hair beauty
-
జుట్టుకి గుడ్లు, పెరుగు అప్లై చేయడం మంచిదేనా..?
కురుల ఆరోగ్యం కోసం పెరుగు, మెంతులు, గుడ్లు వంటివి అప్లై చేస్తుంటారు. ఇవి ఆరోగ్యానికి మంచివని నిపుణులు కూడా సిఫార్సు చేస్తుంటారు. అంతెందుకు నీతా అంబానీ, జాన్వీ కపూర్, అలియా భట్ వంటి ప్రముఖులు కూడా తమ అందమైన శిరోజాల సీక్రెట్ ఇదేనని పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు కూడా. అయితే సెలబ్రిటీ హెయిర్‌స్టైలిస్ట్ అమిత్ ఠాకూర్ ఇలా గుడ్లు, పెరుగు కురులకు అప్లై చేయడం వల్ల నిజంగా ప్రయోజనం ఉంటుందా..? అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇలా జుట్టుకి కండిషనర్‌గా అవి రాయడం వల్ల ఏమవుతుందో కూడా వెల్లడించారు. ఇంతకీ ఠాగూర్ ఏమన్నారంటే..జుట్టుకి పెరుగు, గుడ్లు అప్లై చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందనేది అవాస్తవమని చెప్పారు. ఇది రాయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండదని తెలిపారు. ఇక్కడ పెరుగులో పుష్కలంగా ఉండే లాక్టిక్ యాసిడ్ జుట్టులోని పీహెచ్‌ని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. మంచి కండిషనర్‌గా ఉంటుంది. అయితే జుట్టు నష్టాన్ని రిపేర్ చేయదని అన్నారు. అలాగే గుడ్డులో విటమిన్లు, ప్రోటీన్లు, కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. దీన్ని అప్లై చేయడం వల్ల శిరోజాలు మృదువుగా ఉండి మెరుస్తూ ఉంటుంది. అయితే శాశ్వతమైన మార్పును కలిగించదు. ఈ సహజసిద్ధమైన వాటితో తయారైన ఉత్పత్తులు కురులను ఆరోగ్యంగా పెరిగేలా చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయని అన్నారు. మన బడ్జెట్‌కి అనుగుణంగా కురులు చూడటానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఇంట్లో దొరికే సహజసిద్ధమైన పెరుగు, గుడ్లు వంటి వాటిని కండిషనర్లుగా ఉపయోగించొచ్చని చెప్పారు.కానీ జుట్టు ఒత్తుగా, ధృడంగా పెరిగేందుకు, డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేసేందుకు మాత్రం ఇవి అస్సలు సరిపోవని తేల్చి చెప్పారు హెయిర్‌స్టైలిస్ట్ ఠాగూర్. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది కూడా. View this post on Instagram A post shared by Amit Thakur (@amitthakur_hair) (చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!) -
తలకు రంగేస్తున్నారా..? ఈ పొరపాట్లు చేయకండి..!
తెల్ల జుట్టు నల్లగా అవ్వాలంటే.. ఈ రోజుల్లో ఉన్న అతి పెద్ద సమస్యలలో ఇదొకటి. వయసు పైబడిన వారికే కాదు యువతలోనూ జుట్టు తెల్లబడటం గమనిస్తున్నాం. ఇలాంటప్పుడు జుట్టును నల్లబరచడానికి సాధారణంగా కలర్స్ వాడుతుంటారు. కొందరు స్టైల్ కోసం వివిధ రకాల రంగులను ఉపయోగిస్తుంటారు. అవగాహన ఉంటే హెయిర్ కలర్స్ వల్ల వచ్చే సమస్యలను గుర్తించి.. ముందే సరైన జాగ్రత్తలు తీసుకోవచ్చు. ప్రాచీన కాలంలో తెల్లజుట్టు రంగు మార్చడానికి గోరింటాకును ఉపయోగించేవారని కొన్ని కథనాల ద్వారా తెలుస్తోంది. సింథటిక్ హెయిర్ డై లు మాత్రం వందేళ్ల క్రితం పుట్టుకొచ్చాయి. నాటినుంచి వివిధ రకాల హెయిర్ కలర్స్ జుట్టును నల్లబరచడానికి వివిధ మోడల్స్‌లో మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి.తీవ్ర ప్రభావంషాడో కలర్స్‌తో పాటు ఎక్కువగా వినేమాట బ్లాక్ హెన్నా. ఇది కూడా కలరే. హెయిర్‌ని బ్లాక్ చేసే షాంపూలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ కలర్స్‌లో అమ్మోనియా ఫ్రీ అని మార్కెటింగ్ చేస్తుంటారు. ఇక పారాటోలిన్, డయమిన్ కెమికల్స్ బ్లాక్ కలర్ రావడానికి ఉపయోగిస్తారు. వీటివల్ల రియాక్షన్స్ వస్తాయి. కొందరికి వెంటనే రియాక్షన్ ప్రభావం చూపుతుంది. వెంటనే మాడుపైన దురద పుడుతుంది.కొందరికి తల, కళ్లు, ముఖం వాస్తాయి. దీర్ఘకాలంలో అయితే పిగ్మెంటేషన్ సమస్య వస్తుంది. మొటిమలు, యాక్నె బాధిస్తాయి. ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే మెడికేటెడ్ హెయిర్ కలర్ వాడుకోవాలి. బ్లాక్ హెన్నా సేఫ్ అని చాలా మంది అనుకుంటారు. కానీ, ఇది కూడా హెయిర్ కలరే. మిగతా వాటితో పోల్చితే రెడ్ హెన్నా కొంతవరకు సేఫ్. మాయిశ్చరైజర్ రాసుకోవాలి... హెయిర్ కలర్ వేసుకునేవారు ముందుగా చెవి వెనక జుట్టుకి కొద్దిగా వేసి, ఒకరోజు అలాగే ఉంచి, చెక్ చేసుకోవాలి. కలర్ వేసుకునే ముందు ముఖానికి, మాడుకు కూడా మాయిశ్చరైజర్ అప్లై చేసి, తర్వాత డై వేసుకోవాలి. అప్పుడు కలర్ చర్మానికి అంటినా, డార్క్ అవదు. డై వేసుకోవడానికి ఎవరికి వారుగా కాకుండా మరొకరి సాయం తీసుకోవడం ఉత్తమం.వాష్ చేసుకునేటప్పడు... కలర్ వేసుకున్న తర్వాత శుభ్రపరిచేటప్పుడు ముఖం మీదుగా కాకుండా తల వెనక నుంచే కడగాలి. దీంతో ముఖంపైన కలర్ పడకుండా ఉంటుంది. మెడికేటెడ్ హెయిర్ కలర్స్ మార్కెట్లో దొరికేటంత డార్క్ కలర్‌ని ఇవ్వవు. త్వరగా కలర్ పోతుంది. అందుకే, మార్కెట్లో లభించే వాటికే వెళతారు. కానీ, డై కి ఇచ్చిన ప్రాముఖ్యం మన ఆరోగ్యానికి కూడా ఇవ్వాలనేది గుర్తుంచుకోవాలి. జుట్టు తెల్లబడకుండా ఉండేందుకు మార్గాలేవీ లేవు కనుక ప్రొటెక్టివ్ మెడికేటెడ్ కలర్స్, షాంపూలను ఉపయోగించడం మేలు. పొడిబారడం ప్రధాన సమస్య...సోరియాసిస్ సమస్య ఉన్నవాళ్లు హెయిర్కలర్స్ వేసుకునే ముందు మెడికేషన్ తీసుకోవాలి. కలర్ సమస్యతో పాటు ఈ కాలం చలి వల్ల చాలా మంది తల స్నానం చేయరు. లేదంటే స్నానానికి వేడిగా ఉండే నీటిని ఉపయోగిస్తారు. దీంతో చర్మం, వెంట్రుకలు కూడా పొడి బారుతాయి. కలర్స్ వల్ల కూడా మాడు దురద పెడుతుంది. పొడిబారిన మాడు చుండ్రును పెంచుతుంది. యువతలో ఈ సమస్య అధికం.అందుకని, వారానికి రెండు సార్లు ఆయిల్ మసాజ్ చేసుకొని, మెడికేటెడ్ లేదా యాంటీ డాండ్రఫ్ షాంపూతో తలస్నానం చేయాలి. చుండ్రు సమస్య ఉన్నవాళ్లు నూనె రాసి, అలాగే ఉంచకూడదు. వెంట్రుకల మృదుత్వానికి, కలర్‌కి హెన్నా, అలోవెరా... వంటివి తలకు ప్యాక్స్ వేస్తుంటారు. వీటిని రాత్రంతా అలాగే ఉంచి, మరుసటి రోజు స్నానం చేస్తుంటారు. దీనివల్ల సైనస్ సమస్యలు రావచ్చు. తలకు నేచురల్ ప్యాక్స్ వేసుకున్నా గంటలోపు తలను శుభ్రపరుచుకోవడం మంచిది.– డాక్టర్ స్వప్నప్రియ, డెర్మటాలజిస్ట్ (చదవండి: ఫ్యాషన్‌కి వయసు అడ్డంకి కాదంటే ఇదే..! లెజండరీ గ్రానీ స్టిల్స్ అదుర్స్..) -
తెల్లజుట్టు నల్లగా, స్మూత్ అండ్ షైనీగా : సహజమైన బీట్రూట్ మాస్క్
చిన్న వయసులోనే తెల్లగా మెరిసిన జుట్టును నల్లగా మార్చుకోవడం ఒకపెద్ద సవాల్. మార్కెట్లోదొరికే రసాయనాలు కలిపిన హెయిర్డైలను వాడవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రసాయనాలు జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా హానికరమనీ, ప్రమాదకరమైన కెమికల్స్ వల్ల కేన్సర్ ముప్పు పొంచి వుందని వైద్యులు కూడా చెబుతున్న మాట. హానికరమైన రసాయనాలు లేకుండా సహజంగా, ఇంట్లోనే దొరికే వాటితో జుట్టు రంగు మార్చు కోవడం ఎలా? ఈ విషయంలో బీట్ రూట్ బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.బీట్ రూట్లో పొటాషియం, ఐరన్, ఫోలేట్, విటమిన్ సీ, ఏ,ఈ పుష్కలంగా లభిస్తాయి. కెరోటిన్‌తో కూడిన యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. అలాగే ప్రోటీన్, మెగ్నీషియం , కాల్షియంకూడా అందుతాయి. ఇవి హెయిర్ ఫోలికల్స్ ఆరోగ్యాన్ని కాపాడతాయి. చర్మం , జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగపడతాయి. ఇంకా ఇందులో రెటినోల్, ఆస్కార్బిక్ యాసిడ్, బీ కాంప్లెక్స్ లాంటి జుట్టు, చర్మానికి మేలు చేసే విటమిన్లు కూడా ఉన్నాయి. కొబ్బరి నూనె బీట్రూట్ రసం హెయిర్ మాస్క్కొబ్బరి నూనెను బీట్రూట్ రసంలో కలిపి జుట్టుకు రాసుకుంటే సహజమైన రంగు సంతరించు కుంటుంది. అంతేకాదు జుట్టును తేమగా ఉంచుతుంది. కురులు మృదువుగా మారతాయి. బీట్రూట్ రసంలో కొబ్బరినూనె కలిపిన పేస్ట్‌ను జుట్టుకు అప్లై చేసిన తర్వాత 2 గంటల పాటు అలాగే ఉంచి తర్వాత సాధారణ నీటితో జుట్టును కడగాలి. క్రమంగా తప్పకుండా ఇలా చేయడం వల్ల జుట్టు నల్లగా మారి, నిగనిగలాడుతుంది.క్యారెట్, బీట్రూట్ మాస్క్: ఈ మిక్స్డ్ జ్యూస్ ఆరోగ్యానికి మాత్రమే కాదు, జుట్టు ఆరోగ్యానికి చాలా మంచింది. క్యారెట్,బీట్ రూట్ రసాన్ని తీసి, శుభ్రంగా వడకట్టి జుట్టుకు అప్లై చేయాలి. దీని వల్ల జుట్టు మృదువుగా చక్కటి రంగులో మెరిసిపోవడం కాదే, చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది.బీట్రూట్ రసం బ్లాక్ కాఫీ హెయిర్ మాస్క్ జుట్టు రంగును మార్చడంలో బ్లాక్‌టీ, కాఫీ బాగా పనిచేస్తాయి. ఒక కప్పు బీట్రూట్ రసంలో, ఒకటిన్నర కప్పుల బ్లాక్ టీ లేదా కాఫీ (కాఫీ లేదా టీ పౌడర్‌ను నీటిలో బాగా మరగించి వడబోసుకోవాలి) కొద్దిగా రోజ్ వాటర్ కలిపి ఈ మిశ్రమాన్ని వడబోసుకోవాలి. దీన్ని కుదుళ్లుకు పట్టేలాబాగా పట్టించాలి. ఒక గంట తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. చిక్కులు రాకుండా, జుట్టు తెగిపోకుండా సున్నితంగా దువ్వుకోవాలి.బీట్రూట్, హెన్నాజుట్టు సంరక్షణలో మరో సహజమైంది హెన్నా.దీనికి బీట్ రూట్ రసంజోడిస్తే ఫలితం బావుంటుంది. బీట్ రూట్ రసం, హెన్నా పౌడర్, కొద్దిగా బ్లాక్‌టీని వేసి బాగా కలిపి జుట్టుకు అప్లై చేయాలి. ఒక గంట తర్వాత జుట్టును శుభ్రంగా కడిగేసుకోవాలి. మంచి ఫలితం రావాలంటే కనీసం రెండు మూడు వారాలకొకసారి పైన చెప్పిన మాస్క్‌లను ప్రయత్నించాలి. అలాగే ఈ మాస్క్ వేసుకున్నపుడు షాంపూని వాడకూడదు. -
కెమికల్ స్ట్రెయిట్నెర్లతో పనిలేకుండానే.. మీ జుట్టు హెల్దీగా, షైనీగా!
ఆధునిక కాలంలో స్టయిలింగ్‌కు, సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండగొచ్చినా, ఫంక్షనొచ్చినా బ్యుటీషియన్లకోసం పరుగులు పెడతారు చాలామంది. ముఖ్యంగా గజిబిజిగా ఉన్న జుట్టును, షైనీగా, స్ట్రెయిట్‌గా చేసుకోవడంపెద్ద టాస్క్. హీట్ లేదా కెమికల్ స్ట్రెయిట్నెర్లను ఉపయోగించకుండా స్ట్రెయిట్నింగ్ కోసం ఇవిగో టిప్స్ . బ్లో డ్రైయర్, హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ట్రీట్మెంట్లు మన కేశాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే సహజ పద్ధతుల ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్నర్ ద్వారా పదే పదే జుట్టును వేడికి గురి చేస్తే తొందరగా ఊడిపోతుంది. సహజమైన షైనింగ్‌ను కోల్పోయి పొడి బారుతుంది. అందుకే జుట్టును సహజంగా స్ట్రెయిట్ చేసే పద్ధతులు చూద్దాం. జెంటిల్ క్లెన్సింగ్: రాత్రి పూటే సహజమైన నూనెను జుట్టంతా పట్టించి, ఉదయాన్నే రసాయనాలు లేని షాంపూతో స్నానం చేసి వెంట్రుకలను మృదువుగా ఉంందుకు తేలికపాటి కండీషనర్‌ని వాడాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టుగా మృదువుగా మెరుస్తూ చెప్పినట్టు వింటుంది. జుట్టు తడిగా ఉన్నపుడే పళ్లు వెడల్పుగా ఉండే దంతాల దువ్వెనతో సుత్తిమెత్తగా దువ్వుతూ చిక్కు తీయాలి. సహజంగా గాలికి ఆరనివ్వండి. లేదంటే ఫ్యాన్ ముందు మెల్లిగా దువ్వుతూ, బ్రషింగ్ చేసినా పరవాలేదు. చివర్ల నుండి ప్రారంభించి మూలాల వరకు దువ్వాలి. దీంతో జుట్టు ఎక్కువగా రాలదు. స్ట్రయిట్‌గా వస్తుంది. అలాగే జుట్టుకు కొద్దిగా స్మూతింగ్ సీరమ్ అప్లై చేయండి. లేదంటే కొద్దిగా ఆర్గాన్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా సిలికాన్ వంటి పదార్థాలనూ వాడవచ్చు. పాలు , తేనె: పాలలో ప్రొటీన్లు ఉంటాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంతోపాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. తేనెలో తేమను కాసాడే సహజమైన హ్యూమెక్టెంట్ ఉంటుంది. ఒక కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు మొదళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. దీన్ని 1-2 గంటలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. రోలర్ దువ్వెనతో మంచిగా దువ్వు కోవాలి. దీంతో జుట్టు మెత్తగా షైనింగ్‌గా ఉంటుంది. అరటి-ఆలివ్ ఆయిల్ మాస్క్: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.ఆలివ్ ఆయిల్ తేమను అందిస్తుంది. అరటిపండులో, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెతో మెత్తగా ఉండలు లేకుండా గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. అనంతరం జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 30 నుంచి 60 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో వాష్ చేసి, కండీషనర్ అప్లయ్ చేయాలి. స్ట్రయిట్‌గా సిల్కీగా జుట్టు మెరిసిపోతుంది. గుడ్డు- ఆలివ్ ఆయిల్ మాస్క్: గుడ్లలో ప్రోటీన్లు ,పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను అందిస్తుంది. ఒకటి లేదా రెండు గుడ్లను (వాసన పడని వారు పచ్చసొనను తీసివేయాలి) కొట్టి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట, లేదా గంటసేపు మాస్క్ వేసి ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు నమ్మలేనంత మృదువుగా వెంట్రుకలు తయారవుతాయి. అలోవెరా జెల్ మాస్క్: సౌందర్య పోషణలో అలోవెరాకున్న ప్రాముఖ్యతే వేరు. అలోవెరా జెల్ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సహజమైన జెల్‌ను తీసి జుట్టుకు అప్లై చేసి, 30-60 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఆ తరువాత కండిషనర్ తప్పకుండా అప్లయ్ చేయాలి. -
సాల్మన్ చేపలు తింటున్నారా?,ఇందులోని విటమిన్ బి6 వల్ల జుట్టుకు..
అందం అంటే చర్య సౌందర్యం మాత్రమే కాదు.. జుట్టు సౌందర్యం కూడా. అందుకే అమ్మాయి, అబ్బాయి అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. కాస్త జుట్టు ఊడిపోతున్నా తెగ ఫీల్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో హెయిర్ ఫాల్ చాలా కామన్ ప్రాబ్లమ్. రకరకాల షాంపులు, ఆయుల్స్, పొల్యూషన్ వల్ల చాలామందిలో జుట్టు విపరీతంగా ఊడిపోతుంది. మరి వెంట్రుకలు బాగా పెరిగి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి, మీ డైట్లో ఎలాంటి మార్పులు చేసుకుంటే మంచిది అన్నది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు జుట్టు రాలడానికి ప్రధాన కారణం ఖనిజాలను కోల్పోవడం. ఫోలేట్, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి తదితర పోషకాల లోపం వల్ల జుట్టు బాగా రాలుతుంది. కాబట్టి ఇవి డైట్లో ఉండేలా చేసుకోవాలి. అందకు పాలకూరను ఎక్కువగా తీసుకోవాలి.పాలకూరలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు సహాయ పడతాయి. పాలకూర జుట్టుకు సహజసిద్ధమైన కండిషనింగ్‌ను అందిస్తుంది. పాలకూరలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. నట్స్ ఆహారంలో ప్రతిరోజూ నట్స్ తీసుకోవలి. బాదంపప్పు, పిస్తాపప్పు, కాజు మొదలైన డ్రైఫ్రూట్స్‌ని ప్రతిరోజూ డైట్లో చేర్చుకోవాలి. ఇందులో విటమిన్ ఇ, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, బయోటిన్ సహా ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు జుట్టు, చర్మం ఆరోగ్యానికి గొప్పగా పనిచేస్తాయి. ముఖ్యంగా ప్రతిరోజూ బాదం తీసుకోవడం వల్ల జుట్టు కుదుళ్లను బలంగా, సిల్కీగా ఉండేలా చేస్తుంది. గుడ్లు కోడిగుడ్లలో ప్రొటీన్, విటమిన్ బి12, ఐరన్, జింక్ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కురుల పెరుగుదలకు సహాయపడతాయి. గుడ్డు పచ్చసొనలో ఉండే.. విటమిన్ A,E, బయోటిన్, ఫోలేట్ జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా పెరిగేలా తోడ్పడతాయి. అందువల్ల ప్రతిరోజూ ఓ గుడ్డు తినాలి. చేపల్లో ఒమెగా 3, ఒమెగా 6 తదితర ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ డి, ప్రోటీన్లు ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచేలా చూస్తాయి. జుట్టు పెరుగుదలకు తోడ్పడతాయి. గుడ్డులోని జింక్, బయోటిన్ ఆరోగ్యవంతమైన జుట్టుకు తోడ్పడుతుంది. చేపలు సాల్మన్ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడమే కాకుండా డెడ్ హెయిర్ సెల్స్‌ను తగ్గిస్తుందని ఓ అధ్యయనంలో తేలింది. సాల్మన్, సార్డినెస్, మాకెరెల్ వంటివి ఆరోగ్యకరమైన కొవ్వును కలిగి ఉండే చేపలు. ఈ చేపల్లో ప్రొటీన్లు, విటమిన్ డి, విటమిన్ బి6 కూడా అధికంగా లభిస్తాయి. వీటన్నింటిలో సాల్మన్ చేపలు మరీ ఆరోగ్యకరమైనవి. చిలగడదుంప జుట్టు రాలే సమస్యతో ఇబ్బందిపడుతుంటే ఆహారంలో చిలగడదుంపను చేర్చుకోవాలి. ఎందుకంటే ఇందులో బీటా కెరోటిన్ ఉంటుంది. ఇది శరీరంలో విటమిన్ A లోపాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. కాబట్టి జుట్టు పెరుగుదలకు చిలగడదుంపను మీ డైట్లో ఉండేలా చూసుకోండి. బెర్రీలు బెర్రీలు ప్రతిరోజూ బెర్రీలను తీసుకుంటే జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఎందుకంటే బెర్రీస్‌లో జుట్టుకు ఉపయోగపడే విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అందుకే ప్రతిరోజూ బెర్రీలను డైట్లో చేర్చుకోండి. పెరుగు పెరుగు జుట్టుకు మంచి కండిషనర్‌గా పనిచేస్తుంది. ఇందులోని పోషకాలు, ఔషధ గుణాలు జుట్టు పెరుగుదలకు తోడ్పడుతుంది.వెంట్రుకలకు బలాన్ని ఇచ్చి మెరుపును అందిస్తాయి. పెరుగును తినడమే కాకుండా ప్యాక్ వేసుకోవడం వల్ల కూడా జుట్టు సమస్యలను కంట్రోల్లో ఉంచుతుంది. చుండ్రుతో బాధపడుతున్న వాళ్లు వారానికి ఒకసారి పెరుగుతో ప్యాక్ వేసుకుంటే చుండ్రు పూర్తిగా తొలగిపోతుంది. -
చక్కగా మసాజ్,ఈ బ్రష్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది..
చూడటానికి కంప్యూటర్ మౌస్లా కనిపించే ఈ పరికరం హెడ్మసాజర్. ఇది రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీని అడుగుభాగంలో సున్నితమైన బ్రష్ ఉంటుంది. ఆన్ చేసుకుని, కోరుకున్న వేగాన్ని సెట్ చేసుకుంటే చాలు. తలదిమ్ము వదిలేలా, తలకు హాయి కలిగించేలా ఇంచక్కా మర్దన చేస్తుంది. దీని బ్రష్ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. ఫలితంగా జుట్టురాలడాన్ని అరికడుతుంది. జుట్టు ఇప్పటికే రాలిపోయిన చోట కొత్త వెంట్రుకలను మొలిపిస్తుంది. జపాన్‌కు చెందిన ‘హెబావోడాన్’ కంపెనీ ఈ పరికరాన్ని ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర 5200 యెన్లు (రూ.2,925) మాత్రమే! -
కేశమహిమ
జీవితంలో అప్రధానంగా కనిపించే విషయాలకు కూడా వాటి ప్రాధాన్యం వాటికి ఉంటుంది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ జుట్టు. మన భాషా సాహిత్యాలను కొంచెం తరచి చూస్తే, జుట్టుకు ఉన్న ప్రాశస్త్యం అర్థమవుతుంది. జుట్టు చుట్టూ జరిగే వ్యాపారాలను కాస్త నిశితంగా గమనిస్తే,ఎంతటి వారైనా ‘జుట్టే కదా’ అని కేశపాశాలను వెంట్రుక ముక్కలా తీసి పారేయలేరు. అదీ కేశ మహిమ! అందమైన కేశాలు నిండుగా తలమీద ఉండటం వల్లనే శ్రీమహావిష్ణువుకు కేశవుడనే పేరు వచ్చింది. ఆదిభిక్షువే అయినా, పరమశివుడు కేశసంపదలో తక్కువ వాడేమీ కాదు, ఆయన జటాజూటధారి! ఆయన తన జటాజూటంలో గంగను బంధించాడు కాబట్టి గంగను శిరోజతీర్థం అని అంటారు. తలవెంట్రుకలకు గల పురాణ ప్రశస్తికి ఇవి కొన్ని మచ్చుతునకలు మాత్రమే! జుట్టును అల్లుకున్న జాతీయాలు, సామెతలు దాదాపు అన్ని భాషల్లోనూ ఉన్నాయి. ‘ఫలిత కేశాలు ముదిమికి సంకేతాలే గాని, జ్ఞానానికి కాదు’ అని ఇంగ్లిష్ సామెత. ఇది తలపండితులకు చక్కగా వర్తిస్తుంది. ‘తలలు బోడులైన తలపులు బోడులా’ అనే సామెత మనకు ఉండనే ఉంది. ‘అందితే జుట్టు, అందకపోతే కాళ్లు పట్టుకోవడం’ కూడా మన నుడికారంలో భాగమే! కొందరు బతకనేర్పరులు ఈ విద్యలో బాగా ఆరితేరి ఉంటారు. ‘జుట్టున్నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే’ అని నానుడి. ఇటీవల ఏపుగా జుట్టు పెంచుకోవడానికి హైదరాబాద్‌లో ఒక మహిళ బ్యూటీ పార్లర్‌కు వెళ్లింది. బ్యూటీపార్లర్ చికిత్సతో ఆమెకు ఉన్న జుట్టు కూడా ఊడిపోయింది. ఇలా ఉంటాయి కేశక్లేశాలు! ‘కాళ్లు్ల వంకరగా ఉన్నప్పుడు నెత్తి మీద వెంట్రుకలు తిన్నగా ఉండి లాభమేంటి?’ అని రష్యన్ సామెత. ‘ప్రతి మనిషి పొద్దున్నే తలదువ్వుకున్నట్లు మనసు దువ్వుకోరెందుకో?’ అని చైనీస్ సామెత. మనుషులకు శిరోజాలంకరణ మీద ఉన్న శ్రద్ధ మనోలంకరణ మీద ఉన్నట్లయితే, ఈ ప్రపంచం ఎప్పుడో బాగుపడిపోయేది! మన పూర్వకవులు మరాళకుంతలలైన నీలవేణుల సౌందర్యాన్ని ఇతోధికంగా వర్ణించారు. ‘ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై నంశోత్తరీయంబుపై...’ పద్యంలో పోతనామాత్యుడు శ్రీమహా విష్ణువు కరవైభవాన్ని వర్ణించడానికి లక్ష్మీదేవి కొప్పునే ఆశ్రయించాల్సి వచ్చింది. ‘అంభోజతాక్షి వేణిన్ హరువు గనిన రోమాతి సౌభాగ్యమెంతే... చమిరి యొనరుపన్ చక్కనౌ తీవెయోనాన్’ అంటూ కొప్పరపు కవులు ఒక అవధానంలో వేణీసౌందర్యాన్ని వర్ణించారు. ‘కలుగక యిచ్చెడు మనుజులు/ తలవెండ్రుకలంత మంది తర్కింపంగా/ కలిగియు నీయని యధములు/ మొల వెండ్రుకలంత మంది మోహన రంగా’ అని ఒక పూర్వకవి సంపన్న లోభుల మీద కసిదీరా తన అక్కసును వెళ్లగక్కాడు. తల మీది వెంట్రుకలకే కాదు, పురుషుల మీసాలకు, గడ్డాలకు కూడా మన భాషా సాహిత్యాల్లో తగిన ప్రశస్తి ఉంది. మీసాలను పౌరుష చిహ్నాలుగా గుర్తిస్తారు. అందుకే ‘మీసము పస మగ మూతికి’ అన్నాడు చౌడప్ప. వైదికులకు మీసాలు పెంచే ఆచారం లేకపోయినా, తిరుపతి వేంకట కవులు మీసాలను పెంచారు. ఈ జంటకవులు మీసాలను పెంచడాన్ని కొందరు ఆక్షేపిస్తే, ‘దోసమ టంచెరింగియును దుందుడుకొప్పగ పెంచినారమే/ మీసము రెండు బాసలకు మేమె కవీంద్రుల మంచు దెల్పగా/ రోసము గల్గినన్ కవి వరుల్ మము గెల్వుడు గెల్చిరేని ఈ/ మీసము దీసి మీ పాద సమీపములన్ తలలుంచి మ్రొక్కమే!’ అని సవాలు విసిరారు. అదీ వారి కవన పౌరుషం! కేశ సంరక్షణ కోసం స్త్రీ పురుష భేదం లేకుండా మనుషులు నానా తంటాలు పడటం శతాబ్దాల నుంచే ఉంది. తలకట్టు నిండుగా కనిపించడానికి వివిధ సుగంధ తైలాలను వాడేవారు. గాంభీర్యా నికి గురుతైన మీసకట్టు ఏపుగా పెరగడానికి కూడా రకరకాల పద్ధతులు పాటించేవారు. ‘అంబలి తాగేవాడొకడైతే మీసాలెత్తేవాడు ఇంకొకడు’, ‘మింగ మెతుకు లేదు గాని, మీసాలకు సంపెంగ నూనె’ వంటి సామెతలు సమాజంలోని డాంబిక ఆడంబరాలను బయటపెడతాయి. బ్రిటిష్ హయాంలో ఆధునిక పోకడలు మొదలయ్యాక మన దేశంలో అలంకరణల పద్ధతుల్లో చాలా మార్పులే వచ్చాయి. తల వెంట్రుకలను, మీసకట్టును చిత్రవిచిత్రమైన పద్ధతుల్లో తీర్చిదిద్దుకోవడం మొదలైంది. ఈ మార్పులు మొదలైన కొత్తలో కొంత విచిత్రంగా చూసేవారు. అప్పటికింకా సంప్ర దాయాలను వదులుకోని ఛాందసులు ఈ విచిత్ర కేశాలంకరణలను ఆక్షేపించేవారు. ‘గొంగడి పురుగు కట్టింగు మీసాల వాడు/ గంపశ్రాద్ధపు తలకట్టువాడు’ అని మాధవపెద్ది బుచ్చి సుందర రామ శాస్త్రి ‘కన్యాశుల్కం’లోని గిరీశం పాత్రను వర్ణిస్తూ ఒక పద్యం రాశారు. తలకు చక్కగా నూనె పట్టించి, నున్నగా దువ్వుకోవడం పెద్దమనుషుల లక్షణంగా ఉండేది. ఆ రోజుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు అలా నున్నగా దువ్విన తలకట్టుతో ఉండేవారు. ఆయన తలకట్టు సొగసును– ‘ఈగ వ్రాలిన గాని వేగ జారెడునట్లు మువ్వంపు కురులను దువ్వినాడు/... చెవుల సందున గిర జాలు చిందులాడ మొగము మీదను చిరునవ్వు మొలకలెత్త/ టంగుటూరి ప్రకాశము రంగు మెరయ ధవళగిరి తీర్థమునకు తరలివచ్చె’ అంటూ చిలకమర్తివారు వర్ణించారు. ఆ రోజులే వేరు. సామాజిక, రాజకీయ జీవితాల్లో సరసత ఉండేది. ఇప్పుడు రాజకీయాలు బొత్తిగా మొరటుదేరిపోయాయి. అయితే, ఇప్పటికీ రాజకీయ నాయకుల ప్రసంగాల్లో తరచుగా కేశ ప్రస్తావన వస్తూనే ఉంటుంది గాని, వారి ప్రసంగాల్లో కేశాలకు సంబంధించి దొర్లే ముతక పదాలు జనాల చెవులను చిల్లులు పొడుస్తుంటాయి. అయినా, గొంగట్లో భోంచేసేటప్పుడు వెంట్రుకలను ఏరుకోక తప్పదు కదా! -
నటి ప్రియాంక బిజినెస్ ప్లాన్స్: నా బ్యూటీకి దేశీ ఉత్పత్తులనే వాడతా
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇందుకోసం నైకా బ్రాండ్ కింద సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే బ్యూటీ అండ్ వెల్నెస్ ఈ–కామర్స్ సంస్థ ఎఫ్ఎస్ఎన్తో డీల్ కుదుర్చుకుంది. అనామలీ పేరిట శిరోజాల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన సొంత బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. లాంచ్ సందర్భంగా, జోనాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ rouge, పెరుగు, తేనె లాంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణ పద్ధతులను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, ఈ నేపథ్యంలోనే కురుల సంరక్షణకు సంబంధించి భారతీయ సంప్రదాయ విధానాల స్ఫూర్తితో సహజసిద్ధమైన ప్రకృతి వనరుల నుంచి వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) "అనోమలీ హెయిర్కేర్ను భారతదేశానికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే పుట్టిన ఈ బ్రాండ్ ఇండియా లాంచ్ చాలా ప్రత్యేక మైందని ప్రియాకం చెప్పారు. ప్రకృతి, వృక్షాలతో భారతీయ సౌందర్యం ఇమిడిపోయిందని ఆమె అన్నారు.గత మూడు, నాలుగు సంవత్సరాలలో భారతీయ అందాల విభాగం బాగా వృద్దిచెందిందని నైకా సీఈఓ, ఈ-కామర్స్ బ్యూటీ, అంచిత్ నాయర్ వ్యాఖ్యానించారు.(jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) -
దీపిక పదుకోణ్ ఒత్తయిన జట్టు వెనుక రహస్యమిదే..!
నా బుగ్గల మీది డింపుల్స్కు ఎంత మంది ఫ్యాన్సో .. నా ఒత్తయిన జుట్టుకూ అంతే మంది ఫ్యాన్స్. ఎక్కడికెళ్లినా హెల్దీ హెయిర్ సీక్రెట్స్ చెప్పమంటుంటారు. ప్రతి రోజూ పడుకునే ముందు కొబ్బరి నూనె పెట్టి .. స్కాల్ప్‌ను బాగా మసాజ్ చేస్తాను. తగినన్ని నీళ్లు తాగుతా. హాయిగా నిద్రపోతా. మా అమ్మ చెప్పిన ఈ త్రీ సింపుల్ థింగ్స్‌ను తు.చ తప్పకుండా పాటిస్తా. పాటిస్తూ వస్తున్నా.. చిన్నప్పటి నుంచి. ఇంతకు మించిన సీక్రెట్స్ ఏమీ లేవు. – దీపికా పదుకోణ్ -
జుట్టు తెల్లబడుతుందా నోటెన్షన్, అదిరిపోయే గాడ్జెట్ మీకోసం!
నల్లటి, పట్టులాంటి జుట్టే ఎవ్వరికైనా ప్రత్యేకమైన అందాన్ని ఇస్తుంది. ముఖానికి కళనిచ్చే కేశాలు వయసుతో సంబంధం లేకుండా తెల్లబడిపోతున్నాయి. పోషకాహార లోపమో.. కాలుష్య ప్రభావమో.. బాలమెరుపు అనేది సాధారణ సమస్యగా మారిపోయింది. వయసు మీద పడినా నల్లటి జుట్టునే కోరుకునేవారు కొందరైతే, బాలమెరుపు బయటపడకుండా జాగ్రత్తలు తీసుకునేవారు ఇంకొందరు. అందరికీ ఒక్కటే దిక్కు.. అయితే కలర్ వేసుకోవాలి. లేదంటే హెన్నా పెట్టుకోవాలి. హెన్నా అనగానే రెండు రోజుల పని. ముందు రోజు కలిపి నానబెట్టుకోవాలి. తెల్లవారి అప్లయ్ చేసుకుని ఓ రెండుమూడు గంటలు ఉండాలి. అంత టైమ్ ఎక్కడుందీ బిజీ కాలంలో. అందుకే ఎక్కువ మంది కలర్ వేసుకోవడానికే ఇష్టపడుతున్నారు. వీళ్లందరితో పాటు.. స్టయిలిష్ లుక్ కోసం రకరకాల రంగులు వేసుకునేవారికి సైతం చక్కగా సహకరిస్తుంది ఈ దువ్వెన (ఎలక్ట్రిక్ హెయిర్ డైయింగ్ కూంబ్). సొంత ప్రయోగాలు ఎందుకులే అంటూ పార్లర్లు, సెలూన్లకు తిరుగుతూ డబ్బులు వృథా చేసుకునేవారికి ఇది చాలా మంచి ప్రత్యామ్నాయం. ఈ డివైజ్ ఇంట్లో ఉంటే.. వేగంగా, సురక్షితంగా ఒంటి చేత్తో డై వేసుకోవచ్చు. ఇది బ్యాటరీల సాయంతో పనిచే స్తుంది. దువ్వెన పళ్లు ఉన్నవైపు మధ్యలో గుండ్రటి మూత ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి.. అందులో కలర్ నింపుకుని.. తిరిగి మూత పెట్టి, గట్టిగా బిగించి, ముందువైపు కింద భాగంలో ఉన్న బటన్ ఆన్ చేసుకుని, సాధారణంగా జుట్టు దువ్వుకున్నట్లు దువ్వుకుంటే సరిపోతుంది. దువ్వెన పళ్లలోంచి కొద్దికొద్దిగా లిక్విడ్ బయటికి వస్తూ ప్రతి వెంట్రుకకు కలర్ వేస్తుంది. అయితే కలర్ వేసుకునే కంటే ముందు జుట్టును చిక్కు లేకుండా చూసుకోవాలి. మార్కెట్లో ఇలాంటి మోడల్స్ చాలానే దొరుకుతున్నాయి. అయితే ఇతర వినియోగదారుల రివ్యూస్, క్వాలిటీ చూసుకుని కొనుగోలు చేయడం మంచిది. -
అద్భుతమైన సౌందర్య పోషకంగా.. ఉల్లిపాయ
-
పట్టులాంటి జుట్టుకోసం.. ఇవి కలిపి జుట్టుకి పట్టించండి..
► రెండు కోడిగుడ్ల తెల్లసొనలో రెండు టీ స్పూన్ల ఆముదం, ఒక టీస్పూన్ గ్లిజరిన్ కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల మొదలు నుంచి జుట్టుకంతా పట్టించి, 20 నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. ► ముందురోజు రాత్రి ఒక కప్పు పెరుగులో రెండు టీ స్పూన్ల మెంతులు వేసి నానబెట్టాలి. మరుసటి రోజు నాలుగయిదు మందార ఆకులని జతచేసి గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్నంతటినీ జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాలపాటు ఉంచి తల స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► ఒక పాత్రలో టీ స్పూన్ తేనె, టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, ఒక టీ స్పూన్ నిమ్మరసం, కోడిగుడ్డు సొన ఒకదాని తరువాత ఒకటి వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్ల దగ్గర నుండి చివరి వరకూ పట్టించి ఇరవై నిమిషాలుంచి కడిగేయాలి. ► తలంటుకునే ముందు షాంపూలో కొద్దిగా వెనిగర్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకంతటికీ పట్టించి పది నిమిషాల తరువాత తల స్నానం చేయాలి. వారంలో ఒక్కసారయినా టీ డికాషన్ తో జుట్టుని కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. ► పెరుగు కదుళ్ల నుండి జుట్టుకంతటికీ పట్టించి పది నిమిషాలయ్యాక తల స్నానం చేస్తే పట్టులా మెరుస్తుంది. -
ఇలా చేస్తే .. ఎప్పటినుంచో వెంటాడుతున్న చుండ్రు సమస్య పరార్!!
How To Cure Dandruff Tips In Telugu: ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో, ప్రాంతాలలో చాలామంది ఎదుర్కొనే సాధారణ సమస్యలలో చుండ్రు ఒకటి. చుండ్రు ఒకప్పుడు చలికాలం మాత్రమే వచ్చే సమస్య. ఇప్పుడు కాలాలు, వాతావరణాలతో, వయసుతో సంబంధం లేకుండా అందరినీ చుట్టు ముట్టేస్తోంది. ఇదేమీ పెద్ద అనారోగ్య సమస్య కాదు... ప్రాణాంతక వ్యాధి అసలే కాదు, కాని చాలా చిరాకు కలిగించే సమస్య. కొందరిలో ఆత్మస్థైర్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది! దేనికైనా అది రావడానికి కారణాలు తెలిస్తే నివారించడం సులభం... చుండ్రు ఎందుకు వస్తుంది? దానిని ఎలా నివారించవచ్చనే దానిపై అవగాహన కోసం... చుండ్రు అంటే ఏమిటి? ఎందుకు వస్తుంది? చుండ్రు రావటానికి కారణం మన తలలో ఉండే ఈస్టు అనే హానిలేని సూక్ష్మజీవి. ఇది అందరిలో ఉంటుంది. కానీ తలలో అధికంగా ఉండే నూనె, మృత కణాలని ఆహారంగా తీసుకుని వృద్ధి చెందుతుంది. దీనిమూలంగా మృత కణాలు ఎక్కువై తల నిండా పొట్టు లాగా కనపడుతుంది. దీనినే చుండ్రు అంటారు. ఆహారంలో గణనీయమైన మార్పులు, తరచు ప్రయాణాలు చేయడం, నీటి మార్పు, వాతావరణ మార్పు వంటివి ఇప్పుడు ఇంచుమించు అందరి జీవితంలో తప్పనిసరి అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలో జుట్టుని ఆరోగ్యంగా, అందంగా ఉంచుకోవటానికి ఖచ్చితంగా కొంత టైం కేటాయించాలి. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! నివారణ చర్యలు ►ఇతరుల దువ్వెనలను, హెయిర్ బ్రష్‌లను, తువ్వాళ్ళను వాడకూడదు. తమ వస్తువులను ఇతరులకు ఇవ్వకూడదు. వారానికి ఒకసారి స్వచ్ఛమైన కొబ్బరినూనె లేదా ఆలివ్ ఆయిల్‌ను గోరువెచ్చగా చేసి, తలకు పట్టించి, సున్నితంగా మర్దన చేయాలి. ఆ తర్వాత కుంకుడు కాయలు లేదా శీకాయపొడిని ఉపయోగించి, తలస్నానం చేయాలి. ►తలస్నానం చేసే నీళ్ళు పొగలు కక్కేంత వేడిగా లేదా వణుకు పుట్టించేంత చల్లగా ఉండకూడదు. గోరువెచ్చని నీరు చాలా మంచిది. ప్రకటనలలో చూపించారు కదా అని గాఢమైన రసాయనాలు కలిసిన హెయిర్ ఆయిల్స్‌ను, షాంపూలను ఇష్టం వచ్చినట్లు వాడటం కూడా తలపై ఈస్ట్ పెరిగేందుకు అవకాశం కలిగిస్తుంది. ►మాసిపోయిన దుప్పట్లను, తలగడలను వాడటం, దుమ్ము, ధూళి పడే ప్రదేశంలో పని చేయడం, పోషకాహారం తీసుకోకపోవడం, మానసిక ఆందోళన, కొన్ని రకాల మందులను వాడటం చుండ్రుకు దారి తీసే కారణాలలో ప్రధానమైనవి. ►చుండ్రుతో బాధపడేవారు తలగడ గలీబులను వేడినీటిలో నానబెట్టి, శుభ్రంగా ఉతికి ఎండలో ఆర వేయాలి. పుదీనా రసం మాడుకి పట్టించి అరగంట తర్వాత తలని శుభ్రపరిస్తే చుండ్రు సమస్య ఉండదు. చదవండి: Health Tips: ఈ విటమిన్ లోపిస్తే మతిమరుపు, యాంగ్జైటీ, హృదయ సమస్యలు.. ఇంకా.. మందార ఆకులు : జుట్టుకు కండిషనర్ మందార ఆకులు మరియు పువ్వు రేకులను పేస్ట్ చేసి జుట్టుకు ఒక సహజ కండీషనర్ వలె ఉపయోగిస్తారు. జుట్టు ముదురు రంగులో మారటానికి మరియు చుండ్రు తగ్గించడానికి సహాయపడుతుంది. మెంతి: మెంతి ఆకును దంచి పేస్ట్ లా చేసి తలకు రాస్తే చుండ్రు, వెండ్రుకలు రాలడం తగ్గుతాయి. వెండ్రుకలు నిగనిగలాడతాయి. వేపాకు: తలలో చుండ్రు ఏర్పడితే తాజా వేపాకులను మెత్తగా నూరి, ఆ ముద్దను తలకు పట్టించి, ఓ పావుగంటయిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు తొలగిపోయి తల శుభ్రంగా ఉంటుంది. కాసిని గసగసాలు తీసుకొని, సన్నని మంట పై వేయించి, గోరువెచ్చటి నీటిలో 4 నుండి 5 గంటలు నానబెట్టి ఆ మిశ్రమాన్ని, తలకు పట్టించి, గంట ఆగి తల స్నానం చేయాలి. నాణ్యమైన వెనిగర్ బాటిల్ తెచ్చుకుని ఆరు చెంచాల నీళ్లకు రెండు చెంచాల వెనిగర్ చొప్పున కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేసినట్లయితే చుండ్రు సమస్య నుంచి తొందరలోనే బయట పడవచ్చు. చదవండి: Mysteries Temple: అందుకే రాత్రి పూట ఆ దేవాలయంలోకి వెళ్లరు..! ఈ చిట్కాలు కూడా బాగా పనిచేస్తాయి.. ►చుండ్రుతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరి పొడిని కలిపి తలకి పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ►రెండు టేబుల్ స్పూన్ల మెంతులను నీటిలో రాత్రంతా నానపెట్టి, ఉదయం దానిని పేస్టులా చేసుకుని ఆ మిశ్రమాన్ని తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేయాలి. ►అలోవెరా జెల్‌ని తలకి పట్టించి గంట తర్వాత స్నానం చేయాలి. ఇలా రోజు చేస్తే చుండ్రు తొలగి తల శుభ్రంగా ఉంటుంది. ►తీక్షణమైన ఎండ వెంట్రుకల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎండలోకి వెళ్లేటప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీ పెట్టుకోవడం లేదా బట్టను కట్టుకోవడం మంచిది. ►పోషకాహార లోపం ఏర్పడకుండా సంతులిత ఆహారాన్ని తీసుకోవాలి. ►నిద్రలేమి ఏర్పడకుండా చూసుకోవాలి. తల దువ్వుకునే దువ్వెనలో పళ్ళ మధ్య మట్టి పేరుకోకుండా శుభ్రపరుస్తూ, దువ్వెనలను వారానికి ఒకసారి వేడి నీటితో శుభ్రపరచడం మంచిది. ►వెంట్రుకల కుదుళ్ళలోకి ఇంకేటట్లుగా కొబ్బరి నూనె తలకు రాసినప్పుడు వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి. ►వేసవిలో చెమట వల్ల, వానాకాలంలో తల తడవడం వల్ల తల తొందరగా మాసిపోతుంది కాబట్టి వారానికి రెండుసార్లు గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే వెంట్రుకల ఆరోగ్యం బాగుంటుంది. చదవండి: మళ్లీ వచ్చేశాయ్.. ఏ చీరకాకాసు.. తళతళల కాసులు!! -
భయపడినప్పుడు వెంట్రుకలు ఎందుకు నిక్కబొడుచుకుంటాయంటే..
కేశవర్ణన, చిత్రణ లేని ప్రాచీన సాహితీ కళారూపాలు లేవంటే అతిశయోక్తి కాదు! ఆధునిక యుగం మొదలయ్యే సరికి – ఎన్నో శాస్త్ర సాంకేతిక సాంస్కృతిక వర్తక వాణిజ్య అంశాలతో విడదీయలేనంతగా చిక్కుముడి పడిపోయిన జుట్టుకథను సరదాగా చెప్పుకుందాం... కేశసంరక్షణ ఆధునిక కాలంలో ఒక ప్రత్యేక శాస్త్రంగా ‘ట్రైకాలజీ’ పేరుతో అభివృద్ధి చెందింది. ఎంతగానో విస్తృతి చెందిన ఆధునిక వైద్యరంగంలో ఇది పారామెడికల్ సైన్స్‌గా గుర్తింపు పొందింది. ఇక సాదాసీదా క్షురకులు సహా కేశాలంకార నిపుణుల సంగతి సరేసరి! చరిత్ర పరిణామంలో ఇదొక పార్శ్వమైతే, మరోవైపు కత్తిరించి పారేసిన జుట్టు గుట్టలు కొందరికి కోట్లాదిగా విలువచేసే నోట్ల కట్టలు సంపాదించి పెడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కేవలం జుట్టునే ఆలంబనగా చేసుకుని ఉపాధి పొందుతున్న వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. కేశఖండన, కేశసంరక్షణల వ్యాపారం కళ్లు చెదిరేస్థాయిలో సాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాపారం 2020 సంవత్సరంలో 7506 కోట్ల డాలర్ల (రూ.5.48 లక్షల కోట్లు) మేరకు సాగింది. ఇది 2019 నాటితో పోల్చుకుంటే, 4.63 శాతం తక్కువ. ‘కరోనా’ ప్రభావం కారణంగా లాక్డౌన్లో సెలూన్లు, బ్యూటీపార్లర్లు, కాస్మొటిక్ క్లినిక్‌లు మూతబడటంతో ఈ వ్యాపారం కాస్త తగ్గినా, 2021–28 మధ్య కాలంలో 5.76 శాతం మేరకు సగటు వార్షిక వృద్ధి సాధించగలదని, 2028 నాటికి 11297 కోట్ల డాలర్ల (రూ.8.26 లక్షల కోట్లు) మేరకు చేరుకోగలదని ‘ఫార్చ్యూన్’ పత్రిక ఇటీవల ఒక అంచనాను ప్రకటించింది. జనాభాలో రెండో పెద్దదేశమైన మన భారత్‌లో కేశసంరక్షణ వ్యాపారం 2020 సంవత్సరంలో రూ.25 వేల కోట్లకు పైమాటే! ఇవన్నీ సంఘటిత రంగంలో జరిగిన వ్యాపారానికి సంబంధించిన లెక్కలు. ఇక అసంఘటిత రంగంలో జరిగే వ్యాపారం, విదేశాలకు జుట్టు అక్రమ రవాణా లావాదేవీలకు సంబంధించిన అధికారిక అంచనాలేవీ లేవు. కేశ విశేషాలను చెప్పుకోవాలంటే కొండవీటి చాంతాడు కంటే పొడవాటి జాబితానే తయారవుతుంది గాని, ఎక్కువ మందికి తెలియని కొన్ని ఆశ్చర్యకరమైన వేశ విశేషాలను మచ్చుకు చెప్పుకుందాం... ►తలతో సహా మనుషుల శరీరంపై సగటున లక్ష నుంచి లక్షన్నర వరకు వెంట్రుకలు ఉంటాయి. ►వీటిలో రోజూ దాదాపు 50–150 వెంట్రుకలు రాలిపోతూ ఉంటాయి. అంతకంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతున్నట్లయితే మాత్రం ఏదో సమస్య ఉన్నట్లే! ►వెంట్రుకలు ప్రధానంగా ‘కెరాటిన్’ అనే ప్రొటీన్ ద్వారా తయారవుతాయి. జంతువుల కొమ్ముల్లో ఉండే ప్రధాన పదార్థం కూడా ఇదే. ►ఒక వెంట్రుక ఆయుర్దాయం దాదాపు ఐదేళ్ల వరకు ఉంటుంది. ►ఒక వెంట్రుక అదే మందంలో ఉండే రాగితీగ కంటే దృఢంగా ఉంటుంది. ►భయపడినప్పుడు లేదా చలిగా ఉన్నప్పుడు వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి– అదే గూస్బంప్స్ ఏర్పడతాయి. ఆ సమయంలో వెంట్రుకల కుదుళ్లలోని కండరాలు సంకోచించడం వల్ల అలా జరుగుతుంది. ►విగ్గులు ఆధునిక ఫ్యాషన్ సాధనాలేమీ కాదు. ప్రాచీనకాలం నుంచే ఉండేవి. పేల బెడద పడలేక ప్రాచీన ఈజిప్షియన్లు చాలామంది గుండు గొరిగించుకునేవారు. గుండు కనిపించకుండా ఉండటానికి విగ్గులు వాడేవారు. బహుశ చరిత్రలో తొలి ‘విగ్గరులు’ ఈజిప్షియన్లే కాబోలు! ►ఫ్రెంచి పాలకుడు పద్నాలుగో లూయీ కాలంలో విగ్గులకు కిరీటాల స్థాయి గౌరవం ఉండేది. అప్పట్లో యూరోప్ దేశాల్లో విగ్గుధారణ ఒక స్టేటస్ సింబల్. ఎంత పెద్ద విగ్గు ధరిస్తే అంత గొప్ప అన్నమాట! అందుకే ప్రముఖులను ప్రస్తావించడానికి ‘బిగ్విగ్స్’ అనే పదబంధం ఏర్పడింది. ►కొన్ని వృత్తుల్లోని ఉన్నత పదవుల్లో ఉండేవారంతా తప్పనిసరిగా విగ్గులు ధరించేలా చట్టం తేవాలంటూ విగ్గుతయారీదారులు బ్రిటిష్ పాలకుడు మూడో జార్జ్‌కి 1765లో విజ్ఞప్తి చేశారు. రాజావారు సదరు విజ్ఞప్తిని తోసిపుచ్చారు. అయితే, బ్రిటన్‌లో న్యాయమూర్తులందరూ ఇప్పటికీ తప్పనిసరిగా విగ్గులు ధరించే విధులకు హాజరవడం ఆనవాయితీగా కొనసాగుతోంది. జుట్టునూ వదలని స్మగ్లర్లు విలువైన బంగారం, వజ్రాలు వంటివి స్మగ్లింగ్ చేయడం మామూలే. గంజాయి సహా రకరకాల మాదక ద్రవ్యాలను స్మగ్లింగ్ చేయడం కూడా మామూలే. కత్తిరించాక తుడిచి పారేసే జుట్టును కూడా స్మగ్లింగ్ చేసేవారున్నారు. మన దేశం నుంచి గుట్టలు గుట్టలుగా జుట్టును గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు తరలించే తతంగం కొన్నేళ్ల నుంచి నిరాఘాటంగా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్, గుంటూరు ప్రాంతాల్లో చైనాకు అక్రమంగా తరలించడానికి సిద్ధంగా గోదాముల్లో దాచిన జుట్టు గుట్టలను కొద్ది వారాల కిందటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అక్రమంగా తరలించడం కోసం గోదాముల్లో దాచిపెట్టిన జుట్టును, అక్రమంగా తరలిస్తున్న జుట్టును అధికారులు పట్టుకోవడం ఇదే మొదటిసారి కాదు. గడచిన కొద్ది సంవత్సరాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులే కాదు, అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్ తదితర పారామిలటరీ బలగాలు కూడా సరిహద్దులను దాటబోతున్న జుట్టును భారీ పరిమాణంలో స్వాధీనం చేసుకున్న ఉదంతాలు ఉన్నాయి. జుట్టు అక్రమ రవాణాను అరికట్టడానికి మరిన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వాణిజ్య మంత్రిత్వశాఖ కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్ బోర్డుకు రెండేళ్ల కిందట ఆదేశాలు జారీ చేసినా, జుట్టు స్మగ్లింగ్ యథావిధిగా జరుగుతూనే ఉంది. ఫలితంగా జుట్టు ఎగుమతుల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. జుట్టును అక్రమంగా తరలించడం వల్ల ప్రభుత్వానికి వాటిల్లుతున్న నష్టం ఒక ఎత్తయితే, అనుమతులు తీసుకుని సాగిస్తున్న జుట్టు ఎగుమతుల్లో జరుగుతున్న మోసాలు మరో ఎత్తు. జుట్టును ఎగుమతి చేసే వ్యాపారులు తాము ఎగుమతి చేసే సరుకు విలువ తగ్గించి చూపుతూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన దాని కంటే తక్కువ మొత్తంలో పన్నులు చెల్లిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఎగుమతి చేసే జుట్టును నాణ్యతను బట్టి విడదీసి, కిలో ఒక యూనిట్ చొప్పున చిన్న చిన్న గుట్టలుగా చుడతారు. వీటిని ‘గోలి’, ‘ఛుట్టి’, ‘థుట్టి’ అనే పేర్లతో వ్యవహరిస్తుంటారు. మన దేశంలో కిలో జుట్టు విలువ రూ.4,500 నుంచి రూ.6,000 వరకు ఉంటోంది. ఎగుమతిదారులు కిలో విలువ గరిష్ఠంగా రూ.1,400 వరకు మాత్రమే చూపుతూ పన్నులు ఎగవేస్తున్నారు. మన దేశం నుంచి దొంగచాటుగా రవాణా అయ్యే జుట్టులో ఎక్కువ భాగం మయన్మార్, వియత్నాం, బంగ్లాదేశ్‌ల మీదుగా భూమార్గంలో చైనాకు చేరుకుంటోంది. మన దేశం నుంచి ఏటా విదేశాలకు చేరుతున్న జుట్టు విలువ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకు ఉంటోంది. ఇందులో 5 శాతం జుట్టు తిరుపతి సహా వివిధ పుణ్యక్షేత్రాల్లో భక్తులు సమర్పించుకునే నీలాల నుంచే చేరుతోంది. మన దేశంలో జరిగే జుట్టు ఎగుమతుల వ్యాపారంపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 8 లక్షల మంది జీవనోపాధి పొందుతున్నారని ‘హ్యూమన్ హెయిర్ అండ్ హెయిర్ ప్రోడక్ట్స్ మ్యానుఫాక్చరర్స్ అండ్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ అధ్యక్షుడు సునీల్ ఇమామి మీడియాకు తెలిపారు. జుట్టు స్మగ్లింగ్ కారణంగా హెయిర్ ప్రాసెసింగ్ పరిశ్రమపై ఆధారపడి బతికే 4.1 లక్షల మంది ఉపాధి కోల్పోయిన పరిస్థితులు వాటిల్లాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ స్మగ్లింగ్ వల్ల అటు ప్రభుత్వానికే కాదు, ఇటు అనుమతులు పొంది వ్యాపారాలు సాగిస్తున్న ఎగుమతిదారులకు కూడా భారీ నష్టం వాటిల్లుతోందని ఇమామి చెప్పారు. ఇదిలా ఉంటే, దేశం నుంచి అక్రమంగా రవాణా అవుతున్న జుట్టు విలువ దాదాపు రూ.8 వేల కోట్ల వరకు ఉంటుందని, దీనివల్ల జీఎస్టీ ఆదాయానికి గండిపడుతోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్టాటిస్టిక్స్ ఉన్నతాధికారులు చెబుతున్నారు. జుట్టుతో ఏం చేస్తారంటే.... ఆ మాత్రం మాకు తెలీదేంటి? విగ్గులు తయారు చేస్తారు అనుకుంటున్నారా? ఔను! రకరకాల మార్గాల్లో సేకరించిన జుట్టుతో సవరాలు, విగ్గులు, కృత్రిమ గడ్డాలు, కనుబొమ్మలు వంటివి కూడా తయారు చేస్తారు. అలాగని, జుట్టు ప్రయోజనాలు ఈ మాత్రానికే పరిమితం కాదు. జుట్టును చాపల్లా నేసి, వాటిని మొక్కల రక్షణ కోసం ఉపయోగిస్తారు. ఈ చాపలు టెర్రస్ గార్డెన్లు పెంచేవారికి బాగా ఉపయోగపడతాయి. సముద్రంలో చిందిన చమురు తెట్టును శుభ్రం చేయడానికి జుట్టుతో తయారు చేసిన ‘హెయిర్ బూమ్స్’ను ఉపయోగిస్తున్నారు. చమురు తెట్టును శుభ్రం చేయడానికి జుట్టుతో తయారు చేసిన మరింత మెరుగైన నమూనా పరికరాల తయారీపై ‘నాసా’ శాస్త్రవేత్తలు పరీక్షలు జరుపుతున్నారు. నేటివ్ అమెరికన్లు జుట్టుతో పొడవాటి తాళ్లను పేని, వాటితో రకరకాల వస్తువులు తయారు చేస్తారు. ఇటీవలికాలంలో కొన్నిచోట్ల దుస్తుల తయారీలోను, కళాకృతుల తయారీలోను, ఫర్నిచర్ తయారీలోనూ జుట్టును ఉపయోగిస్తున్నారు. ఇక జుట్టు నుంచి వేరుచేసిన ప్రొటీన్‌ను సోయాసాస్, పలు బేకరీ ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తారు. రీసైకిల్ చేసిన జుట్టును ఎరువుల తయారీలో కూడా ఉపయోగిస్తారు. జుట్టులో 16 శాతం మేరకు నత్రజని ఉంటుంది. పశువుల వ్యర్థాలతో తయారయ్యే సేంద్రియ ఎరువులో ఉండే నత్రజని 0.2–0.3 శాతం మాత్రమే. జుట్టుతో తయారైన ఎరువు పర్యావరణానికి ఏమాత్రం హాని కలిగించదు. కొద్దినెలల్లోనే ఇది మట్టిలో పూర్తిగా కలిసిపోయి, మొక్కలకు కావలసిన పోషకాలను పుష్కలంగా అందిస్తుంది. జుట్టుతో మరో వ్యవసాయ ప్రయోజనం కూడా ఉంది. జుట్టుతో అల్లిన చాపలతో కంచెలను ఏర్పాటు చేసుకుంటే, వాటిని దాటుకుని కుందేళ్లు, ఉడుతలు, ఎలుకలు వంటి జంతువులు పొలాల్లోకి, తోటల్లోకి చొరబడి పంటలను నాశనం చేయలేవు. అంతేకాదు, జుట్టుతో తయారైన చాపలు పంటలను నాశనం చేసే కొన్ని రకాల పురుగులను కూడా సమర్థంగా నిరోధించగలవు. పంటపొలాలకు, తోటలకు రక్షణగా జుట్టుతో తయారైన చాపలతో కంచెలను ఏర్పాటు చేసుకునే పద్ధతి కొన్ని అగ్రదేశాల్లో పరిమితంగానే వాడుకలో ఉంది. ఇదే పద్ధతి వ్యాప్తి చెందితే రైతులకు పురుగుమందుల ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. అమెరికాలోని ఫ్లోరిడా ప్రాంతంలో కొందరు రైతులు తమ పంటచేలకు జుట్టుతో తయారైన చాపలను కంచెలుగా ఏర్పాటు చేసుకోవడం వల్ల వారికి పురుగుమందుల కోసం అయ్యే ఖర్చుతో ఏటా 50 వేల డాలర్లు (రూ.36.67 లక్షలు) ఆదా కావడమే కాకుండా, దాదాపు పదిలక్షలకు పైగా మొక్కలు నాశనం కాకుండా బతికి ఎదిగాయని అక్కడి అధికారులు వెల్లడించారు. జుట్టు నుంచి వేరుచేసిన ప్రొటీన్లను ఔషధాల తయారీలోనూ ఉపయోగిస్తారు. జుట్టు నుంచి వేరు చేసిన ఎల్–సిస్టీన్, ఎన్–ఎసిటైల్ ఎల్–సిస్టీన్ (ఎన్ఏసీ) ప్రొటీన్లతో ఔషధాలను తయారు చేస్తున్నారు. వైద్యరంగంలో జుట్టు వినియోగం కొత్తదేమీ కాదు. ప్రాచీనకాలంలోనే భారత్, చైనాలలో వైద్యులు జుట్టును కాల్చి బూడిద చేసి, ఆ బూడిదను గాయాలకు పైపూతగా ఉపయోగించేవారు. మధ్యయుగంలో పలు యూరోప్ దేశాల్లో శస్త్రచికిత్సలు చేసేటప్పుడు కుట్లు వేయడానికి మనుషుల వెంట్రుకలతో తయారు చేసిన దారాలను ఉపయోగించేవారు. మనుషుల జుట్టుకు గల దారుఢ్యం అమోఘమైనది. జుట్టుతో తయారైన దారాలను శస్త్రచికిత్సల్లో కుట్లు వేయడానికి ఇప్పుడు కూడా భేషుగ్గా ఉపయోగించవచ్చని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు. షాంపూలు, కండిషనర్లు వంటి కేశసంరక్షణ ఉత్పత్తులను తయారు చేసేవారు తమ ఉత్పత్తుల పనితీరును పరీక్షించడానికి జుట్టుతో తయారైన ‘టెస్ట్ స్వాచెస్’ను ఉపయోగిస్తుంటారు. తల‘కట్టు కథలు’ నాగరికత మొదలైనప్పటి నుంచే మనుషులకు జుట్టు మీద మోజు మొదలైంది. ముఖ్యంగా తలకట్టును తీర్చిదిద్దుకోవడాన్ని నాగరికతకే తలమానికంగా భావించడం మొదలైంది. తలకట్టును చూసి మనుషుల స్వభావాలను అంచనా వేసే లక్షణం మనుషుల్లో ఇప్పటికీ ఉంది. బహుశ ఈ లక్షణం ఆదిమ అవశేషమేమో! తలపై జుట్టును ఏపుగా పెంచుకోవడమే కాకుండా, ఆ జుట్టును కాపాడుకోవడానికి అనేక జాగ్రత్తలు తీసుకునేవారు. ప్రాచీన ఈజిప్షియన్లు జుట్టును కాపాడుకోవడానికి ఆముదం, బాదంనూనె రాసుకునేవారు. ఎడారి ప్రాంతపు పొడి వాతావరణంలో వారి జుట్టుకు ఇవి రక్షణ కల్పించేవి. క్రీస్తుపూర్వం 1500 నాటి అస్సీరియన్ రాజులు రింగురింగులుగా మెలితిరిగే ఉంగరాల జుట్టు కోసం పడరాని పాట్లు పడేవారు. వాళ్లలో సహజంగానే ఉంగరాల జుట్టు ఉంటే సరేసరి. వాళ్లు అదృష్టవంతుల కిందే లెక్క! ఎలాంటి మెలికల్లేని నిలువైన జుట్టు ఉంటే మాత్రం దానిని రింగురింగులుగా మెలితిప్పడానికి వేడిచేసిన ఇనుప చువ్వలను ఉపయోగించేవారు. క్రీస్తుశకం 13వ శతాబ్ది కాలంలో ఇటలీ ప్రాంతంలో బల్లికొవ్వును ఆలివ్‌నూనెలో కలిపి మరిగించి, చల్లార్చి దానిని తలకు పట్టించుకునేవారు. జుట్టు ఏమాత్రం చెదిరిపోకుండా కట్టుదిట్టమైన తలకట్టును తీర్చిదిద్దుకోవడానికి క్రీస్తుశకం 16వ శతాబ్దికి చెందిన బ్రిటిష్ మహిళలు తలకు మైనాన్ని పట్టించేవారు. ఇంచుమించు అదేకాలంలో ఫ్రాన్స్‌లో మరో ట్రెండ్ ఉండేది. అక్కడి జనాలు జుట్టు పోషణ కోసం ఎముకల మూలుగను ఉపయోగించేవారు. మేక, గొర్రె, గొడ్డు ఎముకల మూలుగను హేజెల్‌నట్ ఆయిల్లో బాగా గిలకొట్టి కలిపి, దానికి కాసింత నిమ్మరసం చేర్చి తలకు పూసుకునేవారు. ఇప్పుడు విరివిగా వాడుకలో ఉన్న లిక్విడ్ షాంపూ అందుబాటులోకి వచ్చి వందేళ్లు కూడా పూర్తి కాలేదుగాని, ప్రాచీనకాలంలో భారత ఉపఖండంలో జనాలు కుంకుడుకాయలతో, షీకాయతో జుట్టును శుభ్రం చేసుకునేవారు. జర్మన్ రసాయనవేత్త, వ్యాపారవేత్త హాన్స్ స్క్వార్జ్కోఫ్ తొలిసారిగా 1927లో ‘స్క్వార్జ్కోఫ్’ బ్రాండ్ పేరుతో లిక్విడ్ షాంపూను మార్కెట్లోకి ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత వివిధ దేశాల్లోని మిగిలిన సంస్థలు కూడా వేర్వేరు ఫార్ములాలతో షాంపూలను తయారు చేయడం మొదలుబెట్టాయి. కేశ సంరక్షణ ఉత్పత్తుల పరిణామం తలనూనెల నుంచి షాంపూల వరకు మాత్రమే పరిమితం కాలేదు. కండిషనర్లు, హెయిర్‌క్రీమ్స్, జెల్స్, బట్టతలపై జుట్టు మొలిపించే లోషన్స్, సీరమ్స్, నెరిసిన జుట్టుకు టెంపరరీ పడుచుదనం తెప్పించేందుకు వాడే రకరకాల హెయిర్‌డైలు వంటి నానా ఉత్పత్తులు ఇటీవలి కాలంలో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. తల మీద జుట్టును పొడవుగా పెంచుకోవడం కొన్నాళ్లు ఫ్యాషన్‌గా ఉంటే కురచగా కత్తిరించుకోవడం మరికొన్నాళ్లు ఫ్యాషన్‌గా చలామణీలో ఉంటుంది. పొడవాటి జుట్టుకు పోనీ కట్టుకోవడం, చుట్టూ కురచగా కత్తిరించి, తల నడిమధ్యలో గోపురంలా జుట్టును తీర్చిదిద్దుకోవడం– ఇలా చెప్పుకుంటూ పోతే తలకట్టులో రకరకాల ఫ్యాషన్లు. ఫ్యాషన్లకు అనుగుణంగా మాసిన తలపై జుట్టును కత్తిరించి చక్కగా తీర్చిదిద్దే పనిలో గ్రామీణ క్షురకుల మొదలుకొని నగరాల్లోని సెలూన్లు, బ్యూటీపార్లర్ల వరకు వివిధ దశల్లో ఉపయోగించే దువ్వెనలు, కత్తులు, కత్తెర్లు, రేజర్లు, ట్రిమ్మర్లు, షేవింగ్ బ్రష్‌లు, షేవింగ్ క్రీములు, ఆఫ్టర్‌షేవ్ లోషన్లు వంటి ఉత్పత్తులు, అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి ఉపయోగించే హెయిర్ రిమూవర్లు వంటి ఉత్పత్తుల మార్కెట్ కూడా తక్కువేమీ కాదు. విగ్గు విలాసం ఖండిత మానవ కేశాలలో ఎక్కువ భాగం చేరేది విగ్గుల పరిశ్రమకే. విగ్గులను తయారు చేసే కంపెనీలు విగ్గులతో పాటు కృత్రిమ కనుబొమ్మలు, మీసాలు, గడ్డాలు వంటివి కూడా తయారు చేస్తాయి. స్థూలంగా ఈ పరిశ్రమను హెయిర్ విగ్స్ అండ్ ఎక్స్టెన్షన్స్ ఇండస్ట్రీగా పిలుస్తారు. ఇదివరకటి కాలంలో ఈ పరిశ్రమకు ఎక్కువగా వినోదరంగం నుంచే ఎక్కువగా గిరాకీ ఉండేది. సినీ పరిశ్రమ, నాటకాలు, సంప్రదాయ వేడుకల్లో వేషాలు వేసేవారు, విచిత్ర వేషధారణ వంటి సాంస్కృతిక కార్యక్రమాల నిర్వాహకులు వంటి వారు మాత్రమే విగ్గులను కొనుగోలు చేసేవారు. జుట్టు ఊడిపోయి బట్టతల ఏర్పడినా సామాన్య ప్రజలు విగ్గుల జోలికి వెళ్లడం చాలా అరుదుగా ఉండేది. గడచిన రెండు దశాబ్దాలుగా సామాన్య ప్రజానీకం నుంచి కూడా విగ్గులకు గిరాకీ పెరుగుతూ వస్తోంది. అంతర్జాతీయ అంచనాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా గత ఏడాది జరిగిన విగ్గుల అమ్మకాల విలువ 700 కోట్ల డాలర్లకు (సుమారు రూ.52 వేల కోట్లు) పైమాటే! రానున్న ఐదేళ్లలో ఈ మార్కెట్ 13 శాతం వార్షికవృద్ధి సాధించగలదని ‘బిజినెస్‌వైర్’అంచనా వేస్తోంది. వివిధ దేశాల్లోని విగ్గుల తయారీ కంపెనీలకు భారీ పరిమాణంలో జుట్టును సరఫరా చేసేవి ఆసియన్ దేశాలైతే, విగ్గులను ఎక్కువగా వినియోగించేది వివిధ దేశాల్లో స్థిరపడిన నల్లజాతీయులేనని అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. అత్యధికంగా జుట్టును ఎగుమతి చేసే దేశాల్లో చైనా, భారత్, మయాన్మార్ మొదటి మూడు స్థానాల్లో నిలుస్తున్నాయి. జుట్టును అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాల్లో యూరోప్ దేశాలు, అమెరికా అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. భారీ ఎత్తున సాగే స్మగ్లింగ్‌ను సమర్థంగా అడ్డుకోగలిగితే, జుట్టు ఎగుమతుల్లో నిజానికి భారత్‌దే మొదటి స్థానమని దేశంలోని జుట్టు ఎగుమతిదారుల సంఘాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో మన దేశంలోనూ విగ్గులకు గిరాకీ పెరుగుతోంది. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ వంటి ప్రక్రియలు ఖర్చుతో కూడుకున్నవి కావడంతో బట్టతలలవారు విగ్గులపై మొగ్గు చూపుతున్నారు. ఇదిలా ఉంటే, క్యాన్సర్ బారినపడి కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల ప్రభావం వల్ల జుట్టు కోల్పోయిన వారు కూడా ఆత్మస్థైర్యం కోసం విగ్గులను వాడుతున్నారు. క్యాన్సర్ రోగులకు విగ్గుల కోసం జుట్టును దానం చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. మన దేశంలో విగ్గుల తయారీ పరిశ్రమ వార్షిక వ్యాపారం విలువ దాదాపు రూ.300 కోట్ల వరకు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ‘కరోనా’ ప్రభావంతో నాణ్యమైన జుట్టు ధర భారీగా పెరిగింది. ‘కరోనా’కు ముందు 19–26 అంగుళాల పొడవు ఉండే జుట్టు ధర కిలో 16 వేల వరకు ఉంటే, ప్రస్తుతం ఈ ధర రూ. 25 వేల వరకు పెరిగిందని చెన్నైకి చెందిన జుట్టు ఎగుమతి సంస్థ ‘శ్రీ సాయిరాం హెయిర్ ఇండస్ట్రీస్’ ప్రతినిధి ఒకరు చెప్పారు. తిరుమలలో భక్తులు సమర్పించుకునే నీలాలను టీటీడీ నిర్వహించే వేలంపాటలో చెన్నైలోని ఎగుమతిదారులు కొనుగోలు చేస్తుంటారు. తర్వాత నాణ్యత వారీగా గ్రేడింగ్ చేసి, శుభ్రం చేశాక విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. అక్కడ జుట్టు కత్తిరించి డబ్బులిస్తారంట!! ఎక్కడైనా జుట్టు కత్తించినందుకు క్షురకులకు డబ్బులు చెల్లిస్తారు. బ్రిటన్‌లోని కొన్ని సెలూన్లలో మాత్రం జుట్టు కత్తిరించుకునే కస్టమర్లకే ఎదురు డబ్బులిస్తారు. బ్రిటన్‌లోని ‘సెలూన్పే’ వంటి కొన్ని సంస్థలు కస్టమర్లకు ఎదురు డబ్బులు చెల్లిస్తూనే తమ వ్యాపారాన్ని మూడు జుట్టుగుట్టలు ఆరు నోట్లకట్టలుగా సాగిస్తున్నాయి. పొడవాటి జుట్టుతో సెలూన్‌లోకి అడుగుపెట్టి, శుభ్రంగా అంటకత్తెర వేయించుకోవడానికి సిద్ధపడితే, జుట్టు నాణ్యతను బట్టి 75–100 పౌండ్ల (సుమారు రూ.7600– రూ.10,130) వరకు చెల్లిస్తారు. కత్తిరించిన తర్వాత ఈ జుట్టును సెలూన్ నిర్వాహకులే జాగ్రత్తగా గ్రేడింగ్ చేసి, ప్యాక్ చేస్తారు. తర్వాత జుట్టు ప్యాకెట్లను విగ్గుల తయారీ కంపెనీలకు టోకున విక్రయిస్తారు. బ్రిటన్‌లోని ప్రముఖ విగ్గుల కంపెనీలన్నీ ఇలా నేరుగా సెలూన్ల నుంచే జుట్టు గుట్టలను కొనుగోలు చేస్తాయి. సెలూన్ల ద్వారా సాగే జుట్టు విక్రయాలకు లెక్కలన్నీ పక్కాగా నమోదవుతుంటాయి. ఈ లావాదేవీల ద్వారా గత ఏడాది 3.8 కోట్ల పౌండ్ల (రూ.384 కోట్లు) ఆదాయం లభించినట్లు అక్కడి రెవెన్యూ–కస్టమ్స్ విభాగం ప్రకటించింది. చదవండి: Tips To Grow Hair Naturally: మీకో విషయం తెలుసా? రోజూ ఈ సంఖ్యలో వెంట్రుకలు రాలడం సహజమేనట! -
చుండ్రు వల్ల ఇబ్బందా.. ‘వేప’తో ఇలా చెక్ పెట్టొచ్చు!
Home Remedies For Dandruff: చుండ్రు సమస్యతో బాధపడుతున్నారా? వేపతో చుండ్రు సమస్యను అరికట్టవచ్చని మీకు తెలుసా!! నిజానికి చుండ్రు నివారణకు వేపకంటే కంటే శ్రేష్ఠమైన, సౌకర్యవంతమైన రెమిడీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదేమో! ట్రైకాలజిస్టులు సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారు. చుండ్రు నివారించి, అందమైన సిల్కీ హెయిర్ పొందడంలో వేప ఆకుల పాత్ర ఏమిటో, అది ఎలా సాధ్యమో తెలుసుకుందాం.. చుండ్రుతో తంటాలెన్నో.. తలపై చర్మం పొడి (డ్రై స్కిన్)గా ఉండే వారిలో సాధారణంగా కనిపించే సమస్య చుండ్రు. భుజాలపై పొలుసులుగా రాలి చూపరులకే కాకుండా మనకు ఎంతో అసౌకర్యాన్ని కలిగిస్తుంది. చుండ్రు కేవలం తలపై చర్మాన్ని మాత్రమే కాకుండా, ముఖం, శరీరం అంతటిపై కూడా దుష్ప్రభావాన్ని చూపిస్తుంది. చుండ్రుకు కారంణం పొడి చర్మం అని మీరనుకోవచ్చు. కానీ నిజానికి ఇది మలస్సేజియా అనే శిలింధ్రాల జాతికి చెందిన ఫంగస్ కారణంగా చర్మంపై పుడుతుంది. దీని జీవితకాల పరిమితి అతిస్వల్పమైనప్పటికీ వేగంగా పెరగడం, విస్తృతంగా వ్యాపించడం దీని ప్రధాన లక్షణాలు. సాధారణంగా ఈ శిలింధ్రం చలికాలంలో వేగంగా వ్యాపిస్తుంది. అయితే మీరు సరైన సమయంలో, సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎన్నిసార్లు తొలగించినా చుండ్రు మళ్లీ మళ్లీ పుడుతూనే ఉంటుంది. ఫలితంగా జుట్టు రాలిపోతుంది. కాబట్టి సమస్యను సకాలంలో గుర్తించి సరైన చికిత్స అనుసరించడం ఉత్తమం. సుగుణాల వేప వేప మన ఇంటి చుట్టుపక్కల సులభంగా దొరికే దివ్యౌషధం. ఏ ఋతువులోనైనా అందుబాటులో ఉంటుంది. అనేక చర్మ, జుట్టు సంబంధిత సమస్యలను నివారించడంలో వేపకు సాటి మరొకటి లేదు. రక్తశుద్ధీకరణతో పాటు యాంటీ మైక్రోబయల్ కారకాలు దీనిలో పుష్కలంగా ఉంటాయి. యాంటీ ఫంగల్ (శిలీంధ్ర సంహారిణి), యాంటీ వైరల్ (వైరస్ నిరోధకత), యాంటీ ఇన్ఫ్లమేటరీ (తాపనివారణ)కు సమర్ధవంతంగా పనిచేస్తుంది. ప్రతి ఉదయం వేప ఆకులను తినాలి బ్యూటీ ఎక్స్పర్ట్స్, ఆరోగ్య నిపుణులు చెప్పేదేంటంటే.. చుండ్రు నుంచి సులువుగా ఉపశమనం పొందాలంటే రోజూ ఉదయం గుప్పెడు వేప ఆకులు తినాలి. చేదును తప్పించుకోవడానికి కొంచె తేనె జోడించి తింటే సరి. వేపాకులను మరిగించి కషాయం రూపంలో కూడా తాగవచ్చు. దీనివల్ల కలిగే లాభాలను మీరొకసారి గమనించారంటే, ఈ ప్రక్రియ మరీ అంత కష్టమనిపించదు. వేప నూనె వేప నూనెను ఇంటిలో సులభంగా తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనెలో కొన్ని వేపాకులు వేసి మరిగించిన తర్వాత కొన్ని చుక్కల నిమ్మ రసం చేర్చితే వేప నూనె రెడీ! ఈ నూనెను తలకు పట్టించిన తర్వాత ఎండలోకి వెళ్లకపోవడం బెటర్. నూనెలోని నిమ్మరసం సూర్యరశ్మి వల్ల జుట్టుకు హాని కలగచేయవచ్చు. ఈ నూనెతో మాడుకు మర్ధనాచేసి, రాత్రంతా ఉంచి ఉదయానే తలస్నానం చేస్తే సరిపోతుంది. వేప - పెరుగు మిశ్రమం పెరుగుకలిపిన వేపాకును తలకు పట్టించటం ద్వారా చుండ్రు సమస్యకు కళ్లెం వేయవచ్చు. ముందుగా వేపాకును పేస్టులా చేసుకుని, ఒక గిన్నె పెరుగులో కలుపుకుని మాడు మొత్తానికి పట్టించి, 15-20 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. వేపలో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు, పెరుగులోని చల్లదనం చుండ్రును నివారించడమే కాకుండా కుదుళ్లను బలపరచి, మెత్తని సిల్కీ హెయిర్‌ను మీ సొంతం చేస్తుంది. వేప హెయిర్ మాస్క్ డాండ్రఫ్ నివారణ పద్ధతుల్లో వేప హెయిర్ మాస్క్ మరొక సులువైన మార్గం. కొన్ని వేపాకులను తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ తేనెను దానికి కలపాలి. దీనిని హెయిర్ మాస్క్‌లా మాడు భాగం మొత్తానికి పట్టించి 20 నిముషాల తర్వాత కడిగేసుకోవాలి. జుట్టు ఆరిపోయాక ఫలితం మీకే తెలుస్తుంది. హెయిర్ కండీషనర్‌లా వేప వేప ప్రత్యేకత ఏమిటంటే దానిని తలస్నానానికి ముందు లేదా తర్వాత వాడినా అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఎలాచేయాలంటే.. కొన్ని వేపాకులను తీసుకుని బాగా మరిగించాలి. తర్వాత చల్లారనివ్వండి. షాంఫుతో తలస్నానం చేశాక, ఈ వేప మిశ్రమంతో తలను కడిగిచూడండి. తేడా మీకే తెలుస్తుంది. వేప షాంపు అన్ని రకాల చుండ్రు సమస్యలకు సులభమైన పరిష్కారం వేపషాంపు. వేపతో తయారు చేసిన షాంపుతో వారానికి రెండూ లేదా మూడు సార్లు తలస్నానం చెస్తే సరిపోతుంది. సాధారణంగా డాండ్రఫ్ నివారణకు వేపతో తయారుచేసిన షాంపులను వాడాల్సిందిగా నిపుణులు సూచిస్తారు. ఎందుకంటే చుండ్రు నివారణకు అవసరమైన అన్ని సుగుణాలు వీటిల్లో సరిపడినంతగా ఉంటాయి. హెయిర్ ఎక్స్పర్ట్స్ చెప్పేదేమిటంటే.. వేపలోని ఔషధ గుణాలు అన్నిరకాల జుట్టు సంబంధిత సమస్యలను నివారిస్తాయి. మంచి ఫలితాన్ని కూడా ఇస్తాయి. ఈ 6 రకాల సింపుల్ రెమెడీస్ తరచుగా వినియోగించడం ద్వారా ఆరోగ్యమైన, అందమైన జుట్టు మీ సొంతమవుతుందనేది నిపుణుల మాట. చదవండి: Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
స్నేక్ బ్రెయిడ్
సిగ సౌందర్యం మెలికలు తిరిగే పామును చూస్తే ఒళ్లు ఝల్లుమంటుంది. అదే మెలికలు తిరిగిన సొగసైన జడను చూస్తే ఒళ్లు పులకరిస్తుంది. అందమైన తలకట్టు అతివ అందానికి తొలి మెట్టు. అందుకే కురులను ముడి వేసినా చెల్లుతుంది, మెలికలు తిప్పి అల్లినా చెల్లుతుంది. కనికట్టు చేసే స్నేక్ బ్రెయిడ్ తలకట్టు ఈవారం మీకోసం... 1. ముందుగా జుత్తును చిక్కులు లేకుండా దువ్వుకోవాలి. ఆ తర్వాత నడి నెత్తిమీద ఓ పెద్ద పాయను తీసుకోవాలి. 2. ఆ పాయలోంచి ఓ పక్కగా మరో చిన్న పాయను తీయాలి. 3. పక్క నుంచి తీసిన సన్నని పాయను జడలాగా అల్లుకోవాలి. 4. ఆ జడను అల్లుతున్నప్పుడు పక్క నుంచి మరో చిన్న పాయను తీసుకోవాలి. 5. తీసుకున్న పాయను ఆల్రెడీ అల్లుతున్న జడతో కలిపి అల్లాలి. దాన్ని ఓ పక్కగా పెట్టి కదలకుండా స్లైడ్స్ పెట్టేయాలి. 6. మరో పాయను కూడా తీసుకుని జడను వెనక్కి అల్లుకుంటూ రావాలి. 7. పైన మొదట తీసిన పాయ కింద నుంచి ఒక్కొక్క పాయనూ తీసుకుని ఈ జడకు కలుపుకుంటూ అల్లాలి. దాన్ని ఎడమవైపున ఉంచి స్లైడ్స్ పెట్టేయాలి. 8. మళ్లీ పాయలు తీసుకుంటూ జడను కుడివైపునకు అల్లుకుంటూ రావాలి. 9. అప్పుడు జడ ఈ ఫొటోలో చూపినట్టుగా అవుతుంది. 10. జడను జాగ్రత్తగా పట్టుకుని, కింద ఉన్న జుత్తునంతా నున్నగా దువ్వుకోవాలి. ఆపైన జుత్తుని జడతో కలిపి చివరి వరకూ అల్లుకుంటూ వచ్చి, చివర కొద్దిగా జుత్తు వదిలేసి రబ్బర్ బ్యాండ్ పెట్టేయాలి. ఇది సల్వార్ కమీజుల మీదికి, గాగ్రాస్ మీదికి బాగా నప్పుతుంది. జడకు అక్కడక్కడా చిన్న చిన్న పూసలు కానీ, ప్లాసిక్ పువ్వులు కానీ గుచ్చితే మరింత రిచ్ లుక్ వస్తుంది.