న్యూఢిల్లీ: గర్భం తీసేసిన డాక్టర్ ఆమె చావుకు కారణమైన కేసులో కోర్టు తీర్పును నిలిపివేసింది. ఆ చికిత్స చేసేందుకు అతనికి కనీస అర్హతలు లేవని జిల్లా జడ్జి ఐనా మల్హోత్రా తేల్చి చెప్పారు. ప్రైవేట్ క్లినిక్ నడుపుతున్న డాక్టర్ యశ్వంత్ కుమార్ జైన్ నిర్లక్ష్యంతో చావుకు కారణమైన నేరం కింద ట్రయల్ కోర్టు విధించిన 18 నెలల శిక్షను ఒక ఏడాదికి తగ్గించింది. 1996లో ఆరు వారాల గర్భిణీ అయిన మహిళకు గర్భం తీసేయడంతో చనిపోయింది. తప్పుడు ఇంజెక్షన్ ఇవ్వడం, క్లినిక్‌లో సరైన సౌకర్యాలు లేకపోవడం వల్లే గాయత్రి చనిపోయిందని ఆమె భర్త రణ్‌బీర్ సింగ్‌వర్మ కేసు నమోదు చేశారు.
అయితే గర్భం తీసేయడం వల్ల ఆమె ప్రాణానికే ప్రమాదమని ముందే హెచ్చరించినా గర్భం తీసేయించుకుం దని, నిజానికి చికిత్స చేసే సమయంలో ఆమెకు ఎలాంటి హానీ జరగలేదని డాక్టర్ కోర్టుకు తెలిపారు. ఎనిమిదేళ్ల నుంచి చికిత్స అంది స్తున్నా ఇంతవరకు ఇలాంటి ఘటనలు చోటు చేసుకోలేదని కోర్టుకు చెప్పారు. కేసు పూర్వాపరాలు విన్న కోర్టు తీర్పును నిలిపివేసింది.