క్యారట్‌ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు | How To Make Carrot Laddu Recipe In Telugu | Sakshi
Sakshi News home page

క్యారట్‌ లడ్డు.. ఒకసారి తిన్నారంటే మైమరచిపోతారు

Published Fri, Aug 25 2023 12:20 PM | Last Updated on Fri, Aug 25 2023 1:14 PM

How To Make Carrot Laddu Recipe In Telugu - Sakshi

క్యారట్‌ లడ్డు తయారీకి కావల్సినవి: 

క్యారట్‌ తురుము – రెండు కప్పలు; ఎండు కొబ్బరి తురుము – ఒకటిన్నర కప్పులు;
కండెన్స్‌డ్‌ మిల్క్‌ – కప్పు; బాదం పలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు; రోజ్‌వాటర్‌ – అరటీస్పూను;
యాలకుల పొడి – అరటీస్పూను; నెయ్యి – మూడు టేబుల్‌ స్పూన్లు; పచ్చికొబ్బరి తురుమ – గార్నిష్‌కు సరిపడా.



తయారీ విధానమిలా:

  • రెండు స్పూన్ల నెయ్యివేసి కొబ్బరి తురుముని ఐదు నిమిషాల పాటు దోరగా వేయించాలి.
  • కొబ్బరి వేగిన తరువాత క్యారట్‌ తురుము వేసి మీడియం మంట మీద పదినిమిషాలు వేయించాలి.
  • ఇప్పుడు బాదం పలుకులు, కండెన్స్‌డ్‌ మిల్క్‌ వేసి కలపాలి.
  • ఐదు నిమిషాల తరువాత రోజ్‌ వాటర్‌. యాలకుల పొడి వేసి సన్నని మంట మీద తిప్పుతూ మగ్గనివ్వాలి.
  • మిశ్రమం చిక్కబడిన తరువాత దించేసి చల్లారనివ్వాలి.
  • ఇప్పుడు చేతులకు కొద్దిగా నెయ్యి రాసుకుని చల్లారిన మిశ్రమాన్ని లడ్డుల్లా చుట్టుకుని,పైన కొద్దిగా పచ్చికొబ్బరితో గార్నిష్‌ చేసి సర్వ్‌చేసుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement