పచ్చిగా, కచ్చాపచ్చాగా, ఉడికించి... ఎలా తిన్నా టేస్టీగానే ఉంటుంది క్యారట్.aఅందుకే కరకరల క్యారట్‌ను మరింత రుచిగా ఇలా కూడా వండుకోవచ్చని చెబుతోంది ఈ వారం వంటిల్లు...
క్యారట్ మూంగ్‌దాల్ సలాడ్ తయారీకి కావల్సినవి:
క్యారట్ తురుము – కప్పు; పెసరపప్పు –పావు కప్పు;
పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు;
పచ్చిమిర్చి తరుగు – రెండు టీస్పూన్లు; నిమ్మరసం – రెండు టీస్పూన్లు;
ఉప్పు – రుచికి సరిపడా; కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను.
తయారీ విధానమిలా:
పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటసేపు నానబెట్టుకోవాలి.నానిన పప్పులో నీళ్లు వంపేసి పప్పుని పెద్ద గిన్నెలో వేయాలి ∙ఈ పప్పులో క్యారట్ తురుము, కొబ్బరి, పచ్చిమిర్చి తురుము, నిమ్మరసం, ఉప్పువేసి చక్కగా కల΄ాలి ∙చివరిగా కొత్తిమీర తరుగుతో వేసి సర్వ్‌చేసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment