Famous people
-
అంబానీ కంపెనీలో ఉద్యోగి అంటే అట్లుంటది.. అన్ని ఖరీదైన వస్తువులే!
సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఉపయోగించే వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇందులో బ్యాగులు, వాచ్‌లు మొదలైనవి ఉంటాయి. మనం గతంలో జాన్వీ కపూర్, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, భూమి పడ్నేకర్, నైసా దేవగన్, సమీక్ష పెడ్నేకర్ వంటి వారికి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు 'ఓర్హాన్ అవత్రమణి' (Orhan Awatramani)కి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి ఇక్కడ తెలుసుకుందాం. సాధారణంగా సెలబ్రిటీలు తరచుగా పార్టీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ పార్టీలలో వారు ఖరీదైన వస్తువులతో కనిపిస్తారు. అయితే ఓర్హాన్ అవత్రమణి కూడా ప్రముఖులతో పరిచయం ఉన్న వ్యక్తి. ఈ పేరు బహుశా ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఇతన్ని ఒర్రీ అని కూడా పిలుస్తారు. ఓర్హాన్ అవత్రమణి సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల ఇతడు జాన్వీ కపూర్‌తో కలిసి ఒక కార్యక్రమంలో కనిపించాడు. ఇందులో జాన్వీ మెటాలిక్ డిటైలింగ్‌తో కూడిన డ్రెస్ ధరించగా.. ఓర్రీ ఆప్టికల్ ఇల్యూషన్‌తో కూడిన బ్లూ కలర్ జాకెట్ ధరించాడు. Loewe బ్రాండ్‌కి చెందిన దీని ధర సుమారు రూ. 2.14 లక్షలు. అంతే కాకుండా అతడు ధరించిన ప్యాంట్ ఖరీదు రూ. 5,000 కాగా, ఫోన్ పట్టుకున్న కవర్ ధర రూ. 25,000 కావడం విశేషం. వీటితో పాటు ఓర్రీస్ నైక్ స్నీకర్స్ ధర రూ. 50,000. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఓర్హాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రొడక్ట్ మేనేజర్ అని తెలుస్తోంది. ఎప్పుడూ బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించే ఓర్హాన్ అవత్రమణి రూ. 40,000 రూపాయల విలువైన షార్ట్‌లు ధరించి ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఇతని ఇన్స్టాగ్రామ్ ఖాతాకు సుమారు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు కూడా సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి. -
వారఫలాలు : 22 జనవరి నుంచి 28 జనవరి 2017 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొన్ని వ్యవహారాలు నిదానంగా కొనసాగుతాయి. ఆదాయం పెరిగినా ఖర్చులు కూడా అదేస్థాయిలో ఉంటాయి. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. బంధువర్గం నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక పర్యటనలు. తెలుపు, గులాబీ రంగులు, తూర్పుదిశ వ్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొంత మేరకు ఫలిస్తుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. స్వల్ప అనారోగ్యం. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వ్యవహారాలు సాఫీగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆత్మీయుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. విద్యావకాశాలు పొందుతారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. నీలం,తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగతాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగుల యత్నాలు సఫలమవుతాయి. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తి లాభం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు, అవార్డులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగవు. రాబడి కన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఆశించిన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొద్దిపాటి చికాకులు. గులాబీ, లేత పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉద్యోగయత్నాలు నిరాశ కలిగిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. రాబడి కొంత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపార లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు. రాజకీయవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమానురాగాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు సన్మానయోగం. గులాబీ, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యయప్రయాసలతోనే కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మాటపట్టింపులు. తీర్థయాత్రలు చేస్తారు. రాబడి కొంత నిరాశ కలిగిస్తుంది. దూరప్రాంతాల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. తెలుపు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఎంతో ఉత్సాహవంతంగా అనుకున్న కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. ఆదాయం మరింతగా పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నీలం, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందడం వల్ల కొంత ఊరట చెందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు తథ్యం. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నలుపు, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న పనులు పూర్తిచేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంటాబయటా అనుకూలత. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన వస్తులాభాలు. ఇంటì నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. కళాకారులకు పురస్కారాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. -
వారఫలాలు :18 డిసెంబర్ నుంచి 24 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కుటుంబ విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. పనులు అనుకున్న విధంగానే పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. ఆరోగ్యసమస్యలు తీరతాయి. ,వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు. గులాబీ, బంగారురంగులు, దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కుటుంబంలో చికాకులు తొలగుతాయి. ఆర్థికంగా అనుకూలస్థితి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగస్తుల కృషి ఫలిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆకుపచ్చ, నలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరతాయి. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ సమర్థతను నిరూపించుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు. ముఖ్యనిర్ణయాలలో కొంత జాప్యం. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. విద్యార్థులు, కళాకారులకు నూతనోత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఉత్తరదిశ ప్రయాణాలు అనూకులం. శివస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో సఖ్యత. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మిత్రుల నుంచి ఒత్తిడులు తొలగుతాయి. నిరుద్యోగులు, విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరప్రయాణాలు. వ్యాపారాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు. ఎరుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. రుణ æఒత్తిడులు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి సకాలంలో సహాయ సహకారాలు అందుతాయి. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఒక దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కుటుంబవిషయాలలో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. దైవదర్శనాలు చేసుకుంటారు. పసుపు, బంగారురంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. బంధువుల నుంచి ఒత్తిడులు ఎదురైనా చలించరు. బాధ్యతలు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలలో అనుకూల వాతావరణం. ఉద్యోగులకు కలసివచ్చేకాలం. రాజకీయవర్గాలకు సన్మానాలు. తెలుపు, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పాతమిత్రులను కలుసుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వస్తులాభాలు. కోర్టు కేసులు పరిష్కారం. ఇంటా బయటా అనుకూల వాతావరణం. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు శుభవర్తమానాలు. కళాకారులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు మంచి ర్యాంకులు.తెలుపు, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయదండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారం. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు నూతనోత్సాహం. బంగారు, లేత ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. వాహన, గృహయోగాలు కలసి వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త çహోదాలు దక్కే అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. నిరుద్యోగులకు ఊరట కలిగే ప్రకటన రావచ్చు. నీలం, లేత ఆకుపచ్చరంగులు, హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఇంటాబయటా ప్రోత్సాహం లభిస్తుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. పరపతి పెరుగుతుంది. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. కళాకారుల యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు, ఆలయాలు సందర్శిస్తారు. తెలుపు, ఆకుపచ్చరంగులు, అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు. ఇంటా బయటా ప్రోత్సాహం. అనుకోని విధంగా ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. పసుపు, తెలుపు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. -
వారఫలాలు : 11 డిసెంబర్ నుంచి 17 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు పూర్తి చేస్తారు. శ్రమ ఫలిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. ఆదాయం పెరుగుతుంది. గత నిర్ణయాలను మార్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు అనుకూలం. వాహన, గృహయోగాలు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగులకు ఊరటనిచ్చే సమాచారం అందుతుంది. రాజకీయవర్గాలకు పదవులు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కార్యజయం. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. కొన్ని విషయాలలో మౌనం వీడాల్సిన సమయం. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. తెలుపు, ఎరుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వారు పరిచయమవుతారు. బంధువులతో సత్సంబంధాలు. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పనిభారం నుంచి విముక్తి. కళాకారులకు సంతోషకరంగా గడుపుతారు. ఆకుపచ్చ, నీలం రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. రాబడి ఆశాజకనంగా ఉంటుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత అనుకూలిస్తాయి. సమస్యల నుంచి గట్టెక్కుతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఒక ముఖ్యసమాచారం అందుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు సంద ర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ఎరుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా మూడుసార్లు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు.రాజకీయవర్గాలకు పదవులు అప్రయత్నంగా దక్కుతాయి. తెలుపు, గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) వ్యతిరేకులను సైతం అనుకూలురుగా మార్చుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు అనుకూలం. నూతన పరిచయాలు. సంఘంలో గౌరవం. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. వ్యాపారాలు ప్రగతిదాయకం. ఉద్యోగులకు పదోన్నతులు. కళాకారులకు యత్నకార్యసిద్ధి. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు. ఇంటిలో సంతోషకరంగా గడుపుతారు. సేవలకు తగిన గుర్తింపు. అదనపు రాబడి దక్కుతుంది. ఇంటాబయటా అనుకూల వాతావరణంతో ముందడుగు వేస్తారు. వాహనసౌఖ్యం. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శుభవార్తలు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) బంధువులతో విభేదాలు తొలగుతాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. జీవితాశయం నెరవేరుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. నిరుద్యోగుల యత్నాలు ఫలించే సమయం. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులు కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. గులాబీ, లేతఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. విద్యార్థులకు అనుకూల సమాచారం. వాహనయోగం. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల అవకాశం. రాజకీయవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అష్టలక్ష్మీ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యతిరేక పరిస్థితులను కూడా అనుకూలంగా మార్చుకుంటారు. నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తథ్యం. కళాకారులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నలుపు, బంగారు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళ పరుస్తుంది. కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యం మందగిస్తుంది. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. వ్యాపార లావాదేవీలు మందకొడి గా సాగుతాయి.ఉద్యోగులకు ఆక స్మిక మార్పులు. కళాకారులకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు : 4 డిసెంబర్ నుంచి 10 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పాతమిత్రుల ద్వారా ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో లాభాలు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. లేత పసుపు, తెలుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనయోగం. కీలక నిర్ణయాలకు తగిన సమయం. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు హోదాలు. కళాకారులకు సన్మానాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠనం మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న ఆదాయం సమకూరడంలో కొంత జాప్యం. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వివాహ యత్నాలు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. పసుపు, లేత నీలం రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో స్వల్ప వివాదాలు నెలకొంటాయి. విద్యార్థులకు ఒత్తిడులు ఉన్నా అనుకున్న ఫలితాలు సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు సామాన్యంగా ఉంటుంది. తెలుపు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. రాబడి కొంత పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపురావచ్చు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. విద్యార్థులకు కొత్త ఆశలు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. పసుపు, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రతిభాపాటవాలు వెలుగుచూస్తాయి. బంధువర్గం సలహాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు కొంత వరకూ పరిష్కారమవుతాయి. దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు కొత్తహోదాలు దక్కవచ్చు. కళాకారుల కృషి ఫలిస్తుంది. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని కార్యక్రమాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనే యస్వామి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధుమిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. పాతమిత్రులను కలుసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. రాజకీయవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. ఎరుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఉత్సాహంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సన్నిహితులు, మిత్రులతో సంతోషంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. నీలం, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. బంధువుల సహాయంతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. కుటుంబసభ్యులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు అనుకున్న పదవులు దక్కుతాయి. నలుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చే స్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని వివాదాలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు అదనపు పనిభారం తగ్గుతుంది. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. గులాబీ, బంగారురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. -
వారఫలాలు : 27 నవంబర్ నుంచి 3 డిసెంబర్ 2016 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీర తాయి. కొన్ని ఇబ్బందులు తీరి ఉపశమనం పొందుతారు. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు కొంత ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఎరుపు, పసుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) పనులు సజావుగా సాగుతాయి. ఆప్తులు సహాయ పడతారు. ఆదాయానికి లోటు ఉండదు. ఆరోగ్యం మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఒక సమాచారం కొంత నిరాశ కలిగించవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, సోదరులతో సఖ్యత నెలకొంటుంది. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి. తెలుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ప్రారంభంలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల నుంచి ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు సంతోషకరమైన సమాచారం. వ్యాపారాలలో అధిక లాభాలు. ఉద్యోగులకు పైస్థాయి వారి ద్వారా సాయం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. లేత ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆశించిన లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రశంసలు పొందుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ఒక సమస్యను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. గులాబీ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. ఆకుపచ్చ, నీలం రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన సమాచారం అందుతుంది. సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమా లలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అరుదైన సత్కారాలు. నేరేడు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. గతంలో చేజారిన వస్తువులు దక్కించుకుంటారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఊహించని పదోన్నతులు. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. ఎరుపు, నేరేడు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆశించిన రాబడి దక్కుతుంది. సోదరులతో నెలకొన్న విభేదాలు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగులకు కొత్త ఆశలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవం. అనుకున్నది సాధించాలన్న పట్టుదల పెరుగుతుంది. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఆస్తుల వివాదాలు తీరి ఊరట చెందుతారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సమస్యలు తీరతాయి. కళాకారులకు పురస్కారాలు అందుతాయి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీహనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని పనులు నిదానంగా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఒక సంతోషకరమైన వార్త అందుతుంది. రాజకీయవర్గాలకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు సన్మానాలు. నలుపు, నేరేడు రంగులు, లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యపరంగా స్వల్ప చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. ఎరుపు, చాక్లెట్ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. -
వారఫలాలు(20-11-2016 to 26-11-2016)
20 నవంబర్ నుంచి 26 నవంబర్ 2016 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వల్ప అనారోగ్యం. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగస్తుల సేవలకు గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరమైన సమయం. లేత ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) అదనపు ఆదాయం సమకూరుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి కొంత ఊరట. దూరపు బంధువులను కలుసుకుంటారు. గతంలో చేజారిన వస్తువులు తిరిగి దక్కించుకుంటారు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. పసుపు, లేత గులాబీ రంగులు, తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామిని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న పనుల్లో అవాంతరాలు. రాబడికి మించి ఖర్చులు. శ్రమ మరింతగా పెరుగుతుంది. ఆరోగ్యం కొంత ఇబ్బందిపెట్టవచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ముఖ్య నిర్ణయాలలో కొంత నిదానం అవసరం. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులకు ఆకస్మిక పర్యటనలు. ఆకుపచ్చ, బంగారు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) నూతనోత్సాహంతో కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఒక నిర్ణయం మీ స్థాయిని పెంచుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ సలహాల కోసం మిత్రులు ఆతృతగా ఎదురుచూస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. రాబడి అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలు అనుకున్నది సాధిస్తారు. తెలుపు, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొత్త వ్యక్తుల పరిచయమవుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కే అవకాశం. కళాకారుల అంచనాలు నిజమవుతాయి. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఎంతో ఉత్సాహంగా ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగుల సమస్యలు తీరి, ఆనందంగా ఉంటారు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో సత్సంబంధాలు. ఆదాయం ఆశాజనకం. భూవివాదాలు తీరే సూచనలున్నాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో అవరోధాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. నీలం, పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) గతం కంటే ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ప్రతిభావంతులుగా గుర్తింపు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగులకు ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. ఎరుపు, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, వివాదాలు త ప్పవు. క్రమేపీ సాధారణస్థితి ఏర్పడుతుంది. ఆదాయం కొంత మెరుగుపడుతుంది. ఎటువంటి సమస్య ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారుల యత్నాలు క్రమేపీ అనుకూలిస్తాయి. గులాబీ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. అనుకున్న కార్యాలు కొంత శ్రమానంతరం పూర్తి కాగలవు. బంధువులతో కష్టసుఖాలు పంచుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులు కొంత ఉపశమనం పొందుతారు. కొన్ని సమస్యలు తీరే సమయం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు కొంతమేరకు లాభిస్తాయి. ఉద్యోగులకు అనుకూల మార్పులు. కళాకారుల యత్నాలు కలసివస్తాయి. నీలం, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయ దర్శనం చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక వ్యవ హారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యక్తులు పరిచయం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. మీకృషి ఫలించే సమయం. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనయోగం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. నలుపు, బంగారురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త మిత్రులు పరిచయమవుతారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. విలువైన వస్తువులు సేకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. ఆకుపచ్చ, గులాబీ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
తప్పుదోవ పట్టిస్తే సెలబ్రిటీలకు ఐదేళ్ల జైలు!
- ప్రకటనలపై వినియోగదారుల చట్టంలో కొత్త నిబంధనలు న్యూఢిల్లీ: ప్రముఖ వ్యక్తులు, సెలబ్రిటీలు వినియోగదారులను తప్పుదోవ పట్టించే వాణిజ్య ప్రకటనల్లో నటించినట్లయితే.. ఐదేళ్ల జైలుశిక్ష, రూ. 50 లక్షల జరిమానా విధించాలని కొత్త ముసాయిదా చట్టం చెప్తోంది. ముప్పై ఏళ్ల కిందటి వినియోగదారుల పరిరక్షణ చట్టాన్ని తొలగించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో వినియోగదారుల పరిరక్షణ బిల్లు 2015ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దీనిపై పార్లమెంటరీ స్థాయీ సంఘం గత ఏప్రిల్‌లో తన సిఫారసులను సమర్పించింది. వీటిని అధ్యయనం చేసిన వినియోగదారుల మంత్రిత్వశాఖ.. సెలబ్రిటీలను బాధ్యులను చేయటం, కల్తీకి కఠిన శిక్ష విధించటం వంటి కొన్ని కీలక సిఫారసులను ఆమోదించింది. ఈమేరకు ముసాయిదా బిల్లులో చేయదలచుకున్న మార్పులపై ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సారథ్యంలో కేంద్ర మంత్రుల బృందం మంగళవారం ఢిల్లీలో సమావేశమై చర్చించనుంది. అనంతరం వీటిని కేబినెట్ ఆమోదం కోసం మంత్రివర్గానికి నివేదిస్తారు. వివిధ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ప్రకటనల్లో పాల్గొనే ప్రముఖులకు.. ఆయా ప్రకటనలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నట్లయితే తొలిసారి నేరానికి రూ. 10 లక్షల జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష.. రెండోసారి, ఆపైన అదే నేరానికి రూ. 50 లక్షల జరిమానా, ఐదేళ్ల జైలు శిక్ష విధించాలని ముసాయిదాలో నిబంధనలు చేర్చినట్లు ప్రభు త్వ వర్గాలు తెలిపాయి. అలాగే కల్తీ విషయంలో కూడా ఇదే తరహా శిక్షలతో పాటు.. లెసైన్స్ రద్దు చేయ టం వంటి చర్యలను సిఫారసు చేసినట్లు సమాచారం. -
తప్పుదోవ పట్టిస్తే సెలబ్రిటీలకు ఐదేళ్ల జైలు!
-
డెత్ సెన్స్
పదిశోధన మరణం ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచంలో కొందరు ప్రముఖ వ్యక్తులు మాత్రం మృత్యుజాడల్ని ముందే పసిగట్టారు. తమ మరణం ఎలా ఉండబోతుందో ప్రకటించారు. చివరికి అలాగే కన్నుమూశారు. వీరే వారు... 1.తన రచనలతో ప్రపంచం మొత్తాన్నీ అభిమానులుగా మార్చేసుకున్న మార్క్ ట్వెయిన్ ఓచోట ఇలా రాశారు -‘‘1835లో హేలీ తోకచుక్కతో పాటే నేనూ పుట్టాను. అది వచ్చే యేడు మళ్లీ వస్తోంది. బహుశా ఈసారి దానితో పాటే నేనూ పోతానేమో’’. మార్క్ ట్వెయిన్ అన్నట్టుగానే అయ్యింది. ఆయన ఏప్రిల్ 21, 1910న గుండెపోటుతో కన్నుమూశారు. అంతకు కొద్ది గంటల ముందే హేలీ తోకచుక్క రావడం, పోవడం జరిగింది. - మార్క్ ట్వెయిన్ 2.అమెరికాను కొద్దికాలం ఊపేసిన గాయని, నటి, మోడల్... ఆలియా... 2001, జూలైలో ఓ ఇంటర్వ్యూలో తనకు వచ్చిన ఓ కలను చెప్పింది. ఎవరో తరుముతుంటే ఆమె చీకటిలో పరిగెడుతూ ఉంటుంది. ఉన్నట్టుండి గాల్లోకి లేస్తుంది. ఎక్క డికో ఎగిరిపోతుంది. ఇది చెప్పి ఆమె ఓ మాట అంది -‘దేని నుంచి పారిపోతున్నాను? ఈ వృత్తి నుంచా? కీర్తి నుంచా? లేక ఈ లోకం నుంచా?’. నెల తిరక్కుండానే విధి సమాధానం! విమాన ప్రమాదం కారణంగా ఇరవై రెండేళ్ల ఆలియా లోకం నుంచే వెళ్లిపోయింది.- ఆలియా 3. లింకన్‌కి ఓ కల వచ్చింది. ఆ కలలో ఆయన వైట్‌హౌస్‌లో తూర్పున ఉన్న గదికి వెళ్లారు. అక్కడో శవపేటిక ఉంది. చుట్టూ సైనికులు నిలబడి ఉన్నారు. ప్రజలు సందర్శిస్తున్నారు. చనిపోయింది ఎవరని అడిగారు లింకన్. ‘ప్రెసిడెంట్’ అని సమాధానమిచ్చాడో వ్యక్తి. ఎన్నో రోజులు గడవకముందే మరో కల వచ్చింది. విశాల జలాల మీద పడవలో ఒంటరిగా ప్రయాణిస్తున్నట్టు. ఉదయం లేచాక ఆ కల గురించి ఇంట్లోవాళ్లకు చెప్పారు లింకన్. తర్వాత కొద్ది గంటలకే హత్యకు గురయ్యారు. - అబ్రహాం లింకన్ 4. జర్మనీకి చెందిన ప్రముఖ చిత్రకారుడు, సంగీతకారుడు ఆర్నాల్డ్ సోహన్బర్గ్కి 13వ నంబర్ అంటేనే వణుకు. ఆయన పుట్టింది సెప్టెంబర్ పదమూడున. దాంతో ఆ తేదీనే చనిపోతాను అని భయపడే వారాయన. జీవితాంతం ఆ సంఖ్య తన దరిదాపుల్లోకి రాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఫలితం లేకపోయింది. ఆ తేదీ ఆయన్ను వెంటాడింది. 1951, జూలై 13న మరణించారు. ఇంకా విచిత్రం ఏంటంటే... ఆయన చనిపోయింది తన 76వ ఏట. 7, 6 కలిపినా పదమూడే అవుతుంది! - ఆర్నాల్డ్ సోహన్బర్గ్ 5. పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌కి కూడా మరణం దగ్గర పడుతోన్న విషయం ముందే అర్థమయ్యిందట. ఓ కాన్సర్ట్ గురించి మాట్లాడినప్పుడల్లా అది వర్కవుటయ్యేలా లేదనేవాడట. చనిపోవడానికి రెండు గంటల ముందు కూడా ‘ఈ జీవితంతో విసిగిపోయాను’ అన్నాడట. ఇయాన్ హల్పెరిన్ రాసిన ‘అన్మాస్క్డ్- ద ఫైనల్ ఇయర్ ఆఫ్ మైఖేల్ జాక్సన్’లో దీని గురించి ఉందట. - మైఖేల్ జాక్సన్ 6. అమెరికాకు చెందిన గొప్ప ఫుల్బాల్ క్రీడాకారుడు పీట్ మారవిచ్. అతని వేగాన్ని చూసి ‘పిస్టల్ పీట్’ అని పిలిచేవారతన్ని. ఓసారి అతను ఒక సందర్భంలో ఊహించని మాట అన్నాడు. ‘నేనేమీ మరో పదేళ్లు ఫుట్‌బాల్ ఆడకపోవచ్చు. ఆలోపే, అంటే నా నలభయ్యో యేట గుండె నొప్పితో చనిపోవచ్చు’ అన్నాడు. అదే జరిగింది. తొమ్మిదేళ్లు ఆడాక, ఓరోజు ఫుల్బాల్ ఆడుతూండగానే హార్ట్ అటాక్ వచ్చి కన్నుమూశాడు పీట్. అప్పుడతనికి నలభయ్యేళ్లు. - పీట్ మారవిచ్ 7 . ‘ఫాదర్ ఆఫ్ ద మోడ్రన్ టాబ్లాయిడ్’ విలియమ్ థామస్ స్టెడ్ రాసిన మొదటి కథలో... అట్లాంటిక్ సముద్రంలో రెండు ఓడలు గుద్దుకుని, సరిపడా లైఫ్ బోట్స్ లేక వందల మంది చనిపోతారు. తర్వాతి కథలో ఓ పడవ ఐస్‌బర్గ్‌ను గుద్దుకుని ముక్కలవుతుంది. కెప్టెన్ ఎడ్వర్డ్ స్మిత్ కారణంగా కొందరు బతికినా, మిగతావాళ్లంతా చనిపోతారు. కొన్నాళ్లకి అమెరికాలో జరిగే పీస్ కాన్ఫరెన్స్‌కి వెళ్లడానికి టైటానిక్ ఓడ ఎక్కారు స్టెడ్. ఆ ప్రమాదంలో కన్నుమూశారు. విచిత్రం ఏమిటంటే, ఆ ఓడ కెప్టెన్ పేరు... ఎడ్వర్డ్ స్మిత్. - విలియమ్ స్టెడ్ 8. సుప్రసిద్ధ ఫ్రెంచ్ గణిత శాస్త్రవేత్త అబ్రహాం డి మోవ్రేకి ఓరోజు తన నిద్ర విషయంలో అనుమానం వచ్చింది. తను రోజూ అనుకున్నదానికంటే పదిహేను నిమిషాలు ఎక్కువసేపు నిద్రపోతున్నట్టు తెలుసు కున్నాడు. అప్పుడతను తన అసిస్టెంట్‌తో... ‘రోజుకో పదిహేను నిమిషాలు చొప్పున కలుపుకుంటూ పోతే, అవి 24 గంటలు అయిన రోజున నేను ఇక లేవను. పూర్తిగా నిద్రలోకి పోతాను’ అని. అలాగే అయ్యింది. సరిగ్గా తొంభై ఆరు రోజుల తర్వాత మోవ్రే శాశ్వత నిద్రలోకి జారుకున్నాడు. - అబ్రహాం డి మోవ్రే 9. డబ్ల్యూడ బ్ల్యూఎఫ్ చూసిన వాళ్లకు జేమ్స్ హెల్విగ్ గురించి చెప్పక్కర్లేదు. అతడు తన లాస్ట్ అప్పియరెన్స్ రోజున ప్రసంగిస్తూ ఇలా అన్నాడు... ‘ఈ లోకంలో ఎవరూ శాశ్వతం కాదు. ప్రతి ఒక్కరి హృదయ స్పందనా ఎప్పుడో ఒకప్పుడు ఆగుతుంది. ప్రతివారి ఊపిరీ ఎప్పుడో ఒకప్పుడు స్తంభిస్తుంది. ప్రతి ఒక్కరి ఆటా ఏదో ఒకనాడు ముగుస్తుంది. ఈరోజు నాది ముగిసింది’. ఆ తర్వాత రోజు తన భార్యతో కలిసి నడుస్తుండగా గుండె నొప్పి వచ్చి, జేమ్స్ ఆట పూర్తిగా ముగిసిపోయింది. జేమ్స్ హెల్విగ్ 10. డయానాకి కూడా మృత్యువు తనను వెతుక్కుంటూ వస్తున్న విషయం ముందే తెలిసిందట. చనిపోవడానికి కొద్ది రోజుల ముందు నుంచీ డిస్టర్బ్ అయ్యేదట. కారు ప్రమాదానికి గురై మరణిస్తున్నట్టు ఊహలు వచ్చేవట. సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తికి వాటి గురించి ఉత్తరం కూడా రాసిందట. ఆమె ఊహ నిజమైంది. కారులో బయలుదేరి కానరాని లోకాలకు చేరుకుంది. డయానా