AAP Massive Win In Punjab: Arvind Kejriwal Comments On Punjab Election Results - Sakshi
Sakshi News home page

Punjab Election Results: పంజాబ్‌లో ఆప్‌ భారీ విక్టరీ.. కేజ్రీవాల్‌ స్పందన ఇదే..

Published Thu, Mar 10 2022 1:54 PM | Last Updated on Thu, Mar 10 2022 3:45 PM

Aam Aadmi Party Chief Arvind Kejriwal Comments On Results - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ సంచలనం సృష్టించింది. పంజాబ్‌లో జాతీయ పార్టీలకు పెద్ద షాకిస్తూ ప్రభుత్వ ఏర్పాటుకు ఆప్‌ రూట్‌ క్లియర్‌ చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మోజార్టీతో దూసుకుపోతోంది. ఇప్పటికే 91 స్థానాల్లో ఆప్‌ ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఆప్‌ నేతలు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

కాగా ఎన్నికల ఫలితాలపై ఢిల్లీ సీఎం, ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ట్విట్టర్‌ వేదికగా కామెంట్స్ చేశారు. పంజాబ్‌ ప్రజలకు అభినందనలు.. సరికొత్త విప్లవానికి నాంది పలికారు అంటూ.. పంజాబ్‌ సీఎం అభ్యర్థి భగవంత్ సింగ్‌ మాన్‌తో ఉన్న ఫొటోను షేర్‌ చేశారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement