సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి.. | Here Are Some Beauty Tips For Your Hair And Glowing Skin | Sakshi
Sakshi News home page

సమస్యతో బాధపడుతున్నారా..! అయితే ఇలా చేయండి..

Published Sat, Mar 2 2024 7:58 AM | Last Updated on Sat, Mar 2 2024 8:39 AM

Here Are Some Beauty Tips For Your Hair And Glowing Skin - Sakshi

ప్రతీరోజూ బిజీ బిజీగా గడుపుతున‍్న జీవితంలో మనం మన ఆరోగ్యాన్ని పట్టించుకోము. అందులో మన ముఖము, జుట్టుల గురించి అయితే అసలు ధ్యాసే ఉండదు. పలువురితో సాగుతున్న క్రమంలో వీటివలన ఎన్నో సమస్యలను ఎదుర్కుంటూ ఉంటాం. ఇతరులతో హేళనలను భరిస్తూ ఉంటాం. ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా ఈ అద్భుతమైన బ్యూటీ టిప్స్‌ మీకోసమే..!

పిగ్నెంటేషన్‌... కీరాతో కట్‌అరకప్పు కీరదోస గుజ్జు తీసుకుని అందులో కోడిగుడ్డులోని తెల్లసొన, చెంచా నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 20 నిమిషాల పాటు ఆరనిచ్చిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేయాలి. కీరదోస పిగ్మెంటేషన్‌  సమస్యను దూరం చేస్తుంది. దీనివల్ల ముఖంపైన ముడతలు, సన్నని చారలు వంటి సమస్యలు దూరం అవుతాయి.

బార్లీతో మేని మిలమిల
ఒక పాత్రలో బార్లీ గింజల పొడిని తీసుకుని అందులో కొద్దికొద్దిగా గోరువెచ్చటి నీళ్లు పోసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. పావుగంట తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచు చేస్తే.. మచ్చలు, మృత కణాలు తొలగిపోయి చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

మిరియాలతో చుండ్రుకు చెక్‌!
మిరియాలు ఆరోగ్యానికెంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు. అయితే ఆరోగ్యానికే కాదు జుట్టు సంరక్షణకు సైతం మిరియాలు ఉపయోగపడతాయి. ముఖ్యంగా చుండ్రు సమస్యను చాలా సులువుగా పోగొట్టే సత్తా మిరియాలకు ఉంది. ఇందుకోసం ఒక ఉల్లిపాయను తీసుకుని పొట్టు తీసి ముక్కలుగా కట్‌ చేసుకోవాలి. వీటిని మిక్సీజార్‌లో వేసి వీటితోపాటు టేబుల్‌ స్పూన్‌ నల్ల మిరియాలు వేసి మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్‌ చేసుకున్న మిశ్రమం నుంచి జ్యూస్‌ను సపరేట్‌ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్‌లో టేబుల్‌ స్పూన్‌ ఆవనూనె, టేబుల్‌ స్పూన్‌ అలోవెరా జెల్‌ వేసుకుని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. దీంతో ఒక హెయిర్‌ టానిక్‌ రెడీ అవుతుంది. ఈ టానిక్‌ను మాడుకు పట్టించి 10 నిమిషాల పాటు మసాజ్‌ చేసుకోవాలి. గంట తర్వాత మైల్డ్‌షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా చేస్తే ఎంత తీవ్రంగా ఉన్న చుండ్రు అయినా మాయం అవడంతోపాటు తెల్ల జుట్టు త్వరగా రాకుండా ఉంటుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

ఇవి చదవండి: మార్చి వచ్చింది.. బోండాం కొట్టు...

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement