Priyanka Chopra Partners Nykaa To Sell Her Haircare Brand Anomaly - Sakshi
Sakshi News home page

Priyanka Chopra Jonas: భారీ ప్లాన్స్‌, నా బ్యూటీకి దేశీ సాంప్రదాయ ఉత్పత్తులనే వాడతా

Published Sat, Aug 27 2022 1:34 PM | Last Updated on Sat, Aug 27 2022 5:17 PM

Priyanka Chopra partners Nykaa to sell her haircare brand Anomaly - Sakshi

ముంబై: బాలీవుడ్‌ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని ఇండియాలో లాంచ్‌  చేసింది. ఇందుకోసం  నైకా బ్రాండ్‌ కింద సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే బ్యూటీ అండ్‌ వెల్‌నెస్ ఈ–కామర్స్‌ సంస్థ ఎఫ్‌ఎస్‌ఎన్‌తో  డీల్‌ కుదుర్చుకుంది. 

అనామలీ పేరిట శిరోజాల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన సొంత బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. లాంచ్ సందర్భంగా, జోనాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ rouge, పెరుగు, తేనె లాంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణ పద్ధతులను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, ఈ నేపథ్యంలోనే  కురుల సంరక్షణకు సంబంధించి భారతీయ సంప్రదాయ విధానాల స్ఫూర్తితో సహజసిద్ధమైన ప్రకృతి వనరుల నుంచి వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు.  (ఫెస్టివ్‌ సీజన్‌: గుడ్‌న్యూస్‌ 75 వేల ఉద్యోగాలు)

"అనోమలీ హెయిర్‌కేర్‌ను భారతదేశానికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే పుట్టిన ఈ బ్రాండ్‌ ఇండియా లాంచ్ చాలా ప్రత్యేక మైందని ప్రియాకం చెప్పారు. ప్రకృతి, వృక్షాలతో భారతీయ సౌందర్యం ఇమిడిపోయిందని ఆమె అన్నారు.గత మూడు, నాలుగు సంవత్సరాలలో భారతీయ అందాల విభాగం బాగా వృద్దిచెందిందని నైకా సీఈఓ, ఈ-కామర్స్ బ్యూటీ, అంచిత్ నాయర్ వ్యాఖ్యానించారు.(jobmarket: ఉద్యోగాలపై ఇన్‌ఫ్లేషన్‌ ఎఫెక్ట్‌! తాజా రిపోర్ట్‌ ఏం చెబుతోంది?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement