డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.
ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది.
ఈ మూడే ఎందుకు..?
అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్‌లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు.
తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది.
పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్‌ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్.
ఈ ఫేస్ ప్యాక్ తయారీ..
అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్
పెరుగు: 1 టేబుల్ స్పూన్
తేనె : 1 టేబుల్ స్పూన్
ఈ మూడింటిని ఒక బౌల్‌లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది.
(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్‌నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!)
Comments
Please login to add a commentAdd a comment