care
-
చిట్టి గుండెకు గట్టి భరోసా
చిట్టి గుండె కూడా లయ తప్పుతోంది.. గట్టిపడేలోపే గండాల్లో చిక్కుకుంటోంది!గట్టెక్కించి ఆ బుజ్జి గుండెకు నూరేళ్ల భరోసానిస్తోందిశ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ అండ్ రీసెర్చ్!ఎక్కడో కాదు.. తెలంగాణ, సిద్దిపేటలో!ఇక్కడ అడ్మిషన్ నుంచి డిశ్చార్జ్ వరకు మందులు సహా చికిత్స అంతా ఉచితమే! చిన్నారితో పాటు తల్లితండ్రులకూ ఉచిత భోజన, వసతి సౌకర్యాలున్నాయి.∙గజవెల్లి షణ్ముఖరాజు, సాక్షి, సిద్దిపేటఏటా ప్రపంచవ్యాప్తంగా 13. 5 లక్షల మంది పిల్లలు గుండె లోపాలతో పుడుతున్నట్లు అంచనా. ఇందులో మన దేశంలోనే 2.4 లక్షల మంది ఉండగా.. వాళ్లలో 60వేల మందికి హార్ట్ సర్జరీ అనివార్యమవుతోంది. కానీ 10వేల మంది చిన్నారులకు మాత్రమే ఆపరేషన్లు జరుగుతున్నాయి. ఫలితంగా చాలామంది మృత్యువాత పడుతున్నారు. కొందరు పిల్లలు అనారోగ్య సమస్యలతోనే జీవనపోరాటం చేయాల్సి వస్తోంది. ఇలాంటి చిన్ని హృదయాలకు ఆరోగ్య భరోసా కల్పించేందుకు శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ముందుకు వచ్చింది. 2012లో శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్‌ని ప్రారంభించింది. అందులో భాగంగా రాయ్‌పూర్ (ఛత్తీస్‌గఢ్), పల్వాల్ (హరియాణ), ముంబై (మహారాష్ట్ర), ముద్దహళ్లి(కర్ణాటక)లో చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్స్‌ని ఏర్పాటు చేసింది. ఆ వరుసలోనిదే సిద్దిపేటలోని చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్ కూడా! ఇవికాకుండా మరో అయిదు ప్రాంతాల్లో మదర్ అండ్ చైల్డ్ కేర్ సెంటర్లనూ ఏర్పాటుచేసి వైద్యసేవలతో పేదలకు అండగా నిలుస్తోందీ ట్రస్ట్. ఐదు చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లలో ఇప్పటి వరకు 5,86,366 మంది చిన్నారులకు ఓపీ సేవలను అందించారు. అందులో 33,772 మంది చిన్నారులకు హార్ట్ సర్జరీలు చేశారు. విదేశాల నుంచి వస్తున్న పిల్లలకూ అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తున్నారు. సిద్దిపేటలో..శ్రీ సత్యసాయి సంజీవని సెంటర్ ఫర్ చైల్డ్ హార్ట్ కేర్ రీసెర్చ్.. ఐదెకరాల విస్తీర్ణంలోని వంద పడకల ఆసుపత్రి. అత్యాధునిక వైద్య సౌకర్యాలతో అనుభవజ్ఞులైన పీడియాట్రిక్ హార్ట్ సర్జన్ల బృందం సేవలను అందిస్తోంది. మాజీ క్రికెటర్, శ్రీ సత్యసాయి ట్రస్ట్ సభ్యుడు సునీల్ గావస్కర్ కూడా ఈ సెంటర్‌ను సందర్శించారు.ఫొటోలుః కె సతీష్ఓన్లీ దిల్ .. నో బిల్ శ్రీ సత్యసాయి సంజీవని చిన్న పిల్లల ఆసుపత్రిలో కేవలం దిల్ మాత్రమే ఉంటుంది. బిల్ ఉండదు. ఇక్కడ ట్రీట్మెంట్ పొందిన పిల్లల తల్లిదండ్రుల్లో ఒక భరోసా కనిపిస్తోంది. ∙సునీల్ గావస్కర్, ఇండియన్ మాజీ క్రికెటర్, సత్యసాయి ట్రస్ట్ సభ్యుడున్యాయం చేస్తున్నాం.. మేము చదివిన చదువుకు సత్యసాయి ట్రస్ట్ ద్వారా న్యాయం చేస్తున్నాం. ఇప్పటి వరకు రెండువేలకు పైగా హార్ట్ సర్జరీలు చేశాం. హార్ట్‌కి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను వెంటనే డాక్టర్స్‌కి చూపించాలి.∙డాక్టర్ అమితా శర్మ, అనఘా తులసి, భూషణ్ఫ్రీగా చేస్తారని తెలిసి..మా పాపకు తరచు అనారోగ్యం చేస్తుండటంతో హాస్పిటల్లో చూపిస్తే గుండెలో రంధ్రం ఉందని గుర్తించారు. సర్జరీ చేయాలన్నారు. సత్యసాయి చైల్డ్ హార్ట్ కేర్ సెంటర్లో ఫ్రీగా చేస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాం. పాపకు సర్జరీ అయింది.∙శాలిని యాదవ్, ఉత్తర్‌ప్రదేశ్ బరువు పెరగట్లేదని.. మా బాబు బరువు పెరగట్లేదని డాక్టర్‌కి చూపిస్తే హార్ట్‌లో హోల్ ఉందని తేల్చారు. తెలిసినవాళ్ల ద్వారా సత్యసాయి హాస్పిటల్‌కి వచ్చాం. పైసా తీసుకోకుండా బాబుకు సర్జరీ చేశారు. ∙బోలేశ్వర్, రాయ్‌పూర్, ఛత్తీస్గఢ్సేవే లక్ష్యంగా.. శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆసుపత్రులన్నిట్లో అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి. సేవే లక్ష్యంగా కొనసాగుతున్నాం.∙సి. శ్రీనివాస్, చైర్మన్, శ్రీ సత్యసాయి హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ -
‘అమ్మ’కు సుస్తీ చేస్తే? అమ్మ పనులు చేయడం వచ్చా?
ఇంట్లో ఎవరికైనా సుస్తీ చేస్తే అమ్మ వారికి సేవలు చేసి కోలుకునేలా చేస్తుంది. మరి అమ్మకు సుస్తీ చేస్తే? వంట ఎవరు చేయాలి?బాక్స్ ఎవరు కట్టాలి? అంట్ల పరిస్థితి ఏమిటి? అనారోగ్యం వల్ల ఆమెకు చిరాకు కలిగితే ఎలా వ్యవహరించాలి? ఎవరికి సుస్తీ చేసినా అమ్మ ఆరోగ్యంగా ఉంటే ఏమీ కాదు. కానీ అమ్మకు సుస్తీ చేస్తే ఇంటికే సుస్తీ అవుతుంది. మరి మనకు అమ్మ పనులు ఎన్ని వచ్చు? ఒక్క అమ్మ అందరి పనులూ చేస్తుంది. అందరూ కలిసి అమ్మ పనులు చేయలేరా? ఇది చలికాలం. సుస్తీ చేసే కాలం. బద్దకం కాలం. ఏ త్రోట్ ఇన్ఫెక్షనో, జ్వరమో, ఒళ్లు నొప్పులో, నీరసమో, ఏమీ చేయాలనిపించని నిర్లిప్తతో, ముసుగు తన్ని విశ్రాంతి తీసుకోవాలనే తలంపుతో ఒక రోజంతా అమ్మను మంచం కదలనివ్వక పోతే అమ్మ ఎన్ని పనులు చేస్తుందో ఇంట్లోని సభ్యులకు అర్థమవుతుంది. ఆ పనులన్నీ అమ్మ కోసం ఇంటి సభ్యులు చేయగలరా? చేయాలి.ఎవరికి చిరాకు?సాధారణంగా అమ్మకు అనారోగ్యం వస్తే నాన్నకు చిరాకుగా అనిపిస్తుంది. మరి నాన్న ఆఫీసుకు వెళ్లాలి. ఏవేవో పనులుంటాయి. టైముకు అన్నీ జరిగి΄ోవాలి. అమ్మ మంచం మీద ఉంటే అవి జరగవు. అప్పుడు నాన్నకు చిరాకు వేస్తుంది. ‘లేచి పనుల్లో పడితే సుస్తీ అదే పోతుంది’ అని ఎఫ్.ఆర్.సి.ఎస్ లెవల్లో సూచన కూడా చేస్తాడు. అమ్మకు బాగా లేక΄ోతే పిల్లలు నాన్నకు చెప్పాల్సిన మొదటి సంగతి– లీవ్ పెట్టు నాన్నా... రోజూ వెళ్లే ఆఫీసేగా అని. తనకు బాగా లేకపోతే భర్త కన్సర్న్తో లీవ్ పెట్టాడు అనే భావన అమ్మకు సగం స్వస్థత ఇస్తుంది. ఆ తర్వాత నాన్న అమ్మతో చెప్పాల్సిన మాట ‘నేను చూసుకుంటాను. నువ్వు రెస్ట్ తీసుకో’ అనే.పనులు పంచుకోవాలికొన్ని ఇళ్లల్లో తల్లిదండ్రులు పిల్లలకు ఆపిల్ పండు తొక్క తీయడం కూడా నేర్పరు. అలాంటి ఇళ్లలో ఇంకా కష్టం కాని కొద్దో గొప్పో పనులు చేసే పిల్లలు ఉంటే తండ్రి, పిల్లలు కలిసి ఏ మాత్రం శషభిషలు లేకుండా పనులు పంచుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్ ఏమిటి? బ్రెడ్‌తో లాగించవచ్చు. మధ్యాహ్నం ఏమిటి? అన్నం కుక్కర్లో పడేసి, ఏదైనా ఊరగాయ, బాయిల్డ్ ఎగ్ కట్టుకుని వెళ్లవచ్చా? ఇల్లు సర్దే బాధ్యత ఒకరిది. పనిమనిషి ఉంటే ఆమె చేత అంట్లు తోమించి, ఉతికిన బట్టలు వైనం చేసే బాధ్యత ఒకరిది. ఈ పనులన్నీ అమ్మ తప్ప ఇంట్లో అందరూ చేయక పోతే ఆ ఇంట్లో అనవసర కోపాలు వస్తాయి. అవి గృహశాంతిని పోగొడతాయి. అసలే ఆరోగ్యం బాగలేకుండా ఉన్న అమ్మను అవి మరీ బాధ పెడతాయి. ఆమే ఓపిక చేసుకుని లేచి పని చేస్తే ఆరోగ్యం మరింత క్షీణించి లేని సమస్యలు వస్తాయి.అమ్మ పేరున మందు చీటిఏ ఇంటిలోనైనా అతి తక్కువ మందు చీటీలు ఉండేది అమ్మ పేరుతోనే. ఎందుకంటే సగం అనారోగ్యాలు ఆమె బయటకు చెప్పదు. ఒకవేళ చెప్పినా మెడికల్ షాప్ నుంచి తెచ్చి ఇవ్వడమే తప్ప హాస్పిటల్‌కు తీసుకువెళ్లడం తక్కువ. కాని అమ్మను కచ్చితంగా ఆస్పత్రికి తీసుకెళ్లాలి. డాక్టర్ సూచన ఆమెకు బలాన్ని ఇచ్చి లోపలి సందేహాలేవైనా ఉంటే పోగొడుతుంది. అమ్మ సరైన మందులతో తొందరగా కోలుకుంటుంది.అమ్మతో సమయంతనతో కాసింత సమయం గడపాలని అమ్మ కోరుకుంటుంది ఇలాంటప్పుడు. భర్త ఆమె దగ్గర కూచుని తీరిగ్గా కబుర్లు చెప్పవచ్చు. ఏవైనా జ్ఞాపకాలు నెమరు వేసుకోవచ్చు. మధ్య మధ్య ఆమెకు ఏదైనా సూప్ కాచి ఇచ్చి తోడుగా తనూ కాస్తంత తాగుతూ కూచుంటే అమ్మకు ఎందుకు బాగైపోదు..? పిల్లలు పాదాలు నొక్కుతూ కబుర్లు చెప్పవచ్చు. అమ్మ వర్కింగ్ విమన్ అయితే ఆఫీసుకు వెళ్లొద్దని ఇంకొన్నాళ్లు రెస్ట్ తీసుకోమని మారాం చేయొచ్చు. ఆ మారాం కూడా ఆమెకు మందే.కొంత ఖర్చు చేయాలిఅమ్మకు అనారోగ్యం అయితే అమ్మ వద్దు వద్దంటున్నా కొంత ఖర్చు చేయాలి. మంచి పండ్లు తేవాలి. వంట చేయలేని పరిస్థితి ఉంటే మంచిచోట నుంచి భోజనం తెచ్చుకోవాలి. మంచి హాస్పిటల్లో చూపించాలి. మందులు పూర్తి కోర్సు కొని వాడేలా చూడాలి. డాక్టర్లు పరీక్షలు ఏవైనా రాస్తే ఏం అక్కర్లేదు అని ఎగ్గొట్టకూడదు. అమ్మ కోసం కుటుంబం మొత్తం ప్రేమగా, సహనంగా, ఒళ్లు వొంచి పని చేసే విధంగా ఏ ఇంట్లో ఉండగలరో ఆ ఇంట్లో అమ్మ ఆరోగ్యంగా తిరుగుతుంది. తొందరగా కోలుకుంటుంది. ఇదీ చదవండి : తల్లి రైల్వే కూలీ.. బిడ్డకు పవర్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం -
అసలైన ముత్యాలను గుర్తించండి : ఇలా భద్రపర్చుకోండి!
ముత్యాల పేరుతో మనకు మార్కెట్లో దొరికేవి మూడు రకాలు. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్, ఇమిటేషన్ పెరల్స్. నాచురల్ ఫార్మ్డ్ పెరల్స్, కల్చర్డ్ పెరల్స్ రెండూ ఆయెస్టర్లోనే తయారవుతాయి. ఇమిటేషన్ పెర్ల్ అంటే గాజు పూస లేదా ప్లాస్టిక్ పూస మీద ముత్యంలా కనిపించడానికి కోటింగ్ వేసినవి. ఇవి మన్నిక ఉండవు. ఫ్యాన్సీగా ధరించాలనే సరదాతో వాటిని కొనుక్కోవచ్చు. కానీ ముత్యాలని భ్రమ పడవద్దు. ప్రాచీన కాలంలో నాచురల్‌గా వాటంతట అవి ఉత్పత్తి అయ్యే ముత్యాలే మనకు తెలుసు. సముద్రంలో ఉండే ఆయెస్టర్ (ముత్యపు చిప్ప) లోపల ఇసుక రేణువు కానీ మరేదైనా ఫారిన్‌బాడీ చేరినప్పుడు, దాని చుట్టూ క్యాల్షియం పొరలను కోటింగ్‌గా ఏర్పరుచుకుంటుంది ముత్యపుచిప్ప. అలాంటి ముత్యాల లభ్యత చాలా తక్కువ. ఒక నెక్లెస్‌కు అవసరమైన ముత్యాలను సేకరించడం కూడా ప్రాచీన కాలంలో చాలా పెద్ద పని అయ్యేది. గడచిన కొన్ని దశాబ్దాలుగా సముద్రం నుంచి ముత్యపు చిప్పలను సేకరించి నీటి కొలనుల్లో పెంచుతున్నారు. ముత్యపు చిప్ప అంటే ఒక ప్రాణి. ముత్యపుచిప్పలోపల చిన్న బీడ్ను ఇంజెక్ట్ చేస్తారు. ఇక ఆ బీడ్ చుట్టూ క్యాల్షియం పొరలను ఏర్పరుచుకుంటుంది ఆ ప్రాణి. బీడ్ షేప్‌ను బట్టి ముత్యం ఆకారం ఉంటుంది. ఇలా తయారు చేయడం మొదలైన తర్వాత ముత్యాలు విరివిగా లభిస్తున్నాయి. కల్చర్డ్ పెరల్స్ కూడా నిజమైన ముత్యాలేనని గమనించాలి. ఎక్స్ రే ద్వారా పరీక్షించి నిజమైన ముత్యాన్ని గుర్తించాలి. ఇక ముత్యం రంగు ఆయెస్టర్ జీవించిన నీటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. చల్లటి నీరు, ఒక మోస్తరు వెచ్చటి నీరుని బట్టి రంగు మారుతుంది. అలాగే ఆస్ట్రేలియాలో దొరికే ముత్యాలను సౌత్ సీ పెరల్స్ అంటారు. జూన్ నుంచి వచ్చిన వాటిని ఫ్రెష్ వాటర్ పెరల్స్ అంటారు. ముత్యాలకు గాలి తగలాలి. కాబట్టి ముత్యాల దండలను జిప్‌లాక్ కవర్లలో భద్రపరచరాదు. కుషన్ బాక్సులు లేదా వెల్వెట్ బాక్సుల్లో పెట్టాలి. గాలి ధారాళంగా అందడం కోసం కనీసం నెలకోసారయినా బీరువా లో నుంచి బయటకు తీస్తుండాలి. ముత్యాల ఆభరణాలను ధరించకపోతే పాడవుతాయనే మాట అందుకే చెబుతారు. --విశేషిణి రెడ్డి, జిఐఏ జెమాలజిస్ట్ -
Children Eye Care Week బాల్య శుక్లాలపై నిర్లక్ష్యం వద్దు..
బంజారాహిల్స్: ఎల్వీప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 7 నుంచి 14వ తేదీ వరకూ నిర్వహించే బాలల నేత్ర సంరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం అవగాహనా వాక్‌ను నిర్వహించారు. ‘బాల్య శుక్లాలు–పిల్లల చూపుపై వాటి ప్రభావం–త్వరిత గుర్తింపు–చికిత్స ప్రాధాన్యత’ థీమ్‌తో ఈ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కల్లం అంజిరెడ్డి ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన వాక్‌ను సినీ సంగీత దర్శకుడు తమన్ ఎస్, నటుడు విశ్వ కార్తికేయలు ప్రారంభించారు. దాదాపు 300 మంది చిన్నారులు, వారి తల్లిదండ్రులు ఫ్లకార్డులు చేతబూని బాల్యశుక్లాలపై అవగాహన క్పలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తమన్ మాట్లాడుతూ ఈ వాక్‌లో పాల్గొనడం తనకెంతో సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పిల్లల కంటి సమస్యలను త్వరితగతిన గుర్తించగలిగితే వారి సమస్యలను దూరం చేయవచ్చని, ఆ దిశగా తల్లిదండ్రులు అవగాహన పొందాలని కోరారు. ఎల్వీ ప్రసాద్ చైల్డ్ సైట్ ఇన్స్టిట్యూట్ అధిపతి డాక్టర్ రమేష్ కెకున్నయ్య మాట్లాడుతూ రోగ నిర్ధారణను త్వరితగతిన గుర్తించి చికిత్స అందించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలు ఉంటాయన్నారు. బాల్య కంటి శుక్లం చికిత్స చేయకుండా వదిలేస్తే, చివరకు పునరుద్ధరించలేని విధంగా హాని చేయవచ్చన్నారు. ఈ నెల 14 వరకూ ఎల్వీప్రసాద్ ఆస్పత్రి ఆవరణలో చిత్రలేఖనం, ఫ్యాన్సీ డ్రెస్, వక్తృత్వ, క్లే మౌల్డింగ్, బ్రెయిలీ చదవడం, పోటరీ సెషన్లు నిర్వహించి బాలల దినోత్సవం రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. -
చలి పులి వచ్చేస్తోంది నెమ్మదిగా...ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే!
నెమ్మదిగా చలి ముదురుతోంది. వెచ్చని దుప్పట్టు, చలిమంటలు కాస్త ఊరటనిచ్చినా ఇంకా అనేక సమస్యలు మనల్ని వేధిస్తుంటాయి. ముఖ్యంగా శీతగాలులకు శ్వాసకోశ వ్యాధులు, చర్మ సమస్యలు బాగా కనిపిస్తాయి. మరి ఈ సీజన్లో చర్మం పొడిబారకుండా, పగలకుండా ఉండాలంటే ఏం చేయాలి. ఇదిగో మీ కోసం ఈ చిట్కాలు.పొడి బారే చర్మానికి మాయిశ్చరైజర్లు పదే పదే రాయాల్సి వస్తుంది. ఆ అవసరం లేకుండా, చర్మం మృదుత్వం కోల్పోకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలను పాటించాలి.పాల మీగడలో తేనె కలిపి ముఖానికి, చేతులకు పట్టించి, మృదువుగా మసాజ్ చేయాలి. పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి.చలికాలం రోజూ ఈ విధంగా చేస్తుంటే చర్మకాంతి కూడా పెరుగుతుంది. చర్మానికి సరైన పోషణ లేక లేకపోతే జీవ కళ కోల్పోతుంది. పాలు, బాగా మగ్గిన అరటిపండు గుజ్జు కలిపి మిశ్రమం తయారుచేసుకొని ప్యాక్ వేసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత కడిగేయాలి. జిడ్డుచర్మం గలవారు పాలు–రోజ్‌వాటర్ కలిపి రాసుకోవచ్చు. తర్వాత వెచ్చని నీటితో కడిగేయాలి. చర్మంపై ఎక్కువ మృతకణాలు కనిపిస్తే కలబంద రసంలో పది చుక్కల బాదం నూనె, నువ్వుల నూనె కలిపి ముఖానికి, చేతులకు రాయాలి. వృత్తాకారంలో రాస్తూ మర్దన చేయాలి.రాత్రంతా అలాగే వదిలేసి, మరుసటి రోజు ఉదయం వెచ్చని నీటితో కడిగేయాలి.శీతాకాలంలో శరీరాన్ని తేమగా ఉంచుకోవాలి. చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకుంటేనే మెరుస్తూ ఉంటుంది. అలా ఉండాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)ఫ్యాటీఫుడ్స్కు దూరంగా ఉంటూ, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. తాజా ఆకుకూరలు, సీ విటమిన్ లభించే పండ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఒత్తిడికి దూరంగా ఉంటూ సంతోషంగా ఉండేందుకు ప్రయత్నించాలి. రోజూ వాకింగ్, యోగా లాంటి వ్యాయామం చేస్తే శరీరం, మనసు ఆరోగ్యంగా ఉంటాయి. దీంతో మన ముఖంలో చర్మకాంతిలో చక్కటి గ్లో వస్తుంది. -
నగలు ధరించాక పెర్ఫ్యూమ్లు వేసుకుంటున్నారా? అయితే ఈ టిప్స్ మీకోసమే!
అందమైన ఆభరణాలను ఎక్కవ డబ్బు పెట్టి కొనుక్కుంటాం. వాటిని ధరించి ఆనందిస్తాం. కానీ ఆభరణాలను కలకాలం అందంగా ఉంచుకోవడం కూడా తెలుసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోక΄ోతే ఆభరణాలు కాంతిహీనమవుతాయి. ఫంక్షన్లకు వెళ్లేటప్పుడు ఆభరణాలు ధరించిన తర్వాత ఒంటికి లోషన్లు– సన్స్క్రీన్లు రాయడం, పెర్ఫ్యూమ్ స్ప్రే చేసుకోవడం మంచిది కాదు. ఇలా చేస్తే కాస్మటిక్స్లోని రసాయనాలు ఆభరణాల లోహాల మధ్య రసాయన చర్యకు కారణమవుతుంది. ఆభరణాలు మెరుపు తగ్గడం, రంగుమారడం వంటి పరిణామాలు సంభవిస్తాయి. కాబట్టి ఒంటికి క్రీములు, పెర్ఫ్యూమ్లు వేసుకోవడం పూర్తయిన తర్వాత మాత్రమే ఆభరణాలను ధరించాలి. ఆభరణాలను ధరించిన తర్వాత తీసి బీరువాలో దాచేటప్పుడు నేరుగా డబ్బాలో పెట్టడం మంచిది కాదు. ఒంటి మీద నుంచి తీసిన తరవాత కొంతసేపు గాలికి ఆరనివ్వాలి. ఆ తర్వాత నూలువస్త్రంతో తుడవాలి. శుభ్రమైన మెత్తని నూలు వస్త్రంలో చుట్టి డబ్బాలో పెట్టాలి.ఆభరణాలను శుభ్రం చేయడానికి రసాయనాలను వాడరాదు. ఇలా చేస్తే బంగారు ఆభరణాల మెరుపు పోవడంతోపాటు ఆభరణం రంగుమారుతుంది. ఆభరణం రంగు మారిన వెంటనే ఇది కచ్చితమైన బంగారేనా అనే అనుమానం వస్తుంది. ఆభరణం తయారీలో బంగారంలో కొన్ని ఇతర లోహాలను కలుపుతారు. అవి రసాయనాల కారణంగా రంగుమారుతాయి. ఆభరణాలను మెత్తని వస్త్రంతో మృదువుగా తుడవాలి.నిద్రపోయేటప్పుడు ఆభరణాలను ధరించరాదు. బంగారు మెత్తని లోహం. సున్నితమైన పనితనంతో లోహంలో రాళ్లు, వజ్రాలను పొదుగుతారు. నిద్రలో ఒత్తిడికి గురై రాళ్లు ఊడి΄ోయే ప్రమాదం ఉంది. రాలి పడిన రాళ్లను తిరిగిపొందగడం కష్టం. తిరిగి అమర్చినప్పటికీ అతుకు తెలిసి΄ోతుంది. ఆభరణానికి స్వతహాగా ఉండే అందం పోతుంది.రెండు వేర్వేరు లోహాలను ఒకచోట ఉంచరాదు. అంటే బంగారు, వెండి ఆభరణాలను ఒకే డబ్బాలో పెట్టకూడదు. విడిగా భద్రపరచాలి. అలాగే రెండు ఆభరణాలను కూడా ఒకే పెట్టెలో పెట్టరాదు. ఒకదానికొకటి రాసుకుని గీతలు పడతాయి, మెరుపు కూడా తగ్గుతుంది. – రీటా షాకన్సల్టెంట్ అండ్ జ్యూయలరీ డిజైనర్, హైదరాబాద్ -
పిల్లలు నిద్రలో పళ్లు కొరుకుతోంటే ఏం చేయాలి?
చిన్నారులు నిద్రలో పళ్లు కొరుకుతున్నారంటే అది వారిలో అంతర్గతంగా ఉన్న ఆందోళన, టెన్షన్, ఒత్తిడి కారణం వల్ల కావచ్చు. ఇలా నిద్రలో పళ్లు కొరికే కండిషన్‌ను వైద్యపరిభాషలో ‘బ్రక్సిజమ్’ అంటారు. పిల్లల్లో ఇది చాలా సాధారణంగా కనిపించడంతో పాటు వారి మెుదటి ఐదేళ్ల వ్యవధిలో మెుదలయ్యే సమస్య ఇది. సాధారణంగా చిన్నారుల్లో ఆందోళన, కోపం, వ్యాకులత, కంగారు, తొందరపాటుతో ఉండటం, పోటీ తత్వంతో వ్యవహరించడం వంటివి ఉన్నప్పుడు ఈ బ్రక్సిజమ్ సమస్య వారిలో ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సమస్యను అధిగమించాలంటే ముందుగా వాళ్లలో ఆందోళన, వ్యాకులతకు కారణమయ్యే అంశాలేమిటో తెలుసుకుని, దాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. నిద్రకు వుుందు వాళ్లు సంతోషంగా, ఆహ్లాదంగా ఉండేలా తల్లిదండ్రులు చూడాలి. పిల్లలతో మాట్లాడుతూ వారి మనసుల్లో ఉన్న భయాలు, శంకలు తొలగించేలా వ్యవహరించాలి. అలాగే పిల్లలు నిద్రకుపక్రమించే సమయంలో కెఫిన్ ఎక్కువగా ఉండే పదార్థాలు (కాఫీ, చాక్లెట్లు వంటివి) ఇవ్వకూడదు. సమస్య మరీ ఎక్కువగా ఉంటే నోట్లో అమర్చే మౌత్గార్డ్స్, మౌత్పీసెస్తో కొంత ఉపయోగం ఉంటుంది. ఈ సమస్య వల్ల కొన్నిసార్లు డెంటల్ సమస్యలు – మాల్ అక్లూజన్, పళ్లు వదులు కావడం (లూజెనింగ్), పళ్లు ఊడిపోవడం, దవడ ఎముక జాయింట్ (టెంపోరో మాంబడి బులార్ జాయింట్) సమస్యలు కూడా రావచ్చు. అలాంటి సందర్భాల్లో దంతవైద్య నిపుణులను సంప్రదించాలి. -
చెవి రింగులతో ర్యాష్ వస్తోందా?
కొందరికి చెవి రింగులు లేదా దుద్దులు సరిపడక చెవి తమ్మెలకు ర్యాష్ రావచ్చు. కృత్రిమ ఆభరణాలలోని నికెల్ కారణంగా కొందరిలో ఈ ర్యాషెస్ వస్తాయి. ఫలితంగా దురద, ఎర్రబారడం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ దశలో నిర్లక్ష్యం చేస్తే గాయం మరింత రేగి, రక్తస్రావమయ్యే అవకాశాలు ఎక్కువ. ఈ సమస్యను ‘అలర్జిక్ కాంటాక్ట్ డర్మటైటిస్ టు నికెల్’ అంటారు. ఈ కింది సూచనలు పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. నికెల్‌తో అలర్జీ ఉన్నవారు ఆ లోహంతో తయారైన రింగులు, దిద్దుల వంటి కృత్రిమ ఆభరణాలు ధరించడం సరికాదు.ఫ్యూసిడిక్ యాసిడ్ లాంటి తక్కువ మోతాదు కార్టికోస్టెరాయిడ్ ఉన్న యాంటీబయాటిక్ కాంబినేషన్‌తో లభించే క్రీములను గాయం ఉన్న చోట రోజుకు రెండు సార్లు చొప్పున కనీసం 10 రోజులు రాస్తే త్వరగా తగ్గుతుంది. అప్పటికీ తగ్గక పోతే డాక్టర్‌ను సంప్రదించాలి. -
జగనన్న చొరవ.. ఆ బాలుడి గొంతు పలికింది
సాక్షి, హైదరాబాద్/అమరావతి: ప్రమాదవశాత్తు స్వరపేటిక పూర్తిగా చితికిపోయి క్లిష్టపరిస్థిత్లులో చికిత్స కోసం ఎదురు చూస్తున్న తొమ్మిదేళ్ల బాలుడికి ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భరోసాతో పునర్జన్మ లభించింది. మాట కోల్పోయిన అతడు ఇప్పుడు గలగలా మాట్లాడగలుగుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ పరిధిలోని నకరికల్లుకు చెందిన షేక్ ఖాజాబీ, బాజీ దంపతులకు తొమ్మిదేళ్ల కొడుకు మహ్మద్ ఉన్నాడు. ఫిబ్రవరి 29న స్కూల్‌కి వెళ్లిన బాలుడు తోటి పిల్లలతో ఆడుకుంటూ ఇనుప చువ్వ మీద జారిపడ్డాడు. ఆ చువ్వ గొంతులో బలంగా గుచ్చుకోవడంతో అతడి శ్వాసనాళం, స్వరపేటిక పూర్తిగా చితికిపోయాయి. దీంతో మాట నిలిచిపోయి, శ్వాస పీల్చుకోవడానికి సైతం ఇబ్బందిగా మారింది. బాలుడిని నరసరావుపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా మెరుగైన వైద్యం కోసం వెంటిలేటర్ సహాయంతో అంబులెన్స్‌లో హైదరాబాద్ తరలించారు. మహ్మద్‌ను పరిశీలించిన నీలోఫర్ ఆస్పత్రి వైద్యులు శ్వాస తీసుకోవడానికి తాత్కాలికంగా ఒక కృత్రిమ పైప్ అమర్చి, మరింత మెరుగైన వైద్యం కోసం కాంటినెంటల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించారు. అరుదైన శస్త్రచికిత్సతో.. కాంటినెంటల్ హాస్పిటల్స్ లేరింగాలజిస్ట్ స్పెషలిస్ట్ దుష్యంత్ బృందం మహ్మద్‌ను పరిశీలించి అతడికి అతికష్టమైన, అరుదైన లెరింగోట్రైకెల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ చేయాలని నిర్ధారించారు. లెరింగాలజీలో ఫెలోషిప్ చేసిన నిష్ణాతులైన వైద్యులు మాత్రమే ఈ సర్జరీ చేయగలరని, ఏ మాత్రం తేడా వచ్చినా తీవ్ర నష్టం జరుగుతుందని స్పష్టం చేశారు. ఇందుకు రూ.6 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. అయితే.. అంత ఖర్చు భరించే స్తోమత లేని ఆ పేద తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. సోషల్ మీడియా ద్వారా బాలుడి ఆరోగ్య స్థితిని తెలుసుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అతడి ఆరోగ్యాన్ని చక్కదిద్దేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో ఏపీ సీఎంవో అధికారులు కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు ఫోన్‌చేసి.. బాలుడికి చికిత్సతోపాటు ఆరోగ్యం చక్కబడటానికయ్యే ఖర్చంతా ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. వెంటనే వైద్యులు బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స చేసి శ్వాసనాళాన్ని పునరుద్ధరించి.. క్లిష్టమైన స్వరపేటికను బాగు చేశారు. దీంతో బాలుడికి మాటొచ్చింది. ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు ఖాజాబీ, బాజీ మాట్లాడుతూ.. కష్టకాలంలో తమ కుటుంబాన్ని సీఎం జగన్ ఆదుకున్నారని, ఉచితంగా చికిత్స చేయించారని కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ సాయం చేయకపోతే తమబిడ్డ జీవితాంతం మూగవాడిగా ఉండేవాడని పేర్కొన్నారు. -
కేర్ వర్కర్లు కుటుంబీకుల్ని తీసుకురావద్దు
లండన్: ఇంటి పనుల్లో సాయపడే కేర్ వర్కర్లు ఇకపై తమ వెంట కుటుంబసభ్యులను బ్రిటన్‌కు తీసుకురావడానికి వీల్లేదంటూ బ్రిటన్ ప్రభుత్వం తేలి్చచెప్పింది. ఈ నూతన వలస విధానాన్ని ఈ వారం నుంచే అమలుచేసే అవకాశముంది. ఈ విషయమై బ్రిటన్ హోం శాఖ మంత్రి జేమ్స్ క్లెవెర్లీ మాట్లాడారు. ‘‘ కేర్ వీసా విధానం ద్వారా గత ఏడాది 1,00,000 మంది కేర్ వర్కర్లను బ్రిటన్‌లోకి అనుమతిచ్చాం. అయితే వారి వెంట 1,20,000 మంది డిపెండెంట్లు వచ్చారు. ఇది వీసా దుర్వినియోగాలపై మేం తీసుకుంటున్న చర్యలకు విఘాతం కల్గిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అనుమతించబోం’ అని అన్నారు. దీనికి సంబంధించిన నూతన వలస విధానాన్ని గురువారమే ప్రభుత్వం పార్లమెంట్ ముందుంచనుంది. -
మిమ్మల్ని మీరే పట్టించుకోవాలీ..!
కుటుంబ సభ్యులందరికీ కావలసిన వాటిని అమర్చడంలో పడి మహిళలు తమ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించరు. దీనివల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం ఉండదని అందరికీ తెలిసిందే. అందువల్ల ముందే మేలుకొనడం అవసరం. నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వేడుకలు జరుపుకునే ఉంటారు. అయితే అంతకన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే మహిళలు తమ ఆరోగ్యంపై కాస్త శ్రద్ధ పెట్టి సమయం కేటాయించడం. తమ వయసుకు తగ్గ పోషకాహారం తీసుకోవడం. అనారోగ్య సమస్యలను దాచిపెట్టకుండా తగిన ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. మీరు ఆరోగ్యంగా ఉంటేనే...మీ కుటుంబం ఆరోగ్యంగా ఆనందంగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి.. ఐరన్ ఉండే ఆహారం... మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన దానిలో ఐరన్ మొదటి స్థానంలో ఉంది. గర్భధారణ సమయంలో స్త్రీలకు ఐరన్ చాలా అవసరం. శరీరంలో ఐరన్ పరిమాణం తగ్గిపోవడం వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. దీనివల్ల నీరసం, అలసట, ఊపిరి అందకపోవడం వంటి సమస్యలు వస్తాయి. అందువల్ల మీ ఆహారంలో మాంసకృత్తులు, చికెన్, సీఫుడ్, బీన్స్, కాయధాన్యాలు, బచ్చలి కూర, బ్రోకలీ, బీట్రూట్, దానిమ్మ, ఖర్జూరం, తృణధాన్యాలు వంటి ఐరన్ అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. విటమిన్ ఎ తప్పనిసరి... మహిళలకు అవసరమైన విటమిన్ల జాబితాలో విటమిన్ ఎ ద్వితీయ స్థానంలో ఉంది. ఇది మహిళల పునరుత్పత్తి ఆరోగ్యానికి ముఖ్యమైన విటమిన్. ఆహారంలో విటమిన్ ఎ అధికంగా ఉండే ఆకుకూరలు, అరటి పండ్లు వంటివి తీసుకోవాలి. విటమిన్ బి 12.. విటమిన్ బి 12 అనేది జీవక్రియ కార్యకలాపాలను పెంచుతుంది. రక్తహీనతను నివారిస్తుంది, మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అందువల్ల బీ 12 సమృద్ధిగా ఉండే మాంసం, చేపలు, గుడ్లు తీసుకోవాలి. శాకాహారులు ΄÷ట్టు తియ్యని వేరసెనగపప్పు, సెనగలు, దంపుడు బియ్యం, వెన్న తియ్యని పాలు (జంతువుల నుంచి వచ్చిన పాలు) వంటివి తీసుకోవాలి. కాల్షియం... మహిళలు వయస్సు పెరిగేకొద్దీ, ఎముక సంబంధిత ఆరోగ్య సమస్యలను తరచు ఎదుర్కొంటారు. అందువల్ల, ఎముకల ఆరోగ్యానికి మహిళలు కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ముఖ్యం. ఇందుకోసం పాలు, గుడ్డు, నువ్వులు వంటివి తీసుకోవాలి. విటమిన్ డి... ఈ జాబితాలో విటమిన్ డి తర్వాతి స్థానంలో ఉంది. విటమిన్ డి మన శరీరం కాల్షియాన్ని గ్రహించడంలో సహాయపడుతుంది. ఇది ఎముకలు, దంతాల పెరుగుదలకు సహాయపడుతుంది. మెగ్నీషియం... మెగ్నీషియం కూడా స్త్రీలకు కావలసిన అతి ముఖ్యమైన పోషకం. కండరాల బలం ఎముకల ఆరోగ్యానికి మెగ్నీషియం అవసరం. మహిళలు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ పరీక్షలు అవసరం.. భారతదేశంలో మహిళలు రక్తహీనతతో బాధపడుతున్నారు.. ఎన్నో గణాంకాలు స్త్రీలల్లో ఐరన్ లోపం ఉంది అని చెబుతున్నాయి. కనీసం 10 శాతం కూడా హిమోగ్లోబిన్ ఉండటం లేదు. ఈ పరిస్థితిని ఇలానే నిర్లక్ష్యం చేయడం వల్ల తీవ్రమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.. ముఖ్యంగా ఇది బ్లడ్ క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. అందువల్ల అత్యవసరమైన సీబీపీ అంటే కంప్లీట్ బ్లడ్ పిక్చర్, థైరాయిడ్, విటమిన్ పరీక్షలు, కాల్షియం, కొలెస్ట్రాల్, ఐరన్ వంటి పరీక్షలను చేయించుకోవడం అవసరం. ఇవి చదవండి: సమాజాన్ని అద్దంలో చూపించాను -
మానసిక ఆరోగ్య సంరక్షణలో ఏపీ భేష్
సాక్షి, అమరావతి: ప్రజల మానసిక ఆరోగ్య సంరక్షణకు ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు భేషుగ్గా ఉంటున్నాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రశంసించింది. దేశంలో మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి సేవలందించడం, వారి హక్కులను కాపాడటమే లక్ష్యంగా మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని 2017లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. చట్టం అమలుపై రాష్ట్రాలకు పలు మార్గదర్శకాలిచ్చింది. కాగా, చట్టం అమల్లో భాగంగా సీఎం జగన్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలను ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయని ఇటీవల ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ మెంటల్ హెల్త్ వర్క్‌షాప్‌లో కేంద్ర ఆరోగ్య శాఖ కితాబిచ్చింది. మన రాష్ట్రం అవలంభిస్తున్న విధానాలను త్వరలో ప్రత్యేకంగా తెలుసుకుంటామని కేంద్ర ఆరోగ్య శాఖ అడిషనల్ సెక్రటరీ ఎల్ఎస్ ఛాంగ్సన్ పేర్కొన్నారు. ప్రత్యేక బోర్డ్‌ల ఏర్పాటు మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం అమల్లో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే స్టేట్ మెంటల్ హెల్త్ అథారిటీ(ఎస్‌ఎంహెచ్‌ఏ)తో పాటు, విశాఖపట్నం, ఎన్టీఆర్, వైఎస్సార్, తిరుపతి జిల్లాల్లో రీజినల్ రివ్యూ బోర్డ్‌ల ఏర్పాటును చేపట్టింది. ఎస్ఎంహెచ్ఏలో రాష్ట్రంలో మానసిక రోగులకు చికిత్సలు అందించేలా ఆస్పత్రుల రిజి్రస్టేషన్ ప్రక్రియ మొదలైంది. ఇప్పటి వరకూ 52 మెంటల్ హెల్త్ ఇన్స్టిట్యూషన్లు రిజిస్ట్రర్ చేసుకున్నాయి. మరోవైపు మానసిక స్థితి సరిగా లేక, రోడ్లపై తిరిగే నిరాశ్రయులను ఆదుకునే చర్యల్లో భాగంగా శ్రద్ధ రిహెబిలిటేషన్ ఫౌండేషన్‌తో వైద్య శాఖ ఎంవోయూ చేసుకుంది. మానసిక స్థితి సరిగా లేక రోడ్లపై తిరిగే వారిని గుర్తించి శ్రద్ధ ఫౌండేషన్ ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ వంద మంది బాధితులకు చికిత్సలు అందించి, వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చారు. మరోవైపు యువతలో ఆత్మహత్యల నియంత్రణకు ఎమోషనల్ అసెస్మెంట్ ఆఫ్ స్టూడెంట్స్ బై ఎడ్యుకేటర్స్, రెఫరల్ ఇన్ ఏపీ(ఈఏఎస్‌ఈ) కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. నిమ్హాన్స్, అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియా ఆరిజన్(ఆపీ) వంటి ప్రముఖ సంస్థలు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నాయి. ఇప్పటి వరకూ మూడు వేల మందికిపైగా ఎంబీబీఎస్ విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. -
ఇక్కడి వాళ్లు విదేశాల్లో చనిపోయారా? డెడ్ బాడీ తేవడానికి ఒక పోర్టల్
విదేశాల్లో భారతీయ పౌరులు మరణించినప్పుడు, వారి మృతదేహాలను భారతదేశానికి తీసుకువచ్చే ప్రక్రియ ఇకపై మరింత సులభతరం కానుంది. దీని కోసం అన్ని ఎయిర్‌లైన్స్ ఏజెన్సీలు ‘ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫామ్’ను ప్రారంభించాయి. ఫలితంగా విదేశాలలో మరణించిన వ్యక్తి సంబంధీకులు కేవలం దరఖాస్తు చేస్తే సరిపోతుంది. ఈ దరఖాస్తును ఆమోదించి, విదేశాల నుంచి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియను సంబంధిత అధికారులు ఫాస్ట్‌ట్రాక్ పద్ధతిలో చేపట్టనున్నారు. సుదీర్ఘ ప్రక్రియ.. ఇకపై సులభతరం! ఇన్నాళ్లూ భారతీయ పౌరులెవరైనా విదేశాల్లో మరణిస్తే, వారి మృతదేహాలను తీసుకురావడానికి కుటుంబ సభ్యులు సుదీర్ఘ ప్రక్రియను అనుసరించాల్సి వచ్చేది. ఒక్కోసారి వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టేది. అసాధారణ పరిస్థితుల్లో ఎవరైనా మృతి చెందిన సందర్బంలో వారి మృతదేహాలను తీసుకువచ్చేందుకు మరింత సమయం పట్టేది. ఇటువంటప్పుడు కొన్నిసార్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా జోక్యం చేసుకోవాల్సి అవసరం కూడా ఏర్పడేది. ఈ నేపధ్యంలోనే విదేశాల నుంచి భారతీయుల మృతదేహాలను తీసుకొచ్చే ప్రక్రియను సడలించాలన్న డిమాండ్ గత కొంతకాలంగా వినిపిస్తోంది. ఇప్పుడు ఈ దిశగా సానుకూల చర్యలు మొదలయ్యాయి. ‘ఓపెన్ ఈ- కేర్’ అంటే ఏమిటి? ఓపెన్ ఈ-కేర్ ప్లాట్‌ఫారమ్‌ను అన్ని ఎయిర్‌లైన్స్ కంపెనీలు కలిసి సిద్ధం చేశాయి. ఇక నుంచి విదేశాల్లో ఎవరైనా భారతీయ పౌరులు మరణిస్తే మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం మరణించిన వ్యక్తి కుటుంబంలోని ఎవరైనా సభ్యుడు మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు అవసరమైన పత్రాలతో కూడిన దరఖాస్తును సంబంధిత అధికారులు తనిఖీ చేసిన తర్వాత, మృతదేహాలను తీసుకువచ్చే ప్రక్రియను వీలైనంత త్వరగా జరుగుతుంది. 48 గంటల్లోగా ఆమోదం విదేశాల్లో ఉన్న భారతీయుల మృత దేహాలను తిరిగి తీసుకురావడంలో జాప్యాన్ని నివారించేందుకు ఈ- పోర్టల్‌ను తీసుకువస్తున్నట్లు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ప్రకటించారు. ఈ- పోర్టల్ ద్వారా సెంట్రల్ ఇంటర్నేషనల్ హెల్త్ డివిజన్, నోడల్ అధికారులు, రవాణాదారులు, విమానయాన సంస్థలు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, వాట్సాప్‌ల ద్వారా సమాచారం పొందుతాయని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ కోసం నియమితులైన నోడల్ అధికారి దరఖాస్తును తనిఖీ చేసి, 48 గంటల్లోగా ఆమోదం తెలియజేస్తారు. రిజిస్టర్డ్ నంబర్ ద్వారా అప్లికేషన్ స్థితిని ఈ-కేర్ పోర్టల్‌లో సందర్శించవచ్చు. ఇది కూడా చదవండి: నేటికీ పాక్‌ను వణికిస్తున్న హిందూ వ్యాపారి ప్యాలెస్ -
పిల్లల్ని కంటే రూ.5.6 లక్షలు.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్!
ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న చైనా ఇప్పుడు యువత జనాభా తగ్గి వయసు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ జంటలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో చైనాలో అతిపెద్ద ట్రావెల్ ఏజెన్సీ ట్రిప్ డాట్ కామ్ తమ ఉద్యోగులకు బంపరాఫర్ ఇచ్చింది. ఐదేళ్లలో రూ.5.6 లక్షలు కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 10,000 యువాన్లు (రూ.1.1 లక్షలు) చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామని ట్రిప్ డాట్ కామ్ సంస్థ ప్రకటించింది. అంటే ఒక్కో బిడ్డకు ఐదేళ్లలో మొత్తంగా 50,000 యువాన్లు (రూ.5.6 లక్షలు) లభిస్తాయి. జూన్ 30న ప్రకటించిన ఈ ఆఫర్ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది. వారికి మాత్రమే.. ఈ చైల్డ్ కేర్ బినిఫిట్లు కంపెనీలో మూడేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. "మా ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీ పడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్‌కేర్ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాం" అని ట్రిప్ డాట్ కామ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జేమ్స్ లియాంగ్ చెప్పినట్లుగా సీఎన్ఎన్ వార్తా కథనం పేర్కొంది. కాగా చైల్డ్ కేర్ బినిఫిట్ల కోసం కంపెనీకి సుమారు 1 బిలియన్ యువాన్ (దాదాపు రూ.1131 కోట్లు) ఖర్చు అవుతుంది. చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఈ తరహాలో చైల్డ్ కేర్ బినిఫిట్లు ప్రారంభించడం ఇదే తొలిసారి. చైనా జననాల రేటు గత ఏడాది 1,000 మందికి గానూ 6.77 జననాలకు పడిపోయింది. ఇది 2021లో 7.52 జననాలుగా ఉండేది. ఇది రికార్డ్ స్థాయి అత్యంత తక్కువ జననాల రేటు. కొత్త తరం జనాభాను ప్రోత్సహించేందుకు 2021లో చైనా ప్రభుత్వం ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇచ్చారు. కోవిడ్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ పిల్లలను కనడంపై జంటలు ఆసక్తి చూపించలేదు. తక్కువ ఆదాయం, పెరిగిన పిల్లల సంరక్షణ, విద్యా ఖర్చులు వంటివి ఇందుకు కారకాలుగా ఉన్నాయి. ఇదీ చదవండి: గుడ్‌న్యూస్.. డబుల్ డిజిట్ బాటలో వేతన ఇంక్రిమెంట్లు -
మీకోసం మీరు ఆలోచించండి.. ఈ పదిహేను మీ కోసమే మరి! (ఫొటోలు)
-
మీ బంగారం స్వచ్ఛమైనదేనా?నకిలీదా..మొబైల్ లోనే ఇలా చెక్ చేసుకోండి..
-
వేసవి నేపథ్యంలో నెహ్రు జూపార్కులో ప్రత్యేక ఏర్పాట్లు
-
సుందరం ఫైనాన్స్ నుంచి కేర్ హెల్త్
చెన్నై: ఎన్బీఎఫ్సీ దిగ్గజం సుందరం ఫైనాన్స్ తమ కస్టమర్లకు ప్రత్యేకించిన ఆరోగ్య బీమా ప్రొడక్టులను అందించనుంది. ఇందుకు వీలుగా కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో ఒప్పందంపై సంతకాలు చేసింది. కంపెనీకి గల విస్తారమైన నెట్వర్క్ ద్వారా కేర్ హెల్త్‌కు సంబంధించిన కొత్త తరహా బీమా సొల్యూషన్లను కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. రిటైల్, గ్రూప్ విభాగాల్లో ఆరోగ్య బీమా ప్రొడక్టులను విక్రయించనుంది. టెక్నాలజీ ఆధారంగా కంపెనీ ఇప్పటికే సమకూరుస్తున్న సేవలకుతోడు కస్టమర్ల ప్రాధాన్యతకు అనుగుణమైన ఆరోగ్య బీమా ప్రొడక్టులను సైతం అందించనున్నట్లు సుందరం ఫైనాన్స్ పేర్కొంది. వెరసి వివిధ బీమా అవసరాలకు తగిన సొల్యూషన్స్‌ను ఒకే చోట సమకూర్చనున్నట్లు తెలియజేసింది. -
నటి ప్రియాంక బిజినెస్ ప్లాన్స్: నా బ్యూటీకి దేశీ ఉత్పత్తులనే వాడతా
ముంబై: బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా జోనాస్ తన హెయిర్‌కేర్ బ్రాండ్ అనోమలీని ఇండియాలో లాంచ్ చేసింది. ఇందుకోసం నైకా బ్రాండ్ కింద సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయించే బ్యూటీ అండ్ వెల్నెస్ ఈ–కామర్స్ సంస్థ ఎఫ్ఎస్ఎన్తో డీల్ కుదుర్చుకుంది. అనామలీ పేరిట శిరోజాల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన సొంత బ్రాండ్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టారు. లాంచ్ సందర్భంగా, జోనాస్ మాట్లాడుతూ, తాను ఇప్పటికీ rouge, పెరుగు, తేనె లాంటి భారతీయ సాంప్రదాయ సౌందర్య సంరక్షణ పద్ధతులను ఉపయోగించడాన్ని ఇష్టపడతానని, ఈ నేపథ్యంలోనే కురుల సంరక్షణకు సంబంధించి భారతీయ సంప్రదాయ విధానాల స్ఫూర్తితో సహజసిద్ధమైన ప్రకృతి వనరుల నుంచి వీటిని ఉత్పత్తి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. (ఫెస్టివ్ సీజన్: గుడ్‌న్యూస్ 75 వేల ఉద్యోగాలు) "అనోమలీ హెయిర్కేర్ను భారతదేశానికి తీసుకురావడం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక్కడే పుట్టిన ఈ బ్రాండ్ ఇండియా లాంచ్ చాలా ప్రత్యేక మైందని ప్రియాకం చెప్పారు. ప్రకృతి, వృక్షాలతో భారతీయ సౌందర్యం ఇమిడిపోయిందని ఆమె అన్నారు.గత మూడు, నాలుగు సంవత్సరాలలో భారతీయ అందాల విభాగం బాగా వృద్దిచెందిందని నైకా సీఈఓ, ఈ-కామర్స్ బ్యూటీ, అంచిత్ నాయర్ వ్యాఖ్యానించారు.(jobmarket: ఉద్యోగాలపై ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్! తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) View this post on Instagram A post shared by Team Priyanka Chopra Jonas (@team_pc_) -
అత్తను గెంటేసిన కోడళ్లు! అనాథగా మారిన అవ్వ
నా అనుకున్న వారు ఇంకా కళ్ల ముందే ఉన్నారు. రూ.లక్షలు విలువ చేసే ఆస్తిపాస్తులున్నాయి. ఒకరిపై ఆధారపడనవసరం లేదు. అయినా ఆ వృద్ధురాలు వీధిన పడింది. డబ్బు ముందు మానవ సంబంధాలు అడుగంటడంతో ఏడు పదుల వయసులో ఇతరుల దయాదాక్షిణ్యాలపై బతుకు బండి లాగిస్తోంది. రాప్తాడు/అనంతపురం కల్చరల్: రాప్తాడు మండలం గంగులకుంట గ్రామానికి చెందిన నారాయణమ్మకు 74 ఏళ్లు. ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన గొర్రెల కాపరి సిద్దన్నతో ఆమెకు వివాహమైంది. పెళ్లి అనంతరం గంగులకుంటలోనే వారు స్థిరపడ్డారు. వీరికి ఒక్కగానొక్క కుమారుడు లక్ష్మీనారాయణ సంతానం. కొడుకు మృతితో కష్టాలు మొదలు దాదాపు 20 ఏళ్ల క్రితం సిద్దన్న మృతి చెందాడు. అప్పటి నుంచి తల్లి, కుమారుడు కలిసే ఉంటున్నారు. తండ్రి బతికున్నప్పుడే కుమారుడు లక్ష్మీనారాయణ రాప్తాడుకు చెందిన ఓబుళమ్మను పెళ్లి చేసుకున్నాడు. వీరికి సంతానం కాకపోవడంతో రెండో పెళ్లికి లక్ష్మీనారాయణ సిద్ధమయ్యాడు. ఆ సమయంలో మేనమామ కుమార్తె లక్ష్మీదేవి అయితే తన తల్లిని బాగా చూసుకుంటుందని భావించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కొడుకున్నంత కాలం తల్లికి ఏ కష్టమూ రాలేదు. పదేళ్ల క్రితం పిడుగుపాటుకు గురై లక్ష్మీనారాయణ మృతి చెందాడు. ఆ తర్వాత నారాయణమ్మకు కష్టాలు మొదలయ్యాయి. జీమాను కట్టనే దిక్కు భర్త మరణించే నాటికి నారాయణమ్మ పేరుపై 12 సెంట్ల దొడ్డి, 6 ఎకరాల మెట్ట పొలం, రెండు ఇళ్లు, కొంత నగదు ఉండేది. స్థిరాస్తుల విలువ రూ. లక్షల్లోనే ఉంటుంది. ఈ క్రమంలో కోడళ్లు చెరి సగం డబ్బు పంచుకుని నారాయణమ్మను పట్టించుకోకపోవడంతో ఆమె ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. నా అనుకున్న తమ్ముడు సైతం కుమార్తె సుఖం కోసం అక్కను పట్టించుకోవడం మానేశాడు. ఆత్మాభిమానం.. అమాయకత్వమున్న నారాయణమ్మ ఎవరు చెప్పినా వినకుండా గ్రామం మధ్యలో జీమాను కట్టను ఆశ్రయించింది. మొండితనం... మంకుపట్టు జీమాను కట్టపై జీవనం సాగిస్తున్న నారాయణమ్మ తన ఇంటికి వెళ్లేందుకు ససేమిరా అంటోంది. స్థానికులు ఎంత నచ్చచెప్పినా వినకుండా కోడళ్ల ముఖం చూడనని భీష్మించుకుంది. దీంతో నారాయణమ్మకు ఏమైనా జరిగితే గ్రామానికి చెడ్డపేరు వస్తుందని భావించిన గ్రామస్తులే ఏ పూటకా పూట తిండి పెట్టి బాగోగులు చూస్తున్నారు. అధికారులు స్పందించి నారాయణమ్మ విషయంలో జోక్యం చేసుకుని ఆమె శేష జీవితం ప్రశాంతంగా సాగిపోయేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. (చదవండి: అతనికి అప్పటికే రెండు పెళ్లిళ్లు...ప్రేమ పేరుతో బాలికతో మరో పెళ్లి) -
విధులకు రాం.. జీతం మింగేస్తాం
టౌన్‌ప్లానింగ్ విభాగంలో చైన్‌మ్యాన్‌గా పనిచేస్తున్న సూర్యనారాయణ దాదాపు 8 నెలలుగా పత్తాలేడు. జీతం మాత్రం నెలనెలా దాదాపు రూ. 25 వేలకు పైగా ఠంచనుగా ఆయన ఖాతాకు చేరుతోంది. కారుణ్య నియామకం కింద ఉద్యోగం సంపాదించుకున్న ఈయన విధులకే హాజరుకావడం లేదు. సెలవులకూ దరఖాస్తు చేసుకోలేదు. సంబంధిత విభాగం అధికారి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు.ఇంజినీరింగ్ విభాగంలో ఏకైక వర్క్ ఇన్స్పెక్టర్గా ఉన్న మాధవరెడ్డి కొన్ని నెలల క్రితం దిశ యాక్టు కింద కేసు నమోదు కావడంతో అరెస్ట్ అయ్యాడు. అనేక సంవత్సరాలుగా ఉద్యోగానికి రాకపోయినా అధికారులు పట్టించుకోలేదని, దీంతో అమ్మాయిలకు వల వేయడమే పనిగా పెట్టుకున్న ఇతని బండారం చివరికి ఓ బాధితురాలి ఫిర్యాదుతో బయటపడిందని నగరపాలక సంస్థలో చర్చించుకుంటున్నారు. అనంతపురం సెంట్రల్: నగరపాలకసంస్థలో ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉద్యోగులు తయారయ్యారు. సంబంధిత విభాగపు అధికారిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఉద్యోగానికి వచ్చినా రాకపోయినా అడిగే నాథుడు లేరనే ధీమాతో పలువురు ఉన్నారు. పింఛన్ విభాగంలో ఓ రెగ్యులర్ అటెండర్ ఉద్యోగానికి సంవత్సరాల పాటు రాకపోవడంతో ‘సాక్షి’లో కొన్ని రోజుల క్రితం కథనం వెలువడింది. దీంతో ఆయన ఇటీవల కాలంలో చుట్టపుచూపుగానైనా వస్తున్నారు. అయితే, ఇలాంటి అధికారులు నగరపాలకసంస్థలో కోకొల్లలుగా ఉన్నారని ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆయా విభాగాలకు చెందిన అధికారులను మచ్చిక చేసుకుని విధులకు డుమ్మా కొడుతున్నట్లు తెలిసింది. కార్యాలయానికి ఉదయం వచ్చే అధికారుల్లో సగం మంది మధ్యాహ్నానికల్లా కనిపించడం లేదు. కింది స్థాయి సిబ్బందిపై నిఘా లేకపోవడంతో ఇతరత్రా ప్రైవేటు కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు. కొంతమంది కార్యాలయంలోనే వేరే విభాగాల్లో పనులు చేయిస్తూ దళారుల అవతారం ఎత్తుతుంటే, మరికొందరు రియల్ ఎస్టేట్, ఇతరత్రా పనులు చేసుకుంటున్నట్లు సమాచారం. చాలా నెలలుగా ఇదే పరిస్థితి. కొత్త కమిషనర్ భాగ్యలక్ష్మి దృష్టి సారిస్తే ఉద్యోగులు దారికొస్తారని పలువురు చెబుతున్నారు. సార్ తిట్టాడని రాలేదు విధులకు సక్రమంగా రాకపోవడంతో చైన్‌మ్యాన్ సూర్యనారాయణను గతంలో ఉన్న కమిషనర్ తిట్టారు. దీంతో ఆయన విధులకు రావడం లేదు. ఎలాంటి సెలవు కూడా పెట్టలేదు. దీనిపై అదనపు కమిషనర్‌కు రిపోర్టు చేశాం. సీసీఏ రూల్స్ ప్రకారం అతనిపై చర్యలు ఉంటాయి. – శాస్త్రి, ఏసీపీ, టౌన్‌ప్లానింగ్ (చదవండి: రోజూ చిల్లరకొట్టుకు వస్తూ.. నిర్వాహకుడి కూతురిని ట్రాప్ చేసి..) -
ప్రత్యేక అవసరాలున్న చిన్నారులకు బీమా ప్లాన్
న్యూఢిల్లీ: పిల్లల మానసిక ఆరోగ్యం కోసం పని చేసే మామ్స్బిలీఫ్ సంస్థ ప్రత్యేక అవసరాలున్న చిన్నారుల కోసం (ఆటిజం, డౌన్స్ సిండ్రోమ్, నేర్చుకోలేకపోవడం తదితర) బీమా ప్లాన్‌ను తీసుకొచి్చంది. ‘మామ్స్ బిలీఫ్ కేర్–ఆది్వక్ చైల్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్’ను కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ భాగస్వామ్యంతో గురువారం ఆవిష్కరించింది. ప్రత్యేక అవసరాలతోపాటు, శ్రద్ధ అవసరమైన చిన్నారుల చికిత్సా వ్యయాలకు రూ.1.5–4 లక్షల మధ్య కవరేజీనిస్తుంది. ఈ ప్లాన్‌లో రూ.1.5 లక్షల కవరేజీకి ప్రీమియం సుమారు రూ.22,000గా ఉంది. ‘‘ఎదుగుదలకు సంబంధించి సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల అభివృద్ధే మా డీఎన్ఏ. 0–15 ఏళ్ల మధ్యనున్న ఉన్నవారి కోసం ప్రతి నెలా 30,000 సెషన్లు నిర్వహిస్తున్నాం’’ అని మామ్స్ బిలీఫ్ సీఈవో నితిన్ బిండ్లిష్ తెలిపారు. -
ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి.. ఆకతాయిలు వేధిస్తుండడంతో..
రంగంపేట: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి రంగంపేట మండలం జి.దొంతమూరు గ్రామంలో ప్రత్యక్షమైంది. సుమారు 21 ఏళ్ల వయస్సున్న యువతి గురువారం దొంతమూరు శివారు హైస్కూల్ వద్ద తోటలో ఉండగా కొందరు ఆకతాయిలు వేధిస్తుండడంతో స్థానిక వలంటీర్లు గుర్తించారు. వారి నుంచి రక్షించి ఆ యువతిని వివరాలు అడగగా తన పేరు గీతమ్మ అని, ఊరు బందర్ అని మాత్రమే చెబుతోంది. చదవండి: ExtraMarital Affair: మామా నీ కూతుర్ని చంపేశా.. ఇంక ఎటువంటి వివరాలు చెప్పలేకపోతోంది. మతిస్థిమితం లేకపోయిన ఆమెను గ్రామ సచివాలయం వద్దకు తీసుకువచ్చారు. మహిళా పోలీస్ పద్మావతి ద్వారా అంగన్వాడీ, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. వారు వచ్చి యువతిని శుభ్రపరచి బట్టలిచ్చి, అన్నం పెట్టారు. అనంతరం ఆ యవతిని రామచంద్రాపురం సంరక్షణ కేంద్రానికి తరలించారు. చదవండి: నకిలీ ఫేస్బుక్ క్రియేట్ చేసి ఫ్రెండ్ రిక్వెస్ట్.. ఓకే చేయగానే.. -
ఫార్మాలో రూ.81,730 కోట్ల వ్యాపార అవకాశం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కోవిడ్–19 వ్యాక్సిన్ సరఫరా భారత ఔషధ రంగానికి కాసులు కురిపించనుంది. ఇక్కడి తయారీ సంస్థలకు భారత్‌తోపాటు, అంతర్జాతీయంగా వచ్చే మూడేళ్లలో రూ.81,730 కోట్ల వరకు వ్యాపార అవకాశాలు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ వెల్లడించింది. ‘వ్యాక్సిన్ల విక్రయం ద్వారా యూఎస్ సంస్థలు ప్రీమియం ధరలను ఆస్వాదిస్తున్నాయి. ప్రస్తుతం ఈ ధరలు ఒక్కో డోసుకి రూ.1,114.5 నుంచి రూ.1,857.5 వరకు ఉంది. ఒక్కో డోసుపై రూ.260 వరకు లాభం గడిస్తున్నాయి. భారతీయ వ్యాక్సిన్ తయారీదారులు ప్రీమియం ధరను పొందే అవకాశం లేదు’ అని వివరించింది. అంతర్జాతీయంగా ఇలా.. దేశీయ డిమాండ్‌లో ఎక్కువ భాగం మార్చి 2022 నాటికి నెరవేరుతుందని అంచనా. యూరప్, ఉత్తర అమెరికా, అభివృద్ధి చెందిన ఆసియా దేశాల వంటి అధిక ఆదాయ మార్కెట్లలో ఎగుమతి అవకాశాలు పూర్తిగా అయిపోయాయి. చైనా, జపాన్, కొన్ని దక్షిణ అమెరికా దేశాలను మినహాయించి వివిధ ఆఫ్రికా, ఆసియా దేశాలలో ఎగుమతికి ఆస్కారం ఉంది. ఇక్కడ టీకా వేగం చాలా నెమ్మదిగా కొనసాగుతోంది. డిమాండ్ 125 కోట్ల డోసుల కంటే ఎక్కువగా ఉంటుందని అంచనా. అంతర్జాతీయంగా ఆగస్ట్ 10 నాటికి 435 కోట్ల డోసుల కోవిడ్–19 వ్యాక్సిన్స్ నమోదయ్యాయి. భారత్‌లో అవకాశాలు.. వ్యాక్సినేషన్లో భాగంగా ఆగస్ట్ 10 నాటికి భారత్‌లో 50 కోట్ల డోసులు నమోదయ్యాయి. దేశంలో మరో 200 కోట్ల డోసులు అవసరం. ఇక్కడ రోజుకు 50–55 లక్షల డోసుల స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరుగుతోంది. డిమాండ్‌కు తగ్గ సరఫరా లేదు. ఈ ఏడాది జనాభాలో అత్యధికులకు వ్యాక్సినేషన్ పూర్తి కావొచ్చని అంచనా. ఈ కాలంలో భారత ఫార్మా సంస్థలకు రూ.34,180 కోట్ల వ్యాపార అవకాశం ఉంటుంది. ఎగుమతులు పెరగడంతో ఇది వచ్చే ఏడాది నాటికి రూ.36,410 కోట్లకు చేరుకుంటుంది. 2023లో డిమాండ్ రూ.11,890 కోట్లకు పరిమితం అవుతుంది’ అని కేర్ రేటింగ్స్ తన నివేదికలో వెల్లడించింది. -
ఏపీ: ఆలయాల్లో ప్రభుత్వ కోవిడ్ కేర్ సెంటర్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ విపత్తు వేళ రోగులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రముఖ దేవాలయాల్లో కోవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 16 పెద్ద ఆలయాల ఆధ్వర్యంలో వెయ్యి పడకలతో కోవిడ్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్టు దేవదాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు చోట్ల చిన్న కోవిడ్ కేర్ సెంటర్లలో 25 వరకు బెడ్లను, చాలాచోట్ల వంద వరకు బెడ్లను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కోవిడ్ కేర్ సెంటర్లో మూడు/నాలుగు ఆక్సిజన్ పడకలను సిద్ధంగా ఉంచారు. వైద్యుల పర్యవేక్షణ నుంచి ప్రాథమిక చికిత్స వరకు.. కోవిడ్ కేర్ సెంటర్లలో వైద్యుల పర్యవేక్షణలో రోగులకు ప్రాథమిక చికిత్స అందించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం శ్రీ వీర వేంకట సత్యనారాయణస్వామి ఆలయం, పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం, విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్లలో ఇప్పటికే వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. వీటితోపాటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్యనారాయణస్వామి ఆలయం, విశాఖ జిల్లా సింహాచలం, గుంటూరు జిల్లా పెదకాకాని, ప్రకాశం జిల్లా సింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి ఆలయం, నెల్లూరు జిల్లా జొన్నవాడ ఆలయం, కర్నూలు జిల్లా శ్రీశైలం, మహానంది, ఉరుకొంద ఆలయాలు, వైఎస్సార్ జిల్లా గండి, అనంతపురం జిల్లా కసాపురం, చిత్తూరు జిల్లా కాణిపాకం, శ్రీకాళహస్తి, చౌడేపల్లి మండలం దిగువపల్లి ఆలయాల ఆధ్వర్యంలో కోవిడ్ కేర్ సెంటర్ల ఏర్పాటు దాదాపు పూర్తయినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. చదవండి: ఏపీ: జూన్ 22న వైఎస్సార్ చేయూత పలు రైళ్ల దారి మళ్లింపు -
కరోనా :ఎవరి జాగ్రత్తలపై వారి శ్రద్ధ ఉండాలి
-
సంద్రం ఒడిలోకి తాబేళ్ల పిల్లలు
ఇచ్ఛాపురం రూరల్: సముద్ర తాబేళ్లను రక్షించుకునే బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని బూర్జపాడు సర్పంచ్ బుడ్డ మోహనాంగి అన్నారు. డొంకూరు మత్స్యకార గ్రామంలో ట్రీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక తీరం ఒడ్డున కొంత కాలంగా తాబేళ్ల గుడ్లను సేకరిస్తూ పిల్లలు పొదిగేంత వరకు వాటిని సంరక్షిస్తూ సముద్రంలో విడిచిపెడుతుండేవారు. శుక్రవారం రాత్రి సుమారు 300 తాబేళ్ల పిల్లలను ఆమె విడిచిపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు బుడ్డ కాంతారావు, మత్స్యకార సొసైటీ అధ్యక్షుడు చీకటి గురుమూర్తి, ట్రీ ఫౌండేషన్ సంరక్షకులు పాల్గొన్నారు. చదవండి: కాళ్లు చేతులు కదలవు.. కానీ డ్యాన్స్ మాత్రం.. ఫలరాజు.. ఎగుమతుల్లో రారాజు -
ఆడపిల్ల కోసం ఓ తండ్రి ఆవేదన
-
సాయం చేయడంలో ఉన్న ఆనందం
మా చిన్నమ్మాయి తన వృద్ధ తల్లిదండ్రులను చూడటానికి రోజూ సాయంత్రం వస్తుంటుంది. ఒకరోజు తనతో ఒకమ్మాయిని వెంటబెట్టుకొ చ్చింది. తన ‘మెంటీ’ (మెంటర్ పర్యవేక్షించేది మెంటీ) అని పరిచయం చేసింది. ఈ పదం నిఘంటువులో ఉందో లేదో నాకు తెలియదు. నీనా చెప్పేదే మంటే ఆ అమ్మాయికి తానో మార్గదర్శిలా ఉంటున్నా నని. నా పెద్దకూతురు ఆనా కూడా ఇంకో అమ్మాయిని ఇలా చూసుకుంటోంది. ఈ ఇద్దరు ‘మెంటీలు’ తమ హైస్కూలు పూర్తి చేసుకుంటున్నారు. తమ స్పోకెన్ ఇంగ్లిష్‌ను మెరుగు పరుచుకుంటున్నారు. ఈ అమ్మాయిలను నా కూతుళ్లు కలవడం ఎలా తటస్థించింది? ఢిల్లీ నుంచి ముంబయి వెళ్తున్న విమానంలో ఒక మహిళ నీనాకు తారసపడింది. కలిగిన కుటుంబాల వాళ్లు ఇట్లా ఇళ్లల్లో పనిచేసుకునే కుటుం బాల ఆడపిల్లలను మెరుగుపరిచే ప్రాజెక్టు ఒకటి నడుస్తోందట. అధునాతన మహిళలతో గనక ఆ పేద ఆడ పిల్లల సంపర్కం జరిగితే వాళ్లు కనీసం జీవితంలో ఊహించను కూడా లేని ఉద్యోగాల్లోకి ప్రవేశించగలిగే ఆత్మవిశ్వాసం వారికి కలుగుతుంది. ఇలాంటి ఆడపిల్లల తండ్రులు కార్లు నడుపుతుంటే, తల్లులేమో ఇళ్లల్లో పని చేస్తున్నారు. ఆనా మార్గదర్శనం చేస్తున్న ముస్లిం అమ్మాయి జూనియర్ కాలేజీలో చదువుతోంది. నీనా చూసుకుంటున్న అమ్మాయి ముంబయిలో ఉంటున్న కొంకణ్ ప్రాంతీయురాలు. ఈ అమ్మాయిలను ఇట్లా కలిసేలా చేసిన సంస్థ ఢిల్లీలో సుమారు మూడు దశాబ్దాలుగా పనిచేస్తోంది. దాని పేరు ఉదయన్ కేర్. 2016 నుంచీ దాని కార్యకలాపాలు ముంబయికి విస్తరించాయి. ఆ సంస్థ మార్గదర్శనంలో ఒకమ్మాయి బ్రిటన్‌లో సైన్సులో పీహెచ్డీ చేసింది. కిరణ్ మోదీ 27 ఏళ్ల కింద ఉదయన్ కేర్ ప్రారంభించారు. దీనికి దేశవ్యాప్తంగా ఇరవైకి పైగా కేంద్రాలున్నాయి. పదివేలమంది అమ్మాయిల జీవితాల్లో ఉదయన్ మార్పు తేగలిగింది. ఇలాంటి అంకితభావాన్నే నేను శాంతా క్రూజ్‌లో చూశాను. అక్కడ మాజీ ఎంపీ విఠల్ బాలకృష్ణ గాంధీ నెలకొల్పిన యూఎస్వీ ఫార్మా కంపెనీ ఉంటుంది. దానికి ఇప్పుడు చైర్‌పర్సన్‌గా ఉన్న ఆయన మనవరాలు లీనా గాంధీ తివారీ వాళ్ల నానమ్మ సుశీలా గాంధీ పేరు మీదుగా ఈ దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. కార్పొరోట్ సామాజిక బాధ్యత అనే నియ మాలు రాకపూర్వం నుంచే లీనా కంపెనీ చుట్టుపక్కల ఉండే పేదమ్మాయిలను విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో మునిగివుంది. ఈమెను నేను మా ఐపీఎస్ బ్యాచ్‌మేట్ సోనమ్ వాళ్లింట్లో కలిశాను. ముందు డాన్సు క్లాసులు, తర్వాత డ్రామా క్లాసులు పెట్టగానే ఆ పిల్లలు ఆకర్షితులయ్యారట. నెమ్మదిగా వారికి స్పోకెన్ ఇంగ్లిష్, లెక్కలు చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ల భర్త ప్రశాంత్ లెక్కలు చెబుతాడు. పాతవాళ్లు, కొత్తవాళ్లు అందరి పేర్లూ లీనాకు తెలుసు. నాకు తెలిసిన ఇంకో ముస్లిం మహిళ ముంతాజ్ బాట్లీవాలా తన సంపాదనలోంచి చాలా పెద్దమొత్తం పేద ముస్లిం ఆడపిల్లల కోసం ఖర్చుచేస్తోంది. ముంతాజ్, ఇంకా వాళ్ల చెల్లె షానీమ్ వాళ్ల వారసత్వపు ఇంటిని అనాథాశ్రమంగా మార్చారు. సుమారు యాభై మంది అందులో ఉండి చదువుకుంటున్నారు. ముంతాజ్ యోగా గురువు బీకేఎస్ అయ్యంగార్ శిష్యురాలు. ఆయన ఉన్నరోజుల్లో ప్రతి సంవత్సరం అక్కడికి వచ్చేవారు. ఆశ్రమం సాయంత్రం క్లాసుల్లో యోగా తప్పనిసరి. చూడాలేగానీ ముంబయిలో ఇతరులను పట్టించుకోవడానికి సిద్ధంగా ఉండే మనుషులను వెతకడం పెద్ద కష్టమేమీ కాదు. అయితే ఇట్లా కలిగిన ఇళ్లల్లోని మహిళలు పేద అమ్మాయిలు జీవితంలో పైకిరావ డంలో సాయపడితే, ఇలాంటి ధనికులే తమ ఇళ్లల్లో ఊడ్చుకోవడం, వండుకోవడం, ఉతుక్కోవడం లాంటి పనులు తమకు తామే చేసుకోవాల్సి వస్తుంది. పాశ్చాత్యులు ఇలాంటి పనులు స్వయంగా చేసుకుంటారు. మనం కూడా అమెరికన్లలాగా, యూరోపియన్లలాగా అలాంటి జీవితానికి సర్దుకుపోవడం నేర్చుకుందాం. కోవిడ్ లాక్డౌన్ కాలంలోనే ఈ దిశగా ఒక అడుగైతే పడింది. - జూలియో రీబేరో వ్యాసకర్త మాజీ పోలీసు ఉన్నతాధికారి, దౌత్యవేత్త, పద్మభూషణ్ పురస్కార గ్రహీత -
ఆటలు, ఆతిథ్యం...
మేబషి (జపాన్): కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ముంచెత్తిన వేళ సామాజిక దూరం పేరిట మనిషికి మనిషికి మధ్య ఎడం పెరిగిపోయింది. విదేశాల నుంచి, పొరుగు ఊరు నుంచి వచ్చిన వారిని కలిసేందుకు అయినవాళ్లు, బంధువులే ఆసక్తి చూపడం లేదు. అలాంటిది పరాయి దేశం నుంచి వచ్చిన అథ్లెట్లను కంటికి రెప్పలా కాచుకుంటున్నారు జపాన్ వాసులు. ప్రాక్టీస్ కోసం ట్రాక్‌లు, ఉండేందుకు వసతి, ఆహారం, వారి అవసరాల కోసం నిధులు సేకరిస్తూ మానవత్వాన్ని చూపిస్తున్నారు. ఆటపై మమకారంతో తమ దేశానికి తరలివచ్చిన అథ్లెట్లపై తమ ప్రేమను కురిపిస్తున్నారు ఉత్తర టోక్యోలోని మేబషి నగరవాసులు. టోక్యో ఒలింపిక్స్ కోసం నిరుపేద దేశమైన దక్షిణ సూడాన్‌కు చెందిన ఐదుగురు అథ్లెట్ల బృందం నవంబర్‌లో మేబషి చేరుకుంది. ఇందులో ఒకరు కోచ్ కాగా... ముగ్గురు పురుష, ఒక మహిళా స్ప్రింటర్ ఉన్నారు. అప్పటినుంచి ఇక్కడి ట్రాక్‌లపై ప్రాక్టీస్ చేస్తూ తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారు. అనూహ్యంగా ఒలింపిక్స్ వచ్చే ఏడాదికి వాయిదా పడటంతో వీరి అంచనాలు తలకిందులయ్యాయి. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో మేబషివాసులు తమ స్నేహ హస్తం అందించారు. జూలై వరకు వారు అక్కడే ఉంటూ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యేందుకు తగిన ఏర్పాట్లను వారే చూసుకుంటున్నారు. మేబషివాసుల అందించిన ఆపన్నహస్తంతో ఒలింపిక్స్‌కు పూర్తి స్థాయిలో తయారయ్యే అవకాశం లభించిందని వారి ప్రేమకు కృతజ్ఞులం అని 20 ఏళ్ల స్ప్రింటర్ అబ్రహం మజొక్ మాటెట్ గ్యుయెమ్ అన్నాడు. -
కేరెంటింగ్ టైమ్ నిలబెట్టుకోండి
తీరికలేని పనులు ఎన్ని ఉన్నా పిల్లలతో తల్లిదండ్రులు రోజులో కొంత సమయమైనా గడపాలని నిపుణులు చెబుతుంటారు. పైకి చెప్పలేరు కానీ, పిల్లలు మొదట కోరుకునేది తమ పట్ల అమ్మానాన్న శ్రద్ధ చూపాలనే. అది కరువైనప్పుడే నిరాశకు లోనై తమ ప్రతికూల వైఖరి ద్వారా కోపాన్ని వ్యక్తం చేస్తుంటారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో తప్పనిసరిగా కొంత సమయాన్ని గడపాలని మనోవైజ్ఞానిక నిపుణులు పదే పదే చెబుతుంటారు. ఎన్ని పనులున్నప్పటికీ పిల్లలకు రోజులో కనీసం 30 నిమిషాలు కేటాయించడం వల్ల వారికి దగ్గరైన భావన పిల్లలతో పాటు పెద్దలకూ కలుగుతుందని అంటున్నారు. అలా గడిపేందుకు కొన్ని సూచనలు కూడా చేస్తున్నారు. ♦ రోజులో పిల్లలతో గడపడానికి ఒక నిర్దిష్ట సమయాన్ని స్థిర పరచుకోండి. రాత్రి భోజనానికి ముందు, లేదా నిద్రకు ఉపక్రమించే ముందరి సమయాన్ని అందుకోసం కేటాయించవచ్చు. ఆ కొద్దిసేపూ పుస్తకంలోని కథలు చదివి వినిపించడం, ఇంకా ఏదైనా ఆసక్తికర సంభాషణ వారితో జరపవచ్చు. ♦ ఏదైనా సరే మీరు పిల్లలతో గడిపే సమయం ప్రత్యేకంగా ఉండాలి. పిల్లలతో కలిసి ఒకే గదిలో కబుర్లు చెబుతూ ఉండటం కావచ్చు లేదా బయట ఏదైనా ఫంక్షన్‌కు వారితో కలిసి హాజరు కావచ్చు. మీరు మీ పిల్లలతో గడిపే ఆ సమయంలో వారి దృష్టి కేంద్రంగా మీరు మాత్రమే ఉండాలి. ♦ మీ పిల్లలకు కూడా.. మీరు సమయం కేటాయించడం విషయంలో ఒక స్పష్టత ఇవ్వండి. వారి కోసం మీ సమయాన్ని వినియోగిస్తున్నామని చెప్పీ చెప్పనట్లు వాళ్లకు తెలియజేయండి. ♦ పిల్లల కోసం మీరు ఎంచుకున్న సమయంలో పిల్లలు మీ నుంచి ఏం కోరుకుంటున్నారో మిమ్మల్ని అడగమనండి. అడిగాక మీరు ఓకే అనేస్తే పిల్లలు తమ మాటకు మీరు విలువ ఇస్తున్నారని గమనిస్తారు. అంతేకాదు, తమలో ఉన్న సృజనాత్మక ఆలోచనలను మీతో పంచుకోడానికి ఆసక్తి చూపుతారు. ♦ ముఖ్యంగా పిల్లలకు కేటాయించిన సమయంలో ఇతర సమస్యలపై దృష్టి పెట్టకండి. మీరు పిల్లలతో కూర్చున్నప్పుడు మీ స్వంత పనులు, లేదా వృత్తిపరమైన విధుల గురించి అస్సలు మాట్లాడకండి. -
దొరవారొస్తున్నారు.. దాక్కోవాలి!
ఇప్పుడు మా ఎస్.పీ. దొరవారొస్తారు. ఆయనకు చాలా కోపం. చిన్నపిల్లలు కనిపిస్తే గట్టిగా అరుస్తారు, భయపెడ్తారు.‘నా చిన్నప్పుడు..’ అని చెప్పుకోవాలంటే అందరికీ సరదాగానే ఉంటుంది. చిన్నప్పుడు బెరుకు భయమేకాదు కల్మషం లేని మనసులతో చేసిన పనులు కాబట్టి అందులో ఎప్పుడూ సరదానే కనిపిస్తుంది. ఎవర్ గ్రీన్ సినిమాల్లాగా బాల్యం ఎప్పటికీ ఎవర్ గ్రీనే కదా మరి!నాకు రెండేళ్ళ వయసున్నప్పుడు అమ్మమ్మ తాతయ్యల దగ్గరే ఉండేదాన్ని. అమ్మ ఒక్కతే కూతురు కావటం, పైగా నాకూ చెల్లికి ఏణ్ణార్ధమే తేడా కాబట్టి ఇద్దరు పిల్లలతో మా అమ్మ చేసుకోలేదని కూడా నన్ను అమ్మమ్మవాళ్ళే తెచ్చేసుకున్నారు. నాక్కూడా అమ్మమ్మ తాతయ్యలే ఎక్కువ ఇష్టం కాబట్టి తాతయ్యను తాతయ్యా అని అన్నా అమ్మమ్మను మాత్రం అమ్మా అనే పిలిచే దాన్నట.తాతయ్య అప్పటికి ఇంకా ఉద్యోగంలోనే ఉన్నారు. అప్పుడు తాతయ్య హెడ్ కానిస్టేబుల్‌గా ఉండేవాళ్ళు. ఇప్పట్లోలాగా నా అదష్టంకొద్దీ అప్పుడు డే కేర్ సెంటర్లు, నర్సరీ స్కూళ్ళు లేక నేను బ్రతికిపోయానుగానీ పాపం మా అమ్మమ్మ వీరబలైపోయేది రోజూ నేనడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక. మరీ చోద్యం కాకుంటే అందరు పిల్లల్లాగే నాకూ డౌట్లు వచ్చేవండి. అడిగితేనేమో పెద్దవిసిగిచ్చేస్తున్నట్టు భావిస్తారు నేనేంచేయను. కానీ నేను కాస్త అదేదో ఇప్పటివాళ్ళు అన్నట్టు ‘హైపరేక్టివ్’ అనుకుంటా.ప్రశ్నలంటే చిన్నవే.. ‘మా పెరట్లోని మామిడి చెట్టుమీదున్న కాకికి తెలుగు వచ్చా? రాదా? ఒకవేళ వస్తే దాని ‘కా’ భాషలో ‘అన్నంతినాలి’ అని ఎలా చెప్తుంది? ఒకవేళ రాకుంటే ఎలా మాట్లాడుకుంటాయి? కాకి వాళ్ళింట్లో ఎంతమంది ఉంటారు? కాకిపిల్లకు అమ్మమ్మ ఉందా? ఉంటే ఏమని పిలుస్తుంది?’ జస్ట్ ఇంతే...ఇలాంటివే!దానికే భయపడిపోయి అమ్మమ్మ ఒకరోజు ‘బాబ్బాబు రేపు మన ఊళ్ళో జాతర కదా? ఇది ప్రశ్నలతో నన్ను తినేస్తుంది..నేను ఏ పని చేసుకోలేను. రేపు అమ్మాయివాళ్ళు కూడా వస్తారాయె కాస్త ఈ పూటకి నీతో మీ స్టేషన్ కి పట్టుకెళ్ళమని’ బ్రతిమాలుకుందట. తాతయ్య నా పక్షమే కాబట్టి అందరు నన్ను పిడుగన్నా ఆయనొక్కరే ప్రేమగా ‘శాంతకుమారీ’ అని పాతతరం సినిమాల్లో శాంతంగా ఉండే ఒకావిడ పేరుని నాకుపెట్టి పిలిచేవాళ్ళు. ‘ఎందుకే బిడ్డను అలా అంటావు? పసిపిల్ల ఏదో తెలియక నాలుగు ప్రశ్నలేస్తే చెప్పినంత మాత్రాన ఏమైపోతుంది? నీ నోరేమైనా అరిగిపోతుందా?అసలా వయసుకి అలా అడగాలన్న బుద్ధి ఎంతమందికుందో చెప్పు’ అని, ‘ఏం ఫరవాలేదు మా అమ్ములు ఇవ్వాళ నాతోనే వస్తుందిలే. నీ పనులేవో చేసుకో’ అనేసి నన్ను వాళ్ళ స్టేషన్ కి తీసుకెళ్ళారు. నేనప్పుడు నా కిష్టమని యాపిల్సు, కేకులు తప్ప మరేమీ తినేదాన్నికాదు. తాతయ్య గారాబం ఎక్కువేకనుక హేంగరుకెప్పుడూ బ్యాగులో యాపిల్సు, వంటగదిలోని స్టీలు డబ్బాలో కేకుముక్కలు స్టాకుండేవి. రెండేళ్ళకే నాలుగేళ్ళదాన్లా ముద్దుగా బొద్దుగా ఉండేదాన్నట. మర్నాడు జాతర ఏర్పాట్లగురించి పరిశీలించడానికి ఆకస్మికంగా అప్పటికప్పుడే ఎస్.పీ.గారు వస్తున్నారని తెలిసిందిట.అంతే. మా తాతయ్యకు కాలు చెయ్యి ఆడలేదుట. అప్పట్లో ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్‌గా ఉండే వాళ్ళట. కనీసం నన్ను ఇంటిదగ్గర వదిలొచ్చే సమయమైనా లేదని భయపడిపోయి గబగబా అక్కడున్న ఇనప్పెట్టె వెనుక నన్ను కూర్చోబెట్టి ‘అమ్ములు బంగారూ..! ఇప్పుడు మా ఎస్.పీ.దొరవారొస్తారు. ఆయనకు చాలా కోపం. చిన్నపిల్లలు కనిపిస్తే గట్టిగా అరుస్తారు, భయపెడ్తారు. కాబట్టి నువ్విక్కడే ఆయనకు కనిపించకుండా కూర్చుంటే ఆయనెళ్ళిపోయాక నీకు బోలెడన్ని చాక్లెట్లు, బిస్కెట్లుకొనిపెడ్తాను’ అనేసి హడావిడిగా వెళ్ళిపోయి అందరితో బాటూ అటెన్షన్లో నిలబడ్డాడట సెల్యూట్ ఫోజులో.జీపుదిగి నేరుగా ఎస్.పీ.గారొచ్చి చైర్లో కూర్చుని మాట్లాడుతున్నారట. రెండంటే రెండునిముషాలైనా కాకుండానే నేను లేచి బయటకొచ్చేసి నేరుగా ఆయనదగ్గరికే వెళ్ళిపోయి ‘ఎస్.పీ దొరవారంటే మీరేనా? మా తాతయ్య మీరెళ్ళే వరకూ నన్నక్కడ దాక్కోమన్నారు. మీరెందుకు అందర్నీ భయపెడ్తారు? మీరెళ్ళిపోయాక మా తాతయ్య నాకు బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు కొనిపెడ్తానన్నారు. కావాలంటే మీక్కొన్నిపెడతాను మా తాతయ్యను మాత్రం భయపెట్టొద్దేం?’ అనేసరికి తాతయ్యకు పైప్రాణాలు పైనేపోగా మిగతా స్టాఫ్ ‘ఈ గోవిందస్వామికి రోజు మూడిందిరోయ్’ అని అనుకున్నారట. కానీ దొరవారు గట్టిగా నవ్వేసి నన్నెత్తుకుని ‘సరే మరైతే నాకెన్ని బిస్కెట్లు చాక్లెట్లు పెడతావో చెప్పు నేనే తెప్పిస్తా’ అని నాకోసం అవన్నీ తెప్పించిపెట్టారట. పైగా తాతయ్యతో ‘ఏమయ్యా నాగురించి పసిపిల్ల దగ్గర అబద్ధాలు చెబుతావా?’ అని నాతో ‘మంచి దొరవారు’ అనిపించుకుని వెళ్ళారట. ఇంటికొచ్చాక దిష్టి తగిలిందని అన్ని దిష్టులూ తీసినా పదే పదే ఈ కథ మా అమ్మమ్మ నాకు చెప్పి మురిసిపోతుంటుంది. – డేగల అనితాసూరి, హైదరాబాద్ -
ఇంట్లోనే...ఐ'సీ'యూ
సాక్షి,హైదరాబాద్: ఇప్పటివరకూ ఫిజియో థెరపీ, మందుల హోమ్ డెలీవరీ, రక్త, మూత్ర పరీక్షలు వంటి సేవలు మాత్రమే అందుతుండగా, తాజాగా కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ యాజమాన్యం ‘కేర్ ఎట్ హోమ్’పేరుతో రోగి ఇంట్లోకే ఐసీయూ సర్వీసులను తీసుకొచ్చింది. సర్జరీ తర్వాత ఎక్కువ రోజులు ఐసీయూలో ఉండాల్సి వచ్చిన రోగులతో పాటు దీర్ఘకాలిక జబ్బులతో బాధ పడుతూ రోజుల తరబడి ఐసీయూలో ఉండాల్సి వచ్చే కేన్సర్, పక్షవాతం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్, న్యుమోనియా, ఆస్తమా సంబంధిత రోగులకు వారి బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మెరుగైన వైద్యసేవలు అందించనుంది. దీంతో ఆస్పత్రి ఖర్చులు తగ్గడంతో పాటు రోగి త్వరగా కోలుకునే అవకాశమూ ఉంది. ఖర్చు తక్కువ..ఫలితమెక్కువ కేన్సర్, పక్షవాతం సహా మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి రోగాల బారిన పడ్డవారికి ఐసీయూలో వెంటిలేటర్ సహాయంతో వైద్యసేవలు అందించాల్సి వస్తుంది. కార్పొరేట్ ఆస్పత్రిలో రోజు సగటు ఐసీయూ చార్జీ రూ.50 వేలకుపైనే. అదే హోమ్ ఐసీయూ సర్వీసులో రూ.10 వేలకు మించదు. పోస్ట్ ఆపరేటివ్ ఖర్చులు రోజుకు రూ.30 వేల వరకు అయితే ఇంట్లో రూ.5 వేలలోపే. అదే బెడ్‌సైడ్ సర్వీసులకైతే రూ.2 వేలకు మించదని కేర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్స్ ప్రకటించింది. రోగిని రోజుల తరబడి ఐసీయూలో ఉంచాల్సి వస్తుండటం, ఈ వైద్య ఖర్చులు బంధువులకు భారంగా మారు తున్నాయి. ఇదే సమయంలో ఆస్పత్రి ఐసీయూ పడకలు ఖాళీగా లేకపోవడంతో అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన రోగులకు బెడ్స్ సమకూర్చలేని పరిస్థితి తలెత్తుతుంది. పది నుంచి పదిహేను పడకలతో నెలకొల్పిన ఐసీయూలో రకరకాల బాధితులకు చికిత్సలు అందించాల్సి వస్తుండటం, ఒక్కో సారి ఎవరైనా చనిపోతే, బంధువుల ఆర్తనాదాలు విని పక్కనే ఉన్న వారు ఆత్మస్థైర్యం కోల్పోతున్నారు. ఐసీయూలో రకరకాల బాధితులు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోగి ఇన్ఫెక్షన్ మరో రోగికి సోకుతుండటం వల్ల దాన్ని నియంత్రించడానికి అనివార్యంగానే యాంటి బయాటిక్ మందుల్ని ఎక్కువ మోతాదులో వాడాల్సి వస్తుంది. దీంతో రోగి కోలుకోక పోగా ఆరోగ్యం మరింత దెబ్బతింటుంది. అదే సర్జరీ తర్వాత ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసి, ఇంట్లోని బంధువుల సమక్షంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో వైద్యసేవలు అందించడం వల్ల రోగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది. అంతేకాదు ఆపదలో వచ్చిన వారికి సత్వరమే ఐసీయూ సేవలు అందించవచ్చు. ఎలాంటి సేవలు అందిస్తారు? రోజుల తరబడి ఐసీయూ చికిత్సలు అవసరమైన రోగులకు హోమ్ ఐసీయూ సర్వీసులను అందిస్తున్నారు. రోగి డిశ్చార్జ్‌కి ముందే ఆస్పత్రి బయోమెడికల్ ఇంజనీర్ రోగి ఇంటిని పరిశీలిస్తారు. ఇంట్లో ఆస్పత్రి ఐసీయూకు కావాల్సిన వాతావరణం ఉన్నట్లు నిర్ధారించుకుని గాలి, వెలుతురు ఉన్న ప్రదేశాన్ని ఇందుకు ఎంపిక చేస్తారు. రోగి అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని హోమ్ ఐసీయూకు కావాల్సిన వెంటిలేటర్, ఆక్సిజన్, సీపీఏపీఎస్, బైలెవల్ ప్యాప్, సక్షన్ అండ్ ఎయిర్ ఫర్ ఫియర్, మల్టీపారా మానిటర్, బ్యాక్‌రెస్ట్ కాట్, ఐసీయూ బెడ్–3,5 ఫంక్షన్ మోటరైజ్డ్, తదితర మెడికల్ ఎక్విప్మెంట్స్ను రోజువారీ అద్దె ప్రాతిపాదికన సరఫరా చేస్తారు. ఎప్పటికప్పుడు రోగి ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఒక వైద్యుడితో పాటు సీనియర్ నర్సు, ఫిజియో థెరపిస్ట్, అటెండర్‌ను ఇంటికి పంపుతారు. అవసరమైతే స్పెషాలిటీ వైద్యుడు సైతం ఇంటికి వస్తాడు. మందులతో పాటు సాధారణ వైద్య పరీక్షలు సైతం ఇంటి నుంచే అందిస్తారు. ఒక వేళ రోగి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లయితే రోగికి అమర్చిన మల్టీపారామానిటర్ కేర్ ఎట్ హోమ్ కాల్ సెంటర్‌కు ఇండికేషన్స్ ఇస్తుంది. వెంటనే వైద్యులు అప్రమత్తం అవుతారు. హోమ్ కేర్‌తో సత్ఫలితాలు ప్రస్తుతం నగరంలో పలు రకాల హోమ్ సర్వీసులు ఉన్నప్పటికీ.. డిశ్చార్జ్ తర్వాత రోగి ఇంటికి కన్సల్టెంట్‌ను పంపిన దాఖలాలు లేవు. చాలా మందికి సర్జరీ తర్వాత అనివార్యమైతే తప్ప ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం ఉండదు. చిన్నచిన్న వాటి కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి రావడం వల్ల రోగులు హాస్పిటల్ అక్వైర్డ్ ఇన్ఫెక్షన్కు గురవుతుంటారు. నాలుగు రోజుల్లో కోలు కోవాల్సిన రోగి పది రోజులైనా ఆరోగ్యం మెరుగుపడదు. ఆస్పత్రి ఖర్చులు కూడా తడిసి మోపెడవుతుంటాయి. సర్జరీ తర్వాత కేవలం ఇంజక్షన్లు, డ్రెస్సింగ్, ఫిజియో థెరపీ కోసం రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చే రోగులకు హోమ్ కేర్ సర్వీసులు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ప్రస్తుతం కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందిన రోగులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నాం. భవిష్యత్తులో ఇతర రోగులకు ఈ సేవలను విస్తరింపజేస్తాం. – డాక్టర్ బి.సుధాకర్‌బాబు, క్లినిక్ సర్వీస్ అండ్ పాపులేషన్ హెల్త్ హెడ్ -
కెఫీన్‌తో గుండెకు రక్షణ
రోజూ కాఫీ తాగితే కొన్ని రోగాల బారిన పడకుండా ఉండవచ్చునని ఇప్పటికే చాలా పరిశోధనలు స్పష్టం చేశాయి. అయితే ఇదెలా జరుగుతుందో మాత్రం ఎవరికీ తెలియలేదు. ఈ లోటును భర్తీ చేశారు జర్మనీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కాఫీలో ఉండే కెఫీన్ ప్రభావంతో మన కణాల్లోని మైటోకాండ్రియాలో ఉండే ఒక ప్రొటీన్ చురుకుగా కదులుతుందని వీరు గుర్తించారు. ఈ ప్రొటీన్ గుండె కణాలకు జరిగే నష్టాన్ని ఎప్పటికప్పుడు నివారిస్తుందని.. ఫలితంగా కాఫీ తాగితే గుండెజబ్బులు వచ్చే అవకాశాలు తక్కువ అవుతాయని వీరు వివరిస్తున్నారు. మామూలు పరిస్థితుల్లో రక్తనాళాల తాలూకూ ఎండోథీలియల్ కణాల్లో ఉండే పీ27 కెఫీన్ అందినప్పుడు మైటోకాండ్రియలోకి చేరి ఫైబ్రోబ్లాస్ట్‌ల నుంచి కణాలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుందని.. ఈ కణాల్లో కాంట్రాక్టైల్ ఫైబర్స్ ఉండటం వల్ల గుండెపోటు కారణంగా దెబ్బతిన్న కండరాలను మరమ్మతు చేయడం వీలవుతోందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాచిమ్ ఆల్స్షామిడ్ వివరించారు. ఈ స్థాయి చర్యలు జరగాలంటే నాలుగు కప్పుల కాఫీలో ఉండేంత కెఫీన్ శరీరంలోకి చేరాల్సి ఉంటుందని అంటున్నారు. కెఫీన్ గుండెజబ్బులతోపాటు మధుమేహం అంచుల్లో ఉన్నవారు, ఊబకాయులకూ మంచిదని ఎలుకలపై జరిగిన ప్రయోగాలు ఇప్పటికే రుజువు చేసిన విషయం తెలిసిందే. -
దొంగలొస్తారు జాగ్రత్త ..!
సూర్యాపేటరూరల్ : వేసవి అంటే కేవలం ఉక్కపోత..వడదెబ్బే కాదు..దొంగతనాల బెడద కూడా ఉంటుంది. ఉక్కపోతకు తట్టుకోలేక రాత్రి సమయంలో జనం హాయిగా ఆరుబయటో.. లేదంటే డాబాలపైనో నిద్రపోవడానికి ఇష్టపడుతుంటారు. ఇదే అదనుగా భావించే దొంగలు ఏంచక్క అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో వచ్చి ఇళ్లలో చొరబడి బీరువాలు తెరిచి సొత్తు దోచుకెళ్తుంటారు. వేసవిలో విహార, తీర్థయాత్రలకు వెళ్లే కుటుంబాలే లక్ష్యంగా దొంగలు చెలరేగుతుంటారు. అయితే ప్రస్తుతం వేసవికావడంతో అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే చోరీలు జరగకుండా నివారించవచ్చని పోలీసులు చెబుతున్నారు. ఈనేపథ్యంలో ప్రతిఒక్కరూ ఏమరపాటుగా ఉండకుండా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఉదయం రెక్కీ.. రాత్రి దోచేస్తారు.. దొంగతనాలకు వేసవి అనువుగా ఉంటుంది. దొంగలు ఎంచుకున్న ఇంటి పరిసరాలను రెండు, మూడు రోజులుగా (రెక్కీ నిర్వహిస్తారు) పరిశీలిస్తారు. అంటే భిక్షగాళ్లుగా లేదా చెత్త కాగితాలు ఏరుకునేవారిలా..లేదంటే చిరువ్యాపారాలు చేసుకునే వారిలా.. బంగారం మెరుగుపెడతామని వీధుల్లో తిరుగుతూ టార్గెట్ చేసిన ఇళ్ల పరిసరాలను గమనిస్తారు. అనంతరం పక్కా దొంగ ప్రణాళిక రచించి సులువుగా ఇళ్లలో చొరబడి సొత్తును దోచుకెళ్తుంటారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. - చోరీలకు వచ్చే దొంగలు ఒకరోజు ముందే రెక్కీ నిర్వహిస్తారు. అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలి. - ఇంటి కిటికీలను మూసివేయాలి. వాటికి ఉన్న బోల్టులు సక్రమంగా ఉన్నాయో లేదో ఎప్పటికప్పుడు చూసుకోవాలి. - దుస్తుల్లో డబ్బులు పెట్టి కిటికీలకు, తలుపులకు తగిలించరాదు. - ఆరుబయట, మిద్దె (డాబా)లపై నిద్రించేవారు అప్రమత్తంగా ఉండాలి. ఇంటికి ఒకటికి లేక, రెండు తాళాలు వేసుకోవాలి. - బంగారు అభరణాలు ధరించి ఆరుబయట నిద్రించకూడదు. ఇంట్లో పడుకున్నా.. కిటికీలు తెరిచి ఉండే వైపు పడుకోరాదు. - వీలైతే ఇంటి ఆవరణలో పెంపుడు కుక్కలను కట్టి వేయాలి. ఇంట్లో ఎలాంటి శబ్దం, అలికిడి వినిపించినా వెంటనే అప్రమత్తం కావాలి. - దూరప్రాంతాలకు వెళ్లే వారుతమ ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్‌ను సంబంధిత పోలీస్‌స్టేషన్‌కు తెలపాలి. - రాత్రి సమయంలో కొత్తవారు ఎవరైనా వస్తే వారి వివరాలు తెలుసుకుని నమోదు చేసుకోవడం మంచిది. - ఊర్లకు వెళ్లేవారు బంగారం, నగదును బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోవడం అన్ని విధాలా ఉత్తమం. అంజనాపురి కాలనీలో నిఘా కరువు? సూర్యాపేట జిల్లా కేంద్రానికి చేరువలో ఉన్న అంజ నాపురి, మానసానగర్ కాలనీల్లో పోలీసుల నిఘా కరువైంది. గతంలోనూ ఈ ప్రాంతాల్లో పలువురి ఇళ్లలో చోరీలు జరిగాయి. చోరీలు ఎక్కువగా జరిగే ప్రాంతా లను పోలీసులు గుర్తించి రాత్రి వేళ పెట్రోలింగ్ నిర్వహించాలని ఆయా కాలనీల ప్రజలు కోరుతున్నారు. -
చెల్లి గుండెలో ఎన్ని వ్యధలో...
ఆడపిల్లకి ఎన్నో కష్టాలు. కన్నతల్లికి ఎన్నో శోకాలు. బంగారుతల్లికి ఎన్నో వ్యథలు. ఇది చాలక ఎన్ని శారీరక బాధలో!అన్ని బాధల్లో ఎన్ని వివక్షలో! ఇవి తెలుసుకుంటే చెల్లి జాగ్రత్త పడుతుందని.. గుండెకోతను తప్పించుకుంటుందని.. ఈ వివరాలను అందిస్తున్నాం.మహిళలలో గుండెవ్యాధులు... వాటికి కారణాలూ...తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తే..ఆమె తన వ్యథలను జయిస్తుందని..శారీరక బాధలను ఎదుర్కొంటుందని మా నమ్మకం... మా విశ్వాసం. గుండెపోటు చికిత్సలో విదేశాల్లోనూ మహిళల పట్ల వివక్ష... గుండెపోటు వచ్చినప్పుడు పురుషులకు ఇచ్చే చికిత్సే మహిళలకు అందడం లేదన్న ఆందోళనకరమైన విషయం ఈమధ్యే వెల్లడయ్యింది. ఒక స్వీడిష్ అధ్యయనంలో ఈ అంశం తేటతెల్లమైంది. దాదాపు పదేళ్ల వ్యవధిలో స్వీడన్‌లోని 1,80,368 మంది గుండెపోటుకు గురైన రోగులపై నిర్వహించిన ఒక అధ్యయనం తెలిపిన విషయాలు సంచలనంగా మారాయి. మొదటిసారి హార్ట్ ఎటాక్ వచ్చి కోలుకున్న తర్వాత, మళ్లీ అదే రెండోసారి వచ్చినప్పుడు మృతిచెందే మహిళల సంఖ్య... పురుషులతో పోల్చి చూస్తే దాదాపు రెండు రెట్లు ఎక్కువని ఆ అధ్యయనంలో వెల్లడయ్యింది. ఈ విషయమై బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ వ్యాఖ్యానిస్తూ... ‘నిజానికి సామాజికంగా చూస్తే గుండెజబ్బులు అనగానే అదేదో పురుషులకే వచ్చేవనే అభిప్రాయం ఉంది. కానీ మహిళల్లో కనిపించే రొమ్ము క్యాన్సర్‌తో పోలిస్తే గుండెపోటుతో మృతిచెందే మహిళలే ఎక్కువ’’ అంటూ తన ఆందోళనను వ్యక్తం చేసింది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్. పరిశోధకులు ఈ అధ్యయనాలకు అవసరమైన సమాచారం (డేటా)ను ‘యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్’తో పాటు ‘ద కరోలిన్స్కా ఇన్స్టిట్యూట్’కు చెందిన ఆన్లైన్ కార్డియాక్ రిజిస్ట్రీ నుంచి స్వీకరించారు. ఆ డేటా ఆధారంగా నిర్వహించిన అధ్యయనం వెల్లడించిన సత్యాలు చాలా దిగ్భ్రాంతిని కలిగించేలా ఉన్నాయి. గుండెపోటుకు గురైన పురుషులకు ఎలాంటి చికిత్స దొరుకుతుందో... చాలా మంది మహిళలకు అదే చికిత్స లభ్యం కావడం లేదు. ఇదే అధ్యయనంలో కో–ఆథర్‌గా వ్యవహరించిన యూనివర్సిటీ ఆఫ్ లీడ్స్‌కు చెందిన ప్రొఫెసర్ క్రిస్‌గేల్ ఇందుకు కారణాలు చెబుతున్నారు. ఆయన చెబుతున్న అంశాలివి... ‘‘బయటనుంచి చూస్తే సాధారణ ప్రజానీకంతో పాటు ఆరోగ్యరంగంలో సేవలందిస్తున్న చాలామంది ప్రొఫెషనల్స్‌లో చాలామంది... గుండెపోటు వచ్చిన రోగులందరినీ ఒకేలా పరిగణిస్తారు. గుండెపోటు వచ్చిన వ్యక్తి అనగానే మధ్యవయస్కుడైన ఒక పురుషుడు స్థూలకాయాన్ని కలిగి ఉండి, డయాబెటిస్తో బాధపడుతుంటాడనీ, అతడికి పొగతాగే అలవాటుంటుందని అనుకుంటారు. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య చరిత్రా అలాగే ఉండలనేమీ లేదు. జనాభాపరంగా చూస్తే గుండెపోటు విస్తృతి మరింత ఎక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళల్లో అది మరింత ఎక్కువ’’ అని ప్రొఫెసర్ క్రిస్‌గేల్ పేర్కొన్నారు. జెండర్ పరమైన తేడా ఎందుకంటే... గుండెపోటు వచ్చిన వారికి అందించే చికిత్సలో భాగంగా చేసే బైపాస్ సర్జరీ లేదా స్టెంట్స్ అమర్చడం వంటి వైద్యసేవలు పురుషులతో పోలిస్తే మహిళలకు 34 శాతం తక్కువగా లభిస్తున్నాయి. అంతేకాదు... పురుషులకు ప్రిస్క్రయిబ్ చేసే స్టాటిన్స్ (మొదటిసారి గుండెపోటు వచ్చినప్పుడు రెండోసారి మళ్లీ రాకుండా నివారించేందుకు గుండెకు రక్తాన్ని అందించే రక్తనాళాల్లోని పూడికను తొలగించే మందులు) కూడా మహిళలకు 24 శాతం తక్కువగా రాస్తున్నారు. గుండెపోటుకు చికిత్స అందించే మూడు ముఖ్యమైన చికిత్సలూ స్త్రీ, పురుషులకు సమానంగా అందించాలంటూ మార్గదర్శకాలు ఉన్నప్పటికీ మహిళలకు అవి అందకపోవడమే జరుగుతోంది. ఒకవేళ మహిళలకు కూడా పురుషులకు ఇచ్చే చికిత్సే దొరికితే గుండెపోటుతో మృతిచెందే స్త్రీ, పురుషుల సంఖ్యలో ఇప్పుడు గణనీయంగా ఉన్న తేడా చాలావరకు తగ్గుతుందని ఈ అధ్యయనవేత్తలు పేర్కొంటున్నారు. మరికొన్ని అంశాలు... ఈ అధ్యయనంలో భాగంగా చూసినప్పుడు ఏడాదిలో ఇంగ్లాండ్‌లో దాదాపుగా 1,24,000 మంది పురుషులు గుండెపోటుతో హాస్పిటల్లో చేరితే... మహిళల్లో ఆ సంఖ్య దాదాపు 70,000 గా ఉంది. ఈ గణాంకాలను మరీ నిశితంగా పరిశీలించినప్పుడు తెలిసిన సత్యం మరింత విభ్రాంతికి గురిచేసింది. ప్రొఫెసర్ గేల్ చెబుతున్న వివరాల ప్రకారం ‘‘గుండెపోటుతో హాస్పిటల్లో చేరే దాదాపు 50 శాతం మహిళలకు పురుషుల్లాంటి వ్యాధినిర్ధారణ పరీక్షలు జరగడం లేదు లేదా వారి విషయంలో తప్పుడు నిర్ధారణ (మిస్ డయాగ్నోజ్) జరుగుతోంది. ఇక అది వారికి అందించే మొత్తం చికిత్సను తప్పుదారి పట్టిస్తోంది. అంటే మొదట మనమో అంశాన్ని మిస్ చేశామంటే... అది ఆ మొత్తం చికిత్స ప్రక్రియను ప్రభావితం చేస్తోంది. ఫలితంగా మహిళల్లో మృతుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోంది’’ అని ఆయన వివరించారు. అంతేకాదు... ఈ అధ్యయనంలో లభ్యమైన విషయాల్లో మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే... కేవలం ఒక్క గుండెపోటు మాత్రమే కాదు... డయాబెటిస్, హైబీపీ లాంటి ఇతర రుగ్మతల విషయంలోనూ మహిళలే ఎక్కువగా వాటి బారిన పడుతున్నారు. ఇక బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు చెందిన ప్రొఫెసర్ జెరేమీ పియర్సన్ మాట్లాడుతూ ‘‘ఈ అధ్యయన ఫలితాలు చాలా తీవ్రంగా ఉన్నాయి. మనం వెంటనే ఆయా అంశాలపై దృష్టిసారించాలని చెబుతున్నాయి. మనం అత్యవసరంగా ఈ అంశంపై దృష్టిసారించి, అందరిలోనూ అవగాహన పెంపొందేలా పూనుకోవాలంటూ సూచిస్తున్నాయి. కేవలం ఒక చిన్న జాగ్రత్త అంటే... పురుషులకు అందించే చికిత్సే మహిళలకూ అందించడం అన్న చర్య ద్వారా పరిస్థితులను తేలిగ్గానే మార్చేందుకు అవకాశం ఉంది. అప్పుడు తమ ప్రియమైన వారిని కోల్పోయే పరిస్థితి రాకుండా చేసి, మనమెన్నో కుటుంబాలను ఆదుకోవచ్చు’’ అంటున్నారు జెరేమీ. భారతదేశంలో ఇలా... గుండెపోటు విషయంలో పురుషులకూ, మహిళలకు తేడా ఉందంటే మీరు నమ్ముతారా? మహిళల్లో స్రవించే ఈస్ట్రోజెన్ హార్మోన్ వల్ల రుతుక్రమం కొనసాగినంతకాలం మహిళలకు ఒక సహజ రక్షణ ఉంటుంది. కానీ ఒకవేళ చికిత్స విషయానికి వస్తే... సామాజికంగా మహిళలకు అందాల్సిన చికిత్స విషయంలో మాత్రం వివక్ష కొనసాగుతోంది. ఇదేదో వివక్ష ఎక్కువగా ఉండే మనలాంటి సంప్రదాయ దేశాల్లో మాత్రమే కాదు... బాగా అభివృద్ధి చెందాయని చెప్పుకునే యూరోపియన్ దేశాల్లోనూ ఇదే తేడా కొనసాగుతోంది. స్వీడన్, ఇంగ్లాండ్‌లో జరిగిన అధ్యయనాలు ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాయి. అధ్యయనం కొనసాగిన ఆ దేశాల్లోనూ, ఇక మనదేశంలోని మహిళా రోగుల స్థితిగతులను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. పనిలో పనిగా కొన్ని నివారణ చర్యలూ, మరికొన్ని జాగ్రత్తలు కూడా. గుండెజబ్బు విషయంలో స్త్రీ, పురుషుల మధ్య తేడాలు... అవి ఎందుకు? భారతీయ స్త్రీ, పురుషుల్లో గుండెజబ్బుల విషయంలో కనిపించే తేడాలేమిటి? అవి ఎందుకు అనే అంశాన్ని పరిశీలిద్దాం. మహిళల్లో గుండెజబ్బుల అంశానికి వస్తే కనిపించే వ్యత్యాసాలు, అసమానతలకు కారణాలను ఐదు అంశాల్లో వివరించవచ్చు... అవి ... మొదటిగా స్త్రీల విషయంలో మెనొపాజ్ వరకు ఈస్టొజ్రెన్ వల్ల గుండె జబ్బుల నుంచి కొంత రక్షణ ఉంటుంది. అందుకనే మగవాళ్ళలో సుమారు యాభైయ్ యేళ్ళలో ఎక్కువ అయ్యే గుండె జబ్బు ఆడవాళ్ళలో అరవయ్ యేళ్ళకు ఎక్కువవుతుంది. ఒక వయసు వరకూ మహిళల్లో గుండెజబ్బుల నుంచి స్వాభావిక రక్షణ లభిస్తుంది. దీనికి కారణం ప్రతి నెలా రుతుక్రమం సమయంలో విడుదల అయ్యే ఈస్ట్రోజెన్ హార్మోన్. దీని వల్ల మహిళల గుండెకూ, రక్తనాళాలకూ రక్షణ ఉంటుంది. కాబట్టి రుతుక్రమం ఆగిన వారితో పోలిస్తే... రుతుక్రమం అయ్యే మహిళలకు (మెనోపాజ్ దశకు చేరని వారిలో) గుండెజబ్బులు వచ్చే అవకాశాలు వచ్చే అవకాశాలు తక్కువ. కానీ డయాబెటిస్ వచ్చినా లేదా పొగతాగే అలవాటు ఉన్నా మహిళలకు లభించే ఈ సహజ రక్షణ తొలగిపోతుంది. యాభై ఏళ్లలోపు వయసువారిలో మహిళలో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కవ. కానీ యాభై–అరవైలలో ఈ అవకాశాలు ఇద్దరిలోనూ సమానం. అయితే అరవై ఏళ్లు దాటాక గుండెజబ్బులు మహిళల్లోనే ఎక్కువ. ఒకవేళ గర్భాశయాన్ని, అండాశయాన్ని తొలగిస్తే... వీళ్లకు గుండెజబ్బులు వచ్చే అవకాశాలు మరింత ఎక్కువ. అందుకే మరింత జాగ్రత్తగా ఉండాలి. మహిళల్లో గుండెపోటు లక్షణాలు గుండెజబ్బుల విషయంలో అందరికీ తెలిసిన లక్షణం ఛాతీలో నొప్పి మాత్రమే. గుండెపోటు వచ్చినప్పుడు గుండెపై ఒత్తినట్లుగా విపరీతమైన నొప్పి వచ్చి అది మెడ లేదా భుజం లేదా మెడవైపునకు పాకుతున్నట్లుగా వెళ్తుంది. చెమటలూ పడతాయి. ఊపిరితీసుకోవడమూ కష్టమవుతుంది. ఈ లక్షణాలన్నీ పురుషుల్లో చాలా సాధారణం. మహిళల్లోనూ ఇవే లక్షణాలు కనిపిస్తాయి. అయితే 50 శాతం మంది మహిళల్లో మాత్రం ఇవి పురుషులతో పోలిస్తే కాస్త వేరుగా ఉండే అవకాశం కూడా ఉంది. అంటే... బాగా అలసటగా/నీరసంగా ఉన్నట్లుగా ఉండటం (ఫెటీగ్), ఊపిరి ఆడకపోవడం, తిన్న ఆహారం జీర్ణం కానట్లుగా ఉండటం, పొట్ట పైభాగంలో ఇబ్బంది, దవడలో నొప్పి, గొంతులో నొప్పి, భుజంలో నొప్పి వంటి సాధారణ లక్షణాలకు భిన్నమైనవి కనిపించవచ్చు. మహిళల్లో గుండెజబ్బులకు రిస్క్ ఫ్యాక్టర్స్ మహిళలో గుండెజబ్బులు క్రమేణా అభివృద్ధి చెందుతూ ఉండటానికి కొన్ని అంశాలు దోహదపడుతుంటాయి. ఆ అంశాలనే రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవి... వయసు ∙ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెజబ్బులున్న చరిత్ర (ఫ్యామిలీ హిస్టరీ) ∙రక్తపోటు ∙మధుమేహం ∙రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ∙పొగతాగే అలవాటు ∙స్థూలకాయం ∙శారీరక శ్రమ/వ్యాయామం అంతగా లేకపోవడం ∙ఒత్తిడి. ఇక కొలెస్ట్రాల్ విషయానికి వస్తే రుతుక్రమం ఆగిన తర్వాత రక్తంలో చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ వంటి కొవ్వు పదార్థాల పెరుగుదల, మంచి కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గడం వంటి అంశాలు కూడా గుండెజబ్బుల రిస్క్‌ను మరింత పెంచుతాయి. మహిళల్లో రుతుక్రమం ఆగాక రక్తపోటు పెరగడానికి అవకాశాలు ఎక్కువ. అది గుండెజబ్బులకు దారితీయవచ్చు. అందుకే రుతుక్రమం ఆగిన మహిళలు తరచూ గుండెజబ్బుల విషయంలో పరీక్షలు చేయించుకుంటూ జాగ్రత్త పడాలి. హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీతో సహజ రక్షణ కరవే... కొందరు మహిళల్లో రుతుక్రమం ఆగాక కనిపించే లక్షణాలను తగ్గించడానికి బయట నుంచి ఈస్ట్రోజెన్ హార్మోన్లు ఇస్తుంటారు. దీన్నే హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీగా పేర్కొంటారు. అయితే ఇలా బయటి నుంచి ఇచ్చే ఈస్ట్రోజెన్ వల్ల సహజంగానే మహిళల దేహంలో ఉత్పత్తి కావడం వల్ల అంతకుముందు దొరికే సహజ రక్షణ దొరకకపోవడం ఒక విశేషం. నివారణ: ∙మహిళలు వ్యాయామం చేయడం మనదేశంలో చాలా చాలా తక్కువ. రోజూ కనీసం 30 నిమిషాల చొప్పున వారంలో కనీసం 5 రోజుల పాటు నడక, మెల్లగా జాగింగ్ చేయడం వంటి వ్యాయామాలు మహిళల గుండెజబ్బులను సహజంగానే నిరోధిస్తాయి ∙ఆహారంలో ఉప్పు తగ్గించడం, ఆకుకూరలు, తాజా పండ్లు ఎక్కువగా తీసుకోవడం, నూనె పదార్థాలను పరిమితంగా తీసుకోవడం వల్ల గుండెజబ్బులను నివారించవచ్చు. ∙రక్తపోటు, డయాబెటిస్ కొలెస్ట్రాల్ పాళ్లు పెరగడం వంటివి ఉంటే తగిన చికిత్స తీసుకోవాలి. డాక్టర్ శ్రీదేవి, సీనియర్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ రెండవది, గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు కూడా పురుషులతో పోలిస్తే... మహిళలలో అవి పది శాతం సన్నగా ఉంటాయి. ఈ అంశం కూడా రక్తనాళాల్లో పూడిక త్వరగా చేరేందుకు దోహదపడుతుంది. మూడవది, గుండె జబ్బు వచ్చినపుడు లక్షణాల బట్టి వైద్యులు తర్వాతి పరీక్షలూ, చికిత్సా చేబడుతారు. ఈ లక్షణాలు మహిళలలో విభిన్నంగా ఉండడమే కాకుండా, అందరు మహిళలలో ఒకే రకంగా ఉండవు. అందువలన మహిళలలో గుండె జబ్బు కనుక్కోవడం ఆలస్యం అవుతుంది. నాలుగవది, వైద్యులు కూడా స్త్రీల చికిత్స విషయంలో కొంచెం వెనకడుగు వేస్తున్నారు. ఐదవది, స్త్రీలలో చికిత్సకు సంబంధించిన కాంప్లికేషన్స్ అధికంగా ఉంటాయి. చివరిగా, పితృస్వామ్య సమాజంలో మహిళల యొక్క గుండె జబ్బులపై పెట్టే ఖర్చు మగవారి జబ్బుకి పెట్టే ఖర్చు కన్నా తక్కువగా ఉండటం ఒక సమస్య. దీనిని సమస్య అనడం కంటే సామాజిక వివక్ష అనడమే కరెక్ట్. స్త్రీ, పురుషుల మధ్య గుండె పోటు చికిత్సలో విభేదాలు భారతదేశంలో కూడా ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఉత్తర, దక్షిణ భారతదేశంలో చేసిన అనేక పరిశోధనల బట్టి ఈ విషయం తేట తెల్లమవుతుంది. డీమాట్ రెజిస్ట్రీ...: డీమాట్ రెజిస్ట్రీ అనే పరిశొధనలో, ప్రఖ్యాత గుండె నిపుణులు శ్రీనాధ రెడ్డి తదితరులు ఈ విషయాన్ని విపులీకరించడానికి ప్రయత్నించారు. ఆస్పత్రి నుంచి డిస్చార్జ్ చేసే సమయంలో పురుషులకన్నా స్త్రీలలో మందుల ప్రిస్కిప్ష్రన్ అసంపూర్తిగా ఉందని ఈ పరిశొధనలో తేలింది. అసలు పురుషులలో కూడా పాశ్చాత్య దేశలతో పొలిస్తే మందుల మోతాదు కరెక్ట్ గా లేదని అదే పరిశోధనలో బయటపడటం మరొక సంగతి. దక్షిణ భారత దేశంలోనూ ఈ లింగ భేదాలు ఖచ్చితంగా కనిపించాయి. అయితే కేరళలో మాత్రం ఈ వివక్ష కొంచెం తక్కువగా ఉందని అక్కడి పరిశోధకులు అభిప్రాయ పడ్డారు. డాక్టర్ ఎం.ఎస్.ఎస్. ముఖర్జీ, సీనియర్ కార్డియాలజిస్ట్, మాక్స్‌క్యూర్ హాస్పిటల్స్ మాదాపూర్, హైదరాబాద్ జాగ్రత్తలు : ∙మహిళల్లో రుతుక్రమం ఆగాక లక్షణాలు కనిపించకపోయినా వైద్య పరీక్షలు చేయించుకుంటే ఒకవేళ గుండెజబ్బు లక్షణాలను పసిగడితే గుండెపోటును నివారించే అవకాశముంది ∙రిస్క్ ఫ్యాక్టర్లలో నివారించగలిగే అవకాశం ఉన్నవి అంటే... కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడం, రక్తపోటు, మధుమేహాన్ని నియంత్రించుకోవడం వంటి జాగ్రత్తలతో గుండెపోటును నివారించవచ్చు. ప్రతి మూడు నెలలకొకసారి డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. -
ఓ ఎమ్మెల్యే సంరక్షణలో జుబేర్?
-
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కార్యక్రమాలు
కలెక్టర్ మిశ్రా కాకినాడ సిటీ : తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్యారోగ్యశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాలులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ తల్లి పాలే బిడ్డకు శ్రేష్టమన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో తల్లుల విషయంలో మొదటి త్రైమాసికం నుంచి వారిని పర్యవేక్షించి అవసరమైతే పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ 25వ తల్లిపాల వారోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 1098 హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం 1098 హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్‌కు మహిళలు, పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు సమాచారమివ్వాలని, దీనిని విస్తృత ప్రచారం చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా నివారణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఎక్కువగా ఉందని, దీని నిరోధానికి ఐసీడీఎస్, పోలీస్, రెవెన్యూ సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. హెల్ప్‌లైన్‌కు సంబంధించి పోలీస్, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లో ప్రజలకు కనిపించే ప్రాంతాలలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, ఐసీడీఎస్ పీడీ పి.శారదాదేవి, యూనిసెఫ్ స్టేట్‌కో–ఆర్డినేటర్ సుహాసిని, డీఎంహెచ్‌వో కె.చంద్రయ్య, జీఎంఆర్ ప్రతినిధి సుధాకర్, జిల్లా శిశు సంరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు పాల్గొన్నారు. -
ఓ తండ్రి ఆక్రందన!
► తనను బతకనివ్వాలంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట వ్యక్తి నిరాహార దీక్ష ► పోలీసులు, తహసీల్దార్ పట్టించుకోలేదని ఆవేదన ► కన్నకొడుకులే ఈ దుస్థితికి కారణమంటూ కన్నీటిపర్యాంతం కన్న కొడుకులు పొమ్మన్నారు.. ఇంటికి వెళ్తే తాళం వేశారు.. భార్య విడిచిపెట్టింది. అందరూ ఉండి, అనాథై రోడ్డుపాలైన ఓ వ్యక్తి జీవితమిది. అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయే పరిస్థితుల్లో ఉన్నానని, తనను బతికించండంటూ ప్రాధేయపడుతూ అందరి కంటా కన్నీళ్లు తెప్పించాడు. ఈ సంఘటన సోమవారం పలాసలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కాశీబుగ్గ : పలాస మండలం బ్రాహ్మణతర్లా గ్రామానికి చెందిన తెప్పల ధర్మారావు డిప్లమో చదివి హిందుస్తాన్ మోటార్ కంపెనీ(కోల్కత్తా)లో ఉద్యోగం చేసేవాడు. అతనికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారులిద్దరినీ బాగాచ దివించి, ప్రయోజకులను చేశాడు. కాశీబుగ్గకు చెందిన ప్రముఖ వ్యాపారుల కుమార్తె, సొంత మేనమామ కూతురైన భార్య.. పిల్లలు చదువుతున్న సమయంలోనే ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయింది. ప్రస్తుతం కుమారులిద్దరూ పెళ్లిళ్లు జరిగి స్థిరపడ్డారు. వారిలో పెద్ద కుమారుడు దేవేంద్రవర్మ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. పూణేలో ఉద్యోగం చేస్తూ, హైదరాబాదులో చేస్తున్నట్లు చిరునామా ఇచ్చి తప్పించుకుంటున్నాడు. ధర్మారావు పేరున ఉన్నటువంటి 30 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో రాయించుకొని తండ్రిని ఇంటి నుంచి గెంటేశాడు. చిన్నకొడుకు సురేంద్రవర్మ బ్రాహ్మణతర్లా గ్రామంలో మెడికల్ ప్రాక్టిషనర్(ఆర్ఎంపీ)గా పనిచేస్తున్నాడు. ఇద్దరు కుమారులు తండ్రి వద్ద డబ్బును, భూమిని తీసుకొని రోడ్డున వదిలేశారు. ఆకలేస్తుందని ఇంటికి వెళ్లిన ప్రతిసారీ.. కోడళ్లు తలుపులకు తాళాలు వేసి బయటకు పొమ్మంటున్నారని ధర్మారావు కన్నీటిపర్యాంతమయ్యాడు. విషపదార్థాలు కలిపిన భోజనం ఇచ్చి తనను చంపాలని చూశారని ఆవేదన చెందాడు. ఏడాది నుంచి బ్రాహ్మణతర్లా బస్టాండ్‌లో పడుకుంటున్నానని, చుట్టుపక్కల వారంతా గంజి పోస్తే తాగుతున్నానని వాపోయాడు. తాను చావుకు దగ్గరగా ఉన్నానని, ఈ నిరసన ద్వారా తన బాధను వ్యక్తం చేస్తున్నానని సోమవారం పలాస తహసీల్దార్ ముందు కన్నీరుపెడుతూ అందరి హృదయాలనూ కదిలించాడు. ఫోర్జరీ సంతకాలంతో భూములను రాయించుకున్నారని కలెక్టర్ లక్ష్మీనరసింహంతోపాటు.. టెక్కలి ఆర్డీఓ వెంకటేశ్వరరావు, పలాస తహసీల్దార్, కాశీబుగ్గ పోలీసులకు అనేక సార్లు ఫిర్యాదు చేశానని తెలిపాడు. వారెవరూ పట్టించుకోలేదని అధికారుల తీరును ఎండగట్టాడు. చివరికి తన వద్ద ఉన్న నగదును ఖర్చు పెట్టి.. ఫోర్జరీ సంతకాలు చేసిన వైనంపై పలాస తహసీల్దార్‌కు కోర్టు నోటీసును సైతం పంపించాడు. ఈ నిరసనకు స్పందించిన పలాస తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి.. ఆయనతో మాట్లాడారు. నెలరోజుల్లో న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. -
ఆడదామా హోలీ
కులం... మతం... ప్రాంతం... రంగు... రూపు... ఏదైనా... ఆడాలి హోలీ. మనసులు కలిసే రంగోలి... కలర్‌ఫుల్ కేళీ... ఆవో... ఖేలో... హోలీ... రంగులతో సందడి చేసిన లావణ్యా త్రిపాఠి ⇔ ‘సాక్షి’ కోసం సరదాగా హోలీ ఆడతారా? లావణ్య త్రిపాఠి: బాబోయ్.. హోలీ రంగులంటే నాకు భయం. అయినా అడిగారు కాబట్టి, ఓకే. ⇔ హోలీ పండగ అనగానే మీకు గుర్తుకొచ్చేది ఏంటి? చిన్నప్పటి విషయాలు గుర్తుకొస్తాయి. నార్త్‌లో హోలీ బాగా జరుపుకుంటారు. మా డెహ్రాడూన్‌లో అయితే పిచ్చి పట్టినట్లుగా ఆడతారు. ఉదయాన్నే నిద్ర లేచి, పక్కింటికి వెళ్లి, నిద్ర లేవని వాళ్లను లేపేసి మరీ రంగులు చల్లేవారు. నేనైతే దుప్పటి ముసుగు తన్ని నిద్రపోతుండేదాన్ని. నా నిద్ర మత్తు వదిలే లోపు రంగులు చల్లేయాలనుకునేవాళ్లు. కానీ, వాళ్లకి ఆ ఛాన్స్ ఇచ్చేదాన్ని కాదు. అందకుండా పరిగెత్తేదాన్ని. ⇔ అవునూ.. అసలు హోలీ అంటే మీకెందుకంత భయం? నాకు రంగులు పూసుకోవడం పెద్దగా ఇష్టం ఉండేది కాదు. అందుకే వీలైనంతగా ఎస్కేప్ అవ్వడానికి ప్రయత్నించేదాన్ని. కానీ, ఫ్రెండ్స్ ఊరుకుంటారా? వెతికి పట్టుకుని మరీ రంగులు పూసేసేవాళ్లు. ఏడ్చినంత పని చేసేదాన్ని. ఆ వెంటనే నవ్వు కూడా వచ్చేసేది. ⇔ రంగులు పూసుకోవడం ఎందుకు ఇష్టం ఉండేది కాదు? డ్రై కలర్స్ అయితే ఓకే. ఈ రంగు నీళ్లతోనే నాకు ప్రాబ్లమ్. బట్టలు తడిసిపోతాయ్. జుత్తు తడుస్తుంది. రంగు వదిలించుకోవడానికి నానా తిప్పలు పడాలి. ఒంటికి అతుక్కుపోయిన రంగు ఓ పట్టాన వదలదండీ బాబూ. ⇔ మరి... హోలీ స్వీట్స్ గురించి? అవి మాత్రం ఓ పట్టు పట్టేదాన్ని. మా అమ్మగారు బెస్ట్ కుక్. మామూలు వంటల నుంచి పిండి వంటల వరకూ... అన్నీ బాగా చేస్తారు. హోలీ అప్పుడు చేసే ఖీర్, మాల్పువా, గుజియా... అన్నీ ఇష్టమే. అప్పుడైతే డైటింగ్ ప్రాబ్లమ్ లేదు కదా. ఎన్ని స్వీట్లయినా లాగించేసేదాన్ని. ⇔ స్వీట్స్ అందరికీ పంచేవారా? కలర్స్ చల్లుకుంటూ ఆడటం ఇష్టం ఉండేది కాదు కానీ, స్వీట్స్ మాత్రం చాలా జోరుగా పంచేదాన్ని. మా వీధి వీధంతా నాకు ఫ్రెండ్సే. వాళ్లు పిండి వంటలు తెచ్చివ్వడం, నేను వెళ్లి ఇవ్వడం... భలే సరదాగా ఉండేది. ⇔ రంగుల పండగ కాబట్టి, మీకిష్టమైన రంగుల గురించి? గాళ్స్ కలర్ పింక్. అదంటే నాకు ఓ స్పెషల్ లవ్. ఆరెంజ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఎల్లో కలర్ అంటే కూడా లవ్వే. ఎల్లో కలర్ విషయంలో నా ఫ్రెండ్స్ కొంతమంది నన్ను విపరీతంగా ఆటపట్టించేవారు. ‘ఎల్లో ఎల్లో డర్టీ ఫెల్లో’ అనేవాళ్లు. ఎల్లో గురించి ఎవరేమన్నా... నాకు అదంటే ఇష్టమే. వైట్ కలర్ అన్నా ఇష్టమే. బట్ హోలీ రంగుల్లో వైట్ ఉండదు కదా. కానీ, మన మనసు మాత్రం అలా ఉండాలి. ⇔ రంగుల గురించి కొన్ని విషయాలు చెప్పండి? ఒక్కో రంగుకి ఒక్కో మూడ్ ఉంటుంది. దాని గురించి నేను వివరంగా చెప్పలేను కానీ, నా మూడ్, క్లైమెట్ని బట్టి నేను కలర్స్ సెలక్ట్ చేసుకుంటాను. బాగా ఎండగా ఉన్నప్పుడు లైట్ కలర్స్, వీలైతే ఎక్కువగా వైట్ డ్రెస్సులు వేసుకుంటాను. చల్లని వాతావరణానికి ముదురు రంగులు బాగా నప్పుతాయి. హోలీ అంటే ‘ఫెస్టివల్ ఆఫ్ కలర్స్’. ఈ సందర్భంగా అందరి జీవితం కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ⇔ సినిమాల్లో మీరు చేసిన హోలీ సీన్స్ గురించి చెబుతారా? నా ఫస్ట్ మూవీ ‘అందాల రాక్షసి’లో హోలీ సీన్ ఉంది. పర్సనల్‌గా రంగు నీళ్లు ఇష్టం లేకపోయినా... ప్రొఫెషనల్‌గా చేయక తప్పలేదు. ఆ సీన్లో పిల్లలు నా మీదకు రంగులు చల్లడానికి వస్తుంటే, నేను వద్దంటూ మొహానికి చేతులు అడ్డం పెడుతూ, వెనక్కి వెనక్కి వెళుతుంటాను. రియల్ లైఫ్‌లో కూడా అలానే చేసేదాన్ని. అందుకే ఆ సీన్ చేసేటప్పుడు నా చిన్నప్పటి విశేషాలు గుర్తొచ్చాయి. నీళ్లల్లో తడిచే సీన్లు చేయడం కష్టం. తడవడం, కాసేపటికి బట్టలు ఆరిపోవడం, మళ్లీ తడవడం... ఇదే తంతు. భలే గమ్మత్తుగా అనిపించింది. ‘భలే భలే మగాడివోయ్’లో కూడా ఇలాంటి సీన్ చేశాను. స్క్రీన్ మీద ఆ కలర్‌ఫుల్ సీన్స్ చూసినప్పుడు నేను ఫుల్లుగా ఎంజాయ్ చేసి, చేసినట్లే మీకు అనిపిస్తుంది. అంతా యాక్టింగ్. చెప్పాను కదా... రంగు నీళ్లు ఇష్టం ఉండదని. ⇔ హైదరాబాద్‌లోనే ఎక్కువగా ఉంటున్నారు కాబట్టి, డెహ్రాడూన్‌ని మిస్సవుతన్నట్లు అనిపిస్తోందా? తెలుగు సినిమాలు చేస్తూ దాదాపు హైదరాబాద్‌లోనే ఉంటున్నాను కదా. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా పండగలప్పుడు మాత్రం మా ఊరు గుర్తొస్తుంటుంది. ఆ రోజులే వేరు అనిపిస్తుంది. ⇔ హోలీ ఆడబోయే వాళ్లకు మీరిచ్చే సలహా? ఏ పండగైనా ముందు పిల్లలకే సలహా ఇస్తాం. పిల్లలూ జాగ్రత్తగా ఆడుకోండి. రంగు పొడులు కళ్ల మీద పడకుండా చూసుకోండి. ముక్కుకి మాస్క్ తగిలించుకోండి. కళ్లద్దాలు పెట్టుకుంటే కళ్లల్లో నీళ్లు పడవు. రంగు పొడులు కొనుక్కునేటప్పుడు మీరంతట మీరు వెళ్లొద్దు. పెద్దవాళ్లను తీసుకెళ్లండి. ఇక, పెద్దలకు చెప్పొచ్చేదేంటంటే... మీరు కూడా జాగ్రత్త సుమా. ఇప్పుడు కల్తీ పొడులు వస్తున్నాయట. ఆర్గానిక్ కలర్స్ కొంటే సేఫ్. ⇔ ఫైనల్లీ... ఈ ఏడాది మీ కెరీర్ ఎప్పటిలా కలర్ఫుల్గా ఉంటుందనిపిస్తోందా? యస్ అండీ. గత ఏడాది ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’... రెండూ పెద్ద హిట్. ఈ ఏడాది కూడా హిట్స్ గ్యారంటీ అనే నమ్మకం ఉంది. శర్వానంద్‌తో చేసిన ‘రాథ’ ఈ నెలాఖరున విడుదల కానుంది. మంచి సబ్జెక్ట్. నా పాత్ర బాగుంటుంది. వరుణ్ తేజ్ పక్కన చేస్తున్న ‘మిస్టర్’లోనూ నాది మంచి క్యారెక్టర్. నాగచైతన్యతో చేస్తున్న సినిమాలో కూడా మంచి పాత్రే. సో... కెరీర్ ఎప్పటిలా కలర్ఫుల్గా ఉంటుందనే నమ్మకం ఉంది. హోలీ సాంగ్స్... కొన్ని 1 సందెపొద్దు మేఘం (నాయకుడు) 2 కొట్టు కొట్టు కొట్టు రంగుతీసి కొట్టు (మాస్ ) 3 దిల్ దిల్ దివానా... (జెమిని) 4 రంగు రబ్బా రబ్బా... (రాఖీ) 5 హోలీ రంగోలీ హోలీ... హంగామా హోలీ (చక్రం) 6హరివిల్లే హోలీ (మహానగరంలో) 7హోలీ... హోలీ.. (శాడిస్టు) 8హోలీ.. హోలీ (దొంగోడి పెళ్లి) 9హోలీ.. హోలీ పండగల్లే ఉత్సాహమేదో ఉప్పొంగుతుంది నాలో.. (శ్రీ) హోలీ.. కేర్ హోలీ వేడుకలో చర్మాన్ని సురక్షితంగా ఉంచుకోడానికి కొన్ని సూచనలు... ⇒ రంగులు చల్లుకునే ముందు జుట్టు, ముఖం, దేహానికి కొబ్బరినూనె రాసుకోవాలి. ఇలా చేస్తే దేహానికి అంటిన రంగులను వదిలించడం సులభం. ⇒ చేతి గోళ్లకు, కాలిగోళ్లకు నెయిల్‌పాలిష్ మందంగా వేయాలి. గోరు చుట్టూ ఉన్న చర్మానికి కూడా పాలిష్ రాయాలి. ట్రాన్స్పరెంట్ నెయిల్‌పాలిష్‌లు ఉన్నాయి. కాబట్టి మగవారు కూడా హోలీ ఆడే ముందు నిరభ్యంతరంగా నెయిల్‌పాలిష్ వేసుకోవచ్చు. ⇒ రంగులను వదిలించుకునేటప్పుడు చర్మం మంట పుడుతుంటే కాలమైన్ లోషన్ రాసుకోవచ్చు. ⇒ సాధ్యమైనంత వరకు పొడి గులాల్నే వాడాలి. ⇒ ఎండలో హోలీ ఆడితే డీహైడ్రేషన్ బారిన పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎండ పెరిగే లోపు ముగించాలి. ⇒ ఆర్గానిక్ కలర్స్‌నే వాడాలి. అవి చర్మానికి పట్టేసినా కూడా ఎటువంటి హాని కలిగించవు. ⇒ రంగులు పెదవులకు అంటకూడదు. కళ్లలోకి, ముక్కు రంధ్రాలలోకి రంగు వెళ్లినా ప్రమాదమే. కాబట్టి ఎవరికీ బలవంతంగా, మొండిగా ముఖానికి రాయడానికి ప్రయత్నించకూడదు. ⇒ హోలీ రంగులు చల్లుకోవడం పూర్తయిన వెంటనే శుభ్రంగా స్నానం చేయాలి. రంగు త్వరగా వదిలించుకోవాలనే తాపత్రయంలో మరీ వేడిగా ఉన్న నీటిని పోసుకోకూడదు. స్నానం తర్వాత చర్మం మంటపుడుతుంటే వెన్న లేదా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. ⇒ రంగులు వదలడానికి డిటర్జెంట్ సబ్బులను ఉపయోగించవద్దు. స్నానానికి వాడే జంటిల్ సోప్స్ మాత్రమే వాడాలి. ⇒ ఒంటిపై దద్దుర్లు, ఎర్రమచ్చలు, అలర్జీ వంటివి వస్తే డర్మటాలజిస్ట్‌ను కలవాలి. కళ్ల సంరక్షణకు... ⇒ రంగులు తళుకుమనేందుకు చమ్కీలు కలుపుతుంటారు. రంగులు, చమ్కీలు ఏవీ కళ్లలోకి వెళ్లకూడదు. కాబట్టి గాగుల్స్ లేదా ప్రొటెక్టివ్ గ్లాస్‌లను వాడాలి. ⇒ హోలీ గన్‌తో రంగు నీళ్లు చల్లుకునేటప్పుడు ముఖానికి గురిపెట్టకూడదు. తల మీద మరీ ఎక్కువ నీటిని చల్లినప్పుడు అవి కళ్లలోకి జారుతాయి. కాబట్టి ఆడేటప్పుడు రంగులు చల్లేవాళ్లు... చల్లించుకునేవాళ్ల ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ⇒ కళ్లలోకి రంగు వెళ్లినట్లు గ్రహిస్తే వెంటనే పరిశుభ్రమైన నీటితో కంటిని కడగాలి. ⇒ నీళ్లతో కడిగిన తర్వాత కూడా కళ్లమంటలు అనిపించినా, కళ్లకు ఏ మాత్రం అసౌకర్యం అనిపించినా వెంటనే కంటి డాక్టర్‌ను సంప్రదించాలి. – డి.జి. భవాని -
బరువైన బాల్యం..
సాధారణంగా ఐదేళ్ల వయసు పిల్లలెవరైనా అప్పుడే స్కూల్‌కి వెళ్తూ, అమ్మనాన్నల ఒడిలో ఆడుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులు, బామ్మ, తాతయ్యల ఆలనాపాలనలో సేదతీరుతూ గడిపేస్తారు. ఆ వయసులో పిల్లలకు ఎలాంటి ఒత్తిడీ, బాధ్యతలూ ఉండవు. అయితే అందరిబాల్యం ఒకేలా ఉండదు. కొందరు పిల్లలు చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. చైనాకు చెందిన అన్నా వాంగ్ అనే ఓ ఐదేళ్ల బాలిక తన బామ్మ, తాతమ్మలను సంరక్షిస్తోంది. చిన్నతనంలోనే వయసుకు మించిన బాధ్యతల్ని మోస్తూ విస్మయపరుస్తోంది. వయసుకు బరువైన పనులైనా, బాధ్యతగా భావిస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తోంది. ఎవరూ లేకపోవడంతో.. నైరుతి చైనాలోని జుయిన్ అనే మారుమూల పర్వత ప్రాంతంలో ఉండే ఓ గ్రామంలో చిన్న ఇంటిలో నివసించే బాలిక అన్నా వాంగ్. అన్నాకి మూడు నెలల వయసున్నప్పుడు, ఆమె తండ్రి జైలుపాలయ్యాడు. కొంతాలం తర్వాత తల్లి రెండో పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో ఇంట్లో అన్నా, ఆమె బామ్మ, తాతమ్మ (బామ్మకి అమ్మ) మాత్రమే మిగిలారు. వృద్ధులైన బామ్మ, తాతమ్మల్ని సంరక్షించడానికి ఎవరూ లేరు. దీంతో ఆ బాధ్యతల్ని అన్నా తీసుకుంది. వారిద్దరి సంరక్షణకు పూనుకుంది. అన్నీ తానై.. చిన్నప్పటినుంచే బామ్మ, తాతమ్మలకు సేవ చేయడం మొదలుపెట్టింది అన్నా. వృద్ధులైన వారిద్దరూ దాదాపుగా మంచానికే పరిమితం. బామ్మకి ఆర్థరైటిస్ సహా పలు అనారోగ్య సమస్యలుండడంతో ఎటూ కదలలేదు. తాతమ్మకు కూడా దాదాపు 92 ఏళ్లు ఉండడంతో ఆమె సైతం సొంతంగా ఏ పనీ చేసుకోలేదు. దీంతో ఇద్దరి సంరక్షణా బాధ్యతల్ని అన్నా తన భుజాలపై వేసుకుని, వారికి అన్ని రకాలుగా సాయపడుతోంది. వంటసహా బాధ్యతలన్నీ.. ఐదేళ్లలోపు పిల్లలకు వంట చేయడం అసలేరాదు. కానీ అన్నా మాత్రం బామ్మ, తాతమ్మల కోసం రోజూ వంట చేస్తుంది. నిజానికి ఇంట్లో వంట చేసే స్టవ్ చాలా ఎత్తులో ఉన్నప్పటికీ, ఓ స్టూల్ వేసుకుని వంట చేయడం విశేషం. ఇక పక్కనే ఉన్న తోటలోకి వెళ్లి రోజూ తాజా కూరగాయలు తీసుకుని వస్తుంది. ఈ విషయంలో చుట్టుపక్కల వారు ఎంతగానో సహకరిస్తారు. అన్నా కష్టం చూడలేని వారు, ఎప్పుడు అవసరమైనా తమ పొలంలోంచి నచ్చిన కూరగాయలు తీసుకెళ్లేందుకు అనుమతించారు. ప్రతి పనీ సొంతంగానే.. అన్నా ప్రతిరోజూ సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి దినచర్య ప్రారంభిస్తుంది. ఇల్లు శుభ్రం చేయడం, కూరగాయలు తీసుకురావడం, వంట చేయడం సహా మొత్తం పనులన్నీ సొంతంగానే చేస్తుంది. అన్నాకు సాయపడేందుకు ఎవరూ లేరు. బామ్మ, తాతమ్మలకు స్నానం చేయించడం, తినిపించడం, కాలకృత్యాలకు తీసుకెళ్లడం వంటి పనులను సైతం అన్నా ఏ విసుగూ లేకుండా చేస్తుంది. పిల్లలు ఈ వయసులో పెద్దవారికి అంత సేవచేయడం చాలా అరుదు. కానీ అంత సేవ చేస్తున్నా, బామ్మ, తాతమ్మలపై అన్నాకి కొంచెం కూడా విసుగురాదు. వారికి సేవచేయడం తనకెంతో ఇష్టమని, వారిద్దరి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటానని అన్నా చెప్పింది. అయితే అప్పుడప్పుడూ తన తండ్రి ఫొటో చూస్తూ అన్నా కంటతడి పెట్టుకుంటుంది. తన తండ్రి జైలు నుంచి తిరిగొస్తాడని, ఇబ్బందులు తొలగిపోతాయని ఆశతో ఎదురు చూస్తోంది అన్నా. – సాక్షి, స్కూల్ ఎడిషన్ -
రాయితీలు.. ఆర్థిక వృద్ధే లక్ష్యం!
బడ్జెట్‌పై వివిధ సంస్థల వినతి l పన్నుల వ్యవస్థలో మార్పు: కేర్ l పన్ను మినహాయింపులు కావాలి: ఎస్బీఐ l ద్రవ్యలోటు లక్ష్యం పెరుగుతుంది: గోల్డ్‌మన్ l పసిడిపై పన్నుల భారం తగ్గించాలి: డబ్ల్యూజీసీ ముంబై: కేంద్ర బడ్జెట్ సమయం ఫిబ్రవరి 1వ తేదీ దగ్గరపడుతుండడంతో, దీనిపై పలు విశ్లేషణా, అధ్యయన సంస్థల నుంచి వివిధ రంగాల్లో నిపుణుల వరకూ విభిన్న అంచనాలు వెలువడుతున్నాయి. పన్నుల వ్యవస్థలో మార్పులు ఉంటాయని రేటింగ్ ఏజెన్సీ– కేర్ పేర్కొంది. ఆర్థిక వృద్ధి అవసరమని, ఇందుకు ఐటీలో మినహాయింపులు కావాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం– ఎస్బీఐ పేర్కొంటే, ద్రవ్యలోటు కట్టు తప్పడం ఖాయమని గ్లోబల్ ఫైనాన్షియల్ సర్సీసెస్ సంస్థ– గోల్డ్‌మన్ శాక్స్ విశ్లేషించింది. ఇక పసిడి వ్యాపారంలో పారదర్శకతను పెంచాలని ప్రపంచ పసిడి మండలి డిమాండ్ చేసింది. వేర్వేరుగా ముఖ్యాంశాలు చూస్తే... అదనపు ఆదాయం లక్ష్యం వ్యక్తులు, కార్పొరేట్లకు సంబంధించి పన్నుల వ్యవస్థలో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రెవెన్యూ పెంపు ప్రధాన లక్ష్యంగా చర్యలు ఉండవచ్చు. పరోక్ష పన్నులకు సంబంధించిన వ్యవస్థ జీఎస్టీకి కొంత దగ్గరకు జరిగే విధంగా బడ్జెట్ రూపొందించే అవకాశం ఉంది. సేవలపై ప్రభుత్వ లెవీ పన్ను 12 నుంచి 18 శాతంగా ఉండవచ్చు. కాగా ప్రత్యక్ష పన్నుల విషయంలో కార్పొరేట్ పన్నును కేంద్రం తగ్గించవచ్చు. వచ్చే నాలుగేళ్లలో ఈ రేటును 30 శాతం నుంచి 25 శాతానికి తగ్గించడానికి రోడ్ మ్యాప్ ఉంటుందని భావిస్తున్నాం. కొన్ని మినహాయింపులను రద్దుచేస్తూ... తొలిదశగా ఈ రేటును 27.5 శాతానికి తగ్గించవచ్చు. రెవెన్యూ వ్యయాల విషయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఇది 17.31 లక్షల కోట్లు ఉంటే, ఇది వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10–15 శాతానికి పెరిగే వీలుంది. ఇక మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్‌కు సంబంధించి వ్యయాలను 10% వరకూ పెంచవచ్చు. 3 లక్షలకు ఐటీ మినహాయింపు పరిమితి పెంపు! ఆర్థిక వృద్ధి లక్ష్యంగా ఆదాయపు పన్ను(ఐటీ) మినహాయింపుల పరిమితులను పెంచాలని ప్రభుత్వ రంగ ఎస్బీఐ ఒక నివేదికలో కోరింది. ఈ పరిమితి ప్రస్తుత రూ.2.5 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నట్లు పేర్కొంది. ఇలాంటి చర్య తీసుకుంటే 75 లక్షల మంది ఆదాయపు పన్ను మినహాయింపు పొందగలుగుతారని పేర్కొంది. సెక్షన్ 80 సీ కింద పరిమితిని ప్రస్తుత రూ.1.5 లక్షల నుంచి 2 లక్షలకు పెంచుతారన్నది అంచనాగా తెలిపింది. గృహ రుణంపై వడ్డీ మినహాయింపును రూ. 2 లక్షల నుంచి 3 లక్షలకు పెంచుతారని భావిస్తున్నట్లు పేర్కొంది. బ్యాంకుల్లో స్థిర డిపాజిట్ల లాకిన్ కాలాన్ని ఐదేళ్ల నుంచి 3 సంవత్సరాలకు తగ్గించాలన్నది గత కొంత కాలంగా బ్యాంకింగ్ చేస్తున్న విజ్ఞప్తిగా వివరించింది. అలాగే వ్యవసాయ రంగంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొంది. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరం జీడీపీలో ద్రవ్యలోటు లక్ష్యం పెరిగే అవకాశం ఉందనీ, ఇది 3.4 శాతంగా (5.74 లక్షల కోట్లు) ఉండవచ్చని నివేదిక అంచనావేసింది. 3.4 శాతం వరకూ ద్రవ్యలోటు...: గోల్డ్‌మన్ శాక్స్ మరోవైపు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు లక్ష్యాలను కేంద్రం మార్చే వీలుందని అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజం– గోల్డ్‌మన్ శాక్స్ అంచనావేసింది. ఈ లోటు 3.3% నుంచి 3.4 శాతం మధ్య ఉంటుందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య వ్యత్యాసం– ద్రవ్యలోటు పరిమాణం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చితే 3.5 శాతం (రూ.5.33 లక్షల కోట్లు) దాటకూడదన్నది బడ్జెట్ లక్ష్యం. పసిడి పన్నులను తగ్గించాలి: డబ్ల్యూజీసీ రానున్న బడ్జెట్లో పసిడిపై పన్నులను కేంద్రం ప్రస్తుత భారీ 13 శాతం నుంచి తగ్గించాలని ప్రపంచ పసిడి మండలి (డబ్ల్యూజీసీ) కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనివల్ల దేశంలోకి పసిడి అక్రమ రవాణా తగ్గుతుందని, స్థానిక పసిడి వాణిజ్యంలో పారదర్శకత మెరుగుపడుతుందని విశ్లేషించింది. ప్రస్తుతం పసిడిపై 10 శాతం కస్టమ్స్ సుంకం ఉంది. ఎక్సైజ్ సుంకం 1 శాతం. వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ 1.5 శాతం. ఈ రంగంలో పారదర్శకతను నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తున్నట్లయితే, కేంద్రం తప్పనిసరిగా పసిడిపై పన్నుల తీరును సమీక్షించాలని డబ్ల్యూజీసీ భారత్ కార్యకలాపాల చీఫ్ సోమసుందరం పీఆర్ పేర్కొన్నారు. ‘‘జీఎస్టీ వ్యవస్థలో 3 నుంచి 6 శాతం పన్ను ఉంటుందని భావిస్తున్నారు. కస్టమ్స్ సుంకం 10 శాతంగా కొనసాగితే, యల్లోమెటల్పై మొత్తం పన్ను 13 నుంచి 16 శాతంగా ఉంటుంది. ఇది చాలా ఎక్కువ. ఇదే జరిగితే దేశంలో మరింత పసిడి అక్రమ వ్యాపారం పెరిగే అవకాశం ఉంటుందని, దీనికి తావివ్వడం తగదు’’ అని విశ్లేషించారు. -
వారఫలాలు : 22 జనవరి నుంచి 28 జనవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొన్ని వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. తెలుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ వ్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. స్వల్ప అనారోగ్యం. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యావకాశాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం,తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు, అవార్డులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి కొంత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమానురాగాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యయప్రయాసలతోనే కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మాటపట్టింపులు. తీర్థయాత్రలు చేస్తారు. రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఎంతో ఉత్సాహవంతంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందడం వల్ల కొంత ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూలత. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వస్తులాభాలు. ఇంటì నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. -
మంటలకు ఆహుతైన కారు
సురక్షితంగా తప్పించుకున్న ప్రయాణికులు తోకాడ (రాజానగరం) : రాజానగరం నుంచి అనపర్తికి వెళ్లే ఆర్అండ్బి రోడ్డుపై తోకాడ శివారులో ఒక కారు మంటలకు ఆహుతైంది. ప్రయాణీకులు మాత్రం సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడ్డారు. అనపర్తి వైపు వెళ్తున్న ఈ కారు నుంచి అకస్మాత్తుగా పొగలు రావడంతో కారును రోడ్డు పక్కకు ఆపి, అందులో ప్రయాణిస్తు్తన్న ఇద్దరు వ్యక్తులు బయటకు వచ్చేయడంతో ప్రాణనష్టం తప్పింది. పొగలు కాస్త ఉవ్వెత్తున ఎగసి జ్వాలలుగా మారి కారు చూస్తుండగానే కాలిపోయింది. అయితే ఈ కారు నుంచి బయట పడిన వ్యక్తులు వేరొక వాహనంలో వెళ్లిపోవడంతో వివరాలు తెలియలేదు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగివుండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. -
వారఫలాలు :18 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యసమస్యలు తీరతాయి. ,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. గులాబీ, బంగారురంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థికంగా అనుకూలస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యనిర్ణయాలలో కొంత జాప్యం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులు, కళాకారులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఉత్తరదిశ ప్రయాణాలు అనూకులం. శివస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. ఎరుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ æఒత్తిడులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సకాలంలో సహాయ సహకారాలు అందుతాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటుంబవిషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. దైవదర్శనాలు చేసుకుంటారు. పసుపు, బంగారురంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురైనా చలించరు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగులకు కలసివచ్చేకాలం. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. కోర్టు కేసులు పరిష్కారం. ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శుభవర్తమానాలు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు.తెలుపు, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు నూతనోత్సాహం. బంగారు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. వాహన, గృహయోగాలు కలసి వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త çహోదాలు దక్కే అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన రావచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శిస్తారు. తెలుపు, ఆకుపచ్చరంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటా బయటా ప్రోత్సాహం. అనుకోని విధంగా ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, తెలుపు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. -
వారఫలాలు : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆదాయం పెరుగుతుంది. గత నిర్ణయాలను మార్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూలం. వాహన, గృహయోగాలు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కార్యజయం. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని విషయాలలో మౌనం వీడాల్సిన సమయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. బంధువులతో సత్సంబంధాలు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు సంతోషకరంగా గడుపుతారు. ఆకుపచ్చ, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. రాబడి ఆశాజకనంగా ఉంటుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఒక ముఖ్యసమాచారం అందుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా మూడుసార్లు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.రాజకీయవర్గాలకు పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. తెలుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. వ్యాపారాలు ప్రగతిదాయకం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు యత్నకార్యసిద్ధి. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో సంతోషకరంగా గడుపుతారు. సేవలకు తగిన గుర్తింపు. అదనపు రాబడి దక్కుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణంతో ముందడుగు వేస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించే సమయం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. గులాబీ, లేతఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విద్యార్థులకు అనుకూల సమాచారం. వాహనయోగం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల అవకాశం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తథ్యం. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నలుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళ పరుస్తుంది. కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందకొడి గా సాగుతాయి.ఉద్యోగులకు ఆక స్మిక మార్పులు. కళాకారులకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పాతమిత్రుల ద్వారా ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో లాభాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. లేత పసుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠనం మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న ఆదాయం సమకూరడంలో కొంత జాప్యం. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. పసుపు, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు ఒత్తిడులు ఉన్నా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి కొంత పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. బంధువర్గం సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు కొంత వరకూ పరిష్కారమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్తహోదాలు దక్కవచ్చు. కళాకారుల కృషి ఫలిస్తుంది. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనే యస్వామి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పాతమిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. బంధువుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు అనుకున్న పదవులు దక్కుతాయి. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చే స్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. గులాబీ, బంగారురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీర తాయి. కొన్ని ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఎరుపు, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు సహాయ పడతారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం కొంత నిరాశ కలిగించవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ద్వారా సాయం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. లేత ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన సమాచారం అందుతుంది. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమా లలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సత్కారాలు. నేరేడు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. గతంలో చేజారిన వస్తువులు దక్కించుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆశించిన రాబడి దక్కుతుంది. సోదరులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీహనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్త అందుతుంది. రాజకీయవర్గాలకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు. నలుపు, నేరేడు రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. -
వారఫలాలు(20-11-2016 to 26-11-2016)
20 నవంబర్ నుంచి 26 నవంబర్ 2016 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. లేత ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) అదనపు ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఊరట. దూరపు బంధువులను కలుసుకుంటారు. గతంలో చేజారిన వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. పసుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న పనుల్లో అవాంతరాలు. రాబడికి మించి ఖర్చులు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ముఖ్య నిర్ణయాలలో కొంత నిదానం అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులకు ఆకస్మిక పర్యటనలు. ఆకుపచ్చ, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ సలహాల కోసం మిత్రులు ఆతృతగా ఎదురుచూస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలు అనుకున్నది సాధిస్తారు. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారుల అంచనాలు నిజమవుతాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల సమస్యలు తీరి, ఆనందంగా ఉంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు. ఆదాయం ఆశాజనకం. భూవివాదాలు తీరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. నీలం, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) గతం కంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభావంతులుగా గుర్తింపు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, వివాదాలు త ప్పవు. క్రమేపీ సాధారణస్థితి ఏర్పడుతుంది. ఆదాయం కొంత మెరుగుపడుతుంది. ఎటువంటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారుల యత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకున్న కార్యాలు కొంత శ్రమానంతరం పూర్తి కాగలవు. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులు కొంత ఉపశమనం పొందుతారు. కొన్ని సమస్యలు తీరే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంతమేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారుల యత్నాలు కలసివస్తాయి. నీలం, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక వ్యవ హారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీకృషి ఫలించే సమయం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నలుపు, బంగారురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
నోట్ల రద్దుతో వృద్ధికి కోత..!
• కేర్, ఆంబిట్ క్యాపిటల్ నివేదికలు • 2016-17లో 0.5% వరకూ వృద్ధి పడిపోతుంది: కేర్ • వచ్చే ఏడాది జీడీపీ వృద్ధి రేటు అంచనా • 7.3 శాతం నుంచి 5.8 శాతానికి ఆంబిట్ కోత • దేశీయ డిమాండ్ పడిపోతుందని విశ్లేషణ న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై పెను ప్రతికూల ప్రభావం చూపనుందని కేర్ రేటింగ్స, ఆర్థిక సేవల సంస్థ ఆంబిట్ క్యాపిటల్ శుక్రవారం విడుదల చేసిన తమ నివేదికల్లో తెలిపారుు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2016-17) వృద్ధిరేటుపై ఈ ప్రభావం 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకూ ఉంటుందని కేర్ రేటింగ్స పేర్కొంది. పలు రంగాల్లో వ్యాపారం తీవ్రంగా దెబ్బతింటుందని విశ్లేషించింది. కాగా మోదీ ప్రభుత్వ నిర్ణయం వల్ల దేశీయ డిమాండ్ గణనీయంగా పడిపోతుందని, దీనితో వచ్చే ఆర్థిక సంవత్సరం (2017-18) కేవలం 5.8 శాతం వృద్ధి మాత్రమే నమోదవుతుందని నివేదిక పేర్కొంది. చిన్న వ్యాపారాలకు పెను దెబ్బ: ఆంబిట్ ⇔ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలోనే జీడీపీ వృద్ధి రేటు తగ్గిపోయే అవకాశం ఉంది. మొదటి తొలి నెలల్లో 6.4 శాతం వృద్ధి నమోదరుుతే, ఇది ద్వితీయార్థంలో 0.50 శాతం తగ్గవచ్చు. ⇔ అక్టోబర్-డిసెంబర్ 2016 నుంచి 2019 అక్టోబర్-డిసెంబర్ మధ్య పన్ను చెల్లింపు రహిత వ్యాపారాలపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తీవ్రంగా ఉంటుంది. జీడీపీలో దాదాపు 40 శాతంగా ఉన్న ఈ వ్యాపారాలకు సంబంధించి దాదాపు సగం వ్యాపార పరిమాణాన్ని సంఘటిత రంగానికి అసంఘటిత రంగం కోల్పోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ పరిణామం అంచనా కారణంగా 2017-18 వృద్ధి రేటు అంచనాను 7.3 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గిస్తున్నాం. ⇔ రియల్ ఎస్టేట్, తనఖా రహిత రుణాలు, రియల్టీ సేవలు, బిల్డింగ్ మెటీరియల్స్ వంటి నగదు ఆధారిత లావాదేవీలపై నోట్ల రద్దు సమీప కాలంలో తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. ⇔ నగదు ఆధారిత లావాదేవీలపై అధికంగా వ్యాపారం చేసే నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స కంపెనీలపై (ఎన్బీఎఫ్సీ) సైతం ఈ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ⇔ ఆయా రంగాలు స్వల్పకాలంలో తీవ్ర నష్టాలకు గురవుతారుు. వచ్చే రెండేళ్లలో చిన్న, అసంఘటిత రంగాలు పోటీతత్వాన్ని కోల్పోతారుు. తమ మార్కెట్ వాటాను పెద్ద సంస్థలకు కోల్పోతారుు. ⇔ 2017 మార్చి నాటికి సెన్సెక్స్ 29,500 లక్ష్యంగా ఇంతక్రితం అంచనాల ఉపసంహరణ. 2018 మార్చి నాటికి సూచీ 29,000గా ఉంటుందని అంచనా. ⇔ ఆర్థిక వ్యవస్థ మందగించనున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సరళతర ద్రవ్య,పరపతి విధానాన్ని అవలంభించే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే 25 నుంచి 50 బేసిస్ పారుుంట్ల మేర రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గించే వీలుంది. ⇔ పెద్ద నోట్ల రద్దు వల్ల వ్యవస్థలో డిమాండ్ తగ్గుతుందని ఇప్పటికే సిటీగ్రూప్, కొటక్ ఇన్స్టిట్యూషనల్ ఈక్విటీస్, హెచ్ఎస్బీసీ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నారుు. ఈ పరిస్థితి ద్రవ్యోల్బణం కట్టడికి, ఆర్బీఐ రెపో రేటు కోతకు దారితీస్తాయనీ ఆయా సంస్థలు విశ్లేషించారుు. మరోవైపు రేట్ల కోత, వృద్ధి ఊపుకు తాజా చొరవ దోహదపడుతుందని పారిశ్రామిక సంఘాలు విజ్ఞఫ్తి చేస్తున్నారుు. సేవలు, తయారీలపై ప్రభావం: కేర్ రేటింగ్స ఆర్థిక వ్యవస్థలో దాదాపు 70 శాతం వరకూ ఉన్న సేవలు, తయారీ రంగాలపై ఈ నిర్ణయ ప్రతికూల ప్రభావం ఉంటుంది. అరుుతే బ్యాంకింగ్‌కు ఇది సానుకూలాంశం. వ్యవసాయంపై కొంత తక్కువ ప్రభావం ఉండే వీలుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధిరేటు అంచనా నోట్ల రద్దుకు ముందు 7.8 శాతం కాగా ఇప్పుడు దీనికి 0.3 శాతం నుంచి 0.5 శాతం వరకూ తగ్గిస్తున్నాం. సేవల రంగంలో వాణిజ్యం, హోటల్స్, రవాణా వంటి రంగాలపై ప్రతికూలత చూపుతుంది. నగదు లావాదేవీలతో ప్రత్యక్షంగా సంబంధం ఉండడం దీనికి ఒక కారణం. వచ్చే త్రైమాసికంలో కూడా ఈ రంగాల్లో రికవరీ అవకాశాలు ఉండకపోవచ్చు. అరుుతే తయారీ రంగం మాత్రం రెండు నెలలు ప్రతికూలత ఎదుర్కొనే వీలుంది. రియల్టీది కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రతికూలతే. బ్యాంకింగ్ విషయానికి వస్తే- డిపాజిట్లు భారీగా పెరిగే అవకాశం ఉంది. -
బ్లూటంగ్‌తో జాగ్రత్త ..
అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెల్లో నీలినాలుక వ్యాధి (బ్లూటంగ్) సోకే అవకాశం ఉన్నందున కాపర్లు అప్రమత్తంగా ఉండాలని పశుసంవర్ధకశాఖ ‘అనంత’ డివిజన్ సహాయ సంచాలకులు డాక్టర్ టి.శ్రీనాథాచార్ తెలిపారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనా, వర్షాలు ఎక్కువగా వచ్చినా వ్యాధి రావడానికి ఆస్కారముందన్నారు. వ్యాధి లక్షణాలు.. చికిత్స.. నివారణా మార్గాలు.. ఆయన ఇలా వివరిస్తున్నారు. బ్లూటంVŠ S: ఇది ‘క్యూలెకాయిడ్’ రకం దోమల వల్ల వ్యాపిస్తుంది. వ్యాధి బారిన పడిన గొర్రెలు ఎక్కువగా ఈసుకుపోవడం (అబార్షన్), పాల ఉత్పత్తి పడిపోవడం, గొర్రెపిల్లలు బలహీనపడటం, మాంసం, ఉన్ని నాణ్యత దెబ్బతినడం వల్ల ఆర్థికంగా నష్టం జరుగుతుంది. ఈ వ్యాధిని ‘ఏ’ క్యాటగిరీలో చేర్చినందున వీటి మాంసం విదేశీ ఎగుమతికి అవకాశం లేదు. ఈ వ్యాధి ఒక ఏడాదిలోపు గొర్రె పిల్లల్లో ఎక్కువగా సంభవిస్తుంది. లక్షణాలు : 104 నుంచి 106 డిగ్రీల జ్వరం, ముఖం, ముక్కు, పెదవులు వాచి వుండటం, నాలుక ఎర్రగా తయారై నీలి రంగుకు మారుతుంది. కళ్లుగా ఎర్రబడి కనురెప్పలు, చెవులు, కింది దవడ వాపు రావడం జరుగుతుంది. ముక్కు నుంచి తెల్లటి జిగట స్రవాలు రావడం, నోటిలోని మాంసం పొరలు (మ్యూకస్ మెంబ్రేన్) పుండ్ల మాదిరిగా ఏర్పడటం, తొడల మధ్య, చంకల్లో, మల ద్వారం కింద చర్మం ఎర్రగా కమిలినట్లు ఉండటం, వ్యాధి తీవ్రంగా ఉన్న గొర్రెల్లో గిట్టల మొదటి భాగం వాచి, మధ్యలో ఎర్రగా ఉండటం, చర్మం దెబ్బనడం వల్ల ఉన్ని, వెంట్రుకలు ఊడిపోవడం, తీవ్రతను బట్టి ఐదారు రోజులు మేత మేయక, నీరు తాగక నీరసించి చనిపోయే అవకాశం ఉంటుంది. చనిపోయిన గొర్రెల్లో ఊపిరితిత్తులు వాపు, గాలిగొట్టాలు నురుగ వంటి ద్రవాలతో నిండిపోవడం, ఎద భాగంలో నీరు చేరుట, గుండె పొరల్లో రక్తస్రావం, ఊపిరితిత్తులకు సంబంధించిన రక్తనాళం మొదటి భాగంలో రక్తస్రావం జరిగినట్లు తెలుస్తుంది. చికిత్స : ఎలీసా పరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చు. వ్యాధి బహిర్గతమైన తర్వాత ఎలాంటి చికిత్స లేదు. గాలికుంటు, పీపీఆర్ వ్యాధి లక్షణాలు కూడా నీలినాలుక వ్యాధికి సారూప్యత ఉండటంతో పశువైద్యులను సంప్రదించి చికిత్స పొందాలి. నోటిలో పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, బోరిక్ పౌడర్‌ను పూయాలి. వైద్యుని సలహా మేరకు యాంటీబయాటిక్ మందులు వాడాలి. గిట్టల మధ్య పుండ్లను పొటాషియం పర్మాంగనేట్ ద్రావణంతో కడిగి, హిమాక్స్, నెమ్‌లెంట్ వంటి మందులను పూయాలి. దోమలను నివారించాలి : వర్షాకాలంలో గొర్రెల కొట్టం, పరిసర ప్రాంతాల్లో నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం, రాత్రి సమయాల్లో మంద చుట్టూ వేపాకు పొగ వేసి దోమలను నివారించవచ్చు. ప్రతి 10–15 రోజులకోసారి గొర్రెల శరీరంపై, కొట్టంలో 2 శాతం బ్యూటాక్స్ మందును పిచికారీ చేయడం ద్వారా దోమకాటును అరికట్టవచ్చు. రాత్రి పూట మందుకు కొద్ది దూరంలో పెట్రోమాక్స్ లైట్లను వెలిగించడం ద్వారా దోమల శాతాన్ని తగ్గించవచ్చు. గొర్రెలను ఎల్తైన ప్రదేశంలో ఉంచాలి. గొర్రెల మందలో ఆవులు, దూడలు కట్టేయడం ద్వారా దోమలు వాటì పై వాలి గొర్రెలకు బెడద తగ్గుతుంది. -
ప్రభుత్వం స్పందించకుంటే మందులు కొనిస్తా..
–మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి –జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆకస్మికSతనిఖీ –ఆస్పత్రిలోని పరిస్థితులను ఆరోగ్యశాఖ మంత్రికి ఫోన్లో వివరించిన కోమటిరెడ్డి నల్లగొండ టౌన్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిని సోమవారం మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆకస్మికంగా తనిఖీని చేశారు. ఆస్పత్రిలోని ఎమర్జెన్సీ, కాన్పుల వార్డులు, మరుగుదొడ్లను పరిశీలించారు. అక్కడి పరిస్థితులు చూసి ఆయన చలించిపోయారు. ఎమెర్జెన్నీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు పనిచేయకపోవడాన్ని గమనించిన ఆయన ఆస్పత్రి సూపరింటెండెండ్‌ను ఎందుకు పనిచేయడం లేదని ప్రశ్నించారు. రిపేర్ చేయించాలంటే జిల్లా కలెక్టర్ అనుమతిని తీసుకోవాలని, అభివృద్ధి కమిటీ సమావేశంలో తీర్మానం చేయాలని సమాధానం చెప్పారు. దీంతో కోమటిరెడ్డి మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రి అభివృద్ధి నిధులు రూ.5 కోట్లు మూలుగుతున్నా పట్టించుకోవడం లేదు. మందులు బయటనుంచి తెప్పిస్తున్నారు. కనీసం బెడ్షీట్లు కూడా కొనలేకపోతున్నారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని తన ఆసహనాన్ని వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డికి ఫోన్ చేశారు. అన్నా..నేను కోమటిరెడ్డి Ðð ంకట్‌రెడ్డిని మాట్లాడుతున్నా.. నల్లగొండలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నా.. మీరు వింటానంటే కొన్ని నగ్నసత్యాలు చెబుతా అంటూ ఆస్పత్రి పరిస్థితులను వివరించారు. కనీసం ఎమర్జెన్సీ వార్డులో ఏసీలు, ఫ్యాన్లు లేకపోతే ఎట్లాగన్నా.. వారంలో మీరు స్పందించకుంటే నేనే మందులను, బెడ్షీట్లను కొనిస్తానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. కాన్పుల వార్డులో ఏమిటీ దుస్థితి.. అనంతరం ఆయన కాన్పుల వార్డులకు చేరుకుని అక్కడ నేలపై చిన్నారులను పక్కన పడుకోబెట్టుకుని నిద్రిస్తున్న మహిళలను చూసి ఇదేమి దారుణ పరిస్థితి అని వాపోయారు. ఏమిటీ దుస్థితి, ఉదయమే కాన్పు అయిన వారిని ఇలానే నేలపై పడుకోబెడతారా అని అసహనాన్ని వ్యక్తం చేశారు. వార్డులో ఫ్యాన్లు తిరగడంలేదని, ట్యూబులు వెలగడం లేదని పలువురు మహిళలు కోమటిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే ఫ్యాన్లను, ట్యూబులను ఏర్పాటుకు రూ.6 వేలను సంబంధిత ఏఈకి అందజేశారు. అలాగే నార్కట్‌పల్లి మండలానికి చెందిన ఓ మహిళ రూ.10 వేలు అందజేసి హైదరాబాద్ చికిత్స పొందుతున్న ఆమె బాబుకు ఆ ఆస్పత్రిలో డబ్బులను కట్టాల్సిన అవసరం లేదని, వారితో నేను మాట్లాడుతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సూపరిం టెండెంట్ డాక్టర్ టి.నర్సింగరావు, ఆర్‌ఏఓ డాక్టర్ ఉదయ్‌సింగ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వంగూరు లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్‌రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, అల్లి సుభాస్‌యాదవ్, సట్టు శంకర్, డోకూరి రమేష్ పాల్గొన్నారు. -
రైతుల సమస్యను పట్టించుకోని ప్రభుత్వం
∙అక్టోబర్ 2న మౌన దీక్ష ∙రైతు జేఏసీ జిల్లా కన్వీనర్ ప్రొఫెసర్ వెంకటనారాయణ హన్మకొండ : రైతులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని రైతు జేఏసీ జిల్లా కన్వీనర్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. ఆదివారం నక్కలగుట్టలోని ఓ హోటల్లో రైతు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మౌనదీక్ష పోస్టర్లు జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటనారాయణ మాట్లాడుతూ రైతులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా అక్టోబర్ 2న గాంధీ జయంతిని పురస్కరించుకుని రైతులపై ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యతిరేక వైఖరికి నిరసనగా తెలంగాణ జేఏసీ చైర్మ¯ŒS ప్రొఫెసర్ కోదండరాం మౌనదీక్ష చేపట్టనున్నారని తెలిపారు. దీక్షకు రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో రైతు జేఏసీ నాయకులు డాక్టర్ భానుచందర్, డాక్టర్ ఎర్ర శ్రీధర్‌రాజు, మోర్తాల చందర్రావు, కోల జనార్ధ¯ŒS తదితరులు పాల్గొన్నారు. -
కాళ్లవాపు నియంత్రణకు ప్రత్యేక చర్యలు
అన్నవరం గ్రామాన్ని సందర్శించిన కలెక్టర్ వీఆర్‌పురం : కాళ్లవాపు ప్రభావిత గ్రామాల ప్రజలు విటమిన్ల లోపంతో పాటు రక్తహీనతతో బాధపడుతున్నట్టు ప్రాథమికంగా గుర్తించామని, వీటి నియంత్రణకు ఆయా గ్రామాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్టు కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. కాళ్లవాపు ప్రభావం అధికంగా ఉన్న వీఆర్ పురం మండలంలో బుధవారం ఆయన పర్యటించారు. రేఖపల్లి పీహెచ్సీలో కాళ్లవాపు బాధితులను పరామర్శించారు. ఈ వ్యాధికి సంబంధించి తీసుకున్న చర్యలపై అధికారులను ఆరాతీశారు. వ్యాధి నుంచి ఉపశమనం పొందిన అన్నవరం గ్రామానికి చెందిన వారిని కూడా పరామర్శించారు. అనంతరం గ్రామంలోని కిరాణా దుకాణాన్ని తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన పూనెం రాజారావు ఇంట్లో బియ్యం, వంటనూనెను, వంట విధానాన్ని పరిశీలించారు. కాళ్లవాపుపై ఆందోళన చెందవద్దని చెప్పారు. పోలవరం ముంపు ప్రభావంతో సంబంధం లేకుండా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో ప్రత్యేక వైద్య బృందం సేకరించిన రక్త నమూనా, తాగునీరు, ఆహారాన్ని పరీక్షించారని, అన్నీ సాధారణంగానే ఉన్నట్టు రిపోర్టులు వచ్చాయని వివరించారు. నేషనల్ లేబరేటరీ బృందం రెండు రోజుల్లో ఆయా గ్రామాల్లో పర్యటించి, పూర్తి అధ్యయనం చేయనుందని తెలిపారు. కలెక్టర్ వెంట ఐటీడీఏ పీఓ కేవీఎన్ చక్రధర్‌బాబు, పోలవరం(భూసేకరణ ) డిప్యూటీ కలెక్టర్ ఎల్లారమ్మ, డిప్యూటీ కలెక్టర్ (స్పెషలాఫీసర్ ) పి.శ్రీరామచంద్రమూర్తి, అడిషనల్ డీఎంహెచ్ఓ పవన్‌కుమార్ తదితరులు ఉన్నారు. ‘కలెక్టర్ గారూ.. ఆ మాటలకు చాలా బాధపడ్డాం’ వీఆర్‌పురం : ‘నాటుసారా తాగడం వల్ల కాళ్లవాపు మరణాలు సంభవిస్తున్నాయంటూ మీరు అన్న మాటకు మేమంతా చాలా బాధపడ్డాం సార్..’ అని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ వద్ద రేఖపల్లి సర్పంచ్ మడకం జోగమ్మ ఆవేదన వెళ్లగక్కారు. కాళ్లవాపు ప్రభావిత గ్రామమైన రేఖపల్లి పంచాయతీలోని అన్నవరం గ్రామంలో కలెక్టర్ బుధవారం పర్యటించారు. కాళ్లవాపు వ్యాధి బారిన పడి, కాకినాడకు వెళ్లి చికిత్స అనంతరం తిరిగి వచ్చిన వారితో ఆయన మాట్లాడారు. అనంతరం అక్కడున్న సర్పంచ్.. కలెక్టర్‌ని పరిచయం చేసుకుని, ‘సార్.. సారా తాగడం వల్ల కాళ్లవాపు వచ్చి చనిపోయారని మీరు మొన్న కాకినాడలో అన్నారు. దానికి మా గిరిజన ప్రజలమంతా చాలా బాధపడ్డాం’ అని చెప్పారు. దీంతో ఆయన తేరుకుని, ‘కాదమ్మ.. అలా కాదు, ఆ మరణాలకు సారా కూడా ఓ కారణమై ఉండవచ్చేమోనని అన్నాను. అంతేకానీ మరే ఉద్దేశంతో అనలేదు’ అని ఆయన తన మాటలను సరిదిద్దుకున్నారు. కాకినాడ జీజీహెచ్‌కు మరో 16 మంది తరలింపు వీఆర్ పురం : కాళ్లవాపు లక్షణాలతో ఉన్న మరో 16 మందిని చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి అంబులెన్స్‌లో బుధవారం తరలించారు. వైద్య, రెవెన్యూ, మండల పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పడిన బృందాలు మంగళవారం నుంచి చేపట్టిన ఇంటింటి సర్వే వేగవంతంగా కొనసాగుతోంది. మండలంలోని 7,814 కుటుంబాలుండగా, మంగళ, బుధవారాల్లో 4,120 కుటుంబాలను ఈ బృందాలు సర్వే చేశాయి. ఈ నేపథ్యంలో బుధవారం కాళ్లవాపు లక్షణాలతో ఉన్న కొంతమందిని రేఖపల్లి పీహెచ్‌సీకి తరలించారు. కొత్తగా నియమితులైన వైద్య నిపుణుడు రవికాంత్ వారిని పరీక్షించి, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న 16 మందిని కాకినాడకు పంపే ఏర్పాట్లు చేశారు. మంగళవారం తరలించిన ఐదుగురితో కలిపి మొత్తం 21 మంది కాకినాడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే అన్నవరం, పెదమట్టపల్లి, లక్ష్మీనగరం గ్రామాల నుంచి వెళ్లిన 32 మందిలో 30 మంది చికిత్స అనంతరం స్వగ్రామాలకు మంగళవారం వచ్చారని, మిగిలిన ఇద్దరు కూడా ఆరోగ్యంగానే ఉన్నారని అడిషనల్ డీఎంహెచ్ఓ ఎం.పవన్‌కుమార్ తెలిపారు. -
గులాబీ రంగు పురుగుతో జాగ్రత్త
పోచమ్మమైదాన్ : జిల్లాలో సాగుచేసిన పత్తి పంటలో గులాబీ రంగు పురుగు తక్కువ మోతాదులోనే ఉంది.. రైతులు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా గమనిస్తూ తగిన నివారణ చర్యలు తీసుకోవాలని ఏడీఆర్ డాక్టర్ పి.రఘురామిరెడ్డి అన్నారు. శాస్త్రవేత్తలు శుక్రవారం జనగామ, లింగాలఘన్పూర్, రఘునాథపల్లి, పరకాల, హన్మకొండ మండలాల్లో విస్తృతంగా పర్యటించి పత్తి పంటలను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఈ సందర్బంగా రఘురామిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పత్తి పూత, కాయ పెరుగుదల దశలో ఉందన్నారు. సాధరణంగా గులాబీ రంగు పురుగు ఆశించిన పూలు గడ్డిపూలుగా మారతాయి. ఈ సారి మాములుగా ఉన్న పూలలో గులాబీ రంగు పురుగు ఆశించినట్లు గుర్తించామని చెప్పారు. నివారణకు పంటలో లింగాకర్షక బట్టలు అమర్చుకుని ఉధృతిని గమనించాలని సూచించారు. వరుసగా 3 రోజుల పాటు బుట్టకు 8 కంటే ఎక్కువ తల్లి పురుగులు పడితే థయోడైకార్బ్ 1.5 గ్రాములు లేదా క్లోరిఫైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. కార్యక్రమంలో ఎరువాక కేంద్రం కోఆర్డినేటర్ ఉమారెడ్డి, పత్తి శాస్త్రవేత్త రాంప్రసాద్, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
జబ్బుల పట్ల జాగ్రతలు పాటించాలి
మోతె : సీజనల్ జబ్బుల పట్ల ప్రజలు జాగ్రతలు పాటించాలని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ నాగలక్ష్మి అన్నారు.సోమవారం మండల కేంద్రంలో జరిగిన జాతీయ పైలేరియా వ్యాధి నివారణ కార్యక్రమంపై ఆరోగ్య సిబ్బందికి జరిగిన అవగాహణ సదస్సులో ఆమే మాట్లాడుతు గ్రామాలలో ప్రజలు ప్రమాదకరమైన జబ్బులపై జాగ్రతలు పాటించాలన్నారు. నేటి నుంచి∙సెప్టెంబర్ ఒకటో తేదీ వరకు గ్రామాలలో ఫైలేరియా వ్యాధికి నివారణ ముందులను పంపిణీ చేయాలని ఆరోగ్య సిబ్బందికి ఆమే సూచించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది, శ్రీనివాస్, రాములమ్మ, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
మూడు మునకలే..!
ఇంద్రకీలాద్రి : పుష్కర స్నానానికి విచ్చేసే భక్తుల భద్రతపై పోలీసులు దృష్టి సారించారు. తొలి రోజున పద్మావతి ఘాట్‌లో బాలుడు నీట మునిగి మృతి చెందడంతో రెండో రోజు నుంచి బందోబస్తు కట్టుదిట్టం చేశారు ప్రతి స్నాన ఘాట్‌లో స్నానాలు చేసే భక్తులను వెయ్యి కళ్లతో పహారా కాసేందుకు అదనపు సిబ్బందిని నియమించారు. నదిలో మూడు మునకలే అన్నట్లుగా ఎక్కువ సేపు ఎవరికి నదిలో ఉండనీయడం లేదు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు స్నానానికి దిగే సమయంలో ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు వారిని వెయ్యి కళ్లతో పరిశీలిస్తూ ప్రతి క్షణం విజిల్స్ ఊదుతూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. శుక్రవారం నాటి కంటే శనివారం నదిలో నీటిమట్టం సుమారు ఒక అడుగు మేర పెరగడంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. నదిలో బ్యారికేడ్ వరకు ఎవరిని అనుమతించడం లేదు. ముఖ్యంగా నీటితో ఆటలాడే యువతి, యువకులను వెళ్లకుండా చూస్తున్నారు. -
మెుక్కల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి
హన్మకొండ అర్బన్l: హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం విద్యాశాఖ అధికారులతో హరితహారం, విద్యాశాఖ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో 1.75 లక్షల మొక్కలు నాటామని, బాలల హరితహారం ద్వారా పిల్లలకు 2 లక్షల మొక్కలు పంపిణీ చేశామని తెలిపారు. పిల్లలకు ఇచ్చిన మొక్కల సంరక్షణపై అధికారులు పూర్తి బాధ్యత వహించాలని అన్నారు. నాన్ ఈజీఎస్ కింద నాటిన మొక్కలకు నీరు పోయడం, ఫెన్సింగ్ కోసం ఎంత ఖర్చు అవుతుందో తెలుపుతూ సంబంధిత అధికారి పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని సూచించారు. ఒక్కో మొక్క ఫెన్సింగ్‌కు రూ.9, నీరు పోసేందుకు రూ.120 మంజూరు చేయనున్నట్లు తెలిపారు. విద్యకు అధిక ప్రాధాన్యం... పిల్లల విద్యా, వివాహ విషయాల్లో తలిదండ్రులు రాజీ పడటం లేదని, ఈ విషయం గుర్తించి ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు అధికారులు కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉత్తమ విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, సర్దుబాటులో భాగంగా ఇతర ప్రాంతాలకు కేటాయించగా, విధుల్లో చేరని వారి వివరాలు అందజేయాలని డీఈఓను ఆదేశించారు. ఎంఈఓలు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఆంగ్ల బోధనపై ప్రభుత్వ టీచర్లకు వచ్చే నెలలో శిక్షణ ఇస్తామన్నారు. సమావేశంలో డీఈఓ రాజీవ్, డ్వామా ఏపీడీ శ్రీనివాస్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పుష్కరాల్లో అప్రమతంగా ఉండాలి
–ఏఎస్పీ గంగారామ్ భువనగిరి కృష్ణ పుష్కరాల్లో పోలీస్ యంత్రాగం అప్రమతంగా ఉండాలని ఏఎస్పీ గంగారామ్ సూచించారు. పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా బుధవారం భువనగిరిలోని ఏఆర్ గార్డెన్లో జరిగిన డివిజన్ స్థాయి సమీక్ష సమావేశంలో ఏఎస్పీ మాట్లాడారు. డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన హోల్డింగ్ పాయింట్ల వద్ద పోలీస్ సిబ్బంది ఉండాలని చెప్పారు. ఎప్పటి కప్పుడు వాహనాల రద్ది గుర్చి సమాచారం ఇవ్వాలన్నారు. ఇందులో భాగంగా భువనగిరిలోని నల్లగొండ చౌరస్తా వద్ద 1. మండలంలోని వడపర్తి వద్ద 2, చౌటుప్పల్ వద్ద 1, పోచంపల్లి మండలంలోని లక్కారం వద్ద 1 హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య రాకుండా ముందు ఉన్న వాహనాలు వెళ్లిన తర్వాత వెనుకల వచ్చే వాహనాలను పంపిచాలని సూచించారు. సమావేశంలో సీఐలు ఎం. శంకర్‌గౌడ్, అర్జునయ్య, రాఘువీర్రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఎస్ఐలు మంజునా«ద్‌రెడ్డి, హన్మంత్‌లాల్, ఎండి సజిదుల్లా, మధుసూదన్‌రెడ్డి, నర్సింహ్మ, రాజశేఖర్‌రెడ్డి, ఏఎస్ఐ లింగమాయ్య, కానిస్టేబుల్, ఎన్ఎస్ఎస్ వాలంటర్లు ఉన్నారు. -
పాఠశాలల బలోపేతానికి ప్రత్యేక చర్యలు
నకిరేకల్ : ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే వేముల వీరేశం, ఎమ్మెల్సీ పూల రవీందర్‌లు అన్నారు. నకిరేకల్ శివారులోని ఎస్‌ఎస్‌రెడ్డి ఫంక్షన్హాల్లో ఆదివారం జరిగిన నకిరేకల్ ఎంఈఓ బండా వెంకట్‌నర్సింహారెడ్డి పదవి విరమణ సభలో వారు ముఖ్యఅతిథిలుగా పాల్గొనన్నారు. వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం కషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయ వత్తి ఎంతో పవిత్రమైనదన్నారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులు సమాజ సేవకు పునరంకితం కావాలన్నారు. ఈ సందర్భంగా వెంకట్‌నర్సింహారెడ్డి లలిత దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల మల్లీశ్వరి వెంకన్న, జెడ్పీటీసీ పెండెం ధనలక్ష్మి సదానందం, స్థానిక సర్పంచ్ పన్నాల రంగమ్మరాఘవరెడ్డి, కార్యాలయ సూపరిండెంట్ వాహబ్, వివిద ఉపాధ్యాయ సంఘాలు, ప్రై వేటు పాఠశాలల వ్యవహర్తలు పాల్గొన్నారు. -
మొక్కల సంరక్షణ నివేదికలు పంపాలి
ఇప్పటివరకు 2.24కోట్ల మొక్కలు హన్మకొండ అర్బన్ : జిల్లాలో ఇప్పటివరకు 2.24 కోట్లమొక్కలు నాటడం పూర్తయిందని కలెక్టర్ వాకాటి కరుణ తెలిపారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులతో హరితహారంపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మండలాల వారీగా మొక్కల సంరక్షణ కోసం తీసుకున్న సూక్ష్మప్రణాళికలు పంపించాలని అన్నారు. ఇప్పటివరకు పంపించని వారు వెంటనే పంపాలని అన్నారు. నీటిసదుపాయం, రక్షణ చర్యలకోసం కావాల్సిన నిధులకోసం ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ ఆదేశించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షణ బాధ్యతలు సంబంధిత శాఖలే తీసుకోవాలని చెప్పారు. ప్రస్తుతం నర్సరీల్లో ఉన్న మొక్కలు సరిపోక పోతే పండ్ల, పూల మొక్కలు తెప్పించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్, పీవో అమయ్‌కుమార్, డీఎఫ్‌వో శ్రీనివాస్, డ్వామా పీడీ శేఖర్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. -
నాటిన మొక్కలను కాపాడాలి
ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పలుచోట్ల ‘హరితహారం’ కోహెడ : హరితహారంలో భాగంగా గ్రామాల్లో నాటిన మొక్కలను బాధ్యతతో కాపాడాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. శ్రీరాములపల్లి–నారాయణపూర్ రోడ్డుకు ఇరువైపులా గురువారం సుమారు వెయ్యి మొక్కలు నాటారు. కోహెడ హైస్కూల్లో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వెయ్యి మామిడి, ఉసిరి తదితర మొక్కలను ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. శనిగరంలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఎకరం ప్రభుత్వ భూమిలో పలు రకాల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వనాలతోనే వర్షాలు కురుస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పుల స్వామి, జెడ్పీటీసీ సభ్యుడు పొన్నాల లక్ష్మయ్య, కోహెడ పీఎసీఎస్ చైర్మన్ కర్ర శ్రీహరి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ తైదల రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు ఆవుల మహేందర్, భీంరెడ్డి రాజిరెడ్డి, మండల ప్రత్యేకాధికారి ఇందిర, తహశీల్దార్ ఎస్కె.ఆరీఫా, ఏవో మాధవి, సర్పంచ్‌లు దొమ్మాట జగన్‌రెడ్డి, గాజె శ్రీధర్, చిట్టెల బాలరాజు, ఎంపీటీసీ సభ్యులు కర్ర రవీందర్, తిప్పారపు నాగరాజు, తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ మండలంలో.. హుస్నాబాద్‌రూరల్ : పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో మండలంలోని మహ్మదాపూర్, సర్వాయిపేట గ్రామాల్లోని రోడ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ ప్రారంభించారు. అలాగే రేగొండ మల్‌చెర్వు తండా, పోతారం(జె) గ్రామాల్లో జెడ్పీ వైస్ చైర్మన్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.రాంరెడ్డి, తహసీల్దార్ టి.వాణి, ఈవోపీఆర్డీ కొత్త అశోక్‌రెడ్డి, పీఆర్ డీఈ శ్రీనివాసరావు, ఏఈ టి.మహేశ్, సర్పంచ్‌లు పిట్టల సంపత్, శంకర్‌నాయక్, మల్లయ్య, సిరిసిల్ల బాలరాజు, ఎంపీటీసీ సభ్యుడు కుంట మల్లయ్య, ఉపసర్పంచ్లు రాజిరెడ్డి, కరివేద నరేందర్‌రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ రంగానాయక్ తదితరులు పాల్గొన్నారు. ఎల్కతుర్తిలో.. ఎల్కతుర్తి: మండల కేంద్రంలో పంచాయతీ రాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన హరితహారంలో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పాల్గొని పలు మొక్కలు నాటారు. అంతకు ముందు విద్యార్థులు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ తంగెడ శాలిణీమహేందర్, సర్పంచ్ గోల్లె మాధవీమహేందర్, ఎంపీటీసీ మునిగడుప లావణ్య శేషగిరి, పీఆర్ డీఈ శ్రీనివాస్, తహసీల్దార్ మల్లేశం, ఎంపీడీవో ఇందుమతి, వీఎస్ఎస్ చైర్మన్ గడ్డం రవి, సర్పంచ్‌లు గుండా ప్రతాప్, చిర్ర కొంరెల్లి, నార్లగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సైదాపూర్‌లో.. సైదాపూర్: మొక్కలు నాటి.. కరువును తరుమాలని ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ అన్నారు. మండలంలోని ఆకునూర్ శివారు వెంకటేశ్వర్లపల్లిలో సైదాపూర్ పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్‌రెడ్డి, హుజురాబాద్ రూరల్ సీఐ గౌస్‌బాబా, ఎంపీపీ ముత్యాల శ్రీప్రియారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు బిల్లా వెంకటరెడ్డి, సింగిల్ విండో ౖచెర్మన్ కొత్త తిరుపతిరెడ్డి,సర్పంచుల ఫోరం అధ్యక్షుడు సోమారపు రాజయ్య, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మునిగంటి స్వామి, ఖాదీ బోర్డు డైరెక్టర్ పేరాల గోపాల్‌రావు, హుజురాబాద్ మార్కెట్ డైరెక్టర్ పోలు ప్రవీణ్, స్థానిక సర్పంచ్ రాయిశెట్టి కోమల, ఎంపీడీవో వినోద, తహసీల్దార్ రమాదేవి, ఎంఈవో నర్సింహారెడ్డి, వ్యవసాయాధికారి శ్రీలత,ఎస్సై మాచినేని రవి,హెడ్ కానిస్టేబుల్ రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిగురుమామిడిః మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో గీతకార్మిక సంఘం ఆధ్వర్యంలో హుస్నాబాద్ ఎక్సైజ్ సీఐ విజయలక్ష్మి ఆధ్వర్యంలో కర్జూర మొక్కలు నాటారు. ఎక్సైజ్ ఎస్సై శర్వాణి, సర్పంచ్ తాడ సుగుణ, ఎంపీటీసీ కత్తుల రమేశ్, ఉపసర్పంచ్ వీరన్న, గౌడ సంఘం అధ్యక్షుడు వీరగోని విజ్జగిరి, ఉపాద్యక్షుడు రాయమల్లు తదితరులు పాల్గొన్నారు. నవాబుపేట్‌లో చిగురుమామిడి పోలీసుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. సర్పంచ్ వేణు, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు. చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో ఎంపీపీ తాడూరి కిష్టయ్య మొక్కలు నాటారు. తహసీల్దార్ రాజాగౌడ్, ఎంపీడీవో శ్రీనివాసస్వామి, ఎంఈఓ విజయలక్ష్మి, సర్పంచ్ గీకురు రవీందర్, ఎంపీటీసీ ఆకవరం భవాని, ఆర్ఐ అక్బర్ తదితరులు పాల్గొన్నారు. రంగయపల్లిలో.. భీమదేవరపల్లి: పంచాయతీరాజ్, ఏఎస్‌డబ్ల్యూవో శాఖల ఆధ్వర్యంలో రంగయపల్లి, భీమదేవరపల్లిలో సుమారు మూడువేల మొక్కలు నాటారు. రంగయపల్లి గ్రామంలో పీఆర్ ఏఈ కిషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. భీమదేవరపల్లి ఏఎస్‌డబ్ల్యూవో కార్యాలయం, ఎస్సీ వసతి గృహాల్లో వినోద్‌కుమార్ మొక్కలు నాటారు. ఎంపీడీవో వంగ నర్సింహారెడ్డి, ఏస్డబ్యూవో వినోద్‌కుమార్, సర్పంచ్ జిమ్మల భీంరెడ్డి, ఎంపీటీసీ రాజమౌళి, ఏఈలు కిషన్, రాజమల్లారెడ్డి, ఏపీవో కుమారస్వామి, ఈసీ కర్రా శ్రీధర్‌రావు పాల్గొన్నారు. -
లైట్‌గా తీసుకోండి... హాయిగా ఉండండి!
ఏ సీజన్లో ఉండాల్సిన కష్టాలు ఆ సీజన్‌కి ఉంటాయి. చలికాలం వణికించేస్తుంది. వర్షాకాలం పనులకు ఆటంకం కలగజేస్తుంది. ఎండాకాలం అయితే చెమటలు కక్కించేస్తుంది. తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఏ సీజన్‌ని అయినా హాయిగా గడిపేయొచ్చంటున్నారు శ్రుతీహాసన్. ప్రస్తుతం సమ్మర్ సీజన్ కాబట్టి, చర్మ సౌందర్య గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలనీ, ఆహారం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాలనీ ఆమె అన్నారు. ఇక, సమ్మర్లో శ్రుతీహాసన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో తెలుసుకుందాం... ► సమ్మర్లో స్కిన్ డ్యామేజ్‌ని తప్పించలేం. అందుకే మిగతా సమయాలకన్నా రెట్టింపు కేర్ తీసుకోవాలి. బయటికు వెళ్లేటప్పుడు మొహం, మెడ, చేతులు.. ఇలా ఎండకు ఎక్స్పోజ్ అయ్యే చోట సన్ స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. నీళ్లు ఎక్కువ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినాలి. అందరు చెప్పేదే నేనూ చెబుతున్నా. ఈ సీజన్లో ఆయిలీ ఫుడ్ జోలికి వెళ్లకపోవడం మంచిది. ► మా ప్రొఫెషన్‌కి మేకప్ చేసుకోకపోతే కుదరదు. ఎండలో మేకప్ అంటే ఎంత బాధగా ఉంటుందో ఊహించుకోవచ్చు. చర్మానికి ఊపిరి ఆడనట్లుగా అనిపిస్తుంది. అందుకే, ఈ సీజన్లో షూటింగ్స్ లేనప్పుడు స్కిన్‌ని ఫ్రీగా వదిలేస్తా. ► ఎండలో తిరిగినప్పుడు చర్మం కమిలిపోతుంది. అది ఒక పట్టాన తగ్గదు. స్కిన్ ట్యాన్‌ని పోగొట్టాలంటే బంగాళదుంప తొక్కుని ఉపయోగించవచ్చు. ఆ తొక్కుని గుజ్జుగా చేసి, శెనగపిండి, పాలు కలిపి ట్యాన్ అయిన చోట పట్టించాలి. ఎండిపోయిన తర్వాత కడిగేయాలి. ట్యాన్ పోయేంతవరకూ ఇలా చేయొచ్చు. ► మార్కెట్లోకి ఎన్ని సౌందర్య సాధనాలైనా రానివ్వండి. ఇంట్లో తయారు చేసుకునే ఫేస్‌ప్యాక్‌లే బెటర్. శెనగపిండి, మీగడ కలిపి మొహానికి పట్టించుకుంటే చర్మానికి మంచిది. వేసవికి ఇది బెస్ట్ ఫేస్ ప్యాక్. ► సమ్మర్లో నా డైట్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. పుచ్చకాయ జ్యూస్ బాగా తాగుతాను. కొబ్బరి నీళ్లు కూడా తీసుకుంటాను. తేలికపాటి ఆహారమే తింటాను. మధ్యాహ్నం భోజనానికి పాస్తా, వెజిటబుల్ సలాడ్స్ లేకపోతే అన్నం, పప్పు తీసుకుంటాను. సాయంత్రం నాలుగైదు గంటల ప్రాంతంలో పండ్ల ముక్కలు తింటాను. రాత్రి ఏడు గంటల లోపే డిన్నర్ ముగించేస్తాను. సూప్, కూరగాయలు, పప్పు, రోటీ తింటాను. సమ్మర్లో ఎక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది. -
యువ తేజం... యూత్ ఫర్ పీపుల్!
ఆదర్శం సంకల్పబలం గట్టిదైతే ‘సాధన’ సులువవుతుంది. అది శ్రమ కావచ్చు. సామాజిక సేవ కావచ్చు. ఆపదల్లో ఉన్నవారికి, ప్రమాదంలో ఉన్నవారికి తనవంతుగా ఏదైనా చేయాలను కున్నప్పుడు దీపేష్‌కు దారి మొదట మసక మసకగా కనిపించింది. ‘ఏం చేయాలి? ఏలా చేయాలి?’ అనేది స్పష్టంగా బోధపడలేదు. సంకల్పబలం గట్టిదైనప్పుడు ఎదురుచూసే దారి వెలుగుతూ కనిపిస్తుంది. ఆ వెలుగులో వికసించిందే ‘యూత్ ఫర్ పీపుల్’ స్వచ్ఛంద సంస్థ. 2006లో ముంబై లోకల్ ట్రైన్లో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఆ దృశ్యాలను టీవిలో చూస్తున్నప్పుడు దీపేష్ మనసు కదిలిపోయింది. బాధితులకు తన వంతు సహాయం అందించడానికి తమ్ముడు పరేష్‌తో కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. తమకు తోచిన రీతిలో బాధితులకు సహాయపడడానికి భాగవతి, కూపర్, నానావతి... మూడు ఆస్పత్రులకు వెళ్లారు అన్నదమ్ములు. అయితే అక్కడి గందరగోళ వాతావరణంలో సహాయం మాట అలా ఉంచి అడుగు పెట్టడమే కష్టంగా మారింది. అయినప్పటికీ గాయపడిన వాళ్లను, శవాలను మోసుకెళ్లడంలాంటి పనుల్లో సహాయపడ్డారు. ప్రభుత్వ ఏజెన్సీలకు తోడ్పడుతూ బాధితులకు సహాయపడడానికి ఒక శాశ్వత వేదికలాంటిది అవసరం అనే ఆలోచన ఆ సమయంలోనే దీపేష్‌కు వచ్చింది. ఆ ఆలోచనల్లో నుంచి పుట్టిందే... ‘యూత్ ఫర్ పీపుల్’ (వైఎఫ్‌పి) స్వచ్ఛంద సంస్థ. ఈ సంస్థ గురించి దీపేష్ మాటల్లో చెప్పాలంటే... నిర్మాణాత్మకమైన సేవాదృక్పథంతో వైఎఫ్‌పి మొదలైంది. విషాద సంఘటనలు జరిగినప్పుడు తక్షణ సహాయసహకారాలు అందించడానికి యువకులతో ఏర్పాటయిన బృందం... ‘యూత్ ఫర్ పీపుల్’ వైఎఫ్‌పి తరపున పనిచేస్తున్న యువకులు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నవారే. తీరిక చేసుకునో, సెలవురోజుల్లోనో, సెలవు పెట్టో వైఎఫ్‌పి తరపున పని చేస్తున్నారు. 500 మంది సభ్యుల ఈ బృందం రకరకాల సేవాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుంది. ప్రమాదాలు జరిగినప్పుడు ఆన్-ది-స్పాట్ బ్లడ్ డొనేషన్ డ్రైవ్‌ను నిర్వహిస్తుంది వైఎఫ్‌పి. ‘చైల్డ్ లిటరసీ క్యాంపెయిన్’ నిర్వహిస్తుంది. చలికాలంలో ‘మీ వంతుగా ఒక దుప్పటి దానం చేయండి’ అనే నినాదంతో ప్రచారం చేసి అలా వచ్చిన దుప్పట్లను పేదలకు ఇస్తుంది. ‘ది బాంబే రాక్ అసోసియేషన్’ సంస్థతో కలిసి క్యాన్సర్ పేషెంట్లకు సంఘీభావంగా ‘బ్లడ్ డొనేషన్ డ్రైవ్’ నిర్వహిస్తుంది. ‘సమస్య మనదైనప్పుడు, దాని పరిష్కారం గురించి కూడా మనమే ఆలోచించాలి’ అని చెబుతాడు దీపేష్. లోకల్ ట్రైన్లలో ప్రయాణిస్తున్న మహిళా ప్రయాణికులకు రౌడీలతో ఇబ్బందిగా మారింది. దీంతో ‘వార్ అగేనెస్ట్ రైల్వే రౌడీస్’ నినాదంతో మహిళా భద్రతపై దృష్టి సారించాడు దీపేష్. ఒకరోజు మలడ్ రైల్వే స్టేషన్ దగ్గర కొందరు ఆకతాయిలు అమ్మాయిలను అల్లరి చేయడం చూసి పోలీసులకు మెయిల్ పెట్టాడు దీపేష్. అయితే దీని వల్ల పెద్ద ప్రయోజనం కనిపించలేదు. దీంతో ఆకతాయిలకు బుద్ది చెప్పడానికి, వారిని కట్టడి చేయడానికి ‘వార్ అగేనెస్ట్ రైల్వే రౌడీస్’ ఆలోచనను ఆచరణలో పెట్టాడు దీపేష్. దీపేష్ బృందం రైల్వేస్టేషన్ దగ్గరికి వెళ్లి మహిళలతో మాట్లాడి అక్కడి పరిస్థితి అంచనా వేసి దానికి అనుగుణంగా ఒక కార్యాచరణ సిద్ధం చేస్తుంటుంది. రైల్వే స్టేషన్ల దగ్గర, ట్రైన్లలో మహిళలను అల్లరి చేస్తున్న వారిని మందలించడమో, పోలీసులకు అప్పగించడమో చేస్తారు. ‘వార్ అగేనెస్ట్ రైల్వే రౌడీస్’ కార్యక్రమం విజయవంతం అయింది. పోకిరీల బెడదా తప్పింది. రక్తదానం నుంచి మహిళల రక్షణ వరకు ఎన్నో రకాల పనులు చేస్తూ యువశక్తి గొప్పదనాన్ని గర్వంగా చాటుతుంది యూత్ ఫర్ పీపుల్ సంస్థ. -
కేర్ ఆస్పత్రి భారీ విస్తరణలు
-
చలికాలం.. జిడ్డు చర్మం...
బ్యూటిప్స్ చలికాలం పొడి చర్మమే కాదు జిడ్డు చర్మం గలవారు కూడా సరైన సంరక్షణ చర్యలు తీసుకోవాలి. విటమిన్-ఇ గల మాయిశ్చరైజర్‌ను ఎంచుకోవాలి. ముఖాన్ని శుభ్రపరుచుకున్న ప్రతీసారి మాయిశ్చరైజర్‌ను ఉపయోగించాలి.జిడ్డు చర్మం గలవారు పెట్రోలియమ్జెల్లీని ముఖానికి కానీ, పెదవులకు కానీ ఉపయోగించకూడదు. పెదాల పగుళ్ల సమస్యలు ఉంటే హెర్బల్ లిప్ బామ్స్‌ను ఉపయోగించాలి. మేకప్‌కి ఆయిల్ ఫ్రీ ఉత్పత్తులను ఉపయోగించాలి. లిక్విడ్ లేదా క్రీమ్ బేస్డ్ ఫౌండేషన్ల వాడకం బెస్ట్. -
హైదరాబాద్‌లో ఈజీ వాష్ కేర్ లాండ్రీ సర్వీసులు
వ్యవస్థీకృత రంగంలో రాష్ట్రంలో తొలి కంపెనీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యవస్థీకృత రంగంలో లాండ్రీ సర్వీసులు అందించే హైదరాబాద్‌కు చెందిన ఎన్ఆర్ ఈజీవాష్కేర్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఈజీ వాష్ కేర్ పేరుతో తొలి కేంద్రాన్ని ఇక్కడి మాదాపూర్‌లో ఏర్పాటు చేసింది. బట్టలు ఉతకడమేగాక ఇస్త్రీ చేసి మరీ కస్టమర్‌కు అప్పగిస్తారు. కంపెనీ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళ్లి దుస్తులను సేకరించి, తిరిగి డెలివరీ చేస్తారు. సెప్టెంబరులో చేపట్టిన పైలట్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో ఇటీవలే వాణిజ్యపరంగా కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఇప్పటికే 750కిపైగా కస్టమర్లున్నారని కంపెనీ వ్యవస్థాపకులు కలిశెట్టి నాయుడు సాక్షి బిజినెస్ బ్యూరోకు వెల్లడించారు. కస్టమర్ల సౌకర్యార్థం మొబైల్ యాప్‌ను త్వరలో తీసుకొస్తామన్నారు. ఏడాదిలో నాలుగు కేంద్రాలు.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన యూఎస్ కంపెనీ మేట్యాగ్ వాషింగ్ మెషీన్లను భారత్‌లో తొలిసారిగా తాము వినియోగిస్తున్నామని కలిశెట్టి నాయుడు చెప్పారు. ‘బట్టలు ఉతకడానికి ట్రీటెడ్ వాటర్‌తోపాటు నాణ్యమైన డిటర్జంట్, కండీషనర్, కలర్ బ్లీచ్‌ను వాడుతున్నాం. చార్జీలు ప్యాక్‌నుబట్టి రూ.999 నుంచి ప్రారంభం. ఇక రూ.2,999 ప్యాక్‌లో ఒక కుటుంబానికి నెలంతా సేవలందిస్తాం. ఈ ప్యాక్‌లో ఉన్నవారికి ఎనమిదిసార్లు బట్టలు సేకరించి డెలివరీ చేస్తాం. ప్రస్తుతం ఆరు మెషీన్లను దిగుమతి చేసుకున్నాం. అధిక సామర్థ్యమున్న మెషీన్లు మరిన్ని రానున్నాయి. నగరంలో ప్రధాన ప్రాంతాల్లో ఏడాదిలో నాలుగు కేంద్రాలు ప్రారంభిస్తాం’ అని తెలిపారు. -
మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే..!
‘‘కోటితో తీసే సినిమాకైనా, అరవై కోట్లతో తీసే సినిమా కైనా శ్రమ, ప్రేమ ఒకేలా ఉంటాయి. నా బేనర్లో సినిమా చేసినా బయటి బేనర్లో చేసినా సొంత సినిమాలానే భావిస్తా’’ అన్నారు నందమూరి కల్యాణ్ రామ్. మల్లికార్జున్ దర్శకత్వంలో ఆయన హీరోగా కొమర వెంకటేశ్ నిర్మించిన చిత్రం ‘షేర్’ రిలీజ్ రేపే. కల్యాణ్‌రామ్ మాటల్లో ఆ విశేషాలు... * వాస్తవానికి ‘పటాస్’కన్నా ముందే ఈ చిత్రాన్ని అంగీకరించా. కానీ, ముందు ఆ సినిమా పూర్తయ్యింది. ‘పటాస్’ విజయం సాధించడంతో తదుపరి చిత్రంపై అంచనాలు ఉంటాయి కాబట్టి, ‘షేర్’ కథలో కొన్ని మార్పులు చేశాం. ఇది డిఫరెంట్ మూవీ అని నేను అనడం లేదు. బోల్డన్ని ట్విస్టులతో, క్షణం క్షణం ఉత్కంఠకు గురి చేస్తూ కాకుండా హాయిగా సాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో ఓ చిన్న ట్విస్ట్ ఉంది. అది ఆసక్తికరంగా ఉంటుంది. అందరూ ఎంజాయ్ చేసే సినిమా అందిస్తున్నాం. ఈ సినిమా ముఖ్యంగా దర్శకుడు మల్లి (మల్లికార్జున్) కోసం ఆడాలని కోరుకుంటున్నా. సరైన కథ కుదరకో... వేరే కారణాల వల్లో మల్లికి రావాల్సినంత బ్రేక్ రాలేదు. మంచి కంటెంట్‌తో తీసిన ఈ సినిమా తనకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నా. ఎందుకంటే ఈ సినిమా కోసం ఎక్కువ కష్టపడింది తనే. ఇది నా బేనర్లో తీసిన సినిమా కాక పోయినా, బడ్జెట్ కంట్రోల్లో ఉండాలనుకున్నా. అందుకే, సెట్స్ వేయిస్తానని నిర్మాత అంటే, ‘మా సీజీ (కంప్యూటర్ గ్రాఫిక్స్) కంపెనీలో చేసేద్దాం’ అన్నాను. * ఈ చిత్రంలో నేను సివిల్ ఇంజనీర్ పాత్రలో కనిపిస్తాను. మనసులో ఒకటి పెట్టుకుని బయటకు వేరేది చేసే వ్యక్తి అన్నమాట. మల్లి ఈ కథ నాకు చెప్పినప్పుడు అతనిలో కాన్ఫిడెన్స్ కనిపించింది. * మూడేళ్ల పాటు వేరే సినిమా ఏదీ ఒప్పుకోకుండా నేను చేసిన ‘ఓం’ చాలా నిరుత్సాహపరిచింది. త్రీడీలో తీసిన ఆ సినిమా కోసం చాలా పరిశోధనలు చేశాం. ఆ సినిమాలో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్లో బోల్డన్ని ట్విస్టులుంటాయి. అన్ని మలుపులు ఉంటే ప్రేక్షకులు ఒత్తిడికి గురవుతారని అప్పుడు తెలిసింది. అందుకే థియేటర్‌కు వచ్చే ప్రేక్షకులు హాయిగా ఎంజాయ్ చేసే సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నా. అలాగని ప్రయోగాలు మానను. జయాపజయాల విషయంలో నాకు పెద్దగా తేడా కనిపించడం లేదు. ఫెయిలైనప్పుడు ఎక్కువ ఆలోచిస్తాం, సక్సెస్ అయినప్పుడు తక్కువ ఆలోచిస్తాం... అంతే. * ‘షేర్’ చిత్రం ఆడియో వేడుకలో నేను ఉద్వేగంగా మాట్లాడడం చర్చనీయాంశమైంది. బేసిక్‌గా నేను పక్కా ఫ్యామిలీ మ్యాన్ని. కుటుంబ అనుబంధాల మీద ప్రగాఢమైన నమ్మకం ఉంది. మా కుటుంబం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే, ఎవరైనా మా ఫ్యామిలీ గురించి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే... భరించలేను. మా ఫ్యామిలీని పాయింట్ అవుట్ చేస్తే ఎమోషనల్ అయిపోతాను. * తమ్ముడు (ఎన్టీఆర్)తో నిర్మించనున్న చిత్రం గురించి ప్రణాళికలు జరుగుతున్నాయి. అన్నీ కుదిరాక అధికారికంగా ప్రకటిస్తా. దానిలో నేను నటించడం అవసరమా? (నవ్వుతూ). నా తదుపరి చిత్రం గురించి కూడా త్వరలో చెబుతాను. -
వైద్యానికి కొత్త మొబైల్ యాప్..!
కర్ణాటక రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంత గర్భిణులు, తల్లీ పిల్లల ఆరోగ్య సేవల్లో సుయోజన యాప్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. పేషెంట్ కు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండేందుకు సహకరిస్తోంది. ఎప్పటికప్పుడు గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించేందుకు, వివరాలను నమోదు చేసుకొని అత్యవసర సమయంలో తక్షణ వైద్యం అందించేందుకు ఈ సింపుల్ టెక్నాలజీ వినియోగిస్తున్నారు. మొబైల్ ఆధారిత వైద్య సేవలతో మారుమూల గ్రామాల్లో తక్షణ వైద్యం అందించగల్గుతున్నారు. ఇమ్మునైజేషన్ వంటి వైద్యపరమైన సమస్యలను గుర్తించేందుకు, గర్భిణుల నమోదు, సేవలు అందించడం వంటి వాటిలో ఏఎన్ ఎంలకు ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అయితే ఈ సాధారణ మొబైల్ యాప్ తో వారు సమర్థవంతంగా విధులను నిర్వర్తించేందుకు చక్కగా పనికి వస్తోంది. కర్నాటక ఛామరాజ్ నగర్ కు చెందిన రోహిణి రూరల్ ఏరియాల్లో ఏఎన్ఎం గా పనిచేస్తున్నారు. నిజానికి ఆమె తన విధులను నిర్వహించడంలో ఎంతో చురుకుగానూ, ఆసక్తిగానూ ఉంటారు. అయినప్పటికీ ఒక్కోసారి పేషెంట్లకు కావాల్సిన సమాచారాన్ని అందించడంలో కాస్త ఇబ్బంది పడాల్సి వచ్చేది. క్లిష్టమైన సందర్భాల్లో కీలకమైన కేసుల వివరాలను తెలుసుకోవాల్సి వచ్చినపుడు.. ఆమె ఓ పద్ధతి ప్రకారం వాటిని గుర్తుంచుకోవడం కష్టంగా మారింది. దీంతో ఇటీవల రోహిణి సుయోజన యాప్ వాడకం ప్రారంభించింది. ఈ మొబైల్ బేస్డ్ అప్లికేషన్ వాడకం ప్రసూతి, పిల్లల సంరక్షణ చర్యల్లో ప్రస్తుతం ఆమెకు ఎంతో సహకరిస్తోంది. పరీక్షలు నిర్వహించేందుకు, పరిశోధనలు జరిపేందుకు సుయోజన యాప్ మార్గదర్శకంగా ఉందని రోహణి అంటోంది. ఒక దశలో పనిని వాయిదా వేసే అవకాశం లేనప్పుడు ఎమర్జెన్సీని బట్టి వారికి తక్షణ చికిత్స అందించాల్సి వచ్చినపుడు యాప్ ఎంతో ఉపయోగపడుతోందని రోహిణి చెప్తున్నారు. చిన్న టెక్నాలజీని వాడుకోవడంతో ఎంతోమంది ఏ ఎన్ ఎం లు రోగులకు ప్రత్యేక సేవలు అందించగల్గుతున్నారని కూడ రోహిణి చెప్తోంది. సుయోజన యాప్ ను వెనుకబడిన వారికి సేవలు అందించేందుకు స్వాస్థి హెల్త్ రిసోర్స్ సెంటర్ ప్రవేశ పెట్టింది. కరుణ ట్రస్ట్ , డి. ట్రీ ఇంటర్నేషనల్ సహకారంతో సామాజికంగా వెనుకబడ్డి వర్గాలకు ఈ యాప్ సేవలు అందించేందుకు ప్రత్యేక ఏర్పాటు చేశారు. అయితే స్వాస్థి ద్వారా ప్రజారోగ్య సేవలు అందించడం ప్రారంభించి సుమారు పదకొండు సంవత్సరాలు అయింది. ప్రస్తుతం సేవలను వివిధ కోణాల్లో అట్టడుగు స్థాయినుంచి సమర్థవంగా అందించేందుకు, ఏ ఎన్ ఎం ల కు పని సులభతరం అయ్యేందుకు ఈ మొబైల్ యాప్ ను వాడకంలోకి తెచ్చినట్లు స్వాస్థి డైరెక్టర్ బాబా కార్కల్ చెప్తున్నారు. పారా మెడికల్ సిబ్బంది తక్షణ వైద్య సేవలు అందించాల్సి వచ్చినప్పుడు సరైన నిర్ణయాన్ని తీసుకునేందుకు యాప్ ఉపయోగపడుతుంది. ఇది లేని సందర్భాల్లో ఏఎన్ ఎం లు అందించాల్సిన కొన్ని క్లిష్టమైన సేవలను కూడ దాట వేసే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. ఈ మొబైల్ ఆధారిత వైద్య చికిత్స ప్రసవానికి ముందు, ప్రసవానంతరం బిడ్డల రక్షణకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. కొత్తగా పుట్టిన పిల్లల సంరక్షణకు కావాల్సిన కౌన్సెలింగ్ కు, వారి గుండె కొట్టుకునే తీరు గమనించడంతోపాటు ప్రతి లక్షణాన్ని గుర్తించే అవకాశం ఈ యాప్ తో కలుగుతుందని నిర్వాహకులు అంటున్నారు. రామరాజనగర్ జిల్లాలో మార్చి 2014 లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన ఆసక్తికరమైన యాప్ సేవలు కర్ణాటకలోని నాలుగు జిల్లాలో 31 మంది ఏఎన్ ఎం లు అందిస్తున్నారు. యూజర్ ఫ్రెండ్లీ గా ఈ యాప్ లో కన్నడలో సమాచారం అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ ను గురించి ముందుగా దీన్ని వినియోగించే ఏఎన్ ఎం లకు శిక్షణ ఇస్తారు. శిక్షణ పూర్తి కాగానే సేవలు అందించడంలో వారికి వచ్చే సమస్యలను తీర్చేందుకు ఓ సూపర్ వైజర్ ను కూడ అందుబాటులో ఉంచుతారు. ప్రస్తుతం ఈ యాప్ ను శిక్షణ తీసుకున్న ఏఎన్ ఎం ల మొబైల్స్ లో మాత్రమే ఇన్ స్టాల్ చేస్తున్నారు. అయితే యాప్ ద్వారా సేవలు అందించడం వల్ల ఏఎన్ఎం లకు కొంతవరకు ఇబ్బందులు తగ్గినప్పటికీ ప్రభుత్వ అంగీకారం కోసం మాత్రం వీరి బృందం పోరాటం చేయాల్సి వస్తోంది. యాప్ కోసం నిధులు సమకూర్చిన నలుగురు సభ్యులున్న డి-ట్రీ ఇంటర్నేషనల్ తమ ప్రాజెక్టు మరికొన్ని జిల్లాల్లో ప్రవేశ పెట్టేందుకు యోచిస్తోంది. -
సూర్యలంకకు కొత్త శోభ
సూర్యలంక (బాపట్ల): సూర్యలంక బీచ్‌కు కొత్త శోభను తీసుకురావాలని, పర్యాటకులకు తగిన రక్షణ కల్పించటంతోపాటు వారు ప్రశాం తంగా తిరిగి వెళ్లేవరకు అన్ని శాఖలు బాధ్యతాయుతంగా పని చేయాలని ప్రభుత్వాధికారులు నిర్ణయించారు. నూతన రాజధానికి అతి దగ్గరలో ఉన్న సూర్యలంక బీచ్‌కు కొత్త శోభను తీసుకురావడానికి, పర్యాటకుల రక్షణ, సదుపాయాలను కల్పించడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్, రూరల్ జిల్లా ఎస్పీ కె.నారాయణనాయక్లతోపాటు 12 శాఖల అధికారులతో బుధవారం సూర్యలంకలో సమీక్షా సమావేశం జరిగింది. రూరల్ జిల్లా ఎస్పీ నారాయణనాయక్ మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరంలో స్నానాలు ఆచరించేందుకు వచ్చి న యువకులు గత ఐదేళ్ళలో 58 మంది మృతి చెందారని తెలిపారు. ఇటీవల మరో నలుగురు విద్యార్థులు మృత్యువాతకు గురయ్యారని చెపుతూ, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. బీచ్‌లో పోలీసు ఔట్ పోస్టు, వైద్యశాల నిర్మా ణానికి రెండు ఎకరాల భూమిని కేటాయించాలని రెవెన్యూ అధికారులను కోరారు. సూర్యలంకను స్పెషల్ జోన్‌గా ప్రకటించాలి .. బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ సూర్యలంక సముద్ర తీరం పంచాయతీ పరిధిలో ఉండటం, పంచాయతీలకు నిధులు తక్కువగా ఉండటంతో స్పెషల్ జోన్‌గా ప్రకటిస్తే అభివృద్ధి చెందుతుందని తెలిపారు పర్యాటకులు ప్రశాంతంగా స్నానాలు ఆచరించేందుకు ఇక్కడ ఉన్న ఆక్రమణలు తొలగించాలని కోరారు. పంచాయతీరాజ్ అతిథి గృహం వద్ద ఉన్న షాపుల్లోకి వ్యాపారస్తులు వెళ్ళేలా చూడాలని కోరారు. బెల్టుషాపులు లేకుండా చూస్తాం .. ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ప్రభాకర్ మాట్లాడుతూ తీరంలోనే కాకుండా చుట్టుపక్కల ఎక్కడా బెల్టు షాపులు లేకుండా చూస్తామని తెలిపారు. సూర్యలంకలో ఆక్రమణలను వెంటనే తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. పంచాయతీ ఆధ్వర్యంలో నిధులు ఉన్నాయని, వాటి తో వెంటనే ప్రచార మైకులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. స్థలం కేటాయించేందుకు అభ్యంతరం లేదు ... ఆర్డీఓ నరసింహులు మాట్లాడుతూ తీరం వద్ద ఔట్ పోస్టు, వైద్యశాల ఏర్పాటుకు స్థలం కేటాయిం చేందుకు అభ్యంతరం లేదన్నారు. రెవెన్యూ భూములపై సర్వే చేయించి సంబంధిత శాఖలకు భూమిని కేటాయిస్తామని చెప్పారు. వలలతో రక్షణ వలయాలు .... నిబంధనలకు విరుద్ధంగా మద్యం అమ్మకాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు కఠిన చర్యలు చేపడతామని ఎక్సై జ్ డీఎస్పీ వి.అరుణకుమారి తెలిపారు. అత్యవసర వైద్యసేవలు అందించేందుకు ఎయిర్‌పోర్స్ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుందని సీనియర్ చీఫ్ సెక్యూర్టీ ఆఫీసర్ బి.ఖాన్, అసిస్టెంట్ సెక్యూర్టిటీ ఆఫీసర్ మధు తెలిపారు. సముద్రం తీర ప్రాంతంలో కొంత భాగానికి కంచె వేసేం దుకు చర్యలు తీసుకుంటామని అటవీ శాఖ జిల్లా అధికారి సునీత తెలిపారు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో సముద్రంలో ఎంత వరకు స్నానాలు చేసేందుకు వెళ్ళాలో సూచించే వలయాలను ఏర్పాటు చేస్తామని ఏడీఏ రాఘవరెడ్డి చెప్పారు. అవసరమైతే వలలతో రక్షణవలయం ఏర్పా టు చేయటం, గజ ఈతగాళ్ళను రంగంలోకి దించుతామని తెలిపారు. లైఫ్ జాకె ట్లు ఏర్పాటుకు ఏపీ టూరిజం అసిస్టెంట్ డెరైక్టర్ వీవీఎస్ గంగరాజు సుముఖత తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ జివి. రమణ, సీఐలు సాధినేని శ్రీనివాసరావు, ఆంజనేయులు, మెరైన్ సీఐలు శ్రీనివాసరాజు, నిమ్మగడ్డ రామారావు, ఎక్సైజ్ సీఐ నయనతార తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మమ్మ కథ
85 సంవత్సరాల లక్ష్మమ్మకు నలుగురు కొడుకులు. 15 సంవత్సరాల క్రితం భర్త చనిపోయాడు. భర్త బాగా ఆస్తి సంపాదించి, పిల్లలందరికీ పెళ్లిళ్లు చేసి, ఆస్తి సమానంగా పంచి కాలం చేశాడు. తల్లి బాధ్యత పిల్లలు తీసుకుంటారనే నమ్మకంతో ఆమెకు భాగం ఇవ్వకుండా నలుగురు కొడుకులకూ ఆస్తి నాలుగు భాగాలు చేసి ఇచ్చాడు. భార్య తన తదనంతరం పడబోయే కష్టాల గురించి ఆలోచించలేదు. ఆయన చనిపోయాక కొడుకులు, కోడళ్ళు లక్ష్మమ్మను చూడ్డానికి వంతులు వేసుకోవడం మొదలెట్టారు. అంత ఆస్తి, ఇల్లూ వాకిలీ ఉండి కూడా లక్ష్మమ్మ అనాథలా అయిపోయింది. చిట్టచివరికి కొడుకులు, కోడళ్ళు ఆమెను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. తెలిసిన వారి సహాయంతో ఆమె ఆశ్రయం పొంది, కోర్టులో పిల్లలందరి మీద మెయింటెనెన్స్, మెడికల్ ఎక్స్పెన్సెస్ కోసం 125 సిఆర్పిసి కింద కేసు వేసింది. దేవుని దయవల్ల జడ్జిగారు కేసును త్వరగా విచారించి, నలుగురు కొడుకులు ఒక్కొక్కరూ (వారి ఆర్థిక స్థితిని బట్టి) నెలకు 10,000 రూపాయలు మెయింటెనెన్స్ కింద తల్లికి ఇవ్వాలని, మెడికల్ ఎక్స్పెన్సెస్ లేదా ఆపరేషన్ ఖర్చులు ఏమైనా గానీ సమానంగా పంచుకోవాలని తీర్పు ఇవ్వడం జరిగింది. కోర్టు తీర్పు ప్రకారం లక్ష్మమ్మ నలుగురు కొడుకులూ నెలకు 10,000 రూపాయల చొప్పున లక్ష్మమ్మ బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తున్నారు. తల్లి మెడికల్, ఆపరేషన్ ఖర్చులు... అన్నీ కూడా సమానంగా భరిస్తున్నారు. వృద్ధ తల్లిదండ్రుల పోషణ బాధ్యత పిల్లలదే అన్న విషయాన్ని ఈ కేసు తేల్చి చెప్పింది. చట్టరీత్యా తల్లిదండ్రులను చూడాల్సిన, బాధ్యత పిల్లలదే. వారి ఆస్తిని అనుభవించడమేగాక, వారి సంరక్షణ బాధ్యతలను చూసుకోవడం కూడా తమ బాధ్యతేనని పిల్లలంతా గుర్తించాలి. -
ఆగర్భ మిత్రులుగా తీర్చిదిద్దండి
పేరెంటింగ్ టిప్స్ కేర్, కేర్ మంటూ అప్పుడే పుట్టిన చిన్న బాబును/పాపను చూస్తే ఇంటిల్లపాది సంతోషం, ఇంటి వారసుడొచ్చాడనో, మహాలక్ష్మి వచ్చిందనో! అయితే వీరందరికీ దూరంగా ముఖంపై దిండు పెట్టుకొని/మంచం కింద దూరి చిన్ని బుజ్జాయి కంటే ముందు పుట్టిన పాప/బాబు కంటి నిండా నీళ్లు నింపుకుంటారు. అమ్మ నన్ను పట్టించుకోవటం లేదని, మరెవరో వచ్చి అమ్మ ఒడిలో హాయిగా నిద్ర పోతున్నారని. క్రమంగా అమ్మ ఒడిలోని పాప/బాబు పెద్దవారవుతారు... సోదర సోదరిల మధ్య విరోధం వస్తుంది. ఆటల్లో పోటీ నిలుస్తుంది. తల్లిదండ్రుల ప్రేమకోసం పోరాటం మొదలవుతుంది. ఫలితం పిల్లల మధ్య ఘర్షణ. దీనినే ఇంగ్లీషులో సిబ్లింగ్ రైవలరీ అంటారు. తమకు సరైన గుర్తింపు లభించటంలేదని, తమ కన్నా సోదర, సోదరులనే బాగా చూసుకుంటున్నారనే నెగెటివ్ భావన పిల్లల్లో ఇలాంటి ప్రవర్తనకు కారణం అవుతుంది. ఇలా జరక్కుండా ఉండాలంటే... చంటి పిల్లలను గమనిస్తూనే, పెద్దపిల్లలపై దృష్టి సారించాలి. వారిని కూడా పట్టించుకుంటూ ఉండాలి. వయసులో పెద్దపిల్లలు చిన్నవారిని బాగా చూసుకోవాలని చెప్పాలి. వారిమధ్య సంబంధాన్ని వివరించాలి. పిల్లల ఆందోళనను అర్థం చేసుకోవాలి. పిల్లలందరికీ సమప్రాధాన్యత ఇవ్వడం వల్ల వారిమధ్య ఆత్మన్యూనత తలెత్తదు. సోదర, సోదరుల మధ్య ప్రేమ, దయ, జాలి లక్షణాలు పెంపొందించి వారి మధ్య మంచి రిలేషన్ ఏర్పడటానికి కృషి చేయాలి. ఒక్కొక్కరిని విడివిడిగా ప్రశ్నించి, వారి మధ్య గొడవలకు గల కారణాలు తెలుసుకొని వాటిని పరిష్కరించడం వల్ల వారిమధ్య ఆరోగ్య కరమైన వాతావరణాన్ని సృష్టించవచ్చు. -
పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంటలు
నర్సింహులపేట : ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట కుటుంబసభ్యుల నుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం నర్సింహులపేట పోలీసులను ఆశ్రయించింది. వివరాలిలా ఉన్నారుు. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలంలోని చిన్నంలా గ్రామానికి చెందిన దబ్బెటి వెంకన్న, నర్సింహులపేట మండలంలోని దంతాలపల్లి గ్రామానికి చెందిన అక్కిరెడ్డి స్వాతిలు మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే వెంకన్న సూర్యాపేటలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తుం డగా, స్వాతి సూర్యాపేటలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. కాగా, వారి ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. ఈ మేరకు వెంకన్న, స్వాతిలు ఇటీవల పెళ్లి చేసుకుని కుటుంబసభ్యుల రక్షణ కోరుతూ ఎస్సై వెంకటప్రసాద్‌ను ఆశ్రరుుంచారు. ఇదిలా ఉండగా, ఎస్సై ఇరువురి కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. చెన్నారావుపేటలో.. పోలీసులను ఆశ్రరుుంచింది. ఎస్సై పులి వెంకట్‌గౌడ్ కథనం ప్రకారం.. వుండలంలోని గురిజాల గ్రావూనికి చెందిన గొడిశాల వెంకటేశ్వర్లు-విజయు దంపతుల కువూరుడు వుహేష్.. నర్సంపేట పట్టణానికి చెందిన ప్రశాంతిలు కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. అరుుతే ఇరువురి తల్లిదండ్రులు వారి పెళ్లికి నిరాకరించారు. ఈ క్రమంలో ఇటీవల వారు చిల్పూరు వెంకటేశ్వరస్వామి ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, ప్రేమించి పెళ్లి చేసుకున్న తమకు కుటుంబసభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ గురువారం పోలీసులను ఆశ్రరుుంచారు. ఈ సందర్భంగా ఎస్సై పులి వెంకట్‌గౌడ్ విలేకరులతో మాట్లాడుతూ ఇరువురి తల్లిండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తావుని తెలిపారు. -
ఇక ఢిల్లీలోనే ఉరేసుకోవాలా..!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) 'ఆ సమయంలో నేను గానీ అక్కడుంటే.. అలా జరగనిచ్చేవాణ్నికాదు.. అసలు ఇలాంటివి జరగాలని అస్సలు కోరుకోరు' ఎవరైనా ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డప్పుడు అతడిపట్ల సానుభూతితో.. వయసు, హోదాతో సంబంధం లేకుండా చేసే వ్యాఖ్యలు! కానీ ఈ మాటలు పెదవుల వరకే ఆగిపోయి.. ఆచరణలో కానరాకుంటే.. ఇదిగో.. ఇలా మళ్లీ మళ్లీ వరుస మరణాలు.. అవే అబద్ధపు సానుభూతులు! ఏళ్ల తరబడి దేశాన్ని కుదిపేస్తున్న రైతుల బలవన్మరణాల విషయంలో ప్రభుత్వాల తీరిది! సమస్య వచ్చినప్పుడు ప్రకటనలు చేయడం ద్వారా బయటపడొచ్చని చాణక్యుడు ఏ ఉద్దేశంతో చెప్పారో గానీ అచ్చుగుద్దినట్లు అన్నివేళలా దాన్నే ఫాలో అవుతున్నారు మన నేతలు. చెమటదారపోసి.. కాయకష్టం చేసి.. తల్లితో సమానంగా భూమిని ప్రేమిస్తూ ఆరుగాలం కష్టపడి రైతు.. తెల్లారినప్పటి నుంచి నిద్రపోయేవరకు నోట్లోకి ఎంగిలిని అందించేవాడిగా ఎవరికీ గుర్తులేకపోయినా పాలకులకు మాత్రం గుర్తుండి పోవాలి. అతడు లేకుంటే జీవమే లేదు మనుగడే లేదు. కానీ నేడు అతడి ఆత్మహత్య నాయకులకు ప్రసంగ పాఠాలయ్యాయి. ఓ గంట రెండుగంటల వినోదాత్మక చర్చలుగా మారాయి. ఈ విషయాన్ని రైతుల ఆత్మహత్యల గణాంకాలే వెల్లడిస్తున్నాయి. దేశంలో రైతులు ఆత్మహత్యలు అనగానే ముందుగా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని విదర్భ. కానీ, అలాంటి విదర్భ ఇప్పుడు దేశంలో ఎక్కడ రైతు చనిపోతే అక్కడ ఉన్నట్లే. ప్రతి ఏడాది వేల ఆత్మహత్యలు. మొన్నటి వరకు అప్పులు, నష్టం, కబ్జాలు రైతుల ప్రాణాలు తీస్తుంటే నేడు తాజాగా తలెత్తిన బంగారం లాంటి భూములను లాక్కొనేందుకు చేసే రాజకీయ ఒత్తిడులు, చట్టాలతో చేసే భూ ఆక్రమణలు వారి ఆత్మహత్యలను మరింత పెంచాయి. నిన్న మొన్నటి వరకు ఏ పొలానికో, ఇంటికో చెట్టుకో పుట్టకో నెలవైన రైతు మరణం తాజాగా దేశ రాజధానిలో గజేంద్ర రూపంలో మార్మోగింది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఆప్యాయంగా వ్యవసాయం చేసుకునే రాజస్థాన్‌కు చెందిన గజేంద్ర సింగ్.. ఆప్ ర్యాలీలో చెట్టుపైకి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తూ అక్కడే ప్రాణాలు బలితీసుకున్నాడు. ఒకప్పుడు ఓ దళిత రైతు ఆత్మహత్య చేసుకోవడంతో అతడి భార్య కళావతి పేరును కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ నోట వినడం ద్వారా ఎంతగా వెలుగులోకి వచ్చారో.. నేడు అలాగే ప్రతిపక్షాలు చేసిన రభస ద్వారా ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఇంకా ప్రముఖ నేతల ద్వారా ప్రకటనగా వచ్చిన గజేంద్ర మరణం కూడా అంత వెలుగులోకి వచ్చింది. దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య రాజకీయంగా పెనుదూమారాన్ని సృష్టించింది. పార్లమెంట్లో గజేంద్ర సింగ్ ఆత్మహత్య అంశం ప్రకంపనలు సృష్టించింది. భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ చేపట్టిన ర్యాలీలో గజేంద్ర సింగ్ ఒక చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జాతీయ మీడియాల్లో పతాక శీర్షికలను అందుకుంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న తాను పంటలు పండక చాలా నష్టపోయానని, మోదీ ప్రభుత్వం భూ సేకరణ బిల్లు అంటూ తమ భూములు లాక్కుంటే ఎలా బతకాలంటూ గజేంద్ర సింగ్ తన సూసైడ్ లేఖలో ప్రస్తావించాడు. అయితే, అది ఆత్మహత్యా, హత్యా అనే చర్చ లేవనెత్తి.. ఒక మరణాన్ని చులకన చేసే ప్రయత్నం చేయకుండా ఓ సారి రైతుల ఆత్మహత్యలపై లోతుగా చర్చించుకోవాలి. పున: పరిశీలన చేసుకోవాలి. లేదంటే రైతులు ఉరి కొయ్యలకు వేలాడే హృదయవిదారక సంఘటనలు కోకొల్లలు చూడాల్సి వస్తుంది. ఏదైనా జరిగినప్పుడు రాజకీయ నేతలు, ప్రభుత్వాలు ఊకదంపుడు ఉపన్యాసాలు, ఎదుటివారిపై దుమ్మెత్తి పోయటం మానుకోవాలి. ఇప్పటికే వారు ఈ విషయంలో చేసింది శూన్యం. ఇక దేశ రాజధానిలో ఓ రైతు ఆత్మహత్య చేసుకోవటం వల్లే రైతుల ఆత్మ హత్యలకు ప్రచారం బాగా జరిగింది కొందరనుకుంటున్నారు. కానీ ఇలా అనుకుంటే మాత్రం పొరపాటుపడ్డట్టే. అలా అనుకుంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పంటపొలాల్లో సతమతం అవుతున్న రైతులంతా గజేంద్రను ఆదర్శంగా తీసుకొని పార్లమెంటు ముందు పదుల సంఖ్యలో ప్రాణాలు నిలువునా తీసుకునే ప్రమాదం ఉంది. ప్రధాని నరేంద్రమోదీ కూడా పార్లమెంటులో గజేంద్ర మరణంపై స్పందిస్తూ రైతుల ఆత్మహత్యల సమస్య వేళ్లూనుకూని పోయిందని, పురాతన కాలం నాటి నుంచే ఉందని.. దీని పరిష్కరణకై అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందనిప్రకటించారు. ఇది కూడా మరొక ప్రకటనగా మిగిలిపోకుండా ఆచరణ రూపంలోకి తీసుకొస్తే గజేంద్రలాంటి రైతులెందరికో మోక్షం లభించినట్లే. (యం.నాగేశ్వరరావు) -
భార్య బంధువుల నుంచి రక్షణ కల్పించండి
బనగానపల్లె వాసి ఎస్పీకి వినతి కర్నూలు: భార్య తరఫు బంధువుల నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బనగానపల్లెకు చెందిన నడిపి హుసేన్ ఎస్పీ ఆకే రవికృష్ణను వేడుకున్నారు. సోమవారం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు డయల్ యువర్ ఎస్పీ, అనంతరం జిల్లా పోలీసు కార్యాలయంలో నేరుగా వచ్చి కలసినవారి నుంచి ఎస్పీ వినతులను స్వీకరించారు. సాయంత్రం వరకు పోలీసు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బనగానపల్లె వాసి నడిపి హుసేని ఎస్పీని కలసి వినతిపత్రం రూపంలో తన సమస్యను చెప్పుకున్నారు. తన భార్య సక్రమంగా పనిచేయకపోవడం వల్ల కొట్టడం జరిగిందని, అందుకు ఆమె తరపు బంధువులు వచ్చి తనను చితకబాదడంతో తప్పించుకుని పారిపోయానని పేర్కొన్నాడు. రెండు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంట్లో ఉన్న పట్టాదారు పాసు పుస్తకాలు, కొంత నగదు తీసుకువెళ్లారని ఫిర్యాదు చేశాడు. చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా వేడుకున్నాడు. తన కుమారునికి రైల్వే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బుక్కాపురం భాస్కర్‌రెడ్డి రూ.లక్ష తీసుకుని మోసం చేశాడని పసుపుల గ్రామానికి చెందిన రాముడు ఫిర్యాదు చేశాడు. వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఇద్దరు పిల్లలను చదివించుకుంటున్నానని, పదో తరగతి పాసైన తన కుమారునికి రైల్వే శాఖలో హెల్పర్ పోస్టు ఇప్పిస్తానని భాస్కర్‌రెడ్డి నమ్మించి రూ.లక్ష తీసుకుని డబ్బులు ఇవ్వడం లేదని, న్యాయం చేయాలని కోరాడు. తన కుమార్తె వివాహం జరిగిన రెండు రోజుల నుంచి అజ్ఞాత వ్యక్తులు ఆమె మొబైల్‌కు వివిధ నెంబర్ల నుంచి ఇబ్బందికరమైన బ్లాక్మెయిల్ మెసేజ్‌లు పంపుతూ కుటుంబాన్ని మానసికంగా వేధిస్తున్నారని, వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్నూలుకు చెందిన రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి ఫిర్యాదు చేశారు. బంగారు షాపులో పనిచేస్తున్న స్నేహితుడు ఒకరు నా భార్యకు ఫోన్ చేసి ఇబ్బంది ప్రవర్తిస్తున్నాడని డోన్ మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. తరచూ తనతో ఫోన్లో మాట్లాడకపోతే నన్ను చంపేస్తానని బెదిరిస్తున్నాడని, విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. బేతంచెర్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని కొలుములపల్లి గ్రామంలో బెల్టుషాపు ఏర్పాటుతో శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, మద్యం సేవించినవారు అల్లర్లు, గొడవలు సృష్టిస్తున్నారని, బెల్టు షాపు నిర్మూలించి ప్రశాంత వాతావరణం నెలకొల్పాలని గ్రామ ప్రజలు ఫిర్యాదు చేశారు. డయల్ యువర్ ఎస్పీ, ప్రజాదర్బార్లకు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై విచారణ జరిపి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. -
రైతు సమస్యలపై శ్రద్ధచూపాలి
నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆత్మకూరు: రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులు శ్రద్ధచూపాల్సిన అవసరం ఉందని ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల సర్వసభ్య సమావేశం స్థానిక స్త్రీశక్తి భవన్లో బుధవారం ఎంపీపీ సిద్ధం సుష్మ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతులు యూరియా కోసం జిల్లావ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈ సమస్యను అధిగమించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ప్రత్యేక శ్రద్ధచూపాలన్నారు. జనవరిలోనే పలు గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొందని, ఈ సమస్య వేసవికాలం నాటికి మరింతగా తీవ్రరూపం దాల్చే అవకాశం ఉందన్నారు. మూడేళ్లుగా వర్షాలు లేకపోవడంతో బొగ్గేరు ప్రవహించకపోవడంతో పలు ప్రాంతాల్లో పంటలకు సైతం నోచుకోలేదన్నారు. దీనిమూలంగా తాగునీటి కష్టాలు అధికమయ్యాయన్నారు. అధికారులు ఈ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. తాము కూడా జిల్లా కలెక్టరు, జిల్లా అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానన్నారు. రాష్ట్ర విభజన అనంతరం ఆర్థికంగా మన రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉండగా విద్యుత్ రంగంలో మాత్రం ప్రగతి సాధించిందన్నారు. జిల్లాలో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, మరో 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి కృషి జరుగుతుందన్నారు. రైతులకు 9 గంటల వరకు విద్యుత్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందన్నారు. అన్ని గ్రామాల్లో స్వచ్ఛభారత్ ద్వారా మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. అధికారులు రాజకీయాలకతీతంగా అన్ని సమస్యలు పరిష్కరించేలా కృషి చేయాలన్నారు. పీఎం, సీఎంలు దత్తత, స్మార్ట్గ్రామాలను రూపొందించడం మంచి పరిణామమన్నారు. రెండు, మూడు లక్షలతో ఏర్పాటు కానున్న సుజల స్రవంతి కూడా అన్ని గ్రామాల్లో విస్తరించేందుకు కృషిచేయాలన్నారు. గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి పరిచేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. జెడ్పీలోనూ నిధుల కొరత ఉంది: జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి జిల్లా పరిషత్ సైతం లోటు బడ్జెట్లో ఉందని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. మండల సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు తాను ప్రత్యేకంగా శ్రద్ధచూపుతానన్నారు. ఆత్మకూరు జెడ్పీటీసీసభ్యునిగా ఉన్నందునే జెడ్పీ చైర్మన్ అయ్యాయని, ఈ నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పనులు చేశారనే అంశాన్ని ప్రతి ఒక్కరు అడుగుతారని, దీంతో ఈ నియోజకవర్గాన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తానన్నారు. యూరియా కొరత బాగా ఉంది: ఎమ్మెల్యే గౌతమ్‌రెడ్డి ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడుతూ పదిరోజులుగా యూరియా కొరత ఉందని, దీనిని అధిగమించేందుకు కృషి చేస్తున్నామన్నారు. వేసవిలో తాగునీటి సమస్యను అధిగమించేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. అందరం కలిసిమెలసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యమవుతుందని దీనికి ప్రతి ఒక్కరు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈసమావేశంలో ఎంపీడీఓ నిర్మలాదేవి పాల్గొన్నారు. -
స్వైన్‌ఫ్లూ కలకలం
జిల్లాలో స్వైన్‌ఫ్లూ వ్యాధిపై కలకలం రేగుతోంది. రాష్ట్రంలో వరుసగా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు నమోదు కావడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ మహమ్మారి బారిన పడి ఇటీవల బాపట్లకు చెందిన ఓ వివాహిత మృతి చెందిన విషయం అందరికి తెలిసిందే. పొరుగు జిల్లా ప్రకాశంలో కూడా ఓ కేసు నమోదు చేశారు. ఏకంగా తెలంగాణ రాష్ట్రంలో వందలాది కేసులు నమోదుకావడంతోపాటు పదుల సంఖ్యలో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ప్రజలు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మేలని వైద్యులు సూచిస్తున్నారు. గుంటూరు మెడికల్:స్వైన్‌ఫ్లూ అంటువ్యాధి కావటం, వ్యాధిసోకిన వ్యక్తి దగ్గినా తుమ్మినా గాలిద్వారా అతి వేగంగా వ్యాపించే ప్రమాదం ఉండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ప్రజలను అప్రమత్తం చేయాల్సిన జిల్లా వైద్యఆరోగ్యశాఖ నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం విమర్శలకు తావిస్తోంది. ఈ వ్యాధిని నిర్ధారించి చెప్పే ల్యాబ్ సౌకర్యాలు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వద్ద లేవు. ఒకవేళ వ్యాధి సోకినట్లు లక్షణాలను బట్టి నిర్ధారించినా, మరొకరికి సోకకుండా ప్రత్యేక(ఐసోలేటెడ్) వార్డులను ఏర్పాటు చేయాల్సి ఉంది. కాని ఇంతవరకు అలాంటి వార్డుల ఊసేలేదు. వ్యాధి నియంత్రణ కోసం అవసరమైన టామిఫ్లూ మాత్రలు తమ వద్ద ఉన్నాయని చెపుతున్న అధికారులు వాటిని వైద్యం చేసే వైద్య సిబ్బందికి, ఆస్పత్రులకు పంపించకుండా చోద్యం చూస్తూ ఉండటంతో ఒకవేళ అనుమానిత కేసులు వచ్చినా వారికి వైద్యం చేసేందుకు వైద్య సిబ్బంది ఎవ్వరూ కూడా ముందుకొచ్చే పరిస్థితి లేదు. కనీసం మెడికల్ కోటెడ్ మాస్క్‌లను కూడా వైద్య సిబ్బందికి ఇంతవరకు అందించకపోవటం వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వ్యాధి లక్షణాలు... డాక్టర్ నరేంద్ర వెంకటరమణ, ఫిజీషియన్, గుంటూరు స్వైన్‌ఫ్లూ వ్యాధి ఎచ్1, ఎన్1 వైరస్ ద్వారా పందుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. వైరస్ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా ఇతరులకు సోకుతుంది. వ్యాధి సోకినవారిలో మొదట సాధారణ జ్వర ం, గొంతునొప్పి, తుమ్ములు, ముక్కు, కళ్ళ వెంట నీరుకారడం, ఒళ్ళునొప్పులు తదితర లక్షణాలు ఉంటాయి. తరువాత దగ్గు ప్రారంభమై నీరసం, నిస్సత్తువ, వాంతులు, విరోచనాలు, శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువ అవుతాయి. ఉబ్బసం లాంటి దీర్ఘకాల ఊపిరితిత్తుల వ్యాధులున్నవారిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు త్వరగా ఇబ్బందికర పరిస్థితులకు దారి తీస్తాయి. వ్యాధి సోకకుండా ఉండేందుకు విదేశీ ప్రయాణాలు తగ్గించుకోవాలి. దగ్గినా, తుమ్మినా ముఖానికి క్లాత్ అడ్డుపెట్టుకోవాలి. ప్రత్యేకవార్డు ఏర్పాటుకు చర్యలు... డీఎంహెచ్ఓ స్వైన్‌ఫ్లూ కేసులు ఇటీవల కాలంలో తరచుగా పలుచోట్ల నమోదవుతున్న దృష్ట్యా గోరంట్ల జ్వరాల ఆస్పత్రిలో ప్రత్యేక వార్డు ఏర్పాటుకు పరిశీలన చేసినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణి తెలిపారు. టామిఫ్లూ మందులు పంపిణీ చేయాల్సిందిగా ఉన్నతాధికారులను కోరామన్నారు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో కూడా ప్రత్యేక వార్డు ఏర్పాటుకు ఆస్పత్రి సూపరింటెండెంట్‌తో మాట్లాడినట్లు వెల్లడించారు. -
టీడీపీ ఎమ్మెల్యే నుంచి రక్షణ కల్పించండి
పోలీసులనుఆశ్రయించిన వైద్యుడు సీతంపేట : దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్ చెప్పిన విధంగా ఆయన మనుషులకు డబ్బులు ఇవ్వకుంటే ఆసుపత్రి లేపేస్తానని బెదిరించారని కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ పి.వి.రమణమూర్తి గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆసుపత్రి సమీపంలో జీవీఎంసీ అధికారులు కూల్చివేసిన అక్రమ కట్టడానికి పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారని ఆయన తెలిపారు. అందుకు ఆక్రమణదారులకు తాను రూ.9 లక్షలు చెల్లిం చాలని లేకపోతే అంతు చూస్తానని ఎమ్మెల్యే హెచ్చరించారని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి 15వ వార్డు మాజీ కార్పొరేటర్ భర్త టాక్సీ రాజు మరో కొంతమంది అనుచరులతో ఎమ్మెల్యే గణేష్‌కుమార్ ద్వారకానగర్‌లోని తన ఆసుపత్రికి వచ్చి ఆందోళన చేశారన్నారు. బాధ్యతాయుతమైన ఎమ్మెల్యేగా ఆయన తన మాటలను వెనక్కి తీసుకుంటారని గురువారం వరకు వేచిచూశానన్నారు. తనకు, తన ఆసుపత్రి సిబ్బందికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు. ఎమ్మెల్యేపై ఫిర్యాదు వాపసు దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌పై కళా ఆసుపత్రి ఎండీ డాక్టర్ రమణమూర్తి చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకున్నారు. తన నియోజకవర్గం ఎమ్మెల్యేపై అభిమానం, గౌరవించాలనే ఫిర్యాదును వాపసు తీసుకున్నట్లు తెలిపారు. ఈ విషయమై ద్వారకాజోన్ సీఐ పి.వి.వి నరసింహారావును సంప్రదించగా ఎమ్మెల్యే బెదిరించారని రక్షణ కల్పించాలని గురువారం ఫిర్యాదు చేసిన డాక్టర్ రమణమూర్తి అదే రోజు రాత్రి ఫిర్యాదును వాపసు తీసుకున్నట్లు తెలిపారు. -
వెంకన్న దయతో కోలుకున్నా..
తిరుపతి: గుండెపోటుతో స్విమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పి. మురళీధరరావు ఆరోగ్యం పూర్తిగా కోలుకోవడంతో తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. గత ఆదివారం రాత్రి తిరుమలకు నడిచివెళుతుండగా గుండెపోటుకు గురైన ఆయనను వెంటనే తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. అనంతరం తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందారు. ఈ సందర్భంగా మురళీధరరావు మాట్లాడుతూ కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి దయ, స్విమ్స్ వైద్యుల కృషితో కోలుకున్నట్టు ఆయన తెలిపారు. తన ఆరోగ్యంపై కంగారుపడి మూడు రోజులపాటు తనతో పాటు ఉన్న బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కారులో బయలు దేరి హైదరాబాద్‌కు పయనమయ్యారు. యూంజియోగ్రామ్ కోసం ఆయన హైదరాబాద్ కేర్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. -
వన రక్షక వనితలు
అడవి తల్లి రక్షణలో ఆడమగ తారతమ్యం లేకుండా స్మగ్లర్లకు సింహస్వప్నంగా నిలుస్తూ వనాన్ని రక్షిస్తున్న వనితలు వారు. ఏటూరునాగారం, మంగపేట, అటవీశాఖ రేంజ్ కార్యాలయంలో మహిళా బీట్ అధికారులుగా పనిచేస్తూ తమలో అణువణువు ధైర్య సాహసాలు నిండి ఉన్నాయని నిరూపిస్తున్నారు. విధి నిర్వహణలో వారు ఎదుర్కొంటున్న సమస్యలు, సాధించిన విజయాలు, శత్రువు ఎదురైనప్పుడు ఎదుర్కొనే తీరు.. తదితర విషయాలపై ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం. - ఏటూరునాగారం ఏటూరునాగారం, మంగపేట, మండలాల్లోని సుమారు 37 గ్రామ పంచాయతీల పరిధిలో అడవులు విస్తరించి ఉన్నాయి. అడవులను రక్షించేందుకు, అటవీ సంపదను కాపాడేందుకు నిరంతరం తపిసున్నారు మహిళా బీట్ అధికారులు. అడవిలోని చెట్లు నరికివేతకు గురికాకుండా నిత్యం నిఘా కాస్తున్నారు. అటవీ సంపద స్మగ్లర్ల బారిన పడకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. కళ్లు చించుకున్నా ఒక్క మనిషి కూడా కనబడని అడవిలో సంచరిస్తూ అడవికి రక్షణగా నిలుస్తున్న ధీరవనితలు.. విధినిర్వహణలో ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మనసు విప్పి మాట్లాడారు. వివరాలు వారి మాటల్లోనే.. మృగాలు ఎదురైతే చెట్లు ఎక్కుతాం అడవిలో సంచరించే క్రమంలో ప్రమాదకరమైన జంతువులు ఎదురైతే చెట్లు ఎక్కి నక్కి కూర్చుంటాం. అవి వెళ్లే వరకు శబ్దం చేయకుండా ఉండిపోతాం. అలాగే కొంతమంది జంతువులను హతమార్చేందుకు విద్యుత్ తీగలతో ఉచ్చులు పెడుతుంటారు. ఈ క్రమంలో ఎండిపోయిన కర్రలను ముందుకు జరుపుకుంటూ అడవిలోకి వెళ్తాం. ఒక వేళ విద్యుత్ తీగలతో ఉచ్చు ఉంటే వెంటనే ఎండు కర్ర కాలిపోతుంది. ఇలా రక్షించుకుంటాం. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న ప్రాంతంలో జంతువులు వస్తాయని వేటగాళ్లు ఉచ్చులు పెడుతుంటారు. ఆ ప్రాంతాలను ముందే పసిగట్టి అడవిలోకి వెళ్తుంటాం. జంతువుల అడుగుల ఆధారంగా ఎలాంటి జంతువు అనేది గుర్తిస్తాం. - సింగారపు రజిత, ఏటూరు బీట్ అధికారి వర్షాకాలంలో టేకాకులే గొడుగులు వర్షాకాలంలో అడవిలో సంచరించే క్రమంలో వర్షం కురిస్తే టేకు ఆకులు, ఇతర పెద్ద ఆకులను గొడుగులా ఏర్పాటు చేసుకుని తలపై పెట్టుకుంటాం. ఇలా తలదాచుకోవడానికి దగ్గర్లో ఉండే రాతి గుహలు, బండరాళ్ల నీడలో తలదాచుకుంటాం. ఎక్కువగా వర్షం పడితే తడిసిపోక తప్పదు. వర్షాకాలంలో అడవుల్లో పచ్చదనం ఎక్కువగా ఉండడంతో పాములు, విషకీటకాలతో హాని కలిగే అవకాశం ఉంటుంది. ఎక్కువగా పొడుగాటి షూ ధరించి వెళ్తుంటాం. విషకీటకం కుడితే తెలిసిన వైద్యం చేసుకుని గ్రామాల్లోకి రావడానికి ప్రయత్నిస్తాం. కుర్సం తార, ముల్లకట్టం, రాంపూర్ బీట్ అధికారిఅ ఊట నీళ్లే మాకు తాగునీరు అడవిలోని చెట్లకు నంబర్లు రాసేందుకు వెళ్లే క్రమంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి కాలినడకన వెళ్లాలి. అలా వెళ్లే క్రమంలో దాహం వేస్తే అడవిలో ఉండే ఊ ట నీళ్లను తాగేందుకు ఉపయోగిస్తాం. వేసవిలో ఈ సమస్య మరింత ఎక్కువగా ఉం టుంది. కొన్నిసార్లు అడవిలో రెండు రో జు లపాటు ఉండాల్సి వస్తుంది. అలాంటి సమయాల్లో అడవిలో దొరికే పండ్లు తింటూ కడుపునింపుకుంటాం. చెట్లు నరికివేతకు గురైతే దానిమీద ఉన్న గుండ్రని గీత ల ఆ దారంగా వాటి వయసు గుర్తిస్తాం. దీ ని వల్ల ఆ కలపను త్వరగా గుర్తుపట్టి పట్టుకు నే వీలుంటుంది. విధి నిర్వహణలో ఆ టుపోట్లు ఉన్నా సంతోషంగా పనిచేస్తున్నాం. - కొర్నిబెల్లి శోభారాణి, తిమ్మాపురం బీట్ అధికారి పసిగట్టి పట్టుకుంటాం రాత్రివేళ స్మగ్లర్ కలపను అక్రమంగా తరలించుకుపోతున్నాడని సమాచారం అందితే సిబ్బందితో కలిసి బేస్‌క్యాంపునకు చేరుకుంటాం. ఎవరికీ అనుమానం రాకుండా నెగడు చాటునుంచి ఎడ్లబండ్ల కదలికలు గుర్తు పడతాం. తర్వాత బండ్లు ఎటువైపు వెళ్తున్నాయనే విషయాన్ని పసిగట్టి రక్షణ కోసం కర్రలతో కాపుకాస్తాం. అవి రాగానే అందరం ఒకేసారి పెద్దగా అరుస్తూ పట్టుకుంటాం. ఇటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. -కాక విజయ, తొండ్యాల లక్ష్మీపురం బీట్ అధికారి