మద్యం నల్లాలు ఇస్తారా?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో చౌక మద్యం విక్రయాలకు సంబంధించి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చీప్ లిక్కర్ వల్ల యువత దారి తప్పే ప్రమాదం ముందని మహిళా నేతలు డీకే అరుణ, సునీతా లక్ష్మారెడ్డిలు విమర్శించారు. చౌక మద్యం వల్ల మహిళలపై దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఇంటింటికీ నల్లాలు ఇస్తామని.. ఇప్పుడు మద్యం నల్లాలు ఇస్తామంటారా?అని ప్రశ్నించారు. ఐదు వేల కోట్ల ఆదాయం కోసం చీప్ లిక్కర్ ను ప్రవేశపెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పేదల రక్తాన్ని తాగడమేనని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు.