ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం 'అరవింద్ కేజ్రీవాల్'కు రూ.15,000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో.. దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది.
కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్థానం తనకు బెయిల్ మంజూరు చేసిన తరువాత న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు.
ఢిల్లీ ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రనేతలు.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ చార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు చోటు చేసుకుంది. ఎక్సైజ్ పాలసీ ముసాయిదా రూపకల్పన సమయంలో ఈ కేసులో నిందితులు ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నారని ఏజెన్సీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment