ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది.
కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.
మద్యం పాలసీ కేసులో ఈడీ
మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.
ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment