Beetroot juice
-
తెల్లజుట్టు నల్లగా, స్మూత్ అండ్ షైనీగా : సహజమైన బీట్రూట్ మాస్క్
చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల కేన్సర్ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట. హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.బీట్ రూట్లో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరి నూనె బీట్రూట్ రసం హెయిర్ మాస్క్కొబ్బరి నూనెను బీట్రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంలో కొబ్బరినూనె కలిపిన పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.క్యారెట్, బీట్రూట్ మాస్క్: ఈ మిక్స్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.బీట్రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్ జుట్టు రంగును మార్చడంలో బ్లాక్‌టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్‌ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.బీట్రూట్, హెన్నాజుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్ రూట్ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్‌టీని వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన చెప్పిన మాస్క్‌లను ప్రయత్నించాలి. అలాగే ఈ మాస్క్ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ మిరాకిల్ జ్యూస్ తాగితే..!
ప్రస్తుత కాలంలో బరువు తగ్గడం అనేది ఒక పెద్ద టాస్క్. క్రమం తప్పని వ్యాయామం, కొన్ని ఆహార నియమాలు పాటిస్తే ఎలాంటి వారైనా బరువు తగ్గడం ఈజీనే. ఎంత ప్రయత్నించినా ఫలితం కనిపించని పక్షంలో సీనియర్ డైటీషియన్నిగానీ, వైద్యుణినిగానీ సంప్రదించడం ఉత్తమం. అయితే బరువు తగ్గే క్రమంలో ఈ మధ్య కాలంలో బాగా వినిస్తున్న పేరు ఏబీసీ జ్యూస్. వెయిట్ లాస్‌కు ఇది అద్భుతంగా పనిచేస్తుందనేది సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే అసలేంటీ ఏబీసీ జ్యూస్. దీని లాభ నష్టాలేంటి ఒకసారి చూద్దాం. ABC జ్యూస్ అంటే ఏమిటి? ఈ అద్భుత పానీయం (సోషల్ మీడియాలో బాగా పాపులర్) నిజానికి మూడింటి రసాల మిశ్రమం. యాపిల్(A) బీట్రూట్(B) క్యారెట్ (C) అలా టోటల్‌గా ఇది ABC జ్యూస్ అయిందన్నట్టు. వీటిని ప్రయోజనాలను విడివిడిగా చూస్తే. యాపిల్స్ అధిక పోషకాలు, యాపిల్స్ చాలా పోషకమైనవి. గుండె జబ్బులు, మధుమేహం , క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడే ఫైబర్ యాంటీఆక్సిడెంట్లు వీటిలో అధికంగా ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. బీట్రూట్ శక్తివంతమైన ,రుచికరమైన వెజిటబుల్. శరీరంలోని టాక్సిన్స్‌ను తొలగించే లక్షణం ఇందులో ఉంది. యాంటీఆక్సిడెంట్లు , యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అలాగే ఇన్ఫెక్షన్ల నివారణలో బాగా ఉపయోడపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఎక్కువ. న్యూట్రియంట్స్ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, నొప్పిని తగ్గించడానికి, బాడీ మెటబాలిజానికి ఉపయోగ పడుతుంది. క్యారెట్ పలు అధ్యయనాల ప్రకారం క్యారెట్లో బీటా-కెరోటిన్ విటమిన్ A ఎక్కువ లభిస్తుంది. కెరోటినాయిడ్స్, విటమిన్లు , డైటరీ ఫైబర్ పుల్కంగా ఉన్నాయి. క్యారెట్లో యాంటీఆక్సిడెంట్లు , మినరల్స్ కూడా ఉంటాయి. శరీరంలోని విషాన్ని తొలగిస్తుందని కూడా నమ్ముతారు. ABC జ్యూస్ ఆరోగ్యకరమైనదేనా? ఈ జ్యూస్‌లో వాడే పదార్థాలు ఆరోగ్యకరమైనవే అనేది మనకు అర్థం అవుతోంది. అయితే ఈ పండ్లు , కూరగాయల కలయిక ఆరోగ్యకరమైన దేనా అన్నదే ప్రశ్న. ఇందులో అధిక పోషకాలు, విటమిన్లు , యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉన్నాయి అలాగే ఫైబర్ కూడా మెండుగా ఉంది కాబట్టి, ABC డ్రింక్ చాలా ఆరోగ్యకరమైన జ్యూస్ అని న్యూట్రిషన్ అండ్ డైటీషయన్ల అభిప్రాయం. దీనికి తోడు ఇవి సులభంగా, చవకగా అందుబాటులో ఉంటాయంటున్నారు. ABC జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు ఫైబర్ అధికంగా ఉండటం వల్ల గుండెకు మేలు చేస్తుంది. అలాగే, కొలెస్ట్రాల్, సోడియం తక్కువగా ఉన్న ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారంతో పాటు తీసుకుంటే, మరింత ప్రయోజనం ఉంటుంది. ఈ మూడింటిలోని నేచురల్ సుగర్ ఎనర్జీ బూస్టర్‌గా పనిచేస్తుంది. అయితే, బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వారికి ఇది ఒక్కటే సరిపోతుందా అంటే కాదు. రోజంతా ఇదే పానీయం తీసుకోవడం కాకుండా ABC జ్యూస్‌తో పాటు ఆరోగ్యకరమైన తక్కువ కార్బ్, తక్కువ కొవ్వు, అధిక ప్రోటీన్ కలిగిన ఆహారాన్ని తినాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. ABC జ్యూస్ దుష్ప్రభావాలు పొటాషియం నియంత్రణలో ఉన్న వ్యక్తులు, కిడ్నీ రోగులు లేదా తక్కువ FODMAP డైట్లో ప్రేగు సిండ్రోమ్ ఉన్నవారు ABC జ్యూస్‌కు దూరంగా ఉండాలి. ఎలా చేసుకోవాలి రెండు యాపిల్స్, చిన్న క్యారెట్లు, ఒక బీట్ రూట్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కట్ చేసుకొని, జ్యూసర్లో బాగా మెత్తగా అయ్యాక, రసం తీసుకోవాలి. దీన్ని వడపోసుకుని తాగవచ్చు. కావాలంటే రుచికి నిమ్మరసం, చిన్న అల్లంముక్కను కూడా యాడ్ చేసుకోవచ్చు. -
బీట్రూట్ జ్యూస్ తాగే అలవాటుందా? ఇందులోని నైట్రేట్ వల్ల..
ఎండలు ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్నాయి. చిటపటా చినుకులు పడుతున్నాయి. రుతు సంధి కారణంగా అంటే సీజనల్ మార్పుల వల్ల ఇన్ఫెక్షన్లు, ఫ్లూ వంటి అనారోగ్య సమస్యలు రావడం సహజం. ఇటువంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అటువంటి వాటిలో బీట్రూట్ ఉత్తమమైనది. ప్రోటీన్లు విటమిన్లు పుష్కలంగా ఉండే బీట్రూట్తో తయారు చేసిన ఆహారాలను ప్రతిరోజు తినడం వల్ల శరీరంలోని రోగనిరోధక శక్తి లోపం సమస్యలను కూడా తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో ఏయే పోషకాలుంటాయి? బీట్రూట్లో సోడియం, పొటాషియం, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. దీనిని సలాడ్‌లో తీసుకోవడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బీట్రూట్లో ఫోలేట్ పుష్కలంగా ఉంటుంది.. ఇది కణాల పెరుగుదలను మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. బీట్రూట్లో ఐరన్ సమృద్ధిగా లభిస్తుంది కాబట్టి ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్‌ను తాగడం వల్ల రక్తహీనత, రోగ నిరోధక శక్తి సమస్యలనుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. బీట్రూట్లో అధిక మోతాదులో లభించే నైట్రేట్ వల్ల రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా రక్తంలో గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా రక్తప్రవాహాన్ని మెరుగుపరిచేందుకు సహాయపడుతుంది. కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉండే బీట్రూట్ శరీరంలో శక్తి స్థాయులను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. తరచు అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు బీట్రూట్ జ్యూస్ తాగడం వల్ల చక్కటి ఉపశమనం లభిస్తుంది. బీట్రూట్ ఉండే గుణాలు చర్మాన్ని మెరిపించడంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. ఇందులో ఉండే ఫోలేట్, ఫైబర్ చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. దీని రసాన్ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి. బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే గుణాలు ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునేవారు బీట్రూట్ రసాన్ని తాగడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యలకు సరైన పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది. (చదవండి: ఇలా చేస్తే ముఖంపై మొటిమలు మాయం! చక్కటి నిగారింపు మీ సొంతం) -
రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే..
కావలసినవి బీట్రూట్ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. తయారీ విధానం ►బీట్రూట్ను తొక్కతీసి ముక్కలుగా తరగాలి ►దానిమ్మ గింజలను ఒలుచుకోవాలి ►బ్లెండర్లో బీట్రూట్ ముక్కలు, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడపోసి జ్యూస్‌ను గ్లాసులో పోయాలి ► దీనిలో తేనె, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవాలి. దానిమ్మ-బీట్రూట్ జ్యూస్ ఉపయోగాలు ►వేసవిలో దాహం తీర్చే డ్రింకేగాక, మంచి డీటాక్స్ డ్రింక్‌గా ఈ జ్యూస్ పనిచేస్తుంది. ► బీట్రూట్ రోగనిరోధక వ్యస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►దానిమ్మ గింజలు, బీట్ రూట్‌ను కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది ►ఈ జ్యూస్‌లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ►బీట్రూట్లో.. ఐరన్, క్యాల్షియం, జింక్, సోడియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బీ 6, సి, ఫోలేట్,, నియాసిన్‌లు..æ, దానిమ్మ గింజల్లోని.. విటమిన్ బి, సి, కె, పొటాషియం, పీచుపదార్థాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ►రోజుకొక గ్లాసు తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు పోషణ అందుతుంది. -
Health Tips: తెలుసా?.. ఈ జ్యూస్ తాగితే గుండె సంబంధిత వ్యాధులు పరార్!
మనం రకరకాల పండ్ల రసాలు తాగుతుంటాం. అయితే వాటికన్నా బీట్రూట్ రసం తీసుకోవడం చాలా మంచిదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. వారి మాటల్లోనే చెప్పాలంటే... ►బీట్రూట్లో మనకి కావాల్సిన అనేక పోషకాలున్నాయి. ఐరన్ తక్కువగా ఉన్నవారు బీట్రూట్ జ్యూస్ రోజూ తాగితే ఐరన్ పెరుగుతుంది. అలాగే రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయులు కూడా పెరుగుతాయి. ►నీరసంతో బాధపడేవారు కొన్ని బీట్ రూట్ ముక్కలు తిన్నా లేదంటే బీట్ రూట్ జ్యూస్ తాగినా తక్షణ శక్తి వస్తుంది. ►బీట్ రూట్లో బి, సి విటమిన్స్ అధికం. రక్తపోటు నియంత్రణలో ఉండేందుకు బీట్రూట్ దోహదం చేస్తుంది. ఇందులో అధికంగా ఉండే కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం అందరికీ అవసరమైనవే. చదవండి: 150 ఏళ్లు పట్టేదట! కానీ.. కేవలం 18 ఏళ్లలోనే.. !! ►తరచూ బీట్ రూట్ తినేవారికి, రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరవని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ►రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగితే శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. అలాగే అధిక కొవ్వు సమస్యతో బాధ పడేవారు ఈ జ్యూస్ తాగితే కొవ్వు కరుగుతుంది. ►మూడీగా ఉండేవారు అప్పుడప్పుడు బీట్ రూట్ జ్యూస్ తాగుతుంటే ఉల్లాసంగా ఉండగలుగుతారు. ►గర్భిణులకు కావాల్సిన ఫోలిక్ యాసిడ్ బీట్ రూట్ ద్వారా అందుతుంది. గర్భంలోని పిండం సక్రమంగా ఎదగాలంటే గర్భిణీలు రోజూ బీట్ రూట్ జ్యూస్ తాగడం మంచిది. ►కాలేయాన్ని బీట్ రూట్ శుభ్రపరుస్తుంది. ►చర్మ సంబంధిత వ్యాధులు కూడా రావు. ►ఎముకల్ని గట్టిగా ఉంచే శక్తి కూడా బీట్ రూట్ కు ఉంటుంది. ►బీట్ రూట్ జ్యూస్ తాగేవారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు కావాల్సిన రక్త సరఫరా అయ్యేలా బీట్ రూట్ చేయగలదు. ఏకాగ్రతను పెంచగల శక్తి కూడా బీట్ రూట్‌కు ఉంది. అందుకే ఫ్రెష్ బీట్రూట్ జ్యూస్ తాగాలి. చదవండి: Wonder of Science: బాప్రే.. ఒక్క చెట్టుకే 40 రకాల పండ్లా..!! -
అచ్చం రక్తంలాగే ఉండే బీట్రూట్ జ్యూస్.. తాగితే దోమలు ఖతం
మనుషులకు అతిపెద్ద శత్రువులు దోమలే. రకరకాల వ్యాధులను వ్యాపింపజేస్తూ లక్షలాది మంది మరణాలకు కారణమవుతున్నాయి. ఇలాంటి దోమలను నిర్మూలించడంపై దృష్టిపెట్టిన శాస్త్రవేత్తలు.. బీట్రూట్ జ్యూస్ ఆధారంగా రక్తంకాని రక్తాన్ని సృష్టించారు. అందులో విషపూరిత పదార్థాలను కలిపి దోమలను హతమార్చే పద్ధతిని అభివృద్ధి చేశారు. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా? – సాక్షి సెంట్రల్ డెస్క్ కీటకనాశనుల ప్రమాదం నుంచి.. ప్రస్తుతం మనం దోమలను హతమార్చేందుకు మస్కిటో రిపెల్లెంట్లు, రసాయనాలు కలిపిన అగరుబత్తులు వంటి వాటిని వినియోగిస్తున్నాం. వాటిలో విషపూరిత పదార్థాలు దోమలను చంపడమో, మనుషులను కుట్టే సామర్థ్యాన్ని దెబ్బతీయడమో చేస్తాయి. కానీ ఆ రసాయనాలు మనుషులకు కూడా హానికరమేనని వైద్యులు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే.. స్వీడన్‌కు చెందిన ‘మాలిక్యులర్ అట్రాక్షన్’స్టార్టప్ శాస్త్రవేత్తలు.. మనుషులకు హానికలగకుండా దోమలను ఆకర్షించి చంపే విధానాన్ని అభివృద్ధి చేశారు. చదవండి: ఆడ దోమలే ఎందుకు కుడతాయి.. వాళ్లను ప్రేమిస్తాయి! ‘మలేరియా’వాసనతో.. మలేరియా వ్యాధి సోకినవారి నుంచి ఒక రకమైన వాసన వస్తుంటుంది. మలేరియాకు కారణమైన ప్లాస్మోడియం పరాన్నజీవులు.. మన రక్తంలోని ఎర్రరక్త కణాలను ఆక్రమించి, విచ్ఛిన్నం చేసినప్పుడు వెలువడే ‘హెచ్‌ఎంబీపీపీ’అనే రసాయనమే దీనికి కారణం. దోమలు ఈ వాసనకు విపరీతంగా ఆకర్షితమవుతాయి. దీనిని గుర్తించిన శాస్త్రవేత్తలు ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్తోనే దోమలకు చెక్‌పెట్టవచ్చని తేల్చారు. చదవండి: సైలెంట్ అయిపోయిన డుగ్గుడుగ్గు బండి సైలెన్సర్స్ బీట్రూట్ జ్యూస్‌లో కలిపి.. అచ్చం రక్తం లక్షణాలను పోలి ఉండేలా.. అంతే సాంద్రత, రంగుతో బీట్రూట్ జ్యూస్‌ను శాస్త్రవేత్తలు సిద్ధం చేశారు. దానిలో దోమలను ఆకర్షించే ‘హెచ్‌ఎంబీపీపీ’మాలిక్యూల్స్‌ను, మొక్కల ఆధారిత విష పదార్థాలను కలిపారు. దీనిని దోమలు ఉన్న చోట పెట్టారు. హెచ్‌ఎంబీపీపీ వాసనకు ఆకర్షితమైన దోమలు రక్తంకాని రక్తాన్ని పీల్చుకున్నాయి. విషపదార్థం ప్రభావంతో కాసేపటికే అన్నీ చనిపోయాయి. అయితే మలేరియాను వ్యాప్తి చేసే అనాఫిలిస్ రకం దోమలు ఎక్కువగా ఆకర్షితమయ్యాయని.. వివిధ మాలిక్యూల్స్‌ను ఉపయోగించడం ద్వారా ఇతర వ్యాధులను వ్యాప్తిచేసే దోమలనూ చంపవచ్చని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ ప్రకటించింది. ఈ పరిశోధన వివరాలు ఇటీవలే కమ్యూనికేషన్ బయాలజీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మనుషులకు హానికలగకుండా.. ‘‘దోమల నిర్మూలన కోసం వినియోగించే రసాయనాలను గాలిలో స్ప్రే చేయడమో, రిపెల్లెంట్ పరికరాలతో ఆవిరిగా మార్చడమో చేస్తుంటారు. వాటిని మనం కూడా పీల్చుకుంటుంటాం. ఆ విష పదార్థాలు మన శరీరంలో చేరి దుష్ప్రభావాలు కలిగిస్తాయి. అదే మేం రూపొందించిన పద్ధతిలో దోమలు వాటంతట అవే వచ్చి విషపూరిత పదార్థాన్ని పీల్చుకుని చనిపోతాయి. మనుషులకు ఎటువంటి హానీ ఉండదు. పైగా ఖర్చుకూడా తక్కువగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు కాపాడొచ్చు..’’అని మాలిక్యులర్ అట్రాక్షన్ సంస్థ సీఈవో లెచ్ ఇగ్నటోవిజ్ వెల్లడించారు. దోమలకు బ్యాక్టీరియా ఎక్కించి.. దోమల నియంత్రణకు ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. అందులో డెంగీకి కారణమయ్యే దోమల నియంత్రణపై ఇండోనేషియాలో చేసిన ప్ర యోగం దాదాపు విజయవంతమైంది. శాస్త్రవేత్తలు దోమల్లో డెంగీ వైరస్‌ను వ్యాప్తిచేసే సామర్థ్యాన్ని దెబ్బతీసే ‘వొల్బాచియా’ బ్యాక్టీరియాను ఎక్కించారు. ఈ దోమలను పలు ప్రాంతాల్లో వదిలారు. ఆ బ్యాక్టీరియా ఇతర దోమలకూ వ్యాపించి.. డెంగీ కేసులు తగ్గాయి. -
వ్యాయామం చేస్తున్నారా..? బీట్రూట్ రసం తాగండి...
కొత్త పరిశోధన క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నారా..? చాలా మంచి అలవాటు. వ్యాయామాన్ని క్రమం తప్పకుండా కొనసాగించండి. వ్యాయామం వల్ల కండరాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారా..? మరేమీ ఫర్వాలేదు. దీనికి ఓ చిన్న చిట్కా పాటిస్తే చాలు. వ్యాయామం ప్రారంభించడానికి ముందు గ్లాసుడు బీట్రూట్ రసం తాగండి. జోరుగా, హుషారుగా వ్యాయామాన్ని కొనసాగించగలరు. అంతేకాదు, ఎప్పటి కంటే కాసింత ఎక్కువసేపు వ్యాయామం కొనసాగించినా కండరాల నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు అని చెబుతున్నారు అమెరికన్ వైద్య నిపుణులు. తాజా బీట్రూట్ రసం కండరాలకు అదనంగా ఆక్సిజన్ సరఫరా చేస్తుందని, అందువల్ల ఎంత వ్యాయామం చేసినా కండరాల నొప్పులు బాధించవని వారు చెబుతున్నారు. అంతేకాదు, క్రమం తప్పకుండా రెండు వారాల పాటు రోజూ బీట్రూట్ రసం తీసుకుంటే, అధిక రక్తపోటు దాదాపు ఏడు శాతం మేరకు తగ్గుతుందని అంటున్నారు. తమ పరిశోధనల్లో తేలిన ఈ విషయాలను వారు ‘అమెరికన్ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీ’ తాజా సంచికలో ప్రచురించారు.