులకు మధ్య సమతూకం సాధించారు. సమర్థ పాలనకు మద్యం రాబడులు కావాలనేవారు ఆ డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్య విధానం తలకిందులు అవుతుండటం పరిపాటిగానే సాగింది. 1993లో సారా నిషే« ధాన్ని, 1995లో సంపూర్ణ మద్య నిషేధాన్ని విధించారు. మద్యం ద్వారా వచ్చే పన్నుల రాబడిలో నష్టాన్ని కారణంగా చూపి 1997లో దాన్ని సడలిం చారు. ఇటీవల బిహార్ మద్య నిషేధాన్ని విధించగా, కోర్టులు దాన్ని కొట్టేశాయి. దీంతో మరో కొత్త చట్టంతో ఆ రాష్ట్రం తిరిగి నిషేధాన్ని విధించింది. చూడబోతే మద్య నిషేధం ఫుట్ బాల్ ఆటలా మారినట్టుంది. తమిళనాడులో మద్య నిషేధం అప్పుడప్పుడు అమల్లోకి రావడం, ఎత్తివేయడం జరిగింది. మద్యం దుకాణాల సంఖ్యను, అమ్మే సమయాన్ని తగ్గించడం ద్వారా ఇప్పుడు అది తిరిగి ఆ దిశగానే సాగుతోంది. మద్రాస్ ప్రెసిడెన్సీగా ఉన్నప్పటి నుంచి ఆ రాష్ట్రంలో మద్య నిషేధ వారసత్వం ఉంది. మొదటిసారిగా 1971లో దాన్ని సడలించి, 1974లో బిగుతుగా బిగించే శారు. 1981లో మొత్తంగానే ఎత్తేశారు. ఎప్పటికప్పుడు దేశవాళీ మద్యాన్ని అనుమతించడం, నిషేధించడం జరు గుతోంది. నేడు అన్ని పార్టీలూ నిషేధానికి కట్టుబడి ఉన్నామని వాగ్దానం చేస్తున్నాయి. అయితే నిషేధాన్ని అమలు చేయడం ఎలాగనే విషయంలో భిన్నాభిప్రాయా లతో ఉన్నాయి. మహారాష్ట్రలో అధికారికంగా నిషేధం ఊసులేకున్నా, అది కూడా ఆ బాటలోనే సాగుతోంది. అక్కడ మొరార్జీ దేశాయ్ హయాం నుంచి మద్యం తాగడానికి ఎవరికైనా అనుమతి (పర్మిట్) ఉండాలి. నిత్య వ్యవహారంలో ఈ అనుమతి ఒక పరిహాసోక్తిగా మారింది. మందు పుచ్చు కోవాలంటే ఆరోగ్యపరమైన కారణాలను చూపాలి. అయితే రెస్టారెంట్లు ఇప్పుడు యథేచ్ఛగా మందును అందిస్తున్నాయి. మద్య నిషేధ సరళీకరణ విధానాన్ని ప్రకటించాక నెలకు సరిపడా మద్యాన్ని ఇంట్లో నిల్వ చేసుకోవడాన్ని అనుమతించారు. ఇప్పుడు దాన్ని తిరగదోడి రెండు ‘యూనిట్ల’కు పరిమితం చేశారు. యూనిట్ అంటే 40 శాతం శుద్ధ ఆల్కహాల్‌ను కలిగిన ఒక బాటిల్ మద్యం అని అర్థం. ఈ విన్యాసానికి కారణమేమిటో వివరించ లేదు గానీ బహుశా అన్నా హజారే ప్రభావం కావాలి. మునుపటి నిబంధన ప్రకారం నెలకు 48 బీరు సీసాలను (650 ఎమ్ఎల్) లేదా 16 వైన్ సీసాలను(750 ఎమ్ఎల్) లేదా 16 ఆల్కహాల్ సీసాలను (750 ఎమ్ఎల్) ఇంట్లో ఉంచుకోవచ్చు. పర్మిట్ ఉన్నవారు మొత్తం శుద్ధ ఆల్క హాల్ 12 యూనిట్లకు మించకుండా ఈ మూడు రకాల మద్యాన్ని నిల్వ చేసుకోవచ్చు. ఎక్సైజు పన్నుల రూపంలో రూ. 13,500 కోట్లు, వ్యాట్ రూపంలో మరో రూ. 8,000 కోట్లు గత ఏడాది మద్యం వ్యాపారం నుంచి రాబడి లభించింది. కాబట్టి ఇప్పటికే భారీ రుణ భారాన్ని మోస్తూ, కార్లపై విధించే టోల్‌ను కాంట్రాక్టర్లకు తిరిగి చెల్లిస్తున్న రాష్ట్రం మద్య నిషేధం విధించనున్నదని ఊహించడమూ కష్టమే. మద్య నిషేధం ఎత్తివేతకు చంద్రబాబు చూపిన ఆర్థిక సహేతుకత గుర్తుందా? చివ రకు ఇది ప్రభుత్వ ఖజానాలోని నగదుగా తేలుతుంది. ఉదాహరణకు, నితీష్ కుమార్ నేతృత్వంలోని బిహార్ కఠోర నిబంధనలతో కూడిన మద్య నిషేధం కోసం పట్టుబట్టడం సాహసోపేతమైన చర్యే. రూ. 4,000 కోట్ల వార్షిక రాబడి నష్టాన్ని అది పరిగణనలోకి తీసుకుంది. ఎన్టీఆర్లాగే నితీష్ కూడా నిర్లక్ష్యంగా మద్యాన్ని సేవించడం వల్ల కలిగే సామాజిక పర్యవసా నాలకు, ప్రభుత్వాన్ని నడపడానికి అవసరమయ్యే నిధు లకు మధ్య సమతూకం పాటించారు. ప్రభుత్వాలను సమర్థంగా నడపడానికి అవసరమయ్యే రాబడులకు వనరుగా మద్యాన్ని చూపే ప్రభుత్వాలు ప్రతి రూపా యిని లెక్క చూసి జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాయా? మద్య నిషేధం అమలు సులువైనదేమీ కాదు. మహాత్మాగాంధీ పేరు చెప్పుకునే గుజరాత్లో సైతం అది కష్టమే. చుట్టూ మద్యాన్ని వినియోగించే రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలుండగా నిషే ధాన్ని అమలు చేయడం సాధారణ విషయమేమీ కాదు. మహా అయితే వీధుల్లో ఊగుతూ, తూలుతూ పోయే వారు కనబడని నగరాలు మాత్రమే అందుకు మినహా యింపు అవుతాయి. ఎక్కడ దొరుకుద్దో తెలుసుకోవాలే గానీ... గడగడా సీసాలు ఖాళీ చేయడం సాధ్యమే. లాంఛనంగా సమావేశాలకు వచ్చే ప్రతినిధులకు ఆనం దం కలిగించడం కోసం మద్య నిషేధానికి స్వల్పమైన సడలింపు కూడా ఉంది. మద్య నిషేధం ఉన్నా, లేకున్నా అక్రమ మద్యం సమస్య మాత్రం ఆందోళనకరమైనదే. భారీ ప్రాణ నష్టా నికి దారి తీసే మద్యం కల్తీ కారణంగా అది మనం ఊహించగలిగిన దానికంటే ప్రమాదకరమైనది. తమ వ్యాపారానికి దెబ్బ అని మద్యం వ్యాపారులు అక్రమ మద్యాన్ని పట్టించుకునేంత కంటే కూడా తక్కువగానే ప్రభుత్వాలు ఈ సమస్య పట్ల పట్టింపును చూపుతాయి. దశాబ్దాల క్రితం ఆంధ్రప్రదేశ్‌లో సారా కాంట్రాక్టర్లు ప్రభుత్వ అనధికార ప్రతినిధులుగా నాటు సారా బట్టీ లపై దాడులు చేయడమూ, అధికారులు వాటిని అధి కారికమైనవిగా చేయడానికి కాగితాలపై సంతకాలు చేయడమూ నాకు గుర్తుంది. వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు మహేష్ విజాపర్కర్ ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
మద్యం విధానాన్ని మార్చండి
కేసీఆర్‌కు దత్తాత్రేయ లేఖ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం పాలసీతో సామాన్యులు తీవ్రంగా నష్టపోతున్నారని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు కొనసాగే మద్యం విక్రయాలతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. సమయ నియంత్రణ లేని అమ్మకాలతో పేద కుటుం బాలు ఎక్కువగా నష్టపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రమ జీవులు మద్యానికి బానిసలుగా మారుతున్నారని, దీంతో ఉత్పాదకత తగ్గిపోతోందని చెప్పారు. ఆదాయాన్ని పెంచుకునే క్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం విధానంతో... బంగారు తెలంగాణ సాధ్యం కాదని విమర్శించా రు. వెంటనే ఈ విధానాన్ని మార్పు చేయాలని సీఎంను కోరారు. ఈమేరకు ఆదివారం ఆయన సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. అదుపులేని మద్యం విక్రయాలతో జరుగుతున్న అనర్థాలను ఉదాహరణలతో సహా ఆయన లేఖలో వివరించారు. -
జోష్..క్రాష్
సిటీలో పగటిపూటా జోరుగా డ్రంకన్ డ్రైవింగ్ ‘హ్యాపీ అవర్స్’తో కొత్త చిక్కులు మైనర్లు, యువతే అధికం ఈ ఏడాది ఇప్పటి వరకు పగలు చిక్కింది..763 మంది మద్యం వ్యాపారులు ‘హ్యాపీ అవర్స్’గా పిలుచుకుంటున్న గడియలు...ఇప్పుడు అమాయకులకు డెత్ అవర్స్‌గా మారుతున్నాయి. సిటీలో పగలే పూటుగా మద్యం తాగి...అతివేగంతో డ్రైవింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న సంఘటనలు పెరుగుతున్నాయి. ఎక్కువ మంది యుక్తవయస్కులే హ్యాపీ అవర్స్‌లో డ్రంకన్ డ్రైవింగ్ చేస్తూ రోడ్డు ప్రమాదాల బారినపడుతున్నారు. ఇతరుల ప్రాణాలూ తీస్తున్నారు. ఈ నెల ఒకటో తేదీన బంజారాహిల్స్‌లో జరిగిన చిన్నారి రమ్య మృతికి కారణమైన...కారును నడుపుతున్న శ్రావెల్ 21 ఏళ్ళ లోపు యువకుడు. పట్టపగలు ఫుల్లుగా మద్యం తాగి, విచక్షణా రహితంగా డ్రైవింగ్ చేసి నాలుగు కుటుంబాల్లో విషాదం నింపాడు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసు యువత జోష్‌తో జరుగుతున్న ప్రమాదాల్నీ.. పబ్స్ / బార్లలో అమలులో ఉన్న ‘హ్యాపీ అవర్స్’ మరో కోణాన్నీ ఆవిష్కరించాయి. - సాక్షి, సిటీబ్యూరో మద్యం జీవితాలను చిత్తు చేస్తోంది. అమ్మకాలు పెంచుకునేందుకు మద్యం వ్యాపారులు ప్రకటించే ‘ఆఫర్లు’ యువతను చిదిమేస్తున్నాయి. తాగిన మైకంలో యువత జోష్ కోసం చేసే పనులు.. ఎన్నో కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. మరోపక్క మద్యం వ్యాపారులు అమ్మకాలను పెంచుకునేందుకు చేస్తున్న చర్యలు ‘డెత్’ బెల్స్‌ను మోగిస్తున్నాయి. పది రోజుల క్రితం పంజ గుట్ట శ్మశానవాటిక వద్ద జరిగిన ప్రమాదంలో చిన్నారి రమ్యతో పాటు ఆమె చిన్నాన్నను సైతం పొట్టనబెట్టుకుంది. తల్లిని ఆస్పత్రి పాల్జేసింది. ఈ ఘటనకు కారణమైన శ్రావెల్ 21 ఏళ్ల లోపు యువకుడే. గడిచిన కొన్నేళ్ల గణాంకాలను పరిశీలిస్తే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారిలో యువతే అధికం. సిటీలో జరిగిన ప్రమాదాలు, గణాంకాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. - సాక్షి, సిటీబ్యూరో ప్రపంచ వ్యాప్తంగా యువతను ఎక్కువగా బలి తీసుకునేవి రోడ్డు ప్రమాదాలేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనంలో తేలింది. అందులో 30 శాతం మంది 15-30 ఏళ్ల మధ్యవారే ఉంటున్నారని స్పష్టం చేసింది. ఇలా ప్రమాదాల్లో ఏటా కనిష్టంగా 3.5 లక్షల యువత మరణిస్తున్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. నగరంలోని పరిస్థితులూ దీనికి భిన్నం కాదు. ఏటా జరుగుతున్న ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్న వారిలో యువత, ప్రమాదాల బారిన పడుతున్న వాహనాల్లో ద్విచక్ర వాహనాలు (యువత ఎక్కువగా వినియోగించేవి) ఎక్కువ. అజమాయిషీ లేకపోవడం, పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం, పటిష్ట చట్టాలు లేకపోవడంతో ఈ పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. టీనేజర్లు.. టూవీలర్లు నగరంలో ఏటా నమోదవుతున్న ప్రమాదాలను విశ్లేషిస్తే ద్విచక్ర వాహనాల వల్లే ఎక్కువగా జరుగుతున్నట్టు తేలింది. యువత ఎక్కువగా వినియోగించేది ఈ వాహనాలే. ఆ తరవాత స్థానం తేలికపాటి వాహనాలైన కార్లు ఉన్నాయి. ప్రమాదాలకు కారణమవుతున్నవి, బారిన పడుతున్నవి కూడా ఈ తరహా వాహనాలే. ద్విచక్ర వాహనాల వల్ల జరుగుతున్న ప్రమాదాల్లో వాహన చోదకులతో పాటు పాదచారులూ ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. ముఖ్యంగా చాలా విద్యాసంస్థలు నగర శివార్లలో ఉండటంతో సొంత వాహనాలపై వెళ్లి వచ్చే క్రమంలో ఎందరో యువకులు ప్రమాదాలకు గురై మృత్యువాత పడుతున్నారు. దీనికి తోడు జోష్ కోసం చేసే రేసింగ్స్ కూడా యువతను బలి తీసుకుంటోంది. పటిష్ట చట్టాలు కరువు.. సిటీలోని రోడ్ల పరిస్థితి దారుణంగా ఉంటుంది. రహదారులపై వాహనాల కనిష్ట వేగం గంటకు 18 కి.మీ. మించడం లేదు. అయితే, ఇటీవల కాలంలో వచ్చిన వాహనాల వేగం గంటకు 200 కి.మీ.పై ఉంటోంది. దీంతో యువత దానిపై దూసుకుపోతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. నగరంలోని రోడ్ల సామర్థ్యానికి మించిన వాహనాలు కుప్పలు తెప్పలుగా వస్తుండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, వాటిని అడ్డుకోవడానికి అవసరమైన చట్టాలు, నిబంధనలు మాత్రం లేవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తల్లిదండ్రుల పాత్ర కొంత.. యాంత్రిక జీవనయానంలో పిల్లల కదలికలు, బాగోగులు పట్టించుకునే తీరిక తల్లిదండ్రులకు ఉండట్లేదన్నది ట్రాఫిక్ పోలీసుల మాట. దీంతో యువకులు మరింత రెచ్చిపోతున్నారు. పిల్లలకు మైనార్టీ తీరకుండా, లెసైన్స్ లేకుండా వాహనాలు కొనిచ్చి తల్లిదండ్రులు ‘ప్రేమను’ చాటుకుంటున్నారు. వీరు పరోక్షంగా పిల్లల విచ్చలవిడి తనానికి కారణమవుతున్నారని వారు చెప్తున్నారు. ఒకప్పుడు నగరంలోని కొన్ని ప్రాంతాలకు పరిమితమైన బైక్, కార్ రేసింగ్‌లు.. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్, దాని సమీపంలో ఉన్న మార్గాలకు చేరాయి. వీటిని గణించే, అడ్డుకునే పరికరాలు, యంత్రాంగం మాత్రం అదుబాటులో లేదు. ఉన్న వాటినీ సక్రమంగా వినియోగించడంలో ప్రభుత్వ శాఖలు విఫలమవుతున్నాయి. ఫలితంగా ప్రమాదాలకు కారణమై కడుపుకోత మిగులుతోంది. నిబంధనలు చెప్పేది ఇదీ.. భారత మోటారు వాహనాల చట్టం ప్రకారం (ఎంవీ యాక్ట్) పదహారేళ్ల లోపు వయసు వారు ఎలాంటి వాహనాలనూ పడపకూడదు. వీరు వాహనాలను నడుపుతూ రోడ్ల పైకి రావడం నిషేధం. 16 ఏళ్లు నిండిన వారు మాత్రం కేవలం గేర్లు లేని సాధారణ వాహనాలు నడపవచ్చు. 18 ఏళ్లు నిండిన తరవాత మాత్రమే గేర్స్ ఉన్న వాహనాలు నడపడానికి అర్హులు. ఆర్టీఏ అధికారులు లెసైన్స్ సైతం వీరికే మంజూరు చేస్తారు. చట్ట ప్రకారం మైనర్ లేదా డ్రైవింగ్ లెసైన్స్ లేని వ్యక్తికి వాహనాన్ని ఇచ్చిన యజమాని సైతం శిక్షార్హుడే. అంటే ఎవరికైనా మన వాహనాన్ని ఇవ్వాలంటే తొలుత వారు మేజరేనా? డ్రైవింగ్ లెసైన్స్ ఉందా? అనేవి తెలుసుకోవాలి. ఇక్కడ తల్లిదండ్రులకు చట్టాలపై అవగాహన లేకపోవడం, వాటి అమలుపై యంత్రాంగం దృష్టి పెట్టకపోవడంతో ఎన్నో ‘ఇంటి దీపాలు’ చిన్న వయసులోనే ఆరిపోతున్నాయి. విదేశాల్లో అయితే ఇలా.. మానవ జీవితానికి పాశ్చాత్య దేశాల్లో అధిక ప్రాధాన్యం ఇస్తారు. అక్కడ నిబంధనలు సైతం కఠినంగా ఉంటాయి. ఆ రోడ్లపైకి ఎవరైనా డ్రైవింగ్ లెసైన్స్ లేకుండా వాహనం నడుపుతూ వస్తే తక్షణం వాహనం స్వాధీనం చేసుకుంటారు. మైనర్లు చోదకులుగా ఉంటే వారితో పాటు.. తల్లిదండ్రులనూ పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి ఇరువురికీ జరిమానా విధిస్తారు. ఆ జరిమానాలు భారీగా ఉండటమే కాదు.. ఎవరైనా మూడు ఉల్లంఘనలకు మించి పాల్పడితే వారి లెసైన్స్‌ను సైతం రద్దు చేస్తారు. ఇలా ఓసారి లెసైన్స్ రద్దు అయితే మళ్లీ మంజూరు కావడం అనేది దుర్లభం. హ్యాపీ అవర్స్‌తో డెత్ బెల్స్ మద్యం అమ్మకాలు ఎక్కువగా జరిగేది సాయంత్రం తర్వాతే. పగటిపూట ఈ విక్రయశాలలన్నీ దాదాపు ఖాళీగా ఉంటాయి. ఈ నేపథ్యంలో నగరంలోని అనేక బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్స్ వ్యాపారం పెంచుకోవడానికి ‘హ్యాపీ అవర్స్’ విధానాన్ని అవలంబిస్తున్నాయి. దీని ప్రకారం బార్/పబ్ తెరిచిన తర్వాత సాయంత్రం 6 గంటల కంటే ముందు మద్యం సేవించే వారికి ‘1+1’ తరహా ఆఫర్లు ఇచ్చి మందుబాబుల్ని ‘ప్రోత్సహిస్తున్నాయి’. రమ్య మృతికి కారణమైన శ్రావెల్ సైతం మధ్యాహ్నమే ‘హ్యాపీ అవర్స్’లో మద్యం తాగి కారుతో రోడ్డు పైకి వచ్చాడు. డ్రైవింగ్‌పై పట్టు కోల్పోయి ఇద్దరిని పొట్టన పెట్టుకున్నాడు. సైబరాబాద్ ఈస్ట్ అధికారులు ఆదివారం ఒక్కరోజు పగటి పూట జరిపిన తనిఖీల్లో 39 మంది మందుబాబులు వాహనాలు నడుపుతూ చిక్కారు. నగర ట్రాఫిక్ పోలీసులు ఈ ఏడాది ఇప్పటి వరకు చేపట్టిన తనిఖీల్లో 763 మంది పట్టుబడటం ఆందోళన కలిగించే అంశం. యువత పాల్పడే ఉల్లంఘనలు.. యూత్‌తో పాటు మైనర్లు ఎక్కువగా 12 రకాలైన ఉల్లంఘనలకు పాల్పడుతున్నట్లు ట్రాఫిక్ పోలీసుల అధ్యయనంలో తేలింది. వీటిలో ఎనిమిది వైలేషన్స్ వల్ల వారితో పాటు ఎదుటి వారికీ ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. అవి.. డ్రంకెన్ డ్రైవింగ్ హెల్మెట్ లేకపోవడం సిగ్నల్ జంపింగ్ ఓవర్ స్పీడ్ ర్యాష్ డ్రైవింగ్ సెల్‌ఫోన్/ఇయర్‌ఫోన్ డ్రైవింగ్ ట్రిపుల్ రైడింగ్ రాంగ్ సైడ్ డ్రైవింగ్ ప్రమాణాలకు విరుద్ధంగా ఉండే హారన్లు లెసైన్స్/ఆర్సీలు లేకుండా వాహనం నడపడం ధ్రువీకరణలు దగ్గర పెట్టుకోకుండా డ్రైవింగ్ -
మద్య నిషేధం
రాష్ట్రంలో అన్ని పార్టీలు సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని అందుకుని ఉన్నా యి. ఇందులో బీజేపీ కూడా ఒకటి. తమ ఎన్నికల మేనిఫెస్టోలో తొలి పలుకుగా అదే నినాదాన్ని అందుకున్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేస్తామని ప్రకటించారు. తమకు ఒక్క చాన్స్ ఇచ్చి చూడాలని, తమిళనాడును సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ఈసందర్భంగా నితిన్ గడ్కారి హామీ ఇచ్చారు. సాక్షి, చెన్నై : చిన్న పార్టీలతో కలిసి బీజేపీ ఎన్నికల్ని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. 150కు పైగా స్థానాల్లో బీజేపీ అభ్యర్థుల్ని రంగంలోకి దించింది. తమ పార్టీతో పాటుగా కూటమి అభ్యర్థులకు మద్దతుగా కమలనాథులు ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తమకు అవకాశం ఇస్తే, చేసి చూపించే అంశాలతో కూడిన మేనిఫెస్టోను కమలనాథులు సిద్ధం చేశారు. దీనిని టీ నగర్లో జరిగిన కార్యక్రమంలో గురువారం సాయంత్రం కేంద్ర రహదారులు, నౌకాయాన శాఖ మంత్రి నితిన్ గడ్కారి విడుదల చేయగా, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ అందుకున్నారు. ముందుగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ తన ప్రసంగంలో తమకు అవకాశం ఇస్తే, రాష్ట్రాన్ని సమగ్రాభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని ప్రజలకు పిలుపు నిచ్చారు. ఇక, మేనిఫెస్టోను సిద్ధం చేసిన కమిటీని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా అభినందించారు. తదుపరి నితిన్ గడ్కారి తన ప్రసంగంలో యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగు పరిచే విధంగా ముందుకు సాగుతున్నామన్నారు. తమిళనాడులో బిజేపికి ఒక్కఛాన్స్ ఇచ్చి చూడాలని, బిజేపి పాలిత ప్రాంతాల్లో ఏమేరకు అభివృద్ధి పనులు సాగుతున్నాయో, దానికి రెండింతలుగా నిధుల్ని తమిళనాడులో తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిజేపీ రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మురళీ ధరరావు, సీనియర్ నేత ఇలగణేషన్ పాల్గొన్నారు. బీజేపీ మేనిఫెస్టోలో డీఎంకే ప్రకటించిన అంశాలు అనేకం ఉండడం గమనార్హం. మేనిఫెస్టోలో కొన్ని : - అధికారంలోకి రాగానే సంపూర్ణ మద్య నిషేధం - రైతులు తీసుకున్న రుణాలన్నీ మాఫీ - అన్నదాతలకు పెద్ద పీట, వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ - లోకాయుక్త ఏర్పాటు - కొత్త పారిశ్రామిక విధానం - విద్యా, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యం - జౌళి పార్కుల ఏర్పాటు, ఇళ్లు లేని నేత కార్మికులకు సొంత గృహాలు, ఉదయ్ పథకం ద్వారా విద్యుత్ సౌకర్యం - రెండేళ్లలో రాష్ర్టంలో మిగులు విద్యుత్ లక్ష్యం - రాష్ట్రంలో క్రీడావర్సిటీ ఏర్పాటుకు, జిల్లాకో క్రీడా కేంద్రం - శాంతి వనంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, రాజకీయ జోక్యం లేని విధంగా కొత్త విధానాలు - ఆదిద్రావిడ సంక్షేమ శాఖ , అరుంధతీయులకు ప్రత్యేక బోర్డు - సీబీఎస్ఈ తరహాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనలు. నిర్భంధ తమిళంపై పరిశీలన(మాతృభాషల్లో చదువుకునేందుకు వీలుగా అవకాశం) - తీవ్రవాదాన్ని, అసాంఘిక శక్తుల్ని ఉక్కుపాదంతో అణగదొక్కడం లక్ష్యంగా కఠిన నిర్ణయాలు. -మహిళా సంక్షేమం లక్ష్యంగా పథకాలు, పేద యువతుల వివాహానికి ఎనిమిది గ్రాముల బంగారు పథకం, ఉపాధి కల్పన దిశగా శిక్షణా కేంద్రాలు. ప్లస్ టూ వరకు చదువుకునే పేద విద్యార్థినులకు నెలకు రూ. ఐదు వేలు ప్రోత్సాహం. విద్యార్థినులకు ప్రత్యేకంగా అన్నిప్రాంతాల్లో హాస్టళ్లు. - జాలర్ల సంక్షేమం లక్ష్యంగా చర్యలు, దాడుల సమస్యకు శాశ్వత పరిష్కారం - నీటివ్యాపారాన్ని అడ్డుకునే విధంగా రోజుకు 20 లీటర్ల నీటి క్యాన్ పంపిణీ - ఆలయాల పరిరక్షణ, మతమార్పిడి అడ్డుకట్ట, ఆలయాల్లో దర్శనాలకు రుసుం రద్దు. ఆక్రమణలో ఉన్న ఆలయాల ఆస్తుల స్వాధీనం - అన్ని రాష్ట్ర రహదారులు ఫోర్ వేలుగా మార్పు - రేషన్‌కు స్మార్ట్ కార్డు, అన్ని రకాల వస్తువులు ఎల్లప్పుడు లభించే విధంగా చర్యలు - జిల్లాకు ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులు. ఉచిత వైద్యం. - ప్రభుత్వ గుప్పెట్లోకి ఇసుక విక్రయాలు, ధాతు ఇసుక, గ్రానైట్ క్వారీలు కూడా. -2017 సంక్రాంతి పర్వదినంలో మళ్లీ జల్లికట్టు -
నిషా ధర.. నషాళానికి!
⇒చుక్కల్లో మద్యం ధరలు క్వార్టర్‌కు రూ.10 అదనం ఫుల్ బాటిల్‌పై రూ.40 ⇒ఎక్సైజ్ మంత్రి సొంత ఇలాకాలోనూ ఇష్టారాజ్యంగా విక్రయాలు ⇒24 గంటలూ అందుబాటులో మద్యం బెల్టుషాపుల నిర్వహణ షరా మామూలే జిల్లాలో మద్యం ధరలు చుక్కలనంటుతున్నాయి. ఎమ్మార్పీ ధరకు మించి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. జిల్లా అంతటా ఈ పరిస్థితి కొనసాగుతోంది. సాక్షాత్తూ ఎక్సైజ్ మంత్రి సొంత జిల్లా అయినా నిబంధనలను పట్టించుకునే నాథుడే లేడు. అధిక ధరకు విక్రయాలు సాగిస్తున్నా అడిగే పరిస్థితి లేదు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ మద్యం ధరలు ఇష్టారాజ్యంగా పెంచేశారు. మచిలీపట్నం : ఎక్సైజ్ శాఖ మంత్రి సొంత ఇలాకాలో మద్యం ధరలకు రెక్కలొచ్చాయి. జిల్లాలో యథేచ్ఛగా ఎమ్మార్పీపై క్వార్టర్ బాటిల్‌కి రూ.10 పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఫుల్ బాటిల్‌కి ఈవిధంగా రూ.40 అదనంగా వసూలు చేస్తున్నారు. తాజాగా మంత్రి సొంత నియోజకవర్గమైన మచిలీపట్నంలోనూ బరితెగించేశారు. ఐదు రోజుల క్రితం మద్యం సిండికేట్ వ్యాపారులు, మరో ఇద్దరు టీడీపీ కీలక నాయకులు సమావేశమై మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. అనుకున్నదే తడవుగా క్వార్టర్ బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంచేసి విక్రయాలు జరుపుతున్నారు. పట్టణంలోని ఏడు వైన్ షాపులు, పది బార్ అండ్ రెస్టారెంట్లలో ఇవే ధరలు అమలవుతున్నాయి. ఇంతా జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు. జిల్లా అంతటా... జిల్లాలో మొత్తం 334 మద్యం దుకాణాలు ఉండగా, విజయవాడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 160, మచిలీపట్నం ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయ పరిధిలో 174 మద్యం షాపుల వరకు ఉన్నాయి. మచిలీపట్నం ఈఎస్ పోస్టు ఎనిమిది నెలలుగా ఖాళీగానే ఉంది. మచిలీపట్నం సీఐ పోస్టుతో పాటు మచిలీపట్నం ఎక్సైజ్ కార్యాలయ ఏవో పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగానే ఉన్నా వీటిని భర్తీ చేయటం లేదు. ఏఈఎస్ ఇన్చార్జ్ ఈఎస్‌గా వ్యవరిస్తున్నారు. జిల్లా అంతటా మద్యం ధరలు ఎమ్మార్పీ కంటే అదనంగా పెంచి వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. సమయపాలన ఏదీ? మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లలో 24 గంటలూ మద్యం అందుబాటులో ఉంటోంది. నిబంధనల ప్రకారం వైన్‌షాపు ఉదయం 10 గంటలకు తీసి రాత్రి 10 గంటలకు మూసివేయాలి. బార్ అండ్ రెస్టారెంట్లు ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచాలి. ఈ నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమలుకాని పరిస్థితి నెలకొంది. 24 గంటల పాటు మద్యం విక్రయాలు జరుపుతున్నారు. వీటికి తోడు తెలుగు తమ్ముళ్ల కనుసన్నల్లో పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. బెల్టు షాపుల్లో క్వార్టర్ బాటిల్‌కు మరో రూ.5 వసూలు చేస్తున్నారు. చింతగుంటపాలెం, కాలేఖాన్‌పేట, గిలకలదిండి, బందరుకోట బైపాస్‌రోడ్డు తదితర ప్రాంతాల్లో బెల్టుషాపుల నిర్వహణ యథేచ్ఛగా కొనసాగుతోంది. గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. -
సిండి‘కేట్ల’ గుప్పిట్లో మద్యం వ్యాపారం
►ఎంఆర్పీ ఉల్లంఘనపై కమిషనర్ సీరియస్ ►చర్యలకు తటపటాయిస్తున్న అధికారులు ►ధరల నియంత్రణ అమలు చేయాల్సిందే : డిప్యూటీ కమిషనర్ ►క్రాస్ చెకింగ్ కోసం టీంల ఏర్పాటుకు ఆదేశం కర్నూలు: జిల్లాలో మద్యం వ్యాపారులు సిండికేట్లుగా మారి అన్ని రకాల మద్యం సీసాలపై రూ.20 నుంచి రూ.40 వరకు ధర పెంచి అమ్మకాలు సాగిస్తున్నారు. రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం ఇటీవల గూళ్యంలో మద్యం దుకాణంపై దాడి చేసి ధరల ఉల్లంఘనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆలూరులో సీఐగా పనిచేస్తూ శాఖాపరమైన చర్యల్లో భాగంగా మాదవరం చెక్‌పోస్టుకు ఇటీవలే బదిలీ అయిన సీఐ మహేష్‌కుమార్‌పై ఎక్సైజ్ కమిషనర్ ముఖేష్‌కుమార్ మీనా సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎక్సైజ్ శాఖలో ఈ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లాలో మొత్తం 209 మద్యం దుకాణాలు, 36 బార్లు ఉన్నాయి. గత ఏడాది జులై నుంచి కొత్తవారికి అనుమతులిచ్చారు. కొంతకాలం నిర్ణీత ధరలకే విక్రయాలు జరిపిన వ్యాపారులు స్థానికంగా ఎక్సైజ్ అధికారులతో ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కడికక్కడ సిండికేట్లుగా మారి అధిక ధరలకు విక్రయాలు జరుపుతూ సొమ్ము చేసుకుంటున్నారు. మద్యం వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండటంతో స్థానికంగా ఎక్సైజ్ అధికారులు కూడా వ్యాపారులకు వంత పాడక తప్పని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయించేలా చర్యలు తీసుకోవాలని ఇటీవల డిప్యూటీ కమిషనర్లతో హైదరాబాదులో జరిగిన రాష్ట్రస్థాయి సదస్సులో కమిషనర్ ఆదేశాలిచ్చారు. రాష్ట్రస్థాయిలో బృందాలు జిల్లాకు తనిఖీలకు వచ్చి కేసులు నమోదు చేస్తుండటంతో జిల్లాస్థాయి ఎక్సైజ్ అధికారులు ఇరకాటంలో పడ్డారు. కొంతకాలంగా యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయాలు జరిపి సొమ్ము చేసుకుంటున్న వ్యాపారులను కట్టడి చేయడం ఎక్సైజ్ అధికారులకు కష్టసాధ్యంగా మారింది. అధికారుల చర్యలు ఫలించేనా: ఎక్సైజ్ కమిషనర్ హెచ్చరికల నేపథ్యంలో డిప్యుటీ కమిషనర్ నాగలక్ష్మి ధరల నియంత్రణ అమలుపై దృష్టి సారించారు. శనివారం కర్నూలు, నంద్యాల ఇన్చార్జి ఎక్సైజ్ సూపరింటెండెంట్లు హెప్సీబా రాణి, ఫయాజ్‌లతో పాటు సీఐలతో ప్రత్యేకంగా సమావేశమై ఎంఆర్పీ ఉల్లంఘనపై చర్చించారు. ఎక్కడైనా సిండికేట్లకు వంత పలికితే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్రాస్ చెకింగ్ కోసం టీములను ఏర్పాటు చేశారు. ఒక సర్కిల్ పరిధిలోని దుకాణాలను మరో సర్కిల్ పరిధిలోని అధికారులు తనిఖీలు చేసి ఎంఆర్పీ ఉల్లంఘన బయటపడితే కేసులు నమోదు చేసే విధంగా నిర్ణయించారు. ఎంఆర్పీ ధరల ఉల్లంఘన వ్యవహారంలో సీఐ మహేష్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు భయం ఒకవైపు అధికారుల్లో ఉన్నప్పటికీ వ్యాపారులకు అధికార పార్టీ నాయకుల అండదండలు ఉండటంతో నిక్కచ్చిగా ధరల నియంత్రణ అమలు చేయడానికి తటపటాయిస్తున్నారు. స్థానిక అధికారుల సహకారం లేకుండా జిల్లాలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మద్యం విక్రయాలు అమలు సాధ్యమేనా అనే చర్చ జరుగుతోంది. -
మద్యం పాలసీపై మహిళాగ్రహం
బాబు ఎన్నికల హామీలు అమలుచేయాలి మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక విజయవాడ (గాంధీనగర్) : ప్రభుత్వ మద్యం పాలసీపై మహిళలు మండిపడ్డారు. దశలవారీగా మద్యం నియంత్రిస్తామని, బెల్టుషాపులు రద్దుచేస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా పాలసీ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక హనుమంతరాయ గ్రంథాలయంలో మద్యం వ్యతిరేక పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యాన ‘ జనం ప్రాణాలు తీసే మద్యం పాలసీని మార్చాలి ’ అంశంపై శుక్రవారం సదస్సు జరిగింది. పలువురు వక్తలు మాట్లాడుతూ ఆదాయం కోసం నిస్సిగ్గుగా మద్యం అమ్మకాలు జరుపుతున్న సీఎం తీరుపై ధ్వజమెత్తారు. ఐద్వా జాతీయ నాయకురాలు బృందాకరత్ మాట్లాడుతూ మద్యం కారణంగా గృహహింస పెరుగుతోందన్నారు. రాష్ట్రంలో మంచినీటికంటే మద్యమే సులువుగా లభిస్తోందన్నారు. అధికార పార్టీ నాయకులే మద్యం మాఫియా అవతారమెత్తినట్లు సర్వేలో వెల్లడైందన్నారు. కల్తీ మద్యం కేసులో మాజీ ఎమ్మెల్యే అరెస్టయితే సిగ్గుతో తలదించుకోవాల్సిన కాంగ్రెస్ పార్టీ ఆయన్ను రక్షించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఆర్.గంగాభవానీ మాట్లాడుతూ చంద్రబాబు ఒకవైపు మద్యం, మరోవైపు హెరిటేజ్ పాలు రెండింటి ద్వారా ఆదాయం పొందుతున్నారన్నారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మత్స దుర్గాభవాని మాట్లాడుతూ మద్యం నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యమన్నారు. చైతన్య మహిళాసంఘం రాష్ట్ర నాయకురాలు రాధ మాట్లాడుతూ మద్యం కారణంగా కుటుంబాలు వీధినపడుతున్నాయన్నారు. అనంతరం గ్రంథాలయం నుంచి లెనిన్ సెంటర్ భారీ ప్రదర్శన నిర్వహించారు. ప్రభుత్వానికి, మద్యం పాలసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సదస్సులో పి.లక్ష్మణరెడ్డి (మద్య నియంత్రణ కమిటీ ), కఠారి విజయలక్ష్మి (ఏఐపీడబ్ల్యుఏ), గాదె ఝాన్సీ (పీవోడబ్ల్యు), సూర్యారావు (డీవైఎఫ్ఐ), కె.ధనలక్ష్మి (శ్రామిక మహిళ), ఆంజనేయులు (పౌరహక్కుల సంఘం) మనోరమ (మహిళాసత్తా) పాల్గొన్నారు. -
ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో మద్యానికి ఓకే: సుప్రీం
-
ఫైవ్‌స్టార్ హోటల్స్‌లో మద్యానికి ఓకే: సుప్రీం
ఢిల్లీ: కేరళ ప్రభుత్వ మద్యం విధానాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఫైవ్ స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలని కేరళ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం సమర్థించింది. కేరళ బార్స్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేవేస్తూ మంగళవారం కోర్టు తీర్పు వెలవడింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. కేరళ ప్రభుత్వం చర్య వివక్షతతో కూడినదిగా వుందంటూ బార్ యజమానులు విమర్శించారు. దీనివల్ల తాము చేసే వ్యాపారం కోల్పోతున్నామని వాపోయారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బార్ యజమానులు సుప్రీంను ఆశ్రయించి పిటిషిన్ దాఖలు చేశారు. బార్ యాజమానుల పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థిస్తూ ఫైవ్ స్టార్ హోటల్స్‌లో మాత్రమే మద్యం విక్రయాలు జరపొచ్చునని తీర్పు వెల్లడించింది. -
మద్యం ధరలకు రెక్కలు!
♦ ఐఎంఎల్, వైన్‌పై 10%, విదేశీ బ్రాండ్లపై 20% పెంపు? ♦ సర్కార్‌కు నెలాఖరులో ధరల నిర్ణాయక కమిటీ నివేదిక సాక్షి, హైదరాబాద్: మద్యం ధరలు పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరిసారిగా మూడేళ్ల క్రితం మద్యం ధరలను పెంచగా నాలుగు నెలల క్రితం ప్రభుత్వం బీర్ల ధరలు పెంచింది. ఈ నేపథ్యంలో దేశీయ తయారీ మద్యం (ఐఎంఎల్), విదేశీ మద్యం ధరలను కూడా పెంచాలని డిస్టిలరీల యాజమాన్యాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో రెండేళ్లకోసారి మద్యం ధరలను సమీక్షించి పెంచుతుండగా రాష్ట్రంలో మాత్రం ఆ దిశగా ప్రయత్నాలు జరగలేదు. 2015-16 సంవత్సరానికి మద్యం సరఫరా చేసేందుకు నిర్వహించిన టెండర్లలో కూడా దేశంలోని డిస్టిలరీలు అధిక ధరలనే కోట్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితుల్లో మద్యం ధరలను పెంచేందుకు ఏర్పాటైన ధరల నిర్ణాయక ఉన్నత స్థాయి కమిటీ సమర్పించే నివేదిక కోసం ప్రభుత్వం ఎదురు చూస్తోంది. కమిటీ నెలాఖరులోగా నివేదిక ఇచ్చే అవకాశం ఉండగా నవంబర్ మొదటి వారంలో ధరలు పెంచేందుకు సర్కార్ సిద్ధమవుతోంది. తద్వారా డిస్టిలరీలతోపాటు కోట్లాది రూపాయల పెట్టుబడితో కొత్తగా మద్యం దుకాణాలు పొందిన వ్యాపారులు కూడా కొంత ఊరట పొందుతారని ప్రభుత్వం ఆలోచిస్తోంది. పెరిగే ధరలపై వ్యాట్ రూపంలో సర్కార్‌కు కూడా కొంత ఆదాయం సమకూర నుంది. దేశీయ తయారీ మద్యాన్ని (ఐఎంఎల్) మద్యం తయారీ కంపెనీలు (డిస్టిలరీలు) టీఎస్‌బీసీఎల్‌కు విక్రయించే ధరలను బట్టి చీప్ లిక్కర్, మీడియం లిక్కర్, ప్రీమియం లిక్కర్‌గా నిర్ధారిస్తారు. ఇవి కాకుండా విదేశీ మద్యం అదనం. డిస్టిలరీలకు చీప్ లిక్కర్‌పై పెట్టెకు రూ. 450 లోపు, మీడియం లిక్కర్‌కు రూ. 750, ప్రీమియం లిక్కర్‌కు రూ. 750కన్నా ఎక్కువగా టీఎస్‌బీసీఎల్ చెల్లిస్తోంది. దీనికి వ్యాట్, కేంద్ర సుంకం తదిత రాలు కలిపి ఎంఆర్‌పీగా నిర్ణయిస్తోంది. ధరల పెంపుపై ఏర్పాటైన కమిటీ ప్రస్తుతం టీఎస్‌బీసీఎల్ డిస్టిలరీలకు చెల్లిస్తున్న మొత్తం, వ్యాట్, ఎంఆర్పీలపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఇప్పుడు డిస్టిలరీలకు చీప్, మీడియం, ప్రీమియం లిక్కర్‌కు ఒక పెట్టెకు ఇస్తున్న మొత్తాన్ని 10 శాతం వరకు పెంచాలని యోచిస్తోంది. వైన్ వినియోగం రాష్ట్రంలో తక్కువగా ఉన్నందున కొత్త వెరైటీ వైన్ బ్రాండ్లను రాష్ట్రానికి దిగుమతి చేయించి వాటి ధరలను కూడా 10 శాతం పెంచే యోచనలో ఉంది. విదేశీ మద్యం ధరలను మాత్రం 20 శాతం వరకు పెంచాలనుకుంటున్నట్లు తెలిసింది. పెరిగిన ధరలపై వ్యాట్‌ను అమలు చేయడం ద్వారా ఒక్కో ఫుల్‌బాటిల్‌పై బట్టి రూ. 20 నుంచి 50 వరకు ఎంఆర్పీ పెరిగే అవకాశం ఉంటుందని టీఎస్‌బీసీఎల్ వర్గాలు తెలిపాయి. ధరల పెంపుపై దసరా తరువాత నిర్ణయం తీసుకొని నవంబర్ మొదటి వారంలో అమలు చేయాలని సర్కార్ భావిస్తోంది. ఈ విషయాన్ని సచివాలయ వర్గాలు కూడా ధ్రువీకరించాయి. -
పల్లెలెట్టా..ఊగుతున్నయంటే..!
మద్యం వ్యాపారులు ఇక నుంచి పల్లెలను మత్తులో ఉంచనున్నారు. ఎక్సైజ్ అధికారుల అనధికార అనుమతితో గ్రామాల్లో వీధివీధినా బెల్ట్‌షాపుల ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. ఏకంగా వేలం పాటలు నిర్వహించి కొందరికి మద్యం అమ్ముకునే హక్కు కల్పించారు. వారు ఇక నుంచి ఇంటింటికీ మద్యం సరఫరా చేయాలన్నమాట! వ్యాపారులు, బెల్ట్‌షాపుల నిర్వాహకుల కుటిల ఎత్తులో మందుబాబులు చిత్తు కావడం గ్యారంటీ. - గ్రామిణులకు చేరువలో బెల్ట్‌షాపులు - ఉలవపాడు మండలంలో ఇంటింటికీ మద్యం - వ్యాపారులు యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్న నిబంధనలు - మత్స్యకార గ్రామాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణకు వేలంపాట - వ్యాపారుల నుంచి వాటాలు తీసుకుని నిద్రనటిస్తున్న ఎక్సైజ్ పోలీసులు ఉలవపాడు : పల్లెలన్నీ ఇక మత్తులో ఉండనున్నాయి. గ్రామాల్లో వీధివిధినా బెల్ట్‌షాపుల ఏర్పాటుకు ఎక్సైజ్ అధికారులు అనధికారికంగా మద్యం వాపారులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. ఇందుకు ప్రతిఫలంగా అధికారులకు వ్యాపారులు కానుకలు ముట్టజెప్పారు. ఉలవపాడు మండలంలో పరిస్థితి మరీ దారుణం. ఇంటింటికీ మద్యం సరఫరా చేసేందుకు అక్కడి వ్యాపారులు తమ సామ్రాజ్యాన్ని ఇప్పుడిప్పుడే విస్తరించుకుంటున్నారు. గతంలో గుట్టుచప్పుడు కాకుండా బెల్ట్‌షాపులు నిర్వహించేవారు. ఇప్పుడు వాటి నిర్వహణకు వ్యాపారులు కొత్త పంథా ఎంచుకున్నారు. లెసైన్స్ ఉన్న మద్యం వ్యాపారులు గ్రామాలకు వెళ్లి బహిరంగ వేలం నిర్వహించి గ్రామస్తులకు స్థానికంగా మద్యం అమ్ముకునే హక్కు కల్పిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో లెసైన్స్ లేకున్నా ఏకంగా మద్యం షాపులనే బహిరంగంగా నిర్వహిస్తున్నారు. మత్స్యకార గ్రామాలే టార్గెట్ మద్యం వ్యాపారులు మత్స్యకార గ్రామాలను టార్గెట్ చేసుకున్నారు. వేలం పాటలు ఎక్కువగా మత్స్యకార గ్రామాల్లోనే జరిగాయి. గ్రామ పెద్దలకు కొంత నగదు అందజేస్తే వ్యాపారులు మద్యం యథేచ్చగా అమ్ముకోవచ్చు. 5 లెసైన్స్డు షాపుల యజమానులు మండలంలోని గ్రామాలను పంచుకున్నారు. షాపును రెండేళ్లు నిర్వహించుకునేందుకు వేలం వేశారు. అలగాయపాలెం బెల్ట్‌షాపును రూ.7 లక్షలు, టెంకాయచెట్లపాలెం రూ.1.5 లక్షలు, కొత్తపల్లెపాలెం రూ.1.70 లక్షలు, బట్టిసోమయ్య పాలెం రూ.90 వేలు, పెదపట్టపుపాలెం రూ.10 లక్షలు, చినపట్టపుపాలెం రూ.2 లక్షలకు పాట నిర్వహించారు. ఉప్పరపాలెం, భీమవరం గ్రామాల్లో లెసైన్స్డు షాపు నిర్వాహకులే మద్యం అమ్ముకుంటున్నారు. ఇలా 38 బెల్ట్‌షాపులు ఏర్పాటు చేశారు. వ్యాపారులు రూ.30 లక్షలకుపైనే దండుకున్నట్లు సమాచారం. ఎక్సైజ్ పోలీసుల నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని బెల్ట్‌షాపుల నిర్వాహకులకు మద్యం వ్యాపారులు హామీ ఇవ్వడం గమనార్హం. మేం ఊరుకోం.. బెల్ట్‌షాపులు నిర్వహిస్తే ఊరుకునేది లేదని కొన్ని గ్రామాల ప్రజలు మద్యం వ్యాపారులకు తెగేసి చెప్పారు. గ్రామానికి కొంత డబ్బు ఇస్తామని చెబుతున్నా వారు అంగీకరించడం లేదు. పట్టువదలని విక్రమార్కుల్లా వ్యాపారులు గ్రామ పెద్దల చుట్టూ ఇప్పటికీ తిరుగుతుండటం గమనార్హం. బెల్ట్‌షాపులను వ్యతిరేకిస్తున్న గ్రామాల్లో కరేడు పరిధిలోని పెదపల్లెపాలెం, రామకృష్ణాపురం ఉన్నాయి. -
చీప్ లిక్కర్ పై వెనక్కి
పాత పద్ధతిలోనే మద్యం పాలసీ కొనసాగింపు కేబినెట్ భేటీ అనంతరం సీఎం కె. చంద్రశేఖర్‌రావు వెల్లడి ♦ గుడుంబాపై ఉక్కుపాదం మోపుతాం ♦ తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తాం ♦ జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సీఎస్ ఆధ్వర్యంలో కమిటీ ♦ కమిటీ నివేదిక ప్రకారం కొత్త జిల్లాల ఏర్పాటు ♦ త్వరలోనే తెలంగాణ జల వినియోగ విధానం ♦ మొత్తం రూ. 81 వేల కోట్లతో ప్రాజెక్టుల నిర్మాణం ♦ కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు అథారిటీలు ♦ పెరిగిన డీఏకు మంత్రివర్గం ఆమోదం ♦ సిటీ ఆర్టీసీ నష్టాలను జీహెచ్ఎంసీ భరించేలా ♦ చట్ట సవరణ... సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ సాక్షి, హైదరాబాద్: వివిధ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో చీప్ లిక్కర్‌పై రాష్ట్ర సర్కారు వెనక్కి తగ్గింది. గుడుంబాకు అడ్డుకట్ట వేసేందుకు తక్కువ ధరకు దొరికే చీప్ లిక్కర్‌ను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది. మద్యం పాలసీ విషయంలో పాత పద్ధతినే కొనసాగించాలని నిర్ణయించింది. ప్రజల నుంచి మిశ్రమ స్పందన రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు సీఎం కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అదే సమయంలో గుడుంబాపై ఉక్కుపాదం మోపుతామని స్పష్టంచేశారు. ఐజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేసి గుడుంబా తయా రీ, విక్రయాలకు అడ్డుకట్ట వేస్తామని, తయారీదారులపై పీడీ చట్టం ప్రయోగిస్తామని చెప్పా రు. బుధవారం మధ్యాహ్నం నుంచి 5గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ భేటీ జరిగింది. మద్యం విధానం, జిల్లాల పునర్విభజన, గృహ నిర్మాణం, తెలంగాణ జల వినియోగ విధానం, మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లపై కేబినెట్లో చర్చ జరిగింది. సమావేశం తర్వాత సీఎం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ఓకే జిల్లాల పునర్వ్యవస్థీకరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎస్ రాజీవ్‌శర్మ ఆద్వర్యంలో నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసినట్లు సీఎం వెల్లడించారు. ''ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం జిల్లాల పునర్వ్యవస్థీకరణకు నిర్ణ యం తీసుకున్నాం. దేశంలో సగటున 19 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. తెలంగాణలో మాత్రం 35 లక్షల జనాభాకు ఒక జిల్లా ఉంది. దీంతో పాలనాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నా యి. అందుకే కొత్త జిల్లాల ఏర్పాటుపై ఎన్నికల్లో హామీ ఇచ్చాం. మేనిఫెస్టోలోనూ ప్రకటిం చాం. దీన్ని అమలు చేసేందుకు చీఫ్ సెక్రెటరీ అధ్యక్షతన నలుగురు సీనియర్ సెక్రెటరీలతో కమిటీ ఏర్పాటు చేశాం. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తాం''అని సీఎం వెల్లడించారు. మొత్తం 43 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సీఎం వెల్లడించిన కీలకాంశాలివీ.. 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఈ ఏడాది రూ.3,900 కోట్ల ఖర్చుతో నిరుపేదలకు 60 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మిస్తాం. గ్రామీణ ప్రాంతాల్లో 560 చదరపు గజాల విస్తీర్ణంతో నిర్మించే ఒక్కో ఇంటికి రూ.5.04 లక్షలు అవుతుంది. జీహెచ్ఎంసీ, మున్సిపల్ కార్పొరేషన్లలో అంతే విస్తీర్ణంలో నిర్మించే ఇంటికి రూ.5.30 లక్షల అంచనా వ్యయమవుతుంది. హైదరాబాద్ ఐడీహెచ్ కాలనీలో నిర్మించిన నమూనాలో వీటిని నిర్మిస్తారు. గతంలో ఇళ్ల నిర్మాణంలో అక్రమాలు జరిగాయి. కానీ అసంపూర్తిగా ఉన్న గృహాలు, బిల్లులు అందని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేస్తాం. మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు దేశంలోనే తొలిసారిగా మార్కెట్ కమిటీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్నాం. తెలంగాణలో మొత్తం 183 వ్యవసాయ మార్కెట్ కమిటీలున్నాయి. వీటిలో గిరిజన ప్రాంతాల్లో ఉన్న 13 కమిటీలను పీసా చట్టం ప్రకారం ఎస్టీలకు కేటాయించాలి. మిగతా 170 మార్కెట్లలో 50 శాతం కమిటీలను రిజర్వు చేస్తార. అంటే 85 మార్కెట్లను బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయిస్తాం. ఉద్యోగాలకు ఉన్న రిజర్వేషన్ల శాతాన్నే అమలు చేయటంతో పాటు లాటరీ పద్ధతిన రిజర్వేషన్లు ఖరారు చేస్తాం. మిగతా 85 మార్కెట్లు జనరల్ కోటాలో ఉంటాయి. వచ్చే ఏడాది రొటేషన్ పద్ధతిలో ఇవి తారుమారవుతాయి. అంటే జనరల్ కోటాలో ఉన్న మార్కెట్లకు రిజర్వేషన్లను వర్తింపజేసి.. ఇప్పుడు రిజర్వ్ అయిన మార్కెట్లను జనరల్ కోటాకు మారుస్తాం. సిటీ బస్సుల నష్టం జీహెచ్ఎంసీకే.. రవాణా సదుపాయాలను మరింత మెరుగుపరిచేందుకు వీలుగా ఆర్టీసీని పరిరక్షించుకోవాలి. నగరంలో రోజుకు 3,800 బస్సులు సేవలు అందిస్తున్నాయి. వీటి ద్వారా ఆర్టీసీకి ఏటా రూ.218 కోట్ల నష్టం వస్తోంది. అమెరికా, యూరప్‌తో పాటు అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రజా రవాణా నష్టాల్లోనే ఉంది. వీటిని అక్కడి స్థానిక సంస్థలే నిర్వహిస్తున్నాయి. ముంబైలో కూడా ఇదే విధానముంది. అదే తరహాలో సిటీ లో ఆర్టీసీకి వచ్చే నష్టాలను జీహెచ్ఎంసీ భరిం చేలా చట్ట సవరణ చేశాం. ఇప్పట్నుంచీ జీహెచ్ఎంసీ కమిషనర్‌ను టీఎస్ఆర్టీసీ బోర్డులో డెరైక్టర్‌గా నియమించేందుకు నిర్ణయించాం. త్వరలోనే జల వినియోగ విధానం రాష్ట్రానికి లాభం జరిగేలా.. రైతుల సాగునీటి కోసం ఇరిగేషన్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ పూర్తై ది. త్వరలోనే తెలంగాణ జల వినియోగ విధా నం ప్రకటిస్తాం. రాబోయే మూడేళ్లు వరుసగా సాగునీటి ప్రాజెక్టులకు ఏటా బడ్జెట్టులో రూ.25 వేల కోట్లు కేటాయిస్తాం. ఈ ఏడాది ప్రతి నెలా రూ.వెయ్యి కోట్ల చొప్పున ఖర్చు చేస్తాం. మొత్తం రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టులను నిర్మించాలనేది లక్ష్యం. ప్రాణహిత, ఇం ద్రావతి నదులు కలిసిన తర్వా త గోదావరిపై నిర్మించే బ్యారేజీకి లైడార్ సర్వే మొదలైంది. ఇది పూర్తయ్యాక జల విధానం వెల్లడిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కోరాం. కరువును ఎదుర్కొనేందుకు సిద్ధం కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సెప్టెంబరు వరకు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఆ తర్వాతే పరిస్థితులను అంచనా వేసి కరువు మండలాలపై నిర్ణయం తీసుకుంటాం. 3 జిల్లాలు సుభిక్షంగా ఉంటే 6 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రైతుల ఆత్మహత్యలపై పరిహారాన్ని పెంచే ప్రతిపాదనను ఆలోచిస్తాం. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారాన్ని అందించటం లేదనడం సరికాదు. కలెక్టర్ల ఆధ్వర్యంలోనే నిధులున్నాయి. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్యాకేజీ అమలు చేస్తున్నారు. జీతాల పెంపు ఆలోచన లేదు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచే ఆలోచన లేదు. ఇచ్చిన మాట ప్రకారం కాం ట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగుల విభజన పూర్తయితే ఈ ప్రక్రియ మొదలవుతుంది. సింగిల్ పోలీస్ విధానంపై సివిల్ పోలీసులు, బెటాలియన్లు, ప్రత్యేక పోలీస్ ఫోర్స్‌ను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే ఆలోచన ఉంది. పోలీసు బలగాలను ఒక్కసారిగా సివిల్ పోలీసులుగా మార్చితే వచ్చే ఇబ్బందులను అధ్యయనం చేస్తున్నాం. ఎస్కలేషన్‌కు పచ్చజెండా కాగా, రాష్ట్రంలో కొనసాగుతున్న సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ధరల పెంపు (ఎస్కలేషన్)కు కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఉమ్మడి ఏపీలో ఇచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులతో అమలు చేసేం దుకు సానుకూలత తెలిపింది. పనులు జరగని చోట టెండర్ రద్దుచేసి కొత్తగా టెండర్లు పిలిస్తే వ్యయ భారం దాదాపు వందరెట్లు పెరుగుతుండటం, న్యాయపరమైన చిక్కులు తప్పవని కేబినెట్ సబ్ కమిటీ నివేదించిన దృష్ట్యానే ఈ నిర్ణయానికి వచ్చిన ట్లు తెలుస్తుంది. కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్.. 'కేసీఆర్ ఈజ్ ఏ ఫైటర్... క్రూసేడర్.. తెలంగాణ వచ్చేదాకా పోరాడిన వ్యక్తిని. నా కంఠంలో ప్రాణమున్నంత వరకు తెలంగాణకు నష్టం జరిగే పని చేయను. తెలంగాణ భవిష్యత్తుకు మేం వేస్తున్నదే పునాది. వాస్తవాలు గుర్తించని వారెన్నో విమర్శలు చేస్తున్నారు'అని ముఖ్యమంత్రి కేసీఆర్ విపక్షాలపై ధ్వజమెత్తారు. తాను చేసే ప్రయత్నంతో నదీ జలాలు వస్తాయనే ధీమా వెలిబుచ్చారు. 'గతంలో మీడియం, మైనర్ ప్రాజెక్టులను మరిచిపోయారు. పెన్‌గంగ, గోదావరిపై మహారాష్ట్ర 218 బ్యారేజీలు నిర్మించింది. కృష్ణా నదిపై 78 బ్యారేజీలున్నాయి. ఎస్సారెస్పీ, జూరాలకు చుక్క నీరు రావటం లేదు. అందుకే ఇంద్రావతి, ప్రాణహిత కలిసిన తర్వాత గోదావరి నుంచి నీటిని తీసుకునేందుకు ప్రాజెక్టు రీ డిజైన్ చేశాం. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌తో వివాదాలు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి నీటిని వాడుకుంటాం. గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఎక్కడెక్కడ ఎన్ని బ్యారేజీలున్నాయో త్వరలోనే వెల్లడిస్తాం. ఎవరికైనా అపోహలుంటే మానుకోండి. అనవసర పనికి మాలిన విమర్శలు మానండి' అని హితవు పలికారు. కేబినెట్ తీసుకున్న మరిన్ని నిర్ణయాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు పెరిగిన డీఏ చెల్లింపునకు ఆమోదం. జనవరి నుంచి 3.144 % పెరిగిన డీఏ చెల్లించాల్సి ఉంది. రాష్ట్రంలో కొత్తగా నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలం మాల్తుమ్మెద, మహబూబ్‌నగర్ జిల్లా పాలెం, కరీంనగర్ జిల్లాలో జమ్మికుంటలో కొత్తగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీల ఏర్పాటు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు జీహెచ్ఎంసీలో రూ.2,631 కోట్ల అంచనా వ్యయంతో స్ట్రాటెజిక్ డెవలప్మెంట్ ప్రాజెక్టు అమలుకు నిర్ణయం. 20 చోట్ల మల్టీ లెవెల్ ప్లై ఓవర్ల నిర్మాణం. ఉద్యోగ నియామకాలకు సాధారణ గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులకు కేబినెట్ ఆమోద ముద్ర. యూనిఫాం సర్వీసులకు వయో పరిమితి పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయి. సంబంధిత విభాగాల అధికారులతో చర్చించిన తర్వాత నిర్ణయం. హైదరాబాద్‌లో మొబైల్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఏర్పాటుకు వీలుగా ప్రత్యేక రాయితీలు. ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ ప్రొఫెషన్ టాక్ట్ యాక్ట్, ఏపీ నర్సెస్, హెల్త్ విజిటర్స్ యాక్ట్‌ను తెలంగాణకు అన్వయించేలా వర్తింపజేసేందుకు ఆమోదం. తెలంగాణ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయం. ఏపీ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు నుంచి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంకు విభజన, నాబార్డు నుంచి తీసుకున్న రూ.2,500 కోట్ల రుణానికి ప్రభుత్వం గ్యారంటీ. -
నీళ్లు కావాలంటే... మద్యం తాగండనట్లుంది
ఆదిలాబాద్ : ప్రజలు నీళ్లు కావాలి మొర్రో అంటే మద్యం తాగండి అన్నట్లుగా టీఆర్ఎస్ సర్కారు తీరు ఉందని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి ఎద్దేవా చేశారు. బుధవారం అదిలాబాద్ జిల్లా మందమర్రిలోని కమ్యూనిటీ హల్లో జరిగిన సదస్సులో ఆమె మాట్లాడుతూ... ఓ వైపు తాగడానికి మంచినీళ్లు లేక జనం అలమటిస్తుంటే నూతన మద్యం, సర్కారు చీపులిక్కరు... గుడుంబా కంటే చాలా మంచిదంటూ ప్రభుత్వం ప్రచారం చేయడం హస్యాస్పదమని జ్యోతి ఆరోపించారు. ప్రజలకు కావాల్సింది మంచినీరే కానీ మద్యం కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం సాధించి బంగారు తెలంగాణ నిర్మించుకుందామన్న సీఎం కేసీఆర్ చివరకు తెలంగాణను మద్యంలో ముంచెత్తాలని చేస్తున్నారని జ్యోతి విమర్శించారు. -
'ముందు మంత్రులతో తాగించండి'
కరీంనగర్:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న చీప్ లిక్కర్ పాలసీపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కమీషన్ల కోసమే చీప్ లిక్కర్ ను తెస్తున్నారని జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబులు విమర్శించారు. చీప్ లిక్కర్ తాగితే ఆయుష్షు పెరుగుతుందంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్.. ముందుగా మంత్రులతో చీప్ లిక్కర్ తాగించాలని ఎద్దేవా చేశారు. గీత కార్మికుల పొట్ట కొట్టేలా చీప్ లిక్కర్ తెస్తే చూస్తూ ఊరుకోమన్నారు. జగిత్యాల నుంచి చీప్ లిక్కర్ వ్యతిరేక ఉద్యమం ప్రారంభిస్తామన్నారు. చీప్ లిక్కర్, గుడాంబాను ఆరికట్టే వరకూ ఉద్యమం కొనసాగిస్తామని తెలిపారు. -
మద్యం నల్లాలు ఇస్తారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చౌక మద్యం విక్రయాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చీప్ లిక్కర్ వల్ల యువత దారి తప్పే ప్రమాదం ముందని మహిళా నేతలు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డిలు విమర్శించారు. చౌక మద్యం వల్ల మహిళలపై దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇంటింటికీ నల్లాలు ఇస్తామని.. ఇప్పుడు మద్యం నల్లాలు ఇస్తామంటారా?అని ప్రశ్నించారు. ఐదు వేల కోట్ల ఆదాయం కోసం చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పేదల రక్తాన్ని తాగడమేనని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. -
మద్యం పాలసీని అమలు చేయగలమా?
ఎక్సైజ్‌శాఖ తర్జనభర్జన కీలకపోస్టుల్లో ఇన్చార్జీల పాలన 220 ఎస్ఐ, 340 కానిస్టేబుళ్లను నియమించాలని వినతి హైదరాబాద్: తెలంగాణ పల్లెల్లో గుడుంబాను అరికట్టి దానిస్థానంలో చీప్‌లిక్కర్‌ను తీసుకొచ్చేందుకు రూపొందిస్తున్న మద్యం పాలసీ విధివిధానాల కోసం ప్రభుత్వం ముమ్మర కసరత్తు చేస్తోంది. సిబ్బంది కొరత దృష్ట్యా మద్యం పాలసీని తక్షణం అమలు చేయగలమా? అనే సందేహం ఎక్సైజ్‌శాఖను పట్టి పీడిస్తోంది. మండలం యూనిట్‌గా లాటరీ పద్ధతిలో లెసైన్స్‌లను జారీ చేసి, సదరు లెసైన్స్దారునికే గ్రామాల్లో చీప్ లిక్కర్ అమ్ముకునేందుకు పర్మిట్లు మంజూరు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. జిల్లా యూనిట్‌గా ఉన్నప్పుడే నకిలీమద్యం, అధిక ధరలను నియంత్రించలేకపోయిందనే అపఖ్యాతి మూటగట్టుకున్న ఎక్సైజ్‌శాఖ, చీప్‌లిక్కర్ పాలసీని మండల, గ్రామస్థాయిలో ఎలా పర్యవేక్షిస్తుందనేది చర్చనీయాంశంగా మారింది. వేధిస్తున్న సిబ్బంది కొరత! ఖజానాకు భారీగా ఆదాయాన్ని సాధించిపెట్టే శాఖల్లో ప్రధానమైన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో ఏడాదిగా ఇన్చార్జీల పాలన కొనసాగుతోంది. ఉన్నతస్థాయి నుంచి కిందిస్థాయి వరకు దాదాపు 200 పోస్టుల్లో అధికారులు అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అడిషనల్ కమిషనర్, రెండు జాయింట్ కమిషనర్, మూడు డిప్యూటీ కమిషనర్ పోస్టులతోపాటు 12 అసిస్టెంట్ సూపరింటెండెంట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 45మంది అసిస్టెంట్ సూపరింటెండెంట్లలో 15 ఖాళీగా ఉన్నాయి. ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో మూడు జిల్లా ఎస్పీ పోస్టులు ఉండగా.. ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. ఉన్నత స్థాయి పోస్టులు ప్రమోషన్లతోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. ప్రమోషన్లకు సంబంధించిన ఫైల్ ఏడాదికాలంగా సీఎం వద్ద పెండింగ్‌లో ఉంది. క్షేత్రస్థాయి సిబ్బంది కొరతను అధిగమించేందుకు వెంటనే 220 ఎస్సై, 340 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయాలని ఎక్సైజ్ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. -
కన్నీటి ధారలో కొట్టుకుపోవడం ఖాయం
- ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.హైమావతి - ఇల్లెందుకు చేరిన బస్సు యూత్ర ఇల్లెందు : రాష్ట్రంలో నూతన మద్యం పాలసీని ప్రవేశపెట్టి మద్యం రాష్ట్రంగా మార్చాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారని, దీనిని నియంత్రించకపోతే మహిళల కన్నీటి ధారలో కేసీఆర్ కొట్టుకుపోతాడని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి బి.హైమావతి హెచ్చరించారు. మద్యాన్ని నియంత్రించాలని.. మహిళలపై పెరుగుతున్న హిం సను అరికట్టాలని కోరుతూ చేపట్టిన ఐద్వా రాష్ట్రవ్యా ప్త బస్సు యాత్ర బుధవారం ఇల్లెందుకు చేరింది. ఈ సందర్భంగా యూత్రకు స్థానిక నేతలు ఘన స్వాగ తం పలికారు. అనంతరం న్యూ బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో హైమావతి ప్రసంగించారు. మద్యం వల్ల రాష్ట్ర ఆదాయం పెరుగుతుందని సాకు లు చెబుతూ గ్రామాలను కలుషితం చేయాలని కేసీఆర్ యత్నిస్తున్నాడని అన్నారు. గంగదేవిపల్లిని దత్త త తీసుకున్నట్లు ప్రకటించిన ఆయనకు గంగదేవిపల్లిలో మద్యం లేకపోవటం వల్లే అభివృద్ధి సాధ్యమైం దన్న సంగతి తెలియదా అని ప్రశ్నించారు. సభకు ఐద్వా డివిజన్ కార్యదర్శ మెరుగు రమణ అధ్యక్షత వ హించగా.. రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత, ఉపాధ్యక్షురాలు రత్నమాల, సహాయ కార్యదర్శి బుగ్గవీటి సరళ, అఫ్రోజ్ సమీన, మాచర్ల భారతి, సత్యవతి, జైబున్నీసా, సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు. బస్సు యాత్రకు సంఘీభావంగా ఇల్లెందు జెడ్పీటీసీ చండ్ర అరుణ, పీఓడబ్ల్యూ నాయకురాలు బయ్య శారద, మహిళా సమాఖ్య జిల్లా నాయకురాలు ఏపూరి లలితాదేవి, సీపీఎం డివిజన్ కార్యదర్శి మెరుగు సత్యనారాయణ, ప్రజా సంఘాల నాయకులు దేవులపల్లి యాకయ్య, పిట్టల రవి, కుంటా ఉపేందర్, ఎస్ఐ నబీ, కిరణ్, ఆర్.శ్రీను, వజ్జా సురేష్, యూటీఎఫ్ నుంచి రాందాస్ పాల్గొని సంఘీభావం తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం పాల్వంచ : రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్షంగా పాలన సాగిస్తూ.. కొత్త ఎక్సైజ్ విధానానికి రూపకల్పన చేస్తోందని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆశాలత అన్నారు. స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్ద బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మద్యాన్ని నియంత్రించి.. మహిళలపై రోజురోజుకు పెరుగుతున్న హింసను అరికట్టాలని అన్నారు. మద్యాన్ని నియంత్రించేలా కొత్త ఎక్సైజ్ విధానాలను మర్చాలని, అన్ని షాపులను రాత్రి పది గంటలకల్లా మూసివేయాలని, జాతీయ రహదారుల వెంట మద్యం షాపులకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేశారు. సమావేశంలో ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.సరళ, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.జ్యోతి, ఎం.భారతి, ఎన్.రత్నమాల, మినా, అఫ్రోజ్ సమీనా, డివిజన్ నాయకులు ఎస్.లక్ష్మి, కె.సత్య, వి.వాణి, శకుంతల, ఇందిర, నాగమణి పాల్గొన్నారు. -
చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా పోరు
రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్షాల పిలుపు హైదరాబాద్: చీప్‌లిక్కర్ ప్రవాహానికి అడ్డుకట్ట వేయాలని అఖిలపక్ష నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగుతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీ(చీప్ లిక్కర్)ని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. సీఎం, ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ లేదా సిరిసిల్ల నుంచే ఉద్యమానికి శ్రీకారం చూట్టాలని నిర్ణయించారు. మంగళవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘తెలంగాణ మద్య వ్యతిరేక ఉద్యమం’ ఆధ్వర్యంలో రౌండ్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గుడుంబాపై ఉక్కుపాదం మోపాలంటూనే చీప్ లిక్కర్ అమ్మకాలను పెంచాలనుకోవడం తగదన్నారు. చీప్ లిక్కర్‌కు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులు తీర్మానం చేయాలని సూచించారు. బీజేపీ శాసనసభాపక్ష నేత డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ అసెంబ్లీ శీతాకాల సమావేశంలో సారాపై పోరాడతామన్నారు. కేంద్ర మాజీమంత్రి బలరాం నాయక్ మాట్లాడుతూ దివంగత సీఎం వైఎస్సార్ ఆదివాసీల పోడు భూములకు పట్టాలు ఇస్తే వాటినిప్పుడు రద్దు చేసి సారా ఇస్తారా అని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ నేత ఆదం విజయ్ కుమార్ మాట్లాడుతూ బంగారు తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమించకుంటే ప్రభుత్వం సారాగ్రిడ్ను కూడా తీసుకువస్తుందని తెలంగాణ ఉద్యమవేదిక అధ్యక్షుడు చెరకు సుధాకర్ అన్నారు. కార్యక్రమంలో సామాజిక ఉద్యమనేత వీజీఆర్ నారగోని, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వరరావు, డా. శ్రవణ్, ఆప్ నేతలు నమ్రత, వెంకటరెడ్డి, పద్మశాలీ సంఘం నేత టి.నాగయ్య, మా జీ ఎమ్మెల్యే బి.బిక్షమయ్యగౌడ్, ప్రజాసంఘాల నేతలు బెల్లయ్య నాయక్, మంజీలాల్ నాయక్, షకీల, బి.శోభారాణి, బాలలక్ష్మి పాల్గొన్నారు. మద్యం పాలసీ ఉపసంహరించాలి: సీపీఐ హైదరాబాద్: పేదల సామాజిక, ఆర్థిక స్థితిగతులను దెబ్బతీసే విధంగా రూపొందిస్తున్న మద్యం పాలసీని వెం టనే ఉపసంహరించుకోవాలని సీపీఐ డిమాండ్ చేసింది. గుడుంబాను అరికట్టాలంటే చీప్‌లిక్కర్ అమ్మడం ప్రత్యామ్నాయం కాదని, బెల్ట్‌షాపుల ద్వారా ఏటా రూ.4 వేల కోట్ల ఆదాయం ప్రభుత్వానికి గండిపడుతోందని, వాటి ని యంత్రణకు చర్యలు చేపట్టాలని సూచించింది. మంగళవారం మఖ్దూంభవన్‌లో జరిగిన పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల్లో చర్చించిన తీర్మానాలను పార్టీ ఆమోదించింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలని సీఎం కేంద్రాన్ని కోరడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి చెప్పారు. -
'హైదరాబాద్ కు ప్రత్యేక మద్యం పాలసీ'
హైదరాబాద్: తెలంగాణ కొత్త మద్యం పాలసీపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుక్రవారం సాయంత్రం సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి పద్మారావు, కమిషనర్ చంద్రవదన్, ఇతర అధికారులు హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. 'అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం విధానం అమలు కానుంది. ఈ నెలాఖరుకల్లా మద్యం నోటిఫికేషన్ విడుదల చేస్తాం. అందులో హైదరాబాద్ నగరానికి ప్రత్యేక మద్యం పాలసీ ఉంటుంది. చౌకల మద్యం అందుబాటులోకి తెచ్చే విషయంపైన.. అదే విధంగా కర్ణాటక తరహాలో మద్యం అందించే విధానంపై చర్చిస్తాం. శాఖల సమన్వయంతో గ్రామాల్లో నుంచి గుడుంబాను పారద్రోలుతాం' అని అన్నారు. గుడుంబాను పూర్తి స్థాయిలో నిరోధించేందుకు యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని ఆదేశించామన్నారు. అదే విధంగా మద్యం పాలసీపై మరిన్ని మోడళ్లను పరిశీలించాలని సీఎం కేసీఆర్ అధికారులను కోరారు. -
సర్వీస్ బకాయిలపై ‘ఎక్సైజ్’ అలర్ట్
సాక్షి, హైదరాబాద్: పులి మీద పుట్రలా వచ్చి పడుతున్న కేంద్ర ప్రభుత్వ సంస్థల బకాయిల దెబ్బతో ఎక్సైజ్ శాఖ తర్జనభర్జన పడుతోంది. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన మద్యం తయారీ, విక్రయాలు, బాట్లింగ్లకు సంబంధించిన సేవా పన్నును 2010 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు చెల్లించలేదని సెంట్రల్ ఎక్సైజ్ తేల్చింది. ఈ సేవా పన్ను రెండు రాష్ట్రాలకు వర్తింపజేసేందుకు రెండు రాష్ట్రాల బేవరేజెస్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అయితే ఆదాయపు పన్ను విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో విధించిన పన్నులను వసూలు చేసినట్టే ఇప్పుడు కూడా తమనే టార్గెట్ చేసినట్లు కనిపిస్తోందని ఎక్సైజ్ శాఖ ఆందోళన చెందుతోంది. ఏపీబీసీఎల్‌కు కొనసాగింపుగా టీఎస్‌బీసీఎల్ అని సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చి బకాయిలను తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా వసూలు చేయాలని సెంట్రల్ ఎక్సైజ్ భావిస్తోందని ఆరోపిస్తోంది. ఏపీబీసీఎల్ సంస్థ లేనప్పుడు దాని నుంచి బకాయిలు వసూలు చేయలేం కాబట్టి,అందుకు ప్రత్యామ్నాయంగా వచ్చిన టీఎస్‌బీసీఎల్ నుంచి పొందేలా కేంద్ర పన్నుల సంస్థ ప్రణాళికలు వేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపింది. దీని నుంచి బయట పడేందుకు ఎక్సైజ్ శాఖతో పాటు ప్రభుత్వం శుక్రవారం ఉన్నతస్థాయిలో చర్చలు జరిపింది. ఉదయం నుంచి ఇదే పనిలో ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్, టీఎస్‌బీసీఎల్ ఫైనాన్స్ జనరల్ మేనేజర్ సురేష్ ఓట్కర్, మరో జీఎం సంతోష్ రెడ్డి తదితరులు రోజంతా సమావేశాలతో బిజీగా గడిపారు. ఆదాయపు పన్ను కేసులను పరిశీలిస్తున్న ఇతర కన్సల్టెన్సీలతో పాటు లాయర్లతో కూడా సమావేశ మయ్యారు. సర్వీస్ టాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌ను ఆబ్కారీ భవన్‌కు పిలిపించిన కమిషనర్ చంద్రవదన్ రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను, ప్రభుత్వ నేతృత్వంలో పనిచేసే కార్పొరేషన్ల విధివిధానాలను వివరించారు. ఆ చట్టంలోని 9,10 షెడ్యూళ్ల బాధ్యతలు చూస్తున్న షీలాభిడేతో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి చర్చలు జరిపినట్లు సమాచారం. సాంకేతిక కారణాలను చూపి ఏపీ ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలోని పన్నుల భారాన్ని తెలంగాణపై వేసేలా వ్యవహరిస్తోందని, దీనిపై స్పష్టమైన విధానాన్ని అమలు చేయాలని సూచించినట్లు తెలిసింది. ఆదాయపన్ను శాఖ కూడా తెలంగాణ ప్రభుత్వం నుంచి రూ. 1,274 కోట్లను లాగేసుకొని ఏపీ ప్రభుత్వం జోలికి వెళ్లలేదని తెలంగాణ ప్రభుత్వం షిలాభిడేకి తెలియజేసింది. సర్వీస్ టాక్స్ విషయంలో తెలంగాణ, ఏపీ వాటాలను విభజించాలని, జనాభా ప్రాతిపదికన ఏ కార్పొరేషన్ ఎంత చెల్లించాలో తెలియజేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి , అడ్వొకేట్ జనరల్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. -
సిండికేట్‌కు ఎక్సైజ్ సలామ్!
మద్యం దుకాణాలు ప్రారంభమై నెల రోజులు కూడా కాలేదు. అప్పుడే ఎక్సైజ్‌శాఖ మద్యం సిండికేట్‌కు దాసోహం అంటోంది. మద్యం వ్యాపారంలో అక్రమాలు, నివారించేందుకు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే దుకాణాలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా సిండికేట్‌కు అనుకూలంగా మార్చుతోంది. ప్రభుత్వ దుకాణాల ఏర్పాటు నుంచి మద్యం అమ్మకాల వరకు అన్ని సిండికేట్లకు లాభసాటిగా ఉండే విధంగా ఆశాఖ వ్యవహరించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నర్సీపట్నం: ప్రభుత్వ మద్యం దుకాణాల నిర్వహణ నామమాత్రంగా ఉంటోంది. మరోవైపు మద్యం వ్యాపారులు ఇష్టానుసారంగా ధరలను పెంచుతున్నారు. ఎమ్మార్పీ అమలుకాలేదు. గొలుసు దుకాణాల విచ్చలవిడిగా ఏర్పాటవుతున్నాయి. ప్రారంభంలోనే ఈ విధంగా ఉంటే ఇక ముందు ఎలా ఉంటుందన్న సందేహం తలెత్తుతోంది. మద్యం దుకాణాల ఏర్పాటును మహిళలు నిరసిస్తున్నా వీధికో గొలుసు దుకాణం ఏర్పాటు చేసి వేలం పాటలు నిర్వహిస్తున్నారు. నర్సీపట్నం సర్కిల్లో... నర్సీపట్నం ఎక్సైజ్ సర్కిల్ పరిధిలోని ఏడు మండలాల్లో 39 మద్యం దుకాణాలు ఉండగా వీటిలో ఆరు మండలాల్లో ఆరు మద్యం దుకాణాలను ప్రభుత్వం తరఫున ఎకై ్సజ్‌శాఖ నిర్వహిస్తోంది. మండలానికి ఒక దుకాణం మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ దుకాణాలను కూడా సిండికేట్‌కు నష్టం లేకుండా అంతగా అమ్మకాలు జరగని మారుమూల ప్రాంతాల్లో ఏర్పాటుచేశారు. నర్సీపట్నం మున్సిపాలిటీ విషయానికి వచ్చే సరికి పట్టణానికి శివారు బయపురెడ్డిపాలెంలో ఏర్పాటు చేశారు. ప్రశాంతంగా ఉన్న ఊరులో మద్యం దుకాణం పెట్టడంపై మహిళలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన దుకాణాల్లో తక్కువగా నిల్వలు పెట్టారు. వినియోగదారులు నిత్యం వినియోగించే బ్రాండ్లు రకాలు కాకుండా ఖరీదైన మద్యం అందుబాటులో ఉంచుతున్నారు. దీంతో సగటు మందుబాబులు వచ్చే అవకాశాలు లేకుండా పోయా యి. పరోక్షంగా ప్రైవేటు దుకాణాదారులకు ఎక్సైజ్ అధికారులు సహకరిస్తున్నారన్న వాదన ఉంది. జనావాసాల్లో... పలు ప్రాంతాల్లో బడికి, గుడికి సమీపంలో దుకాణాలు ఏర్పాటు అవుతున్నా అధికారులు మౌనంగా ఉంటున్నారు. జనవాసాల్లో నివాస ప్రాంతాల్లో దుకాణాల ఏర్పాటు చేస్తున్నారు. మహిళలు నిరసన వ్యక్తం చేస్తున్నా పట్టించుకోవడం లేదు. విచ్చలవిడిగా గొలుసు దుకాణాలు ఏర్పాటువుతున్నాయి.పట్టణంలో వీధికొక బెల్టుదుకాణం వెలిసింది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే గొలుసు దుకాణాలకు వేలం పాటలు నిర్వహించడం విశేషం. దీంతో బహిరంగంగానే గొలుసు దుకాణాలను వందల సంఖ్యలో వెలుస్తున్నాయి. లెసైన్స్ దుకాణాలు కంటే అనధికార మద్యం దుకాణాలు ద్వారా మద్యం వ్యాపారులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఈ విషయమై ఎక్సైజ్ సీఐ జగన్మోహన్రావును సంప్రదించగా గొలుసు దుకాణాల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం దుకాణాల్లో కూడా అన్ని రకాల మద్యం బ్రాండ్లను అందుబాటులో ఉంచుతున్నామని వివరించారు. -
దోచేద్దాం!
కంప్యూటర్ బిల్లులకు మంగళం పెలైట్ ప్రాజెక్టు పేరిట కాలక్షేపం మద్యం వ్యాపారులకు ప్రభుత్వం వత్తాసు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు.. అమలు చేస్తున్న విధానాలకు పొంతనలేకుండా పోతోంది. ‘పచ్చ’బాబులకు ఇబ్బంది కలిగితే చాలు చట్టాలనే మార్చేయడం అలవాటైపోయింది. ఇందుకు నిలువెత్తు నిదర్శనం మద్యం వ్యాపారమే. మొదట్లో మద్యం విక్రయాలకు కంప్యూటరైజ్డ్ బిల్లులు ఇవ్వాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆ విధానానికి మంగళంపాడేందుకు సిద్ధమైంది. పెలైట్ ప్రాజెక్టుపేరుతో కాలయాపన చేస్తూ మందుబాబులను గుల్లచేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతోంది. చిత్తూరు (అర్బన్): జిల్లాలో 410 ప్రైవేటు మద్యం దుకాణాల నిర్వహణకు మేలో ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రెండేళ్ల పాటు పాలసీకి ప్రతీ దుకాణంలో తప్పనిసరిగా మద్యం బాటిళ్లు విక్రయించేప్పుడు కంప్యూటర్ బిల్లులు ఇవ్వాలని గెజిట్‌లో పేర్కొంది. షరతులకు అంగీకరించే జిల్లాలో 341 మద్యం దుకాణాలను వ్యాపారులు దక్కించుకున్నారు. కల్తీని నివారించాలని.. కర్ణాటక నుంచి అక్రమ మద్యం నివారించడం, కల్తీ మద్యాన్ని పసిగట్టడం సులభతరమవుతుంది. ప్రతి మద్యం బాటిల్‌పై కంప్యూటరైజ్డ్ హోలోగ్రామ్ స్టిక్కర్లు వేసి, దానికి బార్ కోడింగ్ నెంబరు సైతం కేటాయిస్తారు. వీటిని దుకాణాల్లో డీకోడింగ్ చేసి ఆ మద్యం ఎక్కడ తయారయ్యింది..? ఎప్పుడు దుకాణంలోకి వచ్చింది..? ఎప్పుడు అమ్ముతున్నారు..? ఎంతకు విక్రయిస్తున్నారే వివరాలను రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయానికి ఆన్లైన్లో లింకుచేస్తారు. అక్కడి సర్వర్ ఆధారంగా జిల్లాలోని మద్యం బాటిళ్ల పంపిణీ గోడౌన్లకు, దుకాణాలకు, డెప్యూటీ కమిషనర్ కార్యాలయాల కు ఆన్‌లైన్‌ను అనుసంధానం చేస్తారు. ప్రతి దుకాణం లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ‘కార్వే’ అనే సం స్థతో ప్రభుత్వం ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రతి నెలా దుకాణం నుంచి రూ.5 వేల అద్దె తీసుకోవడం.. లేనిపక్షంలో ఒకే సారి రూ.90 వేలు చెల్లించి కంప్యూటర్ పరికరాలు కొనుగోలు చేసేలా ప్రణాళిక రూపొందించా రు. ఈ విధానం జూలై 15 నుంచి జిల్లా వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు గెజిట్‌లో పేర్కొన్నారు. ఇలా కాలక్షేపం జిల్లాలో మద్యం దుకాణాలు దక్కించుకున్న వారిలో 90 శాతం వ్యాపారులు టీడీపీ నాయకులే. రాష్ట్రంలో సైతం మద్యం దుకాణాలు చేజిక్కించుకున్న తమ సానుభూతి పరులను కాపాడడానికి ఉత్తర్వులను తీసుకొచ్చారు. జిల్లాలో 341 దుకాణాలకు గానూ పెలైట్ ప్రాజెక్టు కింద కేవలం చిత్తూరులో 2, తిరుపతిలో 1 చోట కంప్యూటర్ బిల్లులను ఏర్పాటు చేయడానికి రెండు రోజుల క్రితం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పూర్తిస్థాయిలో ఈ మూడు చోట్లా కంప్యూటర్ బిల్లులు విజయవంతంగా నడిస్తే జిల్లా మొత్తం అమలు చేస్తామని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు సైతం ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించడంలేదు. రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయంలో ఆన్లైన్ ఏర్పాటు చేయకపోవడం, జిల్లాలో సైతం మద్యం బాటిళ్ల పంపిణీ గోదాముల్లో ఈ విధానం అమల్లోకి రాలేదు. ఈ మూడు దుకాణాల్లో కూడా వచ్చే ఏడాది నుంచి కంప్యూటరైజ్డ్ విధానం అమలుకానుంది. నకిలీ మద్యం, కర్ణాటక మద్యం దిగుమతి చేసుకుని ఇష్టానుసారం వ్యాపారాలు చేసుకోవడానికి ప్రభుత్వమే పచ్చజెండా ఊపినట్లయ్యింది. ఇదే అదునుగా మద్యం వ్యాపారులు మందుబాబుల బలహీనతను సొమ్ము చేసుకోవడానికి ఉన్న అవకాశాలన్నింటినీ అందిపుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. -
మద్యంపై కన్నెర్ర
సర్కారు మద్యం పాలసీపై మహిళా లోకం కన్నెర్ర చేసింది. ఒంగోలులో మద్యం టెండర్లు అడ్డుకునేందుకు ఉద్యమ స్ఫూర్తితో నిరసన బాట పట్టింది. ప్రగతిశీల మహిళా సంఘం, ఐద్వా, యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు ఆదివారం ఆందోళన చేశారు. నిరసన వ్యక్తం చేస్తున్న మహిళలను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. ఒంగోలు క్రైం : రాష్ట్ర ప్రభుత్వ నూతన మద్యం పాలసీపై జిల్లా మహిళా సంఘాల నేతలు కన్నెర్ర చేశారు. మద్యం పాలసీ విడుదలైనప్పటి నుంచి మహిళా సంఘాలు ప్రభుత్వ తీరుపై మండిపడుతూనే ఉన్నాయి. అయినా ఎలాంటి స్పందన లేకపోవడంతో చివరకు మద్యం షాపుల కోసం టెండర్లు నిర్వహిస్తున్న కల్యాణ మండపం వద్దకు చొచ్చుకుపోయేందుకు ఆదివారం ప్రయత్నించారు. ప్రగతిశీల మహిళా సంఘం, ఐద్వా, యువజన, విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీల ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ముందుగానే సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు ప్రత్యేక పోలీస్ బలగాలతో ఒంగోలు నగరంలో పహారా కాయించారు. నగరంలోని అన్ని వీధుల్లో ఉదయం నుంచి ప్రత్యేక పోలీస్ బలగాలు సంచరిస్తూనే ఉన్నాయి. అయినా స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం నుంచి టెండర్లు నిర్వహించే బచ్చల బాలయ్య కల్యాణమండపం వరకు నిరసన ప్రదర్శన చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీస్ బలగాలతో సిద్ధంగా ఉన్న ఒంగోలు డీఎస్పీ గుంటుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మహిళా సంఘాల నేతలను స్థానిక ఎస్బీఐ సెంటర్లోనే పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా పోలీసులు, మహిళా పోలీసులు, మహిళా నేతలను వ్యానుల్లో ఎక్కించి కొత్తపట్నం, జరుగుమల్లి పోలీస్స్టేషన్లకు తరలించారు. మహిళా సంఘాల నేతలు పోలీసులతో తీవ్రంగా ప్రతిఘటించారు. మద్యం మహమ్మారి మహిళల పాలిట శాపమంటూ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. గోళ్లతో రక్కడం, చీరెలు చించండీ... అంటూ పోలీసులే అనైతిక చర్యలకు పాల్పడ్డారంటూ మహిళ సంఘాల నేతలు యు.ఆదిలక్ష్మి, ఎస్కే మున్వర్ సుల్తానా, కె.రమాదేవి తెలిపారు. పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.పద్మ మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్యం షాపులు రద్దు చేస్తానని బూటకపు వాగ్దానాలిచ్చారని మండిపడ్డారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు చొప్పర జాలన్న, అరుణోదయ అంజయ్య, అఖిల భారత రైతు కూలి సంఘం ఉపాధ్యక్షుడు వై.వి.కృష్ణారావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడారు. పీవోడబ్ల్యూ, అఖిల భారత రైతుకూలి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం, మహిళా, యువజన, విద్యార్థి సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నాయకులు పాల్గొన్నారు. -
మామూళ్లు పెంచేశారు!
మద్యం తయారీ సంస్థల నుంచి డిపోలకు..డిపోల నుంచి రిటైలర్లకు మద్యం పంపిణీ వ్యవహారంలో రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. కొత్త మద్యం పాలసీ ప్రారంభం నేపథ్యంలో గతం కంటే భారీగా ఎక్సైజ్ సిబ్బంది మామూళ్లు పెంచేయడాన్ని వ్యాపారులు సహించలేకపోతున్నారు. కొత్తగా వ్యాపారంలో అడుగుపెట్టిన వాళ్లకు ఈ వ్యవహారం వింతగా కనిపిస్తోంది. అయితే కొత్త దుకాణాల వ్యవహారం కావడంతో సిబ్బంది అడిగే మామూళ్లకు కాదనలేకపోతున్నారు. పాత వ్యాపారులూ చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :మద్యం తయారీ సంస్థల నుంచి గతంలో ఏపీబీసీఎల్ కార్యాలయానికి మద్యం వచ్చేది. ఏపీబీసీఎల్ నుంచి కోట్లాది రూపాయల పన్ను ఆదాయపన్నుశాఖకు బకాయి పెరిగిపోవడంతో డిపోల్ని సీజ్ చేశారు. కేసు నమోదు అనంతరం ఆ వ్యవహారం అంతటితో ఆగిపోయింది. కొత్త పాలసీ నేపథ్యంలో పన్ను భారం నుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం ఏపీబీసీఎల్ స్థానంలో ఏపీఎస్‌బీసీఎల్ (ఏపీ రాష్ర్ట బెవరేజెస్ కార్పోరేషన్ లిమిటెడ్.)ను తెరమీదకు తెచ్చింది. కార్పొరేషన్ సిబ్బందితో పాటు ఎక్సైజ్ సిబ్బంది కీలకంగా వ్యవహరించే ఈ డిపోల్లో మద్యం తయారీ సంస్థల నుంచి మద్యం తెప్పించి పన్నులు వేసి రిటైలర్లకు ప్రభుత్వమే విక్రయించేలా ఏర్పాట్లు చేస్తోంది. సర్వసాధారణమే!: గతంలో డిపోల్లో నడిచే వ్యవహారం ఇకపై ఉండబోదని ప్రకటించినా అది సర్వసాధారణమే అయిపోయింది. డిపోలకు మద్యం లోడు రాగానే టీపీ (రవాణా పర్మిట్), సమయానికే వచ్చిందా, పర్చేజ్ ఆర్డర్ ఉందా, ఎక్సైజ్ డ్యూటీ/ఎడిసివ్ డ్యూటీ చెల్లించారా అన్న విషయాల్ని ఎక్సైజ్ సిబ్బంది పరిశీలించాలి. అనంతరం కంప్యూటర్ సెక్షన్లో ఆన్లైన్ లోడింగ్ చేయించాలి. ఇలా రోజుకు కనీసం పది లోడ్లు (బీర్ అయితే ఒక్కో లోడ్‌కు కనీసం 1200 నుంచి 1250 కేసులు, లిక్కర్ అయితే సు మారు 1150 కేసులు) వస్తుంటాయి. డిమాండ్ అధికంగా ఉంటే ఆ సంఖ్య ఇంకా పెరుగుతుంది. అన్లోడింగ్ సమయంలో మద్యం బాటిళ్లు విరిగిపోతే దానికీ సర్టిఫై చే యా లి. నిబంధనల ప్రకారం మద్యం కంపెనీ ప్రతినిధి, ఎక్సైజ్ సిబ్బంది, డిపో సి బ్బంది సమక్షంలో నిర్ణయించాలి. బ్రేకేజ్ ఎక్కువగా ఉంటే మద్యం సంస్థలకు ఇవ్వాల్సిన సొమ్ములో కోత విధిస్తారు. ఇక్కడే వ్యవహారం పక్కదారి పడుతోంది. బ్రేకేజీల్ని అధికంగా చూపించి మద్యం బాటిళ్లను పక్కదారి పట్టించేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రేట్లు పెంచేశారు: డిపోల్లో జరుగుతున్న వ్యవహారంలో గతంలో కొద్దిశాతమే మామూళ్లు తీసుకుంటే ఇప్పుడు దాన్ని భారీగా పెంచేశారనే విమర్శలు వస్తున్నాయి. అధికారులు తమకు అనుకూలంగా ఉన్న సిబ్బందిని డిపోల్లో నియమించి సొమ్ము వసూళ్లకు పాల్పడుతున్నారన్న విమర్శలున్నాయి. డిపోల నుంచి సరుకు రీటైలర్లకు పంపిణీ చేసే వ్యవహారంలో వ్యాపారులు ఏ స్థాయిలోనూ చేయి తడపందే పని కాదనే విమర్శలున్నాయి. డీడీలు తీసుకువచ్చి, తమవంతు వచ్చేవరకు వేచి చూడడం ఓ తంతు అయితే డిమాండ్‌ను బట్టి తమకు కావాల్సిన సరుకు తీసుకువెళ్లేందుకు మరో తంతు. వీటన్నింటికీ ధర పెట్టేశారు. అలాగే కొత్త దుకాణం తెరిచే సమయంలో నిబంధనల ప్రకారం ఆధార్/పాన్ కార్డు, నౌకరు నామా, లెసైన్సీ వివరాలు పరిశీలించి కంప్యూటర్లలో డేటా నమోదు చేసేందుకు జరిగే తంతుకు (రిజిస్ట్రేషన్)కు కూడా భారీగా మామూళ్లు పెంచేయడంతో వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ వ్యవహారంలో అన్ని స్థాయిల సిబ్బందికీ వాటాలు వెళ్తుంటాయని, జిల్లా అధికారులు దృష్టిసారించాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ శాఖ సిబ్బందే చెబుతున్నారు. -
ఒంగోలులో మహిళలపై పోలీసు జులుం
-
తాగినోళ్లకి తాగినంత..
- నేటి నుంచి కొత్త మద్యం పాలసీ - జిల్లాలో తెరుచుకుంటున్న 326 షాపులు - ఏడాదికి రూ.143 కోట్ల ఆదాయం - ఇక షాపింగ్‌మాల్స్‌లో అమ్మకాలు - అందుబాటులో టెట్రా ప్యాకెట్లు సాక్షి, విశాఖపట్నం: మద్యం షాపుల కేటాయింపు పూర్తయింది. జిల్లాలో 326 షాపులకు లెసైన్సులు వచ్చేశాయి. షాపింగ్ మాల్స్.. టెట్రా ప్యాకెట్లలో సైతం మద్యం అందుబాటులోకి రానుంది. బుధవారం నుంచి ఈ కొత్తషాపులు అందుబాటులోకి వస్తాయి. గతంలోకంటే ఈ ఏడాది మద్యంషాపుల లాటరీలోనూ.. అనంతరం భారీ ఆదాయాన్ని ఆర్జించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రచించింది. దాని వల్ల అతి సామాన్యులకు కూడా మద్యం అందుబాటులోకి రానుంది. కూల్‌డ్రింక్ తాగినంత సులువుగా మద్యం తాగేందుకు వెసులుబాబు కలగనుంది. మద్యం షాపుల లాటరీ ప్రక్రియ సోమవారం ఉదయం ప్రారంభమై తెల్లవారుజాము 2 గంటల వరకు కొనసాగింది. మద్యం షాపులు పొందిన వారికి మంగళవారం తాత్కాలిక ప్రొవిజినల్ సర్టిఫికెట్లు ఇచ్చారు. జిల్లాలో మొత్తం 406 మద్యం షాపుల్లో 39 షాపులను ప్రభుత్వం నిర్వహించనుంది. మిగిలిన 367 షాపుల్లో 326 షాపులను లాటరీలో ప్రైవేటు వ్యాపారులకు అందించారు. వీటి ద్వారా ఏడాదికి రూ.143 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి రానుంది. ముందుగా మూడవ వంతు ఫీజు చెల్లించాలనే నిబంధన మేరకు వచ్చిన ఆదాయం రూ.47.66 కోట్లు. మద్యం షాపులు దక్కించుకున్నవారికి అధికారులు తాత్కాలిక లెసైన్సులు మంజూరు చేశారు. జిల్లాలో రెండు డిపోలు ఉన్నాయి. ఒకటి కంచరపాలెంలో ఉండగా, రెండవది నరవ సమీపంలోని జెర్రిబోతులపాలెంలో ఉంది. మద్యం షాపులకు అవసరమైన మేరకు ఇక్కడ సరుకు అందుబాటులో ఉంచామని ఎక్సైజ్ డీసీ ఎం.సత్యనారాయణ మంగళవారం రాత్రి ‘సాక్షి’కి వెల్లడించారు. తాత్కాలిక లెసైన్సు పొందిన వారు 15 రోజుల్లోగా బ్యాంకు గ్యారెంటీలు చూపించి రెండేళ్ల కాలానికి లెసైన్సు పొందవచ్చు. ఈ ఏడాది నుంచి కొత్తగా షాపింగ్ మాల్స్‌లో మద్యం అమ్మకాలకు అవకాశం కల్పించారు. దీనిపై ప్రజా, మహిళా సంఘాల నుంచి ఎంతగా వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఫలితంగా షాపింగ్ మాల్స్‌లోనూ తాగుబోతుల బెడద ఎదురయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు ప్రభుత్వమే పూర్తి స్థాయిలో మద్యం షాపులు నడపడంతోపాటు ప్రతి ప్రైవేటు షాపులోనూ టెట్రా ప్యాకెట్లలో మద్యం విక్రయాలు చేయాలని ఆదేశించింది. కేవలం రూ.20, రూ.30లో ప్యాకెట్లు లభించనుండటంతో చేతిలో ఆ మాత్రం చిల్లర ఉన్నవారెవరైనా మద్యం దుకాణాల వైపు అడుగులేసే అవకాశం ఉంది. సామాన్యుల ఇల్లు, ఒళ్లు గుల్లచేసి ఖజానా నింపుకుందుకు ప్రభుత్వం వేసిన ఎత్తుగడకు ఎక్కడా ఎలాంటి ఆటంకాలు కలుగకుండా నేతలు, అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. -
‘మద్యం’ గెజిట్‌లో గందరగోళం!
- దుకాణాల క్రమ సంఖ్యలో తప్పిదాలు - రెండు గెజిట్లను ఇచ్చిన అధికారులు - వ్యాపారుల్లో టెన్షన్.. టెన్షన్ చిత్తూరు (అర్బన్): జిల్లాలో విడుదలైన మద్యం పాలసీ గెజిట్ నోటిఫికేషన్లో తప్పులు దొర్లాయి. అవి సరిదిద్దుకునే తప్పిదాలు కావు. ఏకంగా మద్యం దుకాణాలనే మార్చేసే తప్పిదాలు. ఇందులో వచ్చిన తప్పిదాలను సరిచేసి రెండోమారు గెజిట్ జారీ చేయాల్సిన అధికారులు అన్నీ తెలిసి మిన్నకుండిపోయారు. ఒక గెజిట్ ఫోర్సులో ఉండగానే మరో గెజిట్‌ను విడుదల చేసేశారు. దీన్ని గుర్తించిన వ్యాపారులు ఆందోళనకు గురవుతుంటే అధికార పార్టీ నాయకుల నుంచి ఎక్సైజ్ అధికారులకు బెదిరింపులు వస్తున్నాయి. జిల్లాలో 410 ప్రైవేటు, 48 ప్రభుత్వ మద్యం దుకాణాలు నిర్వహించనున్నట్లు అధికారులు ఈనెల 24 తేదీన గెజిట్ జారీ చేశారు. ఇందులో ప్రభుత్వ మద్యం దుకాణాలు కాకుండా తిరుపతిలో 220, చిత్తూరులో 190 ప్రైవేటు మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఆయా ఎక్సైజ్ సూపరింటెండ్లు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే చిత్తూరు ఈఎస్ పరిధిలోని అర్బన్ ఎక్సైజ్ పరిధిలో ఉన్న మద్యం దుకాణాల గెజిట్ క్రమ సంఖ్యల వివరాల్లో తప్పులు దొర్లాయి. 10వ క్రమ సంఖ్య ఉన్న 30వ డివిజన్లో ప్రభుత్వ మద్యం దుకాణం పెట్టనున్నట్లు తొలి గెజిట్‌లో పేర్కొన్నారు. ఈ క్రమ సంఖ్యకు దరఖాస్తులు స్వీకరించరు. ఇందులో 10వ నెంబరులో ప్రభుత్వ దుకాణం చూపిస్తూ, మళ్లీ 10వ నెంబరులో పలమనేరు రోడ్డులోని 30వ డివిజన్లో దుకాణం కోసం అంటూ రెండు మార్లు గెజిట్‌లో 10వ క్రమ సంఖ్యను ముద్రించారు. దీనికితోడు 19వ దుకాణం ఎక్కడుందో చూపించలేదు. అప్పటికే వ్యాపారుల చేతికి గెజిట్ వెళ్లిపోవడంతో దరఖాస్తులు వేసిన చాలామంది రూ.50వేలు చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేసి టెండర్లు కూడా వేసేశారు. తీరా తప్పిదాన్ని గుర్తించిన అధికారులు రెండోమారు మరో గెజిట్‌ను లైవ్‌లోకి తీసుకొచ్చారు. ఇందులో తప్పిదాలు సవరించారు. అయితే రెండు గెజిట్లను పరిగణనలోకి తీసుకున్న వ్యాపారులు అందులో ఉన్న క్రమ సంఖ్య ఆధారంగా ఇష్ట ప్రకారం టెండర్లు వేశారు. ఫలితంగా గెజిట్‌లోని 10వ క్రమ సంఖ్య నుంచి 20 క్రమ సంఖ్య వరకు దుకాణాలన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు లక్కీడిప్‌లో ఏ దుకాణం వస్తే అధికారులు ఏ దుకాణం అప్పగిస్తారోనంటూ వ్యాపారుల్లో టెన్షన్ ప్రారంభమైంది. ‘తమ్ముళ్ల’ బెదిరింపులు.. జిట్లో తప్పిదాలు గుర్తించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్సైజ్ అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. సోమవారం జరిగే లక్కీడిప్‌లో చిత్తూరులోని కొన్ని దుకాణాలు తమకు వద్దని, తాము వేసిన దరఖాస్తులు వెనక్కు ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. అయితే టెండరు బాక్సులకు సీలు వేసి, వీటిని ఖజానా శాఖలో ఉంచడంతో దరఖాస్తులు వెనక్కు ఇవ్వడం అయ్యే పనికాదని అధికారులు తేల్చేశారు. పొరపాటున లక్కీడిప్‌లో తమకు నచ్చని దుకాణం బలవంతంగా అంటగడితే మీ అంతు చూస్తామని చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ నాయకులు ఎక్సైజ్ అధికారులకు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. -
మద్యం పాలసీని నిరసిస్తూ ధర్నా
-
మద్యం పాలసీని నిరసిస్తూ ధర్నా
విజయవాడ: నూతన మద్యం పాలసీని నిరసిస్తూ.. ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విజయవాడ నగర శాఖ ఆధ్వర్యంలో నగరంలో ధర్నా నిర్వహించారు. ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్లో రోడ్డుపై మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి తమ నిరసన తెలిపారు. ప్రభుత్వం మద్యం పై వ్యవహరిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. -
'హైవేలపై మద్యం అమ్మకాలు ప్రమాదకరం'
-
మందు జాతర
- జిల్లాలో 406 మద్యం షాపులకు నోటిఫికేషన్ - ప్రభుత్వ ఆధ్వర్యంలో 39 షాపులు - ఏడాదికి రూ.175 కోట్ల ఆదాయం - ఆదాయ పన్ను చెల్లించిన వారే దరఖాస్తుకు అర్హులు - ఈ నెల 29న లాటరీ సాక్షి, విశాఖపట్నం: మద్యం వ్యాపారులు.. మందు బాబులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2015-17 ఎక్సైజ్ పాలసీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో జిల్లాలో 406 మద్యం షాపులకు ఎక్సైజ్ అధికారులు సోమవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు నిర్ణీత రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు లాటరీ నిర్వహిస్తారు. వీటిలో 39 షాపులను పూర్తిగా ప్రభుత్వం నిర్వహిస్తుంది. మిగతా 367 షాపులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తారు. రెండేళ్ల కాలానికి కేటాయించే ఈ షాపులకు వచ్చే నెల 1 నుంచి 2017 జూన్ 30వ తేదీ వరకూ లెసైన్స్ చెల్లుబాటులో ఉంటుంది. మద్యం షాపులు పొందాలంటే గత నిబంధనలతో పాటు ఈసారి కొత్తగా రెండేళ్ల కాలానికి సంబంధించిన ఆదాయ పన్ను ధ్రువీకరణ పత్రాలు సమర్పించాలి. వాట్ పరిధిలో ఉంటే సంబంధిత పత్రం చెల్లించవచ్చు. గతంలో ఉన్న షాపులనే ఇక మీదట కూడా కొనసాగించనున్నారు. గతంలో అబ్కారీ శాఖ నిర్వహణలో 53 మద్యం దుకాణాలు ఉండేవి. వాటిని ఇప్పుడు 39 చేసి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో నిర్వహించాలని నిర్ణయించారు. గతంలో నిర్వహించిన వేలం ప్రకారం మద్యం షాపుల రుసుం ద్వారా ప్రభుత్వానికి ఏటా రూ.147 కోట్ల ఆదాయం వస్తే ఈ సారి ఏడాదికి రూ.175 కోట్ల ఆదాయం రానుంది. వెనక్కు రాని దరఖాస్తు ఫీజుగా నగరపాలక సంస్థ సరిధిలో రూ.50 వేలు, పురపాలక సంస్థ పరిధిలో రూ.40వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.30వేలు నిర్ణయించారు. బెల్టు షాపుల నియంత్రణకు ప్రత్యేక ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తారు. -
మద్యం పాలసీని ప్రకటించిన ఏపీ సర్కార్
-
మద్యం కొత్త పాలసీకి తాత్కాలిక బ్రేక్!
* 3 నెలల పాటు పాత విధానమే * అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం సాక్షి, హైదరాబాద్: జూలై 1 నుంచి అమలు కావాల్సిన నూతన ఎక్సైజ్ విధానానికి బ్రేక్ పడింది. గుడుంబాను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకొని, ప్రజల ఆరోగ్యానికి హాని కలగని రీతిలో మద్యం విధానం రూపొందించాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎక్సైజ్ శాఖ మరో మూడు నెలల పాటు వాయిదా వేసింది. దీంతో కొత్త మద్యం విధానాన్ని అక్టోబర్ 1 నుంచి అమలు చేయాలని నిర్ణయించారు. దీనికి సీఎం కూడా ఆమోదముద్ర వేశారు. ఈ నేపథ్యంలో జూన్ 30తో ముగియనున్న ప్రస్తుత మద్యం దుకాణాల లెసైన్స్ గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని నిర్ణయించారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంపై కసరత్తు గుడుంబాను రాష్ట్రం నుంచి తరిమేయాలనేది సీఎం సంకల్పం. గుడుంబాకు బానిసలైన పేద, మద్యతరగతి వర్గాలు, కార్మికుల ఆరోగ్యానికి హాని కలిగించని రీతిలో అధికారికంగా ప్రభుత్వం ద్వారానే తక్కువ ధరకు మద్యం అందించే అవకాశాలను పరిశీలించాలని సీఎం గతంలోనే అధికారులను ఆదేశించారు. దీంతో ఎక్సైజ్ అధికారులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించి మూడు నివేదికలు తయారు చేశారు. అందులో మొదటిది మహారాష్ట్ర తరహాలో ‘దేశీదారు’ తక్కువ ధర మద్యాన్ని దుకాణాల ద్వారా విక్రయించడం. రెండోది సారాయిని మళ్లీ ప్రవేశపెట్టి, వేలం ద్వారా 20 ఏళ్ల క్రితం నాటి విధానానికి అంకురార్పణ చేయడం. మూడోది ఇప్పుడున్న విధానాన్ని కొనసాగిస్తూ, గుడుంబా తయారీని అరికట్టి, పీడీ చట్టాలను ప్రయోగించడం. ఈ మూడు విధానాల వల్ల ప్రజలకు ఉపయోగం, రెవెన్యూ లాభనష్టాలపై కూడా నివేదికలు రూపొందించారు. ఈ మూడు విధానాల్లోనూ లోపాలు ఉండడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ముందుగా గుడుంబా, అక్రమ మద్యాన్ని తరిమికొట్టి కొత్త విధానంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. గుడుంబాపై సమరం షురూ! సీఎంతో సమావేశం తరువాత ఎక్సైజ్ అధికారులు మంత్రి పద్మారావుతో భేటీ అయి గుడుంబాను అరికట్టేందుకు తీసుకోవాల్కిన చర్యలపై చర్చించారు. ఎక్సైజ్, పోలీసు శాఖలకు సమాచారం లేకుండా గుడుంబా అమ్మకాలు సాగడం లేదని నిర్ధారణకు వచ్చిన ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి నుంచే గుడుంబా తయారీని అరికట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు మంత్రి ఆదేశాలు ఇవ్వడంతో ఎక్సైజ్ క మిషనర్ ఆర్.వి. చంద్రవదన్ గురువారం అన్ని జిల్లాల ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లతో సమావేశమయ్యారు. పోలీసు, రెవెన్యూ అధికారుల సహకారంతో గుడుంబా, కల్తీమద్యంపై ఉక్కుపాదం మోపాలని నిర్ణయించారు. -
మద్యం పాలసీపై పీటముడి
నూతన మద్యం విధానంపై ఎటూ తేల్చని సర్కారు మరింత చర్చ జరగాలంటూ నిర్ణయాన్ని వాయిదా వేసిన సీఎం పట్టు బిగిస్తోన్న లిక్కర్ లాబీ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో నూతన మద్యం పాలసీపై పీటముడి పడింది. ఎక్సైజ్ ఏడాది ముగుస్తున్నప్పటికీ నిర్ణయం ప్రకటించకుండానే కేబినెట్ సమావేశం ముగిసింది. పాత విధానమే కొనసాగించాలని కొందరు.. తమిళనాడు తరహా మద్యం విధానం అమలు చేయాలని మరికొందరు మంత్రులు పట్టుబట్టడమే ఇందుకు కారణమని తెలిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశంలో నూతన మద్యం పాలసీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటారని ముందుగా ప్రకటించారు. ఈ మేరకు మద్యం పాలసీని అజెండాలో చేర్చారు. మద్యం పాలసీపైనే తొలుత మంత్రి మండలి చర్చ ప్రారంభించింది. సుమారు గంటపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలవుతున్న మద్యం పాలసీపై చర్చించారు. తమిళనాడు తరహా మద్యం పాలసీ వల్ల కల్తీ మద్యం అరికట్టడంతోపాటు లిక్కర్ మాఫియా ఆధిపత్యం తగ్గుతుందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరించారు. ప్రభుత్వం నేరుగా రిటైల్ మద్యం వ్యాపారం నిర్వహించడం ద్వారా అవినీతిని తగ్గించవచ్చని తెలిపారు. యనమలకు మద్దతుగా మంత్రులు రావెల కిషోర్‌బాబు, మాణిక్యాలరావులు నిలిచారు. అయితే పాత విధానమే కొనసాగించాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మంత్రులు అయ్యన్నపాత్రుడు, అచ్చెన్నాయుడు, మృణాళిని, గంటా శ్రీనివాసరావులు పట్టుబట్టినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంత్రుల నడుమ స్వల్ప వాగ్వాదాలు చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం మౌన ముద్ర దాల్చడం గమనార్హం. చివరకు సీఎం జోక్యం చేసుకుని మద్యం పాలసీపై మరింత చర్చ జరగాలంటూ వాయిదా వేశారు. మద్యం పాలసీపై మంత్రుల నడుమ భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనట్లు మంత్రి పల్లె మీడియాకు ధ్రువీకరించారు. కేబినెట్‌పైనా లిక్కర్ లాబీ పట్టు బిగించిందనడానికి మద్యం పాలసీ ప్రకటించకపోవడమే నిదర్శనమని విమర్శలు వినవస్తున్నాయి. -
'ప్రధానిని ఆహ్వానిద్దాం... ఇప్పుడే వద్దు'
-
'ప్రధానిని ఆహ్వానిద్దాం... ఇప్పుడే వద్దు'
హైదరాబాద్: వ్యవసాయ మార్కెటింగ్, ఏరోస్పేస్, డిపెన్స్, ఇండస్ట్రియల్ విధానాలకు ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. జూన్ 6న రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని శుక్రవారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించాలని కొందరు మంత్రులు సూచించగా, ఇప్పుడే వద్దని... రాజధాని పనులు ప్రారంభమయ్యాక ఆహ్వానిద్దామని సీఎం చంద్రబాబు అన్నారు. ఏడాది పాలన పూర్తైనందున జూన్ 8న బహిరంగ సభలో కొత్త పథకాలు ప్రకటించాలని భేటీలో నిర్ణయించారు. మద్యం పాలసీపై మంత్రుల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. పాత విధానాన్ని కొనసాగించాలని కొందరు సూచించగా, కొత్త పాలసీ తీసుకురావాలని మరికొందరు అభిప్రాయపడ్డారు. -
ధరల ‘కిక్కు’
ధరల కిక్కుతో మద్యం వ్యాపారులు దండుకుంటున్నారు. ప్రివిలేజ్ ఫీజు పేరుతో అదనపు వసూళ్లకు దిగారు. వ్యాపారులంతా సిండికేటై దోపిడీకి పూనుకున్నారు. షాపుల్లో ఉన్న ధరల పట్టికను సైతం పక్కకు పడేసి యథేచ్ఛగా అదనపు ధరలకు విక్రయాలు సాగిస్తున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న ఎక్సైజ్ అధికారులు ఏమీ పట్టనట్టే వ్యవహరిస్తున్నారు. కళ్లెదుటే అదనపు ధరల దోపిడీ కనబడుతున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం : మద్యం వ్యాపారులు బరి తెగించారు. లెసైన్స్ గడువు ముగుస్తుండటంతో అంతా సిండికేట్ అయ్యి ధరలు పెంచేశారు. ఏ బ్రాండ్ అయినా ఒక్కో ఫుల్‌బాటిల్‌కు రూ.20 నుంచి 30 వరకు అదనంగా రేటు పెంచి అమ్ముతుండటంతో మందుబాబుల జేబుకు భారీగానే చిల్లు పడుతోంది. దండిగా మామూళ్లు అందుకుంటున్న ఎక్సైజ్ అధికారులు రెట్టింపు వ్యాపారానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని ఆరోపణలు వినపడుతున్నాయి. జిల్లాలో ప్రతినెల రూ.50 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోంది. ఈ అదనపు బాదుడుతో మందుబాబులు మరో రూ.10 కోట్లు వదిలించుకోక తప్పదు. జూన్ 30వ తేదీతో వైన్ షాపుల లెసైన్స్ గడువు ముగియనుండటంతో మద్యం దుకాణాలు రెట్టింపు ధరలతో ఊగిపోతున్నాయి. ‘ప్రివిలేజ్’ దెబ్బకు సిండికేట్ విరుగుడు జిల్లాలో మొత్తం 148 లెసైన్స్డ్ వైన్ షాపులున్నాయి. వీటి ద్వారా ప్రతినెలా రూ.50 కోట్ల మద్యం వ్యాపారం నడుస్తోంది. ప్రభుత్వం ఏడాది కాలపరిమితో జారీ చేసిన లెసైన్స్ గడువు వచ్చే నెలాఖరుతో ముగస్తుంది. ప్రభుత్వం షాపుల యజమానుల అదనపు ఆదాయానికి గండి పెడుతూ ప్రివిలేజ్ (నిర్దేశించిన దానికన్నా ఎక్కువ వ్యాపారం చేస్తే ప్రభుత్వానికి చెల్లించేది) ఫీజు విధించింది. దీని ప్రకారం మద్యం అమ్మకాలపై లాభాల రేటు కాస్తా అటు ఇటుగా 17 శాతం లభించనుంది. లెసైన్స్‌ల జారీ సమయంలో నిర్ణీత లెసైన్స్ ఫీజుకు ఏడు రెట్లు అమ్మకాలు సాగించినా షాపు యజమానులకు లాభాల్లో కోత పెట్టే సరికొత్త నిబంధనను దీంట్లో చేర్చారు. జిల్లాలో ఇప్పటికే అన్ని వైన్ షాపులు ఈ ప్రివిలేజ్ ఫీజు పరిధిలోకి వచ్చాయి. ఒక్కసారిగా లాభాలు పడిపోయాయనుకున్న వ్యాపారులు ఈ అదనపు అమ్మకాల వ్యవహారానికి ప్లాన్ వేసి సిండికేట్ అయ్యారు. ఎక్సైజ్ అధికారులతో కుమ్మక్కై చివరి మూడు నెలల పాటు తాము ఇష్టమొచ్చినట్లు అమ్ముకునే ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. అంటే 40 రోజుల తర్వాత తమ లెసైన్స్ ఉంటుందో..? ఊడుతుందోనన్న ఆలోచనకు వచ్చిన వైన్స్ యజమానులు అదనపు రేట్లకు ప్రణాళిక చేశారు. ఇప్పటికే రెండు నెలల నుంచి ఈ వ్యవహారం నడుస్తున్నా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. బ్రాండ్ ఏదైనా రూ.20 నుంచి 30 వరకు, బీర్లకు రూ.10 నుంచి రూ.15 వరకు అదనంగా వసూళ్లు చేస్తున్నారు. యథేచ్ఛగా అమ్మకాలు లెసైన్స్ పొందిన వ్యాపారులు మార్చి వరకు జిల్లాలో ఎమ్మార్పీ రేట్లకు మద్యం విక్రయించారు. ఎక్సైజ్ అధికారులు కూడా ఎమ్మార్పీ ధరలకే మద్యం అమ్మకాలు జరిగేలా దుకాణాల ముందు ధరల పట్టికను ఏర్పాటు చేయించారు. ఏప్రిల్ నుంచి ఏకంగా ఈ ధరల పట్టికను దుకాణదారులు తీయించి వేయటం గమనార్హం. నగరంలోనే యథేచ్ఛగా ఈ వ్యవహారం నడుస్తున్నా ఎక్సైజ్ సిబ్బంది మాత్రం తమ దృష్టికి ఫిర్యాదులు రాలేదన్నట్లు వ్యవహరిస్తున్నారు. వచ్చే లెసైన్స్ జారీలో ప్రభుత్వం ఇదే తరహా లాటరీ ద్వారా కేటాయిస్తుందో..? ప్రభుత్వమే అమ్మకాలకు దిగుతుందో..? తెలియని పరిస్థితుల్లో మద్యం వ్యాపారులు దీపం ఉండగానే ఇల్లుచక్క బెట్టుకునే పనిలో పడ్డారు. గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సాధారణ ఎన్నికలు, ఫలితాలు ఉండటంతో తారా స్థాయిలో అమ్మకాలు సాగాయి. ఇప్పుడు అలాంటివేవి లేకపోవడం.. పైగా ప్రివిలేజ్ ఫీజు విధించటంతో మద్యం వ్యాపారులు సిండికేట్‌కు తెరదీశారు. ఏప్రిల్ నుంచి కేసులే లేవట..! ఎమ్మార్పీ రేట్ల కన్నా అధిక ధరకు వైన్స్ యజమానులు మద్యం విక్రరుుస్తున్నా ఏప్రిల్ నుంచి ఎక్సైజ్ అధికారులు ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు. గత ఏడాది జూలై 1 నుంచి మార్చి చివరి వరకు 37 కేసులు నమోదైనట్లు పేర్కొంటున్నారు. అన్ని దుకాణాల్లో ఎమ్మార్పీ రేట్ల అమ్మకాలను యజమానులు భేఖాతర్ చేస్తున్నా ఎక్సైజ్ అధికారులు కనీసం దాడులు కూడా చేయకపోవడం గమనార్హం. పట్టణాల్లో సిండికేట్‌తో అదనంగా వసూళ్లు చేస్తుండగా గ్రామాల్లోని బెల్టు షాపులోనూ రూ.10 అదనంగా తీసుకుంటున్నారు. లెసైన్స్ ముగింపు గడువు సమీపిస్తుండడంతో వచ్చే నెలలో రూ.5 అదనంగా ఫుల్‌బాటిల్, బీరుకు పెంచాలన్న యోచనలో మద్యం వ్యాపారులు ముందడుగు వేస్తున్నారు. ఫిర్యాదు చేస్తే కఠిన చర్యలు మహేష్‌బాబు, డిప్యూటీ కమిషనర్, ఎక్త్సెజ్ శాఖ జిల్లాలో ఎమ్మార్పీ రేట్ల కన్నా మద్యం అధిక ధరలకు విక్రయిస్తే సదరు షాపు యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం కొనుగోలు చేసేవారు ఏ షాపులోనైనా ఎక్కువ ధరకు విక్రయిస్తే ఆయా సర్కిల్ పరిధిలోని ఎక్సైజ్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలి. ఇప్పటికే జిల్లాలో అన్ని స్టేషన్లను ఈ మేరకు ఆదేశించాం. -
ఇక ఏరులై పారనున్న మద్యం
ఏపీలో భారీగా అదనపు ఉత్పత్తి నాలుగు డిస్టిల్లరీ కంపెనీలకు ఉత్పత్తి సామర్థ్యం పెంపు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అదనపు మద్యం ఉత్పత్తికి అనుమతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. కేవలం నాలుగు డిస్టిల్లరీ కంపెనీలకు మాత్రమే అదనపు ఉత్పత్తి సామర్థ్యం పెంపునకు అనుమతిస్తూ సీఎం చంద్రబాబు సంబంధిత ఫైలుపై సోమవారం ఆమోదముద్ర వేశారు. ఇంకా పలు డిస్టిల్లరీ కంపెనీలు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కేవలం నాలుగు సంస్థలకు మాత్రమే అనుమతి ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం రాష్ట్రంలో 14 మద్యం తయారీ కంపెనీలుండగా తద్వారా ఏడాదికి 1221.58 లక్షల ప్రూఫ్ లీటర్ల మద్యం ఉత్పత్తి అవుతోంది. ఇప్పుడు నాలుగు డిస్టిల్లరీలకు అదనంగా ఏకంగా ఏడాదిలో 8.73 కోట్ల ప్రూఫ్ లీటర్ల మద్యం ఉత్పత్తికి ముఖ్యమంత్రి అనుమతి మంజూరు చేశారు. ఈ నాలుగు కంపెనీలలో నెలలో అదనపు ఉత్పత్తి 11,22,684 లక్షల కేసులవుతుంది. ఇంత పెద్ద మొత్తంలో మద్యం అదనపు ఉత్పత్తికి అనుమతించారంటే ఇక రాష్ట్రంలో మద్యం కొరతనేది లేకుండా చేయడానికేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. -
'ఈ జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీ'
విజయవాడ:ఈ ఏడాది జూలై నుంచి కొత్త ఎక్సైజ్ పాలసీకి శ్రీకారం చుడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. 13 జిల్లాల ఎక్సైజ్ అధికారులతో మంత్రి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో ఉభయగోదావరి జిల్లాల్లో నాటు సారా నిరోధానికి పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకూ 70 మందని అరెస్ట్ చేసి కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో 7,800 బెల్ట్ షాపులపై కేసులు నమోదు చేసి ఏడు వేల ఐదు వందల మందిని అరెస్ట్ చేసినట్లు రవీంద్ర పేర్కొన్నారు. -
త్వరలో కొత్త మద్యం పాలసీ: కొల్లు రవీంద్ర
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో కొత్త మద్యం పాలసీ విధానాన్ని ప్రవేశపెట్టనున్నట్టు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన విజయవాడలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ సరిహద్దు జిల్లాల నుంచి ఐడీ లిక్కర్ రాకుండా స్పెషల్ టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. అలాగే బందర్ పోర్టు నిర్మాణానికి భూ సేకరణ వేగవంతం చేస్తున్నామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. -
ప్రభుత్వ మద్యం విధానానికి హైకోర్టు సమర్ధన
తిరువనంతపురం: కేరళ ప్రభుత్వ మద్యం విధానాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది. కేరళలోని బార్ యజమానులకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వెలువడింది. ఫైవ్ స్టార్ హోటల్స్, అనుమతించిన బార్లలో మాత్రమే మద్యం విక్రయించాలని కేరళ హైకోర్టు ఆదేశించింది. ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప మిగిలిన చోట్ల మద్యం విక్రయించడాన్ని నిషేధిస్తూ కేరళ ప్రభుత్వం గత సంవత్సరం సెప్టెంబరులో ఆదేశాలు జారీ చేసింది. కొత్త విధానంతో రాష్ట్రంలోని దాదాపు 730 బార్లను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్య వివక్షతతో కూడినదిగా వుందని బార్ యజమానులు విమర్శిం చారు. దీనివల్ల తాము చేసే వ్యాపారం కోల్పోవడమే కాకుండా, పర్యాటక రంగం కూడా దెబ్బతింటుం దని అన్నారు. ప్రభుత్వ చర్యను వ్యతిరేకిస్తూ బార్ యజమానులు హైకోర్టుని, ఆ తరువాత సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. బార్ యజమానులు పెట్టుకున్న పిటిషన్‌ను విచారించేందుకు కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్ అంగీకరించింది. హైకోర్టు దీన్ని పరిష్కరించేవరకు దీనిఅమలుపై స్టే విధించాలని కోరుతూ బార్ యజమానులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేరళ ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మద్యం విధానం వెనుక గల తార్కికతను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. రాష్ట్రవ్యాప్తంగా గల 730 బార్లు నాసిరకం ప్రమాణాలతో వున్నాయని ముద్ర వేస్తూ, ఫైవ్ స్టార్ హోటళ్ళలో మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా వదిలివేయడాన్ని కోర్టు ప్రశ్నించింది. ''ఇందులో ఎలాంటి లాజిక్ లేదు. అసలు నాసిరకం ప్రమాణాలంటే మీ అర్ధం ఏంటి? నేను ఆల్కహాల్ తాగను. అయినా ఇందులో నాకు లాజిక్ కనపడడం లేదు. మీరు దీన్ని ఎలా సమర్ధిస్తారు?'' అని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కపిల్ సిబల్ మాట్లాడుతూ, మద్యం అమ్మడం బార్ యజమానుల ప్రాధమిక హక్కేమీ కాదన్నారు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు తెలిపారు. ఏ సమయంలోనైనా బార్ లైసెన్సులు రద్దు చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్వర్తులపై స్టే విధిస్తూ కొత్త మద్య విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను వేగంగా పరిష్కరించాలని కేరళ హైకోర్టును సుప్రీం ఆదేశించింది. వాదప్రతివాదనలు విన్న అనంతరం కేరళ హైకోర్టు ప్రభుత్వ విధానాన్ని సమర్ధిస్తూ తీర్పు చెప్పింది. -
మీరు.. మేము పంచుకుందాం
మద్యం ధరలకు రెక్కలు తెప్పించిన ఎక్సైజ్‌శాఖ అధిక రే ట్లకు విక్రయించుకోవాల్సిందిగా ఆదేశాలు మద్యం వ్యాపారులను ప్రోత్సహిస్తున్న వైనం నెలకు రూ. కోట్లు దండుకుంటున్న యంత్రాంగం కడప:మద్యం వ్యాపారులు అధిక ఆదాయమే లక్ష్యంగా ఏకమయ్యారు. జిల్లాలో మందుబాబుల జేబులకు వ్యూహత్మకంగా చిల్లులు పెట్టేస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎక్సైజ్‌శాఖ సమర్థవంతమైన పాత్ర పోషించింది. ఎమ్మార్పీ రేట్ల ఉల్లంఘనకు పాల్పడ్డారు. అడ్డు చెప్పిన నాయకుల్ని సైతం మనీతో మాట్లాడకుండా చేస్తున్నారు. అవకాశం ఉన్న మేరకు అక్రమార్జన కోసం కొత్తపద్దతిలో అక్రమ ఆదాయానికి మద్యం వ్యాపారుల్ని ఏకం చేశారు. ఆదాయం పంచుకుందాం... అన్న రీతిలో మందుబాబుల జేబులకు చిల్లుపెట్టేందుకు ప్లాన్ చేశారు. ఎమ్మార్పీ రేట్లు ఉల్లంఘించినా చూసీచూడనట్లు ఉంటాం... మా వాటా మాకు పంపండి.. అని ఓ ఉన్నతాధికారి తెలియజేసినట్లు సమాచారం. ఇంకేముంది వెంటనే జిల్లాలో మద్యం రేట్లుకు రెక్కలు వచ్చాయి. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన నాయకుల్ని సైతం నోట్ల కట్టలతో కొనుగోలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నారుు. అధికరేట్లుకు మద్యం విక్రయాలు... జిల్లాలో 269 మద్యం షాపులకు 209 టెండర్లులో దుకాణాలు కేటాయించారు. తక్కిన దుకాణాలను ప్రభుత్వమే నిర్వహిస్తోంది. నిబంధల మేరకు మద్యం విక్రయాలు నిర్వహించాలని ముందుగా ఎక్సైజ్ యంత్రాంగం ఆంక్షలు పెట్టింది. ఆపై నెలమామూళ్లు కోసం పరితపిస్తోంటే మద్యం వ్యాపారులు తిరగబడ్డట్లు సమాచారం. ఇలా అయితే ఎలా.. మీరు ఆదాయం గడించడండి, మాకు ఇవ్వండని కొందరు అధికారులు మద్యస్థం చేశారు. దీంతో ఎమ్మార్పీ రేట్లుకు మంగళం పలికారు. ఉన్నత స్థాయి అధికారుల జోక్యం వల్ల ఇది ఓ కొలిక్కి వచ్చింది. దాంతో కడప కేంద్రంగా రూ.15 అధికంగాను, ప్రొద్దుటూరు కేంద్రంగా రూ.10 అధిక రేట్లుకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక్కోక్క షాపులో ప్రతిరోజు 1000 నుంచి 1500 మద్యం బాటిళ్లు విక్రయాలుంటాయి. బాటిల్ మీద ఎమ్మార్పీ కంటే రూ.10 అధికంగా విక్రయించినా ఒక్కోక్క మద్యం షాపు నుంచి ప్రతినెలా సుమారు రూ.3లక్షల నుంచి రూ.4లక్షల వరక ఆదాయం గడించే అవకాశం ఉంది. అందులో రూ.50వేలు మాత్రమే మాకు అప్పగించండని జిల్లా స్థాయి అధికారి ఒకరు పేర్కొన్నట్లు సమాచారం. ఈ లెక్కన ప్రతినెలా సరాసరి విక్రయాలు ద్వారా అధనంగా మందుబాబులు సుమారు రూ.12కోట్లు భరించాల్సిన పరిస్థితి కల్గుతోంది. అధికార పార్టీ నేతలు అడ్డగించడంతో.... అధిక రేట్లుకు మద్యం విక్రయాలు చేయడానికి అధికారపార్టీకి చెందిన నాయకులు కొందరు అడ్డుపడ్డట్లు తెలుస్తోంది. ఎమ్మార్పీ రేట్లుకే మద్యం విక్రయాలు చేపట్టాలని, ఎందుకు మద్యం వ్యాపారుల్ని, ప్రోత్సహిస్తోన్నారంటూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు సమాచారం. వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టాలా అంటూ హెచ్చరికలు చేసినట్లు తెలుస్తోంది. స్వయంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని బెదిరించడంతో ఎక్సైజ్ ఉన్నతాధికారులు కడప, ప్రొద్దుటూరులలో ఇరువురు నాయకులకు నెల మామూళ్లు ముట్టజెప్పేందుకు ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. డీప్యూటీ క మిషనర్ ఎమ్మన్నారంటే... అధికరేట్లుకు మద్యం విక్రయాలపై దాడులు నిర్వహిస్తున్నాం. ఇప్పటికే కొన్ని షాపులపై కేసులు నమోదు చేశాం. ఎమ్మార్పీ రేట్లు కంటే అదనంగా మద్యం విక్రయాలు ఉంటే సిబ్బందిపై సైతం చర్యలు తీసుకుంటామని డిప్యూటీ కమిషనర్ విజయకుమారి పేర్కొన్నారు. కాగా జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధిక రేట్లుకు పోత్సహిస్తున్న విషయాన్ని ఎన్ఫోర్సుమెంటు డెరైక్టర్ సూర్యనారాయణరావుతో సంప్రదించగా అలా చేయడం నేరమని తెలిపారు. ఫిబ్రవరిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి, అధిక రేట్లుకు విక్రరుుంచే వ్యాపారులు, అందుకు సహకరిస్తోన్న బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
మద్య నిషేధమే అస్త్రం
రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధమే తమ అస్త్రమని డీఎండీకే ప్రకటించింది. న దీజలాల పరిరక్షణకు అఖిల పక్షానికి డిమాండ్ చేసింది. బీజేపీతోనే పయనం సాగిద్దామా? అన్న నిర్ణయంపై ఆ పార్టీ వర్గాలు తీవ్రంగానే కుస్తీలు పట్టాయి. ఈ మేరకు కోయంబత్తూరు వేదికగా బుధవారం జరిగిన డీఎండీకే సర్వ సభ్య సమావేశంలో కీలక నిర్ణయాలు, తీర్మానాలు చేశారు. సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలకు సమాయత్తమయ్యే రీతిలో విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సన్నద్ధమైంది. ఇందు కోసం పార్టీ వర్గాలు అభిప్రాయాలు, మనోగతాలను తెలుసుకోవడంతోపాటుగా కీలక నిర్ణయాలకు వేదికగా సర్వ సభ్య సమావేశాన్ని విజయకాంత్ మలచుకున్నారు. బీజేపీ కూటమిలో డీఎండీకే కొనసాగేనా? లేదా? అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చే విధంగా కోయంబత్తూరులోని ఓ కల్యాణ మండపంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వ సభ్య సమావేశం, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సమావేశమైంది. అభిప్రాయాలు ఉదయాన్నే విజయకాంత్ నేతృత్వంలో జరిగిన సర్వ సభ్య సమావేశానికి ఆ పార్టీ ఎమ్మెల్యేలు, సర్వ సభ్య సభ్యులు, కార్యవర్గ సభ్యులు మొత్తంగా 285 మంది హాజరయ్యారు. జిల్లాల వారీగా నేతల అభిప్రాయాల్ని విజయకాంత్ సేకరించారు. అసెంబ్లీ ఎన్నికలను ఎలా ఎదుర్కొనాలో, అందుకు ఇప్పటి నుంచే చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లోకి చొచ్చుకెళ్లే రీతిలో నిర్వహించాల్సిన పనుల గురించి సమీక్షించారు. పార్టీ వర్గాల్లో ఉత్సాహాన్ని నింపే రీతిలో విజయకాంత్ తన ప్రసంగాన్ని సాగించారు. రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డ ఆయన కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ సర్కారును, డీఎంకేపై విమర్శల పర్వాన్ని తగ్గించడంతో ఆయన దారెటోనన్న చర్చ ఆరంభమైంది. అదే సమయంలో బీజేపీలో కొనసాగాలా? వద్దా? అన్న అంశంపై మెజారిటీ శాతం మంది నాయకులు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది సమయం ఉన్న దృష్ట్యా, ఇప్పటికిప్పుడే కూటమి విషయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దని, అదే సమయంలో ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే సర్వాధికారాన్ని విజయకాంత్‌కు అప్పగిస్తూ తమ ప్రసంగాలను నాయకులు సాగించారు. శ్రీరంగం ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయంగా తుది నిర్ణయాన్ని విజయకాంత్‌కు అప్పగించారు. తీర్మానాలు సర్వసభ్య సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను గోప్యంగా ఉంచినా, తీర్మానాలను మాత్రం ఆ పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఇరవైకు పైగా తీర్మానాలు చేశారు. ఇందులో పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్ బాటలో తాజాగా, డీఎండీకే సైతం రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు లక్ష్యంగా ఉద్యమాలకు శ్రీకారం చుట్టేందుకు నిర్ణయించడం విశేషం. రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేయాలికావేరి నదీ జలాల పరిరక్షణకు అభివృద్ధి మండలి, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు చేయాలి. నదీజలాల విషయమై కేంద్రంతో సంప్రదింపులకు అఖిల పక్షాన్ని ఏర్పాటు చేయాలి. నదుల అనుసంధానానికి చర్యలు వేగవంతంగా తీసుకోవాలి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి ఎలాంటి నిర్ణయాల్ని అయినా తీసుకోవాలి. తమిళ జాలర్లపై శ్రీలంక నావికాదళం పైశాచికత్వానికి ఖండన. దాడులకు అడ్డుకట్ట వేస్తూ కీలక నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రానైట్ స్కాంను విచారిస్తున్న సహాయం కమిటీకి పూర్తి సహకారం అందించడంతో పాటుగా స్వేచ్ఛను కల్పించాలని వినతి.విద్యుత్ చార్జీల పెంపు రద్దు, చెరకు మద్దతు ధరగా రూ.3500 పెంచాలి, కావేరి నది తీరంలో మీథైన్ తవ్వకాలకు వ్యతిరేకత, కూడంకులం అణు విద్యుత్ కేంద్రంలో రెండు, మూడు యూనిట్లపై నెలకొన్న ఆందోళన నివృత్తి, తదితర డిమాండ్లతో కొన్ని తీర్మానాలు చేశారు.తమిళ ప్రజల్ని ఆదుకునే విధంగా, అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రానికి నిధుల్ని సమకూర్చే విధంగా ప్రత్యేక కమిటీని రంగంలోకి దించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. -
రేయిని బట్టి
జిల్లాలో లిక్కర్ సిండికేటుకు మళ్లీ జీవం ⇒ ‘సాక్షి’ క్షేత్రస్థాయి సర్వేలో వెల్లడి ⇒ జిల్లా వ్యాప్తంగా 52 దుకాణాల్లో శాంపిల్స్ సేకరణ ⇒ ప్రతి క్వార్టర్ మీద కనిష్టంగా రూ.5 అదనం ⇒ జోగిపేటలో రాత్రి అవుతున్న కొద్దీ మద్యం ధరకు రెక్కలు ⇒ పల్లీలు, పుట్నాల పేరుతో చిల్లర దోపిడీ ⇒ వ్యాపారులకు ‘స్వేచ్ఛ’ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: లిక్కర్ సిండికేటు జిల్లాలో మళ్లీ జీవం పోసుకుంది. అవినీతి నిరోధక శాఖ దెబ్బకు రెండేళ్లుగా కొద్దిగా తగ్గినా...! కొత్త రాష్ట్రం ఏర్పాటు వెసులుబాటుతో మళ్లీ పాత జమానా మొదలైంది. మద్యం దుకాణాల యజమానులు ప్రాంతాల వారీగా సిండికేటు కట్టారు. మద్యం ఎమ్మార్పీ నిబంధనను ఉల్లంఘించి క్వార్టర్ మీద రూ. 5 పెంచి అమ్ముతున్నారు. ఏసీబీ దాడులు.. కేసుల నేపథ్యంలో కొంతకాలం భయం నటించిన ఎక్సైజ్ అధికారులు, తాజాగా జూలు విధిల్చారు. లిక్కర్ సిండికేటుకు అండగా నిలబడ్డారు. పీడించకుండా అందిన కాడికి దండుకోం డని సలహా ఇచ్చారు. అధికారుల మాటతో మద్యం వ్యాపారులు ఓ రేటు ‘ఫిక్స్’ చేశారు. అత్యంత విశ్వసనీయ వ్యక్తుల నుంచి సేకరించిన సమాచారం మేరకు.. క్వార్టర్ మద్యం సీసాకు రూ.5, అంత కంటే ఎక్కువ పరిమాణంలోని మద్యం బాటిళ్లకు వీలును బట్టి అదనంగా డబ్బులు వసూలు చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఎమ్మార్పీని ( గరిష్ట చిల్లర ధర) మించి మద్యం అమ్ముతున్నారని, ఎక్సైజ్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వాస్తవ పరిస్థితిని అంచనా వేయడం కోసం ‘సాక్షి’ క్షేత్రస్థాయి పరిశీలన చేసింది. శనివారం సాయంత్రం జిల్లా వ్యాప్తంగా 46 మండలాల్లో ‘సాక్షి’ బృందం పర్యటించి 52 మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేసింది. సంగారెడ్డి, జహీరాబాద్, జోగిపేట , నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో ప్రతి క్వార్టర్ మీద రూ.5 అదనంగా తీసుకోగా, మెదక్, గజ్వేల్, సిద్దిపేట, నర్సాపూర్, దుబ్బాకలో ‘చిల్లర’ దోపీడీకి పాల్పడుతున్నట్లు నిర్ధారణ అయ్యింది. క్వార్టర్, ఫుల్ బాటిళ్లను కొనుగోలు చేసినపుడు వినియోగదారులకు రూ. 5, రూ.10, రూ.15 వరకు చిల్లర ఇవ్వాల్సి వస్తే వాటికి బదులుగా వాటర్ ప్యాకెట్లు, ప్లాస్టిక్ గ్లాసులు, పల్లీలు, పుట్నాలు అంటగడుతున్నారు. జోగిపేటలో రేయిని బట్టి మద్యం రేటు పెరుగుతోంది. రాత్రిని బట్టీ రేటు.... జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో చీకటి పడుతుంటే మద్యం ధర పెరుగుతుంది. సాధారణంగానే ప్రతి దుకాణంలో ఎమ్మార్పీ మీద రూ.5 ఎక్కువ గా తీసుకుంటున్నారు. దుకాణం మూసిన తర్వాతదుకాణం పక్కనే ఉన్న చిన్న దుకాణంలోకి సరుకు పెడతారు. ఈ దుకాణం తెల్లవార్లూ నడుస్తూనే ఉంటుంది. అయితే రేటు మాత్రం స్థిరంగా ఉండదు. డిమాండ్‌ను బట్టి ధర మారుతూ ఉంటుంది. జోగిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో బెల్టు షాపులు కూడా ఎక్కువగానే కొనసాగుతున్నాయి. ప్రతి బ్రాండ్‌పై రూ.10 నుంచి రూ.15 అదనంగా తీసుకుంటున్నారు. బెల్టు దుకాణాలు మద్యం దుకాణాల యాజమాన్యం కనుసన్నల్లోనే నడుస్తున్నాయి. మొత్తం దుకాణాలను ఒకే ఒక సిండికేటు నాయకుడు నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఖేడ్‌లో మద్యం కొంటే జేబులు ఖాళీ నారాయణఖేడ్‌లో 4 మద్యం దుకాణాలున్నాయి. ఓసీ క్వార్టరుకు రూ.85 ధర ఉండగా రూ.95, ఏసీపీ ఆఫ్ బాటిల్‌కు రూ.215 ఉండగా రూ.225, రాయల్ స్టాగ్ క్వార్టర్ రూ.145 ఉండగా రూ.150, బీరు రూ.95 ఉండగా రూ.100లకు విక్రయిస్తున్నారు. అదనంగా డబ్బు వసూలు చేయడంతో ఓ వినియోగదారుడు ‘సాక్షి’ బృందం ముందే దుకాణం మేనేజర్‌తో వాదనకు దిగారు. ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు, వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మద్యం వ్యాపారం చేస్తుండడం వల్లే ఈ అదనపు మోతకు అంతులేకుండా పోతుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిద్దిపేటలో చిల్లర దందా సిద్దిపేట మండల పరిధి, పట్టణ శివారులో 11 దుకాణాలు, చిన్నకోడూరు మండలంలో రెండు , నంగునూరు మండలంలో 2 మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ మద్యం కోసం రూ .100 నోటు ఇచ్చి చిల్లర ఆశించడం అత్యాశే అవుతోంది. చిల్లర బదులుగా పల్లీలు, పుట్నాలు చేతిలో పెడుతున్నారు. సిద్దిపేటలో జాతీయ రహదారి పక్కనే దాబాలు నడుస్తున్నాయి. ఇక్కడ 24 గంటలు లిక్కర్ అందుబాటులో ఉంది. ప్రభుత్వ అనుమతి ఉన్న బార్లు రాత్రి 11 గంటలకు మూసి వేస్తున్నారు కానీ, ఇక్కడ నడుస్తున్న ‘అక్రమ బార్ల’కు సమయ పాలన అంటూ లేదు. బెల్ట్ షాపుల్లో ఒక్కో బాటిల్‌పై రూ. 5 నుంచి రూ. 15 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇక దుబ్బాక, నర్సాపూర్ నియోజకవర్గాల్లోని అన్ని దుకాణాల్లో ఇదే పరిస్థితి కనిపించింది. గజ్వేల్‌లో ఇదో జిమ్మిక్కు.... గజ్వేల్‌లో విచిత్ర పరిస్థితి. ఎమ్మార్పీ ఉల్లంఘనఉన్నట్టు లేదు... లేనట్టు లేదు. ‘సాక్షి’బృందం సభ్యుడు రూ.150 ఇచ్చి క్వార్టర్ రాయల్ స్టాగ్ కొనగా,. దాని ఎమ్మార్పీ రూ.145 ఉంది. దుకాణ యజమాని తిరిగి ఇవ్వాల్సిన రూ. 5 చిల్లర ఇవ్వలేదు. చిల్లర ఇస్తారేమో అని కొద్ది సేపు నిలబడినా క్యాష్ మేనేజర్ నుంచి ఉలుకులేదు, పలుకు లేదు. ఈ సమయంలోనే ఒక వ్యక్తి ఎంసీ డైట్ ఫుల్ బాటిల్ కొన్నాడు. దాని ఎమ్మార్పీ ధర రూ.430 ఉంది. ఆయనకు చిల్లర ఇవ్వలేదు. ‘నాకు రూ. 5 చిల్లర వస్తాయి కదా’ అని అడిగ్గా.. ఓ రకంగా చూస్తూ పల్లీ పాకెట్ చేతిలో పెట్టాడు. పరాష్కం ఆడకురి...... మెదక్ పట్టణంలో 5 వైన్స్ షాపులుండగా ఇందులో 4 దుకాణాలు ఒక రాజకీయ నాయకుడి ఆధీనంలో సిండికేట్‌గా నడుస్తున్నాయి. ఇక్కడ కూడా చిల్లర దోపిడీ కనిపించింది. రూ.100 వంద ఇచ్చి కింగ్ ఫిషర్ బీరు కొనగా, ఎమ్మార్పీ రూ 95 ఉంది. రూ.5 చిల్లర ఇవ్వమని అడిగితే రెండు ప్లాస్టిక్ గ్లాసులు ఇచ్చారు. బిల్లు ఇవ్వమని అడిగితే ‘‘నువ్వు కొన్న ఒక్క సీసాకు బిల్లు కావాలా?’’ అని వెటకారం ఆడారు. ‘పోనీ కేసు కొంటాం బిల్లు ఇస్తావా?’ అని అడిగితే ‘‘బేరం వచ్చేటప్పుడు పరాష్కం ఆడకు పో..., తీసుకుంటే తీసుకో లేకుంటే ఆడ పడేసి పో’’ అంటూ విసుక్కున్నారు. జహీరాబాద్‌లో జేబులు గుళ్ల..... జహీరాబాద్ నియోజకవర్గంలో జహీరాబాద్, కోహీర్, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో కలిపి 12 వైన్స్ దుకాణాలు ఉన్నాయి. జహీరాబాద్ పట్టణంలో 8, కోహీర్‌లో 2, న్యాల్కల్, ఝరాసంగం మండలాల్లో ఒక్కోటి చొప్పున దుకాణాలున్నాయి. ‘సాక్షి’ పరిశీలనలో దాదాపు అన్ని వైన్స్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే బాటిల్‌పై రూ.5 అదనంగా తీసుకున్నట్లు తేలింది. అంతా మా ఇష్టం ‘సాక్షి’ బృందం సభ్యులు ఓ ఔత్సాహిక మద్యం వినియోగదారునితో సిగ్నేచర్ బ్రాండ్‌ను కొనుగోలు చేయించారు. సదరు వినియోగ దారుడు క్వార్టర్ ఎంతా అని అడిగితే రూ. 215 అని దుకాణ నిర్వాహకుడు తెలిపారు. ఫుల్‌బాటిల్ ఇవ్వాలని రూ. 1000 నోటిస్తే దుకాణ నిర్వాహకుడు రూ.120 ఇచ్చారు. దాని ఎమ్మార్పీ రూ. 860 ఉంది. ఇదేం లెక్క అంటే అది అంతే అన్నారు. మండల కేంద్రాల్లో అయితే ఎక్సైజ్ అధికారుల అజమాయిషీ ఉండదు కాబట్టి వైన్స్ నిర్వాహకులు ఎమ్మార్పీ కంటే ఎక్కువ అమ్ముతున్నారని అనుకోవచ్చు, డిప్యూటీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంటు అసిస్టెంటు కమిషనర్ ఉండే జిల్లా కేంద్రంలోనే దందా కొనసాగుతుందంటే పరిస్థితిని అంచనా వేయవచ్చు. తనిఖీలు చేస్తున్నాం ఎమ్మార్పీ కంటే అధికంగా అమ్మితేనే కేసులు నమోదుచేస్తాం. ఇటీవల నారాయణఖేడ్, పటాన్చెరు ప్రాంతాల్లో పలు దుకాణాలపై కేసులు పెట్టాం. నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌షాపులు నడిపిస్తే చర్యలు తీసుకుంటాం. వైన్స్‌లో కేవలం మద్యం మాత్రమే విక్రయించాలి. నీళ్ల బాటిళ్లు, గ్లాసులు, ఇతర తినుబండారాలు విక్రయించకూడదు. - సయ్యద్ యాసిన్ ఖురేషి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, సంగారెడ్డి -
రూ.150 కోట్లు తాగేశారు!
-
రూ.150 కోట్లు తాగేశారు!
* నూతన సంవత్సర వేడుకల్లో ఏపీలో మద్యం అమ్మకాలు * వైజాగ్, విజయవాడ, గుంటూరులో అమ్మకాల జోరు * సంక్రాంతి పండుగకు భారీగా నిల్వ చేస్తున్న మద్యం వ్యాపారులు సాక్షి, హైదరాబాద్: నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో రూ. 150 కోట్ల విలువైన మద్యాన్ని మందుబాబులు తాగేశారు. డిసెంబరు 31తో పాటు జనవరి 1 కలిపి అమ్మకాలు రూ. 150 కోట్లు దాటినట్లు అధికారులు ధ్రువీకరించారు. సాధారణంగా రాష్ట్రంలో సగటున నెలకు రూ. 700 కోట్లు వరకు అమ్మకాలు సాగుతున్నాయి. అంటే 13 జిల్లాల్లో కలిపి రోజుకు సగటున రూ. 23 కోట్లు తాగుతున్నారు. అయితే డిసెంబరు 31న సుమారు ఎనిమిది రెట్లు అధికంగా విక్రయాలు జరగడం విశేషం. న్యూ ఇయర్ వేడుకలకు ప్రధానంగా వైజాగ్, విజయవాడ, గుంటూరు నగరాల్లో మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తక్కువగానూ, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో అమ్మకాలు గణనీయంగానూ పెరిగాయి. ఈ మూడు జిల్లాల్లోనే రూ. 50 కోట్లకు పైగా మద్యం అమ్ముడైనట్లు ఎక్సైజ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ అమ్మకాలను దృష్టిలో ఉంచుకుని మద్యం వ్యాపారులు గత వారం నుంచే ఆయా జిల్లాల్లోని ఏపీబీసీఎల్ నుంచి సరుకు కొనుగోలు చేశారు. ముఖ్యంగా మద్యం విక్రయాల్లో బీరు అమ్మకాలే అధికంగా ఉన్నాయి. గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో ఈ సమయంలో రూ. 200 కోట్ల అమ్మకాలు సాగితే 13 జిల్లాల్లో ఈ ఏడాది రూ. 150 కోట్లు దాటిపోయాయి. ఇక తమకు టార్గెట్లు పెట్టి ఉంటే మద్యం అమ్మకాలు రూ. 200 కోట్లు దాటేవని ఎక్సైజ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ ఎక్సైజ్ ఏడాదికి రూ. 15 వేల కోట్ల ఆదాయం వస్తుందని ఒక పక్క ప్రభుత్వం అంచనా వేస్తుండగా.. దానికి మించి ఈ దఫా అమ్మకాలుంటాయని ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సీజన్లో మద్యం అమ్మకాలు ఎక్కువగా జరుగుతాయి. జనవరి నెలలో ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరులలో మద్యం అమ్మకాలు అధికంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని మద్యం సిండికేట్లు పెద్ద ఎత్తున సరుకు నిల్వ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో మద్యం షాపులు అధికంగా ఉన్నందున ఈ జిల్లాల్లోనే మద్యం స్టాకు ఉంచుతున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పట్టణ ప్రాంతాల్లో భారీ అమ్మకాలు జరిగితే, సంక్రాంతికి గ్రామీణ ప్రాంతాల్లో అధికంగా విక్రయాలు జరుగుతాయి. మొత్తానికి మద్యం ఆదాయం ఏపీ ప్రభుత్వానికి బాగానే ‘కిక్కు’ ఇస్తున్నట్లుంది. -
సిండికేట్ దోపిడీ
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : మద్యం సిండికేట్లు మళ్లీ పుట్టుకొచ్చాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో మద్యం వ్యాపారులు జట్టుకట్టి అడ్డగోలు దోపిడీ షురూ చేశారు. వరుస ఏసీబీ దాడులు, కేసుల నమోదుతో గతంలో సిండికేటు అక్రమాలకు చాలా వరకు చెక్‌పడింది. మళ్లీ ఇప్పుడు మద్యం వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. మద్యం అమ్మకాలపై వస్తున్న లాభాలు సరిపోవడం లేదని ఈ అక్రమార్జనకు తెరలేపా రు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తూ నిండా ముంచుతున్నారు. ఒక్కో మద్యం బాటిల్‌పై రూ.ఐదు నుంచి రూ.20 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు. కూలింగ్ చార్జీల పేరుతో ఒక్కో బీరుపై అదనంగా రూ.ఐదు నుంచి పది రూపాయలు ఎక్కువ గుంజుతున్నారు. జిల్లాలోని పలుచోట్ల ఈ బహిరంగ దోపిడీ కొనసాగుతున్నా ఎక్సైజ్ శాఖ కనీసం పట్టించుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని ప్రశ్నిస్తున్నారు. గతంలో మద్యం సిండికేట్ల వద్ద ప్రతినెలా మమూళ్లు పుచ్చుకున్న ఎక్సైజ్, పోలీసు ఇతర శాఖల అధికారులపై ఏసీబీ కేసులు కూడా నమోదు చేసింది. ఈ కేసుల విచారణ ఇంకా కొనసాగుతున్నా మళ్లీ ఇప్పుడు అదే తరహాలో మద్యం సిండికేట్లు షురూ చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. జిల్లాలోని చెన్నూర్, బెల్లంపల్లి, మందమర్రి, తాండూరు, నిర్మల్, మంచిర్యాల, కాగజ్‌నగర్ తదితర పట్టణాల్లో మద్యం వ్యాపారులు సిండికేట్‌గా మారారు. గతంలో మాదిరిగా కొన్నిచోట్ల సిండికేట్ కార్యాలయాలను కూడా ఏర్పాటు చేశారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్న బెల్లంపల్లిలోని ఓ వైన్సుపై ఇటీవల ఎక్సైజ్ అధికారులు దాడి చేసి కేసు నమోదు చేశారు. వారం రోజులపాటు ఈ మద్యం వైన్స్ లెసైన్సును సస్పెండ్ చేయడంతోపాటు, జరిమానా కూడా విధించారు. వచ్చే లాభాలు సరిపోవని.. జిల్లాలో 149 మద్యం దుకాణాలకు ఈ ఏడాది జూన్‌లో ఎక్సైజ్ శాఖ దరఖాస్తులు స్వీకరించింది. 974 మంది వ్యాపారులు దరఖాస్తు చేసుకున్నారు. 35 దుకాణాలకు సింగిల్ టెండర్లు రాగా, మిగిలిన షాపులకు గట్టి పోటీ నెలకొంది. జూన్ 23న లాటరీ పద్ధతిలో ఈ మద్యం షాపులను కేటాయించారు. మద్యం షాపుల యజమానులు ఐఎంఎల్ డిపో నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి రిటైల్‌గా విక్రయిస్తుంటారు. ఇలా ఏడు పర్యాయాలు మద్యం డ్రా చేసిన తర్వాత తమకు వచ్చే లాభాలు తగ్గిపోయాయంటూ ఈ దోపిడీకి తెరలేపారు. కొన్ని చోట్ల సిండికేటు వ్యాపారులు కల్తీ మద్యం విక్రయాలకు తెర లేపారు. మద్యం సీసా మూతను తీసి అందులో నీళ్లు గానీ, చీప్ లిక్కర్ని కలిపి ఏ మాత్రం గుర్తుపట్టని విధంగా ఆ సీసా మూతను బిగించేస్తున్నారు. ఇలా మద్యం కల్తీకి పాల్పడిన లక్సెట్టిపేటలోని ఓ వైన్సుపై ఎక్సైజ్ అధికారులు ఇటీవల కేసు నమోదు చేశారు. బార్‌కోడ్‌కు ససేమిరా.. బార్కోడ్ విధానాన్ని అమలు చేసేందుకు మద్యం వ్యాపారులు ససేమిరా అంటున్నారు. ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. బార్కోడ్ విధానం అమలైతే మద్యం వ్యాపారుల అక్రమాలకు చాలా మట్టుకు చెక్ పడుతుంది. నాన్‌డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయాలు జరిగితే ఎక్సైజ్ అధికారులకు ఇట్టే తెలిసిపోతుంది. ఆయా మద్యం షాపుల్లో మద్యం విక్రయాలపై ఆన్లైన్ పర్యవేక్షణ ఉంటుంది. ఈ విధానం అమలైతే తమ గుట్టు రట్టవుతుందనే భయంతో వ్యాపారులు ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యాపారులేమో దీన్ని అనవసర వ్యయంగా చెప్పుకొస్తున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటికే ఈ బార్ కోడ్ విధానం అమలులోకి రావాల్సి ఉండగా, జిల్లాలో కనీసం ఒక్క షాపులో కూడా కనిపించడం లేదంటే ఎక్సైజ్ అధికారులు, మద్యం వ్యాపారులకు మధ్య ఉన్న ‘అనుబంధం’ ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. మా దృష్టికి వచ్చింది - శివరాజు, డిప్యూటీ కమిషనర్, ఎక్సైజ్ శాఖ జిల్లాలో కొన్ని చోట్ల ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తరచూ తనిఖీలు చేస్తున్నాం. కేసులు కూడా నమోదు చేశాం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటాం. మద్యం షాపుల్లో బార్కోడ్ విధానం అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. -
కిక్కెక్కడం లేదు
ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని మందు బాబులు గగ్గోలు పెడుతున్నారు.. ఎంత తాగినా కిక్కెక్కడం లేదని ఆరోపిస్తున్నారు. మద్యంలో నీళ్లను కలుపుతుండటమే ఇందుకు కారణం. అధికారులు పట్టించుకోకపోవడంతో మద్యం వ్యాపారులు కల్తీ మద్యాన్ని యధేచ్చగా విక్రయిస్తున్నారు. అయినా గిట్టుబాటు కావడం లేదని కల్తీకి తోడు ధరలు కూడా పెంచేశారు. వాణిజ్య కేంద్రంగా పేరుపొందిన ప్రొద్దుటూరులో మద్యం వ్యాపారాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 21 మద్యం షాపులు ఉన్నాయి. 8 బార్లు ఉన్నాయి. కొన్ని రోజులుగా తమకు నీళ్లు కలుపుతున్న మద్యాన్ని విక్రయిస్తున్నారని మందుబాబులు ఆరోపిస్తున్నారు. అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. నెలకు 850 బాక్స్‌లు విక్రయించాల్సిందే.. ఈ ఏడాది జూలై నుంచి కొత్త మద్యం షాపులు ప్రారంభం అయ్యాయి. బెల్ట్ షాపులు లేనందున ఎక్సైజ్ అధికారులు మద్యం వ్యాపారులకు టార్గెట్లు విధించలేదు. అయితే గత ఏడాది కంటే ఈ ఏడాది విక్రయాలు బాగా తగ్గాయని భావించిన ఎక్సైజ్ అధికారులు తాజాగా టార్గెట్లు విధించారు. ఒక్కో షాపులో నెలకు 850 బాక్స్‌ల మద్యం సీసాలు విక్రయించాలని టార్గెట్ పెట్టినట్లు తెలుస్తోంది. టార్గెట్ విధించిన నేపథ్యంలో అధికారులు, వ్యాపారుల మధ్య పరస్పర అంగీకారం జరిగినట్లు సమాచారం. ఎమ్మార్పీపై రూ. 5 పెంచి విక్రయించుకుంటామని వ్యాపారులు అడగడంతో ఎక్సైజ్ అధికారులు తలాడించినట్లు తెలుస్తోంది. దీంతో నాలుగు రోజుల నుంచి పట్టణంలోని మద్యం షాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ. 5 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పట్టణంలోని పలు మద్యం షాపుల్లో ఉదయం 9 నుంచే విక్రయాలు జరుగుతున్నాయి. మద్యం శాఖ అధికారులు చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. నా దృష్టికి వచ్చింది.. కేసులు రాస్తాం ఎమ్మార్పీ కంటే రూ.5 అదనంగా విక్రయిస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ శంభూప్రసాద్ వివరణ ఇచ్చారు. మద్యం షాపుల్లో తనిఖీలు నిర్వహించి కేసులు రాయమని సీఐకి ఆదేశాలు జారీ చేశామన్నారు. ఆయన రాయకుంటే తానే రాస్తానన్నారు. టార్గెట్లు విధించిన మాట వాస్తవమేనని..అయితే ఎమ్మార్పీ ధరలకే మద్యాన్ని విక్రయించాలన్నారు. టార్గెట్‌కు ధరలకు సంబంధం లేదన్నారు. -
బాబుగారి బుడ్డీ కానుక
సారా తాగినోడు సాంబమూర్తి కొడుకు బ్రాందీ తాగినోడు బ్రహ్మదేవుని కొడుకు విస్కీ తాగినోడు విష్ణు మూర్తి కొడుకు ఏమీ తాగనోడు .... అంటూ ఓ ప్రముఖ సినీ మాటల రచయిత ఓ సందర్భంలో పేర్కొనాడు. ఈ నాలుగు వ్యాఖ్యలు అక్షర సత్యం. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం రాష్ట్ర ప్రజలను మందుబాబులుగా తీర్చిదిద్దాలని ఉద్దేశంలో ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వస్తే రైతుల రుణాలు మాఫీ చేస్తా, బెల్ట్ షాపుల తాట తీస్తానంటూ.... ఎన్నికల సమయంలో ఆయన లెక్కలేనన్ని హామీలు గుప్పించారు. అయితే గద్దెనెక్కిన ఆయన ... ఇచ్చిన వాగ్దానాలు తుంగలోకి తొక్కేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో వచ్చి నాలుగు నెలలు అయినా రుణాలు మాఫీకి అదిగో...ఇదిగో అంటూ కాకి లెక్కలు...మోకాలుకు బోడిగుండుకు లంకె పెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ ఏ రైతుకు రుణాలు మాఫీ కాలేదు. మరోవైపు బ్యాంకులు కూడా రుణమాఫీ సాధ్యం కాదంటూ చెబుతున్నాయి కూడా. తాజాగా నారావారి కన్ను ...బెల్ట్ షాపులపై పడింది. అధికారంలో రాగానే బెల్ట్ తీస్తామన్న ఆయన... తాజాగా ఉన్నవాటిని రద్దు చేయకుండా ఇంకా పెంచాలంటే ఆదేశాలు జారీ చేయటం విశేషం. రాష్ట్రంలో ఇప్పటికే 12 డిస్టలరీలు ఉండగా వాటిని ఇంకా పెంచాలని చెప్పటంతో పాటు, పనిలో పనిగా మద్యం తయారీ ఉత్పత్తిని మరింత పెంచాలంటూ సెలవించారు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నా...బాబు గారు మాత్రం ఐ డోంట్ కేర్ అంటున్నారు. అసలే రాష్ట్ర విభజనతో నష్టపోయాం, ఆదాయం పెంచుకునే మార్గాలు అన్వేషించాలని ఇటీవల ఆయన మీడియా సమావేశంలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు బంగారు బాతులాంటి...మద్యం తయారీ, విక్రయాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. -
మద్యం మత్తుకు పల్లెలు చిత్తు
దుబ్బాక: పల్లెల్లో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ఫలితంగా పచ్చని సంసారాలు కూలిపోతున్నాయి. గ్రామాల్లో కూరగాయలను అమ్మినట్లుగా మద్యం బాటిళ్లను కూడా రాబోయే రోజుల్లో సారా.. బీపీ.. ఐబీ.. రాయల్ స్టాగ్ మద్యాన్ని కొంటారా అంటూ విక్రయించే పరిస్థితి నెలకొనే ప్రమాదం లేకపోలేదు. దుబ్బాక మండలంలోని 32 గ్రామాల్లో బెల్టు దుకాణాలు ‘మూడు పువ్వులు ఆరు కాయల్లాగా’ విరాజిల్లుతున్నాయి. గ్రామాల్లోని కల్లు వ్యాపారులు, హోటళ్లు, కిరాణా షాపుల్లో అక్రమ మద్యాన్ని విక్రయిస్తున్నారు. ప్రతి పల్లెల్లో కనీసం 25 కుటుంబాలు మద్యం విక్రయాలు చేస్తున్నట్లు అంచనా. మండల కేంద్రంలోని మూడు వైన్స్ దుకాణాల యజమానులకు గ్రామాల్లోని మద్యం విక్రయదారులు ఎస్ఎంఎస్ చేస్తే చాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ద్విచక్ర, ఆటోలు, టాటా ఏసీ వాహనాల్లో మద్యాన్ని తరలిస్తున్నారు. బెల్టు షాపుల నిర్వాహకులు మండల కేంద్రంలోని వైన్స్ వద్దకు వచ్చి మద్యం బాటిళ్లను కొనుగోలు చేయాల్సిన అవసరం లేనేలేదు. మండల కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామాల్లో సైతం వైన్స్ యాజమానులు ఏర్పాటు చేసుకున్న మద్యం వాహనాలే దర్శనమిస్తున్నాయి. బెల్టు షాపుల్లో మద్యం తాగుతున్న గ్రామవాసులు పిట్టల్లా రాలిపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. 14 ఏళ్ల పిల్లవాడి నుంచి పండు ముసలివాళ్ల వరకు మద్యం మత్తులోపడి ఆరోగ్యాలను చెడగొట్టుకుంటున్నారు. బెల్టు షాపులకు వచ్చే మందు అసల్దా లేకా నకిలీదా అన్న విషయం తెలియకుండానే పీకల దాకా తాగేవారున్నారు. ఇంట్లోని భార్యా పిల్లలను కొడుతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మద్యానికి బానిసలైన చాలా మంది యువకులు కాళ్లు చేతులు సన్నబడి, 20 ఏళ్లకే నెరిసిన జుత్తుతో 60 ఏళ్ల ముసలివారి అవతారం ఎత్తుతున్నారు. నకిలీ మద్యాన్ని పీకల దాకా తాగి రోగాల బారినపడి మరణిస్తున్నా సంబంధిత ఎక్సైజ్ అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగాయిత్యాలకు పాల్పడడమే కాకుండా మరికొంతమంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులను నిర్వహించుకోవడానికి ఎవరు అనుమతి ఇచ్చారు? వైన్స్‌లో విక్రయించకుండా బెల్టు షాపులకు సరఫరా చేయాలన్న ప్రభుత్వ అనుమతులేవైనా ఉన్నాయా? బెల్టు షాపులు నిర్వహించకుండా ప్రభుత్వ అంక్షలు ఏవైనా ఉన్నాయా? లేవా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. తాగిన మైకంలో ఆడవాళ్లపై అగత్యాలు జరిగినా సంసారాలు కూలిపోతున్నా ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఇవేమి ఎక్సైజ్ అధికారులకు చెవికెక్కడం లేదు. అక్రమ మద్యం, బెల్టు షాపులను నిరోధించాల్సిన ఎక్సైజ్, పోలీసు అధికారులు మామూళ్ల మత్తులో జోగుతుండడంతోనే పల్లెల్లో మద్యం ఏరులై పారుతోందన్న విమర్శలున్నాయి. గ్రామాల్లో బెల్టు షాపులపై కఠిన చర్యలు తీసుకుని మద్యాన్ని విక్రయించకుండా చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
దసరా ధమాకా
బెల్లంపల్లి : బెల్ట్‌షాపులు మళ్లీ పుట్టుకొస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించినా కొందరు మద్యం వ్యాపారులు ప్రోత్సహిస్తున్నారు. మద్యం వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి జోరుగా బెల్ట్‌షాపులకు మద్యం సరఫరా చేస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని బెల్ట్‌షాపులు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతున్నా ఆబ్కారీ, ప్రొహిబిషన్ శాఖ అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారు. బెల్ట్‌షాపులను రద్దు చేసిన ప్రభుత్వం ప్రతి మద్యం దుకాణానికి అనుబంధంగా పర్మిట్ రూంను అనుమతించింది. రూ.2 లక్షలు చొప్పున చెల్లించి వ్యాపారులు పర్మిట్ రూంను ఏర్పాటు చేసుకున్నారు. అయినా కొందరు వ్యాపారులు చాటుమాటుగా బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. వీటి ద్వారానే బస్తీలు, గ్రామీణ ప్రాంతాలలో మద్యం వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. దసరా పండుగను పురస్కరించుకొని పెద్ద ఎత్తున వ్యాపారం సాగించేందుకు బెల్ట్‌షాపులకు భారీగా మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన ఎమ్మార్పీ ధర కన్న అధికంగా బెల్ట్‌షాపుల్లో వసూళ్లు చేసి అక్రమ దందా నిర్వహిస్తున్నారు. దసరా వేదికగా.. దసరా పండుగ వేదికగా బెల్ట్‌షాపులలో పెద్ద ఎత్తున మద్యాన్ని నిల్వ ఉంచారు. ముందస్తు వ్యూహంగా వ్యాపారులు కొందరు మద్యం స్టాక్ ఉంచి కొన్ని రోజుల నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, మందమర్రి, చెన్నూర్, జైపూర్, లక్సెట్టిపేట, దండేపల్లి, బెల్లంపల్లి, కాసిపేట, తాండూర్, రెబ్బెన, ఆసిఫాబాద్, వాంకిడి, కాగజ్‌నగర్, సిర్పూర్(టీ) తదితర ప్రధాన పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బెల్ట్‌షాపుల నిర్వహణ గుట్టుగా జరుగుతోంది. మద్యం అధికంగా అమ్మకాలు జరిపే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకొని బెల్ట్‌షాపులను నిర్వహిస్తున్నారు. దసరా పండుగ తూర్పు ప్రాంతంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. పండుగకు ముందు మద్యం భారీ ఎత్తున కొనుగోళ్లు జరుగుతాయి. ఈ పండుగ రాక కోసమే ఏడాదిపాటున మద్యం వ్యాపారులు ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఆ సమయం ఆసన్నం కావడంతో ఏ మాత్రం ఆలస్యం లేకుండా మూసివేసిన బెల్ట్‌షాపుల తలుపులు తెరుస్తున్నారు. రోజు బెల్ట్‌షాపులకే అత్యధికంగా మద్యం షాపుల నుంచి సరుకు సరఫరా జరుగుతోంది. రోజుకు సుమారు రూ.అర కోటి వరకు బెల్ట్‌షాపుల్లోనే మద్యం అమ్మకాలు జరుగుతున్నట్లు ఓ అంచనా. ఆ ప్రకారంగా మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కొన్నేళ్ల నుంచి మద్యం వ్యాపారంలో కీలకంగా వ్యవహరిస్తున్న కొందరు బెల్ట్‌షాపులను ముందుండి నడుపుతున్నట్లు తెలుస్తోంది. మరో పక్క మద్యం కల్తీ కాకుండా బార్కోడ్ విధానంతో స్కానింగ్ చేసి మద్యం అమ్మకాలు జరపాలని ప్రభుత్వం ఆదే శించిన ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతతో అమలు జరగడం లేదు. ఆ పద్ధతి అమలు కాకపోవడంతో వ్యాపారులు మద్యాన్ని కల్తీ చేసి అమ్ముతున్నారని ఆరోపణలు ఉన్నాయి. పట్టింపులేని అధికారులు మద్యం షాపుల నుంచి బెల్ట్‌షాపులకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. వ్యాపారులు సాగిస్తున్న అక్రమ దందాను నిరోధించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం బెల్ట్‌షాపులను రద్దు చేసిన క్షేత్ర స్థాయిలో మాత్రం కొనసాగడం ఎక్సైజ్ అధికారుల నిర్లిప్తతకు అద్దం పడుతోంది. ఇప్పటికైనా బెల్ట్‌షాపులను రద్దు చేయించి అక్రమ మద్యం అమ్మకాలను ఆపాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై బెల్లంపల్లి ఎక్సైజ్ సీఐ నరేందర్‌రెడ్డిని ఫోన్లో వివరణ కోరగా బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న విషయం తన దృష్టికి రాలేదన్నారు. ఎక్కడైనా బెల్ట్‌షాపులు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
ఏపీకి మద్యం ఆదాయమే దిక్కు: యనమల
-
ఏపీకి మద్యం ఆదాయమే దిక్కు: యనమల
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మద్యం ఆదాయమే ప్రధానమని, మద్యం ద్వారా ఆదాయాన్ని మరింత పెంచే చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఎక్సైజ్ శాఖ అధికారులకు సూచించారు. మద్యం ఆదాయం ఆగస్టులో వచ్చిన ఆదాయం కన్నా సెప్టెంబర్‌లో తగ్గుదల కనిపించడంపట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాన ఆదాయ వనరు మద్యమేనని ఆయన చెప్పారు. మద్యం ఆదాయం తగ్గడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఆదాయ వనరుల సమీకరణ శాఖల అధికారులతో మంత్రి సోమవారం సచివాలయంలో సమీక్షించారు. ఎక్కడెక్కడ ఆదాయం పెంచుకోవడానికి అవకాశం ఉందో నివేదిక రూపంలో ఇవ్వాలని సంబంధిత శాఖల అధికారులను కోరారు. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచే ఆలోచనలో ఉన్నందున ఆంధ్రప్రదేశ్‌లో కూడా మద్యం ధరలను పెంచాలని నిర్ణయించారు. -
‘చీప్’గా చేస్తున్నారు..!
మూతతీయ్.. కల్తీచెయ్ - మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటం - భువనగిరి డివిజన్లో కల్తీ మద్యం అమ్మకాలు - అధికారులు చోద్యం చూస్తున్నారని ఆరోపణలు భువనగిరి : లాభార్జనే ధ్యేయంగా మద్యం వ్యాపారులు అడ్డదారులు వెతుకుతున్నారు. యథేచ్ఛగా మద్యా న్ని కల్తీ చేస్తూ మద్యం ప్రియులప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బ్రాండెడ్ కంపెనీల మద్యం ఫుల్‌బాటిళ్ల మూతలు తీసి అందులో స్పిరిట్, నీళ్లు కలుపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆలేరు పట్టణంలో ఈ రకంగా కల్తీ చేసిన మద్యం సీసాలను స్థానికులు ఎక్సైజ్ అధికారులకు పట్టించా రు. బహిరంగంగానే ఈ దందా జరుగుతున్నా సంబంధిత శాఖ అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలూ ఉన్నాయి. అయితే ఇదంతా కొందరు అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎమ్మార్పీకే మద్యా న్ని విక్రయించాలనే నిబంధనను మద్యం వ్యాపారులు తుంగలో తొక్కుతున్నారని మద్యం ప్రియులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటాం : ఏడుకొండలు ఎక్సైజ్ సీఐ ఆలేరు ఆలేరులోని ఓ దుకాణంలో మద్యం కల్తీ జరుగుతుందని వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో వెంటనే విచారణ చేపట్టాం. ఆ షాపు నుంచి మద్యం షాంపిళ్లను సేకరించాం. వాటిలో కల్తీ జరిగిందా లేదా అన్న విషయంపై నిగ్గు తేల్చాలని కోరాం. నివేదిక రాగానే తప్పు తేలితే చర్యలు తీసుకుంటాం. కల్తీ ఇలా.. మద్యం వ్యాపారులు పలు చోట్ల సిండికేట్‌గా మారి ప్రతి మండలంలో ఒక హోల్‌సేల్ దుకాణాన్ని అనధికారికంగా నడుపుతున్నారు. ఆ దుకాణం నుంచి ఆయా మండలాల్లోని బెల్టుషాపులకు మద్యాన్ని సరఫరా చేస్తుంటారు. దీంతో ఎక్కువగా అమ్మకాలు ఉండే దుకాణాన్ని ఎంపిక చేసి గుట్టు చప్పుడు కాకుండా మద్యం కల్తీ చేస్తుంటారు. ఇందుకోసం ప్రత్యేకమైన అనుభవం కలిగిన వ్యక్తులను నియమించినట్లు తెలిసింది. రాత్రి మద్యం దుకాణం మూసే సమయం, లేదంటే ఉదయాన్నే దుకాణంలోకి వచ్చి తాము ఎంచుకున్న బాటిళ్ల మూతలను సీల్ చిరిగిపోకుండా పైకి తీస్తారు. వెంటనే అందులోంచి క్వార్టర్ సీసా మద్యం తీసి కొన్ని నీళ్లు, మరికొంత స్పిరిట్ కలిపి దాని మూతను యథావిథిగా బిగిస్తారు. ఇదంత ఒక గంటలోపు పూర్తి చేస్తారు. అనంతరం ఆయా మద్యం సీసాల నుంచి తీసిన మద్యాన్ని ఒక సీసాలో పోస్తారు. నాలుగు బాటిళ్లకు ఒక బాటిల్ చొప్పున అదనపు మద్యం తయారు చేయడం జరుగుతుందన్న ఫిర్యాదులు ఉన్నాయి. మద్యం దుకాణాల్లో ఎక్కువగా అమ్మకాలు ఉన్న బ్రాండ్ మద్యం సీసాల్లో ఈ రకమైన కల్తీ చేస్తున్నారని ఆరోపణలున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారుల వత్తాసు మద్యం సీసాలను కల్తీ చేస్తున్నారని ఫిర్యాదు చేస్తే పట్టించుకోవడం లేదని మద్యం ప్రియులు ఆగ్రహం చేస్తున్నారు. ఇటీవల ఆలేరులో ఇలా పట్టుకున్నసమయంలో ఆ శాఖ అధికారుల దృష్టికి తీసుకుపోతే ఇది పెద్ద సమస్య కాదని కామన్ అంటూ ఓ అధికారి అన్నట్లు ఫిర్యాదు దారులు ‘సాక్షి’కి చెప్పారు. కాగా ఇప్పటికే ముగిసిన బోనాల పండగ, దసరా,బతుకమ్మ పండగల నేపథ్యంలో పెద్ద ఎత్తున మద్యం అమ్మకాల్లో అక్రమాలు చోటు చేసుకునే అవకాశం ఉందని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం బొమ్మలరామారం, భువ నగిరి,బీబీనగర్ ప్రాంతాల్లో అక్రమ మద్యం అమ్మకాలను అధికారులు నిరోదించారు. మళ్లీ పండగల నేపథ్యంలో డివిజన్‌కు పొరుగన గల హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, వరంగల్ జిల్లాల నుంచి నకిలి మద్యం దిగుమతి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని మద్యం ప్రియులు కోరుతున్నారు. -
జిల్లాలో విరివిగా కల్తీ మద్యం
సాక్షి ప్రతినిధి, వరంగల్ : మద్యం ప్రియులకు నిఖార్సైన సరుకు దొరకడంలేదు. లక్షల రూపాయల లెసైన్స్ ఫీజుతో కొత్తగా షాపులు పెట్టిన పలువురు మద్యం వ్యాపారులు... వీలైనంత త్వరగా ఆదాయం రాబట్టుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. నీళ్లు కలిపిన మద్యం విక్రయిస్తూ మద్యం ప్రియులకు కిక్ లేకుండా చేస్తున్నారు. కిక్ ఎక్కకపోవడంతో మద్యం ప్రియులు మరింత తాగుతూ జేబులు గుల్ల చేసుకుంటున్నారు. ఇలా వచ్చిన అదనపు ఆదాయూన్ని మద్యం వ్యాపారులు... పలువురు ఎక్సైజ్ అధికారులకు వాటాగా ముట్టచెబుతూ యథేచ్ఛగా దందా సాగిస్తున్నారు. ఈ ఏడాది 2014-15 మద్యం సీజన్లో వెయ్యి కోట్ల రూపాయల ఆదాయం లక్ష్యంగా ప్రభుత్వం జిల్లావ్యాప్తంగా 234 (వైన్స్ షాపు) మద్యం దుకాణాలు ఏర్పాటు చేసింది. లాటరీలో షాపు దక్కిన వారు ప్రభుత్వం నిర్దేశించిన మేరకు లెసైన్స్ ఫీజు చెల్లించారు. జూలై 1 నుంచి మద్యం అమ్మకాలు మొదలుపెట్టారు. పెట్టుబడి త్వరగా రావాలనే ఉద్దేశంతో పలువురు మద్యం వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారు. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి విక్రయిస్తున్నారు. వైన్ షాపుల్లో పెగ్గుల రూపంలో (లూజ్) మద్యం విక్రయించకూడదనే ఎక్సైజ్ శాఖ ప్రాథమిక నిబంధనలను ఉల్లంఘిస్తూ బహిరంగంగానే ఈ పనిచేస్తున్నారు. ఎక్సైజ్ శాఖ అధికారుల ప్రోత్సాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని కొందరు వ్యాపారులు వైన్ షాపు ఆవరణలో డ్రమ్ముల్లో మద్యాన్ని పోసి పెగ్గుల రూపంలో అమ్ముతున్నారు. ఇష్టం వచ్చినట్లుగా నీళ్లు కలిపి మద్యం ప్రియులను దోపిడీ చేస్తున్నారు. ఈ అక్రమాలను ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. ఎవరైనా ఒకట్రెండుసార్లు ఫిర్యాదు చేస్తే మాత్రం వచ్చి తనిఖీలు చేస్తున్నారు. ఇలాంటి మొక్కుబడి తనిఖీల్లోనే భారీగా కల్తీ మద్యం పట్టుబడుతోంది. ఏ కంపెనీకి చెందిన మద్యం సీసాలో అయినా... ప్రమాణాల ప్రకారం మద్యం మోతాదు (ఆల్కహాల్ స్ట్రెంత్) 25 శాతం ఉంటుంది. వాతావరణంలోని మార్పులను బట్టి ఈ మోతాదు శాతం 24.5 నుంచి 25.5 వరకు ఉండవచ్చు. సీసాను ఓపెన్ చేసి నీళ్లు కలిపితే ఇది తక్కువగా ఉంటుంది. ఇది ఎక్సైజ్ శాఖ పరీక్షల్లో తేలుతుంది. కొత్త మద్యం సీజన్ మొదలై 42 రోజులే అయింది. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా కల్తీ మద్యం కేసులు నమోదుయ్యాయి. ఫిర్యాదుల ఆధారంగానే ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అన్నింటా కల్తీ మద్యమేనని నిర్ధారించారు. ఇలా అన్ని కేసుల్లోనూ నీళ్లు కలిపినట్లు విశ్లేషణ పరీక్షల్లో తేలింది. ఎక్సైజ్ అధికారులు 27 షాపుల్లో సేకరించిన శాంపిల్స్‌లో 17దుకాణాల్లో కల్తీ మద్యమని తేలడం గమనార్హం. మచ్చుకు కొన్ని ఘటనలు.. * జూలై చివరవారంలో భూపాలపల్లిలోని కళ్యాణి వైన్స్‌లో ఎక్సైజ్ అధికారులు ఆరు మద్యం సీసాల నుంచి శాంపిల్స్ తీసి పరీక్షించారు. రెండు శాంపిల్స్ కల్తిగా తేలాయి. ఇదేప్రాంతంలోని గాయత్రి వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరించగా... ఒకటి కల్తీగా నిర్ధారణ అయింది. * ములుగు మండలం మల్లంపల్లిలోని దుర్గా వైన్స్‌లో ఐదు శాంపిల్స్ సేకరిస్తే అన్నీ కల్తీగా నిర్ధారణ అయ్యాయి. ఇక్కడ కల్తీ మద్యం తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. 42 కల్తీ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. గణపురం(ఎం)లోని దుర్గా వైన్స్‌లో ఆరు శాంపిల్స్ తీసుకుని పరీక్షలు నిర్వహించారు. అన్ని శాంపిల్స్ కల్తీగానే తేలాయి. * కొత్తగూడలోని కనకదుర్గ వైన్స్‌లో నాలుగు శాంపిల్స్ సేకరించారు. ఇక్కడ కల్తీ అని తేలలేదు. అయితే మద్యాన్ని సీసాల్లోంచి తీసి పెగ్గుల రూపంలో విక్రయిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ నెల 8న వర్ధన్నపేటలోని సన్ని వైన్స్‌లో శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపారు. ఎక్సైజ్ అధికారులు దాడుల జరిపిన సమయంలో సన్ని వైన్స్‌లో నీటి జగ్గుల్లో మద్యం ఉండడం, గ్లాసుల్లో మద్యం పోసేందుకు అవసరమైన గౌరలు ఉన్నాయి. వర్ధన్నపేటలోని తిరుమల వైన్స్‌కు చెందిన రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలను ఒక గుర్తింపులేని గోదాంలో నిల్వ చేస్తే స్వాధీనం చేసుకున్నామని ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. వాస్తవంగా అధికారులు రూ.8 లక్షల విలువైన మద్యం పట్టుకున్నారని.. ఉద్దేశపూర్వకంగానే మద్యం నిల్వలను తక్కువ చేసి ప్రకటించినట్లు తెలుస్తోంది. వర్ధన్నపేటలోని ఎక్సైజ్ అధికారులు ఇక్కడి వైన్స్ షాపులతో కుమ్మక్కై నేరుగా బెల్ట్ షాపులకు తరలించేందుకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
మద్యపాన నిషేధానికి ఉద్యమం
కాగజ్‌నగర్ రూరల్ : మద్యపాన నిషేధానికి ఉద్యమిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం(పీవోడబ్ల్యూ) జిల్లా ఉపాధ్యక్షురాలు అందె మంగ తెలిపారు. బుధవారం పట్టణంలో నిర్వహించిన సంఘ సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళలపై అన్ని హింసలకు కారణమైన మద్యపానాన్ని నిషేధించేందుకు క్రియాశీలక ఉద్యమం చేపడతామని తెలిపారు. ఎన్టీఆర్ ప్రభుత్వంపై సారా వ్యతిరేక పోరాటంలో పీవోడబ్ల్యూ క్రియాశీల పాత్ర పోషించిందని గుర్తు చేశారు. ఐకేపీ సంఘాలకు రుణ మాఫీ వర్తింపజేయాలని, ఆర్పీలకు గౌరవ వేతనం ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ 20న శ్రీరాంపూర్‌లో పీవోడబ్ల్యూ తూర్పు ప్రాంత 5వ మహాసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కాగజ్‌నగర్ పట్టణ కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షురాలుగా ఆర్.కుమారి, అధ్యక్షురాలుగా కె.హారతి, ఉపాధ్యక్షురాలుగా సిహెచ్.నాగనందిని, ప్రధాన కార్యదర్శిగా బి.శ్యామల, సహాయ కార్యదర్శిగా బి.లావణ్య, కోశాధికారిగా సంతూర్బాయి, ప్రచార కార్యదర్శి రత్నం లక్ష్మీ ఎన్నికయ్యారు. -
లక్కెవరిదో?
మద్యం పాలసీ విడుదల నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ లాటరీ ద్వారానే మద్యం దుకాణాల కేటాయింపు 28న లాటరీ నెల్లూరు(క్రైమ్): ఎక్సైజ్ సంవత్సరానికి (2014-15) సంబంధించి కొత్త మద్యం పాలసీని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రాత్రి వెల్లడించింది. కొత్తసీసాలో పాత సారా అన్నట్టు నూతన మద్యం పాలసీ ఉంది. కొద్దిపాటి మార్పులు మినహాయిస్తే మిగతా పాలసీ అంతా పాతదే. బెల్ట్‌షాపులు అరికట్టేందుకు ఎలాంటి ప్రణాళిక విడుదల చేయకపోవడంతో ఇకపై ఊరూరా ఆరు క్వార్టర్లు మూడు బీర్లు అన్న చందంగా మద్యం పొంగిపొర్లే అవకాశం ఉంది. కాకపోతే ప్రతి బాటిల్‌కు తప్పనిసరి కంప్యూటర్ బిల్లు ఇవ్వాలన్న నిబంధన అక్రమ వ్యాపారులకు మింగుడుపడటం లేదు. మద్యం బాటిల్‌పై హోలోగ్రామ్‌తో పాటు 2డీ బార్కోడ్ ముద్రణ లిక్కర్మాఫియా పాలిట పిడుగుపాటుగా మారింది. లెసైన్సీలకు ఏడాది కాలపరిమితి విధించింది. జూలై నుంచి పాలసీ అమలువుతున్న నేపథ్యంలో మద్యం వ్యాపారుల్లో కదలిక మొదలైంది. జిల్లాలో 348 మద్యం దుకాణాల కోసం సిండికేట్ వ్యాపారులు సిద్ధమవుతున్నారు. జిల్లాలో నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 348 మద్యం దుకాణాలున్నాయి. గత ఎక్సైజ్ సంవత్సరంలో 318 దుకాణాలకు మాత్రమే దరఖాస్తులు అందాయి. మిగిలినవి ఖాళీగా ఉన్నాయి. జిల్లాకు ఐదు శ్లాబులు వర్తింపు కొత్త మద్యం పాలసీ ప్రకారం ఫిక్స్డ్ లెసైన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. 2013-14 ఎక్సైజ్ సంవత్సరంతో పోలిస్తే లెసైన్స్ ఫీజుల్లో స్వల్ప మార్పులు తీసుకొచ్చారు. గత ఏడాది 10 వేల నుంచి 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు లెసైన్స్ ఫీజు ఉండగా, ఈ ఏడాది రూ.36 లక్షలు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో మద్యం దుకాణాలను లాటరీ పద్ధతిలో కేటాయిస్తారు. పది వేలు లోపు జనాభాకు రూ.32.50 లక్షలు, 10 వేల నుంచి 50 వేల జనాభా వరకు రూ. 36లక్షలు, 50 వేల నుంచి 3 లక్షల జనాభా వరకు రూ.45 లక్షలు, 3 లక్షల నుంచి 5 లక్షల జనాభా వరకు రూ.50 లక్షలు, 5 లక్షల నుంచి 20 లక్షల జనాభా వరకు రూ.64 లక్షలుగా లెసైన్స్ఫీజును నిర్ణయించారు. బెల్టుషాపుల మూసివేత ఒట్టిదేనా? బెల్టుషాపుల మూసివేతకు పకడ్బందీ ప్రణాళిక ప్రకటించకపోవడంతో పల్లెల్లో మద్యం పొంగిపొర్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. పాత విధానం ప్రకారమే వైన్‌షాపులను లాటరీ ద్వారా కేటాయించాలని నిర్ణయించడంతో మహిళలు, మద్యపాన నిషేధ ఉద్యమకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏడాదికి రూ.132.32 కోట్లు ఆదాయం జిల్లా వ్యాప్తంగా 348 మద్యం దుకాణాలను జనాభా ప్రాతిపదికన నిర్ణయించారు. వీటికి లెసైన్స్‌ఫీజు రూపంలోనే ప్రభుత్వానికి సుమారు 132.32 కోట్లు ఆదాయం ఏటా సమకూరనుంది. వేలంలో పాల్గొనడానికి ప్రతి దరఖాస్తుదారుడు రూ.25 వేలు చెల్లించాల్సిందే. దీని ద్వారా ప్రభుత్వానికి రూ.87 లక్షలు ఆదాయం రానుంది. దరఖాస్తుదారులు పార్టిసిపేషన్ ఫీజుతో పాటు 10శాతం దరావత్తు చెల్లించాలి. వేలం తర్వాత ఎవరికీ పార్టిసిపేషన్ ఫీజు మొత్తాన్ని వెనక్కి ఇవ్వరు. బార్ల లెసైన్స్ ఫీజు ఇలా... నెల్లూరు, గూడూరు ఎక్సైజ్ జిల్లాల పరిధిలో 46 బార్లు ఉన్నాయి. వీటికి ఈ ఏడాది నూతన లెసైన్స్‌ఫీజు విధానం అమల్లోకి రానుంది. జనాభా నిష్పత్తి ప్రకారం లెసైన్స్ రెన్యూవల్ ఫీజును విధించారు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.25 లక్షలు, 50 వేల నుంచి 5 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.38 లక్షలు, 5 లక్షల నుంచి 25 లక్షలలోపు జనాభా ఉన్న ప్రాంతాలకు రూ.48 లక్షలు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ మద్యం దుకాణాలకు మంగళవారం నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఈ ప్రక్రియ నిర్వహిస్తారు. మద్యం దుకాణాలకు దరఖాస్తు చేసుకొనేవారు ఈనెల 27వ తేదీ సాయంత్రం మూడుగంటల్లోపు పూర్తిచేసిన దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. 28వ తేదీ మధ్యాహ్నం రెండుగంటలకు స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో అధికారులు దుకాణాలకు లాటరీ తీయనున్నారు. -
కొత్త సీసాలో పాత సారా..
ఖరారైన నూతన మద్యం విధానం లాటరీ పద్ధతిలోనే దుకాణాల కేటాయింపు బార్లకు మూడు, మద్యం దుకాణాలకు ఐదు శ్లాబులుగా లెసైన్స్ ఫీజు కొన్ని శ్లాబుల్లోనే స్వల్పంగా ఫీజుల పెంపు జిల్లాలో 342 మద్యం దుకాణాలు, 187 బార్లకు నోటిఫికేషన్ విడుదల గుంటూరు : నూతన మద ్యం విధానం ఎట్టకేలకు ఖరారయింది. టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పగ్గాలు చేపట్టిన తరువాత రాష్ట్రంలో బెల్టు షాపులను రద్దు చేస్తూ సంతకం చేశారు. దీనికి అనుగుణంగా నూతన మద్యం విధానంలో సమూలమైన మార్పులు చేస్తారని, కర్ణాటక, మహారాష్ట్ర మాదిరిగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తుందని ప్రచారం జరిగింది. కానీ మార్పులు చేయకుండా కేవలం రెండు మూడు శ్లాబుల్లోని దుకాణాలకు మూడు, నాలుగు లక్షల రూపాయలు ఫీజులు పెంచి పాత విధానాన్నే నిత్యావసర సరుకులను చౌకగా అందించాలని గత ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశ పెట్టింది. కానీ, ఈ పథకం ఆరంభం నుంచే అభాసుపాలవుతూ వచ్చింది. గత కొన్ని నెలలుగా చౌకధరల దుకాణాలకు సరుకులను దిగుమతి చేయడంలో అధికారులు విఫలమౌతూనే ఉన్నారు. పంపిణీ ప్రక్రియ ఇదీ.. ప్రతి నెలా 15వ తేదీ నుంచి 18వ తేదీలోగా చౌకధరల దుకాణాలకు సంబంధించిన సరకుల అలాట్మెంట్ను ఆన్లైన్ ద్వారా మంజూరు చేస్తారు. ఈ కేటాయింపుల ఆధారంగా రేషన్ డీలర్లు డీడీలు చెల్లిస్తారు. చెల్లించిన వారికి నెలాఖరులోగా సరుకులను దిగుమతి చేస్తారు. ఆ సరుకులను ఆ మరుసటి నెల 1వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ కార్డుదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ప్రతినెలా జరిగే ప్రక్రియ ఇది. కొన్ని నెలలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ఈ నెల 24వ తేదీ వచ్చినప్పటికీ ఇంత వరకూ చౌకధరల దుకాణాలకు సరుకుల ఎలాట్‌మెంట్‌ను ఆన్లైన్ చేయకపోవడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని చెబుతున్నప్పటికీ జిల్లాలో మాత్రం కొన్ని మండలాల్లో మినహా ఎక్కడా రేషన్ డీలర్లు డీడీలు చెల్లించలేదు. ఇంత వరకూ ఎంత మొత్తానికి డీడీలు తీయాలో అధికారుల నుంచి స్పష్టత రాకపోవడంతో డీలర్లు అయోమయానికి లోనవుతున్నారు.