వారఫలాలు :18 డిసెంబర్‌ నుంచి 24 డిసెంబర్‌ 2016 వరకు | Varaphalalu: from 18 December to 24 December 2016 | Sakshi
Sakshi News home page

వారఫలాలు :18 డిసెంబర్‌ నుంచి 24 డిసెంబర్‌ 2016 వరకు

Published Sun, Dec 18 2016 12:06 AM | Last Updated on Mon, Sep 4 2017 10:58 PM

Varaphalalu: from 18 December to 24 December 2016

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యసమస్యలు తీరతాయి. ,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.  ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. గులాబీ, బంగారురంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థికంగా అనుకూలస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. స్థిరాస్తి వృద్ధి.  వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యనిర్ణయాలలో కొంత జాప్యం. వ్యాపారాలలో  పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులు, కళాకారులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఉత్తరదిశ ప్రయాణాలు అనూకులం. శివస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.  మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. ఎరుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ æఒత్తిడులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సకాలంలో సహాయ సహకారాలు అందుతాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.  ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఒక దీర్ఘకాలిక  సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటుంబవిషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. దైవదర్శనాలు చేసుకుంటారు. పసుపు, బంగారురంగులు,  తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురైనా చలించరు. బాధ్యతలు పెరుగుతాయి.  స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగులకు కలసివచ్చేకాలం. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. కోర్టు కేసులు పరిష్కారం. ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శుభవర్తమానాలు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.  విద్యార్థులకు మంచి ర్యాంకులు.తెలుపు, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.  కళాకారులకు నూతనోత్సాహం.  బంగారు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. వాహన, గృహయోగాలు కలసి వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త çహోదాలు దక్కే అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన రావచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు.  వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శిస్తారు. తెలుపు, ఆకుపచ్చరంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటా బయటా ప్రోత్సాహం. అనుకోని విధంగా ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, తెలుపు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement