At Home
-
జోరు వానలో ఎట్ హోమ్
సాక్షి, హైదరాబాద్: దేశ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గురువారం సాయంత్రం రాజ్‌భవన్ ప్రాంగణంలో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.కేశవరావు, చిన్నారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, మాజీ గవర్నర్ విద్యాసాగర్‌రావు, ఎంపీలు మల్లు రవి, ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, సీఎస్ శాంతికుమారి, డీజీపీ జితేందర్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభమైన కొద్దిసేపటికే భారీ వర్షం మొదలైంది. అయితే వాటర్‌ప్రూఫ్ టెంట్లు వేసి ఉండటంతో జోరు వానలోనూ కార్యక్రమం యథావిధిగా కొనసాగింది. ఈ కార్యక్రమానికి హాజరైన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలు, పద్మ పురస్కార గ్రహీతల వద్దకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్‌రెడ్డి వెళ్లి పలకరించారు. చివర్లో గవర్నర్ అతిథుల టేబుల్స్ వద్దకు వెళ్లి అందరినీ పలకరించారు. కాగా, వర్షపు నీటి ప్రవాహం టేబుల్స్ కిందకి చేరడంతో చివర్లో కొంత అసౌకర్యం కలిగింది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నేతలు ఎవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు.భిన్నత్వంలో ఏకత్వమే మన బలంమాతృభూమికి స్వాతంత్య్రం కోసం పోరాడిన అసంఖ్యాక దేశభక్తుల నిస్వార్థ త్యాగాలు చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచాయని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గురువారం ఆయన రాజ్‌భవన్ దర్బార్ హాల్ ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. గడిచిన ఏడు దశాబ్దాల్లో దేశం అద్భుత ప్రగతిని సాధించిందన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే మన అతిపెద్ద బలమని స్పష్టం చేశారు. దేశం, రాష్ట్ర అభివృద్ధికి అకుంఠిత దీక్షతో పనిచేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. రాజ్‌భవన్ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. -
పార్లర్‌కి వెళ్లకుండా.. ఇంట్లోనే సింపుల్ చిట్కాతో ఇలా...
పార్లర్లో ఫేషియల్‌తో పనిలేకుండా, ఖరీదైన క్రీములు కొనకుండా ముఖం చక్కగా మెరవాలంటే ఇంట్లోనే టొమాటో ఫేషియల్‌ను ప్రయత్నించండి. పెళ్లికూతురులా మెరిసిపోతారు. టొమాటోను గుండ్రని ముక్కలుగా కోయాలి. ఒక ముక్కను తీసుకుని పైన టీస్పూను పంచదార, టీస్పూను కాఫీ పొడి వేసి ముఖంపైన అద్దాలి. తరువాత చేతులతో సున్నితంగా మర్దన చేసి కడిగేయాలి. ఇప్పుడు మరో టొమాటో ముక్కపై టీస్పూను అలోవెరా జెల్ వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. ఈ మర్దన అయిన వెంటనే మరో టొమాటో ముక్కపై రెండు టీస్పూన్ల పసుపు వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. పసుపు పూర్తిగా ఆరాక నీటితో కడిగేసి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ టొమాటో ఫేషియల్‌లోని ప్రతి స్టెప్‌ను జాగ్రత్తగా అనుసరిస్తే ముఖం కాంతిమంతంగా మెరిసిపోతుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా కొబ్బరినూనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత మర్దన చేసి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేయడమేగాక, చర్మానికి తేమనందిస్తుంది. ఇవి చదవండి: ఈ గ్రామాల్లో.. భారీగా హోలి వేడుకలు -
ఆ తల్లీ కూతుళ్లకి అందుకే అంత ధైర్యం..!
ధైర్యంగా ఉండమని చెప్పడం అందరూ చేసే పనే. ధైర్యాన్ని ప్రదర్శించడం కొందరు చేసేది. ప్రమాదంలోనూ ధైర్యాన్ని చూపడం అతి కొద్ది మందే చేస్తారు. ఆ అతి కొద్దిమందిలోనూ మేటిగా నిలుస్తున్నారు హైదరాబాద్‌లోని బేగంపేట వాసులైన ఈ తల్లీ కూతుళ్లు. ఇంట్లోకి అకస్మాత్తుగా చొరబడిన ఆగంతకులపైకి చిరుతపులుల్లా విరుచుకుపడ్డారు. మారణాయుధాలతో బెదిరించినా ఆత్మస్థైర్యాన్ని బెదరనివ్వలేదు. ఇద్దరు దండుగులను తరిమి తరిమి కొట్టిన తల్లి అమిత మెహోత్. తల్లిని కాపాడుకునేందుకు దుండగులతో వీరోచితంగా పోరాడిన కూతురు బాబీ. దుండగులు ఎలా ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తారో, ఎలా దాడి చేస్తారో మనం ఊహించలేం. అకస్మాత్తుగా ఎదురయ్యే ప్రమాదాలను ఎలా ఎదుర్కోవాలో తెలియక ధనాన్నే కాదు ప్రాణాలను సైతం కోల్పోయేవారెందరో. కానీ, ప్రాణాలను కూడా లెక్క చేయకుండా దుండగుల దుశ్చర్యను క్షణమాత్రంలోనే గుర్తించి, ఆ వెంటనే తమ స్థైర్యాన్ని చూపి నేడు ఎంతో మంది ప్రశంసలు అందుకుంటున్నారు అమిత, బాబీ. స్త్రీలు సబలలు అని నిరూపించిన ఈ వనితలు నేడు ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తున్నారు. ‘‘ఎప్పుడో ప్రాక్టీస్ చేసిన బాక్సింగ్‌తో పాటు 15 ఏళ్లుగా చేస్తున్న జిమ్ వ్యాయామాలు, వీటికి తోడు మార్షల్ ఆర్ట్స్‌పై అవగాహన.. ఇవన్నీ దుండగులు తుపాకీ గురి పెట్టినా ఏమాత్రం బెదరక ధైర్యంగా నిలబడేలా చేశాయి. దోచుకోవడానికి వచ్చిన వారిని తరిమి కొట్టేలా చేశాయి’’ అని తెలిపింది నలభై ఆరేళ్ల అమిత. ఊహించని విధంగా ఆ తల్లీకూతుళ్ల నుంచి ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు కాళ్లకు బుద్ధి చెప్పాల్సి వచ్చింది. కొరియర్ బాయ్స్ వేషంలో.. ఆన్లైన్ అమ్మకాలు పెరిగాక కొరియర్ బాయ్స్ మన ఇళ్ల ముందుకు వస్తుంటారు. వారి గురించి మనకేవిధంగానూ తెలియదు. అలాగని, కొరియర్ వారంతా ప్రమాదకారులే అని మనం చెప్పలేం. కానీ, ఒక్కోసారి సమస్య ఈ విధంగానూ మనల్ని పలకరించవచ్చు అని గ్రహించాలి అనడానికి గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ సంఘటన మన కళ్లకు కడుతుంది. ‘‘మా ఇంటి గుమ్మానికి, ప్రధాన గేటుకు 200 ఫీట్ల దూరం ఉంటుంది. కొరియర్బాయ్స్ ఎవరొచ్చినా గేటు బయటనే ఉండి పిలుస్తారు. గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో బ్యాగ్‌తో ఇద్దరు వ్యక్తులు వచ్చారు. ఒకరు హెల్మెట్ ధరించి ఉండగా మరొకరు మాస్క్ ధరించి ఉన్నారు. నేను మొదటి అంతస్తులోనే ఉండి కొరియర్ వివరాలు అడిగాను. అమిత (నా పేరు), ఎన్‌కె జైన్ (నా భర్త) పేర్లు చెప్పి కొరియర్ వచ్చిందని చెప్పారు. అక్కడే ఉండాలని, వచ్చి