
ఒక తేనె చుక్క... ఓ టొమాటో ముక్క
ఎండాకాలం తెచ్చే కష్టాల్లో చర్మం జిడ్డుబారడం ఒకటి. ఈ కష్టాన్ని పేస్‌ప్యాక్‌లతో గట్టెక్కవచ్చు. ఆమ్లగుణాలున్న పదార్థాలు చర్మం మీద నూనెలను తొలగిస్తాయి. కాబట్టి ఆయిలీ స్కిన్‌కు వాటిని ఉపయోగించాలి.
టొమాటో ప్యాక్: టొమాటో రసాన్ని ముఖానికి పట్టించి ఆరిన తర్వాత చన్నీటితో కడిగితే ముఖం మీద ఉన్న జిడ్డు పోయి రోజంతా తాజాగా ఉంటుంది. కొంతమందికి టొమాటోతో స్కిన్‌కు ఇరిటేషన్ వస్తుంటుంది. అలాంటప్పుడు ఒకటి – రెండు ద్రాక్ష పండ్లను చిదిమి ముఖానికి రాసుకోవచ్చు.
హనీ–కార్న్ మాస్క్: ఒక పచ్చిబంగాళా దుంప, ఒక టేబుల్‌స్పూను కార్న్‌ఫ్లోర్, ఒక టేబుల్ స్పూను తేనె తీసుకోవాలి. బంగాళాదుంపను తురిమి రసం తీసుకోవాలి. ఆ రసానికి తేనె, కార్న్‌ఫ్లోర్ కలిపి ముఖానికి, మెడకు, చేతులకు ప్యాక్ వేయాలి. ఇది ఆరే కొద్దీ స్కిన్‌ను టైట్ చేస్తుంది. పదిహేను నిమిషాల తర్వాత ప్యాక్‌ను కడిగేయాలి. జిడ్డు చర్మానికి కార్న్‌ఫ్లోర్ మాస్క్ వాడితే ఫలితం కడిగిన వెంటనే స్పష్టంగా కనిపిస్తుంది.
గమనిక: సెన్సిటివ్ చర్మానికి, పొడి చర్మానికి ఈ ప్యాక్ వేస్తే మరీ పొడిబారే అవకాశముంది. కాబట్టి ఈ రెండు రకాల చర్మానికి కార్న్‌ఫ్లోర్‌ను మినహాయించి ప్యాక్ వేసుకుంటే సరిపోతుంది.