Orhan Awatramani Tshirt Rs 2 Lakhs Mobile Cover Rs 25 Thousand All Branded Items - Sakshi
Sakshi News home page

టీ షర్ట్ రూ. 2 లక్షలు, మొబైల్ కవర్ రూ. 25వేలు.. అన్ని బ్రాండెడ్ వస్తువులే!

Published Sat, May 13 2023 6:55 PM | Last Updated on Sat, May 13 2023 7:17 PM

Orhan awatramani Tshirt Rs 2 lakhs mobile cover Rs 25 thousand All branded items - Sakshi

సాధారణంగా సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఉపయోగించే వస్తువులు చాలా ఖరీదైనవిగా ఉంటాయి. ఇందులో బ్యాగులు, వాచ్‌లు మొదలైనవి ఉంటాయి. మనం గతంలో జాన్వీ కపూర్, రాధిక మర్చంట్, ఇషా అంబానీ, భూమి పడ్నేకర్, నైసా దేవగన్, సమీక్ష పెడ్నేకర్ వంటి వారికి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి తెలుసుకున్నాము. అయితే ఇప్పుడు 'ఓర్హాన్ అవత్రమణి' (Orhan Awatramani)కి సంబంధించిన ఖరీదైన వస్తువులను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

సాధారణంగా సెలబ్రిటీలు తరచుగా పార్టీలు చేసుకుంటారనే విషయం తెలిసిందే. ఈ పార్టీలలో వారు ఖరీదైన వస్తువులతో కనిపిస్తారు. అయితే ఓర్హాన్ అవత్రమణి కూడా ప్రముఖులతో పరిచయం ఉన్న వ్యక్తి. ఈ పేరు బహుశా ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. ఇతన్ని ఒర్రీ అని కూడా పిలుస్తారు.

ఓర్హాన్ అవత్రమణి సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు. ఇటీవల ఇతడు జాన్వీ కపూర్‌తో కలిసి ఒక కార్యక్రమంలో కనిపించాడు. ఇందులో జాన్వీ మెటాలిక్ డిటైలింగ్‌తో కూడిన డ్రెస్ ధరించగా.. ఓర్రీ ఆప్టికల్ ఇల్యూషన్‌తో కూడిన బ్లూ కలర్ జాకెట్‌ ధరించాడు. Loewe బ్రాండ్‌కి చెందిన దీని ధర సుమారు రూ. 2.14 లక్షలు.

అంతే కాకుండా అతడు ధరించిన ప్యాంట్ ఖరీదు రూ. 5,000 కాగా, ఫోన్ పట్టుకున్న కవర్ ధర రూ. 25,000 కావడం విశేషం. వీటితో పాటు ఓర్రీస్ నైక్ స్నీకర్స్ ధర రూ. 50,000. లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఓర్హాన్ రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో స్పెషల్ ప్రొడక్ట్ మేనేజర్ అని తెలుస్తోంది.

ఎప్పుడూ బ్రాండెడ్ వస్తువులను ఉపయోగించే ఓర్హాన్ అవత్రమణి రూ. 40,000 రూపాయల విలువైన షార్ట్‌లు ధరించి ఇటీవల వార్తల్లో నిలిచాడు. ఇతని ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాకు సుమారు మూడు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నట్లు కూడా సమాచారం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్కోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. ఈ కథనంపై మీ అభిప్రాయాలను, సందేహాలను తప్పకుండా మాతో పంచుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement