కెమికల్ స్ట్రెయిట్‌నెర్‌లతో పనిలేకుండానే.. మీ జుట్టు హెల్దీగా, షైనీగా! | Use these tricks to Straighten Your Hair Naturally at Home | Sakshi
Sakshi News home page

కెమికల్ స్ట్రెయిట్‌నెర్‌లతో పనిలేకుండానే.. మీ జుట్టు హెల్దీగా, షైనీగా!

Published Tue, Mar 12 2024 1:54 PM | Last Updated on Tue, Mar 12 2024 1:56 PM

Use these tricks to Straighten Your Hair Naturally at Home - Sakshi

ఆధునిక కాలంలో స్టయిలింగ్‌కు, సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండగొచ్చినా, ఫంక్షనొచ్చినా బ్యుటీషియన్లకోసం పరుగులు పెడతారు చాలామంది. ముఖ్యంగా గజిబిజిగా ఉన్న జుట్టును, షైనీగా, స్ట్రెయిట్‌గా చేసుకోవడంపెద్ద టాస్క్‌. హీట్ లేదా కెమికల్ స్ట్రెయిట్‌నెర్‌లను ఉపయోగించకుండా స్ట్రెయిట్నింగ్‌ కోసం ఇవిగో టిప్స్‌ .

బ్లో డ్రైయర్‌, హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ట్రీట్‌మెంట్‌లు మన కేశాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే సహజ పద్ధతుల ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్నర్‌ ద్వారా పదే పదే జుట్టును వేడికి గురి చేస్తే తొందరగా ఊడిపోతుంది. సహజమైన షైనింగ్‌ను కోల్పోయి పొడి బారుతుంది.  అందుకే జుట్టును సహజంగా స్ట్రెయిట్  చేసే పద్ధతులు చూద్దాం.

జెంటిల్ క్లెన్సింగ్:  రాత్రి పూటే సహజమైన నూనెను జుట్టంతా పట్టించి, ఉదయాన్నే రసాయనాలు లేని షాంపూతో స్నానం చేసి వెంట్రుకలను మృదువుగా ఉంందుకు తేలికపాటి కండీషనర్‌ని వాడాలి. ఆ తరువాత  చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టుగా మృదువుగా  మెరుస్తూ చెప్పినట్టు వింటుంది.

జుట్టు తడిగా ఉన్నపుడే పళ్లు వెడల్పుగా ఉండే దంతాల దువ్వెనతో సుత్తిమెత్తగా దువ్వుతూ చిక్కు తీయాలి. సహజంగా గాలికి ఆరనివ్వండి. లేదంటే ఫ్యాన్ ముందు మెల్లిగా దువ్వుతూ, బ్రషింగ్ చేసినా పరవాలేదు. చివర్ల నుండి ప్రారంభించి మూలాల వరకు దువ్వాలి. దీంతో జుట్టు ఎక్కువగా రాలదు. స్ట్రయిట్‌గా వస్తుంది. అలాగే  జుట్టుకు కొద్దిగా స్మూతింగ్ సీరమ్ అప్లై చేయండి.  లేదంటే కొద్దిగా  ఆర్గాన్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా సిలికాన్ వంటి పదార్థాలనూ వాడవచ్చు.

పాలు , తేనె: పాలలో ప్రొటీన్లు ఉంటాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంతోపాటు చివర్లు  చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. తేనెలో   తేమను కాసాడే సహజమైన హ్యూమెక్టెంట్ ఉంటుంది. ఒక కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు మొదళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. దీన్ని 1-2 గంటలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో  జుట్టును వాష్‌ చేసుకోవాలి. రోలర్‌ దువ్వెనతో మంచిగా  దువ్వు కోవాలి. దీంతో జుట్టు మెత్తగా షైనింగ్‌గా ఉంటుంది.

అరటి-ఆలివ్ ఆయిల్ మాస్క్: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.ఆలివ్ ఆయిల్ తేమను అందిస్తుంది. అరటిపండులో, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెతో మెత్తగా  ఉండలు లేకుండా గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని  జుట్టుకు  బాగా పట్టించాలి. అనంతరం జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 30 నుంచి 60 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో వాష్‌  చేసి, కండీషనర్‌ అప్లయ్‌ చేయాలి. స్ట్రయిట్‌గా సిల్కీగా జుట్టు మెరిసిపోతుంది.

గుడ్డు- ఆలివ్ ఆయిల్ మాస్క్: గుడ్లలో ప్రోటీన్లు ,పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను అందిస్తుంది. ఒకటి లేదా రెండు గుడ్లను (వాసన పడని వారు పచ్చసొనను తీసివేయాలి) కొట్టి,  రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట, లేదా గంటసేపు మాస్క్‌ వేసి ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం  చేసుకోవాలి. మీరు నమ్మలేనంత మృదువుగా  వెంట్రుకలు తయారవుతాయి.

అలోవెరా జెల్ మాస్క్: సౌందర్య పోషణలో అలోవెరాకున్న ప్రాముఖ్యతే వేరు. అలోవెరా  జెల్  జుట్టును స్ట్రెయిట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సహజమైన జెల్‌ను తీసి జుట్టుకు అప్లై చేసి, 30-60 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఆ తరువాత కండిషనర్‌ తప్పకుండా అప్లయ్‌ చేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement