వీకెండ్‌ స్పెషల్‌: క్యారట్‌ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి | How To Make Carrot Chutney Recipe In Telugu | Sakshi
Sakshi News home page

వీకెండ్‌ స్పెషల్‌: క్యారట్‌ చట్నీ.. సింపుల్‌గా ఇలా చేసుకోండి

Published Sat, Sep 23 2023 4:54 PM | Last Updated on Sat, Sep 23 2023 5:32 PM

How To Make Carrot Chutney Recipe In Telugu - Sakshi

క్యారట్‌ చట్నీ తయారీకి కావల్సినవి:

నూనె – టీస్పూను; పచ్చిమిర్చి – ఆరు; వెల్లుల్లి రెబ్బలు – రెండు;
అల్లం తరుగు – టీస్పూను; చింతపండు – గోలీకాయంత;
క్యారట్‌ – మీడియంసైజు మూడు; కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను;
కరివేపాకు – రెండు రెమ్మలు; వేయించిన వేరుశనగ గింజలు – రెండు టేబుల్‌ స్పూన్లు;
పచ్చికొబ్బరి తురుము – టేబుల్‌ స్పూను;జీలకర్ర – టీస్పూను; ఉప్పు – రుచికి సరిపడా
తాలింపు కోసం: నూనె – టీస్పూను; ఆవాలు – టీస్పూను;
జీలకర్ర – టీస్పూను; మినపప్పు  – అరటీస్పూను; పచ్చిశనగపప్పు – అరటీస్పూను;
ఎండుమిర్చి – రెండు; ఇంగువ – చిటికెడు; కరివేపాకు – రెమ్మ.

తయారీ విధానమిలా:
∙బాణలిలో నూనెవేసి పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లిపేస్టు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇవన్నీ వేగిన తరువాత చింతపండు వేసి నిమిషం తర్వాత దించేయాలి ∙ఇదే బాణలిలో క్యారట్, కొత్తిమీర తరుగు, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేంతవరకు వేయించాలి ∙ఇప్పుడు వేయించిన పచ్చిమిర్చి మిశ్రమం, క్యారట్‌ తురుము, వేరుశనగ గింజలు, కొబ్బరి తురుము, జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పువేసి గ్రైండ్‌ చేయాలి ∙చట్నీ మెత్తగా గ్రైండ్‌ చేసాక... తాలింపు దినుసులతో తాలింపు పెట్టి చట్నీలో వేయాలి ∙ఈ క్యారట్‌ చట్నీ ఇడ్లీ, దోశ, రోటి, అన్నంలోకి మంచి కాంబినేషన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement