నెల్లూరు, సాక్షి: ఇసుక, మద్యం విషయంలో కూటమి ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. ఆయన నెల్లూరులో శనివారం మీడియాతో మాట్లాడారు.
‘‘సూపర్ సిక్స్‌లో ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. ఇప్పుడు ఇసుకపై కొత్త నాటాకానికి తెరతీశారు. చంద్రబాబు చెప్పేదానికి, చేసేదానికి పొంతనే ఉండటం లేదు. చంద్రంబాబా దొంగ ఎమ్మెల్యేలు అన్నట్లు ఉంది. చంద్రబాబు పార్టీ నేతలకు ఒకటి చెబుతారు.. క్షేత్రస్థాయిలో మరోటి జరుగుతోంది. చంద్రబాబు మాటలకు అర్దాలే వేరులే అన్నట్లు ఉంది. ఇసుక, మద్యం జోలికి వెళ్ళవద్దని చెబుతారు. కానీ టీడీపీ నేతలు వాటినే ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఉచిత ఇసుక ఇస్తామని చెప్పారు. ఇప్పుడు సీనరేజ్ రద్దు చేస్తామని చెబుతున్నారు. ఇసుక ఉచితం అన్నప్పుడు సీనరేజ్ ఎక్కడ ఉంటుంది?. రాష్ట్రంలో ఇసుక, మద్యంకు సంబంధించి ఎన్నో దౌర్జన్యాలు జరిగాయి. ఎవరిమీదా చర్యలు తీసుకోలేదు, కేసులూ పెట్టలేదు.
... లాటరీలో మద్యం షాపులు పొందిన వారిని కిడ్నాప్ చేశారు. ఇసుక టెండర్లు పొందిన వారిని మంత్రులు భయపెడుతున్నారు. తమ అనుమతి లేకుండా ఎలా టెండర్లు వేశారు అంటూ నిలదీస్తున్నారు. ఇసుక, మద్యంలో ఎన్నో అక్రమాల జరుగుతున్నాయని టీడీపీ కరపత్రికే రాసింది. సూపర్ సిక్స్‌లో ప్రకటించిన వాటిలో ఏమీ అమలు కాలేదు. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపిస్తున్న మీడియాపై కేసులు పెడుతున్నారు. నెల్లూరు జిల్లాలో నాలుగు ఇసుక రీచ్‌ల కోసం టెండర్లు పిలిచారు. లాటరీ ద్వారా ఎంపిక చెయ్యాలని మంత్రి నారాయణ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
.. మా రీచ్‌లో మాకు తెలియకుండా టెండర్లు ఎలా వేశారంటూ ఒక మంత్రి, ఎమ్మెల్యే లాటరీలలో పొందిన వారిని భయపెడుతున్నారు. ఒక మంత్రి తీసుకున్న నిర్ణయాన్ని పట్టించుకోకుండా కలెక్టర్ టెండర్లు రద్దు చేశారు. మంత్రి అంటే లెక్క లేకుండా చేశారు. దీనిపై కలెక్టర్ సమాధానం చెప్పాలి. మళ్లీ టెండర్లు పిలుస్తామని చెప్తున్నారు. చంద్రబాబు మాటలు పట్టించుకోకుండా ఇక్కడ నేతలు వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈనెల 25న కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహిస్తాం’’ అని అన్నారు.
చదవండి: చంద్రబాబు నిర్ణయం.. టీడీపీ నేతలకే తిరుమల వెంకన్న సేవలు!
Comments
Please login to add a commentAdd a comment