పార్లర్‌కి వెళ్లకుండా.. ఇంట్లోనే సింపుల్ చిట్కాతో ఇలా... | Say Good Bye To Parlour With These Homely Beauty Tips | Sakshi
Sakshi News home page

పార్లర్‌కి వెళ్లకుండా.. ఇంట్లోనే సింపుల్ చిట్కాతో ఇలా...

Published Sat, Mar 23 2024 9:20 AM | Last Updated on Sat, Mar 23 2024 9:20 AM

Say Good Bye To Parlour With These Homely Beauty Tips - Sakshi

పార్లర్‌లో ఫేషియల్‌తో పనిలేకుండా, ఖరీదైన క్రీములు కొనకుండా ముఖం చక్కగా మెరవాలంటే ఇంట్లోనే టొమాటో ఫేషియల్‌ను ప్రయత్నించండి. పెళ్లికూతురులా మెరిసిపోతారు.

  • టొమాటోను గుండ్రని ముక్కలుగా కోయాలి. ఒక ముక్కను  తీసుకుని పైన టీస్పూను పంచదార, టీస్పూను కాఫీ పొడి వేసి  ముఖంపైన అద్దాలి. తరువాత చేతులతో సున్నితంగా మర్దన చేసి కడిగేయాలి.
  • ఇప్పుడు మరో టొమాటో ముక్కపై టీస్పూను అలోవెరా జెల్‌ వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. ఈ మర్దన అయిన వెంటనే మరో టొమాటో ముక్కపై రెండు టీస్పూన్ల పసుపు వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి.
  • పసుపు పూర్తిగా ఆరాక నీటితో కడిగేసి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్‌ రాసుకోవాలి. ఈ టొమాటో ఫేషియల్‌లోని ప్రతి స్టెప్‌ను జాగ్రత్తగా అనుసరిస్తే ముఖం కాంతిమంతంగా మెరిసిపోతుంది.
  • అరటిపండు గుజ్జులో కొద్దిగా కొబ్బరినూనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత మర్దన చేసి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేయడమేగాక, చర్మానికి తేమనందిస్తుంది.

ఇవి చదవండి: ఈ గ్రామాల్లో.. భారీగా హోలి వేడుకలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement