‘ఇసుక దోపిడీ.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్’ | ysrcp leader tjr sudhakar babu slams CM chandrababu over sand policy | Sakshi
Sakshi News home page

‘ఇసుక దోపిడీ.. చంద్రబాబు మాస్టర్ స్కెచ్’

Published Mon, Oct 14 2024 12:53 PM | Last Updated on Mon, Oct 14 2024 4:37 PM

ysrcp leader tjr sudhakar babu slams CM chandrababu over sand policy

తాడేపల్లి, సాక్షి: ఊహలకు అందని మాస్టర్ స్కెచ్‌తో ఇసుకను దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు మండిపడ్డారు. చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి దోపిడీకి ప్లాన్ వేశారని అన్నారు. వైఎస్‌ జగన్ ప్రభుత్వంలో ఇసుక పంపిణీలో లోపాలు జరిగినట్టు ఎల్లో మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ప్రజలు గుర్తించాలని  అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

‘‘2014-19 మధ్యలో కూడా ఇదే కూటమి ప్రభుత్వం ఇసుక విధానం కోసం 19 జీవోలు ఇచ్చారు. ఎమ్మెల్యేలు, నాయకులకు ఎలా దోచిపెట్టవచ్చో చూపిస్తున్నారు. రాజకీయాల్లో ఎన్నికల హామీలకు విలువ లేదని చంద్రబాబు మళ్లీ నిరూపించారు. తాను మారినట్టు, ప్రజల కోసమే పని చేస్తుననట్టు నటిస్తున్నారు. అధికారంలోకి రాగానే తన నిజ స్వభావాన్ని చూపిస్తున్నారు. ఈరోజు 18 టన్నుల లారీ విలువ రూ.33 వేలకుపైగా ఉంది. పేద, మధ్య తరగతి ప్రజలు బతికేదెలా?. మా హయాంలో రూ. 3,750 కోట్ల ఆదాయం ప్రభుత్వానికి వచ్చింది. అందరూ దసరా పండుగ హడావుడిలో ఉంటే టీడీపీ నేతలు మాత్రం టెండర్ల పండుగలో ఉన్నారు. రెండు రోజుల్లోనే టెండర్లు పిలవటం ఏంటి?. ఇన్ని అక్రమాలు జరుగుతుంటే ఎల్లోమీడియాలో వార్తలు ఎందుకు రావటం లేదు?.

మద్యం టెండర్లలో టీడీపీ నేతలందరూ పాల్గొనలేకపోయారని వారి కోసమే రెండు రోజులు గడువు పెంచారు. మద్యాన్ని దూరం చేయాలని జగన్ కోరుకుంటే.. చంద్రబాబు మాత్రం ఏరులై పారించాలని చూస్తున్నారు. మరోవైపు గుట్టుచప్పుడు కాకుండా ఇసుకకు టెండర్ పెట్టేశారు. ప్రభుత్వ ఆదాయానికి పూర్తిగా గండికొట్టేలా వ్యవహరిస్తున్నారు.వర్షాకాలంలో ఉపయోగపడుతుందని 80 లక్షల టన్నుల ఇసుకను రెడీ చేసి పెడితే..  టీడీపీ నేతలు 40 లక్షల టన్నుల ఇసుకను అక్రమంగా అమ్మేసుకున్నారు.ఇప్పుడు భారీస్థాయిలో రేట్లు పెంచటానికి కారణం ఏంటో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సామాన్యలకు టెండర్లు వేసే అవకాశం లేకుండా చేశారు. కలెక్టరేట్ల దగ్గర టీడీపీ గూండాలు, రౌడీలు బెదిరించి తరిమేశారు. ఇదేనా కూటమి ప్రభుత్వపు పాలనా విధానం?. ఇసుకను కచ్చితంగా ఫ్రీగా ప్రజలకు అందించాలని డిమాండ్‌ చేస్తున్నాం. కూటమి ప్రభుత్వ హామీని అమలు చేయాల్సిందే’’ అని అన్నారు.

చదవండి: టీడీపీ, జనసేనలో వర్గ విభేదాలు.. మంత్రికి నిరసన సెగ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement