క్యారెట్‌తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా! | Health and Skin Beauty Benefits of Carrots check these tips | Sakshi
Sakshi News home page

క్యారెట్‌తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా!

Published Tue, Nov 26 2024 11:04 AM | Last Updated on Tue, Nov 26 2024 11:04 AM

Health and Skin Beauty Benefits of Carrots check these tips

ముఖసౌందర్యం

క్యారెట్‌లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగు , ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్లో ఉండే  బీటా కెరోటిన్ మన బాడీలో విటమిన్ ‘ఏ’గా మారి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్లు జుట్టు కణాలను పునరుద్ధరించేందుకు ,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి ముఖ సౌందర్య పోషణలో క్యారెట్లు ఎలా పనిచేస్తాయో  చూద్దాం!

క్యారెట్‌ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా?

 ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...
∙రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల  పాలు కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్‌ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్‌ హెడ్స్, వైట్‌ హెడ్స్‌ పోతాయి.

క్యారెట్‌ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్‌ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది.

క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement