నెల్లూరు, సాక్షి: వరద నివారణ చర్యలతో పాటు వరద సహాయక కార్యక్రమాల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకు వైఎస్ జగన్‌ను విమర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.
‘‘ 1964 లోనే బుడమేరకు భారీ వరద వచ్చింది.. అప్పుడు పదిమంది మరణించారు. రియల్ టైం గవర్నెన్స్ గురించి చెప్పే చంద్రబాబు.. వరద తీవ్రతను ఎందువల్ల గుర్తించలేదు. నీటిని విడుదల చేయాలని అధికారులు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. బాధితులను ఎందువల్ల పునరావాస కేంద్రాలకు తరలించలేకపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తాను నివాసం ఉంటున్న ఇంటి నుంచి పునరావస కేంద్రమైన కలెక్టరేట్‌కి వెళ్లారు. వరదలు తగ్గిన తర్వాతే ఇంటికి వెళ్తానని చెబూతున్నారు. చంద్రబాబు ఉన్న ఇల్లు... నీటిలో మునిగింది అందువల్లే అక్కడికి పోవడం లేదు. హైదరాబాద్‌లో హైడ్రా కంటే ముందే రాష్ట్రంలో జగన్ అక్రమ కట్టడాలను కూల్చడం ప్రారంభించారు.
హైదరాబాద్‌లో హైడ్రా చర్యలను పచ్చ మీడియా ప్రశంసిస్తోంది.. కానీ గతంలో అక్రమ కట్టడాలను పడగొడితే మాత్రం అదే మీడియా గగ్గోలు పెట్టింది. వైఎస్ జగన్ మోకాలు లోతు వరద నీటిలో దిగి పరామర్శలు ప్రారంభించిన తర్వాతే చంద్రబాబు నీళ్లలోకి దిగారు. వైఎస్సార్‌సీపీ హయాంలో తీసుకు వచ్చిన రేషన్ వాహనాలనే ఇప్పుడు వాడుతున్నారు. వరదల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు.. రైతులకు నష్ట పరిహారం చెల్లించాలి. ఏ సీజన్‌లో నష్టం జరిగితే ఆ సీజన్‌లోనే జగన్ పరిహారం చెల్లించారు. మత్స్యకారుల బోట్లు కొట్టుకుపోయాయి.. ఆక్వా రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు.
ప్రభుత్వ వైఫల్యాలు బయటపడకుండా ఉండేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రకాశం బ్యారేజీకి వైఎస్సార్‌సీపీకి చెందిన వారి బోట్లు వచ్చాయని చెబుతున్నారు. చంద్రబాబును జాకీలు పెట్టి పచ్చ మీడియా ఎత్తుతోంది. రైల్ ట్రాక్ పక్కన చంద్రబాబు నిలబడితే... బాబుకు తప్పిన ప్రమాదం అంటూ ప్రచారం చేశారు. వరదల్లో ప్రాణాలు పోయిన అన్ని మరణాలను చంద్రబాబు హత్యలుగానే పరిగణించాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment