ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌ను గురువారం(సెప్టెంబర్ 5) సుప్రీం కోర్టు విచారించనుంది. బెయిల్ పిటిషన్ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఉజ్జల్ భూయన్ ధర్మాసనం విచారించనుంది.
మద్యం పాలసీ ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ పొందగా.. సీబీఐ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలని కేజ్రీవాల్ పిటీషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.
కాగా, ఢిల్లీ లిక్కర్ కేసులో ఇటీవలే మనీష్ సిసోడియా, కవిత సహా పలువురికి బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్ట్. ఇప్పట్లో లిక్కర్ కేసులో ట్రయల్ జరిగే పరిస్థితులు లేకపోవడంతో అత్యున్నత న్యాయ స్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్‌కు సైతం బెయిల్ వస్తుందని ఆప్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
సీబీఐ ఏం చెబుతుంది?
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వకూడదని సీబీఐ వాదిస్తుంది. కేజ్రీవాల్ ఆదేశాలతో మద్యం పాలసీ ద్వారా నిధుల్ని సేకరించి..ఆ మొత్తాన్ని గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ ఖర్చు పెట్టినట్లు చెబుతుంది. గోవాలో 40 నియోజకవర్గాలు ఉన్నాయని, ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో అభ్యర్థికి రూ.90 లక్షలు ఇస్తానని ఆయన హామీ ఇచ్చారని..చెప్పినట్లుగానే నిధుల్ని మళ్లించారని కోర్టుకు సీబీఐ ఆధారాల్ని అందించింది.
తొలిసారి కేజీవాల్ అరెస్ట్
మద్యం పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తొలి సారి మార్చి 21న అరెస్ట్ చేసింది. అనంతరం కొద్దిరోజులకే కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ కోసం అప్లయి చేయగా.. ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. అదే కేసులో జూన్ 26న ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టులో సీబీఐ అతడిని అదుపులోకి తీసుకుని జూన్ 29న జ్యుడీషియల్ కస్టడీలో ఉంచింది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం మే 10న ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. నిబంధనల ప్రకారం.. జూన్ 2న తీహార్ జైల్లో లొంగిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment