parlour
-
నో బ్యూటీ పార్లర్.. నా అందం, ఆనందం రహస్యం అదే! నటి
ఈ విషయం వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. నీనా గుప్తాకు బ్యూటీ పార్లర్లకు వెళ్లే అలవాటు లేదు. ‘అవునా!! గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నవారు తరచూ పార్లర్ లకు వెళ్తుంటారు కదా! అందమే కదా అసలు ఎవరికైనా ఆనందం?’ అని మీరు అడిగి చూడండి... నీనా చెప్పే సమాధానం మిమ్మల్ని మరింతగా ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. ‘నా కూతురే నా ఆనందం‘ అంటారు నీనా!ఆనందం అందాన్నిస్తుంది. ఆ ఆనందం కూతురు మసాబా రూపంలో నీనా కళ్లెదుట ఉంది. ఇక ఆమెకు ఫేషియల్స్ ఎందుకు? పార్లర్లు ఎందుకు? నీనా వయసు 65. సింగిల్ మదర్‌కి స్ట్రెస్ ఉంటుంది. కూతురు ఉన్న సింగిల్ మదర్‌కి మరింత స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్, మరింత స్ట్రెస్‌లను మించిన మూడోస్ట్రెస్ కూడా ఉండేది నీనాకు. అదేమిటో అందరికీ తెలిసిందే. ఆమె కూతురి తండ్రి ఇండియన్ కాదు. 1980ల నాటి వెస్ట్ ఇండీస్ క్రికెట్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్. నీనా, రిచర్డ్స్కు పుట్టిన అమ్మాయే మసాబా. రిచర్డ్స్ కు అప్పటికే పెళ్లి అయి ఉండటంతో ఆయన్ని పెళ్లి చేసుకోకుండా, మసాబా పెరిగి పెద్దయ్యే వరకు – ఒంటరిగానే ఉండిపోయారు నీనా. ప్రస్తుతం మసాబా వయసు 35 ఏళ్లు. ఇప్పటికీమసాబానే నీనా కంటి వెలుగు. మసాబానే ఆమె అందం, ఆనందం. ‘ఎదుగుతున్న వయసులో నా కూతురి కోసం నేను రెండు పనులు ఎప్పటికీ చేయకూడదు అని ఒట్టు పెట్టుకున్నాను. ఒకటి: ఆమె చదువు కోసం ‘ఎవరినీ డబ్బు సాయం అడగకూడదు.’ రెండు : తండ్రి (దగ్గర) లేని పిల్లగా ఆమె కోసం ‘ఎవరి ఎమోషనల్ సపోర్టూ తీసుకోకూడదు.’ ఈ రెండిటిపై గట్టిగా నిలబడ్డాను. మనం డబ్బు, సపోర్ట్ అడగం అని తెలిస్తే ఎవరైనా ధైర్యంగా మన దగ్గరకు వస్తారు. మనమూ అంతే.. ఎవరి దగ్గరకైనా ధైర్యంగా వెళ్లగలం అని ‘బ్రట్ ఇండియా’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో కుషా కపిల్‌తో చెప్పారు నీనా గుప్తాకూతురు మాత్రమే కాదు, సింగిల్ మదర్‌గా తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూ రావటం కూడా నీనా అందానికి కారణం అయి ఉంటుంది -
Pets Spa: మేము నాటీ... మాకూ కావాలి బ్యూటీ! (ఫొటోలు)
-
పార్లర్‌కి వెళ్లకుండా.. ఇంట్లోనే సింపుల్ చిట్కాతో ఇలా...
పార్లర్లో ఫేషియల్‌తో పనిలేకుండా, ఖరీదైన క్రీములు కొనకుండా ముఖం చక్కగా మెరవాలంటే ఇంట్లోనే టొమాటో ఫేషియల్‌ను ప్రయత్నించండి. పెళ్లికూతురులా మెరిసిపోతారు. టొమాటోను గుండ్రని ముక్కలుగా కోయాలి. ఒక ముక్కను తీసుకుని పైన టీస్పూను పంచదార, టీస్పూను కాఫీ పొడి వేసి ముఖంపైన అద్దాలి. తరువాత చేతులతో సున్నితంగా మర్దన చేసి కడిగేయాలి. ఇప్పుడు మరో టొమాటో ముక్కపై టీస్పూను అలోవెరా జెల్ వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. ఈ మర్దన అయిన వెంటనే మరో టొమాటో ముక్కపై రెండు టీస్పూన్ల పసుపు వేసి ఐదు నిమిషాలు మర్దన చేయాలి. పసుపు పూర్తిగా ఆరాక నీటితో కడిగేసి, తడి లేకుండా తుడిచి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ టొమాటో ఫేషియల్‌లోని ప్రతి స్టెప్‌ను జాగ్రత్తగా అనుసరిస్తే ముఖం కాంతిమంతంగా మెరిసిపోతుంది. అరటిపండు గుజ్జులో కొద్దిగా కొబ్బరినూనె వేసి కలిపి ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత మర్దన చేసి నీటితో కడిగేయాలి. ఇది మంచి క్లెన్సర్‌గా పనిచేయడమేగాక, చర్మానికి తేమనందిస్తుంది. ఇవి చదవండి: ఈ గ్రామాల్లో.. భారీగా హోలి వేడుకలు -
ఉద్యోగాల ఎరచూపి యువతులను..
బెంగళూరు(బనశంకరి): మసాజ్‌పార్లర్ ముసుగులో హైటెక్ వేశ్యావాటిక నిర్వహిస్తున్న కేంద్రంపై ఇందిరానగర పోలీసులు దాడిచేసి ఓ మహిళతో సహా ఐదుగురిని అరెస్ట్ చేశారు. ఇందిరానగరలోని ఆరోమా స్టాఅండ్ సెలూన్ మసాజ్పార్లర్లో బాడీ టుబాడీ మసాజ్, హ్యాపీ ఎండింగ్, స్యాండ్విచ్ పేరుతో వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. జాసియా, చిత్రదుర్గకు చెందిన మహేశ్వరప్ప, హిమాయత్ ఉల్లా, రాణేశ్రాయ్, తమిళనాడుకు చెందిన వైదేశ్వరన్ను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 9 సెల్ఫోన్లు, రూ.20 వేల 250 నగదు స్వాధీనం చేసుకున్నారు. వేశ్యావాటికలో చిక్కుకున్న పశ్చిమబెంగాల్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నలుగురు యువతులను కాపాడారు. మసాజ్ పార్లర్ యజమాని మునీంద్రకుమార్ ఉద్యోగాల ఎరచూపి యువతులను రప్పించి వేశ్యావాటిక నిర్వహిస్తున్నట్లు విచారణలో వెలుగుచూసినట్లు పోలీసులు తెలిపారు. మునీంద్రకుమార్, సింగారవేలు, రవిలు పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కలబంద... పార్లర్‌ని ఇంటికి తెస్తుంది!
మార్కెట్లో కొత్త కాస్మొటిక్ వస్తే ప్రయత్నించి చూద్దామా అని మనసు లాగుతుంది. కానీ పడకపోతే మొత్తానికే మోసం వస్తుందేమో అన్న భయం వెనక్కి లాగుతుంది. అలాంటి భయాలేవీ పెట్టుకోకుండా వాడే నేచురల్ కాస్మొటిక్ ఒకటుంది. అదే కలబంద. ఇది బ్యూటీపార్లర్ని ఇంటికే తెస్తుంది. తేనె, పసుపు పాలు, అలొవేరాలను రుబ్బి ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది ఓట్స్‌ని పొడి చేసి, కలబంద రసం కలిపి ప్యాక్ వేసుకుంటే డెడ్స్కిన్ తొలగిపోతుంది కలబంద గుజ్జులో కీ రదోస రసం, రోజ్‌వాటర్ కలిపి ప్యాక్ వేసుకుంటే చర్మం మృదువ వువుతుంది ఎండకి చర్మం నల్లబడితే... కలబంద జిగురులో టొమాటో రసం కలిపి రాసుకుంటే నలుపు పోతుంది కలబంద గుజ్జులో నిమ్మరసం, ఖర్జూరం కలిపి వారానికోసారి ప్యాక్ వేసుకుంటే పొడిదనం పోయి చర్మం తేమగా ఉంటుంది. కలబంద రసంలో బాదం పొడి కలిపి ప్యాక్ వేసుకున్నా మంచిదే కలబంద గుజ్జులో తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి కలబంద జిగురులో తేనె, నిమ్మరసం, బాదం నూనె కలిపి వారానికోసారి ప్యాక్ వేసుకుంటే, వేసవిలో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.