ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో సీనియర్ డైటీషియన్‌నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్. వెయిట్ లాస్‌కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం.
ABC జ్యూస్ అంటే ఏమిటి?
ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్) నిజానికి మూడింటి రసాల మిశ్రమం. యాపిల్(A) బీట్‌రూట్(B) క్యారెట్ (C) అలా టోటల్‌గా ఇది ABC జ్యూస్ అయిందన్నట్టు. వీటిని ప్రయోజనాలను విడివిడిగా చూస్తే.
యాపిల్స్
అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.
బీట్‌రూట్
శక్తివంతమైన ,రుచికరమైన వెజిటబుల్. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణం ఇందులో ఉంది. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది.
క్యారెట్
పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్‌లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ పుల్కంగా ఉన్నాయి. క్యారెట్‌లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు.
ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా?
ఈ జ్యూస్‌లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్‌లతో నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి, ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్ సుగర్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది.
అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్‌తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.
ABC జ్యూస్ దుష్ప్రభావాలు
పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్‌లో ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్‌కు దూరంగా ఉండాలి.
ఎలా చేసుకోవాలి
రెండు యాపిల్స్, చిన్న క్యారెట్లు, ఒక బీట్ రూట్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసర్‌లో బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి. దీన్ని వడపోసుకుని తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment