చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్‌డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల కేన్సర్ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట.
హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.
బీట్ రూట్‌లో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్‌లు కూడా ఉన్నాయి.
కొబ్బరి నూనె బీట్‌రూట్ రసం హెయిర్ మాస్క్
కొబ్బరి నూనెను బీట్‌రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్‌రూట్ రసంలో కొబ్బరినూనె కలిపిన పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.
క్యారెట్, బీట్‌రూట్ మాస్క్: ఈ మిక్స్‌డ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.
బీట్‌రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్
జుట్టు రంగును మార్చడంలో బ్లాక్‌టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్‌రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్‌ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.
బీట్‌రూట్, హెన్నా
జుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్ రూట్ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్‌టీని వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన చెప్పిన మాస్క్‌లను ప్రయత్నించాలి. అలాగే ఈ మాస్క్ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు.
Comments
Please login to add a commentAdd a comment