AAP chief Arvind Kejriwal
-
ఢిల్లీ కొత్త సీఎం ఎవరు?.. రేసులో పర్వేశ్ వర్మ
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల్లో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై నెగ్గిన బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ(47) పేరు మార్మోగిపోతోంది. న్యూఢిల్లీ నియోజకవర్గంంలో కేజ్రీవాల్‌పై 4,089 ఓట్ల తేడాతో ఆయన జయకేతనం ఎగురవేశారు. జెయింట్ కిల్లర్‌గా అవతరించారు. వర్మకు 30,088 ఓట్లు, కేజ్రీవాల్‌కు 25,999 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి సందీప్ దీక్షిత్‌కు 4,568 ఓట్లు లభించాయి. పశ్చిమ ఢిల్లీకి చెందిన పర్వేశ్ వర్మ రెండుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అభ్యర్థిత్వం ఖరారు కాకముందు నుంచే ప్రచారం ప్రారంభించారు. ఓటర్లకు చేరువయ్యారు. ఎన్నికలకు రెండు నెలల ముందే ఇంటికి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గరిష్ట స్థాయిలో ఓటర్లను కలుసుకున్నారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి సాహిబ్‌సింగ్ వర్మ కుమారుడైన పర్వేశ్‌వర్మ ఈ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఓడించి, బీజేపీ తరపున నూతన ముఖ్యమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. బాల్యం నుంచే సంఘ్ భావజాలం పర్వేశ్ వర్మ 1977 నవంబర్ 7న ఢిల్లీలో జన్మించారు. చిన్నప్పుడే రాజకీయాలపై ఆసక్తి కనబర్చారు. తండ్రి బాటలో నడుస్తూ 1991లో ఆర్ఎస్ఎస్లో చేరారు. బాల స్వయంసేవక్‌గా పనిచేశారు. అనంతరం బీజేపీ యువమోర్చాలో చేరారు. యువమో ర్చా జాతీయ కార్యనిర్వాహక సభ్యుడయ్యారు. తర్వాత ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. 2013 ఎన్నికల్లో ఢిల్లీలోని మెహ్రౌలీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2015లో పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. 2019లో అదే నియోజకవర్గంలో 4.78 లక్షల ఓట్ల మెజార్టీతో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. తండ్రి సాహిబ్‌సింగ్ వర్మ స్థాపించిన ‘రా్ష్ట్రీయ స్వాభిమాన్’ అనే సంస్థ ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకుంటున్నారు. ఆర్థిక సాయం అందిస్తున్నారు. మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్ అయిన పర్వేశ్ వర్మ మంచి వక్తగా పేరుగాంచారు. ఇప్పటి ఎన్నిల్లో కేజ్రీవాల్‌ను తానే ఢీకొట్టబోతున్నానని బహిరంగంగా ప్రకటించారు. రెండుసార్లు సీఎంగా పనిచేసిన షీలా దీక్షిత్‌ను ఓడించి కేజ్రీవాల్ సీఎం అయ్యారు. రెండుసార్లు సీఎంగా వ్యవహరించిన కేజ్రీవాల్‌ను ఓడించిన పర్వేశ్ శర్మ సీఎం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
‘ఆప్’ ఓటమి వేళ..స్వాతి మలివాల్‌కు ‘మీమ్స్’ మద్దతు
న్యూఢిల్లీ:ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీపార్టీ, స్వయంగా ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఓటమి పాలయ్యారు.ఈ ఓటమి అంశం బీజేపీ నేతలకు అంతులేని ఆనందాన్నిచ్చింది. వారి సంబరాలకు కారణమైంది.ఎందుకంటే ఆప్‌పై గెలిచింది వారే.అయితే ఆప్‌తో ఎన్నికల్లో తలపడకుండా ఆప్ ఓటమి పట్ల బీజేపీ తర్వాత అంత సంతోషించింది ఒక్కరే. ఆమే..ఆప్ నుంచి సస్పెండైన రాజ్యసభ ఎంపీ స్వాతిమలివాల్. ఢిలీ ఎన్నికల్లో ఆప్ ఓటమి నిర్ధారణ అయిన వెంటనే స్వాతి మలివాల్ తన ఎక్స్(ట్విటర్)ఖాతాలో తనకు జరిగిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహరణం పోస్టు పెట్టారు. pic.twitter.com/kig39RQYmD— Swati Maliwal (@SwatiJaiHind) February 8, 2025ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, గతేడాది మేలో లిక్కర్ కేసులో జైలుకు వెళ్లిన కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై బయటికి వచ్చారు.ఈ సమయంలో కేజ్రీవాల్‌ను కలవడానికి స్వాతి ఆయన నివాసానికి వెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపట్టికి స్వాతి అక్కడి నుంచే పోలీసులకు ఫోన్ చేసిన తనపై కేజజ్రీవాల్ ఇంట్లో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు.కేజ్రీవాల్ అనుచరుడు బిభవ్‌కుమార్ తనను కొట్టాడని కేసు పెట్టారు. దీంతో పోలీసులు బిభవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు.స్వాతి మలివాల్ జరిగిన దాడిని తొలుత ఖండించిన ఆప్ ఆ తర్వాత స్వాతి మలివాల్ చెప్పేవన్నీ అబద్దాలేనని ఆరోపించింది. దీంతో స్వాతి మలివాల్ ఆప్, కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు.తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆప్ వ్యతిరేకంగా పలు చోట్ల ప్రచారం కూడా చేశారు. స్వాతిమలివాల్‌కు మద్దతుగా ఆప్ ఓటమిపై శనివారం మీమ్స్, పోస్టులు సోషల్‌మీడియాను ముంచెత్తాయి. -
Delhi Election Results 2025: ఆ రెండు కారణాలే AAP ను కొంపముంచింది
-
బీజేపీకి అధికారమిస్తే మురికి వాడలు నాశనమే
న్యూఢిల్లీ: ఢిల్లీలో బీజేపీకి అధికారమిస్తే మురికివాడలన్నిటినీ ధ్వంసం చేస్తుందని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. మురికివాడల నివాసితుల సంక్షేమం కంటే కూడా అక్కడి భూములపైనే బీజేపీ దృష్టి ఉందన్నారు. ఆదివారం కేజ్రీవాల్ షకూర్ బస్తీలో మీడియాతో మాట్లాడారు. ‘వాళ్లు మొదటగా మిమ్మల్ని ఓట్లడుగుతారు. ఎన్నికలయ్యాక మీ భూములివ్వమంటారు’అని బీజేపీనుద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. బస్తీల్లోని వారి సమస్యలను పక్కనబెట్టి, వారి భూమిని ఆక్రమించుకునేందుకు బీజేపీ కుట్ర పన్నిందన్నారు. చేతనైతే వలస జీవులపైనా, మురికివాడల్లో ఉండే వారిపైనా నమోదైన కేసులన్నిటినీ ఎత్తేసి, వారికి మరో చోట పునరావాసం కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. 24 గంటల్లో వీటిని తూచా తప్పకుండా అమలు చేస్తే ఈ ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటామని పేర్కొన్నారు. ఇందులో బీజేపీ విఫలమైతే, ఈ ఎన్నికల్లో పోటీ చేసి మురికివాడల ప్రజలకు రక్షణగా నిలుస్తానని, వారి బస్తీలను ఎవరు నాశనం చేస్తారో చూస్తానని హెచ్చరించారు. మురికివాడల్లో వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామన్న బీజేపీ నినాదం కేవలం కంటితుడుపు చర్యమాత్రమేనన్నారు. ‘ఢిల్లీలో 4 లక్షల మురికివాడలుండగా గడిచిన పదేళ్లలో కేంద్రం కేవలం 4,700 ఫ్లాట్లు మాత్రమే నిర్మించింది. ఈ రకంగా చూస్తే ఢిల్లీలోని మురికివాడల ప్రజలందరికీ గృహ వసతి కల్పించేందుకు మరో వెయ్యేళ్లు పడుతుంది’అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. -
‘ఆప్’లోకి మోటివేషనల్ స్పీకర్.. ఢిల్లీ నుంచి పోటీ?
న్యూఢిల్లీ: ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, ఆన్లైన్ కోచింగ్ టీచర్ అవధ్ ఓజా ఈరోజు(సోమవారం) ఆమ్ ఆద్మీ పార్టీలో చేరనున్నారు. రాబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏదో ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.అవధ్ ఓజా గతంలో బీజేపీ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించినా, అది కుదరలేదు. ఇప్పుడు ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరుతున్నారు. అవధ్ ఓజా గోండా నివాసి. 2025 ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, వివిధ పార్టీలు ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది.మనీష్ సిసోడియా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న పట్పర్గంజ్ నుంచి అవధ్ ఓజా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ స్థానంలో బ్రాహ్మణ, గుర్జర్ ఓటర్లు అధికంగా ఉన్నారు. మనీష్ సిసోడియా ఈసారి జంగ్‌పురా అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయవచ్చని తెలుస్తోంది. అవధ్ ఓజా రాజకీయాల్లోకి రావాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఓ టీవీ ఇంటర్వ్యూలో అవధ్ ఓజా మాట్లాడుతూ, తాను అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని, అయితే ఆ అవకాశం రాలేదన్నారు.ఇది కూడా చదవండి: పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు! -
మోదీకి సవాల్.. అలా జరిగితే బీజేపీకి ప్రచారం చేస్తా: కేజ్రీవాల్
ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆప్ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం కేజ్రీవాల్ స్పీడ్ పెంచారు. కేంద్రంలోని బీజేపీని టార్గెట్ చేస్తూ సవాల్ విసిరారు. ఎన్డీయే కూటమి అధికారంలో ఉన్న 22 రాష్ట్రాల్లో ఉచిత కరెంట్ హామీ అమలు చేస్తే తాను బీజేపీకి మద్దతిస్తానని చెప్పుకొచ్చారు.మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. ప్రధాని మోదీకి సవాల్ విసిరారు. ఢిల్లీలో నిర్వహించిన ‘జనతా కీ అదాలత్’ పేరిట ఆప్ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేశంలోని 22 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు ఉచిత విద్యుత్తు హామీని అమలు చేస్తే నేను బీజేపీ తరఫున ప్రచారం చేస్తాను. నా డిమాండ్‌ను నెరవేర్చేందుకు బీజేపీ సిద్ధమేనా?. దీనికి ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సవాల్ చేస్తున్నా. దేశంలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంతటా విఫలం అయ్యాయి. జమ్ము కశ్మీర్, హర్యానాలో బీజేపీకి ఓటమి తప్పదు. బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. దేశంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వాలు అంటే.. ద్రోవ్యోల్బణం, అవినీతి, నిరుద్యోగమే అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో ఢిల్లీలో పరిస్థితులపై కేజ్రీవాల్ మండిపడ్డారు. కేంద్రంలోని బీజేపీ.. బస్ మార్షల్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడంతో పాటు ఢిల్లీలో హోమ్‌గార్డుల వేతనాలను నిలిపివేసిందన్నారు. దేశ రాజధానిలో ప్రజాస్వామ్యం లేదని.. అక్కడ ఎల్జీరాజ్యం నడుస్తోందని ఆరోపించారు. అలాగే, బీజేపీ అంటేనే పేదలకు వ్యతిరేకం అంటూ ఘాటు విమర్శలు చేశారు. <📍 जनता की अदालत, छत्रसाल स्टेडियम, दिल्ली@ArvindKejriwal जी की PM मोदी को चुनौती👇"मोदी जी, फ़रवरी में दिल्ली का चुनाव है। 22 राज्यों में BJP की सरकार है। इन राज्यों में बिजली Free कर दो, मैं दिल्ली चुनाव में मोदी जी का प्रचार करूँगा।"#JantaKiAdalatMeinKejriwal pic.twitter.com/7dqNSsmpfd— Aam Aadmi Party- Uttar Pradesh (@AAPUttarPradesh) October 6, 2024ఇది కూడా చదవండి: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రి: 10 మంది డాక్టర్లపై బహిష్కరణ -
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దేశానికి ఆయువుపట్టయిన ఢిల్లీని కొల్లగొట్టిన వారే ఎర్రకోటలో జెండా ఎగరేయడం ఆనవాయితీగా వస్తోంది. గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ, ఆపై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ ఢిల్లీని క్లీన్‌స్వీప్ చేసి కేంద్రంలో అధికారం చేపట్టాయి. గత రెండు ఎన్నికల్లో రాజధానిలోని మొత్తం 7 ఎంపీ సీట్లనూ కైవసం చేసుకున్న బీజేపీ ఈసారి హ్యాట్రిక్ కోసం ప్రయత్నిస్తోంది. ఎంపీలపై వ్యతిరేకతను అధిగమించేందుకు ఏకంగా ఆరుగురు సిట్టింగులను పక్కన పెట్టేసింది! ఇక కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకొన్న ఆప్.. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిని అనుకూలంగా మార్చుకోవాలని యోచిస్తోంది. కేజ్రీవాల్ భార్య సునీత పార్టీ ప్రచార బాధ్యతలను తన భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా భిన్నమైన తీర్పు ఇవ్వడం ఢిల్లీ ఓటర్లకు కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తోంది. దశాబ్దాలుగా ఢిల్లీ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్‌పై 90వ దశకం నుంచి క్రమంగా బీజేపీ ఆధిపత్యం మొదలైంది. ఆ తర్వాత నుండి హస్తినలో అధికారం ఆ రెండు పారీ్టల మధ్యే మారుతూ వచి్చంది. 2009లో ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలనూ కాంగ్రెస్ క్లీన్‌స్వీప్ చేయగా 2014, 2019ల్లో అదే ఫీట్‌ను బీజేపీ చేసి చూపించింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీపై ‘చీపురు’ తిరగేసిన ఆప్ లోక్‌సభకు వచ్చేసరికి ఒక్క స్థానమూ దక్కించుకోలేకపోయింది. ఓట్లపరంగా కూడా బీజేపీ ఆ రెండు పారీ్టలకు అందనంత ఎత్తులో నిలిచింది. కమలం గుర్తుకు 56.86 శాతం ఓట్లు రాగా హస్తానికి 22.51 శాతం, ఆప్‌కు గుర్తుకు 14.79 శాతం పోలయ్యాయి. కాకపోతే అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఆప్ చేతిలో వరుసగా భంగపాటు తప్పడం లేదు.కేజ్రీవాల్ అరెస్టు కలిసొచ్చేనా? నయా రాజకీయాలతో సంచలనం అరవింద్ కేజ్రీవాల్ 2012లో పెట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నానాటికీ బలపడుతూ వచి్చంది. 2013 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్.. 70 సీట్లకు 28 స్థానాలు సాధించింది. బీజేపీకి 32 సీట్లు రావడంతో హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ ముందుకు రాకపోవడంతో 8 సీట్లొచి్చన కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ తొలిసారి సీఎం అయ్యారు. కానీ 49 రోజులకే రాజీనామా చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్‌కు ఒక్క సీటూ రాలేదు. కానీ 2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఏకంగా 67 సీట్లతో సంచలనం సృష్టించింది. కేజ్రీవాల్ రెండోసారి సీఎం అయ్యారు. మళ్లీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో చేతులెత్తేసినా 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం 62 సీట్లతో ముచ్చటగా మూడోసారి సీఎం అయ్యారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష ఇండియా కూటమి తరఫున సుడిగాలి ప్రచారానికి సన్నద్ధమైన కేజ్రీవాల్ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై జైలు పాలయ్యారు. ఇది ఆప్‌కు కలిసొస్తుందా, ప్రతికూలంగా మారుతుందా అన్నది ఆసక్తికరం. అయితే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం నిమిత్తం కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసే అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు శుక్రవారం పేర్కొనడం ఆప్‌కు ఊరటనిచ్చే పరిణామమే. దీనిపై మే 7న కోర్టు వెలువరించబోయే నిర్ణయం కోసం పార్టీ ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. బీజేపీ ‘హ్యాట్రిక్’ గురి... ఢిల్లీలో హ్యాట్రిక్ క్లీన్‌స్వీప్ కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మనోజ్ తివారీ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ భోజ్‌పురి సూపర్ స్టార్ 2014లో ఇక్కడి నుంచే బీజేపీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. తర్వాత ఢిల్లీ బీజేపీ పగ్గాలు చేపట్టి 7 సీట్లనూ క్లీన్‌స్వీప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఈసారి తివారీ తప్ప మిగతా ఆరుగురు సిట్టింగులనూ బీజేపీ మార్చేయడం విశేషం! ఢిల్లీ మద్యం కుంభకోణాన్ని బీజేపీ ప్రధాన ప్రచారాంశంగా జనంలోకి తీసుకెళ్తోంది. మోదీ ఫ్యాక్టర్‌తో పాటు సీఏఏ, అయోధ్య రామ మందిరం, ఆర్టికల్ 370 రద్దు తదితరాలను నమ్ముకుంది. పూర్వాంచలీలు, ముస్లింల ఆధిపత్యముండే ఈశాన్య ఢిల్లీ స్థానంలో బిహార్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థుల మధ్య కీలక పోరు జరగనుంది. హ్యాట్రిక్‌తో మూడోసారి లోక్‌సభలో అడుగుపెట్టాలనుకుంటున్న మనోజ్ తివారీ ఒకవైపు, కాంగ్రెస్ నుంచి కన్హయ్య కుమార్ మరోవైపు బరిలో ఉన్నారు. అభ్యర్థుల ఎంపికలో బీజేపీ సామాజిక సమతూకం పాటించింది. తూర్పు ఢిల్లీ నుంచి పంజాబీ అయిన హరీశ్ మల్హోత్రా, చాందినీ చౌక్ నుంచి బనియా నాయకుడు ప్రవీణ్ ఖండేల్వాల్, దక్షిణ ఢిల్లీ నుంచి గుజ్జర్ నాయకుడు రాంవీర్ సింగ్ బిధూరి, పశ్చిమ ఢిల్లీ నుంచి జాట్ నాయకుడు కమల్జీత్ సెహ్రావత్, ఎస్సీ రిజర్వ్డ్ వాయవ్య ఢిల్లీ నుంచి దళిత నాయకుడు యోగేంద్ర చందోలియాలను బరిలో నిలిపింది. కమల్జీత్తో పాటు న్యూఢిల్లీ నుంచి దివంగత సుష్మా స్వరాజ్ కుమార్తె బాసురీ స్వరాజ్ రూపంలో ఇద్దరు మహిళలకూ అవకాశం ఇచి్చంది.సునీతా కేజ్రీవాల్ ప్రచారం... ఢిల్లీలో ఇండియా కూటమి భాగస్వాములుగా ఆప్ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 చోట్ల బరిలో దిగుతున్నాయి. రాజధానిలో బీజేపీకి ఎలాగైనా ముకుతాడు వేయాలని చూస్తున్నాయి. ‘ఢిల్లీ మోడల్’ను కేజ్రీవాల్ ప్రధానంగా ప్రచారం చేశారు. ఆయన జైలుపాలైన నేపథ్యంలో ఆప్ ప్రచార భారాన్ని భార్య సునీతా కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. ఆమె సభలకు మంచి స్పందన కూడా లభిస్తోంది. ధరల పెరుగుదల, నిరుద్యోగం, కార్పొరేట్లతో మోదీ కుమ్మక్కు వంటి అంశాలను ఆప్, కాంగ్రెస్ గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పైనా విమర్శలు గుప్పిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో, విపక్షాలపై దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు ఉసిగొల్పుతోందన్న అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి.సర్వేలేమంటున్నాయి... ఢిల్లీలో ఈసారి కూడా బీజేపీ మొత్తం 7 లోక్‌సభ సీట్లనూ క్లీన్‌స్వీప్ చేస్తుందని పలు సర్వేలు అంటున్నాయి. అయితే కేజ్రీవాల్ అరెస్టు తాలూకు సానుభూతిఆప్కు కలిసొస్తే ఆ పారీ్టకి ఒకట్రెండు స్థానాలు దక్కే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. – సాక్షి, న్యూఢిల్లీ -
కేజ్రీవాల్ అరెస్టుకు నిరసన.. హోలీకి దూరం
అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్టు చేసినందుకు నిరసనగా 'హోలీ' జరుపుకోమని పార్టీ ఢిల్లీ కన్వీనర్ గోపాల్ రాయ్ తెలిపారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు ఢిల్లీ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులను కలవకుండా అడ్డుకున్నారని విలేకరుల సమావేశంలో రాయ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం 10 గంటలకు.. ఆప్ ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు, ఆఫీస్ బేరర్లు, ఇండియా బ్లాక్ ప్రతినిధులందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేస్తారు. భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్దేవ్ల అమరవీరుల దినోత్సవమైన శనివారం షాహీదీ పార్క్‌లో సమావేశమవుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా హాజరవుతారని ఆయన తెలిపారు. మార్చి 24న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని, మార్చి 25న హోలీ రోజున ఎలాంటి కార్యక్రమం నిర్వహించబోమని, మార్చి 26న ప్రధాని నివాసాన్ని చుట్టుముడతామని రాయ్ తెలిపారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరెస్టుకు వ్యతిరేకంగా భారత కూటమి సభ్యుల మధ్య చర్చల అనంతరం త్వరలో ఉమ్మడి ఉద్యమం ప్రకటిస్తామని కూడా ఆయన చెప్పారు. -
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌కు బెయిల్
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం 'అరవింద్ కేజ్రీవాల్'కు రూ.15,000 బెయిల్ బాండ్, రూ.లక్ష పూచీకత్తుపై ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసింది. ఈడీ ఎనిమిది సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ విచారణకు హాజరు కాకపోవడంతో.. దర్యాప్తు సంస్థ ఢిల్లీ కోర్టు మెట్లెక్కింది. కోర్టుకు హాజరైన సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. న్యాయస్థానం తనకు బెయిల్ మంజూరు చేసిన తరువాత న్యాయమూర్తి అనుమతితో కోర్టు నుంచి కేజ్రీవాల్ వెళ్లిపోయారు. ఢిల్లీ ఇప్పుడు రద్దు చేసిన ఎక్సైజ్ పాలసీకి సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఆప్ అగ్రనేతలు.. ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్‌లను ఈడీ అరెస్టు చేసింది. ఈడీ చార్జ్ షీట్లలో కేజ్రీవాల్ పేరు పలుమార్లు చోటు చేసుకుంది. ఎక్సైజ్ పాలసీ ముసాయిదా రూపకల్పన సమయంలో ఈ కేసులో నిందితులు ముఖ్యమంత్రితో టచ్‌లో ఉన్నారని ఏజెన్సీ తెలిపింది. -
అరవింద్ కేజ్రీవాల్ తగ్గేదే లే.. పంతం నెగ్గించుకున్న ఢిల్లీ సీఎం
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతు ఇవ్వాలంటూ ఎప్పటినుంచో కోరుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు తన పంతం నెగ్గించుకున్నారు. బీహార్ లో జరిగిన తొలి విడత విపక్షాల సమావేశానికి హాజరైన అరవింద్ కేజ్రివాల్ బెంగళూరులో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరు కావడంలేదని ముందు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ పార్టీ అత్యవసర సమావేశంలో ఢిల్లీ కోరిన మద్దతు ఇవ్వడానికి తాము సుముఖంగా ఉన్నట్లు పేర్కొంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రకటన వెలువడిన కొద్ది గంటల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి పాల్గొంటుందని తెలిపాయి పార్టీ వర్గాలు. కాంగ్రెస్ ససేమిరా.. ఢిల్లీ బ్యూరోక్రాసిపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దేశవ్యాప్తంగా ఇప్పటికే మెజారిటీ పార్టీల మద్దతు కూడగట్టారు. కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంతకాలం మద్దతు ఇవ్వకుండా మంకుపట్టు పట్టింది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా తమ పార్టీ ఎప్పుడూ వ్యవహరించదని తెలిపిన కాంగ్రెస్ గతంలో కేంద్రం ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా మద్దతు ఇచ్చేది లేదని ప్రకటించిన విషయం తెలిసిందే. మీతో వచ్చేది లేదు.. దీంతో కాంగ్రెస్ పార్టీతో కలిసివచ్చేది లేదని ఇదివరకే ప్రకటించాయి ఆప్ వర్గాలు. ఢిల్లీ ముఖ్యమంత్రి కూడాకాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అందులో భాగంగానే కర్ణాటకలో జరగనున్న రెండో విడత విపక్షాల సమావేశాలకు హాజరయ్యే విషయమై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు ఆప్ అధినేత. సరే కానివ్వండి.. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బిజెపి వ్యతిరేక పార్టీలన్నీ ఏకం కావలసిన అవసరం ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఓ మెట్టు దిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ కేసి వేణుగోపాల్ తమ పార్టీ ఎప్పుడూ ఆర్డినెన్సుకు వ్యతిరేకమేనని ప్రకటించారు. ఈ విషయాన్ని ఆప్ ఎంపీ రాఘవ్ చడ్డా కూడా స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం వెలువడిన కొద్దీ గంటల్లోనే అరవింద్ కేజ్రీవాల్ కర్ణాటకలో జరగబోయే రెండో విడత విపక్షాల సమావేశానికి హాజరుకానున్నట్లు తెలిపారు. VIDEO | "I think they (AAP) are going to join the meeting tomorrow. As for the ordinance (on control of services in Delhi), our stand is very clear. We are not going to support it," says Congress general secretary KC Venugopal on the opposition meet, scheduled to be held in… pic.twitter.com/YdeUZYmPG5 — Press Trust of India (@PTI_News) July 16, 2023 ఎందుకీ తిప్పలు.. ఢిల్లీ పరిపాలన విధానాన్ని సవాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనున్న నేపధ్యంలో ప్రతిపక్షాల మద్దతు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి విశ్వప్రయత్నాలు చేసున్నారు. అధికార పార్టీకి మద్దతు భారీగా ఉన్న నేపథ్యంలో లోక్ సభలో ఈ బిల్లు ఎలాగైనా ఆమోదం పొందుతుంది. ఎగువ సభ అయిన రాజ్యసభలో మాత్రం ఈ ఆర్డినెన్స్ ఆమోదం పొందకుండా అడ్డుకోవాలంటే ప్రతిపక్షాల మద్దతు తప్పనిసరి. అందుకే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల నాయకుల్ని ఒక్కొక్కరినీ కలిసి మద్దతు కూడగడుతూ వచ్చారు. తాజాగా ఆయన పట్టుదలకు కాంగ్రెస్ పార్టీ కూడా దిగివచ్చింది. Congress announces its unequivocal opposition to the Delhi Ordinance. This is a positive development. — Raghav Chadha (@raghav_chadha) July 16, 2023 ఇది కూడా చదవండి: ఇష్టమొచ్చినట్టు పోక్సో చట్టం.. స్కూలు మాష్టారుపై కేసు నమోదు.. -
రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్ధి అయితే మద్దతివ్వం
న్యూఢిల్లీ: ఇటీవల బీహార్‌లో జరిగిన విపక్షాల సమావేశంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కేంద్ర ఆర్డినెన్స్ పై స్పందించిన విధానం నచ్చక బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన అరవింద్ కేజ్రీవాల్ తాజాగా మరో షాక్ ఇచ్చారు. విపక్షాలు తమ నాయకుడిగా రాహుల్ గాంధీని ఎంచుకుంటే మాత్రం తాము మద్దతిచ్చేది లేదని తేల్చి చెప్పేశారు ఆప్ నేత ప్రియాంక కక్కర్. ట్విట్టర్ వేదికగా ప్రియాంక కక్కర్ స్పందిస్తూ కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతివ్వకుంటే వారి నేతృత్వంలోని విపక్షాలతో మేము భాగస్వామ్యులము కాలేము. దేశం బాగుపడాలంటే మొదట కాంగ్రెస్ మరోసారి రాహుల్ గాంధీని నాయకుడిగా నిలబెట్టి విపక్షాలను కూడా అతడికి మద్దతివ్వమని అడగకూడదు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇది రాజ్యాంగాన్ని పరిరక్షించడం కంటే కూడా చాలా ముఖ్యమైన విషయమని రాశారు. అనుకుందొక్కటి.. అయినదొక్కటి.. బీహార్ వేదికగా జరిగిన విపక్షాల సమావేశంలో ఢిల్లీలో కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మద్దతిస్తుందని కోటి ఆశలతో వచ్చిన అరవింద్ కేజ్రీవాల్ కు దానిపై కూలంకషంగా చర్చించి గాని నిర్ణయం తీసుకోలేమని రాహుల్ చెప్పిన సమాధానం రుచించలేదు. సమావేశం అనంతరం జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా మాట్లాడకుండా ఢిల్లీ పయనమైన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తమకు మద్దతివ్వకుంటే వారితో కలిసి ప్రయాణించడం కష్టమని సందేశం పంపించారు. ఈ సమావేశానికి ఆప్ తరపున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్, ఎంపీ సంజయ్ సింగ్, రాఘవ్ చడ్డా కూడా హాజరయ్యారు. సమావేశంలో అరవింద్ కేజ్రీవాల్ రాహుల్ గాంధీని విభేధాలన్నిటినీ పక్కన పెట్టేసి కలిసి నడుద్దామని అభ్యర్ధించగా రాహుల్ మాత్రం ఆర్డినెన్స్ పై చర్చించడానికి ఒక పద్ధతుంటుందని తేలికగా చెప్పారు. దీంతో కాంగ్రెస్ పార్టీపై ఆప్ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దుకు మీరు మద్దతిచ్చినప్పుడు కూడా మేము ఇలాగే బాధపడ్డామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. अगर देश बचाना है तो सबसे पहले कांग्रेस को बोल देना चाहिए की वो तीसरी बार भी Rahul Gandhi पर दाव नहीं लगायेंगे और समूचे विपक्ष पर ये दबाव नहीं डालेंगे। देश हित में ये संविधान बचाने से भी ऊपर है। — Priyanka Kakkar (@PKakkar_) June 24, 2023 ఇది కూడా చదవండి: మరో ప్రమాదం.. లూప్ లైన్లో ఉన్న రైలును ఢీకొన్న గూడ్స్ -
కేంద్ర ఆర్డినెన్స్‌పై ఆప్‌కు జేఎంఎం మద్దతు
రాంచీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో పాలనా యంత్రాంగంపై నియంత్రణ కోసం కేంద్రం తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా జరిగే పోరాటంలో ఆప్‌కు మద్దతిస్తామని జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ప్రకటించింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్ శుక్రవారం రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్‌తో భేటీ అయ్యారు. అనంతరం కేజ్రీవాల్, మాన్, సోరెన్ మీడియాతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం ప్రవేశపెట్టే బిల్లును తప్పకుండా ఓడించాలన్నారు. కేంద్ర ఆర్డినెన్స్ విషయంలో ఆప్‌కు జేఎంఎం మద్దతుగా నిలుస్తుందని ఆ పార్టీ చీఫ్, సీఎం సోరెన్ చెప్పారు. ఆర్డినెన్స్‌పై మద్దతు కూడగట్టేందుకు కేజ్రీవాల్ బీజేపీయేతర పార్టీల నేతలను కలుస్తున్న విషయం తెలిసిందే. -
ఆప్, బీజేపీ కౌన్సిలర్ల బాహాబాహీ
-
ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో పాగా వేసిన ఆప్
-
గుజరాత్ ఆప్ సీఎం అభ్యర్థిగా ఇసుదన్ గాధ్వి
-
‘డబుల్ ఇంజినా? అది పాతదైపోయింది’.. బీజేపీపై కేజ్రీవాల్ సెటైర్
గాంధీనగర్: ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా.. డబుల్ ఇంజిన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తుంటుంది బీజేపీ. డబుల్ ఇంజిన్ ద్వారా అభివృద్ధి రెండింతలు వేగవంతమవుతుందని ప్రచారం చేస్తుంది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ‘డబుల్ ఇంజిన్’ నినాదంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్. గుజరాత్‌కు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం లేదని, ఇప్పుడు కొత్త ఇంజిన్ కలిగిన ప్రభుత్వం కావాలని పేర్కొన్నారు. గుజరాత్‌లోని భవ్నగర్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘వారు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలంటూ మాట్లాడారు. కానీ, ఈసారి గుజరాత్‌కు డబుల్ ఇంజిన్ అవసరం లేదు. కొత్త ఇంజిన్ కావాలి. డబుల్ ఇంజిన్ చాలా పాతది. రెండు ఇంజిన్లు 40-50 ఏళ్ల నాటివి. ఒక కొత్త పార్టీ, కొత్త ముఖాలు, కొత్త భావజాలం, కొత్త శక్తి, కొత్త పాలన కావాలి. కొత్త పార్టీ కోసం పాటుపడండి. మీరు ఏదీ కోల్పోరు.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. రెండు రోజుల పర్యటనలో భాగంగా గుజరాత్ వెళ్లిన కేజ్రీవాల్.. ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. ఒకసారి తమకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక్కడి వారికి 70 ఏళ్లుగా అవకాశం ఇస్తున్నారని, తనకు ఓ ఛాన్స్ ఇచ్చి చూడాలని విన్నవించారు. అనుకున్న రాతిలో పని చేయకపోతే.. మరోమారు ఓట్ల కోసం రానని ప్రతిజ్ఞ చేశారు. తమ ప్రభుత్వం అధికారం లోకి వస్తే తప్పుడు కేసులను కొట్టివేస్తామని హామీ ఇచ్చారు. ఇదీ చదవండి: నరబలి కేసు: పోలీస్ స్టేషన్లకు క్యూ కడుతున్న ‘మిస్సింగ్’ మహిళల బంధువులు! -
సరైన స్పందన కరువు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, విద్యుత్ సబ్సిడీ తదితర సమస్యలపై వివరణ కోరగా కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ సర్కార్ నుంచి సరైన స్పందన లేదని ఢిల్లీ లెఫ్టినెంట్(ఎల్జీ) గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా అసహనం వ్యక్తంచేశారు. ‘ఆప్ సర్కార్ ప్రకటనలు, ప్రసంగాలతోనే సరిపుచ్చుతోంది. ప్రజా సంక్షేమం దానికి పట్టడం లేదు. పాలన సరిగా లేదు’ అని శుక్రవారం తాజాగా సీఎం కేజ్రీవాల్‌కు రాసిన మరో లేఖలో ఎల్జీ అసంతృప్తి వ్యక్తంచేశారు. ‘ పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను ఎత్తిచూపుతున్నాను. ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ, స్వయంగా రాష్ట్రపతి పాల్గొన్న కార్యక్రమానికి సీఎం, మంత్రులు గైర్హాజరవడం, విద్యుత్ సబ్సిడీ, ఉపాధ్యాయ నియామకాలు తదితర సమస్యలపై ఆప్ సర్కార్‌ను నిలదీయడం తప్పా?. ప్రశ్నించిన ప్రతిసారీ విషయాన్ని తప్పుదోవ పట్టిస్తూ నన్ను మీరు, మీ మంత్రులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన బాధ్యతలు, విధులను ఆప్ ప్రభుత్వం సక్రమంగా నిర్వర్తించడంలేదు’ అని సీఎంకు రాసిన లేఖలో ఎల్జీ సక్సేనా వ్యాఖ్యానించారు. దీనిపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందించారు. ‘ నాకు ఎల్జీ నుంచి మరో ప్రేమలేఖ అందింది. ఎల్జీ మాటున బీజేపీ దేశ రాజధాని వాసుల జీవనాన్ని చిన్నాభిన్నం చేయాలని చూస్తోంది. నేను బతికి ఉన్నంతకాలం అలా జరగనివ్వను’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తన లేఖను ప్రేమలేఖ అంటూ కేజ్రీవాల్ వ్యాఖ్యానించడంతో ఎల్జీ మరోసారి స్పందించారు. ‘నా లేఖను ఎగతాళి చేశారు. మీరు అన్నట్లు అది ప్రేమ లేఖ కాదు. పరిపాలన లేఖ’ అని అన్నారు. -
నా భార్య సైతం ఇన్ని ‘లవ్ లెటర్స్’ రాయలేదు: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వం, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాల మధ్య కొద్ది రోజులుగా వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. గవర్నర్ వివిధ అంశాలపై లేఖలు రాయటాన్ని సూచిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గడిచిన ఆరు నెలల్లో గవర్నర్ రాసినన్ని లవ్ లెటర్లు.. తన భార్య కూడా రాయలేదంటూ ట్వీట్ చేశారు. తనను తిట్టటం, లేఖలు రాయటానికి కాస్త విరామం ఇచ్చి కాస్త సేదతీరండీ అంటూ సూచించారు. ‘ప్రతి రోజు ఎల్జీ సాబ్ తిట్టినన్ని తిట్లు నా భార్య కూడా తిట్టలేదు. గడిచిన ఆరు నెలల్లో ఎల్జీ సాబ్ రాసినన్ని లవ్ లెటర్లు నా భార్య సైతం రాయలేదు. ఎల్జీ సాబ్ కొద్దిగా చల్లబడండి. అలాగే.. కొద్దిగా సేదతీరమని మీ సూపర్ బాస్‌కి సైతం చెప్పండి.’ అని హిందీలో ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ఢిల్లీలోని బీజేపీ పాలిత మున్సిపల్ బాడీల్లో రూ.6000 కోట్ల స్కాం జరిగిందని, దానిపై దృష్టి పెట్టండంటూ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా లేఖ రాసిన మరుసటి రోజునే కేజ్రీవాల్ ఈ మేరకు ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే.. సిసోడియా లేఖకు ఎల్జీ సక్సేనా ఎలాంటి స్పందన తెలియజేయలేదు. కానీ, బీజేపీ ఆ ఆరోపణలను ఖండించింది. LG साहिब रोज़ मुझे जितना डाँटते हैं, उतना तो मेरी पत्नी भी मुझे नहीं डाँटतीं। पिछले छः महीनों में LG साहिब ने मुझे जितने लव लेटर लिखे हैं, उतने पूरी ज़िंदगी में मेरी पत्नी ने मुझे नहीं लिखे। LG साहिब, थोड़ा chill करो। और अपने सुपर बॉस को भी बोलो, थोड़ा chill करें। — Arvind Kejriwal (@ArvindKejriwal) October 6, 2022 ఇదీ చదవండి: వందేభారత్ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం.. గేదెలను ఢీకొట్టడంతో..! -
‘అధికారంలోకి వస్తే పాత పింఛను విధానం’
న్యూఢిల్లీ/వడోదర: గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే పాత పింఛను విధానాన్ని పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ పార్టీ, ఆప్ ప్రకటించాయి. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లలో ఇదే చేశామంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మంగళవారం ట్వీట్ చేశారు. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వడోదరలో ఓ సమావేశంలో మాట్లాడుతూ ఇదే హామీ ఇచ్చారు. ఉద్యోగులు డిమాండ్ల సాధనకు రోడ్లెక్కాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. ఇదీ చదవండి: హిజాబ్‌పై నిషేధం సబబే -
బీజేపీలో ఉంటూనే ‘ఆప్’ కోసం పని చేయండి: కేజ్రీవాల్
అహ్మదాబాద్: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ రాష్ట్ర బీజేపీ కార్యకర్తలకు కీలక సూచన చేశారు ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. అధికార బీజేపీ పార్టీలోనే ఉంటూ ఆప్ కోసం పనిచేయాలని కోరారు. ‘బీజేపీ నుంచి నిధులు అందుకోండి. కానీ అక్కడి నుంచి ఆప్ కోసం పని చేయండి’ అని పేర్కొన్నారు. గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా రాజ్‌కోట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు కేజ్రీవాల్. ‘మాకు బీజేపీ నాయకులు అవసరం లేదు. వారి నేతలను బీజేపీనే అట్టిపెట్టుకోని. బీజేపీకి చెందిన పన్నా ప్రముఖ్స్, గ్రామాలు, బూత్, తాలుక స్థాయి కార్యకర్తలు పెద్ద ఎత్తున మా పార్టీలో చేరుతున్నారు. చాలా ఏళ్లుగా బీజేపీకి సేవలందిస్తున్న పార్టీ కార్యకర్తలకు కాషాయ పార్టీ ఏమించ్చిందని వారిని ఆడగాలనుకుంటున్నా? మీరు (బీజేపీ కార్యకర్తలు) ఆ పార్టీలోనే ఉండండి. అయితే, ఆమ్ ఆద్మీ పార్టీ కోసం పని చేయండి. చాలా మంది బీజేపీ నుంచి డబ్బులు అందుకుంటున్నారు. ఆ నగదు తీసుకుంటూనే మా కోసం పని చేయండి. ఎందుకంటే మా వద్ద డబ్బులు లేవు.’ అని పేర్కొన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. గుజరాత్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉచిత విద్యుత్తు అందిస్తామని, అది బీజేపీ కార్యకర్తల ఇళ్లకు సైతం వర్తిస్తుందన్నారు కేజ్రీవాల్. ‘మీకు 24 గంటల ఉచిత విద్యుత్తు, మీ పిల్లలకు మంచి స్కూల్స్‌లో ఉచిత విద్య అందిస్తాం. మీ కుటుంబ సభ్యులకు ఉచితంగా నాణ్యమైన వైద్యంతో పాటు మీ కుటుంబంలోని మహిళలకు రూ.1,000 సాయం చేస్తాం.’ అని పేర్కొన్నారు కేజ్రీవాల్. ఇదీ చదవండి: ఆప్‌కు ఫేవర్‌గా గుజరాతీలు!.. సర్వేలపై కేజ్రీవాల్ ఆసక్తికర వ్యాఖ్యలు -
సిసోడియా అరెస్ట్ అయితే మరీ మంచిది: కేజ్రీవాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అవకతవకల ఆరోపణలతో ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా నివాసాలు, బ్యాంకు లాకర్లపై దాడులు నిర్వహించింది కేంద్ర దర్యాప్తు సంస్థ. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సీబీఐ దాడులను సూచిస్తూ మరోమారు బీజేపీపై విమర్శలు గుప్పించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టాలనే కేంద్ర ప్రభుత్వ ప్రణాళికతో వారికే ఎదురుదెబ్బ తగలనుందన్నారు. ‘మనీశ్ సిసోడియాపై దాడులు జరిగిన తర్వాత గుజరాత్లో ఆప్ ఓటు షేర్ 4 శాతం పెరిగింది. ఆయన అరెస్ట్ అయితే అది 6 శాతానికి చేరుతుంది.ఆపరేషన్ లోటస్ విఫలమవుతుందని చెప్పేందుకే ఈ రోజు అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాం. మా ఎమ్మెల్యేలు ఎవరూ పార్టీ మారటం లేదు. నా పిల్లలిద్దరు ఐఐటీలో చదువుతున్నారు. భారత్‌లోని ప్రతి పిల్లాడికి అలాంటి విద్య అందించాలనుకుంటున్నాను. అవినీతి పార్టీలో విద్యావంతులు లేరు. కానీ, నిజాయితీతో పని చేసే పార్టీలో మంచి విద్య, నిజమైన ఐఐటీ పట్టభద్రులు ఉన్నారు.’ అని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అసెంబ్లీలో జరిగిన విశ్వాస ఓటింగ్‌లో 62 మంది ఆప్ ఎమ్మెల్యేలకు గానూ 58 మంది అనుకూలంగా ఓటు వేశారు. ముగ్గురు గైర్హాజరవగా.. అందులో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. మరో నేత సత్యేంద్ర జైన్ జైలులో ఉన్నారు. ఒకరు స్పీకర్. ఇదీ చదవండి: ఢిల్లీ: విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్ -
మా ప్రభుత్వాన్ని కూల్చే యత్నం
న్యూఢిల్లీ: ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తున్నారంటూ ఆప్ సంచలన ఆరోపణలు చేసింది. ‘‘బీజేపీలో చేరాల్సిందిగా నలుగురు ఎమ్మెల్యేలు అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కుల్దీప్ కుమార్‌లను ఆ పార్టీ నేతలు ఒత్తిడి చేశారు. లేదంటే మనీశ్ సిసోడియా మాదిరిగా తప్పుడు కేసులు, సీబీఐ, ఈడీ దాడులు తప్పవంటూ బెదిరించారు. ఒక్కొక్కరికీ రూ.20 కోట్లు ఆఫర్ చేశారు. తమతో పాటు మరో ఎమ్మెల్యేను కూడా తీసుకొచ్చిన వారికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు’’ అని ఆప్ జాతీయ అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ సింగ్ చెప్పారు. నలుగురు ఎమ్మెల్యేలతో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నయానో భయానో తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నిస్తుండటం సిగ్గుచేటంటూ మండిపడ్డారు. మహారాష్ట్రలో శివసేనను చీల్చిన వ్యూహాన్నే తమ పార్టీపైనా ప్రయోగిస్తోందని ఆరోపించారు. ‘‘వాళ్ల ప్రలోభాలకు సిసోడియా లొంగకపోవడంతో ఇతర ఎమ్మెల్యేలపై పడ్డారు. కానీ వాళ్లంతా ఉద్యమాల నుంచి పుట్టుకొచ్చారు. బెదిరింపులకు లొంగే, అమ్ముడుపోయే రకం కాదు’’ అన్నారు. ప్రాణాలైనా ఇస్తాం గానీ పార్టీకి ద్రోహం చేయబోమని సిసోడియా ట్వీట్ చేశారు. ‘‘మేమంతా కేజ్రీవాల్ సైనికులం. భగత్‌సింగ్ అనుయాయులం. మీ సీబీఐ, ఈడీ మమ్మల్నేమీ చేయలేవు’’ అన్నారు. ఇది చాలా తీవ్రమైన విషయమంటూ కేజ్రీవాల్ మండిపడ్డారు. ఈ ఏడాది చివర్లో గుజరాత్ ఎన్నికలు ముగిసేదాకా తమపై సీబీఐ, ఈడీ దాడులు జరుగుతూనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ నివాసంలో ఆప్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమై పరిస్థితిని సమీక్షించింది. విపక్షాలను లేకుండా చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందంటూ దుయ్యబట్టింది. శుక్రవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరపాలని నిర్ణయించింది. ఈ ప్రశ్నలకు బదులివ్వండి: బీజేపీ ఆప్ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. మద్యం పాలసీలో అవినీతి బట్టబయలు కావడంతో శిక్ష తప్పదనే అసహనంతోనే ఆ పార్టీ నేతలు ఇలాంటి తప్పుడు ఆరోపణలకు దిగుతున్నారని బీజేపీ అధికార ప్రతినిధి సంబిత పాత్రా విమర్శించారు. వాళ్లకు దమ్ముంటే డబ్బులు ఆఫర్ చేసిన బీజేపీ నేతల పేర్లు చెప్పాలని సవాలు విసిరారు. ‘‘ఆప్‌కు భారీ కమీషన్లు ముట్టజెప్పిన వాళ్లకే కేజ్రీవాల్ సర్కారు మద్యం లైసెన్సులు కట్టబెట్టింది. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. విచారణను తప్పించుకునేందుకు వ్యూహాత్మకంగా ఒక్క ఫైలుపై తన సంతకం లేకుండా జాగ్రత్త పడ్డారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంపై తమ ప్రశ్నలకు బదులివ్వలేక ఆప్ ఇలా తప్పుడు ఆరోపణలకు దిగిందని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా ఆరోపించారు. ‘నిపుణుల కమిటీ వద్దన్నా వినకుండా హోల్‌సేల్ మద్యం వ్యాపారాన్ని ప్రైవేట్ వ్యక్తులపరం చేశారు. భారీగా లంచాలు తీసుకుని బ్లాక్ లిస్టెడ్ కంపెనీలకూ లైసెన్సులిచ్చారు’ అని అన్నారు. కేజ్రీవాల్ అండ్ కో నిజాయతీ, పారదర్శకతలకు పాతరేసి చూస్తుండగానే అవినీతిలో కూరుకుపోయిందంటూ కాంగ్రెస్ కూడా దుమ్మెత్తిపోసింది. -
24 గంటలు టైమ్ ఇస్తున్నా.. కేజ్రీవాల్‌కు కేంద్ర మంత్రి ఠాకూర్ సవాల్
Anurag Thakur.. దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ వాతావరణం హీటెక్కింది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ నేతల మధ్య మాటల వార్ నడుస్తోంది. కాగా, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాలో ఇంట్లో సీబీఐ సోదాలు హాట్ టాపిక్ మారింది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు బీజేపై విరుచుకుపడుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఆప్ సర్కార్‌పై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ సంచలన ఆరోపణలు చేశారు. మంత్రి ఠాకూర్ శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎక్సైజ్ పాలసీ స్కాంలో మనీష్ సిసోడియా తొలి నిందితుడే అయినా ఈ స్కాం ప్రధాన సూత్రధారి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అని ఆరోపించారు. కేజ్రీవాల్ మీడియా ముందుకు వచ్చి 24 గంటల్లోగా తనకు జవాబివ్వాలని అనురాగ్ ఠాకూర్ సవాల్ విసిరారు. సిసోడియాకు కేవలం డబ్బు వ్యామోహంతో మనీ తీసుకుని మౌనంగా ఉంటున్నాడని.. మనీశ్ సిసోడియా తన పేరును ‘మనీ-ష్’గా మార్చుకోవాలని సెటైరికల్ కామెంట్స్ చేశారు. విలేకరుల సమావేశానికి హాజరైన మనీష్ సిసోడియాకు ముఖం చెల్లలేదని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేకపోయారని ఎద్దేవా చేశారు. మరోవైపు.. ఆప్ నేతలు మాత్రం బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రజలకు మంచి చేస్తే బీజేపీకి నచ్చదంటూ వ్యాఖ్యానించారు. అలాగే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో(2024 ఎన్నికల్లో) కేజ్రీవాల్, మోదీ మధ్యే పోటీ ఉంటుందని సిసోడియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఇలా కేసుల్లో ఇరికిస్తున్నారని సిసోడియా మండిపడ్డారు. ఇది కూడా చదవండి: కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు.. సీఎం పోస్టుకు రూ. 2,500 కోట్లు? -
జాతీయ పార్టీ గుర్తింపునకు అడుగుదూరంలో ఆప్: కేజ్రీవాల్
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించేందుకు అడుగుదూరంలో ఉందని నొక్కి చెప్పారు పార్టీ జాతీయ కన్వినర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ సందర్భంగా పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, వలంటీర్లకు శుభాకాంక్షలు తెలిపారు. గోవాలో ఆప్‌ను రాష్ట్రస్థాయి పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిన క్రమంలో ఈ మేరకు ట్వీట్ చేశారు కేజ్రీవాల్. ‘ఢిల్లీ, పంజాబ్‌ల తర్వాత ఆప్ ఇప్పుడు గోవాలోనూ గుర్తింపు పొందిన పార్టీగా అవతరించింది. మరో రాష్ట్రంలో గుర్తింపు పొందితే.. అధికారికంగా జాతీయ పార్టీగా ప్రకటిస్తాం. కష్టపడి పని చేసిన వలంటీర్లు ప్రతిఒక్కరికి శుభాకాంక్షలు. ఆప్, దాని భావజాలాన్ని నమ్మిన ప్రజలను కృతజ్ఞతలు.’ అని ట్వీట్ చేశారు కేజ్రీవాల్. జన్‌లోక్‌పాల్ ఉద్యమం తర్వాత 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ అవతరించింది. 2013 ఢిల్లీ ఎన్నికల్లో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకోవటం ద్వారా 49 రోజులకే ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఢిల్లీలో రాష్ట్రపతి పాలన విధఇంచారు. 2015లో జరిగిన ఎన్నికల్లో భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఆప్. 2020లోనూ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. After Del n Punjab, AAP is now a state recognised party in Goa too. If we get recognised in one more state, we will officially be declared as a “national party” I congratulate each and every volunteer for their hard work. I thank the people for posing faith in AAP n its ideology pic.twitter.com/7UmsIixF0v — Arvind Kejriwal (@ArvindKejriwal) August 9, 2022 నేషనల్ పార్టీగా గుర్తింపు రావాలంటే? నేషనల్ పార్టీగా గుర్తింపు రావాలంటే.. దేశంలోని ఏ రాజకీయ పార్టీ అయిన ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓట్లు సాధించాలి. లేదా గత లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు సీట్లు లేదా కనీసం 2 శాతం సీట్లు సాధించాలి. అందులో ఎంపీలు మూడు రాష్ట్రాల నుంచి ఎన్నిక కావాలి. లేదా నాలుగు రాష్ట్రాల్లో రాష్ట్రస్థాయి పార్టీగా గుర్తింపు పొంది ఉండాలి. ఇదీ చదవండి: ఆగస్టు 15 లోపు కర్ణాటకలో కొత్త ముఖ్యమంత్రి? -
గేరు మార్చిన కేజ్రీవాల్.. ఆ పార్టీతో దోస్తీకి గ్రీన్‌కార్డ్
ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) భారీ మెజార్టీతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆ ఎన్నికల అనంతరం ఆప్.. పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. ఇటీవలి కాలంలో గుజరాత్, కర్నాటక, హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో పర్యటించి ఆప్‌కు ఒక్కసారి ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరారు. ఈ క్రమంలోనే దక్షిణాదిపై కొంచెం ఫోకస్ పెంచారు. ఇందులో భాగంగానే ఆదివారం కేరళ వెళ్లిన కేజ్రీవాల్ కీలక ప్రకటన చేశారు. కేరళలో ఆమ్ ఆద్మీ పార్టీ.. ట్వంటీ20 పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టు తెలిపారు. కొచ్చీలో కేజ్రీవాల్.. ట్వంటీ20 పార్టీతో కలిసి పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్‌ను ప్రకటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. కేరళలో తమ కూటమి అధికారంలోకి వస్తే ఢిల్లీ మోడల్ మాదిరిగా అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు. మీకు(మలయాళీలకు) అభివృద్ధి, పాఠశాలలు, ఆసుపత్రులు కావాలంటే తమ కూటమిని గెలిచిపించాలని కోరారు. అల్లర్లు, అవినీతి కావాలంటే ఇతర రాజకీయ పార్టీల గెలుపించుకోవాలని సూచించారు. తాము గెలిస్తే కేరళలో కూడా ఢిల్లీలోలాగా 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తామని హామీ ఇచ్చారు. Today is a historic day for Kerala. Through a new political front - People's Welfare Alliance - Aam Aadmi Party and Twenty20 will work together for the welfare of Kerala and its people. — Arvind Kejriwal (@ArvindKejriwal) May 15, 2022 -
కేజ్రీవాల్ ‘క్రేజీ’ ఆఫర్.. టార్గెట్ ఫలిస్తుందా..?
సిమ్లా: ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశంలో జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన కేజ్రీవాల్.. శనివారం హిమాచల్ ప్రదేశ్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆప్ తలిపెట్టిన ర్యాలీలో కేజ్రవాల్ మాట్లాడుతూ.. ప్రజలను, ఆమ్ ఆద్మీపార్టీని చూసి బీజేపీ భయపడుతోందని అన్నారు. అందుకే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లో కేంద్ర ప్రభుత్వం ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ క్రమంలోనే ఓ కొత్త హిమాచల్‌ను ఆవిష్కరించాల్సిన సమయం ఆసన్నమైందని కేజ్రీవాల్ తెలిపారు. ఆప్‌కు ఒక్క ఛాన్స్ ఇస్తే సరికొత్త హిమాచల్‌ను చూపిస్తామని ప్రజలకు కోరారు. అలాగే, కాంగ్రెస్, బీజేపీ నేతలకు కేజ్రీవాల్ ఆఫర్ ఇచ్చారు. ఆయా పార్టీల్లో ఉన్న సచ్ఛీలురందరూ వెంటనే ఆప్‌లో చేరిపోవాలని కోరారు. BJP हिमाचल और गुजरात में आम आदमी पार्टी से डरी हुई है। असल में ये AAP से नहीं, जनता से डरे हुए हैं। BJP ने तय किया है कि Himachal और Gujarat के चुनाव जल्द कराएंगे। BJP चुनाव जब मर्ज़ी कराए, सत्ता आम आदमी के हाथ में आनी चाहिए। -CM @ArvindKejriwal #HimachalMeinBhiKejriwal pic.twitter.com/8jvySkuvEr — AAP (@AamAadmiParty) April 23, 2022 మరోవైపు.. హిమాచల్‌లో ప్రత్యామ్నాయంగా పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయని అన్నారు. ఇప్పుడు తనను టార్గెట్ చేస్తున్నాయన్నారు. ఢిల్లీలో ప్రవేశపెట్టిన పథకాలకు హిమాచల్ ప్రదేశ్ సీఎం జయరాం ఠాకూర్ కాపీ కొడుతున్నారని ఆరోపించారు. ఢిల్లీలో తాము 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అని ప్రకటించగానే.. హిమాచల్ సీఎం ఠాకూర్ ఇక్కడ 125 యూనిట్ల వరకూ ఉచితమంటూ ప్రకటించారని అన్నారు. ఇది చదవండి: పంజాబ్ సీఎం మరో కీలక నిర్ణయం.. -
కాంగ్రెస్ పార్టీ చచ్చిన గుర్రం లాంటిది..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో పొలిటికల్ సస్పెన్స్ కొనసాగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ ఓటముల నుంచి ఎలా గట్టెక్కాలో వ్యూహాలు రచిస్తోంది. ఈ క్రమంలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో భేటీ అవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. వీరి భేటీ నేపథ్యంలో ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా.. కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. చద్దా శనివారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఓ చనిపోయిన గుర్రమని, దానిని ఎన్ని కొరడాలతో కొట్టినా.. అది పరిగెత్తదని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్ర మోదీకి కేవలం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాత్రమే సవాల్ విసరగలరని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయంకాదని కుండబద్దలు కొట్టారు. Congress Party cannot give an alternative to the country. Only Arvind Kejriwal can challenge PM Narendra Modi and BJP. Congress is like a dead horse, there is no point flogging a dead horse: AAP Rajya Sabha MP-elect Raghav Chadha on Prashant Kishor's meeting with Congress pic.twitter.com/nY0t0UlL6s — ANI (@ANI) April 16, 2022 అంతటితో ఆగకుండా.. బీజేపీ పార్టీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. బీజేపీ ఎప్పటికీ హింసాత్మక ఎజెండాతోనే ముందుకు సాగుతుందని బాంబు పేల్చారు. బీజేపీ ప్రభుత్వాలు ఎన్నటికీ మంచి పాఠశాలలను నిర్మించలేవని, ప్రజలకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించలేవని అన్నారు. కేవలం నిరక్షరాస్య గూండాలను మాత్రమే తయారు చేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. भारतीय जनता पार्टी का मतलब अब भारतीय "ज़ाहिल" पार्टी हो गया है। BJP सही मायनों में गुंडों-लफंगों की पार्टी बन गयी है। BJP के गुंडे लोकतांत्रिक ढंग से चुने हुए मुख्यमंत्री पर हमला करते हैं। लेकिन BJP उन गुंडों को सम्मानित करती है। -@raghav_chadha pic.twitter.com/xSi6IGg8wf — AAP (@AamAadmiParty) April 16, 2022 -
ఆప్ అఖండ విజయం.. 60ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన కేజ్రీవాల్
న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ఆద్మీ పార్టీ అఖండ విజయాన్ని అందుకుంది. ఈ సందర్బంగా ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల గెలుపుపై స్పందించారు. మా రాజకీయ ప్రత్యర్థులను మట్టికరి పిస్తూ ఇంతటి విజయం అందించిన పంజాబ్ ప్రజలకు ఎన్నో కృతజ్ఞతలు. ఇలాంటి విప్లవం మొదట ఢిల్లీలో సంభవించింది. పంజాబ్ తీర్పుతో మున్ముందు దేశవ్యాప్తంగా ఇదే విప్లవం సంభవించనుందని అన్నారు. ఇదిలా ఉండగా.. ఆప్ పంజాబ్‌లో మరో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పేరిట ఉన్న రికార్డును చేరిపేస్తూ 60 ఏళ్ల తర్వాత కొత్త రికార్డును కేజ్రీవాల్ తిరగరాశారు. 1962 తర్వాత పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ(వేరే పార్టీలతో పొత్తు లేకుండా) 92 సీట్లు గెలవడం 2022 ఎన్నికల్లో చోటుచేసుకుంది. కాగా, 1962లో క్రాంగెస్ 90 స్థానాల్లో విజయం సాధించింది. తాజాగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాల్లో గెలుపొంది రికార్డును తిరగరాసింది. కాగా, బీజేపీ, అకాలీదళ్ కూటమి.. 1997లో 93 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి భారీ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 18, శిరోమణి అకాలీదళ్ 3, బీజేపీ 2, బీఎస్పీ 1 స్థానాల్లో గెలుపొందాయి. ఆప్ ఢిల్లీ మోడల్‌కు పంజాబీలు ఫిదా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ మోడల్‌కు పంజాబ్ ప్రజలు పట్టం కట్టారు. నాణ్యమైన విద్య, వైద్య, సుపరిపాలన అందిస్తామన్న ఆప్‌కు అధికారాన్ని అప్పగించారు. పంజాబీల ఓటు దెబ్బకు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్.. ఆప్ దరిదాపుల్లో కూడా లేకుండాపోయాయి. ఢిల్లీలో అందిస్తున్నట్లే సుపరిపాలన అందిస్తామని ప్రచారం సందర్భంగా కేజ్రీవాల్ చెప్పారు. -
విద్యర్థులకు కేజీవాల్ గుడ్ న్యూస్
-
పంజాబ్‌లో ఆప్ భారీ విక్టరీ.. కేజ్రీవాల్ స్పందన ఇదే..
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. పంజాబ్‌లో జాతీయ పార్టీలకు పెద్ద షాకిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్ రూట్ క్లియర్ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటికే 91 స్థానాల్లో ఆప్ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ స్పందించారు. ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. పంజాబ్ ప్రజలకు అభినందనలు.. సరికొత్త విప్లవానికి నాంది పలికారు అంటూ.. పంజాబ్ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్ మాన్‌తో ఉన్న ఫొటోను షేర్ చేశారు. इस इंक़लाब के लिए पंजाब के लोगों को बहुत-बहुत बधाई। pic.twitter.com/BIJqv8OnGa — Arvind Kejriwal (@ArvindKejriwal) March 10, 2022 -
రాజకీయ పండితులకు చెక్ పెట్టిన కేజ్రీవాల్.. మనీష్ సిసోడియా కామెంట్స్ ఇవే..
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ రికార్డ్ క్రియేట్ చేసింది. జాతీయ పార్టీలను తన స్టైల్లో చెక్ పెట్టింది. పంజాబ్‌లో ఎన్నికలకు నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటి నుంచి పంజాబ్ రాజకీయాలపై ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. పోలింగ్ విధానంలో ప్రజలనే సీఎం అభ్యర్థిని ఎన్నుకోవాలని వినూత్నంగా ఆలోచించి ఎన్నికల ఫలితాల్లో సక్సెస్ అయ్యారు. మంచి విద్య, ఆరోగ్యం, సుపరిపాలన అందిస్తామని హామీ ఇచ్చిన ఆమ్ ఆద్మీకే పంజాబ్ ఓటర్లు పట్టం కట్టారు. ఎన్నికల ఫలితాల్లో ఆప్ గెలుపుపై ఆప్ నేత మనీష్ సిసోడియా స్పందించారు. ఈ సందర్భంగా సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ఇది ‘ఆమ్ ఆద్మీ’ (సామాన్యుడి) విజయమని అన్నారు. కేజ్రీవాల్ పాలనా విధానాన్ని పంజాబ్ ప్రజలు ఆమోదించారని తెలిపారు. ఆప్ జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుందని పేర్కొన్నారు. దేశ ప్రజలు సైతం కేజ్రీవాల్ ప్రభుత్వం తరహా పాలనను కోరుకుంటున్నారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు.. తాము యూపీ, గోవా, ఉత్తరాఖండ్‌లో కూడా పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపినట్టు తెలిపారు. అక్కడ కూడా ప్రజలు తమ పార్టీపై నమ్మకంతో ఓట్లు వేశారని అన్నారు. ఆ రాష్ట్రాల్లో ఫలితాలు, పార్టీ పని తీరుపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. #WATCH Punjab has accepted Kejriwal's model of governance. It has gained recognition at the national level. People in the entire country will seek this model of governance, says AAP leader Manish Sisodia pic.twitter.com/iVtBjv271Q — ANI (@ANI) March 10, 2022 -
కేజ్రీవాల్ కాబోయే ప్రధాన మంత్రి.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్
ఛండీగఢ్: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా కీలక చర్చ నడుస్తోంది. కాగా, యూపీ, పంజాబ్ ఫలితాలపై ఎక్కువ ఉత్కంఠ నెలకొంది. యూపీలో మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, పంజాబ్‌లో ఆప్(ఆమ్ ఆద్మీ పార్టీ) గెలుస్తుందని పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ నేత, పంజాబ్ ఎన్నికల సహ ఇన్ఛార్జ్ రాఘవ్ చద్దా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. దేశ ప్రజల ఆశాకిరణమని, దేవుడి దయ, ప్రజలు అవకాశం ఇస్తే కాబోయే ప్రధాన మంత్రి ఆయనే అంటూ కామెంట్స్ చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ జాతీయ రాజకీయాల్లో కీ రోల్ పోషిస్తూ రాజకీయ శక్తిగా ఎదుగుతుందన్నారు. అయితే, గురువారం ఓట్ల లెక్కింపు నేపథ్యంలో రాఘవ్ చద్దా కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంజాబ్‌లో తమ పార్టీ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే జాతీయ రాజకీయాల్లో కేజ్రీవాల్ తనదైన ముద్ర వేస్తున్నారని ప్రశంసించారు. కాంగ్రెస్ పార్టీకి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రత్యామ్నాయ పార్టీని అని తెలిపారు. రాబోయే రోజుల్లో కేజ్రీవాల్.. ప్రధాన మంత్రి స్థాయిలో హోదాలో కనిపిస్తారంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. అంతటితో ఆగకుండా బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టిందని అన్నారు. కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడి.. పదేళ్లు కూడా కాకపోయినప్పటికీ రెండు రాష్ట్రాల్లో తమ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, ఎన్నికల ఫలితాల వేళ ఆయన ఇలా మాట్లాడటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. -
వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేతకి నో!
ఆప్ సర్కార్ వర్సెస్ ఎల్జీ మరోసారి తెర మీదకు వచ్చింది. వీకెండ్ కర్ఫ్యూ ఎత్తేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ప్రతిపాదనను లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ సున్నితంగా తిరస్కరించారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ఒక ప్రతిపాదనతో పాటు కొవిడ్ ఆంక్షల్ని సవరించాలన్న విజ్ఞప్తిని సైతం ఆయన తోసిపుచ్చారు. కేసుల సంఖ్య ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలపడం కుదరదని లెఫ్టినెంట్ గవర్నర్ తేల్చేశారు. అయితే 50 శాతం సామర్థ్యంతో ప్రైవేట్ ఆస్పత్రుల్ని నిర్వహించుకోవడానికి మాత్రం ఎల్జీ అనుమతి ఇచ్చారు. కేసుల సంఖ్య తగ్గి, పరిస్థితి మెరుగైనప్పుడే ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలపడం సబబుగా ఉంటుందని ఎల్జీ ఈ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే వారంగా పాజిటివిటీ రేట్‌తో పాటు కేసులు తగ్గాయని, ప్రజల-వ్యాపారుల ఆర్థిక అవసరాల దృష్ట్యా వారంతపు కర్ఫ్యూను ఎత్తేయాలని ఆలోచిస్తున్నట్లు డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేర్కొన్నారు. దేశ రాజధాని రీజియన్‌లో జనవరి 1వ తేదీ నుంచి సరిబేసి విధానంలో మార్కెట్లను నిర్వహించుకోవచ్చని, అలాగే జనవరి 7వ తేదీన వీకెండ్ కర్ఫ్యూలను ప్రకటిస్తూ కేజ్రీవాల్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. అయితే న్యూఢిల్లీ ట్రేడర్స్ అసోషియేషన్, సదర్ బజార్ ట్రేడర్స్, ఇతర మార్కెట్ అసోషియేషన్లు.. సరిబేసి విధానం ఎత్తేయాలని డిమాండ్ చేస్తూ నిరసన వ్యక్తం చేశాయి. ఆర్థికంగా ప్రభావం చూపడంతో పాటు ఉద్యోగాలు పోతున్నాయంటూ వాపోతూ ఢిల్లీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు పెట్టుకున్నాయి. ఈ తరుణంలోనే ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తయారు చేసి ఆమోదం కోసం ఎల్జీకి పంపింది. ఇదిలా ఉంటే కర్ణాకటలో ఓపక్క వీకెండ్ కర్ఫ్యూ ఎత్తివేయగా.. తమిళనాడులో వీకెండ్లో పూర్తిగా లాక్డౌన్, మిగతా రోజుల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుందని సీఎం స్టాలిన్ ప్రకటించారు. -
కేజ్రీవాల్ క్రేజీ ఐడియా సూపర్ సక్సెస్
-
ఒక్క ఛాన్స్ - ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై ఆప్ ఫోకస్
-
ఫుల్ జోష్ లో ఆప్.... తరువాత టార్గెట్ అదే
-
మళ్లీ కేజ్రీవాల్ వర్సెస్ ఎల్జీ
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆప్ ప్రభుత్వం, లెఫ్ట్‌నెంట్ గవర్నర్(ఎల్జీ)ల మధ్య మరో వివాదం తలెత్తింది. రెండు రోజుల క్రితం ఆప్ ప్రభుత్వం ఇచ్చిన రెండు ఉత్తర్వులను ఎల్జీ అనిల్ బైజాల్ తోసిపుచ్చుతూ తాజా ఆదేశాలిచ్చారు. ఢిల్లీలో ప్రభుత్వ నిర్వహణలోని అన్ని ఆసుపత్రులు, ప్రైవేటు ఆసుపత్రుల్లో ఢిల్లీ వాసులైన కోవిడ్–19 రోగులకు మాత్రమే చికిత్స అందించాలని, కోవిడ్–19 లక్షణాలున్న వారికే కరోనా పరీక్షలు జరపాలని పేర్కొంటూ అరవింద్ కేజ్రీవాల్ సర్కారు 6న ఆదేశాలిచ్చింది. రానున్న రోజుల్లో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదమున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ఆదేశాలను తోసిపుచ్చుతూ ‘అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో, నర్సింగ్‌హోమ్స్‌ల్లో స్థానికుడా? స్థానికేతరుడా? అనే వివక్ష చూపకుండా అందరు కోవిడ్–19 పేషెంట్లకు చికిత్స అందించాలి’ అని స్పష్టం చేస్తూ ఎల్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, కరోనా లక్షణాలున్నవారికే పరీక్షలు జరపాలనడం ఐసీఎంఆర్ మార్గదర్శకాలకు వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఢిల్లీ ప్రభుత్వ ఆదేశాలను అమలు చేస్తే..కాంటాక్ట్ ట్రేసింగ్ కష్టమవుతుందని, కరోనా మరింత ప్రబలుతుందన్నారు. ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు మొత్తం 9 కేటగిరీల వారికి పరీక్షలు జరపాల్సిందేనన్నారు. ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ చైర్మన్ హోదాలో ఎల్జీ అనిల్ బైజాల్ ఆ ఆదేశాలిచ్చారు. ఎల్జీ తీరుపై ఆప్ మండిపడింది. బీజేపీ ఒత్తిడితోనే ఎల్జీ అలా వ్యవహరిస్తున్నారని, బీజేపీ చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించింది. -
కేజ్రీవాల్ ప్రమాణానికి సీఎంలకు ఆహ్వానం నో
న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఆమ్ఆద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఈసారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి రాజకీయ పార్టీల ప్రముఖులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించడం లేదు. ఈనెల 16వ తేదీన ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి సీఎంలు, రాజకీయ నాయకులెవరినీ ఆహ్వానించడం లేదని ఆప్ ఢిల్లీ కన్వీనర్ గోపాల్‌రాయ్ చెప్పారు. కేజ్రీవాల్ తన నాయకత్వంపై విశ్వాసం ఉంచి, మూడోసారి గెలిపించిన ఢిల్లీ ప్రజల మధ్యనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆయన తెలిపారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రజలే అతిథులని కేజ్రీవాల్ భావిస్తున్నారని వివరించారు. ఏడాది బుడతడికి పిలుపు అవ్యాన్ తోమర్ అనే చిన్నారికి మాత్రం ప్రత్యేకంగా ఆప్ నుంచి ప్రత్యేకంగా పిలుపు అందింది. కేజ్రీవాల్ మాదిరిగా టోపీ, స్వెట్టర్, మఫ్లర్, కళ్లజోడు ధరించిన ఈ ఏడాది వయస్సున్న ఈ బుడతడు ఢిల్లీలోని ఆప్ కార్యాలయం దగ్గర ఫలితాల వెల్లడిరోజు అందరి దృష్టినీ ఆకర్షించిన విషయం తెలిసిందే. ‘బేబీ మఫ్లర్ మాన్’గా పేరొందిన తోమర్ తల్లిదండ్రులు ఆప్ కార్యకర్తలు. 24 గంటల్లో 11 లక్షల కొత్త సభ్యులు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11 లక్షల మంది పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్టు ఆప్ వెల్లడించింది. పార్టీ సభ్యత్వం తీసుకోదలిచిన వారికోసం ఆ పార్టీ ఓ ఫోన్ నంబర్‌ను ప్రత్యేకంగా కేటాయించింది. పార్టీలో జాయిన్ అవడానికి ఆ నంబర్‌కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. -
'అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'
న్యూఢిల్లీ: మోదీ నాయకత్వంలో ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం రోజున న్యూఢిల్లీలో జరిగిన 'బూత్ కార్యకర్త సమ్మేళన్'కు హాజరైన అమిత్ షా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు దళిత వ్యతిరేక పార్టీలని విమర్శించారు. ఢిల్లీ ప్రజలను కేజ్రీవాల్ ఎంతోకాలం మభ్యపెట్టి.. మోసగించలేరన్నారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో.. ఇక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతుందన్నారు. చదవండి: వెనక్కితగ్గం పాక్‌లోని నాన్కనా సాహెబ్ గురుద్వారాపై దాడి విషయంలో కాంగ్రెస్ వైఖరి ఏంటో చెప్పాలని ఈ సందర్భంగా ఆయన నిలదీశారు. సిక్కులపై దాడులు జరుగుతుంటే కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న వారికి నాన్కనా సాహెబ్ గురుద్వారాపై జరిగిన దాడే సమాధానమన్నారు. ఆ దాడిలో గాయపడిన సిక్కులు ఎక్కడకు వెళ్తారని అమిత్ షా ప్రశ్నించారు. పౌరసత్వ సవరణ చట్టంపై దేశాన్ని కాంగ్రెస్, ఆప్ తప్పుదారి పట్టిస్తున్నాయంటూ మండిపడ్డారు. సీఏఏకు వ్యతిరకేంగా రాహుల్, ప్రియాంక హింసను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. సీఏఏపై తమ పార్టీ ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగిస్తుందని, ప్రజలకు వాస్తవాలు వివరిస్తుందని హామీ ఇచ్చారు. సీఏఏ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేయబోదని హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు సీఏఏపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. మూడు కోట్ల మంది ప్రజలకు చేరేలా 500 ర్యాలీలను నిర్వహిస్తామన్నారు. సీఏఏపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు నేటి నుంచి ఇంటింటి ప్రచారం చేపట్టనున్నట్లు బీజేపీ తెలిపింది. -
ఇప్పుడు ఫ్రీ అంటే.. తర్వాత ఇబ్బందులొస్తాయి
సాక్షి, ఢిల్లీ : మెట్రో రైళ్లలో మహిళలకు ఉచిత ప్రయాణమంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన పథకం మీద సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి పథకాల వల్ల ఢిల్లీ మెట్రో తీసుకున్న దీర్ఘకాలిక రుణాల చెల్లింపులపై భారం పడుతుందని స్పష్టం చేసింది. అంతేకాక, భవిష్యత్తులో మెట్రో విస్తరణ, సదుపాయాలు, సేవలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంది. ఢిల్లీలో నాలుగో ఫేజ్‌లో భాగంగా త్వరలో చేపట్టే మెట్రో విస్తరణ భూసేకరణకు అయ్యే వ్యయంలో సగం కేంద్రం భరించాలని ఆప్ ప్రభుత్వం వేసిన పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. ఈ పథకం వల్ల ఇప్పటివరకు రూ. 100 కోట్ల నష్టంలో ఉన్న సంస్థపై రూ.1500 కోట్ల భారం పడుతుందని హెచ్చరించింది. ఏడాదికి ఏడు వేల కోట్ల ఆదాయం గడిస్తున్నా కూడా నష్టాలు తప్పట్లేదన్నారు. ప్రజాధనాన్ని సరిగ్గా ఉపయోగించాలనీ, ఉచిత పథకాలతో వృథా చేయవద్దని హితవు పలికింది. (చదవండి: నిరుద్యోగ మహిళలకు కేజ్రివాల్ వరం) -
ఆమె పనిచేసుంటే ‘ఆప్’ పుట్టేది కాదు
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ ఢిల్లీలో సరైన పాలన అందించుంటే ఆమ్ ఆద్మీ పార్టీ పుట్టేది కాదన్నారు అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీలోని రోహిణిలో నిర్వహించిన ఎన్నికల సభలో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రసంగించారు. ‘ఈ పరిస్థితుల్లో షీలా దీక్షిత్ ఉన్నా మంచి పాలనే అందించేవారని కొందరు విమర్శిస్తున్నారు. ఆమె ఢిల్లీలో అధికారంలో ఉన్న సమయంలో విద్య, ఆరోగ్యం లాంటి కీలకాంశాలను నిర్లక్ష్యం చేశారు. మెరుగైన సౌకర్యాలు, వసతులు కల్పించలేదు. ఢిల్లీని అభివృద్ధి చేయడంలో ఆమె ప్రభుత్వం దారుణంగా విఫలమైంది. అందుకే తాను ఆప్ లాంటి కొత్త పార్టీని స్థాపించాల్సి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 70 సంత్సరాలు అధికారంలో ఉంది. ఆ పార్టీ మంచి పాలన అందించుంటే మా పార్టీ అసలు ఉనికిలోనే ఉండేది కాద’ని కేజ్రీవాల్ అన్నారు. షీలా దీక్షిత్ 1998 నుంచి 2003 వరకు జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో వరుసగా మూడు పర్యాయాలు గెలిచి అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. మోదీ సర్కార్‌ను తూర్పారపట్టిన కేజ్రీవాల్.. ఢిల్లీలో తాము నూతనంగా స్కూళ్లు, ఆసుపత్రులు, మొహల్లా క్లినిక్‌లు నిర్మించాలనుకున్నప్పటికీ, కేంద్రం ప్రతి విషయంలోనూ తమకు అడ్డుపడుతూనే ఉందని, సీసీ కెమెరాల బిగింపునకు సంబంధించిన ఫైల్‌ను గత మూడేళ్లుగా ఆమోదించకుండా మోదీ ప్రభుత్వం మోకాలడ్డేస్తోందని దుమ్మెత్తిపోశారు. ‘మేం ఏ పని చేసినా కేంద్రం అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అదే దేశంలోని మిగతా రాష్ట్రాల విషయంలో ఇవేవీ అవసరం లేదు. వారికా స్వేచ్ఛ ఉంది. అభివృద్ధిని అడ్డుకోవాలని చూసే అలాంటి (బీజేపీ) పార్టీకి ఓటేస్తే, వచ్చే ఐదేళ్లపాటు మళ్లీ అభివృద్ధిని జరగనివ్వరు. కాబట్టి ఆప్‌కు ఓటేయాలి’ అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల ప్రచారంలో ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా కల్పించే అంశాన్ని తన మేనిఫెస్టోలో చేర్చడం లేదని తెలిసింది. కేవలం జాతీయ సమస్యల మీదే తమ ప్రచారం కొనసాగుతుందని, ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదా అంశాన్ని తాము ఎన్నికల ప్రచారంలో లేవనెత్తబోవడం లేదని ఢిల్లీ మాజీ సీఎం, ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షీలా దీక్షిత్ మీడియాకు తెలిపారు. -
చీపురు-స్వస్తిక్ ట్వీట్.. కేజ్రీవాల్‌పై నెటిజన్ల ఫైర్
న్యూఢిల్లీ: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ బీజేపీని చిత్తుగా ఓడిస్తుందనే అర్థం వచ్చేలా ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తమ పార్టీ గుర్తు చీపురు, హిందూ స్వస్తిక్ చిహాన్ని తరుముతున్నట్టుగా ఉన్న ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేయడంపై సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. బీజేపీ శ్రేణులే గాక చాలా మంది నెటిజన్లు కేజ్రీవాల్‌ను విమర్శిస్తున్నారు. ఇది ఆప్ నీచ సంస్కృతికి నిదర్శనమని పలువురు బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. ‘అది హిందువుల స్వస్తిక్ గుర్తు కాదు.. నిరకుంశ పాలనకు చిహ్నమైన నాజీ చిహ్నమని’ ఆప్ దీనిపై వివరణ ఇచ్చినప్పటికీ ఆ పార్టీపై విమర్శల తాకిడి తగ్గకపోవడం విశేషం. ‘అవసరం ఉన్నప్పుడు హిందువులను అక్కున చేర్చుకోవడం.. లేనప్పడు వారిని దూషించడం ఆప్‌కు అలవాటేన’ని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మండిపడ్డారు. హిందువులుగా ఎప్పుడూ శాంతియుతంగానే జీవిస్తామని.. అనవసర ప్రచార ఆర్భాటాలకు తాము ఎక్కువ విలువివ్వమని మనోజ్ అన్నారు. ఎంపీ ఎన్నికలు ఉండటంతో ఓటు రాజకీయాల కోసం కేజ్రీవాల్ ఇలాంటి దుశ్చర్యలకు దిగుతుంటారని, ఇది ఆయన అధికార దాహాన్ని తెలియజేస్తోందని మనోజ్ తివారీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి తజిందర్ బగ్గా మాట్లాడుతూ.. ‘కేజ్రీవాల్.. మీరు విమర్శించాలనుకుంటే బీజేపీని, ప్రధాని మోదీని, మమ్మల్ని విమర్శించండి.. కానీ హిందూయిజాన్ని అగౌరవపరచకండి. స్వస్తిక్ మా హిందువుల పవిత్ర చిహ్నం, మేం దాన్ని ప్రాణపదంగా పూజిస్తామ’ని అన్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్‌తో తమ పార్టీ ఎలాంటి పొత్తులు పెట్టుకోబోదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. కాంగ్రెస్‌తో జట్టుకు తాము ప్రయత్నించిగా.. ఆ పార్టీ తమను సరిగా అర్థం చేసుకోలేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు డిపాజిట్లు కూడా దక్కవని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థుల వివరాలను వెల్లడించింది. ఆ వివరాలు.. లోక్‌సభ నియోజకర్గం అభ్యర్థి తూర్పు ఢిల్లీ అతీషీ ఉత్తర ఢిల్లీ గుగ్గన్ సింగ్ దక్షిణ ఢిల్లీ రాఘవ్ చద్దా ఈశాన్య ఢిల్లీ దిలిప్ పాండే చాందినీ చౌక్ పంకజ్ గుప్తా న్యూఢిల్లీ బ్రిజేష్ గోయల్ పశ్చిమ ఢిల్లీ బల్బీర్ సింగ్ జఖ్ఖర్ -
‘మీ పిల్లలను డాక్టర్లు చేస్తారా లేక కాపలాదారులా?’
ఢిల్లీ: ‘మీ పిల్లలను డాక్టర్లను చేస్తారా లేక కాపలాదారులను చేస్తారా’ అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను ప్రశ్నించారు. ‘‘మోదీ ఈ దేశాన్ని కాపలాదార్లతో నింపేయాలనుకుంటున్నారు. మీరు మీ పిల్లలను కాపలాదారులను చేయాలనుకుంటే మోదీకి ఓటేయండి. మీ పిల్లలకు సరైన విద్యతో డాక్టర్లు, ఇంజినీర్లను చేయాలనుకుంటే చదువుకున్న, నిజాయితీ గల ఆప్‌కు ఓటేయాలి’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రఫేల్ స్కాంలో ప్రధాని మోదీని విమర్శిస్తూ.. ఆయన ‘చౌకీదార్’ కాదు.. చోర్ (దొంగ) అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలకు కౌంటర్‌గా బీజేపీ #నేనూ కాపలాదారునే (మే భీ చౌకీదార్) అని ప్రచారాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ప్రచారం నేపథ్యంలో ప్రధాని మోదీ సహా కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు, పలువురు నేతలు ట్విటర్లో తమ పేర్లకు ముందు చౌకీదార్ అని చేర్చుకున్నారు. దీనిపై విపక్ష కాంగ్రెస్‌తో సహా పలు పార్టీల నాయకులు విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అటు నెటిజన్లు కూడా బీజేపీ చౌకీదార్ ప్రచారాన్ని తప్పుబడుతున్నారు. -
‘హస్తిన’.. ఎవరి హస్తగతమవునో..!
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ జెండా ఎగరేస్తుందోననే అంశం తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తోంది. నిరసనలు, ఉద్యమాలకు నెలవు, భారత రాజకీయాలకు గుండెకాయగా చెప్పుకునే రాజధాని నగరంలో గెలుపే లక్ష్యంగా సర్వశక్తులూ ఒడ్డడానికి అన్ని పార్టీలూ సమాయత్తమవుతున్నాయి. గత పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన బీజేపీ మళ్లీ అదే ఫీట్‌ను నమోదు చేయాలని చూస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో దుమ్మురేపిన ఆప్ ఎంపీ సీట్లనూ తన ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతుండగా.. ఢిల్లీలో ప్రాభవం కోల్పోయిన హస్తం పార్టీ తిరిగి పూర్వవైభవాన్ని పొందే దిశగా వ్యూహాలు పన్నుతోంది. ఆసక్తి రేకెత్తిస్తున్న త్రిముఖ పోరులో గెలిచి మురిసేదెవరో..! రాజకీయ చరిత్ర ఢిల్లీ 1990 వరకూ హస్తం పార్టీకి కంచుకోటగా ఉండేది. 90ల తరువాత రాజధానిలో రాజకీయ సమీకరణాలు క్రమంగా మారుతూ వచ్చాయి. 1991లో కాషాయ పార్టీకి హస్తిన ప్రజలు పట్టం కట్టారు. తదనంతర కాలంలో రెండు జాతీయ పార్టీల మధ్య ఆధిపత్యం మారుతూ వచ్చింది. ఈ మధ్య కాలంలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభంజనంలా దూసుకొచ్చి ఢిల్లీ కోటలో పాగా వేసింది. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ షీలా దీక్షిత్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌కు గట్టి షాకిచ్చి ఘనవిజయం సాధించింది. దూసుకొచ్చిన బీజేపీ కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉన్న ఢిల్లీలో 1991 పార్లమెంట్ ఎన్నికల్లో లాల్ కృష్ణ అద్వానీ సారథ్యంలోని బీజేపీ విజయ దుందుభి మోగించింది. 40.2శాతం ఓట్లతో బీజేపీ 5సీట్లు గెలుచుకోగా, 39.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం రెండు స్థానాల్లో విజయం సాధించింది. మళ్లీ వికసించిన కమలం బీజేపీ 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఢిల్లీలో తన పట్టును నిలుపుకుంది. ఈసారి 49.6శాతం ఓట్లతో మళ్లీ 5సీట్లను గెలుచుకొని, కాంగ్రెస్‌ను ద్వితీయ స్థానానికి నెట్టింది. 37.3శాతం ఓట్లను హస్తం పార్టీ గెలుచుకోగలిగింది. 1998లో జరిగిన ఎలక్షన్లలో వాజ్‌పేయి హయాంలోని కమల దళం 50.7శాతం ఓట్లతో 6సీట్లలో విజయ బావుటా ఎగురవేసింది. 42.6శాతం ఓట్లతో కాంగ్రెస్ కేవలం ఒక సీటుకే పరిమితమైంది. కమలం క్లీన్‌స్వీప్ 1991 నుంచి చిక్కిన ఆధిక్యాన్ని కాపాడుకుంటూ వచ్చిన కాషాయ పార్టీ 1999 పార్లమెంట్ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయిస్తూ 51.7శాతం ఓట్లతో 7సీట్లను గెలుచుకుంది. కాంగ్రెస్ రెపరెపలు దాదాపు దశాబ్దం కాలంపాటు సాగిన బీజేపీ ఆధిపత్యానికి చెక్‌పెడుతూ సోనియా నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ 2004లో 54.8శాతం ఓట్లను సాధించి 6సీట్లను కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటులో మాత్రమే విజయం సాధించగలిగింది. ఈ విజయాన్ని కొనసాగిస్తూ 2009 ఎన్నికల్లో హస్తం పార్టీ అన్ని సీట్లనూ(7) తన వశం చేసుకుంది. బీజేపీ గెలుపు ఢంకా 2014 సార్వత్రిక ఎన్నికల్లో 3జీ స్కాం, కుంభకోణాలు, పలు అవినీతి ఆరోపణలతో దేశమంతా కాంగ్రెస్‌కు ఎదురుగాలి వీచింది. ఎగ్జిట్‌పోల్స్ ముందే చెప్పినట్టు ఈ ఎన్నికల్లో మోదీ, అమిత్ షా ఆధ్వర్యంలోని బీజేపీ 46.6శాతం ఓట్లతో 7సీట్లలో గెలుపు నగారా మోగించింది. -
జనం లేక వెనుదిరిగిన కేజ్రీవాల్
చండీగఢ్ : ఆమ్ ఆద్మీ పార్టీ ఆర్భాటంగా ఏర్పాటు చేసిన ర్యాలీకి జనం రాకపోవడం, ఖాళీ కుర్చీలు వెక్కిరించడంతో ఆ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మొక్కుబడిగా ప్రసంగించి వెనుదిరిగారు. హర్యానాలో మరో ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించాల్సి ఉందంటూ అక్కడి నుంచి ఆయన బయటపడ్డారు. షెడ్యూల్ ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కేజ్రీవాల్ ప్రసంగం ప్రారంభకావాల్సి ఉండగా జనం పలుచగా ఉండటంతో మరో గంట పాటు జాప్యం చేశారు. అప్పటికీ ప్రజలు పెద్దగా ర్యాలీ ప్రాంతానికి చేరకపోవడంతో పార్టీ శ్రేణులు డీలా పడ్డాయి. కాగా, కొద్దిసేపు ప్రసంగించిన కేజ్రీవాల్ స్ధానిక బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్‌పై విమర్శలు గుప్పించారు. ఆమె అటు లోక్‌సభకు హాజరు కాకపోవడంతో పాటు ఇటు చండీగఢ్‌లోనూ ప్రజలకు ముఖం చూపించరని ఆరోపించారు. కిరణ్ ఖేర్‌ను మీరు ఎప్పుడైనా చండీగఢ్‌లో చూశారా అంటూ ఆయన ప్రశ్నించారు. ఆమె నటిగా ముంబైలో షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతారని చెప్పారు. నియోజకవర్గానికి ఆమె ఒక్క అభివృద్ధి పని కూడా చేపట్టలేదని విమర్శించారు. -
నేటి నుంచి ఢిల్లీలో ఇళ్ల వద్దకే 40 సేవలు
ఢిల్లీ: 40 ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్లవద్దకే సిబ్బంది వచ్చి అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. వివాహ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కొత్త నీటి కనెక్షన్, రేషన్ కార్డు, వాహనాల ఆర్సీల్లో చిరునామా మార్పులు తదితర సేవలను ఇకపై ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే పొందగలుగుతారు. అయితే ఇంటివద్దనే ఈ సేవలను పొందేందుకు ప్రజలు సాధారణ రుసుము కన్నా 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. -
ఐటీ నోటీసులు అందుకే..
సాక్షి,న్యూఢిల్లీ: పార్టీకి అందిన రూ 30 కోట్ల విరాళాలకు సంబంధించి ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన నోటీసులపై ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఐటీ నోటీసులు జారీ చేశారని ఆరోపించారు. తమ పార్టీ స్వీకరించిన విరాళాలపై అన్ని వివరాలు ఖాతాల్లో నమోదయ్యాయని, ఐటీ నోటీసులు రాజకీయ కుట్రలో భాగమేనని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. మరోవైపు ఐటీ చట్టం సెక్షన్ 156 కింద నోటీసులు జారీ చేశామని ఆదాయ పన్ను శాఖ వర్గాలు తెలిపాయి. పార్టీ దాఖలు చేసిన ఐటీఆర్‌లను పరిశీలించిన అసెసింగ్ అధికారి సాధారణ ప్రక్రియలో భాగంగానే ఈ నోటీసులు జారీ చేశారని పేర్కొన్నాయి. ఇతర సంస్థలకూ ఈ తరహా నోటీసులు జారీ చేశామని, ఆప్‌కు విరాళాలు సహా పలు మార్గాల్లో వచ్చిన ఆదాయంపై వివరణ కోరుతూ డిమాండ్ నోటీసు పంపామని ఐటీ వర్గాలు తెలిపాయి. -
రక్షణ మంత్రికి ఈసీ నోటీసులు
పనాజీ: కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్‌కు ఎన్నికల సంఘం బుధవారం షోకాజ్ నోటీసులు పంపింది. ఇటీవల గోవాలో జరిగిన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై వివరణ కోరింది. ఎన్నికల్లో బహిరంగసభలో ప్రచారం చేస్తూ పారికర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రాజకీయ నేతల నుంచి ఓటర్లు డబ్బులు తీసుకోవాలని చేసిన వ్యాఖ్యలపై ఈ నెల 3వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఎలక్షన్ కమిషన్ సూచించింది. ఆ వ్యాఖ్యలు చేసినందకు మంత్రిపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరించాలని ఈసీ కోరింది. గత జవనరి 29న చింబెల్లో ప్రచారం చేసిన మనోహర్ పారికర్.. ఇతర పార్టీల నేతలతో డబ్బులు తీసుకున్నా ఎలాంటి సమస్య లేదన్నారు. ఎవరి వద్ద డబ్బులు తీసుకున్నా చివరికి మీ ఓటు బీజేపీకే వేయాలంటూ ప్రజలకు ఆయన పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో నేతలు మరిన్ని డబ్బులు పంచుతారని పారికర్ అన్నారని గోవా ఫార్వర్డ్ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
అరవింద్‌పై ఈసీకి బీజేపీ ఫిర్యాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తిగత ఆరోపణలకు దిగుతున్నారంటూ కేజ్రీవాల్‌పై ఎన్నికల సంఘం అధికారులకు బీజేపీ నేతలు గురువారం ఫిర్యాదు చేశారు. ఆయన ఆరోపణలు నిరాధారమైనవని, ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అటువంటి ఆరోపణలు చేసే హక్కు కేజ్రీవాల్‌కు లేదని తెలిపామని వారు తెలిపారు. ఆప్ నేతపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని తాము ఎన్నికల కమిషన్ ను కోరామని వివరించారు. ఆప్‌పై పరువునష్టం దావా వేయనున్నట్లు చెప్పారు. ఎన్నికల సంఘం అధికారులను కలిసిన వారిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, దక్షిణ ఢిల్లీ ఎంపీ రమేశ్ బిధూడీ, సీనియర్ నేత విజయ్ గోయల్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, రిలయన్స్ విద్యుత్ కంపెనీలతో బీజేపీ నేత సతీష్‌కు సంబంధాలున్నాయని ఆప్ నేత అరవింద్ ఆరోపించిన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన సతీష్ సాక్ష్యాలను చూపిస్తే తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని, లేదంటూ కేజ్రీవాల్ రాజకీయాల నుంచి తప్పుకోవాలని సవాల్ విసిరారు. కాగా, తాను సతీష్‌కు విద్యుత్ కంపెనీలతో ఉన్న సంబంధాలకు సంబంధించి మరిన్ని సాక్ష్యాలను చూపిస్తానని, రాజకీయాల నుంచి తప్పుకునేందుకు ఆయన సిద్ధంగా ఉండాలని కేజ్రీవాల్ మళ్లీ సవాలు విసిరారు. దీంతో రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రతరమైంది.