రిలయన్స్ ఇండస్ట్రీస్, వాల్ట్ డిస్నీకి చెందిన మీడియా వ్యాపారాల విలీనం పూర్తయింది. ఈ విలీనం ఏకంగా రూ.70,352 కోట్ల విలువైన కొత్త జాయింట్ వెంచర్‌ను ఏర్పాటు చేసింది. రిలయన్స్ - డిస్నీ విలీనంతో దేశంలోనే అతి పెద్ద మీడియా సామ్రాజ్యం అవతరించింది.
జాయింట్ వెంచర్ వృద్ధి కోసం రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ. 11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఈ సంస్థకు నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు, వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ ఉంటారు. విలీన కంపెనీలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 16.34 శాతం వాటాను, వయాకామ్ 18 46.82 శాతం వాటాను, డిస్నీ 36.84 శాతం వాటాను పొందుతాయి.
కాంపిటిషన్ కమిషన్ (సీసీఐ), జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) నుంచి విలీనానికి కావలసిన అనుమతులు కూడా ఇప్పటికే లభించాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ విలీనం తరువాత వీటి కింద సుమారు 100 కంటే ఎక్కువ టీవీ ఛానల్స్ ఉండనున్నాయి. ఇవి ఏడాదికి 30,000 గంటల కంటే ఎక్కువ టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్‌ను ఉత్పత్తి చేయగలవని సమాచారం.
ఇదీ చదవండి: ఆధార్, పాన్ లింకింగ్: ఆలస్యానికి రూ.600 కోట్లు..
రిలయన్స్ ఇండస్ట్రీస్, డిస్నీ జాయింట్ వెంచర్ భారతదేశ వినోద పరిశ్రమలో కొత్త శకానికి నాంది పలుకుతుంది. ప్రపంచ స్థాయి డిజిటల్ స్ట్రీమింగ్ సామర్థ్యాలతో పాటు డిజిటల్ ఫస్ట్ అప్రోచ్‌తో భారతీయులకు మాత్రమే కాకుండా.. ప్రవాస భారతీయులకు సరసమైన ధరలకు అసమానమైన కంటెంట్ ఆప్షన్స్ అందించటానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment