
నునుపైన మెడకోసం...
ఒక బంగాళదుంపని పొట్టు తీయకుండా ఉడకబెట్టి, మెత్తగా మెదుపుకోవాలి. దీనికి కాసిని పాలు, కొద్దిగా కొబ్బరినూనె జతచేసి పేస్ట్‌లా కలపాలి. మెడపై ఈ మిశ్రమాన్ని అప్లై చేసి, 20 నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తుంటే మెడ నలుపు తగ్గి చర్మం కాంతిమంతం అవుతుంది.
మృదువైన చేతుల కోసం
పాత్రలో కొద్దిగా తేనె, కోడిగుడ్డులోని తెల్లసొన, టీ స్పూన్ గ్లిజరిన్, టీ స్పూన్ బార్లీ పొడి.. అన్నీ బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చేతులకి అప్లై చేసి 15 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా వారంలో రెండుసార్లు చేస్తుంటే చేతులు మృదువుగా అవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment