
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ సవాల్ విసిరారు. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ హామీ అమలు చేస్తే తాను బీజేపీకి మద్దతిస్తానని చెప్పుకొచ్చారు.
మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ పేరిట ఆప్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తే నేను బీజేపీ తరఫున ప్రచారం చేస్తాను. నా డిమాండ్‌ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నా. దేశంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలం అయ్యాయి. జమ్ము కశ్మీర్, హర్యానాలో బీజేపీకి ఓటమి తప్పదు. బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే.. ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమే అని కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో ఢిల్లీలో పరిస్థితులపై కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ.. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు ఢిల్లీలో హోమ్‌గార్డుల వేతనాలను నిలిపివేసిందన్నారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదని.. అక్కడ ఎల్జీరాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అలాగే, బీజేపీ అంటేనే పేదలకు వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు. <
📍 जनता की अदालत, छत्रसाल स्टेडियम, दिल्ली@ArvindKejriwal जी की PM मोदी को चुनौती👇
"मोदी जी, फ़रवरी में दिल्ली का चुनाव है। 22 राज्यों में BJP की सरकार है। इन राज्यों में बिजली Free कर दो, मैं दिल्ली चुनाव में मोदी जी का प्रचार करूँगा।"#JantaKiAdalatMeinKejriwal pic.twitter.com/7dqNSsmpfd— Aam Aadmi Party- Uttar Pradesh (@AAPUttarPradesh) October 6, 2024
ఇది కూడా చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