‘వైఎస్సార్‌సీపీని వీడి.. కాలగర్భంలో కలిశారు’ | YSRCP Leaders Reactions On Party Defections In AP, More Details Inside| Sakshi
Sakshi News home page

వలసలపై వైఎస్సార్‌సీపీ నేతల రియాక్షన్లు

Published Thu, Aug 29 2024 12:04 PM | Last Updated on Thu, Aug 29 2024 1:34 PM

ysrcp leaders reacts on party defections in AP

గుంటూరు,సాక్షి: ప్రజలను దృష్టి మరల్చేందుకు.. రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని వైఎస్సార్‌​సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ తాజా రాజకీయ పరిణామాలపై తమ స్పందన తెలియజేస్తున్నారు. 

సభ్యుల పార్టీ మార్పుపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి  స్పందించారు.  వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయాలని చంద్రబాబు గతంలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని ఫైర్‌ అయ్యారు. ఆయన గురువారం నెల్లూరులో మీడియాతో మాట్లాడారు.

‘‘గతంలో 23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి.. చివరికి 23 సీట్లకే చంద్రబాబు పరిమితం అయ్యారు. రాజీనామా చేసి పార్టీలో చేరిన వారికి పదవులు ఇస్తామని చంద్రబాబు గ్యారెంటీ ఇస్తారా?. కొందరిని ప్రలోభాలకు గురిచేసి పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ప్రజలను దృష్టి మరల్చేందుకు రాజ్యసభ సభ్యుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. గతంలో పార్టీ మారినవారు కాలగర్బంలో కలిసిపోయారు. పార్టీ వీడితే వచ్చే నష్టమేమీ లేదు’’ అని అన్నారు.

ఇది చారిత్రిక సత్యం!
అధికారం లేదని పార్టీ మారినోళ్లు పరువు పోగొట్టుకున్నారని మాజీమంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజ్యసభ సభ్యుల పార్టీ మార్పుపై అంబటి రాంబాబు ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. ‘‘అధికారం లేదని పార్టీ మారినోళ్ళు పరువు పోగొట్టుకున్నారు కానీ, ప్రజాదరణ పొందలేదు.. ఇది చారిత్రిక సత్యం!’ అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement