కళలు మానసిక వికాసాన్ని న్ని పెంపొందిస్తాయి
Published Tue, Aug 16 2016 12:11 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
అదనపు జేసీ నాగేంద్ర
కరీంనగర్‌కల్చరల్: కళలు విద్యార్థులలో మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని అదనపు జాయింట్ కలెక్టర్ నాగేంద్ర అన్నారు. సోమవారం కళాభారతిలో స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కళలతో విద్యార్థులలోని ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చదువులోనే కాకుండా కళలలో కూడా ముందుండాలని సూచించారు. కార్యక్రమంలో డీఈవో శ్రీనివాసాచారి, జిల్లా పౌరసంబంధాల అధికారి ప్రసాద్, ఆనందం తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఎట్‌హోం..
కలెక్టర్ నీతూప్రసాద్ తన క్యాంపు కార్యాలయంలో ఎట్‌హోం ఏర్పాటు చేశారు. సాయంత్రం రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, పుట్ట మధు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎస్పీ జోయల్ డేవిస్, జగిత్యాల సబ్ కలెక్టర్ శశాంక్, అదనపు జేసీ నాగేంద్ర, డీఆర్‌వో వీరబ్రహ్మయ్య, ఆర్‌డీఓ చంద్రశేఖర్, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. కేబీ.శర్మ బృందం ఆలపించిన శాస్త్రీయ, దేశభక్తి గీతాలు అలరించాయి.
పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో స్వాతంత్య్ర వేడుకలు
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా పోలీసు కార్యాలయం, డీఐజీ కార్యాలయం, ఆర్మ్‌డ్ రిజర్వ్ క్వార్టర్స్‌లలో సోమవారం ఎస్పీ జోయల్ డేవిస్ జాతీయ పతకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కోటేశ్వర్‌రావు, ఆర్‌ఐలు గంగాధర్, శశిధర్, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
పోలీసు శిక్షణ కేంద్రంలో...
జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం(పీటీసీ) జరిగినస్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఇన్‌చార్జీ ప్రిన్సిపాల్ జిల్లా ఎస్పీ జోయల్‌డేవిస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ భీంరావు, డీఎస్పీ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
Advertisement