తీసుకుంటామని చెప్పాను. నేను కిందికి వచ్చేసరికి గేటు లోపలి నుంచి గుమ్మం వద్దకు వచ్చేశారు. ఎదుర్కొని .. కనిపెట్టి.. బ్యాగ్‌లో నుంచి కొరియర్ పార్శిల్ తీస్తున్నట్లుగా తీసి ఒకరు తపంచా (నాటు తుపాకీ)తో నాపై ఎక్కుపెట్టాడు. మరొకరు నన్ను తోసుకుంటూ లోపలికి వచ్చి కిచెన్ లో ఉన్న పనిమనిషి మెడపై కత్తి పెట్టాడు. నా అరుపులకు మొదటి అంతస్తులో ఉన్న కుమార్తె కూడా వచ్చింది. మాపై అటాక్ చేస్తుండగా మేం కూడా తిరిగి అటాక్చేశాం. ఇద్దరం కలిసి ఆ వ్యక్తి చేతులను గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పి, తపంచాను లాగేసుకున్నాం. దీంతో అచేతనుడైన ఆ వ్యక్తి వెంట తెచ్చుకున్న తాళ్లతో మమ్మల్ని కట్టేసేందుకు ప్రయత్నించగా, ఎదురుతిరిగాం. దాదాపు 20 నిమిషాల సేపు ఘర్షణ జరిగింది. చివరకు ఆ వ్యక్తి పారిపోయే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని బలవంతంగా తోసుకుంటూ బయటకు వచ్చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు మేము ఎంతగానో వెంబడించాం. ఆ వ్యక్తి పారిపోయాడని తెలుసుకుని కిచెన్ లో ఉన్న మరో వ్యక్తి ఎక్కడ దొరికిపోతాడో అని ఆందోళనపడ్డాం. అతను కూడా పారిపోయేందుకు కత్తితో బెదిరిస్తూ బయటకు వచ్చాడు. మా అరుపులకు ఈ లోగా స్థానికులు రావడంతో అతన్ని పట్టుకోగలిగాం. తెలిసిన వారే అయ్యుంటారని మేం వారు ధరించిన హెల్మెట్, మాస్క్‌ను తీసేయడంతో వారెవరో కనిపెట్టగలిగాం. కిందటేడాది దీపావళి సమయంలో పది రోజులపాటు మా ఇంటి క్లీనింగ్ విషయంలో ఓ ఏజెన్సీని సంప్రదిస్తే, వారు పంపించిన వ్యక్తులే వీళ్లు. మా ఇంటిని క్లీన్ చేసే సమయంలో ఏయే వస్తువులు ఎక్కడ ఉన్నాయో గమనించి, ఇంట్లో ఆడవాళ్లం మాత్రమే ఉండే సమయం చూసి, ఇలా దొంగతనం చేయడానికి ప్లాన్ చేసుకున్నారని తెలిసింది. మేం ఎదురు తిరగడంతో వచ్చిన పని గురించి కాకుండా మేము తమ ముఖాలను చూడకుండా కాపాడుకునేందుకే ఎక్కువ ప్రయత్నం చేశారు. ఆ ధైర్యం ఎలా వచ్చిందంటే.. గతంలో ఐదేళ్లు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాను. రోజూ జిమ్‌కు వెళ్తుంటాను. మార్షల్ ఆర్ట్స్‌పై కూడా అవగాహన ఉంది. అవే నన్ను ధైర్యంగా ఉండేలా, సాహసం చూపేలా చేశాయి. ఎదురొచ్చిన విపత్తు నుంచి కాపాడేలా చేశాయి. ఒక తపంచా, రెండు కత్తులు, తాళ్ల సహాయంతో వారు మమ్ముల్ని లొంగదీసుకునేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. వారి ప్రతి చర్యను తిప్పికొట్టగాలిగామంటే బాక్సింగ్, ఫిట్నెస్లే కారణమని కచ్చితంగా చెప్పగలను’’ అని తామ ఎదుర్కొన్న సంఘటనను వివరించారు అమిత. ఈ తల్లీకూతుళ్లు దుండగులను ధైర్యంగా ఎదుర్కొన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన తర్వాత అమిత, ఆమె భర్త, స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. డీసీపీ ప్రశంసలు.. సన్మానం.. అమిత, ఆమె కుమార్తె బాబీ ఇద్దరూ చూపిన ధైర్యసాహసాలు ఆదర్శప్రాయం అని నార్త్‌జోన్ డీసీపీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. బేగంపేట పైగా కాలనీలోని అమిత నివాసానికి నేరుగా వచ్చిన డీసీపీ అమితతో పాటు ఆమె కుమార్తెనూ ప్రశంసించి, శాలువాతో సత్కరించారు. మైనర్ బాలిక అయినా ఆమె చూపిన తెగువ ఎంతో అభినందనీయమన్నారు. ఆత్మరక్షణకై మెలకువలు అవసరం మహిళలు ఆత్మరక్షణ దిశగా మెలకువలను నేర్చుకోవాలి. ఇప్పుడు నా జీవితంలో ఎదురైన అనుభవం లాగా ఎవరి జీవితాల్లోనూ రాకూడదని కోరుకుంటాను. ఒకవేళ వస్తే మాత్రం అందుకు సిద్ధంగా ఉండాలి. ధైర్యంగా ముందడుగు వేయాలి. – అమిత – కోట కృష్ణారావు, సాక్షి, హైదరాబాద్ -
సందడిగా రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోమ్’
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం విజయవాడలోని రాజ్‌భవన్ లో ఎట్ హోమ్ కార్యక్రమం సందడిగా జరిగింది. గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ రాష్ట్రంలోని ప్రముఖులకు రాజ్‌భవన్‌లో తేనీటి విందు ఇచ్చారు. ఈ విందుకు సీఎం వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, గుడియా ఠాకూర్ దంపతులతోపాటు వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ భారతి దంపతులకు గవర్నర్ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం జాతీయ గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, వైఎస్ భారతి దంపతులు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ దంపతులు వివిధ అంశాలపై కొద్దిసేపు సంభాíÙంచుకున్నారు. రాజ్‌భవన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన డిజిటల్ స్క్రీన్ మీద ప్రదర్శించిన దేశ స్వాతంత్య్ర పోరాట చిత్రాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అతిథులు అందరి వద్దకు వెళ్లి ఆప్యాయంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు జోగి రమేశ్, ఆర్ కే రోజా, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాసరావు, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్వాతంత్య్ర సమర యోధులు, పద్మ అవార్డు గ్రహీతలు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు, ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు. కాగా, ప్రతిపక్ష నేత నారా చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. -
దేశవ్యాప్తంగా పెరుగుతున్న హోం థియేటర్ ట్రెండ్
భారీ తెర.. 4కే నాణ్యతతో దృశ్యాలు.. నలువైపుల నుంచి ప్రతిధ్వనించే సరౌండ్ సౌండ్ సాంకేతికత.. చీకటి పరుచుకున్న పెద్ద హాల్లో చల్లగా తాకే ఏసీ గాలి... ఒకేసారి వందలాది మందితో కలసి సౌకర్యవంతమైన సీట్లలో కూర్చొని చూసే వీలు.. దీనికితోడు ఈలలు, చప్పట్లతో హోరెత్తించే అభిమానులు... ఇదీ మల్టిప్లెక్స్‌లు లేదా థియేటర్లలో సినీ వీక్షకులకు కలిగే అనుభూతి. మరి ఇదే భారీతనం ఇంట్లోనే లభిస్తే..! అవును.. ప్రజలు ఇప్పుడు క్రమంగా థియేటర్‌ను ఇంటికే తెచ్చేసుకుంటున్నారు. ఈ హోం థియేటర్ ట్రెండ్ దేశవ్యాప్తంగా చిన్న పట్టణాలకూ పాకుతోంది. – సాక్షి, హైదరాబాద్ మార్కెట్లో భారీ తెరల టీవీలు అందుబాటులో ఉన్నప్పటికీ ఆడియో నాణ్యత విషయంలో పరిమితులు నెలకొన్నాయి. కానీ అదే హోం థియేటర్లో ఇటువంటి అడ్డంకులు ఏవీ ఉండవు. నచి్చన సైజులో స్క్రీన్, ఖరీదైన సౌండ్ సిస్టంను ఏర్పాటు చేసుకొనే వెసులుబాటు ఉంటోంది. దీనికితోడు నచి్చన సమయంలో కుటుంబ సభ్యులు, స్నేహితుల మధ్య సరదాగా గడుపుతూ థియేటర్ ముందు కాలక్షేపం చేసే సౌలభ్యం కలుగుతోంది. ఇక అనుభూతి అంటారా.. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు.. మీరు ఖర్చు చేసినదాన్నిబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ మారుతుంది. పెరిగిన డిమాండ్.. మూడు గదుల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న అపార్ట్మెంట్లు, విల్లాల్లో నిర్మాణ సంస్థలు సైతం ప్రత్యేకంగా హోం థియేటర్ కోసం ఏర్పాట్లు చేస్తున్నాయంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థం చేసుకోవచ్చు. ఏటా భారత్‌లో సుమారు 1,25,000 హోం థియేటర్లు ఏర్పాటవుతుండటం విశేషం. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 5,000 యూనిట్లుగా ఉంటోంది. ఓటీటీల రాకతో...: దేశంలో ఓటీటీలకు పెద్దగా ఆదరణ లేనప్పుడు హోం థియేటర్ విభాగం వృద్ధి కేవలం 20 శాతంగానే ఉండేది. కరోనా మహమ్మారి వ్యాప్తి తర్వాత ఏకంగా ఏటా 50 శాతం వృద్ధి నమోదవుతోంది. ఇప్పుడు స్థానిక భాషల్లోనూ ఓటీటీల్లో కంటెంట్ ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. హోం థియేటర్లో సినిమాలను 50 శాతం మంది చూస్తుంటే స్పోర్ట్స్‌ను 25 శాతం, వెబ్ సిరీస్‌లను 25 శాతం మంది వీక్షిస్తున్నారట. ఖర్చు ఎంతంటే..: మెట్రో, ప్రథమ శ్రేణి నగరాల్లో సంపన్నులు 15–30 సీట్ల సామర్థ్యంగల లగ్జరీ హోం థియేటర్లను కోరుకుంటున్నారు. ఇందుకోసం రూ. 50 లక్షలు మొదలుకొని రూ. 3 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈ విభాగం వాటా 5 శాతం ఉంటోంది. అలాగే 6–12 సీట్ల సామర్థ్యం ఉన్న హోం థియేటర్ల వాటా 25 శాతంగా ఉంది. వాటికి అయ్యే వ్యయం రూ. 15–50 లక్షల శ్రేణిలో ఉంది. ఇక ఎకానమీ విభాగంలో రూ. 5–15 లక్షల వ్యయంలో 4–10 సీట్లతో హోం థియేటర్లను ప్రజలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రూ.7 కోట్ల ఖరీదు చేసే స్పీకర్లు.. ప్రస్తుతం డాల్బీ అటా్మస్, ఆరో 3డీ, డీటీఎస్ ఎక్స్ ఆడియో ఫార్మాట్స్ ఉన్నాయి. హోం థియేటర్ కోసం ఇళ్లలో స్క్రీన్ తప్పనిసరి కాదు. కానీ థియేటర్ ఫీల్ కావాలంటే మాత్రం స్క్రీన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. లేజర్ ప్రొజెక్టర్ల వైపు మార్కెట్ మళ్లుతోంది. వాటి ధర రూ. 2.5 లక్షలు మొదలుకొని రూ. 1.5 కోట్ల వరకు ఉంది. మంచి స్పీకర్లు రూ. 50 వేల నుంచి రూ. 2 కోట్ల వరకు దేశంలో లభిస్తున్నాయి. జర్మనీ బ్రాండ్ అయిన టైడల్ ఆడియో రెండు స్పీకర్ల ధర రూ. 7 కోట్ల వరకు ఉంది. ఆంప్లిఫయర్ ధర రూ. 1.5–20 లక్షలు, ప్రాసెసర్ ధర రూ. 50 వేలు మొదలుకొని రూ. 35 లక్షల దాకా పలుకుతోంది. అకౌస్టిక్స్ కోసం వాడే మెటీరియల్నుబట్టి థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఆధారపడి ఉంటుంది. కరోనా తర్వాత పెరిగిన ప్రాధాన్యం కరోనా వ్యాప్తి తర్వాత ప్రజలు ఎంటర్టైన్మెంట్కు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. కాబట్టే హోం థియేటర్లకు డిమాండ్ పెరిగింది. ప్రైవసీ కోరుకొనే వాళ్లకు హోం థియేటర్ చక్కని పరిష్కారం. సంప్రదాయ థియేటర్‌ను మించి హోం థియేటర్ ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. ఆడియో క్వాలిటీ 100 శాతంపైగా మెరుగ్గా ఉంటుంది. నీటి తుంపర, సీటు కదలడం వంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సైతం ఏర్పాటు చేసుకోవచ్చు. మేము ఇప్పటివరకు 2 వేలకుపైగా హోం థియేటర్లను ఏర్పాటు చేశాం. – ముడిమెల వెంకట శేషారెడ్డి, ఎండీ, వెక్టర్ సిస్టమ్స్ -
దేశానికే ఆదర్శంగా జగనన్న కాలనీల్లో ఇంధన పొదుపు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో పేదల కోసం నిర్మిస్తున్న గృహాల్లో ఇంధన సామర్థ్య చర్యలను దేశానికే రోల్ మోడల్‌గా అమలు చేయనున్నట్లు ఏపీ గృహనిర్మాణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్ తెలిపారు. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) సీఈవో విశాల్ కపూర్ తరఫున సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు అనిమేష్ మిశ్రా, నితిన్భట్, సావిత్రిసింగ్, పవన్‌లు అజయ్ జైన్‌ను కలిసినట్లు ఈఈఎస్ఎల్ దక్షిణాది రాష్ట్రాల సలహాదారు ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఆయన ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం... హౌసింగ్ ఎండీ లక్ష్మీశా, జేడీ శివప్రసాద్, హౌసింగ్ డిపార్ట్మెంట్లో ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్ గురించి ఈఈఎస్ఎల్ అధికారులకు వివరించారు. అజయ్ జైన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈఈఎస్ఎల్, కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అతిపెద్దదైన ఇంధన సామర్థ్య కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభించనుందని తెలి పారు. సీఎం జగన్ సూచన మేరకు వైఎస్సార్–జగ నన్న కాలనీల్లోని ఇళ్లకు అత్యంత నాణ్యమైన స్టార్ రేటెడ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ పరికరాలను గృహనిర్మాణశాఖ ఆధ్వర్యంలోనే ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అందించనుందని తెలిపారు. ప్రతి ఇంటికి 4 ఎల్ఈడీ బల్బులు, 2 ఎల్ఈడీ ట్యూబ్‌లైట్లు, 2 ఎనర్జీ ఎఫిషియెన్సీ బీఎల్డీసీ ఫ్యాన్లను మార్కెట్ ధర కన్నా తక్కువకు ఈఈఎస్ఎల్ సహకారంతో సమకూర్చనున్నట్లు చెప్పారు. అయితే ఇది స్వచ్చందమేనని, లబ్ధిదారులు తప్పనిసరిగా ఈ పరికరాలు తీసుకోవాలని లేదన్నారు. ఈ పరికరాలను వినియో గించడం వల్ల ప్రతి ఇంట్లో ఏటా 734 యూనిట్ల ఇంధనం ఆదా అవుతుందని ఈఈఎస్ ఎల్ అంచనా వేసిందని తెలిపారు. దాని ప్రకారం ఫేజ్–1లోని 15.6 లక్షల ఇళ్లకు రూ.352 కోట్ల వార్షిక ఇంధనం ఆదా అవుతుందని అజయ్ జైన్ వివరించారు. -
ఎంపీ ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే సామాన్యుడి పరిస్థితేంటి?
సాక్షి, హైదరాబాద్: నాలుగు పర్యాయాలు ఎంపీ అయిన తన ఇంటిపైనే రాళ్ల దాడి జరిగితే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. సోమవారం హైదరాబాద్ దార్సుసలాంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఢిల్లీలోని తన ఇంటిపై రాళ్ల దాడి జరగడంపై తీవ్రంగా మండిపడ్డారు. ఒక వైపు ముస్లింల ఇళ్లపై బుల్డోజర్లు ప్రయోగిస్తూనే, మరోవైపు ఎంపీ ఇంటిపై రాళ్లు రువ్వుతున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్డోజర్లతో కూల్చివేతలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయినా రాళ్ల దాడులకు, తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదన్నారు. ఇలాంటి ఘటన బీజేపీ నేత ఇంటిపై జరిగితే స్పందన మరోలా ఉండేదని ఒవైసీ అన్నారు. దేశంలో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ నోరు మెదపడం లేదని, కనీసం స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలోనైనా స్పందిస్తారా? కనీసం ఖండిస్తారా? అని ప్రశ్నించారు. ప్రధానమంత్రి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్ ఎక్కడ ఉంది? అంటూ నిలదీశారు. -
ఇంట్లో ఎక్కువ డబ్బు పెట్టుకుంటున్నారా.. ఏమవుతుందో తెలుసా?
దేశంలో ప్రస్తుతం డిజిటల్ లావాదేవీలే ఎక్కువగా జరుగుతున్నాయి. అయినప్పటికీ చాలా మంది ఇప్పటికీ డబ్బును బ్యాంకుల్లో కాకుండా ఇంట్లోనే పెట్టుకుంటున్నారు. ఇంట్లో ఎంత డబ్బు నిల్వ ఉంచవచ్చనే దానిపై పరిమితులు ఉన్నాయి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఇంట్లో నిల్వ చేసే డబ్బుపై ఎలాంటి పరిమితి లేదు. ఇదీ చదవండి: గ్యాస్ వినియోగదారులకు ఊరట.. ధరల పరిమితిపై కేంద్రం పరిశీలన! అయితే ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేసినప్పుడు మాత్రం ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో లెక్క చెప్పాలి. దానికి సంబంధించిన పత్రాలు సమర్పించాలి. ఆ డబ్బు లెక్కలోకి రానిదై ఉండకూడదు. ఇంట్లో ఉంచిన డబ్బుకు పత్రాలు సరిపోలకపోతే ఆదాయపు పన్ను అధికారులు మొత్తం డబ్బుపై 137 శాతం వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో లెక్కలోకిరాని ఆ డబ్బును స్వాధీనం చేసుకోవచ్చు కూడా. ఇదీ చదవండి: Physics Wallah Viral Video: బోరుమన్న ఫిజిక్స్ వాలా మాజీ టీచర్లు! నాటకం బాగుందన్న నెటిజన్లు! నిబంధనలు ఏం చెబుతున్నాయి? అటువంటి జరిమానాలు పడకూడదంటే నగదుకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ రూపొందించిన నియమాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఏ వ్యక్తి అయినా ఏదైనా రుణం లేదా డిపాజిట్ రూ. 20,000లకు మించి నగదు రూపంలో తీసుకునేందుకు వీలు లేదు.ఈ నిబంధన ఆస్తి లావాదేవీలకు కూడా వర్తిస్తుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరిగితే దానికి సంబంధించి లెక్కా పత్రాలు గనుక లేకపోతే ఐటీ అధికారులు జరిమానా విధిస్తారు. ఒకేసారి రూ. 50,000లకు మించి డిపాజిట్ లేదా విత్‌డ్రా చేసేటప్పుడు పాన్ నంబర్లు, ఆధార్, ఇతర వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఆదేశాలు ఉన్నాయి. ఇదీ చదవండి: Get 1 Electric Scooter: రూ.38 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. భారీ డిస్కౌంట్! ఇక ఆస్తుల అమ్మకం లేదా కొనుగోలుకు సంబంధించి రూ. 30 లక్షల కంటే ఎక్కువ మొత్తంలో నగదు రూపంలో చెల్లించినా, తీసుకున్నా విచారణకు లోబడి ఉండాల్సి ఉంటుంది. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌ని ఉపయోగించి ఒకేసారి లక్ష రూపాయల కంటే ఎక్కువ లావాదేవీలు చేసినా విచారణ ఉంటుంది. -
ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ
బనశంకరి: బెంగళూరులో ఇంట్లోనే డ్రగ్స్ ఫ్యాక్టరీ పెట్టిన నైజీరియన్‌ని సీసీబీ పోలీసులు అరెస్టు చేసి రూ.2 కోట్ల విలువచేసే 4 కేజీల ఎండీఎంఏ క్రిస్టల్ (సింథటిక్ డ్రగ్స్), డ్రగ్స్ తయారీకి వాడే రసాయనాలను సీజ్ చేశారు. నిందితుడు డేవిడ్ జోమలవే అని పోలీసులు తెలిపారు. 2018లో డేవిడ్ భారత్‌కు చేరుకుని సోదరునితో కలిసి డ్రగ్స్ కార్యకలాపాల్లో నిమగ్నమయ్యాడు. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి బెంగళూరులోని ఎల్రక్టానిక్ సిటీ వద్ద గల చాముండీలేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నాడు. ఒక ఫ్యాక్ట రీలో పనిచేస్తున్నట్లు ఇంటి యజమానికి చెప్పేవా డు. ఆ తరువాత డ్రగ్స్ తయారీకి ఉపయోగించే ముడి రసాయనాలు, అలాగే ఉపకరణాలను ఆన్లైన్లో కొనుగోలు చేసి ఇంట్లోనే ఉత్పత్తిని ప్రారంభించాడు. ఎండీఎంఏ (ఎక్స్టసీ) డ్రగ్స్ తయారు చేసి విదేశాలకు పంపుతూ భారీగా డబ్బు సంపాదించినట్లు పోలీస్‌కమిషనర్ కమల్‌పంత్ తెలిపారు. బూట్ల కింద దాచి స్మగ్లింగ్ బూట్ల కింది భాగంలో ఎండీఎంఏ క్రిస్టల్స్‌ను దాచిపెట్టి కొరియర్ ద్వారా న్యూజిల్యాండ్, ఆ్రస్టేలియాలతో పాటు వివిద దేశాలకు సరఫరా చేసేవాడు. కస్టమర్లు ఇచి్చన డబ్బును ఢిల్లీలో ఉన్న తన సోదరుని బ్యాంక్ అకౌంట్లో జమచేయించుకునే వాడని పోలీసులు తెలిపారు. ఇతడు నైజీరియన్ కాగా, ఉగాండా, మొజాంబిక్ దేశాల పాస్‌పోర్టును కలిగి ఉన్నాడు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఇంట్లో వాకింగ్‌కు గిన్నిస్ రికార్డు!
లండన్: బరువు తగ్గడం కోసం ఇంట్లో వాకింగ్ చేస్తూవచ్చిన 70 ఏళ్ల పెద్దాయనకు తాను ప్రపంచ రికార్డు నెలకొల్పినట్లు డౌటు వచ్చింది. అనుమానం వచ్చిందే తడవు వెంటనే గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు లేఖ రాశాడు. ఆయన రికార్డును ప్రస్తుతం గిన్నిస్ బుక్ పరిశీలిస్తోంది. వింటుంటే వింతగా ఉందా! కానీ ఇదే నిజం. ఐర్లాండ్‌కు చెందిన భారతీయ సంతతి ఇంజనీర్ వినోద్ బజాజ్ తాజాగా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌కు లేఖ రాశారు. తాను 1500 రోజుల్లో భూమి చుట్టుకొలతకు సమానమైన 40,075 కిలోమీటర్ల దూరం నడిచానని చెప్పుకొచ్చారు. తన నడకను లెక్కగట్టేందుకు ఎలక్ట్రానిక్ డివైజ్‌ను వాడానని సాక్ష్యం చూపుతున్నారు. 2016లో బరువు తగ్గే ఉద్దేశ్యంతో వాకింగ్ ఆరంభించినట్లు ఆయన చెప్పారు. క్రమంగా ఇది ఒక అలవాటుగా మారిందన్నారు. తొలి ఏడాది పూర్తయ్యేసరికి 7600 కిలోమీటర్ల దూరం పూర్తి చేసినట్లు పేసర్ ట్రాకర్ యాప్ చూపిందని చెప్పారు. రెండో ఏడాదికి తన నడక 15200 కిలోమీటర్లను దాటిందన్నారు. ఇది చంద్రుడి చుట్టుకొలత కన్నా ఎక్కువ. ఈ ఏడాది సెప్టెంబర్ 21కి భూ చుట్టుకొలతకు సమానమైన దూరం తాను నడిచినట్లు నమోదయిందని తెలిపారు. ఇందుకు మొత్తం 1496 రోజులు పట్టిందన్నారు. చెన్నై నుంచి వినోద్ 1975లో స్కాట్లాండ్ వచ్చారు. తర్వాత ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. -
పండుగలను ఇళ్లలోనే జరుపుకోండి
సాక్షి, హైదరాబాద్: జన సమూహాలు లేకుండా వినాయకచవితి ఉత్సవాలతోపా టు మొహర్రంను ఎవరి ఇం ట్లో వారే నిర్వహించుకోవాలని, సామూహిక నిమజ్జనా లు, ప్రార్థనలు వద్దని ప్రజలకు అటవీ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. కరోనా నేపథ్యంలో ఈ రెండు పండుగలను నిరాడంబరం గా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నా రు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆదివారం మంత్రి తన క్యాంప్ కా ర్యాలయం నుంచి మీడియా ద్వారా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కరోనా నిబంధన లను ప్రజలు తప్పకుండా పాటించాలని, వ్యక్తుల మధ్య భౌతికదూరం పాటించాలని, మాస్కులు తప్పక ధరించాలని, ఈ నిబంధనలను పాటిస్తూ ప్రజలు పండుగలు జరుపుకోవాలని కోరారు. -
ఇళ్ల వద్దే శుక్రవారం నమాజ్
సాక్షి, హైదరాబాద్: కరోనా నియంత్రణ కోçసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో ముస్లింలు శుక్రవారం ప్రార్థనలను ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ వక్ఫ్‌బోర్డు సీఈఓ హమీద్ ఖాన్ ఆదేశాలు జారీ చేశారు. ఐదుగురి కంటే ఎక్కువ మంది గూమికూడవద్దని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాల మేరకు మసీదుల్లో జరిగే శుక్రవారం నమాజులో ఐదుగురు మాత్రమే పాల్గొనాలని గురువారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. మసీదులు శుక్రవారం నమాజుకు నోచుకోని పరిస్థితి ఉత్పన్నం కావద్దనే ఈ సడలింపునిస్తున్నామన్నారు. ముస్లింలందరూ ఇళ్ల వద్దే నమాజు చదువుకోవాలని, శుక్రవారం రోజు కూడా మసీదుకు రావొద్దని హైదరాబాద్‌లోని జామియా నిజామియా ఇస్లామిక్ వర్సిటీ ఉపకులపతి ఫత్వా జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా వక్ఫ్ బోర్డు సీఈఓ గుర్తు చేశారు. ఈ ఆదేశాలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ ఆడిటర్లకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ ఉత్తర్వులను మసీదు కమిటీలకు చేరవేయాలని కోరారు. -
తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం
సాక్షి, హైదరాబాద్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ సౌందరరాజన్ తమిళిసై ఆదివారం రాజ్‌భవన్ లో ఎట్ హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆనవాయితీగా జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీఆర్ఎస్ నాయకులు కేకే, నామా, సంతోష్ రావు, నాయిని నర్సింహారెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, టీటీడీపీ అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. నాయకులు, అధికారులు, ప్రముఖులతో ఈ కార్యక్రమం వైభవంగా సాగుతోంది. -
రాష్ట్రపతి నిలయంలో ఎట్‌హోమ్
సాక్షి, హైదరాబాద్: శీతాకాల విడిది కో సం ఈ నెల 20న హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శనివారం తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్‌హోం’కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో గవర్నర్ తమిళిసై, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొన్నారు. ఎట్‌హోం కార్యక్రమానికి వచ్చిన అతిథులకు రాష్ట్రపతి కోవింద్ దంపతులు అభివాదం చేసి పేరు పేరునా పలకరించారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, పువ్వాడ అజయ్, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కార్యక్రమానికి హాజరయ్యారు. మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులను సీఎం కేసీఆర్ రాష్ట్రపతి కోవింద్‌కు పరిచయం చేశారు. ఈ సందర్భంగా వారంతా రాష్ట్రపతి దంపతులతో గ్రూప్ ఫొటో దిగారు. -
రాష్ట్రపతి భవన్లో ఎట్‌హోం కార్యక్రమం
-
హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోం కార్యక్రమం
-
నేటి నుంచి ఢిల్లీలో ఇళ్ల వద్దకే 40 సేవలు
ఢిల్లీ: 40 ప్రభుత్వ సేవలను ప్రజల ఇళ్లవద్దకే సిబ్బంది వచ్చి అందించే కార్యక్రమాన్ని ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోమవారం ప్రారంభించనుంది. వివాహ, కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, కొత్త నీటి కనెక్షన్, రేషన్ కార్డు, వాహనాల ఆర్సీల్లో చిరునామా మార్పులు తదితర సేవలను ఇకపై ఢిల్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లకుండా తమ ఇంటి వద్దనే పొందగలుగుతారు. అయితే ఇంటివద్దనే ఈ సేవలను పొందేందుకు ప్రజలు సాధారణ రుసుము కన్నా 50 రూపాయలు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. -
ఆహ్లాదకరంగా ఎట్ హోం..
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో బుధవారం సాయంత్రం ఎట్‌హోం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆహ్లాదకర వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజకీయ నేతలు, న్యాయాధిపతులు, అధికారులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు ఇచ్చిన ఈ తేనీటి విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ ఉప ముఖ్యమంత్రి ఎన్. చినరాజప్ప, హైకోర్టు చీఫ్ జస్టిస్ టి.బి.రాధాకృష్ణన్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, స్పీకర్ ఎస్.మధుసూదనాచారి పాల్గొన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కేశవరావు, డి.శ్రీనివాస్, సుజనా చౌదరి, బి.వినోద్‌కుమార్, మల్లారెడ్డి, విశ్వేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రభాకర్ హాజరయ్యారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్సీలు, సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వివిధ రంగాల ప్రముఖులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. -
దటీజ్ కోవింద్! ఫ్యామిలీని సైతం పక్కనపెట్టారు..
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖులకు పరిచయస్తులు కావడమే అదేదో అర్హత అయినట్లు వెళ్లినచోటల్లా హడావిడిచేస్తుంటారు కొందరు. ఇక ఆ ప్రముఖుడి కుటుంబసభ్యులైతేనా.. పొందే వీఐపీ ట్రీట్మెంట్లు, చేసే రచ్చ ఏమాత్రం తక్కువ ఉండదు. అయితే అందరు ప్రముఖులూ అలా ఉండరు. అప్పనంగా ప్రత్యేక సేవలు చేయించుకోరు, కొన్నిసార్లు ప్రోటోకాల్ హక్కుల్ని సైతం వదిలేసుకుని హుందాగా ప్రవర్తిస్తుంటారు. ఉదాహరణకి మన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మొన్న రిపబ్లిక్‌డేనాడు వ్యవహరించిన తీరు చర్చనీయాంశమైంది. జాతీయ పండుగ సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి రాష్ట్రపతి తన కుటుంబసభ్యులను ఆహ్వానించలేదు. భార్య సవితను మాత్రమే కోవింద్ తనతో తీసుకెళ్లారు. ఎట్ హోమ్ అంటే ఏదో రాజకీయ వందనాలు, మొహమాటపు పలకరింపులు, అక్కరలేని ఆహ్వానితులతో జరగకూడదని రాష్ట్రపతి భావించారట. కార్యక్రమ ప్రాంగణం.. స్ఫూర్తిదాయక సమ్మేళనంలా, చక్కటి సృహృద్భావ వాతావరణంలో, ప్రేరణను ఇచ్చే, ప్రేరణ పొందే వ్యక్తులతో కళకళలాడాలని కోరుకున్నారట. ఈ క్రమంలోనే తన కుటుంబీకులను కూడా ఆహ్వానించవద్దని సిబ్బందిని ఆదేశించినట్లు తెలిసింది. గతేడాది 2వేల మంది.. ఈసారి 724 మాత్రమే : రిపబ్లిక్‌డే సందర్భంగా రాష్ట్రపతి భవన్లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి ఈ సారి అతితక్కువగా 724 మందిని మాత్రమే ఆహ్వానించారు. గతేడాది(2017లో) 2015 మందికి ఆహ్వానాలు వెళ్ళగా, అంతకుముందు(2016లో) 2,347 మందిని వేడుకకు పిలిచారు. ప్రణబ్ వారసుడిగా పదవి చేపట్టిన కోవింద్.. గతానికి భిన్నంగా అతికొద్దిమందిని, అదికూడా అరుదైన వ్యక్తులను భవన్‌లోకి ఆహ్వానించారు. ఆసియాన్ దేశాల అధినేతలు, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేబినెట్ మంత్రులు, ముఖ్య అధికారులు, అమరవీరుడు, ‘అశోకచక్ర’ జ్యోతి ప్రకాష్ నిరాలా కుటుంబం, అండర్-17 ఇండియన్ ఫుట్‌బాల్ టీమ్ సారథి అమర్జిత్ సింగ్, దళిత్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్(డిక్కీ) వ్యవస్థాపకుల్లో ఒకరైన మిలింద్ కాంబ్లే, సీబీఎస్ఈ, ఐఎస్సీ, యూపీఎస్సీ పరీక్షల్లో టాపర్లుగా నిలిచినవారు, క్రీడారంగంలో సత్తా చాటుకున్న ఫొగట్ సోదరీమణులు, వివిధ రంగాల్లో రాణిస్తున్న యువతీయువకులు రాష్ట్రపతి ఆహ్వానం అందుకున్నవారిలో ఉన్నారు. రాష్ట్రపతి కుమార్తె విధులు మారారు : రామ్నాథ్కోవింద్-సవిత దంపతులకు ఇద్దరు సంతానం. కుమార్తె స్వాతి, కుమారుడు ప్రశాంత్ కుమార్. వీరిద్దరూ ప్రచారానికి చాలా దూరంగా ఉంటారు. కోవింద్ రాష్ట్రపతి అయ్యేంత వరకు స్వాతి ఎయిర్ ఇండియాలో ఎయిర్ హోస్టెస్‌గా పనిచేశారు. అయితే, భద్రతాకారణాల వల్ల ఇప్పుడామె గ్రౌండ్ డ్యూటీకి మాత్రమే పరిమితమయ్యారు. కొవింద్ కుమారుడు ప్రశాంత్ కుమార్ ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోమ్’ కార్యక్రమం సందడిగా జరిగింది. శీతాకాల విడిదికి విచ్చేసిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ 3 రోజులుగా హైదరాబాద్‌లో బస చేస్తున్నారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్, సీఎంతో రాష్ట్రపతి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఈ కార్యక్ర మానికి వచ్చిన వారందరినీ రాష్ట్రపతి హృదయపూర్వకంగా పలకరించారు. అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, కౌన్సిల్ చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటల రాజేందర్, ఎంపీ దత్తాత్రేయ, సీఎల్పీ నేత జానారెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, పలువురు ఎంపీలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మతోపాటు ఉన్నతాధికారులు హాజరయ్యారు. రాజకీయ నేతలతోపాటు సామాజిక, క్రీడా తదితర రంగాల ప్రముఖులు, ప్రభుత్వ ఉన్నతాధికారులను రాష్ట్రపతి పలకరించారు. -
ఎట్ హోమ్‌లో.. ఇద్దరు చంద్రులు
ఎట్ హోమ్‌లో.. ఇద్దరు చంద్రులు ► గవర్నర్ సమక్షంలో గంటన్నరకు పైగా భేటీ ► విభజన అంశాలు, సమస్యలపై చర్చ! ► తొలిసారి రాజ్‌భవన్‌కు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ► హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాజ్‌భవన్‌లో తేనీటి విందు(ఎట్ హోమ్) ఇచ్చారు. సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం ఎన్.చంద్రబాబు నాయుడులతోపాటు ఇరు రాష్ట్రాల మంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ విందుకు హాజరయ్యారు. ఆహూతులందరికీ గవర్నర్ దంపతులు స్వయంగా స్వాగతం పలికారు. సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరున్నర వరకు ఉల్లాసంగా ఎట్‌హోం కార్యక్రమం జరిగింది. అనంతరం గవర్నర్ ఇద్దరు సీఎంలతో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు. అపరిష్కృత అంశాలపై చర్చ? రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు కావొస్తోంది. పునర్విభజన చట్టం మేరకు జరగాల్సిన వివిధ సంస్థల విభజన, ఉద్యోగుల విభజన వంటి అంశాలెన్నో ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. విభజన చట్టం 9, 10 షెడ్యూళ్లలోని పలు అంశాలు, కార్పొరేషన్లు, హైకోర్టు విభజన తదితర ప్రక్రియలేవీ ముందుకు సాగడం లేదు. ఈ నేపథ్యంలో గవర్నర్ భేటీలో సాగునీటి పంపకాలు సహా పలు అపరిష్కృత అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఈ భేటీ సానుకూలంగానే జరిగిందని, ఇక ముందు కూడా సీఎంల స్థాయిలో ఇలాంటి భేటీ జరపాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉల్లాసంగా కార్యక్రమం గవర్నర్ నరసింహన్ ప్రత్యేకంగా ఆహ్వానించిన మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్‌కల్యాణ్ కూడా ఎట్ హోమ్‌కి హాజరయ్యారు. కార్యక్రమంలో ఇద్దరు సీఎంలు గవర్నర్‌కు చెరోవైపు కూర్చున్నారు. మధ్యలో ఒకసారి గవర్నర్ లేచి వెళ్లగా కేసీఆర్ చంద్రబాబు పక్కన కూర్చుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి, పవన్ కల్యాణ్ ముచ్చటించుకుంటూ కనిపించారు. కార్యక్రమం ముగిశాక ఇద్దరు సీఎంలను తీసుకుని గవర్నర్ రాజ్‌భవన్‌లోకి వెళ్లగా.. సుమారు ఐదు నిమిషాల తర్వాత పవన్ కల్యాణ్ కూడా లోనికి వెళ్లారు. గవర్నర్‌తో పవన్ కొంతసేపు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎంల భేటీ అంశాలుగానీ, పవన్‌తో భేటీ విషయాలు కానీ బయటికి రాలేదు. ఎట్‌హోం కార్యక్రమంలో కేంద్రమంత్రులు దత్తాత్రేయ, సుజనా చౌదరి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర డిప్యూటీ సీఎంలు కడి యం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్, జగదీశ్వర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఈటల రాజేందర్, సీఎల్పీ నేత జానారెడ్డి, షబ్బీర్ అలీ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, ఎంపీలు కేశవరావు, డీఎస్, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్, బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర మాజీ సీఎస్ రాజీవ్‌శర్మ, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. -
'ఎట్ హోం'లో అరుదైన కలయికలు
-
కళలు మానసిక వికాసాన్ని న్ని పెంపొందిస్తాయి
అదనపు జేసీ నాగేంద్ర కరీంనగర్‌కల్చరల్: కళలు విద్యార్థులలో మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర అన్నారు. సోమవారం కళాభారతిలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళలతో విద్యార్థులలోని ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులోనే కాకుండా కళలలో కూడా ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాసాచారి, జిల్లా పౌరసంబంధాల అధికారి ప్రసాద్, ఆనందం తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్‌హోం.. కలెక్టర్ నీతూప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో ఎట్‌హోం ఏర్పాటు చేశారు. సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పుట్ట మధు, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎస్పీ జోయల్ డేవిస్, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక్, అదనపు జేసీ నాగేంద్ర, డీఆర్వో వీరబ్రహ్మయ్య, ఆర్డీఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేబీ.శర్మ బృందం ఆలపించిన శాస్త్రీయ, దేశభక్తి గీతాలు అలరించాయి. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో స్వాతంత్య్ర వేడుకలు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయం, డీఐజీ కార్యాలయం, ఆర్మ్డ్ రిజర్వ్ క్వార్టర్స్‌లలో సోమవారం ఎస్పీ జోయల్ డేవిస్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వర్రావు, ఆర్ఐలు గంగాధర్, శశిధర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు. పోలీసు శిక్షణ కేంద్రంలో... జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ) జరిగినస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇన్చార్జీ ప్రిన్సిపాల్ జిల్లా ఎస్పీ జోయల్‌డేవిస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ భీంరావు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రపతి భవన్లో ఎట్‌హోం కార్యక్రమం
-
ఎవరూ రాకున్నా.. నేనున్నా
‘ఎట్‌హోం’కు కేసీఆర్, చంద్రబాబు గైర్హాజరుపై గవర్నర్ తీవ్ర అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో శనివారం నిర్వహించిన ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు హాజరుకాలేదు. దీంతో గవర్నర్ నరసింహన్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఏటా ఆనవాయితీగా నిర్వహించే ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావడం సంప్రదాయంగా వస్తోంది. రాష్ట్ర విభజన తరువాత నరసింహన్ ఇరు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరిస్తున్నందువల్ల.. ఇరు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, చంద్రబాబులకు రాజ్‌భవన్ నుంచి ఆహ్వానం వెళ్లింది. సాధారణంగా సీఎం ఎంత బిజీగా ఉన్నా ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి హాజరవుతుంటారు. కానీ శనివారం కార్యక్రమానికి ఇద్దరు సీఎంలు రాకపోవడం చర్చనీయాంశమైంది. కార్యక్రమం ముగింపు దశలో గవర్నర్ కొద్దిసేపు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా సీఎంల గైర్హాజరుపై ప్రశ్నించగా... ‘‘ఎవరూ రాకున్నా.. నేనున్నాను. మీరున్నారు కదా. నేనుంటే చాలదా...’’ అని గవర్నర్ వ్యాఖ్యానించారు. ఆతిథ్యం ఇచ్చేది మీరే కాబట్టి మీరు ఎలాగూ ఉంటారు అని మీడియా ప్రతినిధులు అనగానే.. ‘‘వారి ద్దరు రాకపోవడానికి కారణం ఉండి ఉంటుంది. ఆ కారణాలు ఏంటో నాకు తెలియదు. చంద్రబాబు పట్టిసీమలో బిజీగా ఉన్నారు. కేసీఆర్ వేరే పనుల వల్ల బిజీగా ఉన్నారేమో! నేను ఇద్దరు సీఎంలకు ఆమోదయోగ్యమైన గవర్నర్‌ను. హైదరాబాద్‌లో ఉండే చివరి రోజు వరకు ఆమోదయోగ్యంగానే ఉంటా. సీఎంలిద్దరూ ఎందుకు రాలేదన్న విషయంలో కారణాలు వెదకొద్దు. ఓ నిర్ణయానికి రావొద్దు..’’ అని గవర్నర్ పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఒక చిన్న ఉదాహరణను ప్రస్తావించారు. ‘‘చిన్నప్పుడు మా మనవళ్లు అలిగేవారు. ఎందుకు అలిగేవారో తెలియదు. అలగడం మాత్రం నిజం. ఇప్పుడు ఇద్దరు సీఎంలు రానిది నిజం.. ఎందుకు రాలేదో మాత్రం తెలియద’’న్నారు. ఇద్దరు సీఎంలతో తన మనవళ్లు ఫొటో దిగుదామనుకున్నారని, వారు రాకపోవడంతో నిరుత్సాహానికి గురయ్యారని చెప్పారు. కాగా.. ‘ఎట్‌హోం’ కార్యక్రమానికి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. గవర్నర్ దంపతులు ప్రతీ టేబుల్ వద్దకు వెళ్లి అతిథులను పలకరించారు. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి దిలీప్ బి బొసాలే, మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, మంత్రులు నాయిని, లక్ష్మారెడ్డి, కేంద్ర మంత్రులు దత్తాత్రేయ, సుజనాచౌదరి, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్, షబ్బీర్ అలీ, పలువురు నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఇద్దరు సీఎంల గైర్హాజరుతో ‘ఎట్ హోం’ కార్యక్రమం పేలవంగా ముగిసింది. -
అనుష్కతో కలిసి విరాట్...
ముంబైలో దిగిన కోహ్లి స్వదేశానికి భారత క్రికెటర్లు ముంబై: ప్రపంచకప్ నుంచి నిష్ర్కమించిన భారత జట్టు శనివారం స్వదేశంలో అడుగుపెట్టింది. విరాట్ కోహ్లి తన స్వస్థలం ఢిల్లీ వెళ్లకుండా... అనుష్క శర్మతో కలిసి ముంబైలో అడుగుపెట్టాడు. చేతిలో చేయి వేసుకుని ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చారు. రోహిత్, రహానే, జడేజా, అక్షర్ పటేల్, టీమ్ డెరైక్టర్ రవిశాస్త్రి కూడా ముంబైలోనే దిగారు. ఇక కెప్టెన్ ధోని ఢిల్లీలో అడుగుపెట్టగా... మిగిలిన ఆటగాళ్లు కూడా రాత్రే భారత్‌కు చేరుకున్నారు. -
ఎట్ హోంలో చంద్రబాబు, కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు మరోసారి కలిశారు. రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమం ఇందుకు వేదికైంది. గవర్నర్ నరసింహన్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో పాటు స్పీకర్లు, మంత్రులు, డీజీపీలు, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, కేసీఆర్ పలు విషయాల గురించి చర్చంచుకున్నారు. చంద్రబాబు, కేసీఆర్.. గవర్నర్‌కు చెరో పక్కన ఆశీనులయ్యారు. ఇరు రాష్ట్రల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి గవర్నర్ చొరవజూపారు. ఈ కార్యక్రమం అనంతరం గవర్నర్.. చంద్రబాబు, కేసీఆర్‌లతో ప్రత్యేకంగా సమావేశమై పలు విషయాల గురించి చర్చించారు. -
‘ఎట్ హోం’లో మోడీ హవా..
న్యూఢిల్లీ: 68వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ శుక్రవారం రాష్ట్రపతిభవన్‌లో విందు ఇచ్చారు. మోఘల్ గార్డెన్స్‌లో ఎట్‌హోం పేరుతో ఇచ్చిన ఈ విందులో ప్రధానమంత్రి నరేంద్రమోడీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. రక్షణ వలయాన్ని పట్టించుకోకుండా మోడీ అతిథులను పలకరిస్తూ.. వారికి శుభాకాంక్షలు తెలిపారు. 63 ఏళ్ల నరేంద్రమోడీ ‘ఎట్‌హోం’ కార్యక్రమంలో పాల్గొనడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఎర్రకోటపై ప్రధానిగా మోడీ తొలి ప్రసంగాన్ని పలువురు అతిథులు కొనియాడారు. పలువురు మోడీ ఆటోగ్రాఫ్‌లు తీసుకునేందుకు ఆసక్తి చూపించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ దేశాభివృద్ధి కోసం పాటుపడాలని, ఈ లక్ష్యాన్ని సాధించాలంటే అందరి భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్సింగ్, బీజేపీ సీనియర్ నేత ఎల్కే అద్వానీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అరుణ్‌జైట్లీ, వివిధ దేశాల దౌత్యవేత్తలు, పలువురు వీవీఐపీలు పాల్గొన్నారు. -
ఇద్దరు ‘చంద్రు’ల ముచ్చట్లు
సాక్షి, హైదరాబాద్: నిత్యం పరస్పర విమర్శలతో హోరెత్తిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు మరోసారి చేతులు కలిపారు. సుమారు ముప్పావు గంటపాటు చర్చలు జరిపారు. స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకుని సాంప్రదాయంగా ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ శుక్రవారం ఏర్పాటు చేసిన ఎట్‌హోం కార్యక్రమం వీరికి చర్చావేదిక అయింది. వీవీఐపీలకు ఏర్పాటు చేసిన హాలులో ఇద్దరు సీఎంలు పరస్పరం పలకరించుకుని కరచాలనం చేసుకున్నారు. జస్టిస్ సుభాషణ్ రెడ్డి కొద్దిసేపు వారి మధ్య కూర్చున్నారు. గవర్నర్ కూడా ఆ హాలులోకి ప్రవేశించగానే ఇద్దరు సీఎంలు ఆయనకు చెరొక పక్కన కూర్చున్నారు. ఆయన సమక్షంలోనే వీరిద్దరూ సుమారు ఇరవై నిమిషాలకు పైగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో మంత్రులు, ఇతర ముఖ్యులు వారికి దగ్గరగా వెళ్లడానికి సాహసించలేదు. అయితే, వీరిద్దరి ముచ్చట్లపై వారు ఆసక్తి కనబరిచారు. ఎట్‌హోం కార్యక్రమం ముగిసిన తర్వాత జాతీయపతాకానికి గౌరవవందనం చేశారు. అటు నుంచి ఇద్దరు సీఎంలతో కలసి గవర్నర్ నివాసంలోకి వెళ్లారు. అక్కడ సుమారు 45 నిమిషాల పాటు ప్రత్యేకంగా చర్చలు జరిపారు. చంద్రబాబు, కేసీఆర్‌లు జరిపిన చర్చల వివరాలు ఇంకా తెలియరాలేదు. ఎంసెట్ అడ్మిషన్లు, నీటి పంపకాలు, కరెంటు సమస్యలు, పలు సంస్థల్లో విభజన సమస్యల వంటివాటిపై రెండు రాష్ట్రాల మధ్య తీవ్రమైన విభేదాలు, విమర్శలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో వారి మధ్య సామరస్యం కోసం ప్రయత్నిస్తానని గవర్నర్ గతంలోనేప్రకటించారు. ఈ మేరకు ఆయన చొరవ చూపినట్లు తెలుస్తోంది. అయితే, వీరి మధ్య ఏయే అంశాలు చర్చకు వచ్చాయి? ఏ నిర్ణయాలకు వచ్చారు అనే వివరాలు తెలియరాలేదు. కాగా, ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ చక్రపాణి, తెలంగాణ మండలి చైర్మన్ కె.స్వామిగౌడ్, రెండు రాష్ట్రాల స్పీకర్లు ఎస్.మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్‌రావు, మంత్రులు మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, పి.మహేందర్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, తెలంగాణ, ఆంధ్రా పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, ఎన్.రఘువీరా రెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత డి.శ్రీనివాస్, బీజేఎల్పీ నేత కె.లక్ష్మణ్, ఎంపీలు బండారు దత్తాత్రేయ, కె.కవిత, వీహెచ్, రాపోలు ఆనంద భాస్కర్, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. సాయంత్రం 5.30కు ప్రారంభమైన ఈ కార్యక్రమం 6.25కు ముగిసింది. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి)