
ఢిల్లీ: 40 ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్లవద్దకే సిబ్బంది వచ్చి అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. వివాహ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కొత్త నీటి కనెక్షన్, రేషన్ కార్డు, వాహనాల ఆర్సీల్లో చిరునామా మార్పులు తదితర సేవలను ఇకపై ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే పొందగలుగుతారు. అయితే ఇంటివద్దనే ఈ సేవలను పొందేందుకు ప్రజలు సాధారణ రుసుము కన్నా 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.