Carrots
-
క్యారెట్‌తో ఇలా చేస్తే 24 క్యారెట్ల బంగారంలా!
క్యారెట్లో విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మపు రంగు , ఆకృతిని మెరుగుపరచడంలో సహాయపడతాయి. క్యారెట్లో ఉండే బీటా కెరోటిన్ మన బాడీలో విటమిన్ ‘ఏ’గా మారి ఆరోగ్యకరమైన చర్మాన్ని అందిస్తుంది. క్యారెట్‌లోని విటమిన్ సి కొల్లాజెన్‌ను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. అలాగే క్యారెట్లు జుట్టు కణాలను పునరుద్ధరించేందుకు ,జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. మరి ముఖ సౌందర్య పోషణలో క్యారెట్లు ఎలా పనిచేస్తాయో చూద్దాం!క్యారెట్ ఆరోగ్యానికి ఎంతో మంచిదని తెలుసు. అయితే ఇది అందానికీ ఎంతగా మెరుగులు దిద్దుతుందో తెలుసా? ‘24 క్యారెట్ల’ బంగారం లాంటి ముఖ సౌందర్యానికి ఏం చేయాలంటే...∙రెండు క్యారెట్లను మెత్తని పేస్టులా చేసుకుని, అందులో ఐదారు చెంచాల పాలు కలిపి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత ప్యాక్‌ను తీసేసి ముఖానికి ఆవిరి పట్టాలి. కొన్నాళ్లిలా చేస్తే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ పోతాయి.క్యారెట్ గుజ్జులో కాసింత ముల్తానీ మట్టి, తేనె కలిపి ప్యాక్ వేసుకుంటే... ముఖం కాంతిమంతమవుతుంది.క్యారెట్, కీరా, బంగాళ దుంపల్ని మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఇందులో కాసింత టొమాటో రసం, చిటికెడు గంధం కలిపి ముఖానికి పూసుకోవాలి. అరగంట తర్వాత చల్లని నీటితో కడిగేసుకుంటే ముఖం మిలమిలా మెరుస్తుంది. -
Diwali 2024 : దివ్యంగా వండుకోండిలా
దీపావళి వస్తోంది...ఇల్లంతా వెలుగులతో నిండిపోతుంది.పిల్లల ముఖాల్లో మతాబులు వెలుగుతాయి.మరి... వంటిల్లు బోసిపోతే ఎలాగ?ఫ్రిజ్‌లోంచి బ్రెడ్... క్యారట్ తీయండి.స్టవ్ వెలిగించండి... చక్కెర డబ్బా మూత తీయండి. దివ్యంగా వండండి! షాహీ తుకడాకావలసినవి: బ్రెడ్ స్లయిస్‌లు –5; నీరు – టీ స్పూన్; పాలు– 3 కప్పులు; జీడిపప్పు– గుప్పెడు; పిస్తా– గుప్పెడు; బాదం – గుప్పెడు; యాలకులు – 2 (పొడి చేయాలి); నెయ్యి – అరకప్పు; చక్కెర – అర కప్పు; కుంకుమ పువ్వు – 6 రేకలు;తయారీ: బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి పక్కన పెట్టాలి. అడుగు మందంగా, వెడల్పుగా ఉన్న పెనంలో చక్కెరలో నీటిని పోసి సన్న మంట మీద మరిగించాలి. చక్కెర కరిగిన తరవాత అందులో కుంకుమ పువ్వు రేకలు వేయాలి. చక్కెర తీగపాకం వచ్చిన తర్వాత దించి పక్కన పెట్టాలి. ఒక పాత్రలోపాలు పోసి మరిగించాలి. మధ్యలో గరిటెతో అడుగు పట్టకుడా కలుపుతూ పాలు చిక్కబడి పావు వంతుకు వచ్చే వరకు మరిగించి యాలకుల పొడి వేయాలి. ఆ తర్వాత పైన తయారు చేసి సిద్ధంగా ఉంచిన చక్కెరపాకంలో నాలుగవ వంతు వేసి కలుపుతూ ఐదు నిమిషాల సేపు మరిగించి స్టవ్ మీద నుంచి దించి పక్కన పెట్టాలి. ఇది రబ్రీ. బ్రెడ్ స్లయిస్‌లను అంచులు తీసేసి త్రికోణాకారంలో కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ∙మరొక పెనంలో నెయ్యి వేడి చేసి బ్రెడ్ ముక్కలను అన్ని వైపులా దోరగా కాల్చాలి. పెనం మీద నుంచి తీసిన వెంటనే చక్కెర పాకంలో వేసి నిమిషం తర్వాత తీసి వెడల్పుగా, అంగుళం లోతు ఉన్న ప్లేట్లో అమర్చాలి. ఇలా అన్ని స్లయిస్‌లను వేయించి, చక్కెర పాకంలో ముంచి తీసి ప్లేట్లో సర్దాలి. ఇప్పుడు ప్లేట్లో ఉన్న బ్రెడ్ స్లయిస్ల మీద రబ్రీ పోసి, ఆ పైన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులను చల్లాలి.గమనిక: పాలను రబ్డీ చేసే సమయం లేకపోతే కండెన్స్డ్ మిల్క్ వాడవచ్చు. డయాబెటిస్ పేషెంట్లు తినాలంటే చక్కెర బదులుగా మార్కెట్లో దొరికే షుగర్ ఫ్రీ లేదా స్టీవియాలను వాడవచ్చు. క్యారట్ బర్పీకావలసినవి: క్యారట్ – అర కిలో; నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు పాలు – కప్పు; చక్కెర – అర కప్పు; యాలకుల పొడి– అర టీ స్పూన్; పిస్తా – గుప్పెడు (తరగాలి);తయారీ: క్యారట్‌ను కడిగి చెక్కు తీసి తురమాలి. మందపాటి బాణలిలో రెండున్నర టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసి అందులో క్యారట్ తురుము వేసి బాగా కలిపి మూత పెట్టి మంట తగ్గించి సన్నమంట మీద పది నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు క్యారట్ తురుములో పాలు పోసి కలిపి మూత పెట్టి నాలుగైదు నిమిషాల సేపు ఉడికించాలి. క్యారట్ మెత్తగా ఉడికిన తర్వాత అందులో చక్కెర, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. చక్కెర కరిగేకొద్దీ మిశ్రమం ద్రవంగా మారుతుంటుంది. కొద్ది సేపటికి తిరిగి దగ్గరవడం మొదలవుతుంది. అప్పుడు మిశ్రమం అడుగు పట్టకుండా గరిటెతో కలుపుతూ బాగా దగ్గరయ్యే వరకు ఉంచాలి. ఈ లోపు ఒక ట్రేకి నెయ్యి రాసి క్యారట్ మిశ్రమంపోయడానికి సిద్ధం చేసుకోవాలి. క్యారట్ పాకం గట్టి పడిన తరవాత స్టవ్ మీద నుంచి దించి నెయ్యి రాసిన ట్రేలో పోసి సమంగా సర్ది పిస్తా పలుకులను అద్దితే క్యారట్ బర్ఫీ రెడీ. బర్ఫీ వేడి తగ్గిన తర్వాత చాకుతో గాట్లు పెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత బర్ఫీ ముక్కలను ప్లేట్ నుంచి సులువుగా వేరు చేయవచ్చు.గమనిక: క్యారట్ మిశ్రమాన్ని ఎప్పుడు ట్రేలోపోయాలనేది స్పష్టంగా తెలియాలంటే... స్పూన్‌తో కొద్దిగా తీసుకుని చల్లారిన తరవాత చేత్తో బాల్‌గా చేసి చూడాలి. తురుము జారిపడకుండా బాల్ గట్టిగా వస్తే అప్పుడు మంట మీద నుంచి దించేయవచ్చు. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..!
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో సీనియర్ డైటీషియన్నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్. వెయిట్ లాస్‌కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం. ABC జ్యూస్ అంటే ఏమిటి? ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్) నిజానికి మూడింటి రసాల మిశ్రమం. యాపిల్(A) బీట్రూట్(B) క్యారెట్ (C) అలా టోటల్‌గా ఇది ABC జ్యూస్ అయిందన్నట్టు. వీటిని ప్రయోజనాలను విడివిడిగా చూస్తే. యాపిల్స్ అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ శక్తివంతమైన ,రుచికరమైన వెజిటబుల్. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణం ఇందులో ఉంది. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది. క్యారెట్ పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ పుల్కంగా ఉన్నాయి. క్యారెట్లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు. ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా? ఈ జ్యూస్‌లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి, ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్ సుగర్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్‌తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ABC జ్యూస్ దుష్ప్రభావాలు పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్లో ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్‌కు దూరంగా ఉండాలి. ఎలా చేసుకోవాలి రెండు యాపిల్స్, చిన్న క్యారెట్లు, ఒక బీట్ రూట్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసర్లో బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి. దీన్ని వడపోసుకుని తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. -
వీకెండ్ స్పెషల్: క్యారట్ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి
క్యారట్ చట్నీ తయారీకి కావల్సినవి: నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు; అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత; క్యారట్ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుము – టేబుల్ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను; జీలకర్ర – టీస్పూను; మినపప్పు – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను; ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ. తయారీ విధానమిలా: ∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్. -
క్యారట్‌తో మూంగ్‌దాల్ సలాడ్, ఓసారి ట్రై చేయండి
పచ్చిగా, కచ్చాపచ్చాగా, ఉడికించి... ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారట్.aఅందుకే కరకరల క్యారట్‌ను మరింత రుచిగా ఇలా కూడా వండుకోవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు... క్యారట్ మూంగ్‌దాల్ సలాడ్ తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – కప్పు; పెసరపప్పు –పావు కప్పు; పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు; నిమ్మరసం – రెండు టీస్పూన్లు; ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను. తయారీ విధానమిలా: పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.నానిన పప్పులో నీళ్లు వంపేసి పప్పుని పెద్ద గిన్నెలో వేయాలి ∙ఈ పప్పులో క్యారట్ తురుము, కొబ్బరి, పచ్చిమిర్చి తురుము, నిమ్మరసం, ఉప్పువేసి చక్కగా కల΄ాలి ∙చివరిగా కొత్తిమీర తరుగుతో వేసి సర్వ్‌చేసుకోవాలి. -
క్యారట్ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు
క్యారట్ లడ్డు తయారీకి కావల్సినవి: క్యారట్ తురుము – రెండు కప్పలు; ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు; కండెన్స్డ్ మిల్క్ – కప్పు; బాదం పలుకులు – రెండు టేబుల్ స్పూన్లు; రోజ్‌వాటర్ – అరటీస్పూను; యాలకుల పొడి – అరటీస్పూను; నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుమ – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానమిలా: రెండు స్పూన్ల నెయ్యివేసి కొబ్బరి తురుముని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి. కొబ్బరి వేగిన తరువాత క్యారట్ తురుము వేసి మీడియం మంట మీద పదినిమిషాలు వేయించాలి. ఇప్పుడు బాదం పలుకులు, కండెన్స్డ్ మిల్క్ వేసి కలపాలి. ఐదు నిమిషాల తరువాత రోజ్ వాటర్. యాలకుల పొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ మగ్గనివ్వాలి. మిశ్రమం చిక్కబడిన తరువాత దించేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుని,పైన కొద్దిగా పచ్చికొబ్బరితో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. -
ఇలా చేస్తే క్యారట్స్ను పిల్లలు ఇష్టంగా తింటారు..
క్యారట్ డేట్స్ స్వీట్ తయారికి కావల్సినవి: క్యారట్ తురుము – పావు కప్పు ; విత్తనాలు తీసేసిన డేట్స్ – పావు కప్పు; బెల్లం – పావు కప్పు; శనగపిండి – అరకప్పు; బ్రౌన్‌సుగర్ – కప్పు; నెయ్యి – అరకప్పు; నూనె- పావు కప్పు. తయారీ విధానమిలా.. శనగపిండిని జల్లెడ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ∙టేబుల్ స్పూను నెయ్యి వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో మిగిలిన నెయ్యి, నూనె వేసి ఐదు నిమిషాలు వేడి చేసి పక్కనపెట్టుకోవాలి. బెల్లంలో పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. బెల్లం కరిగిన తరువాత వడగట్టి పక్కన పెట్టాలి ∙ క్యారట్,డేట్స్, బెల్లం నీళ్లుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి .గ్రైండ్ చేసి ప్యూరీని ముక్కలు లేకుండా వడగట్టి తీసుకోవాలి. బాణలిలో బ్రౌన్ సుగర్, అరకప్పు నీళ్లుపోసి మరిగించాలి ∙షుగర్ కరిగిన తరువాత క్యారట్ డేట్స్ ప్యూరిని వేసి సన్ననని మంట మీద తిప్పుతూ ఉండాలి . తీగ పాకం వచ్చాక శనగపిండి వేసి ఉండలు లేకుండా కలపాలి.ఇప్పుడు కాచి పెట్టుకున్న నెయ్యి /నూనెను కొద్దికొద్దిగా వేస్తూ కలపాలి నెయ్యి మొత్తాన్ని మిశ్రమం పీల్చుకుని దగ్గరపడిన తరువాత దించి నెయ్యిరాసిన ప్లేటులో పోసుకోవాలి మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడు ముక్కలు కట్ చేసుకుంటే క్యారట్, డేట్స్ పాక్ రెడీ. ఇలా చేస్తే పిల్లలు క్యారట్‌ను ఎంతో ఇష్టంగా తింటారు. -
Health: ప్లేట్లెట్ల సంఖ్య పడిపోయిందా? బొప్పాయితో ఒక్కటే కాదు గుమ్మడి, గోధుమ గడ్డి..
Super Foods To Increase Platelet Count: ప్రస్తుత కాలంలో డెంగ్యూ జ్వరాలు, వైరల్ ఫీవర్ల మూలాన ప్లేట్లెట్ల కౌంట్ విపరీతంగా పడిపోతూ రోగులను, వారి సంబంధీకులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అయితే, ప్లేట్లెట్ల కౌంట్ పడిపోయిన తర్వాత చేయగలిగిందేమీ లేదు, దాతలనుంచి సేకరించిన ప్లేట్లెట్లను రోగులకు ఎక్కించడం మినహా. అలా కాకుండా, మంచి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే రోగ నిరోధకత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రోగనిరోధకతను పెంచే ఆహారం ఏమిటో తెలుసుకుందాం. రక్తాన్ని పెంచే క్యారట్.. ప్లేట్లెట్ కౌంట్‌ని కూడా పెంచుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఆ సమస్యతో బాధపడేవారు త్వరగా ఉపశమనం పొందారని సర్వేలో తేలింది. క్యారెట్‌ని నేరుగానైనా, సలాడ్ రూపంలోనైనా ఎలా తీసుకున్నా ఫలితం ఉంటుంది. గుమ్మడికాయ.. ఎక్కువగా వంటల్లో ఉపయోగించే గుమ్మడిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. అంతేనా.. ఇందులో ప్లేట్లెట్లని పెంచడమే కాదు, వాటి సంఖ్యను అదుపులో ఉంచే లక్షణాలు కూడా ఉన్నాయి. దీన్ని క్రమబద్ధంగా తీసుకోవడం వల్ల కణాల్లో ప్రోటీన్ ఉత్పత్తి అవుతుంది. ఇలా ప్రోటీన్ ఉత్పత్తి అవడమంటే ప్లేట్లెట్స్కౌంట్ పెరిగినట్లే. బొప్పాయి బొప్పాయి పండు ఆరోగ్యానికి, చర్మ సౌందర్యానికి చాలా మంచిదని తెలుసు. అయితే, కేవలం పండులో మాత్రమే కాదు.. ఈ ఆకుల్లోనూ బోలెడు ఆరోగ్యానికి సంబంధించిన గుణాలున్నాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్స్, అల్కాలాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. వీటిని తినడం వల్ల 24 గంటల్లోనే ప్లేట్లెట్ పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. అయితే, ఈ ఆకు రుచి మాత్రం కాస్త చేదుగానే ఉంటుంది. కానీ, ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకోకతప్పదు. గోధుమగడ్డి.. ఈ మధ్యకాలంలో చాలామందికి ఆరోగ్యంపై పెరిగిన అవగాహన కారణంగా.. గోధుమగడ్డి గురించి అందరూ ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఇందులోని ఎన్నో ప్రత్యేక గుణాలు ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి.. ఈ గడ్డిని రసంగా చేసుకుని వడపోసి అందులో కాస్త నిమ్మరసం కలిపి తాగాలి. ఇలా చేయడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ సులభంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. బీ 12 ఫుడ్.. ►పాలు, గుడ్లు, చీజ్‌లో బీ 12 ఎక్కువగా ఉంటుంది. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ బాగా పెరుగుతుందని తేలింది. ►బీట్ రూట్.. ఎరుపు రంగులో ఉండే బీట్రూట్.. శరీరంలో రక్త శాతాన్ని పెంచుతుంది. దీనిని ఎలా తీసుకున్నా మంచిదే. దీని వల్ల ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. ►క్యారట్, బీట్రూట్ని కలిపి జ్యూస్ చేసుకుని తాగినా మంచి ఫలితమే ఉంటుంది. విటమిన్ కె ఫుడ్.. విటమిన్ కె ఉన్న ఫుడ్ కూడా ప్లేట్లెట్స్ సంఖ్యని పెంచుతుందని తేలింది. కేల్, గుడ్లు, ఆకుకూరలు, లివర్, మాంసం, క్యాబేజీ తినడం వల్ల కూడా ప్లేట్లెట్స్ సంఖ్య పెరుగుతుంది. విటమిన్ సి ఫుడ్.. ►ఆరోగ్యానికి విటమిన్ సి చాలా అవసరం. ►విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, కమలాఫలం, కివీ, పాలకూర, ఉసిరి, బ్రొకోలీ, టమాట, అడవి ఉసిరి, కాలీఫ్లవర్ తినడం వల్ల ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుందని తేలింది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గించి కౌంట్‌ని పెంచడంలో ఈ ఆహారపదార్థాలు బాగా ఉపయోగపడతాయి. ►ప్లేట్లెట్స్ పడిపోయిన వారు సమస్యని పరిష్కరించుకునేందుకు వీటిని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ►ఒకవేళ తినడం కష్టం అనుకుంటే వీటితో సలాడ్ చేసి భోజనానికి ముందుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇక కమలాఫలాల్ని జ్యూస్‌లా చేసుకోని ►తాగేయొచ్చు. ►ముఖ్య విషయం ఏమిటంటే.. పైన చెప్పిన ఆహారపదార్థాలను తీసుకోవడం వల్ల కేవలం ప్లేట్లెట్స్ సంఖ్య ఒక్కటే పెరగదు.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. వాటిలో వ్యాధి నిరోధకత ఒకటి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. -
Health Tips: క్యారెట్లు, బీట్రూట్ తరచుగా తింటున్నారా? డేంజర్!
Health Reasons Not to Eat These Vegetables Too Much: ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది ఊబకాయం, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు సమస్యల బారిన పడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణం అనారోగ్యకరమైన ఆహారాలని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొన్ని రకాల కూరగాయల వల్ల కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయి. ఎలాంటి కూరగాయలను తీసుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు వస్తున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. కాలీఫ్లవర్ కాలీఫ్లవర్ ఆరోగ్యకరమైన కూర అయినప్పటికీ ఇది అందరికీ పడదు. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయి. ముఖ్యంగా దీనివల్ల ఎసిడిటీ, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాలీఫ్లవర్‌ను ఎప్పుడూ పచ్చిగా తినకూడదని నిపుణులు తెలుపుతున్నారు. దీనిని పచ్చిగా తినడం వల్ల కడుపు నొప్పి రావడంతోపాటు పొట్టలో దీర్ఘకాలిక సమస్యలకు గురయ్యే అవకాశాలున్నాయి. పుట్టగొడుగులు పుట్టగొడుగులు శరీరానికి మంచి పోషకాహారం అయినప్పటికీ దీనిని అతిగా తీసుకోవద్దని నిపుణులు తెలుపుతున్నారు. వీటిని ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే.. అలెర్జీ సమస్యలు వస్తాయి. అందువల్ల వీటిని తీసుకున్నప్పుడు ఏవైనా తేడాగా అనిపిస్తే దానికి దూరంగా ఉండటం మేలు. వండుకునేటప్పుడు కూడా నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. క్యారట్లు క్యారట్లలో బాడీకి అవసరమైన అన్ని పోషకాలు ఉంటాయి. కానీ వీటిని పచ్చిగా తింటే.. అనారోగ్య సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటిని తినేముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వీటిని అతిగా తీసుకుంటే.. చర్మం రంగు మారే అవకాశాలు కూడా ఉన్నాయి. బీట్రూట్ బీట్రూట్స్ను సలాడ్లలో ఎక్కువగా వినియోగిస్తారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి ప్రయోజనాలున్నా.. అతిగా తీసుకుంటే శరీరానికి ప్రమాదకరంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు వీటిని ఎక్కువగా తీసుకోకపోవడమే మంచిది. అందువల్ల ఎవరైనా సరే, వీటిని పరిమిత పరిమాణంలో తీసుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు. చదవండి: Hypothyroidism During Pregnancy: రెండో నెల.. హైపో థైరాయిడ్! డైట్‌తో కంట్రోల్ చెయ్యొచ్చా? Bone Pain: ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకున్నారంటే! -
Health Tips: రోజూ క్యారెట్ తినే అలవాటుందా? అయితే..
క్యారెట్లు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి. మొక్కల ఆధారిత ఆహారాలు వాస్తవానికి అధిక కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి, నిర్వహించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణుల అధ్యయనాలలో తేలింది. ►క్యారెట్లో సహజంగా ఖనిజాలు, విటమిన్లు, కరిగే ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ►ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సహాయపడతాయి. ►నిపుణుల అభిప్రాయం ప్రకారం, క్యారెట్‌లోని విటమిన్ ఎ, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్, దీర్ఘకాలిక గుండె జబ్బుల నుండి రక్షించడంలో సహాయపడతాయి. ►వాస్తవానికి, యాంటీ ఆక్సిడెంట్ల ఉనికి కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ►ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. ►అందువల్ల క్యారట్ తీసుకోవడం వల్ల చెడు కొలస్ట్రాల్ స్థాయులు తగ్గిపోతాయి. క్యారెట్ సూప్ చేసుకోండిలా! కావల్సినవి: క్యారెట్లు – 3 (శుభ్రపరిచి, ముక్కలు చేయాలి) ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి) చిలగడ దుంప – 1 (తొక్క తీసి, ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు – 2 (తరగాలి), కొత్తిమీర – పావు కప్పు నీళ్లు – తగినన్ని, కూరగాయలు ఉడికించిన నీళ్లు – కప్పు టొమాటో గుజ్జు – అర కప్పు, పండుమిర్చి ముద్ద – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, కారం – పావు టీ స్పూన్, నూనె – టేబుల్ స్పూన్ తయారీ: క్యారెట్లు, ఉల్లిపాయలు, చిలగడదుంప, వెల్లుల్లి, కొత్తిమీర ఒక గిన్నెలో వేసి నీళ్లు పోయాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి సన్నని మంట మీద 15 నిమిషాలు ఉడికించాలి. తర్వాత చల్లారనివ్వాలి. నీళ్లు వడకట్టి కూరగాయల ముక్కలన్నీ మెత్తగా రుబ్బాలి. పొయ్యి మీద గిన్నె పెట్టి నూనె వేసి కాగాక టొమాటో గుజ్జు, పండుమిర్చి ముద్ద, ఉప్పు, కారం కలిపి ఉడికించాలి. దీంట్లో కూరగాయలు వడకట్టిన నీళ్లు, రుబ్బిన మిశ్రమం కలిపి, మిరియాల పొడి వేసి ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి వేడి వేడిగా అందించాలి. చదవండి: C- Section Wound Infection: సిజేరియన్.. కుట్ల నుంచి చీము.. ఏమైనా ప్రమాదమా? Detoxification: నోటి దుర్వాసన, చెమట నుంచి చెడు వాసన.. శరీరంలోని విషాలు తొలగించుకోండిలా! ఇవి తింటే మాత్రం.. -
Health: విటమిన్ ‘ఏ’ లోపిస్తే సంతానలోపం సహా పలు సమస్యలు.. ఇవి తింటే!
Vitamin A Deficiency Symptoms Problems: కొందరిలో ఎన్ని చర్యలు తీసుకున్నా, మొటిమలు తగ్గవు. అలాగే గాయాలు త్వరగా మానవు. కొందరు చిన్నారులలో అయితే ఎదుగుదల సరిగా ఉండదు. విటమిన్ ఏ లోపం ఉన్న వారిలో ఈ సమస్యలన్నీ కనిపిస్తాయి. మీ పిల్లలు సరిగా ఎగకపోతున్నా, మీకు అయిన గాయాలు త్వరగా మానకపోతున్నా విటమిన్ ఎ లోపించినట్లు భావించాలి. విటమిన్ ఎ లోపిస్తే ఇంకా ఏమేం సమస్యలు వస్తాయి, దానిని భర్తీ చేయాలంటే తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో తెలుసుకుందాం. కొందరిలో నిత్యం గొంతు, ఛాతీ ఇన్ఫెక్షన్లు వస్తుంటాయి. సీజన్‌తో సంబంధం లేకుండా ఈ సమస్య వేధిస్తుంటుంది. దీనికి కూడా విటమిన్ ఏ లోపం కారణమై ఉండొచ్చు. చిన్నారుల్లో విటమిన్ లోపం ఉంటే ఎదుగుదల సరిగ్గా ఉండదు. కాబట్టి చిన్నారుల ఎదుగుదలలో ఆశించిన స్థాయిలో మార్పు కనిపించకపోతే చిన్నపిల్లల వైద్య నిపుణులు సంప్రదించడం ఉత్తమం. ►విటమిన్ ఏ లోపం ఉన్న వారిలో సంతాన లోపం కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రత్యుత్పత్తి వ్యవస్థ సరిగ్గా పనిచేయాలన్నా విటమిన్ ఎ తగినంత ఉండాలి. కాబట్టి దీర్ఘకాలంగా సంతాన లోపంతో బాధపడేవారిలో ఈ విటమిన్ లోపం ఉండే అవకాశాలు లేకపోలేవు. ►విటమిన్ ఏ లోపం కారణంగా కంటి సంబంధిత వ్యాధులు వస్తాయని మనందరికీ తెలుసిందే. మరీ ముఖ్యంగా విటమిన్ ఏ లోపం ఎక్కువైతే రే చీకటి వస్తుంది. రాత్రుళ్లు కంటి చూపు సరిగ్గా లేకుంటే విటమిన్ ఏ లోపం ఉందని గుర్తించాలి. ►కొందరిలో తరుచూ కళ్లు పొడిబారుతుంటాయి. విటమిన్ ఏ లోపం ఉండే వారిలో కనిపించే ప్రధాన లక్షణాల్లో ఇదీ ఒకటి. కాబట్టి ఇలాంటి సమస్య దీర్ఘకాలంగా వేధిస్తుంటే వైద్యులను సంప్రదించాలి. ►విటమిన్ ఏ లోపం కారణంగా చర్మ సంబంధిత వ్యాధులు కూడా వస్తుంటాయి. ముఖ్యంగా చర్మం పొడి బారుతుంటుంది. దీర్ఘ కాలంగా పొడి చర్మం సమస్య వేధిస్తుంటే విటమిన్ ఏ లోపమని గుర్తించాలి. ►పైన చెప్పుకున్న లక్షణాలన్నీ విటమిన్ ఏ లోపం వల్లే వచ్చేవే అయినప్పటికీ.. కొన్ని ఇతర అనారోగ్య సమస్యల వల్ల కూడా లక్షణాలు కనిపిస్తుంటాయి. కాబట్టి వీటినే ప్రామాణికంగా తీసుకొని విటమిన్ ఏ లోపమనే నిర్ణయానికి రాకుండా వైద్యులను సంప్రదించడం ఉత్తమం. ఇప్పుడు విటమిన్ ఏ పుష్కలంగా లభించే ఆహార పదార్ధాలేమిటో చూద్దాం! క్యారట్లు: విటమిన్ ఏ కి ఉత్తమ ఆహారం క్యారట్లు. క్యారట్ హల్వా అందరికీ ఇష్టమే కానీ, క్యారట్స్ లో ఉన్న పోషకాలు మనకి అందాలంటే మాత్రం పచ్చివి తింటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. లేదా జ్యూస్ తీసుకుని తాగచ్చు. చిలగడ దుంప: చిలగడ దుంప లో కూడా విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. ఇది మంచి చిరుతిండి. దీనిని ఉడకబెట్టి తినేయవచ్చు. లేదంటే, వీటితో ఇతర రకాల పిండివంటలు చేసుకోవచ్చు. సూప్స్, సలాడ్స్ కూడా బాగుంటాయి. తక్కువ మోతాదులో పచ్చివి తిన్నా మంచిదే. ఆకు కూరలు: ఒకప్పుడు ఆకుకూరలు లేని భోజనం ఉండేది కాదు. మీకు గుర్తుంటే చిన్నప్పుడు ముందు ఆకు కూరలే తినమనేవాళ్ళు కూడా. అయితే, ఆకు కూరల్లో ఉండే పోషకాలన్నీ మనకి అందాలంటే వాటిని సరిగ్గా వండాలి. అంటే, ఎంత తక్కువ వండితే అంత ఎక్కువ మంచిది. గుమ్మడికాయ: తియ్య గుమ్మడికాయ పులుసు తినని వారు ఉండరు. తియ్య గుమ్మడి ఎంత రుచిగా ఉంటుందో అంత ఆరోగ్యకరం కూడా. ఒక్క పులుసే కాదు, తియ్య గుమ్మడి తో సూప్స్, పైస్, స్నాక్స్ వంటివి చేసుకోవచ్చు. తియ్యగుమ్మడిలో విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది. పాలు: మనందరం చిన్న పిల్లలకి రెగ్యులర్ గా ఒక గ్లాస్ పాలు ఇస్తాం. పాలలో కాల్షియమే కాదు విటమిన్ ఏ కూడా ఉంటుంది. పిల్లలతో పాటూ పెద్ద వాళ్ళు కూడా ఒక గ్లాస్ పాలు తాగడం వల్ల ఎన్నో డిసీజెస్ నించి రక్షింపబడతాం. టొమాటో: టొమాటో మన వంటల్లో నిత్యం ఉండే పదార్ధమే. పప్పు, కూర, రసం, పచ్చడి ఎందులోనైనా అందులో కొంచెం టొమాటో ఉంటే వచ్చే రుచే వేరు. పైగా ఇవన్నీ కేవలం టొమాటో తోనే కూడా చేసుకోవచ్చు. విటమిన్ ఏ మాత్రమే కాక టొమాటో లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలం గా ఉన్నాయి. ఇవి కాన్సర్ సెల్స్ పెరగకుండా అడ్డుకుంటాయి. ఇందులో ఉండే క్రోమియం బ్లడ్ షుగర్ లెవెల్స్ ని అదుపులో ఉంచుతుంది. ►విటమిన్ ఎ ను పొందడం కోసం ట్యాబ్లెట్లు, ఇతర సప్లిమెంట్లపై ఆధార పడటం కన్నా, అది మెండుగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవడం ఉత్తమం. చదవండి: Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ జరిగేది ఇదే.. ఈ ఆహార పదార్థాలు తింటే మేలు! -
క్యారెట్, నిమ్మకాయ, ఆలుగడ్డ.. మచ్చలు మటుమాయం!
Home Remedies for Black Spots on Face: క్యారెట్, నిమ్మకాయ, బంగాళ దుంప ఒక్కోటి తీసుకుని శుభ్రంగా కడిగి తడిలేకుండా తుడుచుకోవాలి. తరువాత ఈ మూడింటిని తొక్క తీయకుండా సన్నగా తురుముకోవాలి. వీటన్నిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలిపి 24 గంటలపాటు మూతపెట్టి ఉంచాలి. తరువాత గిన్నెలో ఉన్న తురుమును వడగట్టి నీటిని వేరు చేసి ఒక గిన్నెలో మూడు టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్, వడగట్టి పెట్టుకున్న రసం మూడు టీస్పూన్లు వేసి, కొద్దిగా బాదం నూనెవేసి పేస్టులా కలుపుకోవాలి. చివరిగా ఈ విటమిన్ క్యాప్యూల్స్ ఒకటి వేసి కలిపితే క్రీం రెడీ అయినట్లే. దీనిని గాజు సీసాలో స్టోర్ చేసుకుని రోజూముఖానికి రాసుకుంటే నల్లని మచ్చలు తగ్గి ముఖ వర్ఛస్సు పెరుగుతుంది. రోజూ రెండుసార్లు ముఖానికి రాసుకుంటూ ఉంటే మంచి ఫలితం త్వరగా వస్తుంది. చదవండి: Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్ పుష్కలం.. ఒక్కసారి తాగారంటే!
Apple Carrot Orange Juice Recipe Health Benefits- యాపిల్ క్యారట్ ఆరెంజ్ జ్యూస్‌లో విటమిన్ సి, ఏ, యాంటీ ఆక్సిడెంట్స్, బీటా కెరోటిన్స్ పుష్కలంగా ఉండి ఫ్రీ రాడికల్స్‌పై పోరాడతాయి. క్యారట్, యాపిల్, ఆరెంజ్‌లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందించి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మండే ఎండల్లో ఈ జ్యూస్ తియ్యగా, పుల్లని రుచితో ఉండి దాహార్తిని తీరుస్తుంది. కావలసినవి: క్యారట్స్ – రెండు, యాపిల్స్ – రెండు, ఆరెంజెస్ – మూడు, నీళ్లు – కప్పు, అల్లం రసం – అరటీస్పూను, పసుపు – పావు టీస్పూను, మిరియాల పొడి – పావు టీస్పూను, ఐస్ ముక్కలు – నాలుగు. తయారీ: క్యారట్స్, యాపిల్స్‌ను తొక్క, గింజలు తీసి ముక్కలుగా తరగాలి. ఆరెంజ్‌లను తొక్కతీసి జ్యూస్ తీసుకోవాలి. క్యారట్ ముక్కలను బ్లెండర్లో వేయాలి. దీనిలో ఆరెంజ్ జ్యూస్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. క్యారట్ గ్రైండ్ అయ్యాక యాపిల్ ముక్కలు, అల్లం రసం, పసుపు, మిరియాలపొడి, నీళ్లు పోసి మరోసారి చక్కగా గ్రైండ్ చేసుకుని గ్లాసులో పోసుకోవాలి. దీనిలో కొద్దిగా ఐస్ ముక్కలను వేసుకుని తాగితే జ్యూస్ చాలా బావుంటుంది. చదవండి: Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే! -
Health Tips: గుండె సమస్యలను పారదోలడంలో ఇది బెస్ట్!
శీతాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఆరోగ్య సమస్యలు పొంచి ఉంటాయి. ముఖ్యంగా కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచడానికి క్యారెట్‌ను ఖచ్చితంగా తీసుకోవాలి. క్యారెట్లో బీటా-కెరోటిన్ స్థాయిలు నిండుగా ఉంటాయి. ఈ బీటా-కెరోటిన్ మన శరీరంలో విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెంది రక్తంలోని చెడుకొవ్వులను తొలగించడంలో కీలకంగా వ్యవహరిస్తుందని ఇల్లినాయిస్ యూనివర్సిటీ అధ్యనాలు వెల్లడించాయి. తద్వారా గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనిలోని ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియంలతోపాటు బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ, కంటి ఆరోగ్యం, చర్మ-ఆరోగ్యం.. వంటి ప్రయోజనాలను చేకూర్చే విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు. క్యారెట్‌ను సలాడ్‌గా మాత్రమేకాకుండా ఈ కింది ప్రత్యేక రుచుల్లో కూడా తినొచ్చు. అవేంటో తెలుసుకుందాం.. క్యారెట్- ఆరెంజ్ డిటాక్స్ డ్రింక్ రెండు క్యారెట్లు, ఆరెంజ్ పండ్లు రెండు తీసుకుని విడివిడిగా జ్యూస్తయారు చేసుకోవాలి. తర్వాత రెండింటిని ఒక గ్లాసులో బాగా కలుపుకుని,దీనికి టేబుల్ స్పూన్ చొప్పున పసుపు, నిమ్మరసం, 2 స్పూన్ల అల్లం పేస్టు జోడించి బాగా కలుపుకోవాలి. ఈ ద్రావణాన్ని ఉదయాన్నేతాగితే శరీరంలోని వ్యర్ధాలను తొలగించడమేకాకుండా రోజంతా యాక్టీవ్‌గా ఉంచుతుంది. క్యారెట్-అల్లం సూప్ బాణీలో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్, తరిగిన అల్లం ముక్కలు వేసి వేయించాలి. తర్వాత అరకప్పు తరిగిన ఉల్లి ముక్కలు , ముక్కలుగా కట్‌చేసిన క్యారెట్లను (6 పెద్దవి) వేసి, ఒక టీ స్పూన్ సాల్ట్, కప్పు నీళ్లు పోసి మెత్తబడేవరకు ఉడికించాలి. తర్వాత నీళ్లను ఒక గిన్నెలో ఒంపి క్యారెట్లను మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒంపిన నీళ్లను ఈ మిశ్రమానికి కలిపి స్టౌ మీద చిక్కబడే వరకు కలుపుకోవాలి. ఆర స్పూను చొప్పున మిరియాల పొడి, సాల్ట్ కలుపుకుంటే సూప్ రెడీ! వింటర్లో మీ ఆరోగ్యాన్ని కాపాడటంలో ఈ సూప్ సహాయపడుతుంది. క్యారెట్ క్రాకర్స్ ఒక గిన్నెలో మైదా పిండి, ఆవాల పొడి, వెన్న, జీలకర్ర, క్యారెట్, జున్ను, నీరు, గుడ్డు సొన వేసి మెత్తగా పిండిని కలుపుకోవాలి. 30 నిమిషాలు తర్వాత, పిండిని మందంగా పరిచి, గుండ్రంగా బిస్కెట్ సైజులో కట్‌చేసుకోవాలి. 10-12 నిముషాల వరకు బంగారు రంగు వచ్చేవరకు బేక్ చేస్తే క్యారెట్ క్రాకర్స్ రెడీ! దీనిని స్నాక్స్ రూపంలో తినొచ్చు. చదవండి: African Wild Dogs: దయచేసి ఒక్కసారి తుమ్మి మా పార్టీని గెలిపించండి..!! -
మీ పిల్లల్లో ఇమ్యునిటి పెరగాలా.. ఇవి తినిపించండి..
కరోనాను ఎదిరించాడానికి ప్రతి ఒక్కరికి శక్తి అవసరం. పెద్దలకి అయితే, కాస్తంత ఇమ్యూనిటి పవర్ ఎక్కువ. మరి చిన్నారులకు సహజంగానే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అందుకే వారికి త్వరగా వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరముల ప్రమాదం ఎక్కువ. అయితే మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలను వారికి రోజూ తినిపిస్తే చాలు.. వారి రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడొచ్చు. మరి ఆ పదార్థాలు ఏమిటో చూద్దాం..! పెరుగు: నిత్యం పెరుగును కచ్చితంగా తినిపించాలి. దీంతో వారి శరీరంలో ఉండే చెడు బాక్టీరియా నశిస్తుంది. జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. పెరుగులో ఉండే కాల్షియం పిల్లల ఎముకలను దఢంగా చేస్తుంది. నిమ్మజాతి పండ్లు: నిమ్మజాతికి చెందిన నారింజ, బత్తాయి తదితర పండ్లను చిన్నారులకు ఇవ్వడం వల్ల వాటిలో ఉండే విటమిన్ సి పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దగ్గు, జలుబు, జ్వరం వంటి శ్వాసకోశ వ్యాధులను రాకుండా చూస్తుంది. నట్స్: రోజూ జీడిపప్పు, బాదం, పిస్తాపప్పు తదితర నట్స్‌ను తినిపించడం వల్ల వాటిలో ఉండే పోషకాలు వారిలో రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. అలాగే పిల్లలు బలంగా తయారవుతారు. వారికి సంపూర్ణ పోషణ లభిస్తుంది. అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. క్యారెట్లు: పిల్లలకు విటమిన్ ఎ, జింక్ సమద్ధిగా లభించాలంటే వారికి నిత్యం క్యారెట్లను తినిపించాలి. వీటితో కంటి చూపు మెరుగు పడుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరిగి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. -
క్యారెట్.. ఆ టేస్టే సెపరేట్
క్యారెట్ ఇడియాప్పం కావలసినవి: బియ్యప్పిండి – రెండున్నర కప్పులు; క్యారెట్ గుజ్జు – 1 కప్పు; వేడి నీళ్లు – ఒకటిన్నర కప్పులు; మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – 1 టేబుల్ స్పూన్; నూనె – కొద్దిగా; ఫుడ్ కలర్ – అభిరుచి బట్టి తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, క్యారెట్ గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ కలుపుకోవాలి. తర్వాత కొద్దికొద్దిగా వేడి నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకుని, వేడి తగ్గేదాకా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ కూడా వేసుకుని.. ఆ మిశ్రమాన్ని చేత్తో బాగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాన్‌లోని ప్రతి బౌల్‌కి బ్రష్‌తో నూనె పూసుకోవాలి. తర్వాత జంతికలు లేదా కారప్పుస మేకర్‌కి సన్నని హోల్స్ ఉంటే ప్లేట్‌ని అటాచ్ చేసుకుని, అందులో ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా నింపుకుని ఇడ్లీ పాన్‌లో చిత్రంలో కనిపిస్తున్న విధంగా(నూడుల్స్‌లా) చేసుకోవాలి. ఉడికిన తర్వాత కొద్దిగా కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. టేస్టీ కీమా బాల్స్ కావలసినవి : మటన్ కీమా – అర కిలో(మెత్తగా ఉడికించుకోవాలి); కినోవా – ఒకటిన్నర కప్పు (మార్కెట్లో లభిస్తాయి); చిలగడదుంప ముక్కలు – 2 కప్పు(ఉడికించినవి) పెసలు – అర కప్పు (రాత్రిపూట నానబెట్టుకోవాలి); వెల్లుల్లి గుజ్జు – అర టీ స్పూన్; అల్లం తురుము – పావు టీ స్పూన్; మిరియాలు – 5 లేదా 6; పసుపు – 1 టీ స్పూన్; సోయాసాస్ – ఒకటిన్నర టీ స్పూన్లు; ఎండు మిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్; ధనియాల పొడి – 1 టీ స్పూన్; టమాటా గుజ్జు – 2 కప్పులు; టమాటా సాస్ – 2 కప్పులు; నీళ్లు – 2 కప్పులు; కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్; తాళింపు సామాన్లు – కొద్దిగా; ఉప్పు – కొద్దిగా; నూనె – సరిపడా. తయారీ : ముందుగా కినోవా శుభ్రం చేసుకుని సరిపడా నీళ్లు వేసుకుని ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సీ బౌల్ తీసుకుని అందులో ఉడికించిన కినోవా, చిలగడదుంప ముక్కలు, నానబెట్టిన పెసలు, వెల్లుల్లి గుజ్జు, అల్లం తురుము, మిరియాలు వేసుకుని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకున్న మటన్ కీమా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ మొత్తం మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, అందులో కినోవా, పసుపు, ఉప్పు, సోయాసాస్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా తయారుచేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని పాత్రలో నూనె వేసుకుని, ఆ బాల్స్‌ని గరిటెతో ముందుకీ వెనక్కి తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఆ తర్వాత మరో పాత్ర తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని, తాళింపు సామాన్లు వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. ఇప్పుడు టమాటా గుజ్జు, టమాటా సాస్, నీళ్లు, ఎండు మిర్చి పేస్ట్, ధనియాల పొడి వేసుకుని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఆ బాల్స్‌ని ఉడికించుకోవాలి. కొత్తిమీర తురుముతో గార్నిష్ చేసుకుని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఈ బాల్స్ భలే రుచిగా ఉంటాయి. బాదం పూరీ కావలసినవి: మైదాపిండి – 1 కప్పు; బాదం పేస్ట్ – పావు కప్పు(బాదం గింజలను 8 గంటల పాటు నానబెట్టి మిక్సీ పట్టుకోవాలి); నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; బియ్యప్పిండి – అర కప్పు; ఉప్పు – తగినంత; ఏలకుల పొడి – అర టీ స్పూన్; నీళ్లు – 1 కప్పు; పంచదార – 2 కప్పులు;కుంకుమ పువ్వు – కొద్దిగా; లవంగాలు – పూరీల సంఖ్యను బట్టి; తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, బాదం పేస్ట్, బియ్యప్పిండి, నెయ్యి, ఉప్పు వేసుకుని బాగా కలుపుతూ ముద్దలా చేసుకోవాలి. ఈ సమయంలోనే పక్కన స్టవ్ వెలిగించుకుని పంచదార, నీళ్లు వేసుకుని పాకం దగ్గర పడేముందు(తీగలుగా రాగానే) ఏలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బాదం–మైదా మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని, వాటిని చిన్నచిన్న పూరీలుగా తయారు చేసుకోవాలి. వాటిని రెండు సార్లు (త్రిభుజాకారం వచ్చేలా) ఫోల్డ్ చేసి, మరోసారి చపాతీ కర్రతో ఒత్తాలి. ఇప్పుడు లవంగాలను తీసుకుని.. ఒక్కో పూరీకి ఒక్కొక్కటి పెట్టి వాటిని నూనెలో వేయించి, వేడివేడిగానే పాకంలో వేసుకోవాలి. వేడివేడిగా ఉన్నప్పుడే వీటిపైన పిస్తా, బాదం వంటి డ్రైఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. -
ఇలా చేస్తే... అందం మీ సొంతం
∙క్యారెట్, ఓట్స్ పౌడర్, పంచదార, పసుపు కలిపి మెత్తని పేస్ట్ చేసుకుని మొటిమలపై అప్లై చేసుకుంటే మొటిమలు తగ్గుతాయి. ∙ క్యారెట్, నారింజ రసం, పంచదార తీసుకుని మూడింటినీ కలిపి మెత్తని పేస్ట్ చేసుకోవాలి. జిడ్డు చర్మం ఉన్న వారు ఈ పేస్ట్‌ని ముఖానికి అప్లై చేసుకుంటే ఫలితం ఉంటుంది. ∙ముఖానికి మేకప్ వేసుకునే ముందు క్యారెట్, నారింజ రసం రెండింటినీ కలిపి ముఖంపై వలయాకారంలో మసాజ్ చేయాలి. తర్వాత ముఖాన్ని చన్నీటితో కడిగేసి 20 నిమిషాల తర్వాత మేకప్ వేసుకోవాలి. ఇలా చేస్తే మేకప్ మరింత అందంగా కనబడుతుంది. ∙మెడ చుట్టూ చర్మం నల్లగా ఉన్నవారు... క్యారెట్ పేస్ట్‌లో నిమ్మరసం, పంచదార పొడి వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా మెడ చుట్టూ నల్లగా ఉన్న చర్మంపై నూనె రాసి తయారుచేసుకున్న మిశ్రమాన్ని అప్లై చేసి మసాజ్ చేయాలి. -
ఫాస్ట్‌ఫుడ్ కోసం కంగారూల దాడులు..
పెర్త్, ఆస్ట్రేలియా : అటవీ కంగారూల గుంపు యాత్రికులపై దాడులకు పాల్పడుతున్నాయి. అయితే, కంగారూలు దాడికి పాల్పడటానికి కారణం తెలిస్తే మాత్రం షాక్‌కు గురి కావాల్సిందే. క్యారెట్లు, మెక్‌డొనాల్డ్స్, కేఎఫ్‌సీ ఫాస్‌ఫుడ్స్‌కు అలవాటు పడిన కంగారూలు వాటి కోసమే దాడులు చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాత్రికులు తమ వెంట తెచ్చుకున్న ఆహారాన్ని కంగారూలకు పెడుతూ సెల్ఫీలు దిగటం మోర్రి సెట్ పార్కులో మామూలే. అయితే, కంగారూలకు ఫాస్ట్ ఫుడ్ తీసుకోవడం ఒక వ్యసనంగా మారింది. పర్యాటకులు ఎక్కువగా రాని సమయాల్లో ఆహారం కోసం అవి దాడులకు పాల్పడుతున్నాయి. ఈ దాడుల్లో తీవ్రగా గాయపడిన ఓ మహిళకు 17 కుట్లు పడ్డాయి. ఫాస్ట్‌పుడ్స్‌ను తీసుకోవడం వల్ల కంగారూల ఆరోగ్యం వేగంగా దెబ్బతింటుంది. వాటి జీర్ణవ్యవస్థకు సరిపడని ఆహారం కావడమే ఇందుకు కారణం. క్యారెట్లను కంగారూలు ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి అధిక కోపాన్ని ప్రదర్శిస్తాయని నిపుణులు తెలిపారు. -
మొటిమలు రాకుండా ఉండాలంటే..
న్యూఢిల్లీ : యుక్త వయసులో ఉన్న అమ్మాయిలను, అబ్బాయిలను భయపెట్టేది పరీక్షలు కాదు, సిలబస్ కాదు ...మరేంటంటే ‘ఆక్నే’ మన భాషలో చెప్పాలంటే మొటిమలు. అవును చంద్రబింబం లాంటి ముఖారవిందాన్ని పాడు చేయడానికి చిన్న మొటిమ చాలు. అందుకే మొటిమలంటే అంతలా భయపడతారు. మరి ఈ మొటిమలు ఎందుకు వస్తాయి, రాకుండ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాటిని ఎలా తగ్గించుకోవాలో ఓ సారి చూద్దామా... మొటిమలు అనేవి చర్మ సంబంధిత సమస్య. మొటిమలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. నూనే, చనిపోయిన చర్మ కణాలు చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల, ఒత్తిడి, హర్మోన్ల మార్పు, మోనోపాజ్ ఇలా రకరకాల కారణాలు. మారుతున్న జీవనశైలి కూడా మొటిమలు రావడానికి కారణం. మొటిమలు రాకుండా ఉండాలంటే రాత్రి పడుకునేముంది మేకప్‌ను పూర్తిగా తొలగించాలి రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. జిడ్డు చర్మం వారు అయితే ఎక్కువ సార్లు శుభ్రంచేసుకోవాలి. మేకప్‌ను తొలగించడానికి అల్కహాల్ రహిత మేకప్ రిమూవరన్ని ఉపయోగించాలి. తర్వాత డీప్ పూర్ క్లెన్సర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఆరోగ్యకరమైన, తాజా ఆహారాన్ని తీసుకోవాలి. జంక్ ఫుడ్, మసాలాలకు దూరంగా ఉండాలి. వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. నీరు శరీరం నుంచి విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. దీని వల్ల చర్మం తాజాగా, తేమగా ఉంటుంది. ప్రతిరోజు యోగా చేయ్యాలి. శ్వాస తీసుకోవడం, శ్వాసకు సంబంధించిన వ్యాయమాలు చేయడం వల్ల శరీరమంతా మెరుగైన రక్త ప్రసరణ జరుగుతుంది. ఫలితంగా మొటిమలు రాకుండా ఉంటాయి. ముఖాన్ని శుభ్రపర్చుకోవడానికి సబ్బు వాడకూడదు. సబ్బు వాడటం వల్ల ముఖం పొడిబారుతుంది. బాక్టీరియా వ్యాపించడానికి ఆస్కారం ఉంటుంది. సూర్యరశ్మి వల్ల చర్మం దెబ్బతినకుండా ఉండటానికి సన్ స్క్రీన్ లోషన్ ఉపయోగించాలి. వీటితో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మొటిమలు రాకుండా నివారించవచ్చు. ఆకు కూరలు ఆకుపచ్చ కూరలు బచ్చలి, పాలకూర వంటివి మీ రోజు వారి ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిలో పుష్కలంగా ఉన్న విటమిన్ ఏ ఆంటీ ఏజింగ్ ఎజెంట్‌గా పనిచేస్తుంది. అంతేకాకుండా జీర్ణవ్యవస్థలో ఉన్న బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు పంపిస్తుంది. పసుపు మొటిమలను తగ్గించడానికి పసుపు చాలా బాగా ఉపయోగపడుతుంది. చర్మ నిగారింపుకు కూడా పసుపును వావడతారు. పసుపును ఆహారంలో తీసుకోవడం వల్ల మొటిమలను కలిగించే బాక్టీరియాను, విషపదర్ధాలను బయటకు నెట్టి వేస్తుంది. క్యారేట్ క్యారేట్లలో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల రోజువారి ఆహారంలో వీటిని భాగం చేసుకోవాలి. సాల్మన్ వీటిల్లో ఓమేగా3 ఫాటీ ఆమ్లాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మొటిమలను నివారించడమే కాక నొప్పి, వాపుని తగ్గిస్తుంది. -
ఎగ్ లెస్.. లెస్స!
గుడ్డు లేకుండా గుడ్ కేక్ తినండి. ఇంట్లో చేసుకుని గుటుక్కుమనిపించండి. క్రిస్మస్ అంటేనే.. గుడ్ టైమ్. గుడ్డు తినని వాళ్లకు గుడ్ కేక్ ఎలా? అందుకే ఈ గుడ్డులెస్ కేక్! ఫ్రెష్ ఫ్రూట్ కేక్ కావలసినవి: మైదాపిండి – కప్పు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; తాజా క్రీమ్ – పావు కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కస్టర్డ్ పౌడర్ – టీ స్పూను; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; ఉప్పు – 2 కప్పులు; చిలకరించిన క్రీమ్ – 500 గ్రా.; పంచదార పొడి – పావుకప్పు; పంచదార సిరప్ – పావు కప్పు; తాజా పండ్ల ముక్కలు – (కివి, కమలాపండు తొనలు, స్ట్రాబెర్రీ, దానిమ్మ గింజలు, చెర్రీలు, ఆపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు) – తగినన్ని తయారి: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ ఉంచి, స్టౌ మీద మీడిమం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార వేసి బాగా క్రీమీగా వచ్చేవరకు కలిపాక, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ జత చేసి సుమారు రెండు మూడు నిమిషాలు బాగా గిలకొట్టాక, పావు కప్పు క్రీమ్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙మైదాపిండి, బేకింగ్ పౌడర్, కస్టర్డ్ పౌడర్... వీటిని జల్లెడ పట్టి, పైన తయారు చేసి ఉంచుకున్న మిశ్రమంలో వేసి కలపాలి ∙ఏడు అంగుళాల అల్యూమినియం కేక్ ట్రే కి బటర్ రాసి, కేక్ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, కుకర్‌లో ఉంచి సుమారు అరగంటసేపు సన్నని మంట మీద ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపి, పది నిమిషాలు చల్లారాక, అంచుల మీదుగా చాకుతో కట్ చేసి కేక్‌ను బయటకు తీయాలి ∙500 మి.లీ. క్రీమ్‌ను బాగా గిలక్కొట్టాలి. పావు కప్పు పంచదార పొడి జత చేసి మరోమారు గిలక్కొట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. (వాడే ముందు మాత్రమే బయటకు తీయాలి) ∙కేక్‌ను ఒక ప్లేట్లోకి తిరగదీసి అంచులను చాకుతో నీట్‌గా కట్ చేయాలి ∙చాకుతో కేక్ చుట్టూ క్రీమ్ అప్లయ్ చేయాలి. పైన మధ్యభాగంలో మాత్రం కొద్దిగా ఎక్కువ క్రీమ్‌ను ఉంచి, దాని మీద కొద్దిగా పంచదార సిరప్ చిలకరించి ఆ పైన మరి కాస్త క్రీమ్ వేసి, దాని మీద తాజా పండ్ల ముక్కలు వేసి, చేతితో నెమ్మదిగా ఒత్తాలి ∙పైన మళ్లీ క్రీమ్, పళ్ల ముక్కలు వేసి ఒత్తాలి. ఇలా మూడు పొరలు పూర్తయ్యాక చివరగా పంచదార సిరప్, క్రీమ్ వేసి పెద్ద చాకు సహాయంతో సమానంగా పరిచి, ఎక్కువైన క్రీమ్‌ను చాకుతో తీసేసి, కేక్‌ను ఫ్రీజ్‌లో సుమారు అరగంట సేపు ఉంచి తీయాలి ∙చివరగా మళ్లీ కేక్ మీద క్రీమ్ వేసి చాకుతో సమానంగా పరిచి, చుట్టూ కూడా వచ్చేలా చేసి, చివరగా మనకు నచ్చిన వాటితో (స్ట్రాబెర్రీ వేఫర్లు బాగుంటాయి) అలంకరించి సుమారు 4 గంటలు ఫ్రిజ్‌లో ఉంచి అందించాలి. చాకొలేట్ నట్స్ కేక్ కావలసినవి: మైదా పిండి – కప్పు; కార్న్‌ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; కండెన్స్డ్ మిల్క్ – అర కప్పు; జీడిపప్పు తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పుల తరుగు – 2 టేబుల్ స్పూన్లు; బ్లూ బెర్రీలు (ఎండబెట్టినవి) – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – టేబుల్ స్పూను; ఖర్జూరం తరుగు – టేబుల్ స్పూను; ఉప్పు – ఒకటిన్నర కప్పులు తయారి: ∙ఒక పాత్రలో అర కప్పు వేడి నీళ్లు, కోకో పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ∙ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙బేకింగ్ పౌడర్, మైదా పిండి, కార్న్‌ఫ్లోర్‌లను జల్లించి పక్కన ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలకొట్టాక, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు గిలక్కొట్టాలి. (ఎంత ఎక్కువ సేపు గిలక్కొడితే అంత రుచిగా వస్తుంది) ∙ఒక పాత్రలో మైదాపిండి మిశ్రమంలో సగం భాగం, కోకో పొడి, డ్రైఫ్రూట్స్ (జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్, ఖర్జూరం) ముక్కలు వేసి కలిపాక, మిగిలిన సగం పిండి జత చేసి కలపాలి ∙యేడు అంగుళాల మందం ఉన్న అల్యూమినియం గిన్నెకు బటర్ పూసి ఈ మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరవాలి. (బటర్ బదులు బటర్ పేపర్‌ను కూడా ఉపయోగించవచ్చు) ∙ఈ గిన్నెను కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అర గంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదారను కొద్దిగా చల్లితే బాగుంటుంది. బ్లూ బెర్రీ చీజ్ కేక్ కావలసినవి: బిస్కెట్లు – 125 గ్రా.; కరి గించిన బటర్ – 75 మి.లీ.; క్రీమ్ చీజ్ – 200 గ్రా.; పంచదార పొడి – 1/3 కప్పు; క్రీమ్ – 300 మి.లీ. (బాగా గిలక్కొట్టాలి); కండెన్స్డ్ మిల్క్ – 200 మి.లీ.; చైనా గ్రాస్ – 10 గ్రా.; బ్లూ బెర్రీలు – 3 టేబుల్ స్పూన్లు (ఎండినవి వాడుతుంటే, ముందు రోజు రాత్రి అర కప్పు నీళ్లలో నానబెట్టాలి); బాదం పప్పులు – 3 టేబుల్ స్పూన్లు. తయారి: ∙బిస్కెట్లను చేత్తో గట్టిగా నలిపి పొడి చేసి, కరిగించిన బటర్లో నెమ్మదిగా వేస్తూ కలపాలి. (కలపడం పూర్తయ్యే సరికి తడిసిన ఇసుకలా ఉంటుంది) ∙ఈ మిశ్రమాన్ని తొమ్మిది అంగుళాల స్ప్రింగ్ ఫామ్ కేక్ టిన్‌లో పోసి గట్టిగా ఒత్తి ఫ్రిజ్‌లో ఉంచాలి ∙1/3 వంతు కప్పు నీళ్లలో చైనా గ్రాస్‌ను సుమారు పావు గంట సేపు నానబెట్టాలి ∙ఒక పాత్రలో క్రీమ్ వేసి బాగా గిలకొట్టాలి ∙మరో పాత్రలో క్రీమ్ చీజ్, పంచదార పొడి వేసి గిలక్కొట్టాలి ∙సన్నని మంట మీద పాన్ ఉంచి, వేడయ్యాక, నానబెట్టి ఉంచుకున్న చైనా గ్రాస్ వేసి పూర్తిగా ఉడికేవరకు ఉంచి తీసేయాలి ∙పాన్‌లో కండెన్స్డ్ మిల్క్ వేసి గోరు వెచ్చన చేసి, ఉడికించిన చైనా గ్రాస్ జత చేసి, బాగా కలిపి రెండు నిమిషాలు ఉంచి, దించి కొద్దిగా చల్లార్చాలి ∙ఈ మిశ్రమాన్ని క్రీమ్ చీజ్ మిక్స్‌కి జత చేసి బాగా గిలకొట్టాలి ∙బెర్రీలు, బాదం పప్పులు వేసి కలపాలి. (బ్లూబెర్రీలు నానబెట్టిన నీళ్లు కొన్నిటిని జత చేయవచ్చు) ∙గిలక్కొట్టిన క్రీమ్ కలపాలి ∙కేక్ టిన్‌లో చీజ్ కేక్ మిశ్రమం వేసి సమానంగా పరిచి ఫ్రిజ్‌లో సుమారు 12 గంటలు ఉంచి తీయాలి ∙కేక్‌ను టిన్ నుంచి జాగ్రత్తగా విడదీసి అందంగా అలంకరించి అందించాలి. వెనీలా కప్ కేక్స్ కావలసినవి: ఉప్పు – 2 కప్పులు ; బటర్ – పావు కప్పు; పంచదార పొడి – పావు కప్పు; వెనిలా ఎసెన్స్ – టీ స్పూను; కండెన్స్‌డ్‌మిల్క్ – అర కప్పు; బేకింగ్ పౌడర్ – టీ స్పూను; మైదా పిండి – కప్పు; సోడా – అర కప్పు (క్లబ్ సోడా); చెర్రీస్ – 20 తయారి: ∙కుకర్‌లో రెండు కప్పుల ఉప్పు వేసి, దాని మీద ఒక స్టాండు, ఆ పైన ఒక ప్లేట్ పెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙మిక్సింగ్ బౌల్లో బటర్, పంచదార పొడి వేసి బాగా గిలక్కొట్టాక, వెనిలా ఎసెన్స్, కండెన్స్డ్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలక్కొట్టాలి ∙ఒక పాత్రలో బేకింగ్ పౌడర్, మైదా పిండి వేసి బాగా కలిపి, సగం మిశ్రమాన్ని పైన తయారుచేసి ఉంచుకున్న బటర్ మిశ్రమానికి జత చేసి బాగా కలిపాక, మిగిలిన సగం వేసి మరోమారు కలపాలి ∙సోడా (క్లబ్ సోడా వంటివి) వేసి బాగా కలపాలి ∙కప్ కేక్‌లను తీసుకుని అందులో ఒక్కోదానిలో ఒక్కో చెర్రీ వేసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం అందులో పోసి, వీటిని చిన్న ట్రేలో ఉంచి, ట్రేను కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. (విజిల్ పెట్టకూడదు) ∙సుమారు అరగంటసేపయ్యాక తీసేయాలి ∙చల్లారాక బయటకు తీసి అందించాలి. క్యారెట్ కేక్ కావాల్సినవి: మైదా – 2 కప్పులు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ను (500 మి.లీ), వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్) – అర కప్పు, పాలు – అర కప్పు తయారి: మైదా, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి ∙వెన్న, పంచదారపొడి, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి ∙ఇందులో జల్లించిన మైదా మిశ్రమం, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి పిండి గట్టిగా ఉంటే, కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదంటే చేతితో టిన్ను లోపల అంతా సర్దాలి ∙ప్రెజర్ కుకర్‌లో కింద ఉప్పు వేసి, దాని మీద వైర్ స్టాండ్, పెర్ఫరేట్ ప్లేట్ ఉంచి మూతపెట్టి, మీడియం మంట మీద ఉంచాలి ∙ముందుగా తయారు చేసుకున్న కేక్ టిన్నును కుకర్‌లో ఉంచి మూత పెట్టి (విజిల్ పెట్టకూడదు) సన్నని మంట మీద సుమారు అరగంటసేపు ఉంచాలి. (పుల్లతో గుచ్చితే పూర్తిగా తయారయినదీ లేనిదీ తెలుస్తుంది. ఒకవేళ ఇంకా పూర్తి కాలేదనిపిస్తే మరి కాసేపు స్టౌ మీద ఉంచాలి) ∙పూర్తయిన తర్వాత బయటకు తీసి, అంచుల మీదుగా చాకుతో కట్ చేస్తూ కేక్‌ను బయటకు తీసి, పైన పంచదార పొడిని చల్లితే బాగుంటుంది. ప్రెజర్ కుకర్ కేక్... అవెన్ లేకుండా ప్రెజర్ కుకర్లోనూ కేక్ తయారు చేసుకోవచ్చు. కుకర్ అడుగున కేజీ ఉప్పు లేదా ఇసుక పోయాలి. దీని పైన ఒక కుకర్ బాటమ్ ప్లేట్ ఉంచాలి. మంట పూర్తిగా తగ్గించి, కుకర్ని వేడి చేయాలి. కుకర్‌లో చిన్న స్టాండ్ పెట్టి, సులువుగా పట్టేటంత మరొక గిన్నె తీసుకొని కేక్ మిశ్రమం పోయాలి. కేక్మిశ్రమం ఉన్న గిన్నెను కుకర్‌లో జాగ్రత్తగా ఉంచాలి. పైన వెయిట్ పెట్టకుండా కుకర్మూత ఉంచాలి. (వెయిట్ పెడితే కుకర్ పేలే ప్రమాదం ఉంటుంది.) సన్నని మంట మీద 30–35 నిమిషాలు కేక్‌ను బేక్ చేసి, మంట తీసేయాలి. కుకర్ వేడి పూర్తిగా తగ్గేంత వరకు ఉంచి, కేక్ గిన్నెను బయటకు తీయాలి. తర్వాత నచ్చిన విధంగా అలంకరించుకోవాలి. -
సెంచరీ కొట్టిన క్యారెట్
-
వారి స్మగ్లింగ్ స్టైల్ చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!
న్యూయార్క్: మత్తుపదార్ధాల రవాణా.. బహుశా దీనికోసం ఇప్పటివరకు ఎంచుకోని మార్గం లేదనుకుంట.. ఇకముందు కూడా మరిన్ని కొత్త మార్గాలు రాక మానవనుకుంట. గంటలుగంటలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నవారు ఎంతటి మేధావులో చెప్పలేంగానీ.. డ్రగ్ మాఫియాకు పడుతున్నవారిని మాత్రం ఏమరుపాటున కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే మత్తుపదార్థాల రవాణాకోసం వారు అనుసరిస్తున్న విధానాలు చూస్తుంటే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే. షూలలో, సాక్స్లలో, పెట్టెల్లో, వాహనాల టైర్లలో, పూల మొక్కల కుండీల్లో, కరిగిపోని టాబ్లెట్ల రూపంలో ఇలా ఒక్కటేమిటీ పోలీసుల కళ్లుగప్పి తమ పని పూర్తిచేసుకునేందుకు స్మగ్లర్లు అనుసరించేపద్ధతులు అన్నీ ఇన్నీ కాదు. మొన్నీమధ్యే కడుపులోపల, చెప్పుకోకూడని చోట్లలో కూడా మత్తుపదార్థాలను పెట్టుకోని రవాణా చేస్తూ పట్టుబడుతున్నారు. అయితే, మెక్సికోలోని డ్రగ్ మాఫియా మాత్రం పోలీసులను మోసం చేసేందుకు చేసిన ప్రయత్నం అంతాఇంతా కాదు.. వారు ఏకంగా కేరట్లాంటి కృత్రిమ క్యారెట్లను సృష్టించి వాటిల్లో గంజాయి కూర్చడమే కాకుండా.. అసలైన క్యారెట్ల మధ్య భాగంలో కూడా గంజాయి జొప్పించి తరలించే ప్రయత్నం చేశారు. దాదాపు మూడువేల క్యారెట్లను తలపించే ప్యాకెట్లను రెండు ట్రక్కుల్లో అసలైన క్యారెట్ల మధ్యలో పెట్టి ఏ మాత్రం అనుమానం రాకుండా ఉంచారు. కానీ, అమెరికాలోని టెక్సాస్ మెక్సికో సరిహద్దులో ఆ ట్రక్కులను తనిఖీ చేసిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆ క్యారెట్లలో ఉన్న గంజాయి విలువ ఏకంగా 5లక్ష డాలర్లు(దాదాపు మూడున్నర కోట్లు)గా అంచనా వేశారు. దీనిని స్వాధీనం చేసుకున్న అధికారుల్లో ఒకరైన ఈఫ్రెయిన్ సోలిస్ మాట్లాడుతూ..'అమెరికా మెక్సికో సరిహద్దులో గుండా మత్తుపదార్థాల రవాణా చేసేందుకు మరోసారి స్మగ్లర్లు వారి సృజనాత్మకతను ఉపయోగించారు. అయితే, వారు ఏ రూపంలో ప్రయత్నించినా వాటిని సమూలంగా ఎదుర్కొనేందుకు మా పోలీసు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గతంలో కూడా క్యారెట్లు, దోసకాయలు, టమాటాల్లో పెట్టి గంజాయి తరలించారు' అని ఆయన తెలిపారు. -
అంగరంగ వైభవంగా శిడిబండి ఉత్సవం
ఉయ్యూరు, న్యూస్‌లైన్ : అమ్మా వీరమ్మ.. శరణు శరణు.. కోర్కెలు తీర్చే కల్పవల్లి రక్షమామ్.. రక్షమామ్.. అంటూ భక్తుల శరణుగోష ఉయ్యూరులో ప్రతిధ్వనించింది. వేలాది మంది భక్తులు పసుపుకుంకుమలు సమర్పించి శిడిబండికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లలో భాగంగా 11వ రోజైన గురువారం నిర్వహించిన శిడిబండి ఉత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. జిల్లా నలుమూలల నుంచి ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు తరలివచ్చారు. 15 రోజులపాటు జరిగే ఉయ్యూరు వీరమ్మతల్లి ఉత్సవాల్లో శిడిబండికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ కారణంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రత్యేకంగా రూపొందించిన శిడిబండి శివాలయం రోడ్డు నుంచి వీరమ్మతల్లి ఆలయానికి చేరుకుంది. ఈ క్రమంలో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పసుపు కుంకుమలు, అరటిపళ్లు, హారతులు సమర్పించారు. భక్తుల కోలాహలం మధ్య పోలీసు బలగాలు శిడిబండిని కాలేజీ రోడ్డు నుంచి ప్రధాన సెంట ర్ మీదుగా ఆలయానికి చేర్చాయి. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు పూర్తి చేసిన పిదప శిడి మహోత్సవం ప్రాంగణానికి బండిని చేర్చారు. పెళ్లికొడుకు బంధువుల నిరసన... ఈ తరుణంలో శిడిబుట్టలో కూర్చునేందుకు దళితవాడ నుంచి ఉయ్యూరు వంశీకులు ఈ ఏడాది పెళ్లి అయ్యే ఉయ్యూరు వెంకటేశ్వరరావును స్థానికులు, బంధువులు మేళతాళాలు, డప్పు వాయిద్యాల మధ్య ఆలయ ప్రాంగణానికి తీసుకొచ్చారు. మార్గమధ్యంలో ఓ ఎస్ఐ పెళ్లికొడుకు బంధువుపై చేయిచేసుకోవడంతో శిడి ఉత్సవానికి పెళ్లికొడుకు రాడంటూ బంధువులు ఓ బ్యాంక్ కార్యాలయం ప్రాంగణం వద్ద ఆందోళన చేపట్టారు. పోలీసుల జులుం నశిం చాలి.. పోలీసులు క్షమాపణ చెప్పాలి.. అంటూ నిరసన వ్యక్తం చేశారు. పట్టణ ఎస్ఐగా గతంలో పనిచేసిన శివప్రసాద్ పెళ్లికొడుకు బంధువులతో సంప్రదింపులు జరిపి తనపై నమ్మకం ఉంచి తనవెంట కలిసి రావాలని, ఉత్సవాన్ని సజావుగా సాగేలా సహకరించాలని కోరడంతో బంధువులు ఆందోళన విరమించి శిడి ఉత్సవానికి కదిలారు. అనంతరం ఆలయ ప్రదక్షణ పూర్తి చేసిన తరువాత శిడిబుట్టలో కూర్చున్న యువకుడు వెంకటేశ్వరరావు మరో మారు ఆలయ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న అనంతరం మూడు పర్యాయాలు శిడి ఆడించటంతో ఉత్సవం ముగుస్తుంది. శిడిబండికి తగిలిన అరటిపళ్లు దొరికితే పిల్లలు లేని వారికి పిల్లలు, పెళ్లి కాని వారికి పెళ్లి అవుతుందని భక్తుల నమ్మకం. డీసీపీ రవిప్రకాష్, ఏసీపీ మహేశ్వరరాజు, సీఐలు, ఎస్ఐలు భద్రతా చర్యలు చేపట్టారు.