Face pack
-
ప్రసవానంతర చర్మ సంరక్షణ కోసం..!
డిజైనర్, నటి మసాబా గుప్తా ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన చిట్కాలను నెటిజన్లతో షేర్ చేసుకుంటుంటారు. అలానే తాజాగా ప్రసవానంతర చర్మ సంరక్షణకు సంబంధించి.. కొన్ని ఆసక్తికర చిట్కాలను షేర్ చేశారు. నిజానికి ప్రసవానతరం చర్మం వదులుగా అయిపోయి..అందవిహీనంగా ఉంటుంది. మెడ వంటి బాగాల్లో ట్యాన్ పేరుకుపోయి ఒకవిధమైన గరుకుదనంతో ఉంటుంది. అలాంటప్పుడు నటి మసాబా చెప్పే ఈ చిట్కాలను పాటిస్తే సులభంగా కాంతివంతమైన మెరిసే చర్మాన్ని పొందొచ్చు. అదెలాగో చూద్దామా..!.ప్రసవానంతరం జీవితం అందంగా సాగిపోవాలంటే ఈ బ్యూటీఫుట్ చిట్కాలను తప్పనిసరిగా పాటించాలని చెబుతున్నారు మసాబా. అవిసె గింజలు ఆరోగ్యానికే కాదు అందానికి కూడా మంచిదని చెబుతోంది. ముఖ్యంగా ఈ అవిసె గింజలు, పెరుగు, తేనెతో కూడిన ఫేస్ ప్యాక్‌తో కాంతివంతమైన చర్మాన్ని ఈజీగా పొందొచ్చని అంటోంది. ఈ మూడే ఎందుకు..?అవిసె గింజల పొడి: దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది ముఖంపై ఉండే ఎరుపు ర్యాష్‌లను తగ్గించడం తోపాటు ఫ్రీ రాడికల్స్‌తో కూడా పోరాడుతోంది. ఇందులో ఉండే ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్ కంటెంట్ చర్మాన్ని హైడ్రేటెడ్‌గా చేసి, బొద్దుగా ఉండేలా చేస్తుంది. అలాగే మలినాలను తొలగించి చర్మా ఆకృతిని మెరుగుపరుస్తుంది. అందువల్లే దీన్ని ఎక్స్‌ఫోలియేటింగ్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. తేనె: ఇది తేమను లాక్ చేస్తుంది. చర్మం మృదువుగా చేసి, మొటిమలను నివారిస్తుంది. ముఖంపై ఉండే ఒక విధమైన చికాకుని తగ్గించేలా యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ముఖ్యంగా నిస్తేజమైన చర్మానికి పోషణనిచ్చి పునురుజ్జీవంప చేసి సహజమైన కాంతిని అందిస్తుంది. పెరుగు: ఇది లాక్టిక్ యాసిడ్‌తో నిండి ఉంటుంది. ముఖంపై ఉండే సున్నితమైన ఎక్స్ఫోలియంట్, మృతకణాలను తొలగించి చర్మానికి అద్భుతమైన మెరుపుని అందిస్తుంది. దీని ప్రోబయోటిక్స్ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. పోడి లేదా సున్నితమైన చర్మానికి ఇది బెస్ట్. ఈ ఫేస్ ప్యాక్ తయారీ..అవిసె గింజల పొడి: 1 టేబుల్ స్పూన్పెరుగు: 1 టేబుల్ స్పూన్ తేనె : 1 టేబుల్ స్పూన్ఈ మూడింటిని ఒక బౌల్లోకి తీసుకుని చక్కగా కలిపి ముఖం, మెడ భాగాల్లో సమానంగా అప్లై చేయాలి. ఇలా సుమారు 15 నుంచి 20 నిమషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో కడగండి. ఇక్కడ అవిసెగింజల పొడిని తాజాదనం కోల్పోకుండా మంచి డబ్బాలో నిల్వ చేసుకోవడం మంచిది. View this post on Instagram A post shared by Masaba 🤎 (@masabagupta)(చదవండి: శిఖర్ ధావన్ ఫిట్నెస్ సీక్రెట్ తెలిస్తే కంగుతినాల్సిందే..!) -
క్యారెట్‌తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా!
క్యారెట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగు , ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన బాడీలో విటమిన్ ‘ఏ’గా మారి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్లు జుట్టు కణాలను పునరుద్ధరించేందుకు ,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి ముఖ సౌందర్య పోషణలో క్యారెట్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం!క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...∙రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్‌ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది.క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది. -
బీట్రూట్- మిల్క్ ప్యాక్: మచ్చలు మాయం, గ్లోయింగ్ స్కిన్
ఎండాకాలంలో ముఖం, చర్మం సూర్యరశ్మికి గురికావడం వల్ల చాలా సమస్యలొస్తాయి.మొటిమలు ఎక్కువగా వస్తాయి. చర్మం నల్లబడుతుంది. సూర్యరశ్మికి ఎక్కువగా తిరగడం వల్ల చర్మ రంగు మారుతుంది. ఈ సమస్యని దూరం చేయాలంటే బీట్రూట్ క్రీమ్, ప్యాక్ హెల్ప్ చాలా సహాయ పడుతుంది. బీట్ రూట్ క్రీమ్ తొక్కతీసిన అరకప్పు బీట్రూట్ ముక్కలను గిన్నెలో వేసి అరగ్లాసు నీళ్లు పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆపేసి బీట్రూట్ ముక్కల్లో టీస్పూను సోంపు వేసి పది నిమిషాలు నానబెట్టాలి. పది నిమిషాల తరువాత బీట్రూట్ ముక్కల్లో ఉన్న నీటిని వడగట్టి తీసుకోవాలి. ఈ నీటిలో టీస్పూను రోజ్ వాటర్, రెండు టీస్పూన్ల అలోవెరా జెల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. వారం రోజులపాటు నిల్వ ఉండే ఈ క్రీమ్‌ను రోజూ ఉదయం పూట రాసుకుంటే.. ముఖం మీద మచ్చలు, ముడతలు, డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పట్టి ప్రకాశవంతముగా కనిపిస్తుంది. బీట్రూట్ ఫేస్ ప్యాక్ స్కిన్ ప్రాబ్లమ్స్‌ని దూరం చేసి చర్మ రంగుని మెరుగ్గా చేస్తుంది. బీట్రూట్ తొక్క తీసేసి ముక్కలుగా కోయాలి. ఈ ముక్కలకు పాలు కలిపి గ్రైండ్ చేయాలి. దీనిని ముఖానికి ప్యాక్‌లా అప్లయ్ చేయాలి. అలా మెడమీద కూడా రాసుకోవాలి. 15 నిమిషాల పాటు అలానే ఉంచి తర్వాత క్లీన్ చేయాలి. ఇలా రెగ్యులర్‌గా చేస్తే ముఖంపై ఉన్న బ్లాక్ హెడ్స్ దూరమవుతాయి. మురికిని దూరం చేసి చర్మాన్ని కాంతివంతంగా తయారు చేస్తుంది. పాలు కలుపుతాం కాబట్టి, చర్మం మృదువుగా, మెరుస్తుంటుంది. చర్మ సమస్యల్ని దూరం చేసి టోన్ చేయడంలో బీట్రూట్ హెల్ప్ చేస్తుంది. బీట్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, చర్మ ఆరోగ్యాన్ని కాపాడే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అలాగే బీట్రూట్లో నేచురల్ కలర్ ఉంటుంది. ఇందులోని బీటా లైన్ ఫెయిర్ స్కిన్‌టోన్‌ని అందిస్తుంది. అలాగే ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి చర్మంలోని సమస్యల్ని దూరం చేసి ముడతలు పడకుండా చేస్తుంది. -
ఫ్రూట్ ఫేషియల్: పార్లర్ అవసరం లేకుండా ఇంట్లోనే..
బ్యూటీ టిప్స్ రెండు స్పూన్ల క్యారెట్ జ్యూస్‌లో బొప్పాయి జ్యూస్, శనగపిండి, తేనె కలిపి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీళ్లతో కడిగేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. యాపిల్ పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి స్మాష్ చేసుకోండి. ఇందులో తేనె, రోజ్ వాటర్ కలుపుకొని ఫేస్‌ప్యాక్ వేసుకోండి. ఇలా తరచూ చేస్తుంటే నల్లటి మచ్చలు తొలగిపోయి చర్మం మంచి నిగారింపును సంతరించుకుంటుంది. ఆరెంజ్ పండ్ల తొక్కలను పొడి చేసుకొని అందులో గంధం, చిటికెడు పసుపు కలిసి ముఖానికి రాసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే జిడ్డుతనం పోయి యవ్వనంగా తయారవుతారు. చర్మ సౌందర్యానికి బొప్పాయి బెస్ట్ ఛాయిస్. మొటిమలు, మచ్చలు వంటి చర్మ వ్యాధులను తగ్గించేందుకు కూడా ఇది చక్కగా పనిచేస్తుంది. బొప్పాయి పండులో కాసిన్ని పాలు, తేనె కలపుకొని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా, బ్రైట్‌గా కనిపిస్తుంది. మామిడి, ఓట్స్‌ను కలిపిన ఈ స్క్రబ్ ముఖం మీద మృతకణాలు, దుమ్మూధూళిని తొలగించి చర్మానికి నిగారింపునిస్తుంది. పుచ్చకాయ రసాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇది చర్మానికి టోనర్‌గా పనిచేసి పొడిబారడాన్ని తగ్గిస్తుంది. ∙అరటి, యాపిల్, బొప్పాయి, నారింజ పళ్ల గుజ్జును సమపాళ్లల్లో తీసుకుని పేస్టు చేయాలి. ఈపేస్టుని ముఖానికి పూతలా వేయాలి. అరగంట తరవాత కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన మృతకణాలు, ట్యాన్‌ను తొలగించి కాంతిమంతంగా మారుస్తుంది. -
బ్యూటీ టిప్స్: వేపాకుల పేస్ట్‌తో ఆ సమస్య తగ్గిపోతుంది
బ్యూటీ టిప్స్ ► టీ స్పూన్ పచ్చిపాలలో అయిదారు చుక్కల తులసి రసం కలపాలి. ఈ మిశ్రమంలో కాటన్ ముంచి ముఖానికి, మెడకి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగితే మొటిమలు తగ్గి ముఖం పొడిబారకుండా ఉండి చర్మం నిగనిగలాడుతుంది. ► ఒక టేబుల్ స్పూన్ కోకో బటర్‌కి రెండు టేబుల్ స్పూన్ల రోజ్‌వాటర్‌ని కలిపి పేస్ట్‌లా చేయాలి. ఆ పేస్ట్‌ని ఫేస్‌కి ప్యాక్‌లా వేసుకుని పది నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ఫేస్‌వాష్ చేసుకోవాలి. ► ముఖంపై మొటిమలు, మచ్చలతో బాధపడుతుంటే వేపాకులు బెస్ట్ సొల్యూషన్. వేపాకుల పొడిలో పసుపు, రోజ్‌వాటర్ కలుపుకొని ముఖానికి అప్లై చేయాలి. ఆరిన తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మొటిమల సమస్య తగ్గిపోతుంది. ► కొద్దిగా కాఫీ పౌడర్, కొబ్బరి నూనెను సమపాళ్లలో తీసుకొని అందులో ఒక చెంచా చక్కెర వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేయండి. ఇది చర్మాన్ని ఎక్స్ఫోలియేట్ చేయడమే కాకుండా మృదువుగా మారుస్తుంది, చర్మం తాజాగా కనిపిస్తుంది. -
టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే మొటిమల సమస్యకు ఇలా చెక్ పెట్టొచ్చు
మొటిమలు.. చాలామంది టీనేజర్స్‌ని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.కాలుష్యం, హార్మోన్లలో మార్పులు,పోషకాహార లోపాలు వంటి కారణాల వల్ల ముఖంపై మొటిమలు వస్తుంటాయి. అయితే సమస్యకు నివారించేందుకు ఎంత ప్రయత్నించినా కొన్నిసార్లు అవి మరింత ఎక్కువై ఇబ్బంది పెడుతుంటాయి. వేలకు వేలు డబ్బులు ఖర్చు పెట్టే కంటే మన ఇంట్లోనే దొరికే నేచురల్ ఫేస్‌ప్యాక్‌తో మొటిమలకు చెక్ పెట్టొచ్చు. అదెలాగో చూద్దామా. ►బీట్రూట్ గుజ్జులో రెండు చెంచాల ముల్తానీ మట్టీ, చెంచా నిమ్మరసం కలిపి ముఖానికి ప్యాక్‌లా అప్లై చేయాలి. అరంగటపాటు ఆరనిచ్చి.. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మొటిమలూ, నల్లమచ్చలు తొలగిపోయి చర్మం నిగనిగలాడుతుంది. ► జాజికాయ, మిరియాలు, మంచి గంధం..ఈ మూడింటిని తీసుకుని ఒక్కొక్కటి విడివిడిగా ఒక రాయి మీద కొంచెం కొంచెం నీళ్లు జల్లుకుంటూ అరగదీయాలి. అలా అరగదీయగా వచ్చిన మూడు రకాల పేస్టులను ఒక చిన్న కప్పులోకి తీసుకుని ఒకదానితో ఒకటి బాగా కలపాలి. ► ఆ మిశ్రమాన్ని పడుకునే ముందు మొటిమలు, మచ్చలు ఉన్న చోట రాసుకుని నిద్రపోవాలి. మరునాడు పొద్దున్నే లేచి ముఖాన్ని గోరు వెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా మూడు నుండి ఏడు రోజుల వరకు చేసినట్లయితే ఎలాంటి మొటిమలు అయినా, మొండి మచ్చలయినా సులభంగా తొలగిపోతాయి. ► రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. అరగంట తరవాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. పింపుల్స్, వాటి తాలూకూ మచ్చలు తొలగుతాయి -
కోనసీమలో ‘నల్ల బంగారం’
సాక్షి అమలాపురం: కోనసీమలో తయారయ్యే ‘కొబ్బరి చిప్ప బొగ్గు’ దేశంలోనే ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. ముఖ సౌందర్యానికి ఫేస్‌ప్యాక్‌గా, తాగునీటిని శుద్ధిచేసేందుకు వినియోగించడంతో పాటు పెట్రోలియం ఉత్పత్తులు, దేశ రక్షణకు చెందిన విడి భాగాలు, ఆటో మొబైల్ పరిశ్రమలలో కీలక విడిభాగాల తయారీలో ఈ బొగ్గు అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. తయారీదారుల ఇంట నల్ల బంగారమై మెరుస్తోంది. ఇటువంటి అత్యుత్తమమైన, నాణ్యమైన కొబ్బరి చిప్ప బొగ్గు తయారీకి కేరాఫ్ అడ్రస్‌గా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా నిలుస్తోంది. నదీతీరంలో బొగ్గు తయారీ.. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని పి.గన్నవరం, అంబాజీపేట మండలాల్లో వైనతేయ నదీతీరంలో బొగ్గు తయారవుతోంది. ఇక్కడ నుంచి ఏడాదికి రూ. 2 కోట్ల విలువ చేసే 700 నుంచి 900 టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తున్నారు. తమిళనాడు లోని కాంగాయం, పల్లడం, కోయింబత్తూరు, కర్ణాటకలోని బెంగళూరు, తెలంగాణలోని హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు, మన రాష్ట్రంలోని నెల్లూ రు, గూడూరు వంటి ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రయోజనాలెన్నో.. కొబ్బరి చిప్ప బొగ్గు ప్రయోజనాలు తెలిస్తే నిజంగా నల్ల బంగారమే అంటారు. సౌందర్య పోషణకు వాడే ఫేస్‌ప్యాక్‌లతోపాటు కాస్మోటిక్స్, సబ్బులలో వాడకం అధికం. ఆటోమొబైల్‌లో కీలకమైన స్పేర్ పార్టుల తయారీ, రక్షణ రంగంలో యుద్ధ పరికరా లు, గ్యాస్ మాస్కుల తయారీలో వినియోగిస్తారు. పెట్రోలియం, గ్యాస్ ఉత్పత్తిలో అధిక శాతం రికవరీకి ఇది దోహదపడుతుంది. నీటిలోని క్లోరిన్, పురుగు మందులు, మలినాలను, వైరస్, బ్యాక్టీరియాలను నివారిస్తుంది. దీనిలో అధిక ఉష్ణ విలువ ఉంటుంది. మండించడానికి సమర్థవంతమైన ఇంధన వనరు గా ఉపయోగపడుతుంది. చిప్ప బొగ్గుతో భూమిలో వేగంగా సేంద్రియ కర్భనం ఉత్పత్తి అవుతుంది. బాగా ఆరిన కొబ్బరి చిప్ప బొగ్గు అత్యధిక ధర కేజీ రూ.35 నుంచి రూ.38 వరకు ఉండగా, ఈ ఏడాది ఆశించిన ఎగుమతులు లేకపోవడంతో ధర తగ్గిపోయింది. ప్రస్తుతం కేజీ రూ.24 నుంచి రూ.26 కాగా, తడిసిన బొగ్గు ధర రూ.19 వరకు మాత్రమే ఉంది. దీనివల్ల నష్టపోతున్నామని, ఎగుమతులు లేక సరుకు పెద్ద ఎత్తున పేరుకుపోయిందని, అక్టోబర్ నుంచి మంచి ధర వస్తుందని తయారీదారులు ఆశలు పెట్టుకున్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వ ప్రోత్సాహం వన్ డిస్ట్రిక్ట్.. వన్ ప్రొడెక్టులో భాగంగా కోనసీమ జిల్లాను కొబ్బరికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ చిప్ప బొగ్గు తయారీ పరిశ్రమలను ప్రోత్సహించాలని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. కోకోనట్ బోర్డు, ఉద్యానశాఖ ఆధ్వర్యంలో రూ.25 లక్షల విలువైన యూనిట్‌కు 35 శాతం వరకు రాయి తీ అందించనుంది. అంతకన్నా పెద్ద ప్రాజెక్టు పెట్టుకుంటే రూ.పది లక్షల వరకు రాయితీ ఇవ్వనున్నా రు. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ (జైకా) ఆధ్వర్యంలో రూ.3 కోట్లతో జిల్లాలో కోకోనట్ మిల్క్ యూనిట్‌తోపాటు కోకోనట్ చార్ కోల్ పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యానశాఖ సన్నాహాలు చేస్తోంది. మన్నిక ఎక్కువ.. దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ, కర్ణాటక కన్నా ఇక్కడ ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యమైంది. చిప్ప దళసరి కావడంతోపాటు దీనిలో అధిక శాతం గ్యాస్ నిక్షిప్తమైనందున ఇది వేగంగా మండుతోంది. మిగిలిన రాష్ట్రాలలో ఆరు బయట బొగ్గు తయారీ ఎక్కువ. కోనసీమలో బొగ్గు తయారీ డ్రమ్ములలో చేస్తారు. దీనివల్ల బూడిద శాతం తక్కువగా ఉంటోంది. ఇక్కడ తయారయ్యే బొగ్గు ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటుంది. మార్కెట్ అవకాశాలు పెరగాలి మనం తయారు చేసే బొగ్గే అత్యంత నాణ్యమైంది. మార్కెటింగ్ అవకాశాలు పెద్దగా లేక అనుకున్న ధర రావడం లేదు. ఇతర ప్రాంతాల వారు ఇక్కడ నుంచి బొగ్గు తీసుకెళ్లి మరింత నాణ్యంగా తయారు చేసి కేజీ రూ.50 నుంచి రూ.70 చేసి అమ్మకాలు సాగిస్తున్నారు. మనకు మాత్రం ఆ ధర రావడం లేదు. మార్కెటింగ్ అవకాశాలు పెరిగితే మరింత ధర వచ్చే అవకాశముంది.– మట్టపర్తి రామకృష్ణ,ముంజువరం, పి.గన్నవరం మండలం అత్యంత ధృడమైంది ఇక్కడ తయారయ్యే కొబ్బరి చిప్పలో 80 నుంచి 90 శాతం మేర చిన్న చిన్న రంధ్రాలు ఉండడంతో ఎక్కువ కాలం మన్నిక ఉండడంతోపాటు ధృడంగా ఉంటోంది. ఆటోమొబైల్, రక్షణ పరికరాలు, పెట్రోలియం ఉత్పత్తుల తయారీలో అధికంగా వాడుతున్నారు. – ఎ.కిరిటీ, ఉద్యాన శాస్త్రవేత్త, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పరిశోధనా స్థానం, అంబాజీపేట -
అరటిపండుతో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నారా? దానిలోని బి12 చర్మానికి..
ఈరోజుల్లో ఆడవాళ్లు, మగవాళ్లు అనే తేడా లేకుండా అందానికి చాలా ప్రాముఖ్యత ఇస్తున్నారు. ఒకప్పుడు బ్యూటీ పార్లర్లు అంటే ఆడవాళ్ల కోసమే ప్రత్యేకంగా ఉండేవి. కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా మేం ఎందుకు తగ్గాలి అని సెలూన్ షాప్‌లకు క్యూ కడుతున్నారు. వేలకు వేలు తగలేసి మరీ కాస్ట్లీ ప్రోడక్ట్లను కొంటున్నారు. అయితే ఖర్చు లేకుండానే మన ఇంట్లో దొరికే వస్తువులతో క్షణాల్లో అందంగా మెరిసిపోవచ్చు. అదెలాగో చూసేద్దాం. బ్యూటీ టిప్స్: అరటి తొక్కతో సహా పండుని ముక్కలుగా తరిగి పేస్టు చేయాలి. ఈ పేస్టుకు రెండు టీస్పూన్ల పచ్చిపాలు పోసి మరోసారి గ్రైండ్ చేసి పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. తరువాత ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పూతలా వేసుకుని, ఇరవై నిమిషాలు ఆరాక కడిగేయాలి. అరటి పండులో ఉన్న విటమిన్ బి 6, బి12, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, పొటాషియం చర్మానికి పోషణ అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. ఈ ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల ముఖ చర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
బంగాళదుంపతో ముఖం మిలమిల.. మచ్చలు పోయి నిగారింపు
బ్యూటీ టిప్స్ ఒక బంగాళదుంపను తీసుకుని తొక్క తీసి,పేస్టులా చేసుకోవాలి. దీన్ని పలుచని వస్త్రంలో వడగట్టి నీటిని తీసేయాలి. ఆ గుజ్జులో 6 టేబుల్ స్పూన్లు పాలు కలపాలి. ఈ మిశ్రమంలో 6 చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ వేసి బాగా కలిపి, ఐస్‌ట్రేలో వేసి రిఫ్రిజిరేటర్లో పెట్టాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగి.. ఫ్రీజ్ అయిన బంగాళదుంపతో ముఖమంతా రుద్దాక, చేతులతో సున్నితంగా మర్దన చేసి, ఆరిన తరువాత కడిగేయాలి. వారంలో మూడుసార్లు ఇలా చేయడం వల్ల ముఖం మీద పేరుకు పోయిన దుమ్మూధూళి, మొటిమల తాలూకు మచ్చలు పోయి ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. -
అరటిపండుతో అదిరిపోయే అందం.. ఈ ప్యాక్‌తో ఇన్ని ఉపయోగాలా?
అందంగా కనిపించాలని ఎవరికి మాత్రం ఉండదు? వాటికోసం వేలకువేలకు తగలేసి కాస్మొటిక్స్ వస్తువులు కొంటుంటారు. కానీ ఈజీగా ఇంట్లోనే దొరికే అరటిపండుతో నిగనిగలాగే స్కిన్‌టోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అరటిపండు తింటే ఆరోగ్యానికే కాదు, చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మృదువుగా, ముడతలు లేకుండా చేయడంలో సహాయపడుతుంది. అందమైన చర్మం కోసం అరటింపడుతో ఇలా ప్యాక్ వేసుకోండి.. ♦ బాగా పండిన అరటిపండును తీసుకుని గుజ్జులా చేసుకోవాలి. దీన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం నిగారింపును సంతరించుకుంటుంది. ♦ అరటిపండు గుజ్జులో తేనే, పసుపు కలుపుకొని రాసుకుంటే ఇన్స్టంట్ గ్లో వస్తుంది. ♦ అరటిపండును మెత్తగా చేసుకోని దానిలో వేపాకు పౌడర్‌ను కలుపుకొని ముఖానికి పట్టించాలి. ఈ ప్యాక్‌ను తరచుగా వేసుకోవడం వల్ల మొటిమలను నివారిస్తుంది. ♦ మెటిమలు, వాటి తాలూకూ మచ్చలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే అరటిపండు మీ సమస్యకు చక్కని పరిష్కారం.ఒక అరటిపండును తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని పేస్ట్‌లా మ్యాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం, శనగపిండి కలుపుకొని ముఖానికి అప్లై చేసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ♦ అరటిపండు గుజ్జులో రెండు రెండు స్పూన్ల పెరుగు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 20 నిమిషాలయ్యాక ముఖాన్ని శుభ్రం చేసుకుంటే మృదువుగా మారుతుంది. -
సహజ సిద్ధమైన యూత్ప్యాక్స్
పార్టీలు, వేడుకలకు వెళ్లాలనుకొన్నప్పడు ముఖానికి తక్షణ నిగారింపు రావడం కోసం రకరకాల ఫేస్‌ప్యాక్‌లు ఉపయోగిస్తుంటారు. అయితే ఒక్కోసారి అవి అందుబాటులో ఉండవు. ఉన్నా, చర్మానికి పడవు. అలాంటప్పుడు... సహజసిద్ధమైన ఈ ఫేస్‌ప్యాక్స్ ప్రయత్నించండి. ఇవి మీ చర్మానికి తగిన పోషణను ఇవ్వడంతో పాటు యవ్వన కాంతినిస్తాయి. చందనం, రోజ్ వాటర్ చందనం ముఖం పై ఉన్న మృతకణాలను తొలగించి చర్మం మెరిసిపోయేలా చేస్తుంది. రోజ్‌వాటర్ చర్మానికి మెరుపునందిస్తుంది. వేసవిలో ఈప్యాక్ వేసుకోవడం ద్వారా సూర్యరశ్మి ప్రభావానికి గురైన చర్మానికి ఉపశమనం దొరుకుతుంది. ఇందుకోసం... ♦ గంధపు చెక్కను రోజ్ వాటర్‌తో అరగదీసి.. ముఖానికి ఫేస్‌ప్యాక్‌లా వేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొంటే సరిపోతుంది. మీ దగ్గర గంధపు చెక్క లేకపోతే.. దానికి బదులుగా గంధపు పొడిని ఉపయోగించవచ్చు. గంధం పొడిలో సరిపడినంత రోజ్ వాటర్ కలిపి ముఖానికి మాస్క్‌లా వేసుకొంటే సరిపోతుంది. ఓట్ మీల్‌తో... ఓట్మీల్ సహజసిద్ధమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. దీనిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ గుణాలు, ఇతర పోషకాలు చర్మానికి మెరుపునిస్తాయి. ఓట్ మీల్ సహజసిద్ధమైన క్లెన్సర్‌గా పనిచేసి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. రెండు టేబుల్స్పూన్ల ఓట్ మీల్లో టీస్పూన్ చందనం పొడి వేసి సరిపడినంత రోజ్ వాటర్ కలిపి పేస్టులా తయారు చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పావుగంట ఆరనివ్వాలి. ఆ తర్వాత కొన్ని నీళ్లు చల్లుకుంటూ మసాజ్ చేసుకొంటున్నట్టుగా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. -
బ్యూటీపార్లర్ నిర్వాకం.. విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు
సాక్షి, గుంటూరు: తాడేపల్లి పట్టణ పరిధిలోని క్రిస్టియన్‌పేటలో ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకుల వల్ల ఓ విద్యార్థిని ముఖంపై నీటిపొక్కులు వచ్చాయి. ఫలితంగా ఆమె తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వివరాల ప్రకారం.. బ్యూటీపార్లర్‌కు సోమవారం సాయంత్రం ఉండవల్లికి చెందిన ఓ డిగ్రీ విద్యార్థిని వచ్చింది. ఫేస్ వ్యాక్స్ చేయించుకుంది. ఆ రాత్రి ఆమె ముఖంపై ఎర్రగా కంది నీటి పొక్కులు వచ్చాయి. కంగారు పడిన ఆమె ఆస్పత్రికి వెళ్లగా డాక్టర్లు ఫేస్ వ్యాక్స్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు. దీంతో విద్యార్థిని బంధువులు మంగళవారం బ్యూటీపార్లర్‌కు వచ్చి సిబ్బందిని ప్రశ్నించగా, ఘరానాగా సమాధానమిచ్చారు. ఇవన్నీ సహజమేనని చెప్పారు. చేతనైనది చేసుకోండి అంటూ దౌర్జన్యంగా మాట్లాడారు. దీంతో విద్యార్థిని పోలీసులను ఆశ్రయించారు. విద్యార్థిని ముఖంపై వచ్చిన నీటిపొక్కులు తగ్గడానికి నాలుగు నెలల నుంచి 5 నెలల సమయం పడుతుందని వైద్యులు చెబుతున్నారు. చదవండి: Viral: స్విగ్గీ ఫుడ్ ఆర్డర్ డెలివరీ చేస్తున్న డ్రాగన్స్.. నమ్మడం లేదా? -
Beauty Tips: వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం నిగనిగలాడుతుంది: నటి
'మేరీ ఆషీకి తుమ్ సే హై' అనే టీవీ షోతో కెరీర్ ఆరంభించింది ఢిల్లీ బ్యూటీ రాధికా మదన్. 2018లో పటాకా సినిమాతో బాలీవుడ్లో తెరంగేట్రం చేసింది. ఇక ఆంగ్రేజీ మీడియం సినిమాలో ఇర్ఫాన్ ఖాన్ కూతురిగా నటించి మెప్పించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. దీనితో పాటు రే వెబ్‌సిరీస్‌లోనూ తన నటనకు గానూ రాధిక విమర్శల ప్రశంసలు అందుకుంది. త్వరలోనే కుట్టీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రాధికా.. తన బ్యూటీ సీక్రెట్ ఏమిటో అభిమానులతో పంచుకుంది. అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా.. ‘నా చర్మ సౌందర్య రహస్యం.. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్ ప్యాకే. ఇది మా అమ్మమ్మ, అమ్మ నుంచి వారసత్వంగా అందిన చిట్కా అని చెప్పొచ్చు. చాలా సింపుల్. ఒక టేబుల్ స్పూన్ శనగ పిండి, ఒక టీ స్పూస్ పసుపు, రెండు టీ స్పూన్ల బాదం పప్పు పొడి, ఒక టేబుల్ స్పూన్ కుంకుమ పువ్వు పాలు.. అన్నిటినీ కలిపి ప్యాక్‌లా తయారు చేసుకోవాలి. దీనిని మొహానికి, మెడకు అప్లయ్ చేయాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేసు కోవాలి. మెత్తటి టవల్‌తో తడిపొడిగా తుడుచుకుని మాయిశ్చరైజన్ రాసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసినా.. మొహం డ్రై అవకుండా తేమతో నిగనిగలాడుతూ ఉంటుంది’’ అని రాధికా మదన్ చెప్పుకొచ్చింది. చదవండి: Anushka Sharma Beauty Secret: టీనేజ్‌లో ఉన్నపుడు అమ్మ చెప్పింది.. నా బ్యూటీ సీక్రెట్ అదే! Beauty Tips: నల్ల మచ్చలు వేధిస్తున్నాయా? ఈ సులభమైన చిట్కాలతో చెక్ పెట్టేయండి! -
Beauty Tips: మొటిమలు, జిడ్డుకు చెక్ పెట్టేయండిలా!
ముఖంపై మొటిమలు, జిడ్డు సమస్య వేధిస్తోందా? అయితే, పుదీనా ఆకులతో సమస్యకు ఇలా చెక్ పెట్టేయండి! ►పుదీనా ఆకులను ఎండబెట్టి పొడిచేయాలి. ►ఈ పొడిలో కొద్దిగా ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్ వేసి పేస్టులా కలపాలి. ►ఈ పేస్టుని ముఖంపై అసహ్యంగా కనిపిస్తోన్న మొటిమలపై రాయాలి. ►పూర్తిగా ఆరాక నీటితో కడిగేయాలి. ►ఈ పేస్టుని రోజూ అప్లై చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన జిడ్డుని తొలగించి, మొటిమలు తగ్గుముఖం పట్టేలా చేస్తుంది. ►క్రమం తప్పకుండా ఈ ప్యాక్ వేసుకుంటే ముఖచర్మం నిగారింపుని సంతరించుకుంటుంది. అదే విధంగా.... ►గుప్పెడు పుదీనా ఆకులకు కొద్దిగా తేనె, రోజ్‌వాటర్ జోడించి పేస్టులా నూరాలి. ►ఈ పేస్టుని ముఖానికి పూతలా వేసి పదిహేను నిమిషాల తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం జిడ్డులేకుండా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. చదవండి: Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
Beauty Tips: చింతాకు, బొప్పాయి గుజ్జు.. మచ్చలు, ముడతలు మాయం!
Tamarind Leaf And Papaya Pack : కప్పు చింత ఆకుల్లో పావు కప్పు బొప్పాయి పండు గుజ్జు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూతలా అప్లై చేసి ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరువాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి రెండు సార్లు ఈ పుల్లటి ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి మాయిశ్చర్ అందుతుంది. ఇందులోని యాంటీసెఫ్టిక్ గుణాలు చర్మాన్ని సూక్ష్మజీవుల నుంచి కాపాడతాయి. క్రమం తప్పకుండా ఈ ప్యాక్‌ను వేసుకుంటే ముఖం మీద మచ్చలు, ముడతలు, చర్మసంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ►ఇక బియ్యప్పిండి, బొప్పాయి గుజ్జుని మఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గుముఖం పడతాయి. ►అదే విధంగా బొప్పాయిగుజ్జులో పసుపు, పచ్చిపాలు, తేనె, తులసి ఆకుల పొడి కలిపిముఖానికి పట్టిస్తే, మొటిమలు, తెల్లమచ్చలు మాయమవతాయి. ►బొప్పాయి పండు గుజ్జు, అర స్పూన్ అలోవెరా జ్యూస్, కొంచెం తేనె కలిపి రాసుకుంటే చర్మానికి కావలసిన తేమ, పోషక పదార్థాలు అందుతాయి. మీరు యవ్వనంగా కనిపిస్తారు. ►నిమ్మరసం, కొద్దిగా పెసరపిండి కలిపి అందులో కొద్దిగా బొప్పాయి గుజ్జును కలిపి రాసుకొంటే తెల్లని ఛాయ వస్తుంది. ►బొప్పాయి పండుకి ముఖం మీద ముడతలు పోగొట్టే అద్భుత గుణం కూడా ఉంది. చదవండి: టీనేజ్‌లో కాకుండా... యుక్తవయసు దాటాకా మొటిమలు వస్తున్నాయా? అయితే -
Beetroot: ముఖం మీది మొటిమలు, మృత కణాలు ఇట్టే మాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న బీట్రూట్ అందాన్ని ఇనుమడింపజేయడంలోనూ ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ సీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. మొటిమలను వదిలించడంలో ఇవి రెండూ కీలక పాత్ర పోషిస్తాయి. ఇక వీటికి జింక్, యాంటీబయోటిక్స్ తోడైతే మొటిమలు త్వరగా తగ్గుతాయి. అందువల్ల మొటిమలతో బాధపడుతున్నవారు బీట్రూట్ ప్యాక్‌ను ప్రయత్నిస్తే మంచి ఫలితం వస్తుంది. బీట్రూట్ ప్యాక్ తయారీ: ►రెండు స్పూన్ల పెరుగులో రెండు టీస్పూన్ల బీట్రూట్ రసం వేసి బాగా కలపాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట ఆరనివ్వాలి. ►తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ►ఇలా చేయడం వల్ల ముఖం మీది మొటిమలు, వాటి తాలుకూ మచ్చలు పోయి ముఖం కాంతిమంతమవుతుంది. ►వారంలో మూడుసార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. ►అదే విధంగా రోజూ ముఖానికి బీట్రూట్ రసం రాసి పది నిమిషాలపాటు మర్దన చేస్తే ముఖం మీద ఉన్న మృతకణాలు తొలగి పోతాయి. చదవండి: Kiwi Fruit: కివీ పండు పొట్టు తీయకుండా తింటున్నారా? ఇందులోని ఆక్టినిడెన్ అనే ఎంజైమ్ వల్ల... -
Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్!
Winter Skin Care Tips In Telugu: వాతావరణం మారినప్పుడల్లా ఆ ప్రభావం సున్నితమైన చర్మంపై పడుతుంది. ఫలితంగా ముఖం మీద ట్యాన్ పేరుకు పోవడం, కళ్ల కింద డార్క్ సర్కిల్స్ ఏర్పడటం.. వెరసి ముఖం పొడిబారి గ్లో తగ్గిపోతుంది. ఇలాంటప్పుడు చర్మాన్ని లోతుగా శుభ్రపరిచి, పోషణ అందించే ప్యాక్‌లు వాడటం ద్వారా పోయిన గ్లోను తిరిగి తెస్తాయి. ►సొరకాయ (ఆనప కాయ) గుజ్జులో పావు టీస్పూను తేనె, టీస్పూను అలోవెరా జెల్, టీస్పూను రోజ్ వాటర్, విటమిన్ ఈ క్యాప్సూల్ వేసి పేస్టులా కలుపుకోవాలి. ►ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఐదు నిమిషాల పాటు మర్దన చేయాలి. తరువాత పదినిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. ►ముఖాన్ని శుభ్రంగా కడిగి మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ఈ ప్యాక్‌ను వారానికి రెండు సార్లు వేసుకోవడం వల్ల నల్లని మచ్చలు, ట్యాన్ తొలిగి ముఖం నిగారింపును సంతరించుకుంటుంది. చదవండి: Weight Loss Diet: ఆ హార్మోన్ వల్లనే బరువు పెరుగుతారు..! యాలకులు, వెల్లుల్లి, కరివేపాకు, తేనె, మజ్జిగ.. -
Beauty Tips: ముఖారవిందానికి పప్పుల ఫేస్ ప్యాక్స్!
ముఖం అందంగా మెరిసిపోవాలని అందరూ కోరుకుంటుంటారు. దీనికోసం మార్కెట్లో దొరికే రసాయన క్రీములన్నీ వాడేస్తుంటారు. ఇవి కొన్నిసార్లు దుష్ప్రభావాలు చూపించి ఉన్న అందాన్ని కోల్పోయేలా చేస్తాయి. అయితే ఎటువంటి రసాయనాలు వాడకుండా మనింట్లో ఉండే పప్పులతో ఫేస్ ప్యాక్‌లు ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం.. శనగపప్పు మూడు టీస్పూన్ల పచ్చిశనగపప్పును రాత్రంతా నానబెట్టుకుని, ఉదయం నీళ్లు తీసేసి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, టీస్పూను నిమ్మరసం, తేనె వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ పేస్టుని ముఖానికి అప్లై చేసి ఆరాక కడిగేయాలి. తరువాత మాయిశ్చరైజర్ రాసుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేయడం వల్ల ముఖం మీద జిడ్డు, నల్లమచ్చలు, మొటిమలు తగ్గుముఖం పడతాయి. చదవండి: అందుకే కార్డియాక్ అరెస్ట్ సంభవిస్తుందట..! ఇలా చేస్తే ప్రాణాలు నిలుపుకోవచ్చు.. మసూర్‌దాల్ కప్పు ఎర్రకందిపప్పు (మసూర్‌దాల్) తీసుకుని దానిలో ముప్పావు కప్పు పచ్చిపాలు పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఈ పప్పుని పేస్టులా గ్రైండ్ చేయాలి. ముఖాన్ని కడిగి ఈ పేస్టుని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తరువాత ముఖంపై వలయాకారంలో మర్దనచేసి నీటితో కడిగేయాలి. ఈ ప్యాక్ ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ను తగ్గించి, ముఖం కాంతిమంతంగా కనిపించేలా చేస్తుంది. పెసరపప్పు అరకప్పు పెసరపప్పుని రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పేస్టులా రుబ్బుకోవాలి. దీనికి టేబుల్ స్పూను పెరుగు, టేబుల్ స్పూన్ అలోవెరా జెల్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి పదినిమిషాల తరువాత నీటితో మర్దన చేసి, కడిగేయాలి. ఈ ప్యాక్‌తో విటమిన్ ఏ, సీలు ముఖారవిందాన్ని మరింత మెరిపిస్తాయి. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
తొక్కే కదా అని తీసిపారేయకండి...
అన్ని పండ్ల తొక్కల్లో విటమిన్లు, ప్రొటీన్లు ఉన్నాయని మనందరికీ తెలుసు. అందుకని వాటిని ఆహారంగా తీసుకోలేం కదా. అయితే తొక్కే కదా అని తీసిపారేయకండి. వాటిని మరోలా ఉపయోగించుకోవచ్చు. నిమ్మకాయ తొక్కలు అందానికి బాగా ఉపయోగపడతాయని ఇంతకు ముందు చాలా సార్లు తెలుసుకున్నాం. బకెట్ నీళ్ళలో కొన్ని నిమ్మ తొక్కలు వేసి మరిగించి, ఆ నీళ్లతో స్నానం చేయాలి. నిమ్మతొక్కల్లోని సిట్రిక్ యాసిడ్ వల్ల చర్మం మృదువుగా అవుతుంది. బయట ఎక్కువగా తీరుతున్న వారికి చర్మంపై దుమ్ముచేరి, కమిలిపోతుంది. అలసటకు కూడా గురవుతారు. అలాంటప్పుడు అరటిపండు తొక్కతో ముఖమంతా మర్దనా చేసి ఆ తరువాత గోరువెచ్చని నీటితో కడగాలి. బొప్పాయి గుజ్జుతో ఫేసియల్ చేయడం అందరికీ తెలుసు. వీటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తగా చేసి దీన్ని కూడా ప్యాక్ గా వేసుకుని పది నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగితే డెడ్ స్కిన్ తొలగిపోతుంది. యాపిల్ తొక్కను కూడా మిక్సీ చేసి ముఖానికి పట్టించాలి.నెమ్మదిగా మర్దన చేస్తే, రక్త ప్రసరణ బాగా జరిగి చర్మం కాంతివంతం అవుతుంది. నారింజ తొక్కలు కూడా సున్నిపిండిలో వేసి మర పట్టిస్తే చర్మం మృదువుగా అవుతుంది. దీన్ని కూడా నీళ్ళలో మరిగించి ఆ నీటితో స్నానం చేస్తే చర్మంలోని వ్యర్థాలు బయటికి పోతాయి. అలాగే తొక్కల గుజ్జుతో ప్యాక్ చేసుకుంటే నల్లని మచ్చలు, కంటికింద వలయాలు తగ్గుతాయి. నిద్రనుంచి లేచినప్పుడు కొందరి ముఖం ఉబ్బి పోతుంది. ఇది తగ్గాలంటే బంగాళా దుంప తొక్కలు ఉడికించిన నీటితో ముఖం కడుక్కుంటే ఉబ్బిన చర్మం మామూలుగా అయిపోతుంది. అలాగే ఉడికిన తొక్కల్ని ప్యాక్ గా చేసుకుంటే ముఖం మృదువుగా మారిపోతుంది. -
సాగనివ్వకండి బ్యూటిప్
వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై చర్మం సాగుతుంటుంది. దాంతో మనసు ఎంత ఉత్సాహంగా ఉరకలేస్తున్నా, ఎదుటి వారికి మాత్రం ముడతలను చూడగానే మీ వయసు ఇట్టే తెలిసి పోతుంది. అలా కాకుండా ఉండాలంటే ఇలా చేసి చూడండి. స్ట్రాబెర్రీ: ఈ పండ్లలో చర్మాన్ని బిగుతుగా చేసే గుణం ఉంటుంది. ఇది 100 శాతం నేచురల్ ట్రీట్మెంట్. 5–6 స్ట్రాబెర్రీలను తీసుకొని గ్రైండ్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. అందులో కొద్దిగా శనగపిండి వేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకుంటే సరి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ముడతలు తగ్గుతాయి. గుడ్డు తెల్లసొన, పెరుగు: ముడతలు మటుమాయం చేయడానికి గుడ్డు బాగా ఉపయోగపడుతుంది. ఒక టేబుల్ స్ఫూన్ పెరుగులో రెండు గుడ్ల తెల్ల సొనను వేసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖంపై ఉన్న మడతల వద్ద, మెడకు అప్లై చేయాలి. అది పూర్తిగా ఆరిపోయాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా తయారవుతూ ముడతలు తగ్గుతాయి. బియ్యం పిండి: చర్మంపై ముడతలను తొలగించేందుకు రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిలో రెండు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ లేదా గ్రీన్ టీ పోసి బాగా కలపాలి. తర్వాత ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 20–30 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజు విడిచి రోజు చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. -
మృదువైన మెరుపు
మార్కెట్లో కొన్న క్రీమ్స్ కంటే.. సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే చర్మం మృదుత్వాన్ని కోల్పోకుండా కాపాడతాయి. మచ్చలు, మొటిమలు, ముడతలు... ఇలా ఒక్కటేమిటి వయసుతో వచ్చిన సమస్యలను, కాలుష్యం తెచ్చిపెట్టిన ఇబ్బందులను సహజసిద్ధమైన చిట్కాలు పరిష్కరిస్తాయి. అందుకే చాలా మంది ఈ చిట్కాలను తు.చ. తప్పకుండా పాటిస్తారు. నిపుణుల సలహాలు కూడా ఇవే. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి: క్లీనప్ : కమలా రసం – 2 టీ స్పూన్లు, తేనె – అర టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – అర టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు – 1 టేబుల్ స్పూన్ మాస్క్: కీరదోస గుజ్జు – 3 టీ స్పూన్లు, ముల్తానీ మట్టి – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా కమలా రసం, తేనె ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కొబ్బరి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు కీరదోసగుజ్జు, ముల్తానీ మట్టి ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
మృదువైన జుట్టు కోసం...
అరటిపండుని మెత్తగా చేసి అందులో ఒక గుడ్డు, 3 టీ స్పూన్ల మజ్జిగ, 3 టీ స్పూన్ల ఆలివ్ నూనె, 2 టీ స్పూన్ల తేనె కలిపి, జుట్టుకి, మాడుకీ బాగా అంటేలా రాయాలి. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో కడిగేసుకోవాలి. నెలకి రెండుసార్లు ఈ ప్యాక్‌ను వేసుకుంటే మంచిది. ఒక టీ స్పూన్ తాజా నిమ్మరసం, టీ స్పూన్ ఉప్పు, టీ స్పూన్ కలబంద రసం కలిపి తలకి రాసుకోవాలి. అరగంటయ్యాక చన్నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా నెలలో రెండుసార్లు చేస్తే సరి! -
పట్టులాంటి మృదుత్వం
సౌందర్యవంతమైన ముఖ కాంతికి సహజమైన చిట్కాలే సరైనవంటున్నారు నిపుణులు. రోజు రోజుకీ పెరిగిపోతున్న కాలుష్యంతో ముఖం జిడ్డుగా, కాంతిహీనంగా మారిపోతుంది. అలాంటప్పుడు కొంత సమయం ఫేస్ ప్యాక్ వేసుకోవడానికి కేటాయిస్తే చాలు. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం మృదువుగా పట్టులా మెరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు మీగడ – 2 టీ స్పూన్లు, నిమ్మరసం – పావు టీ స్పూన్ స్క్రబ్ : ఓట్స్ – 2 టీ స్పూన్లు, టమాటా గుజ్జు – 2 టీ స్పూన్లు మాస్క్: చిక్కటి పాలు–1 టీ స్పూన్, శనగపిండి – అర టీ స్పూన్, తులసి ఆకుల గుజ్జు – 3 టీ స్పూన్లు, పచ్చి పసుపు – చిటికెడు తయారీ : ముందుగా పెరుగు మీగడ, నిమ్మరసం ఒక చిన్న బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఓట్స్, టమాటా గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు తులసి ఆకుల గుజ్జు, శనగపిండి, పసుపు, చిక్కటి పాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
తళుక్కుమనే మెరుపు!
ముఖ సౌందర్యానికి కాసింత సమయాన్ని వెచ్చిస్తే చాలు... తళుక్కుమనే మెరుపు మీ సొంతమవుతుందంటున్నారు నిపుణులు. ముఖంపైన ఉండే మృతకణాలు, మొటిమలు, మచ్చలు పూర్తిగా తొలగిపోవాలంటే... శ్రద్ధ చూపించడం చాలా అవసరం. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతం మారుతుంది. మచ్చ లేని మృదువైన అందం మీ సొంతమవుతుంది. ఇంకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : కొబ్బరి పాలు – 2 టీ స్పూన్లు, కలబంద గుజ్జు – 1 టీ స్పూన్ స్క్రబ్ : బియ్యప్పిండి – 1 టీ స్పూన్, కీరదోస గుజ్జు – 2 టీ స్పూన్లు, కొబ్బరి నూనె – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు –1 టీ స్పూన్, ముల్తానీ మట్టి – 1 టీ స్పూన్, అరటిపండు గుజ్జు – 2 టీ స్పూన్లు, దానిమ్మ రసం – 1 టీ స్పూన్ తయారీ : ముందుగా కొబ్బరి పాలు, కలబంద గుజ్జు ఒక చిన్న బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బియ్యప్పిండి, కీరదోస గుజ్జు, కొబ్బరి నూనె ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని ఇంచుమించు ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, ముల్తానీ మట్టి, అరటిపండు గుజ్జు, దానిమ్మ రసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖం కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖానికి ఫేస్ ప్యాక్ వేసిన తర్వాత సబ్బు పెట్టకపోవడం మంచిది. -
ఫేస్‌క్రీమ్స్‌తో పనిలేదు!
మేకప్‌తో వచ్చే అందం కంటే.. మేకప్ వేయకుండా మెరిసే అందానికే ఓటేస్తుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఖర్చులేని ఈ చిట్కాలను పాటించడానికి మాత్రం కాసింత సమయం వెచ్చించాల్సిందే. అప్పుడే ఫలితం కనిపిస్తుంది. ముందుగా క్లీనప్, స్క్రబ్ వంటివి చేసుకుని ఆవిరి పట్టించుకుని ఫేస్‌ప్యాక్ వేసుకుంటే ముఖం కాంతివంతంగా మెరవడంతో పాటు మచ్చలు, మొటిమలు పూర్తిగా మాయమవుతాయి. మరింకెందుకు ఆలస్యం? ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : ఆలీవ్ నూనె – పావు టీ స్పూన్, దానిమ్మ జ్యూస్ – 2 టీ స్పూన్లు(చెత్త తొలగించి), బాదం పాలు – 1 టీ స్పూన్ (బాదం పప్పులను నాలుగు గంటల పాటు నానబెట్టి.. కొద్దిగా నీళ్లు వేసుకుని మిక్సీ పట్టుకుని, జ్యూస్‌లా మారిన తర్వాత ఆ మిశ్రమాన్ని వడకట్టుకుని బాదం పాలు తయారు చేసుకోవాలి. వాటిని ఫ్రిజ్‌లో నిలువ చేసుకోవచ్చు.) స్క్రబ్ : దానిమ్మ గుజ్జు – 2 టీ స్పూన్లు, ఆరెంజ్ జ్యూస్ – 2 టీ స్పూన్లు, బియ్యప్పిండి – అర టీ స్పూన్, పచ్చిపసుపు – పావు టీ స్పూన్ మాస్క్ : గడ్డ పెరుగు – 2 టీ స్పూన్లు, యాపిల్ గుజ్జు – 3 టీ స్పూన్లు, పెసరు పిండి – 1 టీ స్పూన్, నిమ్మరసం – అర టీ స్పూన్ తయారీ : ముందుగా దానిమ్మ జ్యూస్, బాదం పాలు, ఆలీవ్ నూనె ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు దానిమ్మ గుజ్జు, బియ్యప్పిండి, ఆరెంజ్ జ్యూస్, పచ్చి పసుపు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు గడ్డ పెరుగు, యాపిల్ గుజ్జు, పెసరు పిండి, నిమ్మరసం ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, ఇరవై నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. వెంటనే సబ్బు ముఖానికి రాసుకోకపోవడమే మంచిది.