Hair brush
-
కెమికల్ స్ట్రెయిట్నెర్లతో పనిలేకుండానే.. మీ జుట్టు హెల్దీగా, షైనీగా!
ఆధునిక కాలంలో స్టయిలింగ్‌కు, సౌందర్యానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. పండగొచ్చినా, ఫంక్షనొచ్చినా బ్యుటీషియన్లకోసం పరుగులు పెడతారు చాలామంది. ముఖ్యంగా గజిబిజిగా ఉన్న జుట్టును, షైనీగా, స్ట్రెయిట్‌గా చేసుకోవడంపెద్ద టాస్క్. హీట్ లేదా కెమికల్ స్ట్రెయిట్నెర్లను ఉపయోగించకుండా స్ట్రెయిట్నింగ్ కోసం ఇవిగో టిప్స్ . బ్లో డ్రైయర్, హీట్ స్టైలింగ్ టూల్స్, కెమికల్ ట్రీట్మెంట్లు మన కేశాలను డ్యామేజ్ చేస్తాయి. అందుకే సహజ పద్ధతుల ద్వారా జుట్టును స్ట్రెయిట్ చేసుకోవచ్చు. స్ట్రెయిట్నర్ ద్వారా పదే పదే జుట్టును వేడికి గురి చేస్తే తొందరగా ఊడిపోతుంది. సహజమైన షైనింగ్‌ను కోల్పోయి పొడి బారుతుంది. అందుకే జుట్టును సహజంగా స్ట్రెయిట్ చేసే పద్ధతులు చూద్దాం. జెంటిల్ క్లెన్సింగ్: రాత్రి పూటే సహజమైన నూనెను జుట్టంతా పట్టించి, ఉదయాన్నే రసాయనాలు లేని షాంపూతో స్నానం చేసి వెంట్రుకలను మృదువుగా ఉంందుకు తేలికపాటి కండీషనర్‌ని వాడాలి. ఆ తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే జుట్టుగా మృదువుగా మెరుస్తూ చెప్పినట్టు వింటుంది. జుట్టు తడిగా ఉన్నపుడే పళ్లు వెడల్పుగా ఉండే దంతాల దువ్వెనతో సుత్తిమెత్తగా దువ్వుతూ చిక్కు తీయాలి. సహజంగా గాలికి ఆరనివ్వండి. లేదంటే ఫ్యాన్ ముందు మెల్లిగా దువ్వుతూ, బ్రషింగ్ చేసినా పరవాలేదు. చివర్ల నుండి ప్రారంభించి మూలాల వరకు దువ్వాలి. దీంతో జుట్టు ఎక్కువగా రాలదు. స్ట్రయిట్‌గా వస్తుంది. అలాగే జుట్టుకు కొద్దిగా స్మూతింగ్ సీరమ్ అప్లై చేయండి. లేదంటే కొద్దిగా ఆర్గాన్ ఆయిల్, కొబ్బరి నూనె లేదా సిలికాన్ వంటి పదార్థాలనూ వాడవచ్చు. పాలు , తేనె: పాలలో ప్రొటీన్లు ఉంటాయి, ఇవి జుట్టును బలోపేతం చేయడంతోపాటు చివర్లు చిట్లిపోవడాన్ని తగ్గిస్తుంది. తేనెలో తేమను కాసాడే సహజమైన హ్యూమెక్టెంట్ ఉంటుంది. ఒక కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల తేనె బాగా కలిసే వరకు కలపాలి. ఈ మిశ్రమాన్ని మీ జుట్టుకు మొదళ్ల నుండి చివరి వరకు బాగా పట్టించాలి. దీన్ని 1-2 గంటలు అలాగే ఉంచి, గోరువెచ్చని నీటితో జుట్టును వాష్ చేసుకోవాలి. రోలర్ దువ్వెనతో మంచిగా దువ్వు కోవాలి. దీంతో జుట్టు మెత్తగా షైనింగ్‌గా ఉంటుంది. అరటి-ఆలివ్ ఆయిల్ మాస్క్: అరటిపండులో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి.ఆలివ్ ఆయిల్ తేమను అందిస్తుంది. అరటిపండులో, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనెతో మెత్తగా ఉండలు లేకుండా గుజ్జుగా చేసుకోవాలి. దీన్ని జుట్టుకు బాగా పట్టించాలి. అనంతరం జుట్టును షవర్ క్యాప్‌తో కప్పి 30 నుంచి 60 నిమిషాలు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో వాష్ చేసి, కండీషనర్ అప్లయ్ చేయాలి. స్ట్రయిట్‌గా సిల్కీగా జుట్టు మెరిసిపోతుంది. గుడ్డు- ఆలివ్ ఆయిల్ మాస్క్: గుడ్లలో ప్రోటీన్లు ,పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆలివ్ ఆయిల్ జుట్టుకు తేమను అందిస్తుంది. ఒకటి లేదా రెండు గుడ్లను (వాసన పడని వారు పచ్చసొనను తీసివేయాలి) కొట్టి, రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట, లేదా గంటసేపు మాస్క్ వేసి ఉంచుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మీరు నమ్మలేనంత మృదువుగా వెంట్రుకలు తయారవుతాయి. అలోవెరా జెల్ మాస్క్: సౌందర్య పోషణలో అలోవెరాకున్న ప్రాముఖ్యతే వేరు. అలోవెరా జెల్ జుట్టును స్ట్రెయిట్ చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది. సహజమైన జెల్‌ను తీసి జుట్టుకు అప్లై చేసి, 30-60 నిమిషాల పాటు అలాగే ఉంచి, తర్వాత తేలికపాటి షాంపూతో కడగాలి. ఆ తరువాత కండిషనర్ తప్పకుండా అప్లయ్ చేయాలి. -
లేటెస్ట్ టెక్నాలజీతో హ్యాండ్‌బ్యాగులు
మగువల భుజాన్ని అంటిపెట్టుకుని ఉంటూ.. వారి అవసరాలన్నీ తీర్చే నేస్తం హ్యాండ్‌బ్యాగ్. మనీ, మొబైల్‌ఫోన్, కాస్మెటిక్స్, జ్యువెలరీ, హెయిర్ బ్రష్.. ఇలా ముదితలకు చెందిన ముఖ్యమైన వస్తువులను అపురూపంగా మోస్తుంది. తమకు కావాల్సినవన్నీ మోసే హ్యాండ్‌బ్యాగ్స్‌ను యువతులు కూడా అంతే అపురూపంగా చూసుకుంటుంటారు. మార్కెట్లోకి కొత్త మోడల్ రాగానే సొంతం చేసుకుంటారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా నయా మోడల్స్‌ను రిలీజ్ చేస్తున్నారు డిజైనర్లు. ..:: శిరీష చల్లపల్లి ఒకప్పుడు కాలేజ్ గాళ్స్.. సబ్జెక్ట్‌కో నోట్‌బుక్, జామెట్రీ బాక్స్, టిఫిన్ బాక్స్.. వాటర్ బాటిల్.. ఇలా స్టేషనరీని వెంటేసుకుని కాలేజీకి వెళ్లేవారు. వీటన్నింటినీ మోసే బ్యాగ్‌ను భుజాలకుతగిలించుకుని భారంగా నడిచేవాళ్లు. ప్రజెంట్ ట్రెండ్ మారింది. ఇంటర్ స్టూడెంట్ నుంచి రిటైర్డ్ ఎంప్లాయీ వరకూ అందరూ హ్యాండ్‌బ్యాగ్ లేనిదే గడప దాటడం లేదు. వారి వారి అవసరాలకు తగ్గట్టుగా రకరకాల హ్యాండ్‌బ్యాగ్‌లు మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. రకరకాలు.. కొత్త హంగులతో ముస్తాబై వస్తున్న బ్యాగులను మగువలు విపరీతంగా ఆదరిస్తున్నారు. యువతులే కాదు..అమ్మలు.. అమ్మమ్మలు కూడా ఏజ్‌కు తగ్గట్టుగా హ్యాండ్‌బ్యాగ్‌లు మెయింటేన్ చేస్తున్నారు. డాక్టర్ బ్యాగ్, బో బ్యాగ్, క్రాస్ బాడీ బ్యాగ్, రిస్లెట్ బ్యాగ్, మెసెంజర్ బ్యాగ్, క్లచ్ బ్యాగ్, బ్యారెల్ బ్యాగ్, డ్రాస్ట్రింగ్ బ్యాగ్, సాడిల్ బ్యాగ్, స్ట్రక్చర్డ్ బ్యాగ్, టోటె బ్యాగ్ ఇలా రకరకాల బ్యాగ్‌లు టీనేజ్ అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకూ ఎవరికి వారే ఫంక్షన్లలో స్టయిల్ ఐకాన్‌గా నిలవడానికి ప్రయత్నిస్తున్నారు. మ్యాచింగ్ మస్ట్.. టీనేజ్ అమ్మాయిలైతే ఎక్కువగా స్లింగ్ బ్యాగులు, టోటే బ్యాగులను ఎంచుకుంటున్నారు. కాలేజీ అమ్మాయిలైతే సింగిల్ హ్యాండ్‌తో వాళ్ల డ్రెస్‌కు మ్యాచ్ అయ్యే హ్యాండ్‌బ్యాగ్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారు. రెండు నోట్బుక్లు, మొబైల్ ఫోన్, పెప్పర్ స్ప్రే ఇమిడిపోయేవి తీసుకుంటున్నారు. లైట్‌వెయిట్ హ్యాండ్ బ్యాగ్‌లతో ఫెమినిన్‌గా, క్యూట్‌గా కనిపించడానికి ఇష్టపడుతున్నారు. ట్రెండ్‌కు తగ్గట్టుగా.. నయా పోకడలతో అప్డేట్ అవుతున్న డిజైనర్లు సైతం రకరకాల మెటీరియల్స్‌తో హ్యాండ్‌బ్యాగులు తయారు చేస్తున్నారు. డ్రెస్‌లు డిజైన్ చేసినట్టే హ్యాండ్‌బ్యాగ్‌లను కూడా కస్టమైజ్డ్గా తీసుకొస్తున్నారు. లెదర్, క్లాత్, జ్యూట్, ఫ్యాబ్రిక్ ఇలా ఎన్నో రకాల మెటీరియల్స్ వాడుతున్నారు. డబుల్ జిప్, మల్టీ జిప్, క్లచ్ మోడల్ ఇలా వెరైటీ హ్యాండ్ బ్యాగ్స్ వేటికవే స్పెషల్ లుక్‌తో అదరగొడుతున్నాయి. సేఫ్టీ లాకింగ్.. సేఫ్టీ కోసం హ్యాండ్బ్యాగ్స్కు సైతం లాకింగ్ సిస్టమ్ అరేంజ్ చేస్తున్నారు డిజైనర్లు. నంబర్ లాకింగ్, మినీ కీ లాక్, అలారం బేస్డ్ ఇలా రకరకాల లాకింగ్ సిస్టమ్స్ అటాచ్ చేస్తున్నారు. అంతెందుకు జీపీఎస్ టెక్నాలజీని కూడా హ్యాండ్‌బ్యాగ్‌లకు అడాప్ట్ చేస్తున్నారు. హ్యాండ్‌బ్యాగ్‌లో ఎలక్ట్రానిక్ చిప్ అరేంజ్ చేస్తున్నారు. దీంతో పొరపాటున హ్యాండ్‌బ్యాగ్ అన్ అథెంటిక్ పర్సన్గానీ ఓపెన్ చేశాడంటే.. సదరు హ్యాండ్‌బ్యాగ్ ఓనర్ మొబైల్‌కు, ముందుగా అందులో ఫీడ్ చేసిన మొబైళ్లకు సమాచారం అందుతుంది. తస్కరణకు గురైన మీ హ్యాండ్‌బ్యాగ్ ఏ ఏరియాలో ఉందో కూడా చూపిస్తుంది. ఇలా లేటెస్ట్ టెక్నాలజీతో ముస్తాబైన హ్యాండ్‌బ్యాగులు మార్కెట్లో అదరగొడుతున్నాయి.