trail court
-
మద్యం పాలసీ కేసులో అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఎదురు దెబ్బ తగిలింది. మద్యం పాలసీ కేసులో ట్రయిల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. కేజ్రీవాల్ పిటిషన్‌పై జస్టిస్ మనోజ్ కుమార్ ఓహ్రీ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం గురువారం (నవంబర్21) విచారణ చేపట్టింది. మద్యం పాలసీ కేసు సంబంధించి ట్రయల్ కోర్టు ప్రొసీడింగ్స్‌ను నిలిపివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. విచారణ చేపట్టిన కోర్టు కేజ్రీవాల్ పిటిషన్‌ను కొట్టి వేసింది. అయితే, ఇదే మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్‌పై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌పై స్పందించాలని ఈడీని కోరింది.మద్యం పాలసీ కేసులో ఈడీ మద్యం పాలసీ కేసులో ఈడీ తాజాగా మరిన్ని ఆధారాల్ని సేకరించింది. సేకరించిన ఆధారాలతో అనుగుణంగా కేజ్రీవాల్‌ను విచారణ చేపట్టాలని కోరుతూ ట్రయల్ కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను ట్రయల్ కోర్టు పరిశీలించింది. కేజ్రీవాల్‌పై తదుపరి చర్యలు తీసుకునేందుకు ఈడీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ట్రయల్ కోర్టు నిర్ణయం అనంతరం ఈడీ కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. ఆ సమన్లలో ట్రయల్ కోర్టులో విచారణ కావాలని స్పష్టం చేసింది.దీంతో పలు మార్లు సమన్లు జారీచేసినా కేజ్రీవాల్ స్పందించలేదు.ఈ తరుణంలో ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించాలని కోరుతూ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై గురువారం విచారణ చేపట్టిన కోర్టు.. ట్రయల్ కోర్టు విచారణపై స్టే విధించలేమని తెలిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 20కి వాయిదా వేసింది. -
రూ.83 వేల కోట్ల మోసం : జైలు శిక్ష పడుతుందని.. ప్రియురాల్ని ఇరికించాడు!
మదుపరులు ‘కింగ్ ఆఫ్ క్రిప్టో’గా అభివర్ణించే ఎఫ్‌టీఎక్స్ ఫౌండర్ శామ్ బ్యాంక్మన్ ఫ్రైడ్ కోర్టు విచారణ సందర్భంగా తనని తాను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రిప్టోకరెన్సీ ఎక్ఛేంజ్ కుప్పకూలిపోవడంతో నా వల్ల చాలా మంది బాధపడ్డారు. అయితే, తానెవరినీ మోసం చేయలేదని, కస్టమర్ల నుంచి బిలియన్ డాలర్ల మొత్తాన్ని దోచుకోలేదని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. 83వేల కోట్ల (10 బిలియన్ డాలర్లు) మోసానికి గాను ఏళ్ల తరబడి జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశ్యంతో చేసిన నేరాన్ని తన ప్రియురాలు కరోలిన్ ఎల్లిసన్పై నెట్టాడు. ప్రపంచ వ్యాప్తంగా 134 ఎఫ్‌టీఎక్స్ అనుబంధ సంస్థల నెత్తిపై 5,000 కోట్ల డాలర్ల అప్పులు, 10 లక్షల మందికి పైగా క్రిప్టో మదుపరులు నష్టం’ వంటి కారణాలతో అమెరికా దర్యాప్తు సంస్థలు ఫ్రైడ్పై సెక్యూరిటీస్ ఫ్రాడ్, వైర్ ఫ్రాడ్ (టెలికమ్యూనికేషన్, టెక్నాలజీని వినియోగించి చేసే మోసం), మనీ ల్యాండరింగ్‌కు పాల్పడినందుకు డజనకుపైగా కేసులు నమోదు చేశాయి. వీటిపై న్యూయార్క్ సిటీ మనహట్టన్ ఫెడరల్ కోర్టు శామ్ బ్యాంక్మన్-ఫ్రైడ్‌ను విచారిస్తుంది. ప్రియురాల్ని ఇరికించి తాజాగా,ఫెడరల్ కోర్టు నిర్వహించిన విచారణకు ఫ్రైడ్, అతని తరుపు వాదించే లాయర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రైడ్‌ను విచారిస్తున్న న్యాయమూర్తులతో రిస్క్-మేనేజ్మెంట్ టీమ్‌ను నియమించుకోవడం వంటి తప్పులు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదే సమయంలో తాను చేసిన తప్పుల్ని ఒప్పుకుంటే జైలు శిక్ష పడుతుందనే ఉద్దేశంతో తన ప్రియురాలు, 2017లో ఫ్రైడ్ స్థాపించిన ట్రేడింగ్ కంపెనీ అలమెడా రీసెర్చ్ సీఈవో కరోలిన్ ఎల్లిసన్‌ను ఇరికించారు. ఆరు గంటల వాంగ్మూలంలో ‘మేం మార్కెట్లో అత్యుత్తమ ప్రొడక్ట్‌ను తయారు చేయగలమని భావించాము. కానీ ఊహించిన దానికి విరుద్ధంగా మారింది. దీంతో కస్టమర్లు, ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. కంపెనీ దివాలా తీసింది’అని బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ మాన్హాటన్ ఫెడరల్ కోర్టులో తన ఆరు గంటల వాంగ్మూలంలో చెప్పాడు. నేరం రుజువైతే దశాబ్ధాల పాటు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అందుకే తనపై నమోదైన డజనకు పైగా కేసుల్లో తాను ఏ తప్పు చేయలేదని మరోసారి స్పష్టం చేశాడు. 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ ఫండ్లను అలమెడా రీసెర్చ్‌కు తరలించారని, ఎన్నికల ప్రచారం కోసం అమెరికాలోని పలువురు రాజకీయ నాయకులకు 100 మిలియన్ల కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చారని ప్రాసిక్యూటర్లు ఆరోపించారు. డిఫెన్స్ లాయర్ మార్క్ కోహెన్ ప్రశ్నలకు బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్ స్పందిస్తూ.. స్పాన్సర్‌షిప్‌లు, రియల్ ఎస్టేట్ కోసం ఉపయోగించే నిధులు ఎఫ్‌టీఎక్స్ కస్టమర్ల నుండి రాలేదని, కంపెనీ ఆదాయం,ఈక్విటీ పెట్టుబడిదారుల నుండి పొందిన కమీషన్ల నుంచి వచ్చినట్లు తాను నమ్ముతున్నానని అన్నాడు. రాజకీయ విరాళాలు ఇచ్చేందుకు తనకున్న ఆలమేడ నుంచి అప్పు తీసుకున్నట్లు తెలిపారు. మొత్తం ప్రియురాలే చేసింది 2022 జూన్‌లో క్రిప్టో మార్కెట్ క్రాష్ అయ్యింది. దీంతో పెట్టుబడి దారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు అల్మెడ బ్యాలెన్స్ షీట్లను తప్పుగా మార్చమని చెప్పినట్లు ఫ్రైడ్ వివరించాడు. ఆ బ్యాలెన్స్ షీట్లను చూసే అవసరలేదని భావించానని, కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదన్నారు. సుదీర్ఘ విచారణలో ఫ్రైడ్ నుంచి వాంగ్మూలం తీసుకున్న అనంతరం విచారణను కోర్టు వాయిదా వేసింది. ఎవరీ బ్యాంక్మన్-ఫ్రైడ్ క్రిప్టో ఎక్స్ఛేంజీ ఎఫ్‌టీఎక్స్‌ను 2019లో బ్యాంక్మన్-ఫ్రైడ్ స్థాపించారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఇది విస్తరించింది. 2014లో మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్ డిగ్రీని ఆయన పూర్తి చేశారు. అనంతరం క్వాంటిటేటివ్ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ క్యాపిటల్‌లో మూడేళ్ల పాటు ట్రేడర్‌గా పనిచేశారు. 2017లో అలమెడా రీసెర్చ్ పేరుతో సొంత ట్రేడింగ్ కంపెనీని ప్రారంభించారు. 2019లో ఎఫ్‌టీఎక్స్‌ను ఏర్పాటు చేశారు. 2022 ప్రారంభంలో ఫోర్బ్స్ గణాంకాల ప్రకారం.. ఆయన ఎక్స్ఛేంజీ విలువ 40 బిలియన్ డాలర్లు. ఆయన సంపదలో అధిక మొత్తాన్ని స్వచ్ఛంద సేవకు ఇస్తానని హామీ ఇచ్చారు. -
పాక్ ఉగ్రవాది కసబ్‌కి ఉన్న వెసులుబాటు నాకు లేదు: సత్యేంద్ర జైన్
తిహార్ జైలులో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన మంత్రి సత్యేంద్ర జైన్ రాజభోగాలు అనుభవిస్తున్నారంటూ మసాజ్ వీడియో లీకైన సంగతి తెలిసిందే. పైగా ఆ మసాజ్ చేస్తున్న వ్యక్తి రేపిస్ట్ అని జైలు అధికారులు చెప్పడంతో మరింత వివాదాస్పదంగా మారింది. ఈ మేరకు సత్యేంద్ర జైన్ జైలు గదిలోని ఫుటేజ్ లీక్ అవ్వడంపై కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీకి వ్యతిరేకంగా పిటీషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి వికాస్ ధుల్ ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించారు. అందులో భాగంగా జైన్ మనీలాండరింగ్‌పై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కోర్టు ఆదేశాలు ఉల్లంఘింస్తూ... మీడియాకు సున్నితమైన సమాచారాన్ని లీక్ చేస్తున్నారంటూ జైన్ తరపు న్యాయవాది వాదించారు. వారి చర్యలతో ప్రతి నిమిషం తమ పరువు పోతుందని అన్నారు. ఈ మేరకు సత్యేందర్ జైన్ ట్రయల్ కోర్టులో మాట్లాడుతూ...కనీసం 26/11 ముంబై దాడుల్లో ఉరిశిక్ష పడిన పాకిస్తాన్ ఉగ్రవాదిని ప్రస్తావిస్తూ... అజ్మల్ కసబ్‌కు కూడా ఉచిత న్యాయపరమైన విచారణ వచ్చింది. కనీసం నేను అంతకంటే అధ్వాన్నంగా లేను. నేను కోరేది న్యాయమైన ఉచిత విచారణ. దయచేసి నాకు వ్యతిరేకంగా వస్తున్న మీడియా నివేదికలను పరిశీలించండి అని జైన్ కోర్టుని కోరాడు. అలాగే ఆయన జైలుతో ప్రత్యేక చికిత్స తీసుకుంటున్నట్లు వచ్చిన ఈడీ ఆరోపణలను కూడా ఖండించారు. జైలులో తాను 28 కేజీలు తగ్గాను, సరైన తిండి కూడా లేదన్నారు. కోర్టు తనపై ఒత్తిడి తీసుకువచ్చిన జైలు నిబంధనలను కూడా ఉల్లంఘించలేదని అన్నారు. మరోవైపు జైన్‌ని జైలులో ఉంచేందుకు బీజేపీ ఈడీని దుర్వినియోగం చేస్తుందంటూ ఆప్ పదేపదే ఆరోపిస్తోంది. ఐతే ఈడీ తరుపు న్యాయవాది జోహైబ్ హుస్సేన్ సత్యేంద్ర జైన్‌కి ఫిజియోథెరఫీ తీసుకోమని సలహ ఇవ్వడంతో ఆయన దానిని తీసుకుంటున్నారని వాదించారు. కేంద్ర ఏజెన్సీ ద్వారా ఒక్కటి కూడా లీక్ అవ్వలేదని అన్నారు. అలాగే దోషులకు న్యాయం జరిగేలా చూస్తామని న్యాయవాది అన్నారు. అలాగే జైన్ తరుఫు న్యాయవాది కేంద్ర ఏజెన్సీలు తనను ఉరిశిక్ష పడే ఖైదీగా చిత్రీకరిస్తూ లీక్ అవుతున్న వీడియోలు, ప్రముఖ ఛానెల్‌ల స్క్రీన్షాట్లను కూడా సమర్పించారు. ఐతే ఈడీకి నేతృత్వం వహిస్తున్న అడిషనల్ సొలిసిటర్ జనరల్(ఏఎస్జీ) ఎస్సీ రాజు వ్యక్తిగత కారణాలతో హాజరు కాకపోవడంతో కోర్టు ఈ కేసును వాయిదా వేసింది. (చదవండి: తిహార్ జైలులో ఆప్ మంత్రి మసాజ్ వీడియోలో ట్విస్ట్.. అతను ఫిజియో థెరపిస్ట్ కాదు.. రేపిస్ట్..) -
కోర్టులు భౌతికంగా పనిచేయక తప్పదు: సుప్రీం
న్యూఢిల్లీ: హైబ్రిడ్ విధానంలో కేసుల విచారణ సవ్యంగా సాగడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. వర్చువల్ విచారణ ఇక తప్పనిసరి కాదని తెలిపింది. కోవిడ్ మహమ్మారి ముందు మాదిరిగా న్యాయస్థానాలు ఇకపై భౌతిక విచారణలు జరపాలని సూచించింది. ‘కోర్టుల్లో కూర్చుని, స్క్రీన్ల వైపు చూస్తూ విచారణలను నిర్వహించడం మాకు సంతృప్తికరంగా లేదు’ అని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ బీఆర్ గవాయ్‌ల ధర్మాసనం శుక్రవారం పేర్కొంది. కోర్టులు తిరిగి యథావిధిగా పనిచేయాలనీ, పౌరులందరికీ న్యాయం అందించేందుకు కృషి చేయాలని కోరింది. వర్చువల్ విచారణను పిటిషనర్ల ప్రాథమిక హక్కుగా ప్రకటించాలంటూ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సొసైటీస్ ఫర్ ఫాస్ట్ జస్టిస్ అనే ఎన్జీవో వేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఈ అంశంపై ఎలా ముందుకెళ్లాలనే విషయమై తగు సూచనలు ఇవ్వాల్సిందిగా పిటిషనర్లయిన కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శైలేష్ ఆర్ గాంధీ, ముంబై మాజీ పోలీస్ కమిషనర్ జూలియో రిబీరో తదితరులకు నోటీసులిచ్చింది. -
ఉరిశిక్షపై సుప్రీంకు వెళ్లడానికి దోషులకు 60 రోజుల గడువు
న్యూఢిల్లీ: ఉరిశిక్ష పడిన దోషులు శిక్ష నుంచి ఉపశమనానికి సుప్రీంకోర్టుకెక్కడానికి 60 రోజులు గడువు ఉన్నప్పటికీ ఈ లోగా వారికి డెత్ వారంట్లు ఎందుకు జారీ చేస్తున్నారని సుప్రీంకోర్టు గురువారం ట్రయల్ కోర్టులను ప్రశ్నించింది. 2018లో గుజరాత్‌లోని సూరత్‌లో మూడేళ్ల చిన్నారి అత్యాచారం, హత్యకేసులో అనిల్ సురేంద్ర సింగ్ యాదవ్‌ని ట్రయల్ కోర్టు దోషిగా తేల్చింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు కూడా సమర్థించింది. ఆ తర్వాత కేవలం 33 రోజుల్లోనే కింది కోర్టు డెత్ వారంట్లు జారీ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ యాదవ్ సుప్రీంకోర్టుకెక్కాడు. దీంతో బెంచ్ యాదవ్ డెత్ వారంట్‌పై స్టే విధించింది. హైకోర్టు తీర్పుని సుప్రీంలో సవాల్ చేసుకోవడానికి దోషులకు 60 రోజులు గడువు ఉంటుందని, ఈలోగా డెత్ వారంట్లు జారీ చేయకూడదని సుప్రీంకోర్టు గతంలో తీర్పిచ్చింది. అలాంటప్పుడు కింది కోర్టులు డెత్ వారంట్లు ఎలా జారీ చేస్తారని సుప్రీం ఆశ్చర్యం వ్యక్తం చేసింది. -
గర్భిణి మృతి కేసులో తీర్పును నిలిపేసిన కోర్టు
న్యూఢిల్లీ: గర్భం తీసేసిన డాక్టర్ ఆమె చావుకు కారణమైన కేసులో కోర్టు తీర్పును నిలిపివేసింది. ఆ చికిత్స చేసేందుకు అతనికి కనీస అర్హతలు లేవని జిల్లా జడ్జి ఐనా మల్హోత్రా తేల్చి చెప్పారు. ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ యశ్వంత్ కుమార్ జైన్ నిర్లక్ష్యంతో చావుకు కారణమైన నేరం కింద ట్రయల్ కోర్టు విధించిన 18 నెలల శిక్షను ఒక ఏడాదికి తగ్గించింది. 1996లో ఆరు వారాల గర్భిణీ అయిన మహిళకు గర్భం తీసేయడంతో చనిపోయింది. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం, క్లినిక్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే గాయత్రి చనిపోయిందని ఆమె భర్త రణ్‌బీర్ సింగ్‌వర్మ కేసు నమోదు చేశారు. అయితే గర్భం తీసేయడం వల్ల ఆమె ప్రాణానికే ప్రమాదమని ముందే హెచ్చరించినా గర్భం తీసేయించుకుం దని, నిజానికి చికిత్స చేసే సమయంలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదని డాక్టర్ కోర్టుకు తెలిపారు. ఎనిమిదేళ్ల నుంచి చికిత్స అంది స్తున్నా ఇంతవరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కోర్టుకు చెప్పారు. కేసు పూర్వాపరాలు విన్న కోర్టు తీర్పును నిలిపివేసింది.